Jump to content

Mukyamanthri Yuva Nestham (Nirudyoga Bruthi)


Recommended Posts

  • 3 weeks later...
  • 2 weeks later...
10 లక్షల మందికి నిరుద్యోగ భృతి
04-07-2018 03:58:02
 
  • వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్య శిక్షణ
  • అప్రెంటిస్‌ కోసం పరిశ్రమలతో ఒప్పందాలు
  • ఉద్యోగ అవకాశాల కోసం జాబ్‌ పోర్టల్‌
  • మార్గదర్శకాలపై మంత్రుల కమిటీ చర్చ
 
అమరావతి, జూలై 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 10లక్షల మందికి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వనుంది. కనీస విద్యార్హత డిగ్రీ ఉండి.. 22-35 ఏళ్ల మధ్య ఉన్న నిరుద్యోగులకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించింది. ఈ పథకం మార్గదర్శకాలపై మంత్రుల కమిటీ సమావేశమైంది. మంత్రులు నారా లోకేశ్‌, కొల్లు రవీంద్రలు మంగళవారం ఇక్కడ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. నిరుద్యోగ భృతి పొందే యువతీయువకులకు వివిధ శాఖల అనుసంధానంతో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. నిరుద్యోగ భృతికి నమోదు చేసుకునే సమయంలోనే వారికిష్టమైన మూడు రంగాలను ఎంచుకునే అవకాశం ఇస్తారు. దాని ఆధారంగా పరిశ్రమలకు అవసరమైన ఉద్యోగాలేమిటో చూసి... వాటికి ఎంపికయ్యే విధంగా ఈ నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తారు. నైపుణ్యాభివృద్ధితో పాటు పరిశ్రమలతో ఒప్పందం చేసుకుని నిరుద్యోగులను అప్రెంటి్‌సలుగా తీసుకునేలా చూస్తారు.
 
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అప్రెంటిస్‌ కార్యక్రమాన్ని వినియోగించుకుంటూ... రాష్ట్ర ప్రభుత్వ అప్రెంటిస్‌ ప్రోత్సాహాన్ని అనుసంధానం చేసి నిరుద్యోగ యువతను పెద్దఎత్తున అప్రెంటీ్‌సలుగా తీసుకుంటారు. మరోవైపు నిరుద్యోగ భృతి అందుకునే యువతీయువకుల వివరాలతో జాబ్‌ పోర్టల్‌ ఏర్పాటు చేస్తారు. దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీలకు ఈ డేటా అందుబాటులో ఉంచి... ఆయా కంపెనీలు తమకు కావాల్సిన అర్హతలున్నవారిని ఎంపిక చేసుకునే వీలు కల్పిస్తారు. అటు కంపెనీల కోసం, ఇటు యువతీయువకులకు ఉద్యోగాల కల్పన కోసం సులభంగా ఉండేలా ప్రత్యేక మొబైల్‌ యాప్‌ తయారుచేయాలని నిర్ణయించారు.
 
అంతేకాదు... నిరుద్యోగ భృతికోసం ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ రూపొందించాలనీ మంత్రుల కమిటీ నిర్ణయించింది. ఈ వెబ్‌సైట్‌లో ఎవరైనా తమ ఆధార్‌ నంబర్‌ ఎంటర్‌ చేయగానే... వారి ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్‌ చేయగానే నిరుద్యోగ భృతికి అర్హులా?.. కాదా? అనే విషయం తెలిసిపోతుంది. అనర్హులైతే కారణాలు కూడా చెప్పేలా ఈ వెబ్‌సైట్‌ ఉండాలని నిర్ణయించారు. ఒకవేళ అర్హత ఉన్నా భృతి రాకుంటే 1100కు ఫోన్‌ చేస్తే న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారు. దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికే నిరుద్యోగ భృతి అందిస్తారు. ఏడాదికి రూ.1200 కోట్లు దీనికోసం ఖర్చవుతాయని అంచనా. ఈ మార్గదర్శకాలన్నింటినీ ఆరో తేదీన మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు.
Link to comment
Share on other sites

