Jump to content

Handri - Niva SUJALA - PHASE 2


sonykongara

Recommended Posts

  • 1 month later...
  • Replies 443
  • Created
  • Last Reply

Though this canal travels quite far away from my place, I'm very happy to see this. This gives me hope :)  Rapthadu and Uravakonda constituencies  were the major beneficiaries this year, hope next year a lot more areas get it.

 

On the another hand I wish people start using water judiciously. I was shocked to see that rice being cultivated on these lands. I don't think that crop is suited for our district. Personally we gave up that crop when i was a kid, some 15 years back. I highly doubt it is ever gonna come back again as water fights would turn much uglier in the coming days. Hope farmers get educated on these lines. Also wondering if its time to come up with ground rules for water allocation. Fights will only intensify in the coming days as the canal travels one heck of a distance over many districts. But then it would be better problem to solve than not having water at all :)

Link to comment
Share on other sites

హంద్రీ నీవాపై మరో ప్రాజెక్టు
 

కర్నూలు : హంద్రీనీవా కాలువ నీటి ఆధారంగా జిల్లాలో మరో రిజర్వాయర్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జలవనరుల శాఖ ఇంజనీర్లు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపే పనిలో నిమగ్నమయ్యారు. ఏటా కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్న పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాలకు ఈ రిజర్వాయరు పూర్తయితే కష్టాలు తీరే అవకాశం ఉంది. జలవనరుల శాఖ సెక్రటరీ శశిభూషణ్‌కుమార్‌ ఆదేశాల మేరకు ప్రాథమిక సర్వే నివేదికను ఎస్‌ఈ చంద్రశేఖర్‌రావు రూపొందిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు పందికోన రిజర్వాయర్‌ నుంచి నీటిని తరలిస్తారు. దేవనకొండ మండలంలోని ముక్కిళ్ల వద్ద 4 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ను ఏర్పాటు చేసి అక్కడి నుంచి చక్రాళ్ల చెరువుకు నీటిని లిప్ట్‌ చేస్తారు. చక్రాళ్ల నుంచి కుడి, ఎడమ కాల్వల ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరందించేలా ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్నారు. ఈ ప్రా జెక్టుకు రూ.500 కోట్లు మాత్రమే ఖర్చు అవుతుందని ఇంజనీర్లు చెబుతున్నారు. ప్రాథమిక నివేదిక పంపిన తర్వాత ప్రభుత్వం పూర్తి స్థాయి నివేదికకు (డీపీఆర్‌) అనుమతి ఇస్తుందని వారు తెలిపారు

Link to comment
Share on other sites

  • 2 weeks later...
కరువు సీమలో మళ్లీ రైతు రాజ్యం
 
636235822461135703.jpg
ఆకుపచ్చ కోక కట్టిన నేలతల్లి! కనువిందు చేస్తోంది! ఏ కోనసీమలోనిదో కాదు! కృష్ణా డెల్టాలోనిదీ కాదు! పేరు వినగానే కరువు గుర్తుకొచ్చే రాయలసీమలోనిదీ దృశ్యం! అందులోనూ.. ఎడారీకరణకు దగ్గరవుతున్న మండలాలున్న అనంతపురం జిల్లాలోనిది! ఆత్మకూరు మండలం సింగంపల్లె గ్రామ పరిధిలోనిది! వానకారు పంటలే దైవాధీనంగా ఉండే అనంతపురంలో... ఇదేమి చిత్రమని ఆశ్చర్యపోవద్దు! ఇది చెరువులు చేసిన అద్భుతం! కూలీలుగా మారిన రైతులను మళ్లీ పొలాల్లోకి దించింది. వారికి పాత రోజులు గుర్తుకు తెచ్చింది. మరో నలుగురికి పనులు ఇచ్చే స్థాయికి తీసుకొచ్చింది! అనంతపురం జిల్లాలో ఇంత చిత్రం ఎలా జరిగింది? అసలక్కడ ఏం జరిగింది?
  • 20 ఏళ్ల తర్వాత చెరువుల కింద వరిసాగు..
  • పట్టిసీమ ఫలాలతో పచ్చటి పంటలు
  • హంద్రీ నీవా కాల్వల ద్వారా 65 చెరువులకు నీరు
  • రబీలోనూ 3767 హెక్టార్లలో వరి సాగు
(అనంతపురం - ఆంధ్రజ్యోతి) రైతుకు నీళ్లిస్తే పొలంలో బంగారం పండిస్తాడు! తాను బతుకుతూ... పది మందిని బతికిస్తాడు! దేశం ఆకలి తీరుస్తాడు! ఇది అక్షరాలా నిజమని అనంతపురం జిల్లా రైతులు నిరూపిస్తున్నారు. నీరు ఇచ్చిన అండతో పచ్చటి పైరు పండిస్తున్నాడు. దీనంతటికీ బీజం... పట్టిసీమలో పడింది. పట్టిసీమ ద్వారా ఈ ఏడాది తొలిసారిగా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తీసుకురావడం తెలిసిందే. ఆ మేరకు శ్రీశైలం నుంచి కిందికి వెళ్లాల్సిన నీటిని రాయలసీమ జిల్లాలకు మళ్లించారు. హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు నీటిని పంపి.. అక్కడి నుంచి అనంతపురం జిల్లాలోని పశ్చిమ భాగంలో చెరువులను నింపారు.
 
