Jump to content

Recommended Posts

Posted

అర్హులందరికీ నిరుద్యోగ భృతి

సీఎం వచ్చేలోగా కార్యాచరణ: మంత్రి లోకేశ్‌

 

19-10-2017 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ భృతిపై కార్యాచరణను ఖరారు చేస్తున్న ప్రభుత్వం... వీటికి ఆన్‌లైన్‌ లో దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. ఈ పథకం పై బుధవారం మంత్రి నారా లోకేశ్‌ కార్యాలయంలో మరో మంత్రి కొల్లు రవీంద్ర, ఉన్నతాధికారులతో ఒక సమావేశం జరిగింది. నిరుద్యోగ భృతి అమలు విధి విధానాలపై చర్చించారు. వివిధ శాఖల నుంచి సమాచారాన్ని సేకరించి, దానిని క్రోడీకరించి... లబ్ధిదారులను గుర్తించే అంశంపై సుదీర్ఘ చర్చ జరిగింది. భృతి ఇవ్వడానికి ఎలాంటి అర్హతలు నిర్దేశించాలన్న అంశంపైనా చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి వచ్చేనాటికి పూర్తిస్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని లోకేశ్‌ ఆదేశించారు. విద్యార్హత ఆధారంగా భృతి చెల్లించే అంశంపైనా చర్చ జరిగింది. భృతిని ఉచితంగా ఇవ్వకుండా... ప్రయోజనాత్మక కార్యక్రమంలో భాగస్వాములను చేసి, అందుకు ప్రతిఫలంగా డబ్బు చెల్లించాలని, దీనిపై కార్యాచరణ రూపొందించాలని సూచించారు. అలాగే... వారికి నైపుణ్య శిక్షణ ఇవ్వడం ద్వారా ఆసక్తి ఉన్న రంగాల్లో రాణించేలా చూడాలన్నారు.

Posted

వారంలో ఒక రూపం!

నిరుద్యోగ భృతిపై వేగం పెంచిన రాష్ట్ర ప్రభుత్వం

సంఖ్య తేల్చడంపై కసరత్తు

ముఖ్యమంత్రి వచ్చేలోగా కొలిక్కి

తర్వాత రిజిస్ట్రేషన్‌కు వెబ్‌సైట్‌

విద్యార్హతల ఆధారంగా రూ.1000 నుంచి రూ.2000

ఈనాడు - అమరావతి

18ap-main5a.jpg

రాష్ట్రంలో నిరుద్యోగ భృతికి అర్హులైన నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారనే విషయాన్ని వారం పది రోజుల్లో కొలిక్కి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరిగివచ్చేలోగా మొత్తం సంఖ్యపై ప్రాథమిక వివరాలను సిద్ధం చేయాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు బుధవారం వివిధశాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. యువజన సంక్షేమశాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఆ శాఖ ప్రత్యేక కమిషనరు కోమలి కిషోర్‌, ఆర్థిక, కార్మికశాఖల ఉన్నతాధికారులు, ప్రణాళికా సంఘం అధికారులు పాల్గొన్నారు. వివిధ అంశాలపై చర్చించి కొన్నింటిపై స్పష్టతకు వచ్చారు.

చర్చకొచ్చిన అంశాల్లో...

* ఉపాధి కల్పన కార్యాలయాల్లో ఇప్పటి వరకూ 9 లక్షల మంది పేర్లను నమోదు చేసుకున్నారు. ప్రజా సాధికార సర్వేలో 33 లక్షల మంది నిరుద్యోగులున్నట్లు గుర్తించారు. వీటన్నింటినీ క్రోడీకరించి తుది సంఖ్యను తేల్చాలి.

* రేషన్‌కార్డు, భూ రికార్డులు, ఇతర సంక్షేమశాఖల ద్వారా అమలు చేసిన పథకాలు, పింఛను లబ్ధిదారుల వివరాలను ఆయా శాఖల నుంచి తీసుకుని, పరిశ్రమల్లో ఉద్యోగులు/కార్మికులు, కళాశాలల నుంచి బయటకు వస్తున్న విద్యార్థుల వివరాలను తీసుకుని వివరాలను క్రోడీకరించాలి.

