Jump to content

Handri - Niva SUJALA - PHASE 2


sonykongara

Recommended Posts

  • Replies 443
  • Created
  • Last Reply
  • 4 weeks later...
రిత్విక్‌, హెచఈఎస్, మేఘాలకు హంద్రీనీవా విస్తరణ పనులు
 
అమరావతి, మే 20(ఆంధ్రజ్యోతి): హంద్రీనీవా సుజల స్రవంతి విస్తరణ బాధ్యతను మూడు సంస్థలకు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విస్తరణ పనులను మూడు భాగాలుగా జల వనరులశాఖ విభజించింది. మొత్తం రూ.832 కోట్లతో చేపట్టే తొలిప్యాకేజీ పనులను రిత్విక్‌కూ, రెండో ప్యాకేజీని హిందుస్థాన్‌ ఇంజనీర్స్‌ సిండికేట్‌కు, మూడో ప్యాకేజీ పనులను మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కు అప్పగించారు. పనులను త్వరగా చేపట్టాలని కాంట్రాక్టు సంస్థలను జల వనరులశాఖ ఆదేశించింది. 3 నెలల్లో పూర్తవుతాయని జల వనరులశాఖ వెల్లడించింది.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

హంద్రీనీవా ప్రాజెక్ట్ తో, కరువు సీమలో మళ్ళీ రైతు రాజ్యం....

 

 
handri-niva-project-06062017.jpg
share.png

సీఎం చంద్రబాబు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న హంద్రీనీవా సుజల స్రవంతి (హెచఎనఎస్‌ఎస్) కాలువ వెడల్పు పనుల టెండర్ల ప్రక్రియ ముగించి, విస్తరణ పనులకు శ్రీకారం చుట్టడంతో రైతన్నల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. మొదటి దశ కాల్వను విస్తరించడం ద్వారా కృష్ణా జలాలను తక్కువ సమయంలో ఎక్కువగా జిల్లాకు తేవచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.

హంద్రీనీవా కాల్వ ద్వారా వాస్తవానికి 3,850 క్యూసెక్కుల నీరు ప్రవహించేందుకు వీలున్నా.. 2,100-2,200 క్యూసెక్కులకు మించి నీరు ప్రవహించడం లేదు. కర్నూలు జిల్లా మల్యాల నుంచి అనంతపురం జిల్లాలోని జీడిపల్లి జలాశయం వరకు ఉన్న హంద్రీనీవా మొదటి కాల్వ 216.300 కి.మీ.మేర, రూ.1,030 కోట్లతో, 3,850 క్యూసెక్కులు ప్రవహించేలా విస్తరించనున్నారు.

కరవు జిల్లా అనంతకు ఇప్పటి వరకు తుంగభద్ర కాల్వ జీవనాడిగా ఉండగా, ఇకపై హంద్రీనీవా కూడా అత్యంత కీలకమైన సాగు, తాగునీటి వనరుగా మారనుంది. హంద్రీనీవా పరిధిలో సీమ జిల్లాల్లో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఇందులో అనంతపురం జిల్లాలోనే అత్యధికంగా 3.45 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందనుంది. లక్షల మంది తాగునీటి అవసరాలు తీర్చనుంది.

 

నిరుడు మహారాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలతో శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తడంతో హంద్రీనీవా ద్వారా ఆగస్టు నుంచి నీటిని అనంతకు మళ్లించారు. అప్పటి నుంచి ఫిబ్రవరి వరకు కృష్ణమ్మ పరవళ్లు కొనసాగాయి. దాదాపు 28 టీఎంసీల నీరు హంద్రీనీవా ద్వారా తీసుకున్నారు. అయితే ఇంత సుదీర్ఘకాలం కాకుండా శ్రీశైలానికి వరద పోటెత్తినపుడు, ఎగువన మంచివర్షాలతో జలాశయం నిండుకుండలా మారినపుడు, తక్కువ సమయంలో ఎక్కువ నీటిని హంద్రీనీవా ద్వారా జిల్లాకు తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఇది మొదటి దశ కాల్వ విస్తరణ ద్వారా సాధ్యమని కూడా తేల్చారు. దీంతో కాల్వ విస్తరణకు ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేశారు.

