Jump to content

Ramesh39

Members
  • Posts

    12,781
  • Joined

  • Last visited

  • Days Won

    2

Ramesh39 last won the day on April 13 2018

Ramesh39 had the most liked content!

About Ramesh39

  • Birthday July 18

Profile Information

  • Gender
    Male
  • Location
    Singapore

Recent Profile Visitors

The recent visitors block is disabled and is not being shown to other users.

Ramesh39's Achievements

  1. Dussera Pandaga ki perfect movie action movie ante ila theyali anela thesina Koratala Siva NTR acting ni enjoy cheyandi few days lo ani ratings marchi rasukuntaru Larger than Life movies cheyali ante - only Nandamuri family anle vundi movie
  2. Koratala Siva is back Movie better than JG Perfect Dasara movie
  3. https://www.eenadu.net/telugu-news/movies/official-invitation-of-tollywood-celebration-of-fifty-years-of-nandamuri-balakrishna/0210/124141049
  4. Avg first half and ok second half overall watchable movie Visuals are next level
  5. Jai Sree Raama Jai Hanumaan
  6. వచ్చేస్తోంది!..సింగపూర్‌ విమానం ఈనాడు, అమరావతి ప్రపంచంతో అనుసంధానం ఎక్కడికైనా తేలికగా ఎగిరిపోవచ్చు! గన్నవరం విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు తొలి అంతర్జాతీయ విమాన సర్వీసు అక్టోబర్‌ నుంచి నుంచి ప్రారంభం కాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం, భారత విమానయాన సంస్థ చొరవతో ఇండిగో ముందుకొచ్చి సింగపూర్‌కు సర్వీసు నడపబోతోంది. కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం నాలుగు జిల్లాల నుంచి ఏటా ఈ నాలుగు జిల్లాల నుంచి 25 లక్షల మంది హైదరాబాద్‌, దిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు వెళ్లి అక్కడి నుంచి విదేశాలకు వెళ్తున్నారు. గన్నవరం నుంచి అంతర్జాతీయ సర్వీసులు అందుబాటులోకి వస్తే.. వీరందరూ ఇక్కడి నుంచే వెళ్లేందుకు వీలుంటుంది. సింగపూర్‌తో భారతదేశానికి బలమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయి. సముద్ర మార్గంలో నౌకల ద్వారా జరిగే రవాణా చాలావరకు సింగపూర్‌, దుబాయ్‌ మీదుగానే ఇతర దేశాలకు చేరుకుంటాయి. సింగపూర్‌కు ఏటా కోస్తా ప్రాంతం నుంచి వెళ్లేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. . రోజూ హైదరాబాద్‌ నుంచి సింగపూర్‌, దుబాయ్‌లకు ఆరు విమాన సర్వీసులు నడుస్తున్నాయి. ఇక్కడి నుంచి రోజూ ఒక్క విమాన సర్వీసును సింగపూర్‌, దుబాయ్‌కు నడిపితే.. వెసులుబాటు కలుగుతుందని ఎప్పటినుంచో ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు. ప్రయాణ ఖర్చు, సమయం ఆదా..: సింగపూర్‌కు విమాన టిక్కెట్‌ రూ. 16 నుంచి రూ. 20 వేల వరకూ అవుతోంది. అదే.. ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు విమానంలో, రోడ్డు మార్గంలో వెళ్లడం వల్ల ఖర్చు అదనం. అక్కడ వేచి ఉండే సమయంలో ఖర్చు, విమానాశ్రయంలో యూజర్‌ డెవలప్‌మెంట్‌ ఛార్జీలు సైతం ప్రయాణికులపై పడుతున్నాయి. అమెరికా, లండన్‌, కెనడా ఎక్కడి నుంచి వచ్చేవారినైనా తీసుకొచ్చేందుకు, సాగనంపేందుకు ఇక్కడి నుంచి వారి బంధువులు నిత్యం హైదరాబాద్‌కు వాహనాల్లో వెళ్లి వస్తున్నారు. ఇది మళ్లీ అదనపు ఖర్చు.. ప్రయాస. హైదరాబాద్‌కు విజయవాడ నుంచి బయలుదేరి వెళ్లాక.. అక్కడ తెల్లవారుజామున 2గంటల తర్వాత నుంచి అంతర్జాతీయ సర్వీసుల రాకపోకలు ఉంటాయి. దీంతో