గుంతకల్లు మండలం నుంచి పెనుకొండ మండలం గొల్లపల్లి రిజర్వాయరు వరకు 12 మండలాల మీదుగా వెళ్లిన హంద్రీ నీవా కాలువతో 65 చెరువులను నింపారు. చెరువులకు నీటి చేరికతో చుట్టుపక్కల భూగర్భ జలాలు పెరిగాయి. దీంతో 70వేల నుంచి 80వేల బోర్లు రీచార్జి అయ్యాయి. హంద్రీనీవా రెండో దశ కింద జీడిపల్లి రిజర్వాయరు నుంచి గొల్లపల్లి రిజర్వాయరు వరకూ కాలువ ప్రవహించడంతో ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగాయి. చాలా చోట్ల 40 అడుగుల లోతులోనే నీరు పడుతున్నాయి. దీని ఫలితమే... వేసవిలోనూ వరి, వేరుశనగ సాగు! చెరువులు, బోర్ల కింద రబీ సీజనులో 3767 హెక్టార్లలో వరి సాగు చేయడం విశేషం.
 
 
12 మండలాల్లో పెరిగిన జల
అనంతపురం జిల్లాలో హంద్రీ నీవా నీటితో 12 మండలాల్లో భూగర్భజలాలు పెరిగాయి. జిల్లాలో సగటున నవంబరులోనే 24మీటర్ల లోతులో భూగర్భ జలాలుండేవి. ఇప్పుడు 22.32 మీటర్లుగా నమోదైంది. ఫిబ్రవరి 19 నాటికి భూగర్భ జలాల రికార్డు పరిశీలిస్తే గుంతకల్లు మండలంలో 4.27 మీటర్లు, గుత్తిలో 6, వజ్రకరూరులో 4.99, కూడేరులో 5.69, ఉరవకొండలో 3.7, విడపనకల్లులో 0.68, పెనుకొండలో 1.09, పెద్దపప్పూరులో 6.46, రామగిరిలో 6.57, గార్లదిన్నెలో 4.18, గార్లదిన్నెలో 4.18, సోమందేపల్లెలో 7.63 మీటర్ల మేర భూగర్భ జలాలు పెరిగాయి. కృష్ణా గోదావరి అనుసంధానం తొలి ఏడాది అందించిన ఫలాలు... కరువు సీమలోని రైతులో భరోసాను పెంచాయి. భవిష్యత్తుపై నమ్మకాన్నీ పెంచాయి! అన్నదాతా సుఖీభవ!