నిరుద్యోగి అని ఎలా గుర్తించాలి?

నిరుద్యోగి అని ఎలా నిర్ధారణకు రావాలనే దానిపై చర్చ సాగింది. కుటుంబ ఆర్థిక స్థితిగతులు, విద్యార్హతలు, ప్రస్తుతం ఏం చేస్తున్నారు? వంటి వివరాలను సమీక్షించడంద్వారా నిరుద్యోగులుగా ఉన్నారా? వారికి ప్రభుత్వ మద్దతు ఎంత మేర అవసరముందన్న విషయాన్ని ప్రాథమికంగా గుర్తించడం. ప్రక్రియ మొదలయ్యాక పరిస్థితులను బట్టి అర్హులందరికీ అవకాశం కల్పించేలా ఏర్పాట్లు చేయాలి. సంఖ్య కొలిక్కి వచ్చాక వెంటనే నిరుద్యోగులు పేర్లను నమోదు చేసుకునేందుకు ప్రత్యేకంగా ఒక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేయడంతోపాటు ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రజలే ముందు, సీఎం కనెక్ట్‌ వంటి ఆన్‌లైన్‌ వేదికల ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే అవకాశం కల్పించాలి. ఆధార్‌ నెంబరును నమోదు చేయగానే దరఖాస్తు డౌన్‌లోడ్‌ అయ్యేలా ఏర్పాటు చేయాలి.

భృతి ఇలా.. పదోతరగతి/ఇంటర్‌, డిగ్రీ, పీజీ ఇలా విభాగాలుగా చేసి విద్యార్హతలను బట్టి భృతి చెల్లించాలని ప్రతిపాదించారు. కనిష్ఠంగా రూ.1000 నుంచి గరిష్ఠంగా రూ.2వేల వరకు ఇవ్వాలి. దీనివల్ల తెదేపా ఎన్నికల మేనిఫెస్టోలో రూ.2వేల వరకూ ఇస్తామన్న హామీ నెరవేర్చినట్లు అవుతుందని లోకేష్‌ అభిప్రాయపడినట్లు తెలిసింది.

భృతి రాకపోతే నేరుగా.. నమోదు చేసుకున్న నిరుద్యోగికి భృతి రాకపోతే ఎందుకు రాలేదనేదీ ఆన్‌లైన్‌లోనే అదే నిరుద్యోగి తెలుసుకునేలా వెసులుబాటు కల్పించాలి. ఎందుకు ఇవ్వలేదనేదీ అందులో చూశాక సంతృప్తి చెందకపోతే ఆ నిరుద్యోగి సరైన ధ్రువీకరణ సమాచారంతో పునఃనమోదు చేసుకోవచ్చు వారికి వెంటనే ఆన్‌లైన్‌లోనే భృతి కేటాయించేలా సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేయాలి.

  • 1 month later...
Posted
18 ఏళ్లకే నిరుద్యోగ భృతి!
35 ఏళ్ల వరకూ అర్హులు
కనీస విద్యార్హత ఇంటరు
నెలకు రూ.1500?
ప్రతిపాదనలు సిద్ధం
2న ముఖ్యమంత్రి ప్రకటన..
ఈనాడు - అమరావతి

రాష్ట్రంలో నిరుద్యోగభృతి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం శాసనసభలో ప్రకటించే అవకాశం ఉంది. పథకం అమలుకి సంబంధించి విధివిధానాల రూపకల్పనకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం శాసనసభ కమిటీ హాల్లో బుధవారం సమావేశమైంది. మంత్రులు యనమల రామకృష్ణుడు, కె.అచ్చెన్నాయుడు, నారా లోకేష్‌, ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు సి.కుటుంబరావు, యువజన   సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్‌.వి.సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మంత్రివర్గ ఉపసంఘం కొన్ని ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం వీటిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. శనివారం శాసనసభలో దీనిపై చర్చించనున్నారు. ఆ సందర్భంగా పథకం అమలుపై ముఖ్యమంత్రి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు అధికార వర్గాల సమాచారం.

