Nfan from 1982 Posted August 30, 2024 Posted August 30, 2024 12 hours ago, Vihari said: Happynest Project is going to be started from jan as per minister narayana. flats konna andariki flat istham ani announce chesadu. 920 Cr cost tho construction jan nundi starting antunnadu. NRIs ki pandaga. Dead cheap deal for the buyers 👏👏 3500 per sft with premium items in 2024 ante 👏👏 Flash 1
sonykongara Posted August 30, 2024 Author Posted August 30, 2024 రూ.930 కోట్లతో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు రాజధాని అమరావతిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును పునరుద్ధరించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. Updated : 30 Aug 2024 08:27 IST 2018లో నిర్ణయించిన ధరలకే కొనుగోలుదారులకు ఫ్లాట్లు మాటకు కట్టుబడి ప్రాజెక్టు పూర్తిచేయాలని సీఎం ఆదేశం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్‌డీఏ అథారిటీ సమావేశం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏపై నిర్వహించిన సమీక్షలో మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్, అధికారులు ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును పునరుద్ధరించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగినా, ఆ భారాన్ని సీఆర్‌డీఏనే భరించాలని, కొనుగోలుదారులకు 2018లో ఫ్లాట్ల బుకింగ్ సందర్భంగా ఖరారుచేసిన ధరలకే అందజేయాలని ఆయన స్పష్టంచేశారు. సీఎం అధ్యక్షతన గురువారం సచివాలయంలో సీఆర్‌డీఏ 37వ అథారిటీ సమావేశం జరిగింది. ‘హ్యాపీనెస్ట్’ ప్రాజెక్టు సవరించిన అంచనాలతో పాటు, మరికొన్ని ప్రతిపాదనలకు అథారిటీ ఆమోదముద్ర వేసింది. హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును ఐదేళ్లపాటు జగన్ ప్రభుత్వం నిలిపివేయడం వల్ల నిర్మాణవ్యయం రూ.714 కోట్ల నుంచి రూ.930 కోట్లకు చేరింది. ఫ్లాట్ల ధర పెంచకుండా, ప్రాజెక్టును పూర్తిచేయాలంటే సీఆర్‌డీఏకి రూ.216 కోట్లు నష్టం వస్తుందని అంచనా. అయినా ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని... ప్రాజెక్టును పునరుద్ధరించాలని సీఎం ఆదేశించారు. రాజధాని అమరావతిలో అభివృద్ధిని పరుగులు పెట్టించేందుకు అప్పట్లో సీఆర్‌డీఏ 1,200 ఫ్లాట్లతో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టును తలపెట్టింది. బుకింగ్ ప్రారంభించిన కొన్నిగంటల్లోనే మొత్తం ఫ్లాట్లు అయిపోయాయి. ప్రాజెక్టును నిలిపివేయడంతో కొనుగోలుదారుల్లో కొందరు వెనక్కు వెళ్లిపోయారని సీఆర్‌డీఏ అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. సమీకరణలో ఇచ్చినవారికి కోరినచోట స్థలం రాజధానికి ఇంకా రైతులు ఇవ్వాల్సిన భూమి 3,551 ఎకరాలు ఉంది. ఉండవల్లి, పెనుమాకతో పాటు మరో రెండు మూడు గ్రామాల నుంచే ఎక్కువ భూమి రావాల్సి ఉంది. వారిలో చాలామంది భూసమీకరణలో ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. భూమి ఇస్తామని, కానీ తమకు ప్యాకేజీ పెంచి ఇవ్వాలని అడుగుతున్నారు. అది సాధ్యం కాదని, రాజధాని మొత్తం ఒకే విధానం అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టంచేసింది. వారిని ప్రోత్సహించేందుకు స్థలాల కేటాయింపులో కొంత వెసులుబాటు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పటివరకు రాజధానిలో లాటరీ విధానంలో స్థలాలు కేటాయిస్తోంది. ఇకపై వారికి కేటాయించిన