ఇదీ సింగంపల్లె కథ
అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం వై.సింగంపల్లెలో 300 కుటుంబాలున్నాయి. ఆ గ్రామంలో చెరువు కింద 200 ఎకరాల ఆయకట్టు ఉంది. గ్రామంలో 75శాతంమంది పొలాలున్న రైతులే. ఒకప్పుడు వారంతా సేద్యంపైనే ఆధారపడి జీవించేవారు. వానలు కురవక, చెరువులోకి నీరు రాక పొలాలు బీళ్లుగా మారడంతో... 20 ఏళ్లుగా ఆ రైతులంతా కూలీలుగా మారిపోయారు. కూడేరు, అనంతపురంవెళ్లి సాయంత్రం దాకా పని చేసుకునేవారు. తిరిగి ఇంటికొచ్చేటపుడు వాటర్‌ క్యానతో నీళ్లు తెచ్చుకుని తాగాల్సిన పరిస్థితి! ఇక... గ్రామంలో పొలంలేని 25 శాతం మంది పూర్తిగా వలస పక్షులయ్యారు. హంద్రీ నీవా సుజల స్రవంతి కాలువ సింగపల్లె గ్రామం మీదుగా వెళ్తుందని, బతుకులు మారతాయని అధికారులు చెప్పినా... ఎవ్వరికీ ఆ నమ్మకం కలిగేది కాదు. ఇన్నాళ్లకు ఆ మాట నిజమైంది. సింగంపల్లెలో ఇప్పుడు మళ్లీ రైతు రాజ్యం ఏర్పడింది.

ఊరందరికీ పని...

ఇప్పుడు సింగంపల్లెలో ప్రతి ఒక్కరికీ పని దొరుకుతోంది. చెరువుకింద 200 ఎకరాలుండగా 180 ఎకరాల్లో వరిసాగు చేశారు. చెరువుకు ఎగువన ఉన్న మరో 100 ఎకరాల్లో పైపుల ద్వారా మోటార్లు పెట్టి నీటిని తోడుకుని వేరుశనగ సాగుచేశారు. 20 ఏళ్లుగా పంటలేక పొలాల్లో పెరిగిన సర్కారు తుమ్మ చెట్లను 10 జేసీబీలతో నెలరోజులపాటు తొలగించారు. ఎకరా వరి నాట్లకు రూ.2500, కాడెద్దులు ఎకరా పాకమాను తోలినందుకు రూ.1000, కలుపు తీసేందుకు ఒక కూలీకి రూ.150... చేయాలనుకున్న వారందరికీ పనికి పని! పంటకు పంట!
2narahari.jpg
ఈయన పేరు యల్లం నరహరి. తాను రైతుననీ, తన వ్యాపకం వ్యవసాయమని 20 ఏళ్ల క్రితమే మరిచిపోయాడు. నాలుగెకరాల పొలంలో పంటలు పండక భార్యా పిల్లలతో ప్రతిరోజూ 20 కిలోమీటర్ల దూరంలో ఉండే టౌనులో కాంక్రీటు పనికి వెళ్లేవాడు. కానీ.. ఈ ఏడాది ఆయనలోని రైతు మళ్లీ మేల్కొన్నాడు. ఇంటిల్లిపాదీ తమ సొంత పొలం పనుల్లో మునిగి తేలుతున్నారు. ఇరుగుపొరుగు గ్రామాల నుంచి కూలీలను పిలిపించుకుంటున్నారు! ఇది కేవలం నరహరి కథ మాత్రమే కాదు! అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం సింగపల్లె గ్రామానికి చెందిన నారాయణప్ప, జె.నారాయణ, ఆంజనేయులు, బోయ ఆదినారాయణ వంటి రైతులందరిదీ ఇదే గాథ! ‘‘నాకు నాలుగెకరాల పొలం ఉంది. మా చెరువుకు నీళ్లు వచ్చాయి. అటక ఎక్కించిన మోటార్లను బోర్లలో దింపాం. సంతకు పోయి ఎద్దులను కొనాలి. నాగళ్లు చేయించుకోవాలి. ఎడ్లబండి కొనుక్కోవాలి. అందుకోసం రూ.లక్ష అప్పు చేసి సిద్ధంగా పెట్టుకున్నా. మా చెరువుకు ఇంక నమ్మకంగా నీళ్లొస్తాయి. అప్పులు మమ్మల్నేమీ చేయలేవు’’ అంటూ నరహరి భరోసా వ్యక్తం చేశారు.
 
US2GUNTUR.gif
Link to comment
Share on other sites

Karuvu prantalani gurtinchi (by collecting historical data) ah places lo paddy and sugarcane cultivation ban cheyyali govt..... farmers ni educate chesi, ah lands ki suit aye commercial crop vaipu protsahinchali.....