అనంత కరువుకు సెలవు!

కాలువ వెడల్పు పెరిగితే అనంత జిల్లాకు కరువు తీరుతుందని నిపుణులు చెబుతున్నారు. హెచఎనఎ్‌సఎ్‌స కాలువ వెడల్పు చేస్తే మల్యాలనుంచి రాయలసీమ జిల్లాలకు ఏటా సుమారు 60 టీఎంసీల వరకు నీరు తీసుకునే వీలుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అనంతపురం జిల్లాను కరువు రహితంగా మార్చాలంటే 100 టీఎంసీల నీరు అవసరమని నిపుణులు అంచనా వేశారు. ఇప్పటికే తుంగభద్ర ప్రాజెక్టునుంచి హెచఎల్‌సీ ద్వారా జిల్లాకు సుమారు 22 టీఎంసీల నీరు అందుతోంది. కాలువ వెడల్పు జరిగి లైనింగ్‌ పనులు పూర్తయితే అనంతపురం జిల్లా అవసరాలకు నీటి లభ్యత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అనంతపురం జిల్లాలో కరువు నివారించడానికి హంద్రీనీవా వరప్రదాయనిగా మారనుందని చెబుతున్నారు.

Link to comment
Share on other sites

బుక్కపట్నం చెరువు 
విజయనగర రాజుల నిర్మించిన ఈ 15 శతాబ్దపు చెరువు 4000ఎకరాల పొలాలకు నీరు అందిస్తది 
చిత్రావతి నది నుండి ఈ చెరువు కి నీరు వస్తది 
కర్ణాటక ప్రభుత్వం పరగోడు రిజర్వాయర్ నిర్మించిన తర్వాత ఈ చెరువు కి నీరు రావడం ఆగిపోయింది 
అడపా దడపా వర్షపు నీరు తప్ప 
ఈ ఇయర్ హంద్రీ నీవా సుజల స్రవంతి ద్వారా కృష్ణమ్మా బుక్కరాయ పట్నం చెఱువు లోకి ప్రవేశించింది 4 వేల ఎకరాల ను సస్యశామలం చేయనుంది 5 ఏళ్ళ తర్వాతా నీరు చూస్తున్న ఈ ప్రజల ఆనందం చూడండి

బాబు వచ్చాడు - నీరు ఇచ్చాడు

19105836_10213335196197346_9018931472139

18952903_10213335196357350_8678185335352

19059950_10213335196317349_8650826613405

19060084_10213335196557355_1496818283835

 

Link to comment
Share on other sites

  • 2 weeks later...

I'm following any irrigation related news from AP from last three years with out a doubt CBN/TDP efforts are paying now, Handri - Niva Chittor varaku complete cheyali next time Rayalaseema lo seats guarantee ga peragali.

Link to comment
Share on other sites

I'm following any irrigation related news from AP from last three years with out a doubt CBN/TDP efforts are paying now, Handri - Niva Chittor varaku complete cheyali next time Rayalaseema lo seats guarantee ga peragali.

Uncle mammalni maa leader ni maa state ni vadilesaaeu ga inka following enduku :thinking:
Link to comment
Share on other sites

Uncle mammalni maa leader ni maa state ni vadilesaaeu ga inka following enduku :thinking:

Memu vadilipetaledu Babu garu 2008 October lo letter lo icharu vadu sir ana vinaledu, ayina 2014 end varaku sir tho vunamu kada evarki chepina vallaki support chesamu chivaraku thapani sari prasithulo bayataku vachamu but sir ekkada vuna manchiga vundali korukutamu as a well wisher ....