లేఅవుట్‌లోనే రైతులు కోరుకున్నచోట స్థలం కేటాయించేలా నిబంధన మార్చేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. ‘‘ఇప్పుడు రైతులంతా భూమి ఇచ్చేందుకు ఒకేసారి ముందుకు రావట్లేదు కాబట్టి... స్థలాల కేటాయింపులో మొదట వచ్చినవారికి మొదటి ప్రాధాన్యమిస్తాం’’ అని నారాయణ తెలిపారు. భూసమీకరణలో ఇవ్వనివారి భూముల్ని భూసేకరణ ద్వారా తీసుకుంటామని ఆయన స్పష్టంచేశారు. జనవరి 1కి పూర్తిస్థాయిలో అమరావతి పనులు అమరావతిలో నిర్మాణాల పటిష్ఠతపై మద్రాస్, హైదరాబాద్ ఐఐటీల నివేదికలు సెప్టెంబరు మొదటివారంలో వస్తాయని నారాయణ తెలిపారు. ఆ తర్వాత టెండర్లు పిలిచి, పనులు ప్రారంభిస్తామన్నారు. జనవరి 1 నుంచి పూర్తిస్థాయిలో అమరావతి నిర్మాణ పనులు మొదలవుతాయని ఆయన తెలిపారు. కరకట్ట రోడ్డు విస్తరణ పనులకు టెండర్లు సిద్ధమవుతున్నాయని తెలిపారు. రూ.160 కోట్లతో సీఆర్‌డీఏ పరిపాలనా భవనం అమరావతిలో సీడ్‌యాక్సెస్ రోడ్డుకు పక్కనే 2019కి ముందు తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మాణం తలపెట్టి కొంతవరకు పూర్తిచేసిన సీఆర్‌డీఏ పరిపాలనా భవనాన్ని రూ.160 కోట్లతో పూర్తిచేసేందుకు అథారిటీ ఆమోదం తెలిపింది. ఆ భవనాన్ని 90రోజుల్లో అందుబాటులోకి తేవాలని సీఎం ఆదేశించారు. ఆ భవన నిర్మాణానికి గతంలో రూ.61 కోట్లు ఖర్చుపెట్టారు. అందులోనే సీఆర్‌డీఏ కార్యాలయంతో పాటు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల రాష్ట్రస్థాయి కార్యాలయాలను ఏర్పాటుచేస్తామని అథారిటీ సమావేశం అనంతరం పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ విలేకర్లకు తెలిపారు. రెండంతస్తుల్లో పురపాలకశాఖ కమిషనర్, మెప్మా, ఇంజినీరింగ్, టౌన్‌ప్లానింగ్ విభాగాలు, టిడ్కో కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్నారు. మూడు అంతస్తుల్లో సీఆర్‌డీఏ కార్యాలయం, ఒక అంతస్తులో అమరావతి అభివృద్ధి సంస్థ కార్యాలయం ఉంటాయని తెలిపారు. మిగతా అంతస్తులను రిసెప్షన్, ఇతర అవసరాలకు వినియోగిస్తామన్నారు. సెప్టెంబరు 15లోగా రైతులకు రూ.175 కోట్లు చెల్లిస్తాం రాజధానికి భూములిచ్చిన రైతులకు గత సంవత్సరం కౌలు రూ.175 కోట్లు సెప్టెంబరు 15లోగా చెల్లిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఈ సంవత్సరానికి రూ.225 కోట్లు కొన్నిరోజుల్లో ఇస్తామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రైతులు ఓపిక పట్టాలని ఆయన కోరారు. ‘‘ఖజానా ఖాళీగా ఉంది. అంతా సర్దుబాట్లపై నడుస్తోంది. గత సంవత్సరం కౌలు రూ.175 కోట్లు ఈ నెలలోనే ఇచ్చేద్దామనుకున్నాం. కానీ పింఛన్లకు పెద్దమొత్తం కావాలని, కొంత సమయం ఇవ్వాలని ఆర్థికశాఖ కోరింది. అందుకే సెప్టెంబరు 15లోగా ఇవ్వాలని నిర్ణయించాం’’ అని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నగరంగా అమరావతి సీఆర్డీఏ సమీక్షలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు అమరావతిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్ఫురణకు వచ్చేలా... ఆంగ్లంలో అమరావతి మొదటి అక్షరం ‘ఎ’, చివరి అక్షరం ‘ఐ’తో... నగరం లోగోను రూపొందించాలన్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటూ, సులభంగా జీవించేలా అమరావతి నిర్మాణం జరగాలని ఆయన స్పష్టంచేశారు. రాజధానిలో అడవిలా పెరిగిపోయిన కంపచెట్ల తొలగింపు ప్రక్రియ చురుగ్గా సాగుతోందని, 60% పూర్తయిందని అధికారులు తెలిపారు. జంగిల్ క్లియరెన్స్ పర్యవేక్షణ, మదింపునకు డ్రోన్లు ఉపయోగించాలని సీఎం సూచించారు.