 

agree brother. kani ban cheyyatam kashtam. paddy ki kharchu takkuva, risk takkuva (ofcourse returns kuda takkuve anuko). vere crops ki incentives iste emaina slow ga change avutaremo. 

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 1 month later...

కరవునేలలో ‘జల’సిరి

15ap-story7a.jpg

కృష్ణా జలాలతో కరవు నేల పులకించిపోయింది. చెరువులు కళకళలాడిపోతున్నాయి. అనంతపురం జిల్లాలో గొల్లపల్లి జలాశయాన్ని కృష్ణా నీటితో నింపడంతో పెనుకొండ మండలంలో కరవును తరిమినట్లైంది. ప్రస్తుతం ఎటు చూపినా ఈ ప్రాంతమంతా పచ్చదనంతో నిండి కోనసీమను తలపిస్తోంది. సుమారు పదివేల ఎకరాల ఆయకట్టుకు నీరందించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేపట్టి ఈ రిజర్వాయర్‌లో నీటిని నింపింది.

- ఈనాడు, హిందూపురం
Link to comment
Share on other sites

హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుతో అనంతపురంజిల్లా సస్యశ్యామలం... Super User 19 April 2017 Hits: 512  

anantapur-farmers-19042017.jpg
share.png

ఆకుపచ్చ కోక కట్టిన నేలతల్లి! కనువిందు చేస్తోంది! ఏ కోనసీమలోనిదో కాదు! కృష్ణా డెల్టాలోనిదీ కాదు! ఒకప్పుడు ఫ్యాక్షన్‌తో అట్టుడికిన ప్రాంతం.. కక్షలతో ఉక్కిరిబిక్కిరై..ఊళ్లకుఊళ్లు ఖాళీ అయిన జిల్లా. ఒకవైపు కరువుకాటు మరోవైపు ఫ్యాక్షన్ గొడవలు. ఉపాధికోసం సొంతూరును వదిలి వలసవెళ్లిన జీవితాల్లో మార్పు కనిపిస్తోంది. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుతో అనంతపురంజిల్లా సస్యశ్యామలం అవుతోంది.

రైతుకు నీళ్లిస్తే పొలంలో బంగారం పండిస్తాడు! తాను బతుకుతూ... పది మందిని బతికిస్తాడు! దేశం ఆకలి తీరుస్తాడు! ఇది అక్షరాలా నిజమని అనంతపురం జిల్లా రైతులు నిరూపిస్తున్నారు. నీరు ఇచ్చిన అండతో పచ్చటి పైరు పండిస్తున్నాడు. దీనంతటికీ బీజం... పట్టిసీమలో పడింది. పట్టిసీమ ద్వారా ఈ ఏడాది తొలిసారిగా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తీసుకురావడం తెలిసిందే. ఆ మేరకు శ్రీశైలం నుంచి కిందికి వెళ్లాల్సిన నీటిని రాయలసీమ జిల్లాలకు మళ్లించారు. హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు నీటిని పంపి.. అక్కడి నుంచి అనంతపురం జిల్లాలోని పశ్చిమ భాగంలో చెరువులను నింపారు.

 

నిన్నటిదాకా కరువుతోపాటు ఫ్యాక్షన్ కుంపట్లతో...

నిన్నటిదాకా కరువుతోపాటు ఫ్యాక్షన్ కుంపట్లతో విలవిల్లాడిన అనంతపురం జిల్లాలో .. పరిస్థితులు మారుతున్నాయి. దేశంలోనే అతి తక్కువర్షపాతం నమోదయ్యే రెండవ జిల్లా అయిన అనంతపురంలో క్రమంగా పచ్చదనం వెల్లివిరుస్తోంది. భూగర్బజలాలు పాతాళంలోకి దిగజారి.. పొలాలన్నీ బీళ్ళుగా మారిన పరిస్థితుల్లో జిల్లావాసులు పొట్టచేతపట్టుకుని వలసలు వెళ్లిన విషాదఛాయలు ఇపుడు కనుమరుగవుతున్నాయి. కరువుతో ఇక పంటలు వేయలేమనుకున్న పరిస్థితుల్లో హాంద్రీనీవా సుజల స్రవంతి తమకు వరప్రదాయినిగా మారిందంటున్నారు రైతన్నలు.