అనర్హతకు ఆధార్‌
నిరుద్యోగ భృతి పథకం అమలుపై కసరత్తు
వారి వివరాలతో వెబ్‌సైటు, జాబ్‌పోర్టల్‌
అభ్యర్థులు మూడు రంగాలను ఎంచుకునే అవకాశం

ఈనాడు, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పదిలక్షల మంది నిరుద్యోగులకు నెలకు రూ.వేయి చొప్పున స్టైఫండ్‌ ఇస్తూ వారికి ఆసక్తి ఉన్న రంగాల్లో నైపుణ్యాభివృద్ధి శిక్షణనిచ్చేందుకుగాను నిరుద్యోగ భృతి పథకం అమలుపై కసరత్తు కొలిక్కివస్తోంది. నిరుద్యోగభృతి కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వారి ఆధార్‌నెంబరును ఎంటర్‌ చేయగానే భృతి పొందేందుకు అర్హులా, కాదా? అనే విషయాన్ని వెంటనే తెలిపేలా ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ రూపొందించనున్నారు. అర్హత   లేనట్లుగా సమాధానం వస్తే, 1100కు ఫిర్యాదు చేయవచ్చు. పునఃపరిశీలించి అర్హత ఉంటే వెంటనే పథకాన్ని వర్తింపజేస్తారు. పథకం ముసాయిదా మార్గదర్శకాలను శుక్రవారం జరగనున్న రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ముందుంచనున్నారు. ముసాయిదా మార్గదర్శకాలు, వివిధ శాఖలవారీగా నిరుద్యోగులకు శిక్షణనిచ్చేందుకు మౌలికవసతులు ఎంతమేర అందుబాటులో ఉన్నాయనే విషయాలపై రాష్ట్ర యువజనాభ్యుదయ మంత్రి కొల్లు రవీంద్రతో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటీమంత్రి నారా లోకేష్‌ ఉన్నతాధికారులతో మంగళవారం సమీక్షించారు. ఆయా శాఖలవారీగా జిల్లా, రాష్ట్రస్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు ఉన్న మౌలిక వసతులపై చర్చించారు.

మార్గదర్శకాల్లో కొన్ని...
* ప్రజాసాధికార సర్వే వివరాల ఆధారంగా నిరుద్యోగుల ఎంపిక.
* 25-35 ఏళ్ల మధ్య వయస్సులవారు అర్హులు.
* డిగ్రీ/పాలిటెక్నిక్‌ తత్సమాన విద్యార్హత ఉన్నవారికే నిరుద్యోగభృతి.
* ఇంట్లో ఒకరికంటే ఎక్కువమంది ఉన్నా వర్తిస్తుంది.
* నిరుద్యోగభృతి కోసం అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో వారికి ఆసక్తి ఉన్న మూడు రంగాలను ప్రతిపాదించవచ్చు.
* ఆయా రంగాల్లో వివిధ పథకాల కింద నైపుణ్యాభివృద్ధి శిక్షణనిస్తున్న అన్ని శాఖలను సమన్వయం చేసి వారికి జిల్లా లేదా రాష్ట్రస్థాయిలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ.
* కేంద్రప్రభుత్వం అమల్జేస్తున్న అప్రెంటిస్‌షిప్‌ కార్యక్రమానికి ఈ పథకాన్ని అనుసంధానం చేయడం ద్వారా అవకాశాలను కల్పించడం.
* నిరుద్యోగభృతి పొందుతూ, నైపుణ్యాభివృద్ధి పొందుతున్న వారి అర్హత వివరాలతో ప్రత్యేకంగా జాబ్‌పోర్టల్‌ ఏర్పాటు.
* దేశవ్యాప్తంగా పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు వంటివి ఉద్యోగాలు ఇచ్చేటపుడు ఈ పోర్టల్‌ ఆధారంగా ఎంపిక చేసుకునేందుకు వీలుగా దీన్ని సిద్ధం చేయడం.