అర్హుల ఎంపికకు మంత్రివర్గ ఉపసంఘం సిద్ధం చేసిన ప్రతిపాదనలివీ..
* కనిష్ఠ వయోపరిమితి 18 ఏళ్లు. గరిష్ఠ వయోపరిమితి 35 ఏళ్లు.
* కనీస విద్యార్హత ఇంటర్మీడియెట్‌.
* ఒక్కొక్కరికి నెలకు రూ.1500 చొప్పున నిరుద్యోగ భృతి.
* ఇంటర్మీడియెట్‌పైన ఎంత విద్యార్హత ఉన్నప్పటికీ... అందరికీ ఒకేలా రూ.1500 చొప్పునే ఇవ్వాలని నిర్ణయం. విద్యార్హతల్నిబట్టి వేర్వేరు శ్లాబ్‌లు అమలు చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ వచ్చింది. ఇంటర్మీడియెట్‌ చదివినా, అంతకంటే ఎక్కువ చదివినా నిరుద్యోగి నిరుద్యోగే కాబట్టి అందరికీ ఒకే శ్లాబ్‌ అమలు చేయాలని ఉపసంఘం ప్రతిపాదించింది.
* ఒక కుటుంబంలో ఒక్కరికే.
* తెల్ల రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, ఓటరు గుర్తింపుకార్డు తప్పనిసరి.
* మాగాణి భూమి అయితే రెండున్నర ఎకరాల లోపు, మెట్ట భూమి అయితే ఐదు ఎకరాల లోపు ఉన్నవారే అర్హులు.
* సొంత కారు ఉన్నవాళ్లు అర్హులు కాదు.
* నిరుద్యోగ భృతి తీసుకుంటున్నవారిలో సామాజిక స్పృహను పెంచేందుకు స్వచ్ఛభారత్‌, వనం-మనం వంటి నాలుగైదు ప్రభుత్వ కార్యక్రమాల అమలు బాధ్యతను అప్పగిస్తారు.
* నిరుద్యోగ భృతికి అర్హులు 8 లక్షల మంది నుంచి 10 లక్షల మంది వరకు ఉంటారని అంచనా.
* ఉన్నత విద్యాభ్యాసం చేసి, నిరుద్యోగులుగా ఉన్నవారికి నైపుణ్య శిక్షణ కేంద్రాల్లో శిక్షణనిచ్చి, ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తారు. దానికయ్యే ఖర్చుని ప్రభుత్వం భరిస్తుంది.
* రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో కేటాయించిన రూ.500 కోట్లు, నిరుద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం నుంచి వస్తున్ననిధులు, వివిధ ఉపప్రణాళికల ద్వారా ఖర్చు చేస్తున్న నిధులు వంటివన్నీ సమీకృతంచేసి

ఈపథకాన్ని అమలు చేస్తారు.
* వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లు, విభాగాల ద్వారా స్వయం ఉపాధి పథకాల కింద రాయితీలు పొందిన వారు నిరుద్యోగ భృతికి అనర్హులు.
* పథకం ప్రారంభించడానికి ముందు... ఇప్పటి వరకు ఎక్కడా నిరుద్యోగులుగా పేరు నమోదు చేసుకోనివారికి మరో అవకాశం ఇస్తారు. ఐటీ శాఖ ఆధ్వర్యంలో ఒక వెబ్‌సైట్‌ను ప్రారంభిస్తారు.
* ప్రతి సంవత్సరం ఏటా ఒక నిర్దిష్ట సమయంలో మాత్రమే నిరుద్యోగులుగా నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. ఏడాది పొడవునా నమోదు ప్రక్రియ ఉండదు.
* నిరుద్యోగి తన ఆధార్‌ కార్డునెంబరు నమోదు చేసి అతడిని నిరుద్యోగభృతి కింద అర్హుడిగా గుర్తించారా లేదా? గుర్తించకపోతే ఎందుకు అనే కారణాలను కూడా అందులో చూపించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అర్హుడిగా గుర్తించకపోవడానికి పోర్టల్‌లో చూపిన కారణాలు సరైనవి కావని సంబందితÅ వ్యక్తి భావిస్తే 1100కి ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం 1100లో ప్రత్యేకంగా నిరుద్యోగభృతి ప్రజావిజ్ఞప్తుల విభాగాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ విభాగం ఈ ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపడం ద్వారా వాటి పరిష్కారానికి సమన్వయం చేస్తుంది.
* ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు ఇలా వేర్వేరు శాఖలు, సంస్థల ద్వారా నిరుద్యోగ యువతకు సామర్థ్య పెంపు(స్కిల్‌ డెవలప్‌మెంట్‌) శిక్షణనిప్పిస్తున్నారు. ఇకమీదట వీటన్నింటినీ ఒకతాటి మీదకు తీసుకువచ్చి ఏకరూప శిక్షణనిప్పించనున్నారు.