హాంద్రీనీవా నీటితో జిల్లా కరువు పరిస్థితుల్లో మార్పు...

హాంద్రీనీవా నీటితో అనంతపురంజిల్లా కరువు పరిస్థితుల్లో మార్పువచ్చింది. జిల్లాలోని జీడిపల్లి,గొల్లపల్లి రిజర్వాయర్లలలో జలకళ, వీటితోపాటు జిల్లావ్యాప్తంగా పలుచెరువులను కృష్ణాజలాలతో నింపడంతో భూగర్బజలాలు పెరిగాయి. జలసిరులు అందుబాటులోకి రావడంతో గుతకల్లు, ఉరవకొండ, రాప్తాడు నియోజక వర్గాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వర్షాలపై ఆధారపడి పంటలు...

జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో ఫ్యాక్షన్ నేపథ్యం కలిగిన గ్రామాలే ఎక్కువ. ఇక్కడి రైతులు గతంలో పూర్తిగా వర్షాలపై ఆధారపడి పంటలు సాగుచేసేవారు. వర్షాలు లేక పంటలు ఎండిపోవడంతో అప్పులపాలయి దిక్కుతోచని స్థితిలో ఉన్న తమకు కృష్ణాజలాలు ఉపశమనం కలిగించాయంటున్నారు. పచ్చటి పొలాలను చూసి పదిహేనేళ్లు అయిందని ఈ పంటలను చూస్తుంటే ఇక.. ఇక తమప్రాంతంలో ఫ్యాక్షన్‌కు తావేలేదంటున్నారు అన్నదాతలు.

ఇప్పుడు అనంతపురంలో ఉన్న పరిస్థితి గురించి, ఆ రైతులు ఏమంటున్నారో మీరే వినండి...

Link to comment
Share on other sites

 అనంతపురం: జీడిపల్లి వరకు హంద్రి-నీవా కాల్వ వెడల్పుకు రూ.1100 కోట్ల నిధులు, జీవో జారీ చేసిన సీఎం చంద్రబాబు

Link to comment
Share on other sites

అనంతపురం: జీడిపల్లి వరకు హంద్రి-నీవా కాల్వ వెడల్పుకు రూ.1100 కోట్ల నిధులు, జీవో జారీ చేసిన సీఎం చంద్రబాబు

Great
Link to comment
Share on other sites

agree brother. kani ban cheyyatam kashtam. paddy ki kharchu takkuva, risk takkuva (ofcourse returns kuda takkuve anuko). vere crops ki incentives iste emaina slow ga change avutaremo.

Mandal ki X amount of acers gurtinchi andulo experimental fa try cheyyataniki konta fund ivvali (it may cost max 1-2 Cr for govt per year in ATP district)
Link to comment
Share on other sites

The whole concept of canal water doesn't work out for rayalaseema region. Its a good starting place to implement things like water audit. Probably the best thing would be to stop all canal water to farms directly and only allow drip irrigation.  I  know it would be hard but then its the need of the hour. It  should reach a point where each village that has a tank is given water and farmers lay pipes from the tank and then pay for what they use. That way they will be forced to move away from water crops like paddy. 

Link to comment
Share on other sites

హంద్రీనీవా’ వెడల్పునకు టెండర్లు
 

  • 90 రోజుల్లో పూర్తిచేయాలని లక్ష్యం
  • 216 కిలోమీటర్ల మేర 19 మీటర్ల వెడల్పు
  • రూ.1030 కోట్లతో అంచనా
అనంతపురం, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హంద్రీనీవా సుజల స్రవంతి (హెచఎనఎస్‌ఎస్) కాలువ వెడల్పు పనులకు శనివారం టెండరు ప్రకటించారు. ఈ మేరకు షార్ట్‌టెండర్‌ నోటీసు విడుదల చేశారు. మంగళవారం నాటికి టెండరు నిబంధనలు, కాంట్రాక్టరు అర్హతల వంటివి అధికారులు ఆనలైనలో అప్‌లోడ్‌ చేయనున్నట్టు సమాచారం. ఆరు నెలల క్రితం సీఎం చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు హంద్రీనీవా కాలువ వెడల్పు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఈ నెల 20న చంద్రబాబు పుట్టినరోజును అనంతపురం జిల్లా పామిడిలో జరుపుకున్నారు.
 