Link to comment
Share on other sites

  • 3 weeks later...
  • 2 weeks later...
12.26 లక్షల మందికి భృతి
01-08-2018 02:05:00
 
636686859011025097.jpg
  • ఏడాదికి రూ.1470 కోట్ల వ్యయం
  • ‘యువసాధికారిక నిరుద్యోగ భృతి’గా అమలు
  • డిగ్రీ, పాలిటెక్నిక్‌ అర్హత.. బీపీఎల్‌ యువతకే
  • కుటుంబంలో ఎంతమంది అర్హులున్నా సరే
  • ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్‌ వర్తింపు
  • రేపటి కేబినెట్‌ సమావేశంలో ఆమోదం
అమరావతి, జూలై 31(ఆంధ్రజ్యోతి): ఒకవైపు నిరుద్యోగ యువతకు ఆర్థికంగా సాయం... మరోవైపు వారికి అవసరమైన నైపుణ్యాల శిక్షణ, ఉద్యోగ కల్పనకు మార్గదర్శనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నిరుద్యోగ యువతకు భృతి అందించేందుకు ప్రభుత్వం ఈ మేరకు తుది ప్రణాళిక సిద్ధం చేసింది. ‘యువసాధికారిక నిరుద్యోగ భృతి’ పేరిట ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రతి నెలా 12.26 లక్షల మందికి భృతి ఇస్తారు. పల్స్‌ సర్వే లెక్కల నుంచి తీసుకున్న నిరుద్యోగులకు ప్రతి నెలా వెయ్యి రూపాయల చొప్పున ఆన్‌లైన్‌లోనే చెల్లించనున్నారు. ఏడాదికి రూ.1470 కోట్లు దీనికోసం అవసరం అవుతాయని అంచనా వేశారు. ఏదైనా డిగ్రీ, పాలిటెక్నిక్‌ డిప్లొమాలను నిరుద్యోగ భృతి పథకానికి అర్హతగా నిర్ణయించారు. 22-35 ఏళ్ల మధ్య యువత ఇందుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వారి దామాషా ప్రకారం రిజర్వేషన్లు వర్తిస్తాయి. అదే సమయంలో ఒక ఇంట్లో అర్హులు ఎందరున్నా... వారందరికీ నిరుద్యోగ భృతిని అందించాలని నిర్ణయించారు.
 
 
భృతి.. ఇష్టమైన రంగానికీ దరఖాస్తు
నిరుద్యోగ భృతి దరఖాస్తులను ఆన్‌లైన్‌లోనే తీసుకోనున్నారు. దీనికోసం ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ ఏర్పాటు చేస్తారు. నిరుద్యోగ భృతి ప్రకటన ఇచ్చాక... అర్హులైన వారు దరఖాస్తు చేసుకునేందుకు 15 నుంచి 21 రోజుల సమయం ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. దరఖాస్తు సమయంలోనే తనకు ఇష్టమైన రంగాన్ని అభ్యర్థి పేర్కొనాలి. స్వయం ఉపాధి, పరిశ్రమల్లో అప్రెంటిస్ షిప్‌, ఏపీ స్కిల్‌ డెవలప్ మెంట్‌ కార్పొరేషన్‌, వివిధ బీసీ సమాఖ్యలు... ఇలా పలు విభాగాలు ఇప్పటికే అందిస్తున్న శిక్షణ కార్యక్రమాల్లో నుంచి ఒక దాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ఆ తర్వాత అర్హులైన వారి వివరాలు, వారు ఎంచుకున్న శిక్షణ రంగాలను జిల్లాల వారీగా... డీఆర్‌డీఏ పీడీలకు పంపిస్తారు. ఏ జిల్లాకు ఆ జిల్లాలో నెల రోజులపాటు శిక్షణ ఏర్పాటు చేస్తారు. శిక్షణ కోసం ఒక్కో అభ్యర్థికి రూ.12వేలు ఖర్చు చేయనున్నారు. దీన్ని ప్రభుత్వమే భరిస్తుంది. ఈ శిక్షణ కోసం రూ.1472 కోట్లను ప్రభుత్వం ఖర్చుచేయనుంది.
 
 
పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా
మరోవైపు రాష్ట్రంలో రాబోయే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగ భృతి తీసుకుంటున్న యువతను తీర్చిదిద్దుతారు. పరిశ్రమల అవసరాలు తెలుసుకుని... వారి ఉద్యోగావసరాలకు తగిన శిక్షణ ఇస్తారు. అదేసమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన సంస్థలు, కంపెనీలు, పరిశ్రమల్లో అప్రెంటిస్ షిప్ గా కూడా వీరిని ఎంపిక చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. మరోవైపు నిరుద్యోగ భృతికోసం ఏర్పాటుచేసే ప్రత్యేక వెబ్‌పోర్టల్‌లోనే... భవిష్యత్తు ఉద్యోగావకాశాల సమాచారం కూడా అందిస్తారు.
 