sonykongara Posted August 31, 2024 Author Posted August 31, 2024 (edited) Edited August 31, 2024 by sonykongara Nfan from 1982 and AndhraBullodu 1 1
sonykongara Posted August 31, 2024 Author Posted August 31, 2024 On 7/23/2024 at 4:40 PM, sonykongara said: Piyush Kumar: రాజధాని నిధుల భారం రాష్ట్రంపై పడదు ‘రాజధాని అమరావతికి కేంద్రం సాకి (మూలధన వ్యయంగా ఇచ్చే నిధులు) కింద ఇస్తున్న నిధుల భారం రాష్ట్రంపై పడబోదు. 50 ఏళ్ల తర్వాత తీర్చే రుణమే ఇది. రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ కింద ఈ నిధులు ఇస్తోంది. Published : 31 Aug 2024 05:38 IST ప్రత్యేక ప్యాకేజీలోనే ఆ నిధులు రాష్ట్ర వాటా 10 శాతమూ కేంద్రమే భరిస్తుంది పోలవరానికి రూ.12,157 కోట్లు అడ్వాన్సుగా ఇస్తారు తొలుత వర్క్సు పెండింగ్ బిల్లులు చెల్లిస్తాం ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఈనాడు - అమరావతి ‘రాజధాని అమరావతికి కేంద్రం సాకి (మూలధన వ్యయంగా ఇచ్చే నిధులు) కింద ఇస్తున్న నిధుల భారం రాష్ట్రంపై పడబోదు. 50 ఏళ్ల తర్వాత తీర్చే రుణమే ఇది. రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ కింద ఈ నిధులు ఇస్తోంది. కేంద్రం 90 శాతం, రాష్ట్రం 10 శాతం భరించే విధానంలో ఇవి వస్తున్నాయి. రాష్ట్రం భరించాల్సిన 10 శాతం నిధులూ కేంద్రమే వేరే నిధుల నుంచి సర్దుబాటు చేస్తోంది’ అని రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ చెప్పారు. ‘ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 15,000 కోట్ల నిధులు ఇలా రాష్ట్రానికి రానున్నాయి. పోలవరానికి ఇవ్వబోయే రూ. 12,157 కోట్లు అడ్వాన్సుగా ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ ఏడాది రూ. 6,000 కోట్లు అడ్వాన్సుగా వస్తాయి. గతంలో పోలవరం ప్రాజెక్టులో పని చేసి తొలుత రాష్ట్రం ఆ బిల్లులు చెల్లిస్తే ఆనక కేంద్రం రీయింబర్సు (తిరిగి చెల్లింపు) చేసేది. ఇప్పుడు అడ్వాన్సుగా ఆ నిధులు ఇచ్చేందుకు అంగీకరించింది’ అని ఆయన వివరించారు. వెలగపూడి సచివాలయంలో గురువారం పీయూష్ కుమార్ కొద్దిమంది విలేకరులతో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏం చేయబోతున్నారో వివరించారు. ఆయన చెప్పిన అంశాలివి.. ప్రస్తుతం కేంద్రం మూలధన వ్యయం కింద ఇస్తున్న నిధులతో పనులు ప్రారంభిస్తాం. సాకీ కింద మరిన్ని నిధులు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటిని అభివృద్ధి పనులకు వెచ్చిస్తూ ఆదాయం సృష్టిస్తాం. రాష్ట్ర ఆదాయాన్ని పెంచే ఇతర మార్గాలూ అన్వేషించాం. వాటన్నింటికీ ఇప్పుడు వెల్లడించలేం. ఒకవైపు రాబడి పెంచుతూ మరోవైపు అనవసర ఖర్చులు తగ్గించనున్నాం. ఎక్కడా వృథా వ్యయం చేయబోం. గత ఐదేళ్లలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విషవలయంలా మారిపోయింది. అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేస్తూ పరిస్థితులను చక్కదిద్దుతాం. రాష్ట్రంలో పెండింగ్ బిల్లులు రూ. 