Posted
నిరుద్యోగ భృతికి విద్యార్హత ఇంటర్‌
30-11-2017 01:17:42
 
  • మంత్రుల బృందం ప్రతిపాదన
అమరావతి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): నిరుద్యోగ భృతి పొందడానికి కనీస విద్యార్హత ఇంటర్మీడియెట్‌గా మంత్రుల బృందం ప్రతిపాదించింది. బుధవారం మంత్రులు యనమల రామకృష్ణుడు, లోకేశ్‌, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రతో పాటు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు, సంబంధిత శాఖల అధికారుల బృందం సమావేశమైంది. వీరు చర్చించి సిద్ధం చేసిన ప్రతిపాదనలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందిస్తారు.
 
శుక్రవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇంటర్‌, ఆపైన చదివి నిరుద్యోగులుగా ఉన్నవారు ఈ భృతికి అర్హులని సమావేశం అభిప్రాయపడింది. నిరుద్యోగ భృతి కనీసం నెలకు రూ.1,500 ఇవ్వాలని ప్రతిపాదించారు. ఈ ఏడాది బడ్జెట్‌లో దీనికి రూ.500కోట్లు కేటాయించారు. దీనికి అదనంగా ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌, బీసీ సబ్‌ప్లాన్‌ వంటి వాటినుంచి కొంత సమీకరించి ఈ పథకానికి కేటాయించాలని, భృతి పొందేవారిలో ఆయా వర్గాలవారు కూడా ఉన్నందువల్ల ఆ నిధుల కేటాయింపు సమంజసమే అవుతుందని అభిప్రాయపడింది. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉండి, తెల్లరేషన్‌ కార్డు ఉన్న పేద కుటుంబాలకు చెందినవారినే భృతి పొందడానికి అర్హులుగా పరిగణించాలని నిర్ణయించింది.
 
నాలుగు చక్రాల వాహనాలు ఉన్న కుటుంబాలకు చెందినవారు దీనికి అనర్హులుగా నిర్ణయించారు. సొంత ఇల్లు ఉన్నవారిని మినహాయించాలన్న ప్రతిపాదనను మంత్రుల బృందం తిరస్కరించింది. అలాగే ఒక కుటుంబంలో ఒకరికే భృతి ఇవ్వాలని, ఏపీలో నివసిస్తున్నట్లుగా ఆధార్‌, ఎన్నికల కార్డు తప్పనిసరిగా చూపించాలనే నిబంధన విధించాలని నిర్ణయించారు. ఈ నిబంధనల దృష్ట్యా ఎంతమంది అర్హులు అవుతారనే విషయంపై ఈ సమావేశంలో స్పష్టత రాలేదు. దీనిపై మరింత కసరత్తు చేసి సమాచారం ఇవ్వాలని అధికారులకు మంత్రుల బృందం సూచించింది.
Posted
నిరుద్యోగ భృతిపై రేపు కీలక ప్రకటన!
1brk113-babu.jpg

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో ప్రధానంగా కాపులను బీసీల్లో చేర్చేందుకు ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్‌ నివేదికపై చర్చించనున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే తెదేపా శాసనసభాపక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు నేతలతో అన్నారు. నిరుద్యోగ భృతిపై కూడా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ రెండు అంశాలను రేపు అసెంబ్లీలో చర్చించి ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. నిరుద్యోగ భృతికి సంంధించిన విధివిధానాల ఖరారు ఈ భేటీలో ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. 18 నుంచి 35 ఏళ్ల వయసు నిరుద్యోగులకు రూ.1500 మేర భృతి ఇవ్వాలని ఇప్పటికే కేబినెట్‌ సబ్‌కమిటీ సిఫారసు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఎవరిని నిరుద్యోగులుగా పరిగణించాలనే దానిపై ఈ మంత్రివర్గంలో విధివిధానలు ఖరారు చేయనున్నారు.