ఇక్కడి నుంచి రాత్రి 10 గంటలకు అక్కడికి చేరుకున్నా.. కనీసం ఐదారు గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. అటునుంచి కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత వచ్చే ప్రయాణికులు.. తెల్లవారే వరకూ విమానాశ్రయంలోనే ఉండాల్సి వస్తోంది. ఆ తర్వాత రోడ్డు మార్గంలో ఐదారు గంటలు ప్రయాణించి విజయవాడకు చేరాలి. ప్రస్తుతం ప్రవాసాంధ్రులు, విదేశాలకు వెళ్లే యాత్రికుల కోసమే ప్రత్యేకంగా వందల వాహనాలు నడుస్తున్నాయి. ఏపీఎస్‌ ఆర్టీసీ సైతం ప్రత్యేకంగా ఓ ఏసీ సర్వీసు విదేశాల నుంచి వచ్చే వారి కోసం నడుపుతున్నారు. ప్రధానంగా ఈ దేశాలకు.. అమెరికా, కెనడా, లండన్‌, జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ, డెన్మార్క్‌, చైనా, మలేషియా, సింగపూర్‌, రష్యా, సింగపూర్‌, కెన్యా, నైరోబి, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా దేశాల్లో ఇక్కడి వాళ్లు అధికంగా ఉన్నారు. సింగపూర్‌కు సర్వీసులు ప్రారంభమైతే.. వీళ్లంతా అత్యంత తేలికగా.. వెళ్లి వచ్చేందుకు వీలుంటుంది. ఇక్కడి నుంచి మూడు గంటల్లో సింగపూర్‌ వెళ్లి.. అక్కడి నుంచి గంటల వ్యవధిలో సమయం వృథా కాకుండా వెళ్లిపోవచ్చు. కస్టమ్స్‌, ఇమ్మిగ్రేషన్‌ ఇక్కడ పూర్తి.. అంతర్జాతీయ ప్రయాణికులకు కస్టమ్స్‌, ఇమ్మిగ్రేషన్‌ తనిఖీలు చాలా కీలకం. గన్నవరం నుంచి అంతర్జాతీయ అనుసంధానం ఏర్పడితే.. ఇక్కడే కస్టమ్స్‌, ఇమ్మిగ్రేషన్‌ ప్రక్రియ పూర్తవుతుంది. నేరుగా సింగపూర్‌కు వెళ్లాక.. అక్కడ మళ్లీ ఈ తనిఖీలు అవసరం ఉండదు. నేరుగా విమానంలోనికి వెళ్లిపోయి.. విదేశాలకు చేరిపోవచ్చు. ముందుగానే కనెక్టివిటీ సర్వీసులకు టిక్కెట్లను బుక్‌ చేసుకుంటే సమయం చాలా ఆదా అవుతుంది. విదేశీయుల నుంచి ఆదాయం.. విదేశాల నుంచి అతిథులు, ప్రముఖల రాక అమరావతికి భారీగా పెరిగింది. వీళ్లంతా హైదరాబాద్‌లోనే బస చేసి.. ఇక్కడికి వాహనాల్లో వచ్చి తిరిగి సాయంత్రానికి అక్కడికే వెళ్లిపోతున్నారు. అదే.. ఇక్కడ నుంచి అంతర్జాతీయ సర్వీసులు నడిస్తే.. నేరుగా గన్నవరంలో దిగి.. విజయవాడలో బస చేస్తారు. సింగపూర్‌కు సర్వీసులు నడిస్తే.. ఏ దేశం నుంచైనా కనెక్టివిటీ పెట్టుకొని నేరుగా ఇక్కడ వాలిపోవచ్చు. ఏటా వేల సంఖ్యలో బౌద్ధ భిక్షువులు అమరావతి ప్రాంతం చూసేందుకు వచ్చి వస్తుంటారు. రాజధానిగా ప్రకటించిన తర్వాత వారి రాకపోకలు మరింత పెరిగాయి. వాళ్లు కూడా నేరుగా ఇక్కడికి రాకుండా.. హైదరాబాద్‌లో ఉండి.. ఇక్కడికి వచ్చి సాయంత్రానికి వెళ్లిపోతున్నారు. అదే.. నేరుగా ఇక్కడే దిగితే.. ఇక్కడే బస చేస్తారు. వీళ్లు ఖర్చు పెట్టే ప్రతిరూపాయి ఇక్కడికే చెందుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. మొదటి సర్వీసుతో ఓ చారిత్రక ఘట్టం.. గన్నవరం నుంచి అక్టోబర్‌లో కచ్చితంగా సింగపూర్‌ సర్వీసు ప్రారంభమవుతుంది. మొదటి అంతర్జాతీయ విమానం ఇక్కడి నుంచి ప్రారంభమయ్యే చారిత్రక ఘట్టం మా హయాంలో ఆవిష్కృతమవ్వడం చాలా ఆనందంగా ఉంది. రన్‌వే విస్తరణ డిసెంబర్‌ నాటికి పూర్తయితే.. మరిన్ని విమానయాన సంస్థలు అంతర్జాతీయ సర్వీసులను నడిపేందుకు ముందుకొస్తాయి. - జి.మధుసూదన్‌రావు, గన్నవరం విమానాశ్రయం డైరెక్టర్‌