 

Modi antey istam lekapoyina center lo Congress vallu rochu taokolemu ani BJP antey vuna abhimanam tho ayanaki support chesthunaru kada mana telugu vallu chala mandhi nenu kuda alanti vadiney :)

Link to comment
Share on other sites

Memu vadilipetaledu Babu garu 2008 October lo letter lo icharu vadu sir ana vinaledu, ayina 2014 end varaku sir tho vunamu kada evarki chepina vallaki support chesamu chivaraku thapani sari prasithulo bayataku vachamu but sir ekkada vuna manchiga vundali korukutamu as a well wisher ....

 

Modi antey istam lekapoyina center lo Congress vallu rochu taokolemu ani BJP antey vuna abhimanam tho ayanaki support chesthunaru kada mana telugu vallu chala mandhi nenu kuda alanti vadiney :)

edo okati ilaage cheppandi maa laanti amaayakulaki :(

Link to comment
Share on other sites

నీటిని ఎత్తిపోద్దాం

హంద్రీనీవా ప్రధాన కాల్వపై ఎత్తిపోతల

రూ.239.31 కోట్లకు మంత్రివర్గం ఆమోదం

పురపాలకాల్లో లేఔట్లు, భూముల సబ్‌డివిజన్‌ బాధ్యత కమిషనర్లకు

వడ్డీ వ్యాపారుల నియంత్రణకు కొత్త చట్టం

డిజిగ్నేటెడ్‌ టెక్నాలజీ పార్కు పాలసీకి ఆమోదం

ఈనాడు - అమరావతి

3ap-main1a.jpg

హంద్రీనీవా సుజల స్రవంతి ప్రధాన కాల్వపై రూ.239.31కోట్ల వ్యయంతో ఎత్తిపోతల నిర్మించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఖరీఫ్‌కు ముందే హంద్రీనీవా పనులు పూర్తిచేసే లక్ష్యంతో సొరంగం స్థానంలో ప్రత్యామ్నాయ పనులు చేపట్టనున్నారు. ఎంఈఐఎల్‌-మైటాస్‌-కేబీఎల్‌ సంస్థలకు ఈ పనులు అప్పగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం జరిగిన సమావేశంలో నిర్ణయించారు. హంద్రీనీవా ఫేజ్‌-2 నిధుల నుంచి సవరించిన వ్యయాన్ని భరించడానికి మంత్రివర్గం అనుమతినిచ్చింది. సొరంగం స్థానంలో ప్రధాన కాల్వపై 506.000 కి.మీ.నుంచి 511.000 కి.మీ వరకు ఆకృతి, నమూనా హెచ్‌పీలు, మట్టి పని, ఎత్తిపోతల చేపట్టనున్నారు.

తక్కువ డిపాజిట్‌దారుల చెల్లింపులకు ప్రాధాన్యం: అగ్రిగోల్డ్‌ ఆస్తుల వేలం ద్వారా వచ్చిన రూ.37కోట్లను విడుదల చేశారు. అక్షయగోల్డ్‌ ఆస్తుల వేలం ద్వారా రూ.ఆరు కోట్లు వచ్చాయని అధికారులు వివరించారు. కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నందున హైకోర్టుకు సమాచారం అందించాలని, తక్కువ మొత్తంలో డిపాజిట్‌ చేసిన వారికి చెల్లింపుల్లో ప్రాధాన్యమివ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఐటీ పరిశ్రమల ఆదాయం తగ్గితే అద్దె రాయితీ: డిజిగ్నేటెడ్‌ టెక్నాలజీ పార్కు పాలసీ 2017-20కి మంత్రిమండలి ఆమోదించింది. దీనికింద మూడేళ్లలో రూ.239 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఐటీ సంస్థలు నేరుగా రాష్ట్రానికి వచ్చేలా వసతులు కల్పించడం పాలసీ లక్ష్యం. ఎవరైనా అద్దెకు తీసుకుని సామర్థ్యం మేరకు వ్యాపారం చేయలేక ఆదాయం తగ్గితే 50శాతం అద్దె రాయితీనిస్తారు. ఇది నాలుగు విభాగాల్లో అమలు చేస్తారు. 18 నెలల నుంచి 36 నెలల పాటు ఈ పథకం ఉంటుంది.