ఆ సందర్భంగా హంద్రీనీవా కాలువు వెడల్పు జీవోను జిల్లా ప్రజలకు కానుకగా ప్రకటించారు. అదే వేదిక నుంచి కాలువ వెడల్పు పనులను 90 రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ వీరపాండ్యనను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ హెచఎనఎ్‌సఎ్‌స అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం కాలువ వెడల్పు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించడం, శనివారం టెండర్లను ప్రభుత్వం ఆనలైనలో ఉంచడం చకచకా జరిగిపోయాయి. సోమవారం టెండర్‌ను ప్రచురిస్తారని, అదేరోజు సాయంత్రానికి నోటీసు పిలుస్తారని అధికారులు చెబుతున్నారు. కాలువను 19 మీటర్ల వెడల్పు చేయడం, నిర్మాణాల వద్ద లైనింగ్‌ చేయడం, పనులకు ఇబ్బందులు లేకుండా కాలువ పక్కనున్న మట్టి కుప్పలను తొలగించడం వంటి పనులు చేయాలని టెండర్లలో పొందుపరిచారు.
216 కిలోమీటర్ల మేర 19 మీటర్ల వెడల్పు
కర్నూలు జిల్లా మల్యాల నుంచి అనంతపురం జిల్లా జీడిపల్లి వరకూ 216 కిలోమీటర్ల మేర హెచఎనఎ్‌సఎ్‌స కాలువ వెడల్పు పనులను చేపట్టనున్నారు. దీన్ని మూడు ప్యాకేజీలుగా విభజించారు. 0 నుంచి 134 కిలోమీటర్ల వరకు కర్నూలు జిల్లా పరిధిలోని కాలువను రెండు ప్యాకేజీలుగాను, 134 నుంచి 216 కిలోమీటర్ల వరకు అనంతపురం జిల్లా పరిధిలోని కాలువను మరొక ప్యాకేజీగాను విభజించారు. కాలువ వెడల్పు పనులకు రూ.1030 కోట్లు అంచనా వేశారు. ప్రస్తుతం గరిష్ఠంగా 14.5 మీటర్ల వెడల్పు ఉన్న కాలువను 19 మీటర్లకు పెంచనున్నారు.
 
అనంత కరువుకు సెలవు!
కాలువ వెడల్పు పెరిగితే అనంత జిల్లాకు కరువు తీరుతుందని నిపుణులు చెబుతున్నారు. హెచఎనఎ్‌సఎ్‌స కాలువ వెడల్పు చేస్తే మల్యాలనుంచి రాయలసీమ జిల్లాలకు ఏటా సుమారు 60 టీఎంసీల వరకు నీరు తీసుకునే వీలుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 14.5 మీటర్ల వెడల్పుతో ఉన్న కాలువలో 2050 క్యూసెక్కుల ప్రవాహంతో 180 రోజుల్లో 33 టీఎంసీలు తీసుకుని కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వినియోగిస్తున్నారు. ఈ ప్రకారం కాలువ వెడల్పు 19 మీటర్లకు పెరిగితే 3800 క్యూసెక్కుల ప్రవాహంతో 180 రోజుల్లో 60 టీఎంసీల దాకా తీసుకోవచ్చని వారు వివరిస్తున్నారు. అదే కాలువకు లైనింగ్‌ పనులు చేపడితే 12 పంపుల ద్వారా ఐదువేల క్యూసెక్కుల ప్రవాహంతో నీటిని తీసుకోవచ్చని సీఎం చంద్రబాబు అనంత సభలో వివరించారు.
 
ఆ మేరకు 180 రోజుల్లో 80 టీఎంసీలకు పైగా హంద్రీనీవా కాలువనుంచి పంపుల ద్వారా తోడుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. అనంతపురం జిల్లాను కరువు రహితంగా మార్చాలంటే 100 టీఎంసీల నీరు అవసరమని నిపుణులు అంచనా వేశారు. ఇప్పటికే తుంగభద్ర ప్రాజెక్టునుంచి హెచఎల్‌సీ ద్వారా జిల్లాకు సుమారు 22 టీఎంసీల నీరు అందుతోంది. కాలువ వెడల్పు జరిగి లైనింగ్‌ పనులు పూర్తయితే అనంతపురం జిల్లా అవసరాలకు నీటి లభ్యత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అనంతపురం జిల్లాలో కరువు నివారించడానికి హంద్రీనీవా వరప్రదాయనిగా మారనుందని చెబుతున్నారు.
Link to comment
Share on other sites

551 కోట్లతో చెరువుల అనుసంధానం.. 160 గ్రామాలకు జల‘సిరి’
 
636289946029584505.jpg
హంద్రీ నీవా కాల్వ నుంచి 106 చెరువులకు కృష్ణా జలాల ఎత్తిపోతల ప్రాజెక్టుకు జలవనరుల శాఖ అధికారులు తుది రూపు ఇచ్చారు. నివేదికను కలెక్టర్‌ ఎస్‌.సత్యనారాయణ ద్వారా గురువారం ప్రభుత్వానికి పంపారు. ప్రాజెక్టు అధ్యయనానికి 2015 జూలై 15న జీవో నం:479 జారీ అయింది. హైదరాబాదుకు చెందిన ఐడెల్‌ సంస్థ సర్వే చేసి రూ.879 కోట్ల అంచనాతో నివేదిక ఇచ్చింది. ఈ మొత్తం తగ్గించాలంటూ ఈఎన్ సీ ఫైలును వెనక్కి పంపారు. దీంతో ఇరిగేషన్ ఇంజనీర్లు చెరువులను అనుసంధానం చేస్తూ ప్రతిపాదనలు రూ.551 కోట్లకు తగ్గించారు. డిప్యూటీ సీఎం కేఈ
కృష్ణమూర్తి ప్రత్యేక చొరవ తీసుకుని సీఎంను ఒప్పించి నిధులు రాబడితేనే పశ్చిమ ప్రాంతంలో 160 గ్రామాలకు జల‘సిరి’.
  •  హంద్రీ నీవా నుంచి ఎత్తిపోతలకు తుది రూపు 
  •  తుది నివేదిక పంపిన జలవనరుల అధికారులు 
  •  చెరువుల అనుసంధానంతో తగ్గిన వ్యయం 
  •  ముఖ్యమంత్రిని ఒప్పిస్తేనే జల కల సాకారం 
ప్రాజెక్టు స్వరూపం
ప్రాజెక్టు : 106 చెరువులకు కృష్ణా జలాల ఎత్తిపోతల పథకం
ప్రతిపాదన వ్యయం : రూ.879 కోట్లు
సవరించిన అంచనా : రూ.551 కోట్లు
 అవసరమైన నీరు : 2.44 టీఎంసీలు (హంద్రీనీవా కాల్వలో జిల్లా వాటా 9 టీఎంసీలలో)
 ఆయకట్టు : ప్రత్యక్షంగా 16 వేల ఎకరాలు, పరోక్షంగా 20 వేల ఎకరాలు
 తాగునీరు : 1.20 లక్షల మందికి
 ప్రయోజనం : నందికొట్కూరు, పాణ్యం, కర్నూలు, డోన, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో 16 మండలాల పరిధిలో 160 గ్రామాలు.
 విధానం : గొలుసుకట్టు చెరువుల అనుసంధానం.
ఆంధ్రజ్యోతి-కర్నూలు: కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో 6.05 లక్షల ఎకరాలకు సాగునీరు, లక్షల జనాభాకు తాగునీరు లక్ష్యంగా హంద్రీ నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం చేపట్టారు. శ్రీశైలం ఉపరితలంలో మల్యాల ప్రధాన లిఫ్ట్‌ నుంచి 40 టీఎంసీల కృష్ణా వరద జలాలు ఎత్తిపోసుకోవాలి. జిల్లాకు 9 టీఎంసీలు వినియోగించుకుని 80 వేల ఎకరాలకు నీరివ్వాలి. అయితే హంద్రీ నీవా కాలువ పరీవాహకం ఎగువన చెరువులు ఉన్నా.. వర్షాభావం వల్ల అవి ఒట్టికుండలుగా మారాయి. వాటి కింద ఆయకట్టుకు వర్షమే ఆధారమైంది. కళ్లెదుటే కృష్ణా జలాలు జిల్లా మీదుగా వెళ్తున్నా తాగునీటికి కష్టాలు తప్పడం లేదు. కాల్వ తీరం వెంబడి ఉన్న నందికొట్కూరు, డోన, పాణ్యం, కర్నూలు, పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల పరిధిలో 106 చెరువులకు కృష్ణా జలాలు ఎత్తిపోసి కరువును పారదోలాలని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సీఎం చంద్రబాబుకు విన్నవించారు. దీంతో ముఖ్యమంత్రి 2015 జూలై 15న అధ్యయనం కోసం రూ.90 లక్షలు కేటాయిస్తూ జీవో నెం.479 జారీ చేశారు. హైదరాబాదుకు చెందిన ఐడెల్‌ సంస్థ రూ.879 కోట్లతో సమగ్ర అధ్యయన నివేదిక (డీపీఆర్‌) ప్రభుత్వానికి ఇచ్చింది. ‘10 వేల ఎకరాలకు సాగునీరు అందించే ఈ ప్రాజెక్టులకు రూ.879 కోట్లు ఇవ్వడం సాధ్యం కాదు. ఈ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు ఉన్నాయా? హైడ్రాలికల్‌ పర్టిక్యులర్స్‌ ఉన్నాయా?’ అని కొర్రీలు పెడుతూ ఉన్నతాధికారులు ఈ ఫైలును వెనక్కి పంపారు. ప్రతిపాదన వ్యయం తగ్గించాలని ఈఎనసీ సూచించారు. రీ సర్వేకి ఐడెల్‌ సంస్థ చేతులేత్తేయడంతో ఇరిగేషనశాఖ ఎస్‌ఈ చంద్రశేఖర్‌రావు పర్యవేక్షణలో మైనర్‌ ఇరిగేషన ఏఈఈ వేణు మూడు నెలలు కసరత్తు చేసి ప్రతిపాదన వ్యయం రూ.551 కోట్లకు తగ్గిస్తూ తుది నివేదిక తయారు చేశారు. దీన్ని కలెక్టర్‌ సత్యనారాయణ ద్వారా గురువారం రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు.