  7. శ్రీశైలం నిండింది నేడు గేట్లు ఎత్తే అవకాశం ముందస్తు రబీకి మెరుగైన అవకాశాలు ఈనాడు - హైదరాబాద్‌ శ్రీశైలానికి వరద ఉద్ధృతి పెరిగింది. మంగళవారం మధ్యాహ్నం మూడుగంటల సమయంలో 2.09 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, ఆరుగంటలకు కొంత తగ్గి 1.75 లక్షల క్యూసెక్కులు ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టానికి 1.7 అడుగులు మాత్రమే తక్కువగా ఉండగా, ఇంకా తొమ్మిది టీఎంసీల నిల్వకు అవకాశం ఉంది. రెండు విద్యుత్‌ కేంద్రాలనూ పూర్తి స్థాయిలో నిర్వహించడంతోపాటు.. పోతిరెడ్డిపాడు, కల్వకుర్తికి కలిపి మొత్తం 72,814 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు. హంద్రీనీవాకు నిలిపివేశారు. ఎగువన కర్ణాటకలోని ఆలమట్టి నుంచి నామమాత్రంగానే నీటి విడుదల ఉన్నా, స్థానికంగా కురిసిన భారీ వర్షాలతో జూరాల, తుంగభద్ర, హంద్రీనదుల నుంచి భారీగా వరద వచ్చి శ్రీశైలానికి చేరుతోంది. ఇదే ప్రవాహం కొనసాగితే బుధవారం గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. మరోవైపు నాగార్జునసాగర్‌ కింద ముందస్తు రబీకి అవకాశాలు మెరుగుపడ్డాయి. త్వరలోనే నీటి విడుదలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆలమట్టి, నారాయణపూర్‌లు పూర్తి స్థాయి నీటిమట్టాలతో ఉన్నాయి. ఆలమట్టిలోకి 25 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండటంతో, ఈ నీటిని దిగువకు వదులుతున్నారు. ఈ నీటితోపాటు భీమా నుంచి రావడం, స్థానికంగా కురిసిన వర్షాలతో జూరాలకు ఉదయం 50 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా సాయంత్రానికి 1.07 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. తుంగభద్ర పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలతో సుంకేశుల నుంచి మధ్యాహ్నం 67,158 క్యూసెక్కులు, హంద్రీనది నుంచి 34 వేల క్యూసెక్కులు విడుదల చేశారు. జూరాలకు ఇన్‌ఫ్లో పెరగడంతో శ్రీశైలానికి 1.75 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉంది. జూరాలకు వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. విద్యుదుత్పత్తి ద్వారా శ్రీశైలం నుంచి నీటి విడుదల పెరగడంతో నాగార్జునసాగర్‌ నీటిమట్టం 523 అడుగులకు చేరింది. నాగార్జునసాగర్‌ నిండాలంటే మరో 160 టీఎంసీలు అవసరం. ఆలస్యంగా అయినా కృష్ణాబేసిన్‌లోని రిజర్వాయర్ల పరిస్థితి మెరుగైంది. రెండు రాష్ట్రాల్లోని అనేక చిన్న నదుల్లో కూడా వరద ప్రవాహం ఉంది. ఖరీఫ్‌కు తరచూ గడ్డుకాలం కృష్ణాబేసిన్‌లో ప్రత్యేకించి నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కింద ఖరీఫ్‌ సీజన్‌కు తరచూ గడ్డు పరిస్థితి ఎదురవుతోంది. ముందస్తు రబీకో లేక రబీకో మాత్రమే నీటిని ఇచ్చే పరిస్థితి నెలకొంది. ఒకటిన్నర దశాబ్దం నుంచి ఆరుసార్లు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఈ సంవత్సరం కూడా సాగర్‌ కుడి, ఎడమ కాలువల కింద ఖరీఫ్‌కు నీటి లభ్యత లేదు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌కు కూడా నీటి ప్రవాహం ఎక్కువవుతూ ఉండటంతో రబీకి అవకాశాలు పెరిగాయి. అయితే రెండు కాలువల కిందా ఎంత ఆయకట్టుకు ఇవ్వడం వీలవుతుందనే స్పష్టత రావాలంటే మరో నాలుగైదు రోజులు ఆగాలని నీటిపారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి. సాగర్‌ ఎడమకాలువ కింద రబీ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించడంతోపాటు 54 టీఎంసీలు కేటాయించాలని బోర్డుకు ఇండెంట్‌ కూడా పెట్టింది. 2002-03, 2003-04వ సంవత్సరాల్లో సాగర్‌ కింద ఖరీఫ్‌కు నీటిని ఇవ్వలేదు. 2009, 2012లో కూడా ఇవ్వలేదు. 2015-16లోనూ తాగునీటికి మాత్రమే ఇచ్చారు. గత ఏడాది కూడా పూర్తిగా ఇవ్వలేకపోయారు. ఈ ఏడాది ఖరీఫ్‌ లేదు. సాగర్‌ ఆయకట్టు మాత్రమే కాదు.. శ్రీశైలం మీద ఆధారపడిన ఎస్సార్బీసీ, జూరాల నుంచి తీసుకొనే భీమా, మిగులు జలాల ఆధారంగా నిర్మించిన నెట్టెంపాడు, కల్వకుర్తి, హంద్రీనీవా, తెలుగుగంగ ఇలా అన్ని ప్రాజెక్టుల్లోనూ అక్టోబరులో గానీ నీటిని విడుదల చేయలేని పరిస్థితి. ప్రతి సంవత్సరం జాప్యం కావడమో లేదా ఖరీఫ్‌కు అసలు ఇవ్వలేకపోవడమో జరుగుతోంది.
  8. indigo vadu singapore ki kuda oka flight esthe super
  9. అత్యున్నత స్థాయిలో అమరావతి నిలవాలని కోరుకున్నా ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: రాష్ట్ర రాజధాని అమరావతి అత్యున్నత స్థాయిలో నిలవాలని జగన్మాత దుర్గమ్మను కోరుకున్నట్లు హిందుపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ అన్నారు. దసరా మహోత్సవాల్లో పదో రోజు శనివారం శ్రీరాజరాజేశ్వరీ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను బాలకృష్ణ దర్శించుకున్నారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన బాలకృష్ణకు దేవస్థానం అధికారులతో పాటు పాలకమండలి సభ్యులు ఆలయమర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు. ముఖ్యమంత్రి సంకల్ప దీక్షతో చేపట్టిన అమరావతి రాజధాని నిర్మాణం, నదుల అనుసంధానం విజయవంతంగా పూర్తి కావాలని, అందుకు దుర్గమ్మ ఆశీస్సులు లభించాలని వేడుకున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పాలకమండలి ఛైర్మన్‌ గౌరంగబాబు, సభ్యులు శంకర్‌బాబు, పద్మశేఖర్‌, ధర్మారావు, పీఆర్వో అచ్యుతరామయ్య పాల్గొన్నారు.
  10. Leader evarini vadili pettadu ga Jai CBN
  11. సెప్టెంబరులోనైనా ప్రవాహం వచ్చేనా? ఆగస్టు ఆశలు ఆవిరయ్యాయి కృష్ణా బేసిన్‌లో కానరాని వరద జలాశయాల్లోకి సెప్టెంబరులోనైనా రాకపోతే కష్టమే తాగునీటికీ ఇబ్బందులు తప్పవంటున్న నీటిపారుదల శాఖ వర్గాలు ఈనాడు, హైదరాబాద్‌: ఆగస్టుపై పెట్టుకున్న ఆశలు ఆవిరయ్యాయి.. కృష్ణా బేసిన్‌లోకి సెప్టెంబరులోనైనా ప్రవాహం వస్తుందో రాదో తెలియని పరిస్థితి నెలకొంది.. జలాశయాల్లోకి సెప్టెంబరులోనూ వరద రాకపోతే సాగునీటి సంగతి అటుంచి వచ్చే ఏడాది వరకు తాగునీటికీ ఇబ్బంది తప్పదని నీటిపారుదల శాఖ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. భారీ వరదొస్తే ముందస్తు రబీకైనా నీటిని విడుదల చేయడానికి అవకాశం ఉంటుంది. రాకపోతే వచ్చిన నీటిని తాగునీటికోసం వచ్చే ఏడాది ఖరీఫ్‌ ప్రారంభం వరకు నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు కూడా ఆశాజనకంగా లేకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కృష్ణా బేసిన్‌లో కర్ణాటకలో ఎగువన ఉన్న ఆలమట్టి, నారాయణపూర్‌ రిజర్వాయర్లలో కనీస నిల్వ పోను సుమారు 150 టీఎంసీలు అవసరం కాగా, ఈ ఏడాది ఇప్పటివరకు 162 టీఎంసీలు వచ్చాయి. ఖరీఫ్‌లో ఆయకట్టుకు వినియోగించినా ఈ రెండు రిజర్వాయర్లలో పూర్తిస్థాయిలో నీటినిల్వలున్నాయి. మంగళవారం ఉదయానికి ఈ రెండు రిజర్వాయర్లలో కలిపి తొమ్మిది టీఎంసీల ఖాళీ ఉంది. ఆలమట్టిలోకి సోమవారం 20వేల క్యూసెక్కుల ప్రవాహం రాగా, మంగళవారం కూడా అంతే వచ్చింది. ఇందులో పదివేల క్యూసెక్కులను ఆయకట్టుకు వినియోగించుకొని మిగిలిన నీటిని నిల్వ చేస్తున్నారు. ఇలా రోజుకో టీఎంసీనో, రెండు టీఎంసీలో వస్తే ఆయకట్టుకు పోను మిగిలిన నీటిని రిజర్వాయర్లలో నింపుతున్నారు. మంగళవారం సాయంత్రం ఆలమట్టి నుంచి విద్యుదుత్పత్తి ద్వారా నీటి విడుదలను పెంచి నారాయణపూర్‌కు సుమారు 20వేల క్యూసెక్కులను విడుదల చేసినట్లు సమాచారం. ఆలమట్టిలోకి కనీసం 50వేల నుంచి లక్ష క్యూసెక్కుల ప్రవాహం వస్తేనే కర్ణాటక దిగువకు కొంత నీటినైనా విడుదల చేస్తుంది. కృష్ణా ఉపనది భీమాపై మహారాష్ట్రలో ఉన్న ఉజ్జయిని డ్యాంలోకి కూడా ప్రవాహం పెరిగింది. ఈ ప్రాజెక్టు నిండడానికి మరో నాలుగు టీఎంసీలు మాత్రమే కావాల్సి ఉంది. తుంగభద్ర పరిస్థితి కొంత మెరుగవుతున్నా, ఇప్పుడప్పుడే శ్రీశైలానికి వదిలే పరిస్థితి కనిపించడం లేదు. తుంగభద్రలోకి 17442 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. నిండడానికి మరో 39 టీఎంసీలు అవసరం. ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు కింద ఆయకట్టుకు కూడా పూర్తి స్థాయిలో విడుదల చేయలేదు. శ్రీశైలంలోకి స్థానికంగా కురిసిన వర్షాల వల్ల 6574 క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. ఈ సీజన్‌లో అత్యధికంగా వచ్చింది ఇదే కావడం గమనార్హం. సాగర్‌లోకి 820 క్యూసెక్కులు, పులిచింతలలోకి 1226 క్యూసెక్కులు వచ్చాయి. పెన్నా బేసిన్‌లో సోమశిలలోకి 12286 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. గోదావరిలోనూ అంతే.. గోదావరి బేసిన్‌లోనూ ప్రవాహం తక్కువగానే ఉంది. శ్రీరాంసాగర్‌లోకి 11573 క్యూసెక్కులు ఉంది. ఇప్పటివరకు వచ్చింది 22 టీఎంసీలు మాత్రమే. నిండడానికి మరో 61 టీఎంసీలు కావాలి. సింగూరులోకి 8849 క్యూసెక్కులు, నిజాంసాగర్‌లోకి 1643, కడెంలోకి 7218, ఎల్లంపల్లిలోకి 5111 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. సింగూరు, కడెం, ఎల్లంపల్లిల్లో నిల్వలు మెరుగ్గా ఉన్నాయి.
  12. మేము సైతం... అజరామర అమరావతి నిర్మాణానికి పదుల సంఖ్యలో దేశాలు అవకాశాలు అందిపుచ్చుకునేందుకు పోటీ పెట్టుబడులు, సాంకేతిక సహకారానికి ఆసక్తి కార్యాచరణ ప్రారంభించిన పలు సంస్థలు పౌరాణిక, చారిత్రక ప్రాధాన్యం ఉన్న ‘అమరావతి’ పేరు పెట్టుకుని.. ఆ కీర్తిని మరో వెయ్యేళ్లు అజరామరంగా నిలిపే స్థాయిలో భవ్యమైన ఆధునిక రాజధాని నిర్మాణానికి సిద్ధమవుతున్న వేళ.. సహకారం అందించడానికి మేము సైతం అంటూ పదులకొద్దీ ప్రముఖ దేశాలు పోటీ పడుతున్నాయి. రాజు ముందు తమ పాండిత్యాన్ని ప్రదర్శించడానికి పోటీపడే కవుల్లా.. దేవతల రాజు దేవేంద్రుడి రాజధాని ‘అమరావతి’ పేరు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నిర్మాణంలో, నిర్వహణలో తమ ప్రతిభను చూపడానికి అంతర్జాతీయ సంస్థలు పోటీ పడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు గుంటూరు జిల్లాలో చారిత్రక ప్రాధాన్యం ఉన్న ఒక వూరైన ‘అమరావతి’ నేడు యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకరిస్తోంది. నిర్మాణ, మౌలిక వసతులు, ప్రణాళికల రంగాల్లో అగ్రగామి అంతర్జాతీయ సంస్థల్ని నేడు రా రామ్మని వూరిస్తోంది. 217 చ.కి.మీ. పరిధిలో నిర్మిస్తున్న ఈ నూతన నగరంలో ఏదో ఒక రూపంలో పాలు పంచుకునేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు, సాంకేతిక, ఆర్థిక సహకారం అందించేందుకు సింగపూర్‌, జపాన్‌, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఆస్ట్రేలియా, చైనా ఇలా పలు దేశాలు, అక్కడి సంస్థలు ప్రణాళికలతో ముందుకు వస్తున్నాయి. ఈ దేశాల బృందాలు ఇప్పటికే అమరావతిలో పర్యటించాయి. కొన్ని దేశాలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలూ చేసుకున్నాయి. స్క్రిప్ట్‌ పక్కాగా సిద్ధమైతే సగం సినిమా పూర్తయినట్టే అని సినీ పండితులు చెబుతారు. నిర్మాణానికి కూడా అంతే. ఈ నేపథ్యంలో రాజధాని నిర్మాణంలో పలు అంశాలపై అనేక దేశాలు అందిస్తున్న వివిధ ప్రణాళికలపై ప్రత్యేక కథనం.. సింగపూర్‌ గురించి చెప్పేదేముంది.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తర్వాత అమరావతి ప్రాజెక్టులో ఎక్కువ పాత్ర పోషిస్తోంది సింగపూరే. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచారంలోనే సింగపూర్‌ లాంటి నగరాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఆ దేశానికి కీలక బాధ్యతలు అప్పగించారు. అమరావతి నగరం, కేంద్ర రాజధాని ప్రాంతం, మొత్తం రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ)కు వ్యూహ ప్రణాళికను సింగపూర్‌ సంస్థలే రూపొందించాయి. * అమరావతిలో 1691 ఎకరాల్లో అంకుర ప్రాంత అభివృద్ధికి ప్రధాన అభివృద్ధిదారుగా సింగపూర్‌కి చెందిన అసెండాస్‌-సింగ్‌బ్రిడ్జి, సెంబ్‌కార్ప్‌ సంస్థల కూటమి ఎంపికమైంది. * ఆంధ్రప్రదేశ్‌, అమరావతి అభివృద్ధికి సింగపూర్‌ సహకారానికి సంబంధించి రెండు ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. దీని అమలు పర్యవేక్షణకు ముఖ్యమంత్రి చంద్రబాబు, సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ సారథ్యంలో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైంది. * సీఆర్‌డీఏ ప్రాంతంలో పరిశ్రమల అభివృద్ధికి ‘క్యాపిటల్‌ రీజియన్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రమోషన్‌ ఏజెన్సీ’ ఏర్పాటుకు సింగపూర్‌ ముందుకు వచ్చింది. * తమ దేశానికి చెందిన ‘సెంటర్‌ ఫర్‌ లివబుల్‌ సిటీస్‌’ సంస్థ ద్వారా అమరావతిలో భూ నిర్వహణ, నగర నిర్వహణ ప్రణాళికల రూపకల్పనలో సింగపూర్‌ ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోంది. జపాన్‌ రవాణా ప్రణాళిక * అమరావతిపై మొదటి నుంచి ఆసక్తి కనబరుస్తున్న దేశాల్లో జపాన్‌ ఒకటి. మొత్తం సీఆర్‌డీఏ ప్రాంతానికి సమగ్ర ట్రాఫిక్‌, రవాణా అధ్యయనాన్ని జపాన్‌ చేపట్టింది. రెండేళ్లలో ఇది పూర్తవుతుంది. * సీఆర్‌డీఏ పరిధిలోని వివిధ పట్టణ ప్రాంతాల్ని రాజధానితో అనుసంధానం చేయడం, వాటి మధ్య పరస్పర అనుసంధానానికి చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేస్తుంది. * రాజధాని మొత్తానికి సమాచార ప్రసార సాంకేతిక పరిజ్ఞానం (ఐసీటీ) నెట్‌వర్క్‌ ప్రణాళిక రూపకల్పనకు ముందుకు వచ్చింది. * అమరావతిలో క్రీడా, ఎలక్ట్రానిక్‌ నగరాల అభివృద్ధిలో భాగస్వామ్యానికి జపాన్‌ ఆసక్తిగా ఉంది. 2020 ఒలింపిక్స్‌ నిర్వహిస్తున్న అనుభవంతో రాజధానిలో క్రీడా నగరాన్ని అభివృద్ధి చేస్తామని జపాన్‌ ప్రతిపాదించింది. * ఆంధ్రప్రదేశ్‌, జపాన్‌ మధ్య సహకారానికి అక్కడి మినిస్ట్రీ ఆఫ్‌ ల్యాండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ట్రాన్స్‌పోర్టు (ఎంఎల్‌ఐటీ)తో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. * రాజధానిలో ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందించేందుకు జపాన్‌కు చెందిన జైకా, జేబిక్‌ వంటి సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి. * తాగునీరు, మురుగునీటి శుద్ధి, విపత్తుల నుంచి రక్షణ, డేటా కేంద్రాల నిర్వహణలో ప్రాజెక్టులు చేపట్టేందుకు జపాన్‌ సిద్ధంగా ఉంది. స్టేడియం నిర్మాణానికి బ్రిటన్‌ ఆసక్తి అమరావతి, ఆంధ్రప్రదేశ్‌తో సహకారానికి బ్రిటన్‌ రెండు విభాగాలను ఏర్పాటు చేసింది. అమరావతిలో వాణిజ్యం, పెట్టుబడుల ప్రోత్సాహానికి అవసరమైన సమావేశాలు, రహదారి ప్రదర్శనల నిర్వహణ వంటి కార్యక్రమాల్ని ఒక విభాగం చూస్తుంది. అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధి, ఆకర్షణీయ నగరంగా తీర్చిదిద్దేందుకు సహకారం అందించేందుకు మరో విభాగం కృషి చేస్తోంది. * అమరావతిలో అంతర్జాతీయ స్థాయి స్టేడియం నిర్మాణానికి బ్రిటన్‌ ముందుకు వచ్చింది. * వివిధ అంశాలపై అధ్యయనానికి నిధులిచ్చేందుకు బ్రిటన్‌కు చెందిన అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ (డీఎఫ్‌ఐడీ) ఆసక్తిగా ఉంది. * తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థ, ప్రైవేటు పెట్టుబడిదారులను ఆకర్షించడం, వాతావరణ మార్పులు, ఆకర్షణీయ నగరాల నాయకత్వం, నవకల్పన సంస్థల ఏర్పాటు తదితర అంశాల్లో బ్రిటన్‌ సహకరించనుంది. * రాజధానిలో భూగర్భ జలవనరులు, కృష్ణా నది పరీవాహక ప్రాంతం గతంలో ఎలా ఉండేది, రాబోయే కొన్నేళ్లలో ఎలా మారనుంది వంటి అంశాలపై బ్రిటన్‌కు చెందిన బ్రిటిష్‌ జియోలాజికల్‌ సర్వే సంస్థ అధ్యయనం చేయనుంది. ఆ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. * పరిపాలన నగరం బృహత్‌ ప్రణాళిక, శాసనసభ, హైకోర్టు భవనాల ఆకృతులు రూపొందిస్తోంది కూడా బ్రిటన్‌కు చెందిన నార్మన్‌ ఫోస్టర్‌-పార్ట్‌నర్స్‌ సంస్థే. మౌలిక వసతుల ప్రణాళికలో చైనా పాత్ర * రాజధాని ప్రాథమిక ప్రణాళిక దశ నుంచి చైనా ఆసక్తి కనబరిచింది. రాజధానిలో కీలకమైన మౌలిక వసతుల ప్రణాళిక రూపకల్పనలో చైనాకు చెందిన గుజౌ ఇంటర్నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కార్పొరేషన్‌ (జీఐఐసీ) కీలక పాత్ర పోషించింది. ఆర్వీ అసోసియేట్స్‌తో కలిసి ఆ సంస్థ ప్రణాళిక రూపొందించింది. గుజౌ, అమరావతి మధ్య సోదర నగర సహకారానికి ఒప్పందం జరిగింది. జల నిర్వహణలో ఆస్ట్రేలియా సాయం జలవనరుల సుస్థిర నిర్వహణలో సాయపడేందుకు ఆస్ట్రేలియా ముందుకు వచ్చింది. ఆస్ట్రేలియాతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుంది. అమరావతిలో నివాస భవనాల నుంచి వచ్చే వ్యర్థ జలాల్ని అక్కడే శుద్ధి చేసి పునర్వినియోగానికి అనుగుణంగా మార్చే ప్రాజెక్టుకు ‘కోపరేటివ్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ వాటర్‌ సెన్సిటివ్‌ సిటీస్‌’ (సీఆర్‌సీ) సంస్థ సాంకేతిక సహకారం అందిస్తుంది. ఆ సంస్థతో కలసి రాష్ట్ర ప్రభుత్వం పైలట్‌ ప్రాజెక్టు చేపడుతోంది. ఇంధన రంగంలో జర్మనీ ఆసక్తి రాజధానిలో ఇంధన, రవాణా రంగాల అభివృద్ధికి నిధులు సమకూర్చేందుకు ఆ దేశానికి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ సంస్థ ఆసక్తిగా ఉంది. విజయవాడలో లైట్‌ రైల్‌ రవాణా వ్యవస్థపై ఈ సంస్థ అధ్యయనం చేసింది. ఆకర్షణీయ అమరావతికి ఫ్రాన్స్‌ తోడ్పాటు అమరావతిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన సహకారం అందించేందుకు ఫ్రాన్స్‌ ముందుకు వచ్చింది. అమెరికాలోని వివిధ ఫ్రెంచి కంపెనీల ప్రతినిధులు ఇటీవల అమరావతిని సందర్శించారు. వారిలో సలహాదారులు (కన్సల్టెంట్‌), గుత్తేదారులు, సాంకేతిక సహాయం అందించేవారు ఉన్నారు. ఫ్రాన్స్‌లోని మార్సిలే నగరంతో అమరావతికి సోదర నగర ఒప్పందం ఉంది. అమరావతిలో రవాణా ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు అక్కడి సంస్థలు ఆసక్తిగా ఉన్నాయి. మరికొన్ని దేశాలు.. * కెనడా: రాజధానిలో రహదారులు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు అవసరమైన పరికరాల సరఫరా, ఇంధన ప్రాజెక్టులు, ఎలక్ట్రిక్‌ వాహనాల సరఫరాకు ఈ దేశం ఆసక్తి కనబరుస్తోంది. * స్విట్జర్లాండ్‌: ఈ దేశ బృందం ఇటీవలే అమరావతిలో పర్యటించింది. బిల్డింగ్‌ ఎనర్జీ ఎఫిషియంట్‌ ప్రాజెక్ట్‌ (బీప్‌) ద్వారా సాంకేతిక, పర్యావరణ, జల నిర్వహణలో సహకారం అందించేందుకు ముందుకు వచ్చింది. * నెదర్లాండ్స్‌: ఈ దేశానికి చెందిన ఆర్కాడిస్‌.. టాటా సంస్థతో కలిసి రాజధానికి వరద నియంత్రణ ప్రణాళిక, బ్లూ మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తోంది. * డెన్మార్క్‌: రాజధానిలో సైకిల్‌ ట్రాక్‌లు, మోటారు రహిత రవాణా వ్యవస్థల రూపకల్పనలో పాలు పంచుకునేందుకు ఆసక్తిగా ఉంది. * అమెరికా: ఈ దేశానికి చెందిన మెకన్సీ, సీహెచ్‌ 2ఎం సంస్థలు సీఆర్‌డీఏకి కీలకమైన కన్సల్టెన్సీ సర్వీసులందిస్తున్నాయి. * రష్యా: ఈ దేశ బృందం అమరావతిని సందర్శించింది. నిర్మాణంలో పాలుపంచుకోవాలన్న ఆసక్తి వ్యక్తం చేసింది. * మలేసియా: ‘కెపాసిటీ బిల్డింగ్‌’లో సహకారానికి సిద్ధంగా ఉంది. అమరావతి ప్రణాళిక రూపకల్పన దశలో.. పుత్రజయ నగర నిర్మాణంలో తమకెదురైన అనుభవ పాఠాలను వివరించింది.