1.30 లక్షల కోట్లు ఉన్నాయి. కేంద్రం నుంచి వచ్చే నిధులు, వేస్ అండ్ మీన్స్, సొంత రాబడి కలిపి తొలుత వర్క్సు పెండింగ్ బిల్లులన్నీ చెల్లిస్తాం. రెవెన్యూ పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు మరికొంత సమయం పడుతుంది. మధ్యమధ్యలో సర్దుబాటు చేసుకుంటూ అవీ చెల్లిస్తాం. అన్ని బిల్లులకు వచ్చే ఏడాది వరకు సమయం పట్టవచ్చు. కేంద్ర ప్రాయోజిత పథకాల్లో రాష్ట్ర వాటా చెల్లిస్తే కేంద్రం నుంచి మరిన్ని నిధులు వస్తాయి. ఆ ప్రయత్నాల్లోనే ఉన్నాం. కేంద్ర పథకాలను రాష్ట్రంలో ఎన్ని అభివృద్ధి పనులకు అనుసంధానం చేయవచ్చో పరిశీలిస్తున్నాం. రాష్ట్రంలో విదేశీ సాయంతో చేపట్టే ప్రాజెక్టులు ఎన్నో ఉన్నా వాటికి రుణం తీసుకునే విషయం ఆలోచిస్తున్నాం. వడ్డీ ధరలు ఎక్కువగా ఉంటున్నాయి. పైగా డాలర్ మారకం ప్రభావమూ పడుతోంది. దేశీయంగా తక్కువ వడ్డీకి రుణాలు పొందే అవకాశం ఉంటే ఆ విదేశీ రుణాలకు ఎక్కువ వడ్డీకి తీసుకోవడం ఎందుకు? గతంలో యూనివర్సిటీలు, వివిధ బోర్డులు, ఇతరత్రా సంస్థల నుంచి డిపాజిట్లను రాష్ట్ర ఫైనాన్షియల్ సర్వీసు కార్పొరేషన్ సమీకరించింది. ఆ నిధులను తిరిగి ఆ సంస్థలకు చెల్లించడం తక్షణమే సాధ్యం కాదు. 2033 వరకు ఆ నిధులను వాడుకుంటూ వడ్డీ చెల్లించేలా ఆ సంస్థ సమీకరించింది. ఆ మొత్తాలు వెనక్కు ఇవ్వడం సులభమయ్యే పని కాదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికరంగా బహిరంగ మార్కెట్ రుణం రూ. 56,000 కోట్లు వచ్చే అవకాశం ఉంది. అవి కాక విద్యుత్తు సంస్కరణలు అమలు చేసినందున కేంద్రం మరో 0.5 శాతం రుణం ఇవ్వబోతోంది. ఆ రూపేణా మరో రూ. 8,000 కోట్లు త్వరలో రానున్నాయి. ఆర్థికశాఖలో సంస్కరణలు చేపడతాం. సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇప్పిస్తాం. ఆర్థికశాఖ సిబ్బందితో పాటు కన్సల్టెన్సీల సేవలూ అవసరమే. కార్పొరేషన్ల రుణాలను ప్రభుత్వం ఉపయోగించుకోదు. ఆయా కార్పొరేషన్లు వాటికి అవసరమైతే రుణాలు తీసుకుంటాయి. అవి ఖర్చు చేసుకుంటాయి. గతంలో తప్పిదాలను మేం చేయబోము. రుణాలు తీసుకువచ్చి పథకాలకు ఇవ్వబోం. Nfan from 1982 and rk09 2
Nfan from 1982 Posted September 11, 2024 Posted September 11, 2024 59 minutes ago, sonykongara said: There is no deadline seen for the project
sonykongara Posted September 12, 2024 Author Posted September 12, 2024 AP CRDA: అమరావతిలో భూ కేటాయింపుల పరిశీలనకు మంత్రివర్గ ఉపసంఘం సీఆర్డీఏ పరిధిలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు భూ కేటాయింపుల అంశాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం ఆరుగురు మంత్రులతో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. Updated : 12 Sep 2024 19:02 IST అమరావతి: సీఆర్డీఏ పరిధిలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు భూ కేటాయింపుల అంశాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం ఆరుగురు మంత్రులతో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉపసంఘంలో ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, పురపాలకశాఖ మంత్రి పొంగూరు నారాయణ, గనులు,ఎక్సైజ్ శాఖమంత్రి కొల్లు రవీంద్ర, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సంధ్యారాణి, పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేశ్, పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్‌లు సభ్యులుగా ఉంటారు. కన్వీనర్‌గా పురపాలక శాఖ కార్యదర్శి, ప్రత్యేక ఆహ్వానితులుగా ఆయా శాఖల కార్యదర్శులు ఉండనున్నారు. గతంలో జరిగిన భూ కేటాయింపులపై సమీక్ష, కేటాయించిన భూమి వినియోగంపై అంచనా వేసి అవసరమైన మార్పులను మంత్రుల కమిటీ సూచించనుంది. అభ్యర్థనల పరిశీలన, వివిధ రంగాలలోని ప్రపంచ స్థాయి సంస్థలను గుర్తించి అమరావతిలో ఏర్పాటు చేసేందుకు అవసరమైన సహకారం అందించనుంది. వివిధ సంస్థల భూ కేటాయింపు పురోగతిని పర్యవేక్షించి ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు చేయనుంది.
sonykongara Posted September 12, 2024 Author Posted September 12, 2024 రాజధానికి ముంపు ముప్పు తప్పేలా.. గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో వాగుల ఆధునికీకరణను గాలికొదిలేసింది. అవి ఆక్రమణలకు గురైనా.. గుర్రపుడెక్కతో పూడిపోయినా పట్టించుకోలేదు. Published : 12 Sep 2024 04:18 IST వాగుల్లో గుర్రపుడెక్క తొలగింపు పనులు రూ.36 లక్షలతో టెండర్లు పిలవనున్న ఏడీసీఎల్ ఈనాడు, అమరావతి ఉండవల్లి వద్ద కొండవీటి వాగు గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో వాగుల ఆధునికీకరణను గాలికొదిలేసింది. అవి ఆక్రమణలకు గురైనా.. గుర్రపుడెక్కతో పూడిపోయినా పట్టించుకోలేదు. విజయవాడ నగరంలో బుడమేరు సృష్టించిన విధ్వంసం చూస్తే అవెంత నిర్లక్ష్యానికి గురయ్యాయో అవగతమవుతుంది. రాజధాని అమరావతిలో కొండవీటి వాగు, పాలవాగుల ఆధునికీకరణ పనులనూ అర్ధంతరంగా నిలిపేసింది. ఇటీవల భారీ వర్షాలకు నీరంతా కొండవీటివాగు ఎత్తిపోతల వద్దకు రాకుండా.. వెనక్కి తన్ని కొన్ని ప్రాంతాల్లోకి చేరింది. భవిష్యత్తులో ఈ వాగుల వల్ల ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఏడీసీఎల్ (అమరావతి అభివృద్ధి సంస్థ) చర్యలు చేపట్టింది. వాగుల ప్రవాహానికి అడ్డంగా పేరుకుపోయిన గుర్రపుడెక్క తొలగించేందుకు టెండర్లు పిలుస్తోంది. ప్రవాహానికి అడ్డు లేకుండా.. అమరావతిలో కొండవీటి వాగు, పాలవాగు, కొంతమేర కోటేళ్ల వాగు ప్రవహిస్తుంటాయి. వీటిలో పెద్దదైన కొండవీటి వాగు కొండవీటి కొండల నుంచి చిన్న ప్రవాహంలా మొదలై.. 