  • 2 weeks later...
Posted
ఆన్‌లైన్‌లో నిరుద్యోగ భృతి ముసాయిదా
12-12-2017 20:39:56
 
అమరావతి: నిరుద్యోగ భృతి, ఉపాధి కల్పనకు సంబంధించిన ముసాయిదాను రాష్ట్ర ప్రభుత్వం ఆన్‌లైన్‌లో పెట్టింది. ముసాయిదాపై ఈనెల 31 వరకు అభిప్రాయ సేకరణ జరపనున్నారు. రాష్ట్రంలో సుమారు పది లక్షల నిరుద్యోగులు ఉన్నారని, ప్రజాభిప్రాయం మేరకు నిరుద్యోగభృతిపై నిర్ణయం తీసుకుంటామని శాప్ ఎండీ బంగార్రాజు తెలిపారు. వ్యవసాయం, మెరైన్ రంగాల్లో ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. జపాన్, కొరియా సంస్థల్లో వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. కంపెనీలకు అవసరమైన నైపుణ్య శిక్షణ నిరుద్యోగులకు ఇస్తామన్నారు.
Posted

Recent article in AndhraJyothy said AP is expected to pay 9700 cr towards interest payments on loans for the next 4 months. So, it is around 29000 crores a year. ika ilanti schemes pedithe debt ye range ki veltundo

 

Posted
1 hour ago, swarnandhra said:

Recent article in AndhraJyothy said AP is expected to pay 9700 cr towards interest payments on loans for the next 4 months. So, it is around 29000 crores a year. ika ilanti schemes pedithe debt ye range ki veltundo

 

Haha...

Posted

This is the result of election based goverance. People simply vote themsevles freebies and politicans cant resist emptying treasury to get the votes. It was started by ysr in 2004 but I think it would have happened anyway at some point. Only god can save India. We have all the problems of developed countries - subsidies, social spending, fiscal deficits, high taxations  and none of their benefits - excellent infrastructure etc.

  • 1 month later...
Posted
4 minutes ago, swarnandhra said:

45 years daaka unemployment allowance, 45 years tharuvata Jagga gaari pension. brilliant ideas.

naku ade anipinchindi bro

  • 3 months later...
Posted
వచ్చే నెల నుంచే నిరుద్యోగ భృతి
జూన్‌ 2 లేదా 8 నుంచి..
అమలుకు సిద్ధమవుతున్న రాష్ట్ర ప్రభుత్వం
డిగ్రీ ఆపై విద్యార్హతలున్న వారికి ఇవ్వాలని ప్రాథమిక నిర్ణయం?
1ap-main5a.jpg