 
అదేవిధంగా వెబ్‌పోర్టల్‌లో నమోదైన యువత వివరాలను కంపెనీలకూ అందిస్తారు. ఆయా కంపెనీల్లో ఉద్యోగావకాశాలకు తగినవారుంటే ఎంపిక చేసుకునేలా సమన్వ యం చేస్తారు. మొత్తం నిరుద్యోగ భృతి కింద నమోదై న వారందరికీ శిక్షణ ఇస్తారు. వేతన ఉపాధిలో 1.5 లక్షల మంది, స్వయం ఉపాధిలో 2.7 లక్షల మంది, పరిశ్రమల్లో అప్రెంటిస్ లుగా 1.5 లక్షలు, కృషీ విజ్ఞాన కేంద్రాలు, పశుపోషణ, ప్రాథమిక రంగాల్లో ఐదు లక్షలమందికి శిక్షణ ఇవ్వాలని అనుకుంటున్నారు.
Link to comment
Share on other sites

 
నిరుద్యోగ భృతికి ఏపీ కేబినెట్‌ ఆమోదం
02-08-2018 14:42:45
 
636688177667378466.jpg
అమరావతి: నిరుద్యోగ భృతికి ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 12.26 లక్షల మందికి రూ.1000 చొప్పున నిరుద్యోగ భృతి ఇవ్వాలని కేబినెట్ ఆమోదించింది. ఈ నిరుద్యోగ భృతికి 'ముఖ్యమంత్రి యువనేస్తం' పేరు ఖరారు చేసింది.
Link to comment
Share on other sites

నిరుద్యోగులకు ‘యువ నేస్తం’
03-08-2018 03:42:04
 
636688645254748320.jpg
  • తక్షణం నిరుద్యోగ భృతి
  • విధి విధానాలకు మంత్రివర్గం ఆమోదం
  • ‘ముఖ్యమంత్రి యువ నేస్తం’గా నామకరణం
  • 22-35 ఏళ్ల వారు అర్హులు
  • డిగ్రీ, పాలిటెక్నిక్‌ చదివి నిరుద్యోగులై ఉండాలి
  • ఖాతాలో ప్రతినెలా వెయ్యి జమ
  • కుటుంబంలో ఎందరున్నా వర్తింపు
  • మూడో వారం నుంచి రిజిస్ట్రేషన్‌
  • ఆన్‌లైన్‌లో ఈ-కేవైసీతో నమోదు
  • నచ్చిన రంగంలో నైపుణ్య శిక్షణ
  • పరిశ్రమలతో పోర్టల్‌ సంధానం
  • స్థానికంగానే ఉద్యోగుల ఎంపిక
 
ఒకవైపు నిరుద్యోగ భృతి... మరోవైపు ఉద్యోగాల ప్రకటన! యువతీ యువకులకు రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి రెండు తీపి కబుర్లు వినిపించింది! ‘ముఖ్యమంత్రి యువ నేస్తం’ కింద ప్రతి నెలా సుమారు 12 లక్షల మందికి రూ.వెయ్యి చొప్పున నిరుద్యోగ భృతి అందించాలన్న నిర్ణయంతోపాటు... సుమారు 20 వేల ఉద్యోగాల భర్తీకి గురువారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
 