29 కిలోమీటర్ల దూరం ప్రవహించి ఉండవల్లిలోని కృష్ణా నది హెడ్ రెగ్యులేటర్ వద్ద కలుస్తోంది. మధ్యలో పాలవాగు, కోటేళ్లవాగు వచ్చి ఇందులో కలుస్తున్నాయి. వీటిల్లో పేరుకుపోయిన గుర్రపు డెక్క, పిచ్చి మొక్కల తొలగింపును గత వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక రాజధాని నిర్మాణ పనులపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాగుల్లో గుర్రపుడెక్క తొలగించేందుకు రూ. 36 లక్షలతో రెండుమూడ్రోజుల్లో ఏడీసీఎల్ టెండర్లు పిలవనుంది. కొండవీటి వాగులో 14 కిలోమీటర్లు, పాలవాగులో 18 కిలోమీటర్ల మేర గుర్రపుడెక్క, పిచ్చిమొక్కలు తొలగిస్తారు. అర్ధంతరంగా నిలిచిన పనులు రాజధాని నగరానికి శాశ్వతంగా ముంపు సమస్య లేకుండా అప్పట్లో తెదేపా హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వరద నివారణ చర్యలు ప్రారంభించారు. అనంతవరం నుంచి కృష్ణాయపాలెం వరకు 19.85 కిలోమీటర్ల మేర కొండవీటి వాగును, దొండపాడు నుంచి కృష్ణాయపాలెం వరకు 16.70 కిలోమీటర్ల మేర పాలవాగును లోతు పెంచి, వెడల్పు చేయడంతోపాటు శాఖమూరులో 0.03 టీఎంసీల సామర్థ్యంతో జలాశయం నిర్మించాలన్నది ప్రణాళిక. ఈ పనులను రూ. 299.62 కోట్ల అంచనా వ్యయంతో హెచ్‌ఈఎస్-ఎంవీఆర్ ఉమ్మడి సంస్థ దక్కించుకుంది. 26 శాతం పనులు పూర్తయ్యాక ప్రభుత్వం మారి వైకాపా గద్దెనెక్కింది. అంతే.. ఆ పనులను అర్ధంతరంగా ఆపేసింది. రాజధానికి ముంపు సమస్య లేకుండా శాశ్వత పరిష్కారానికి అప్పటి తెదేపా హయాంలోనే రూ. 237 కోట్లతో కొండవీటివాగు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. ప్రకాశం బ్యారేజీ, బకింగ్‌హామ్ కాలువ, కొండవీటి వాగులను కలిపేలా దీన్ని నిర్మించారు. 16 మోటార్ల ద్వారా 5 వేల క్యూసెక్కుల ప్రవాహాన్ని ఎత్తిపోసే సామర్థ్యం ఉంది. దీనిని వైకాపా ప్రభుత్వం నిరుపయోగంగా మార్చింది. ప్రపంచ బ్యాంకు రుణంతో.. ప్రస్తుతం నిధుల కొరత కారణంగా కొండవీటి వాగు, పాలవాగుల్లో గుర్రపు డెక్క తొలగించే పనులను మాత్రమే ఏడీసీ చేపట్టనుంది. రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు రుణం మంజూరయ్యాక వాగుల ఆధునికీకరణ పనులను తిరిగి ప్రారంభించే యోచనలో ప్రభుత్వం ఉంది. వాటి లోతు పెంచి, వెడల్పు చేయడంతోపాటు గట్లపైన పచ్చదనం పెంపు, తదితర పనులను పూర్తి స్థాయిలో చేపట్టే అవకాశం ఉంది. Mobile GOM 1
surendra.g Posted September 13, 2024 Posted September 13, 2024 On 8/30/2024 at 10:08 AM, Nfan from 1982 said: Dead cheap deal for the buyers 👏👏 3500 per sft with premium items in 2024 ante 👏👏 Its coming to 4930/- per sqft (Calculated as cost divided by Super buildup area)
Nfan from 1982 Posted September 13, 2024 Posted September 13, 2024 3 hours ago, surendra.g said: Its coming to 4930/- per sqft (Calculated as cost divided by Super buildup area) Oh I see. But usually cost is calculated for all areas ga for apartment??