ఈనాడు అమరావతి: నిరుద్యోగ భృతి పంపిణీ కార్యక్రమాన్ని జూన్‌ 2 లేదా 8 నుంచి అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. తెదేపా ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీల్లో ప్రధానమైన వాటిలో నిరుద్యోగ భృతి ఒకటి. దీంతో ఈ హామీని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతానికి డిగ్రీ, ఆపై విద్యార్హతలున్న నిరుద్యోగ యువతకు భృతిని పంపిణీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. నిరుద్యోగభృతి పంపిణీ నిమిత్తం ప్రస్తుత బడ్జెట్‌లో రూ.వేయి కోట్లను ప్రభుత్వం కేటాయించింది. గతేడాది కేటాయించిన రూ.500 కోట్లు కలిపితే ప్రస్తుతం రూ.1500 కోట్లు ఈ పథకం కోసం కేటాయించినట్లయింది. నిరుద్యోగ భృతిపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం పలుమార్లు భేటీ అయి వివిధ రాష్ట్రాలు, దేశాల్లో నిరుద్యోగ భృతి అమలుతీరుకు సంబంధించిన వివరాలను సేకరించి సమీక్షించింది. వాటి ఆధారంగా ప్రాథమికంగా కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. మరోవైపు రాష్ట్రంలోని నిరుద్యోగుల సంఖ్యను తేల్చేందుకు మంత్రి నారా లోకేష్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు ఆధ్వర్యంలోని మరో కమిటీ కసరత్తు చేసింది. ఉపాధికల్పనా కార్యాలయం, ప్రజాసాధికార సర్వే వివరాల ఆధారంగా ఇంటర్‌ ఆపైన విద్యార్హతలుండి నిరుద్యోగులుగా ఉన్నవారు 10లక్షల మంది వరకు ఉన్నట్లు ప్రాథమికంగా తేల్చారు. వీరిలో ఇప్పుడు ప్రభుత్వం డిగ్రీ ఆపైన
విద్యార్హత ఉన్నవారికే ప్రస్తుతం నిరుద్యోగ భృతి ఇవ్వాలన్న ప్రాథమిక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో... ఆ మేరకు డిగ్రీ ఆపైన విద్యార్హతలున్న నిరుద్యోగుల సంఖ్య తేల్చేందుకు కసరత్తు చేస్తున్నారు. నిరుద్యోగ భృతి అమలు చేస్తున్నట్లు అధికారికంగా ముందుగా ప్రకటించాలా? లేదా జూన్‌లో నేరుగా అమలులోకి తీసుకురావాలా అనే విషయంలో చర్చ జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

నిరుద్యోగ భృతికి సంబంధించి తుది మార్గదర్శకాలు ఖరారు కావాల్సి ఉంది. ఇప్పటివరకూ రూపొందించిన ముసాయిదా మార్గదర్శకాల ప్రకారం చూస్తే...
* దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలకు చెంది ఉండాలి.
* సొంత వ్యవసాయ భూమి తడి(వెట్‌ట్యాండ్‌)దైతే 2.5 ఎకరాల వరకు, పొడిదై(డై ల్యాండ్‌)తే గరిష్ఠంగా 5 ఎకరాల్లోపు ఉన్నవారు అర్హులు.
* కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వం అందిస్తున్న సామాజిక పింఛన్లను తీసుకుంటున్నప్పటికీ ఆ కుటుంబలోని నిరుద్యోగి అర్హులే(ఇతర అర్హతలనూ పరిగణలోకి తీసుకుంటారు).
* పదవీవిరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకూ అవకాశం. అదే సమయంలో ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్న వారి పిల్లలకు అవకాశం కల్పించాలా వద్దా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఎంతమందికి.. ఎంత మొత్తం?
మొదట్లో పది, ఇంటర్‌, డిగ్రీ/పీజీ అలా మూడు రకాలుగా విభజించి నిరుద్యోగభృతిని చెల్లించాలని భావించారు. పది వరకు అయితే రూ.వేయి, ఇంటర్‌ తత్సమాన అర్హతలున్నవారికి రూ.1500, డిగ్రీ/పీజీ వారికి రూ2వేలు చొప్పున ఇవ్వాలన్న చర్చ మంత్రివర్గ ఉపసంఘ సమావేశాల్లో జరిగింది. అయితే ఇప్పుడు ప్రభుత్వం డిగ్రీ, ఆ పైన అర్హత ఉన్నవారికే భృతి చెల్లించాలన్న నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో.. రూ.2వేలు చొప్పున ఇచ్చే అవకాశం ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
* ఉపాధికల్పన కార్యాలయంలో నమోదు చేసుకున్నవారి ప్రకారం చూస్తే డిగ్రీ అర్హత ఉన్నవారు 2.80లక్షల మందికిపైగా ఉన్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
* ప్రస్తుతం నిరుద్యోగ భృతి అంశం రాష్ట్ర యువజన సంక్షేమ శాఖ పరిధిలో ఉంది. రాష్ట్రంలోని నిరుద్యోగుల సంఖ్య,  ఇతర వివరాలపై ఈ శాఖ ఆధ్వర్యంలోనే కసరత్తు జరుగుతోంది. ఇప్పుడు నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రత్యేకంగా తీసుకుని దీని అమలులు, పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఐటీ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన వెబ్‌సైట్‌లో నిరుద్యోగుల నమోదు ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నారు.
* నేడు జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉంది.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...