కమిషనర్లకే లేఔట్లు, భూముల సబ్‌డివిజన్‌ బాధ్యతలు.. వ్యాపార సరళతర నిర్వహణలో భాగంగా పురపాలక లేఔట్లకు ఆన్‌లైన్‌ ద్వారా అనుమతులిస్తారు. హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ చట్టం 1955 ప్రకారం మంజూరు అధికారం, పురపాలికల్లో లేఔట్లు, భూముల సబ్‌డివిజన్‌ మంజూరు అధికారం కమిషనర్లదే. మున్సిపల్‌ కౌన్సిల్‌కు బదులుగా వీరికి అప్పగించారు. తొలిదశలో మేజర్‌ పురపాలక సంఘాల్లో అమలు చేస్తారు.

411 పోస్టులు మంజూరు.. సాంఘిక సంక్షేమశాఖలో కొత్తగా 330 పోస్టులు మంజూరు. ఇందులో 270 బోధన, 60 బోధనేతర సిబ్బంది ఉద్యోగాలు ఉన్నాయి. మైదాన ప్రాంతాల్లోని గిరిజన సంక్షేమ వసతిగృహాల కోసం 50 మల్టిపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టులు, అన్ని శాఖల్లో కలిపి 411 పోస్టులు మంజూరు.

వడ్డీ నిర్ణయించేది ప్రభుత్వమే

* 2015 నాటి వడ్డీ వ్యాపారుల బిల్లు స్థానంలో కొత్తగా ఆంధ్రప్రదేశ్‌ మనీ లెండర్స్‌ బిల్‌-2017కు ఆమోదం.

* తొలి దశలో పట్టణ ప్రాంతాల్లో దీన్ని అమలు చేస్తారు. ప్రతి వడ్డీ వ్యాపారి లైసెన్సు పొందాలి. ఇది మూడేళ్లు ఉంటుంది. అప్పు తీసుకునే సమయంలో తీసుకున్న దానికంటే ఎక్కువ నోట్లపై రాస్తున్నారని మంత్రివర్గంలో చర్చించారు. కొత్త బిల్లు ప్రకారం వడ్డీ ఎంతనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుంది.

* అధిక వడ్డీ వసూలు చేసినా.. తప్పుడు మొత్తం నమోదు చేసినా, రుణగ్రహీతల్ని వేధించినా చర్యలు తీసుకుంటారు.

చుక్కల భూములపై మార్గదర్శకాలు.. చుక్కల భూముల చట్టం-2017 ముసాయిదా ప్రతిపాదనలకు ఆమోదం. అయిదారు లావాదేవీలు జరిగిన చోట సమస్యలున్నాయని, ఇక్కడ ఏం చేయాలనే దానిపై మార్గదర్శకాలు తయారుచేయాలనే సూచన వచ్చింది.

సీఆర్‌డీఏలో రైతుల ఇబ్బందులు.. సీఆర్‌డీఏ పరిధిలోని లేఔట్ల విధానాన్ని పరిశీలించారు. కేబినెట్‌ ఉపసంఘంలో చర్చించాక నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. సీఆర్‌డీఏలో రోడ్ల నిర్మాణానికి వేర్వేరు జోన్లున్నాయి. వ్యవసాయ జోన్‌లో ఉన్న చిన్న, సన్నకారు రైతులకు వీటివల్ల ఇబ్బందులు వస్తున్నాయి. వీటిని ఎలా అధిగమించాలనే విషయమై అధ్యయనం చేయాలని నిర్ణయం.