  13. అధికారిక ముద్ర గన్నవరం విమానాశ్రయం అంతర్జాతీయ హోదాకు మరో అడుగు అతి దగ్గరలోనే విదేశాలకు ఎగిరే రోజు ఈనాడు, అమరావతి గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా సంతరించుకున్న నేపథ్యంలో మరో ముందడుగు పడింది. కేంద్ర మంత్రివర్గ ఆమోదం లభించిన నేపథ్యంలో తాజాగా రాష్ట్రపతి సైతం అధికారిక ముద్రను వేశారు. దీంతో గన్నవరం విమానాశ్రయం నుంచి విదేశాలకు విమాన సర్వీసులు ఎగిరే రోజు అతి దగ్గరలోనే ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించిన.. పనులు సైతం విమానాశ్రయంలో జోరందుకున్నాయి. భవన నిర్మాణంతో పాటూ రన్‌వే విస్తరణ పనులు సైతం చురుగ్గా సాగుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ ఓ సాధారణ దేశీయ స్థాయి విమానాశ్రయంగా ఉన్న స్థితి నుంచి రాజధాని నేపథ్యంలో అనూహ్యంగా వసతులను సంతరించుకోనుంది. ప్రయాణికుల రద్దీ పెరిగిపోనుంది. రూ.162 కోట్లతో అంతర్జాతీయ వసతులున్న నూతన టెర్మినల్‌ భవనాన్ని ఏడాదిన్నర వ్యవధిలో నిర్మించారు. నూతన టెర్మినల్‌తో గన్నవరం విమానాశ్రయం రూపురేఖలు సమూలంగా మారిపోయాయి. ఇదే సమయంలో విమానాశ్రయ అభివృద్ధికి సంబంధించిన బృహత్తర ప్రణాళికను అమలు చేసేందుకు కొత్తగా 740 ఎకరాల భూమిని సేకరించారు. గతంలో ఉన్న 535 ఎకరాలతో కలిపితే.. విమానాశ్రయం విస్తీర్ణం అమాంతం 1275 ఎకరాలకు పెరిగింది. కొత్తగా విమానాశ్రయానికి చుట్టుపక్కల ఉన్న ఆత్కూరు, పురుషోత్తమపట్నం, గన్నవరం, అజ్జంపూడి, అల్లాపురం, కేసరపల్లి, బుద్ధవరం, వీఎన్‌పురం, చినఅవుటుపల్లి, పెదఅవుటుపల్లి గ్రామాల పరిధిలో ఈ భూమిని సేకరించారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ఈ భూమిని విమానాశ్రయానికి అప్పగించడంతో అత్యవసరంగా రన్‌వే విస్తరణ పనులను చేపడుతున్నారు. ప్రస్తుతం రన్‌వేను 3360 మీటర్లకు పొడిగిస్తున్నారు. దీనివల్ల అతిపెద్ద విమానాలైన బి 747-400 రాకపోకలకు సైతం వీలు కలుగుతుంది. గత రెండున్నరేళ్లలో విమానాశ్రయానికి ప్రయాణికుల రద్దీ సైతం అనూహ్యంగా పెరిగిపోయింది. ప్రస్తుతం అంతర్జాతీయ హోదాకు అధికారిక ఆమోద ముద్ర పడటంతో.. కస్టమ్స్‌, ఇమ్మిగ్రేషన్‌ కార్యకలాపాలను ఇక్కడి నుంచి ప్రారంభించేందుకు అవసరమైన చర్యలను వేగవంతం చేయాల్సి ఉందని ఏపీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ పేర్కొన్నారు. గన్నవరం నుంచి ఏ నగరానికి సర్వీసును వేసినా.. 90శాతం ఆక్యుపెన్షీ ఉంటోంది. దీంతో సర్వీసులు ఒక్కొక్కటిగా పెరిగాయి. ప్రస్తుతం రోజూ 24 సర్వీసులకు పైగా నడుస్తున్నాయి. 2016-17 తొలి అర్ధ సంవత్సరంలోనే విమాన ప్రయాణికుల సంఖ్య 70శాతం పెరగడం గమనార్హం. ఏడాది కిందట దిల్లీకి విమాన సర్వీసును ప్రారంభించిన సమయంలో ప్రయాణికులు ఉంటారా అనే సందేహాలు వచ్చాయి. అయితే అనూహ్యంగా విజయవాడ-దిల్లీ సర్వీసుకు ప్రస్తుతం 90శాతానికి పైగా రద్దీ పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌, విశాఖపట్నం, తిరుపతి, దిల్లీ, చెన్నై, బెంగళూరు నగరాలకు గన్నవరం నుంచి సర్వీసులు నడుస్తున్నాయి.
×
×
  • Create New...