 
డిప్యూటీ సీఎం చొరవ తీసుకుంటేనే..
నదుల అనుసంధానం స్ఫూర్తితో ‘గొలుసుకట్టు చెరు వుల అనుసంధానం’ ద్వారా వంకలు, వాగులు నుంచి గ్రావిటీ ద్వారా నీటిని చెరువులకు ఎత్తిపోసేలా రీ సర్వే చేశారు. హంద్రీ నీవా నుంచి కనిష్ఠంగా 3 మీటర్లు, గరిష్ఠం గా 116 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసి 160 గ్రామాలకు తాగు, సాగునీటితో పాటు 106 చెరువులకు కృష్ణాజలాలు ఎత్తిపోసే ప్రతిపాదనలకు తుదిరూపు ఇచ్చారు. 16 ప్యాకేజీలలతో రూ.551 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చాలంటే డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి నిధులు రాబడితేనే కరువు పల్లెలు సస్యశ్యామలమవుతాయి.
 
తుది నివేదిక ప్రభుత్వానికి పంపించాం
గొలుకుట్టు చెరువుల అనుసంధానం ద్వారా రూ.551 కోట్లకు అంచనా వ్యయం తగ్గించాం. kunl.jpgతుది నివేదిక కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి ఇచ్చాం. నిధులు ఇస్తే పశ్చిమ ప్రాంతంలో కరువును శాశ్వతంగా నివారించవచ్చు. 1.20 లక్షల మందికి దాహం తీరుతుంది.
 చంద్రశేఖర్‌రావు, ఇరిగేషన్ ఎస్‌ఈ, కర్నూలు
Link to comment
Share on other sites

atp konchem kastamey clean sweep. As per my dad, lot of corruption at ground level from all the mla's and they don't work together at all. One good +ve is two constituencies got water (sunitha's and kesav's), others not so much. Hope things change in the next two years. If all the leaders can work together it may be possible. But as of today, clean sweep is not going to happen.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...