surendra.g Posted September 13, 2024 Posted September 13, 2024 18 minutes ago, Nfan from 1982 said: Oh I see. But usually cost is calculated for all areas ga for apartment?? Yes, Cost including Charges for Flat Super builtup area (Outerwall to outerwall area + balcony + common areas share) Car Parking Corpus fund Floor raising charges East facing charges GST Nfan from 1982 1
surendra.g Posted September 13, 2024 Posted September 13, 2024 Just now, surendra.g said: Yes, Cost including Charges for Flat Super builtup area (Outerwall to outerwall area + balcony + common areas share) Car Parking Corpus fund Floor raising charges East facing charges GST + 1 yr maintenance charges Nfan from 1982 1
sonykongara Posted September 14, 2024 Author Posted September 14, 2024 Nfan from 1982 and Mobile GOM 2
sonykongara Posted September 14, 2024 Author Posted September 14, 2024 Amaravati: రాజధాని అమరావతిలో పునాదులకు ఢోకా లేదు రాజధాని అమరావతిలో ఐదేళ్లుగా నీళ్లలో నానుతున్న హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల పునాదులకు.. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్న నివాస భవనాల టవర్ల పటిష్ఠతకు ఢోకా లేదని చెన్నై, హైదరాబాద్ ఐఐటీలకు చెందిన నిపుణులు స్పష్టం చేశారు. Published : 14 Sep 2024 04:37 IST ఐఐటీ చెన్నై, హైదరాబాద్ నిపుణుల నివేదిక! ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో ఐదేళ్లుగా నీళ్లలో నానుతున్న హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల పునాదులకు.. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్న నివాస భవనాల టవర్ల పటిష్ఠతకు ఢోకా లేదని చెన్నై, హైదరాబాద్ ఐఐటీలకు చెందిన నిపుణులు స్పష్టం చేశారు. వాటిపై అధ్యయనం చేసిన ఆ రెండు ఐఐటీల నిపుణుల బృందాలు ఇటీవలే ప్రాథమిక నివేదికను అందజేసినట్టు తెలిసింది. ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వానికి తుది నివేదిక అందజేయనున్నట్టు సమాచారం. హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల టవర్ల పునాదులు ఐదేళ్లుగా నీటిలో నానుతున్నాయి. వాటి పటిష్ఠతను పరీక్షించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం చెన్నై ఐఐటీ బృందానికి అప్పగించింది. చెన్నై ఐఐటీ నిపుణులు ఇటీవల ఆ పునాదుల్ని బోటులో వెళ్లి పరిశీలించాల్సి వచ్చింది. పునాదుల నుంచి కొంత భాగాన్ని కత్తిరించి తీసుకెళ్లి వాటి పటుత్వాన్ని పరిశీలించారు. భవనాలు, పునాదులు పటిష్ఠంగానే ఉన్నాయని.. ఐదేళ్లుగా బయటకు కనిపిస్తూ తుప్పు పట్టిన ఇనుమును తొలగించి, కెమికల్ ట్రీట్‌మెంట్ చేసి భవన నిర్మాణాలు కొనసాగించవచ్చని ఐఐటీ నిపుణులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిలభారత సర్వీసుల అధికారులు, గ్రూప్-1 అధికారులు, ఎన్జీవోలు, నాలుగో తరగతి ఉద్యోగుల కోసం నిర్మించిన.. వివిధ దశల్లో ఉన్న భవనాల పటిష్ఠతను హైదరాబాద్ ఐఐటీ నిపుణుల బృందం పరిశీలించింది. వాటికి కూడా ఢోకా లేదని, నిర్మాణాలు కొనసాగించవచ్చని ఆ బృందం నిగ్గుతేల్చినట్టు సమాచారం. Nfan from 1982 and Mobile GOM 2
Flash Posted September 15, 2024 Posted September 15, 2024 Norman Foster malli ravataniki oppukunte, confidence rebuild chesinatte.. cbn should go and meet him if required sonykongara 1
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now