 
అమరావతి, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): విద్యార్హతలు ఉండి... ఉపాధి, ఉద్యోగాలకోసం ప్రయత్నిస్తున్న యువతకు ‘ముఖ్యమంత్రి ఆపన్న హస్తం’ అందించనున్నారు. తెలుగుదేశం ఎన్నికల హామీల్లో ఒకటైన నిరుద్యోగ భృతి అమలుకు గురువారం రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పథకం అమలుకోసం యువజన శాఖ రూపొందించిన మార్గదర్శకాలపై ఆమోద ముద్ర వేసింది. ఆ వివరాలను యువజన శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులుతో కలిసి ఐటీ శాఖ మంత్రి లోకే్‌శ్‌ వెల్లడించారు. ‘ముఖ్యమంత్రి యువ నేస్తం’ పేరిట ఈ నెల నుంచే నిరుద్యోగ భృతి పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. నిరుద్యోగ యువతకు భృతి చెల్లిస్తూనే... ఈ పథకానికి నైపుణ్య శిక్షణ, అప్రెంటిస్ షిప్ ను అనుసంధానిస్తున్నామన్నారు. ఇలాంటి కార్యక్రమం ప్రపంచంలోనే లేదన్నారు. భారత్‌లోనూ పలు రాష్ట్రాలు ఈ పథకం అమలులో విఫలమయ్యాయన్నారు.
 
 
రాష్ట్రంలో... డిగ్రీ, పాలిటెక్నిక్‌ పూర్తయి 22 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారంతా దీనికి అర్హులని లోకేశ్‌ తెలిపారు. ఫించన్‌ నిబంధనలే వర్తిస్తాయని అయితే, కుటుంబంలో ఎంతమంది అర్హులున్నా అందరికీ భృతి చెల్లిస్తామని చెప్పారు. ప్రతినెలా రూ.వెయ్యి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. ‘‘ఈ నెలలోనే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 15 రోజులపాటు గడువు ఉంటుంది’’ అని లోకేశ్‌ తెలిపారు. ప్రజాసాధికారిక సర్వే సమాచారం ప్రకారం... సుమారు 12 లక్షల మంది యువతీ యువకులు భృతికి అర్హులని అంచనా వేస్తున్నామన్నారు. ‘ఆధార్‌’ ప్రాతిపదికనే రిజిస్ట్రేషన్‌ జరుగుతుందని... అర్హులు కాకపోతే అప్పటికప్పుడే ఆ సమాచారం తెలిసిపోతుందని లోకేశ్‌ తెలిపారు. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న 15రోజుల తర్వాతి నుంచే భృతి చెల్లిస్తామని తెలిపారు.
 
 
నిరుద్యోగ భృతి పథకంతోపాటు... నైపుణ్య శిక్షణ, ఉద్యోగంలో భాగంగానే శిక్షణ కల్పిస్తామని లోకేశ్‌ తెలిపారు. ఉద్యోగ శిక్షణ పూర్తిగా యువతీ యువకుల ఇష్టమని, ఇందులో నిర్బంధం ఉండదని తెలిపారు. ‘‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కూడా దీనికి అనుసంధానం చేస్తాం. వీటి ద్వారా యువత తమకు నచ్చిన రంగాల్లో శిక్షణ పొందవచ్చు. అలాగే ఈ ప్లాట్‌ఫామ్‌ను స్థానిక కంపెనీలకు కూడా అందుబాటులోకి తెస్తాం. ఆన్‌జాబ్‌ ట్రైనింగ్‌ కూడా కల్పిస్తాం’’ అని లోకేశ్‌ వివరించారు.
 
 
నాలుగేళ్లలో 1.49 లక్షల కోట్ల పెట్టుబడులు
రాష్ట్ర విభజనవల్ల ఐటీ, ఇతర పరిశ్రమలు తెలంగాణలోనే ఉండిపోయాయని మంత్రి లోకేశ్‌ చెప్పారు. అయితే, ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో గడిచిన నాలుగేళ్లలో 721 భారీ కంపెనీలు నవ్యాంధ్రకు వచ్చాయన్నారు. వీటి ద్వారా 1.49 లక్షల పెట్టుబడి రాష్ట్రానికి వచ్చిందని, 2.27 లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని ప్రకటించారు. ఇక... ఇప్పటిదాకా రాష్ట్రానికి 23వేల చిన్న, మధ్యతరగతి పరిశ్రమలు వచ్చాయని... వీటిద్వారా 3.30 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయని వివరించారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు బ్రాండ్‌ అంబాసిడర్‌. ఆయన వెళ్లగానే ప్రపంచంలోని అనేక సంస్థలు తమ ద్వారాలు తెరుస్తున్నాయి’’ అని తెలిపారు.
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...