మిథానీకి 57 ఎకరాలు.. కేంద్ర రక్షణ శాఖకు చెందిన ‘మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌’(మిధాని)కి నెల్లూరు జిల్లాలో 57.14 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం. కొడవలూరు మండలం బొడ్డువారిపాలెం గ్రామంలో భూమిని కేటాయించారు.

* నెల్లూరు జిల్లా దగదర్తి మండలం దామవరం గ్రామంలో గ్రీన్‌ఫీల్డ్‌ విమానాశ్రయం ఏర్పాటు చేయడానికి 210 ఎకరాలను ఇవ్వడానికి జిల్లా కలెక్టర్‌కు అనుమతిస్తూ నిర్ణయం.

అప్పు తీసుకునేందుకు ఆమోదం: ఏపీ ఆయిల్‌ఫెడ్‌ రూ.150 కోట్లు, మార్క్‌ఫెడ్‌ రూ.60 కోట్లు, ఏపీఎస్‌ఎస్‌డీసీ రూ.300 కోట్ల చొప్పున 2017-18 నుంచి 2019-20 దాకా వాణిజ్యబ్యాంకులు, ఎన్‌సీడీసీ, నాబార్డు నుంచి ఎనిమిది శాతం వడ్డీపై రుణం తీసుకునేందుకు ఆమోదం.

ఇళ్ల క్రమబద్ధీకరణ: నగరపాలక సంస్థల్లో వంద గజాలలోపు ప్రభుత్వ స్థలం లేనిచోట, గృహ సముదాయాలు నిర్మించే వీలు లేని ప్రాంతాల్లో ఆక్రమించి ఇళ్లు నిర్మించుకున్న దారిద్య్ర రేఖ దిగువనున్న కుటుంబాల వారికి క్రమబద్ధీకరించాలని నిర్ణయం.

అందుబాటులోకి కూరగాయల ధరలు

* నిత్యావసర వస్తువుల ధరలు తగ్గడంపై ప్రజలు సంతృప్తిగా ఉన్నట్లు జీఎస్టీపై జరిగిన చర్చలో అభిప్రాయం.

* కూరగాయల ధరలు అందుబాటులోకి తీసుకురావాలి. రైతుబజార్ల కార్యకలాపాలు పర్యవేక్షించాలి.

* గ్రామీణ ప్రాంతాల్లో కుక్కల బెడదను నియంత్రించడానికి ఏపీ పంచాయతీరాజ్‌ చట్టం 1994లోని సెక్షన్‌ 92 సవరించాలని నిర్ణయం. దీన్ని శాసనసభ ముందుంచుతారు.

* రాజధాని శంకుస్థాపన సమయంలో గుంటూరు జిల్లా కలెక్టర్‌ శాఖాపరంగా చేపట్టిన పనులకు సంబంధించి రూ.4.29 కోట్ల విడుదల.

మద్యం ఆదాయవనరు కాదు: సీఎం

మద్యాన్ని ఆదాయ వనరుగా ప్రభుత్వం ఎప్పుడూ చూడలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. గొలుసు దుకాణాలను రద్దు చేసిన విషయాన్ని మంత్రివర్గ సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో గుర్తు చేశారు. కొత్త విధానం వల్ల మహిళలు, మధ్యతరగతి వర్గాలు ఇబ్బందిపడకుండా చూడాలని ఆదేశించారు. దీనిపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 3 weeks later...

@kishbab, If water is let into NS, mukkodu thodesthaadu NS left canal vaipu or will generate power leaving it further down..NS is in their control. Eee whole division lo baaga anyayam jarigindi maathram NS andhra farmers ye. Chintalapudi phase-2 will take care of NS Left farmers, something needs to planned to take care of Right Canal farmers too. So leaving water from srisailam is not an option for Andhra. Because of pattiseema we atleast have this option to use water to rayalaseema, else vunna water to TG vaadu max lagesthaadu.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...