sonykongara Posted September 16, 2024 Author Posted September 16, 2024 అమరావతి రైతులకు కౌలు డబ్బులు విడుదల రాజధాని రైతులకు ఏపీ ప్రభుత్వం డబ్బులు విడుదల చేసింది. Published : 16 Sep 2024 20:10 IST అమరావతి: రాజధాని రైతులకు ఏపీ ప్రభుత్వం డబ్బులు విడుదల చేసింది. ఈ మేరకు రైతుల ఖాతాలో సీఆర్‌డీఏ డబ్బులు జమ చేసింది. రాజధాని అమరావతి నిర్మాణానికి భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు ఎకరానికి ఇస్తున్న వార్షిక కౌలు.. మరో ఐదేళ్ల పాటు ప్రభుత్వం పొడిగించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఎకరానికి ఎంత కౌలు చెల్లిస్తున్నారో అంతే మొత్తాన్ని ఇస్తున్నారు. పదేళ్లపాటు కౌలు చెల్లించాలన్న గడువు ఒప్పందం ముగియడంతో మరో ఐదేళ్లు పెంచాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది.
nbk@myHeart Posted September 16, 2024 Posted September 16, 2024 39 minutes ago, sonykongara said: అమరావతి రైతులకు కౌలు డబ్బులు విడుదల రాజధాని రైతులకు ఏపీ ప్రభుత్వం డబ్బులు విడుదల చేసింది. Published : 16 Sep 2024 20:10 IST అమరావతి: రాజధాని రైతులకు ఏపీ ప్రభుత్వం డబ్బులు విడుదల చేసింది. ఈ మేరకు రైతుల ఖాతాలో సీఆర్‌డీఏ డబ్బులు జమ చేసింది. రాజధాని అమరావతి నిర్మాణానికి భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు ఎకరానికి ఇస్తున్న వార్షిక కౌలు.. మరో ఐదేళ్ల పాటు ప్రభుత్వం పొడిగించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఎకరానికి ఎంత కౌలు చెల్లిస్తున్నారో అంతే మొత్తాన్ని ఇస్తున్నారు. పదేళ్లపాటు కౌలు చెల్లించాలన్న గడువు ఒప్పందం ముగియడంతో మరో ఐదేళ్లు పెంచాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. Is anything paid for last 5-6 years? Is this payment just for this year or all pending?
Mobile GOM Posted September 17, 2024 Posted September 17, 2024 5 hours ago, nbk@myHeart said: Is anything paid for last 5-6 years? Is this payment just for this year or all pending? Last govt lo vallu emi pay cheyala. Last 5 years erriars anukunta nbk@myHeart 1
surendra.g Posted September 17, 2024 Posted September 17, 2024 5 hours ago, Mobile GOM said: Last govt lo vallu emi pay cheyala. Last 5 years erriars anukunta Every year court ki velli techukunnaru kadaa!
sonykongara Posted September 17, 2024 Author Posted September 17, 2024 Minister Narayana: అమరావతిలో చుక్క నీరూ నిలవనివ్వం ‘భవిష్యత్తులో ఎటువంటి ముంపూ తలెత్తకుండా రాజధాని నిర్మాణం చేపడతాం. ఇందుకోసం కొండవీటి వాగు, పాల వాగు, గ్రావిటీ కాలువలను డిజైన్ చేశాం. వీటిని బాగా లోతు, వెడల్పు చేస్తాం. వీటితో పాటు ఆరు రిజర్వాయర్లు నిర్మిస్తున్నాం. Updated : 17 Sep 2024 06:39 IST కాలువలను డిజైన్ చేశాం 6 రిజర్వాయర్లు నిర్మిస్తాం కృష్ణాకు 15 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినా తట్టుకునేలా కరకట్ట రోడ్డు నిర్మాణం పురపాలక శాఖ మంత్రి నారాయణ ఈనాడు, అమరావతి: ‘భవిష్యత్తులో ఎటువంటి ముంపూ తలెత్తకుండా రాజధాని నిర్మాణం చేపడతాం. ఇందుకోసం కొండవీటి వాగు, పాల వాగు, గ్రావిటీ కాలువలను డిజైన్ చేశాం. వీటిని బాగా లోతు, వెడల్పు చేస్తాం. వీటితో పాటు ఆరు రిజర్వాయర్లు నిర్మిస్తున్నాం. ఎంత వరద వచ్చినా కాలువల్లోకి వెళ్లేలా చూస్తాం. అవి నిండితే... రిజర్వాయర్లను నింపేలా ప్రణాళికను సిద్ధంచేశాం. ఒకవేళ అంతకంటే ఎక్కువ వరద వస్తే.. ఎత్తిపోతల ద్వారా కృష్ణా నదిలోకి పంపిస్తాం. ఒక్క చుక్క నీటినీ రాజధానిలో నిలవనివ్వం’ అని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టంచేశారు. విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘నీరుకొండ వద్ద 0.4 టీఎంసీలు, కృష్ణాయపాలెం వద్ద 0.1, శాఖమూరు వద్ద 0.01, లాం వద్ద 0.3, పెదపరిమి వద్ద 0.2, వైకుంఠపురం వద్ద 0.3 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మిస్తాం. ఒకవేళ మరీ భారీగా వరద వస్తే... ఉండవల్లి వద్ద 12,350 క్యూసెక్కులు, బకింగ్‌హాం కాలువ వద్ద 4,000 క్యూసెక్కులు, వైకుంఠపురంలో 5,650 క్యూసెక్కుల మేర నీటిని ఎత్తిపోతల ద్వారా నదిలోకి పంపే ఏర్పాట్లు చేస్తాం. ఈ పనులకు రెండు నెలల్లో టెండర్లను పిలుస్తాం. వచ్చే వర్షాకాలం నాటికి వీటిని పూర్తి చేయాలని ఏడీసీ అధికారులను ఆదేశిస్తాం’ అని మంత్రి తెలిపారు. డిసెంబరులోగా టెండర్లు ‘కరకట్ట రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరిస్తాం. భవిష్యత్తులో కృష్ణా నదికి 15 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినా ఇబ్బంది తలెత్తకుండా చూస్తాం. ఐఐటీ మద్రాస్, హైదరాబాద్‌కు చెందిన నిపుణులు ఇటీవల భవనాలు, పునాదుల పటిష్ఠతపై నివేదికలు ఇచ్చారు. అన్ని నిర్మాణాల సామర్థ్యం బాగుందని, పనులు కొనసాగించవచ్చని అభిప్రాయపడ్డారు. పనుల రీఎస్టిమేట్ల రూపకల్పన కన్సల్టెంట్ల కోసం ఆర్‌ఎఫ్‌పీలను పిలిచాం. రెండు నెలల్లో టెండర్లు పిలిచి, డిసెంబరులో పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేస్తాం. జంగిల్ క్లియరెన్స్ 80 శాతం పూర్తయింది. రైతులకు ఒక విడత రూ.169 కోట్ల కౌలు బకాయిలు జమయ్యాయి’ అని నారాయణ వివరించారు. వైకాపాది దుష్ప్రచారమని తేలిపోయింది ‘బుడమేరు వరదకు విజయవాడలోని చాలా ప్రాంతాలు మునిగాయి. కృష్ణా నదికి ఎన్నడూ లేనంతగా 11.43 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినా అమరావతిలోని ఏ ప్రాంతమూ మునగలేదు. ఇదంతా ముంపు ప్రాంతమని, రాజధాని నిర్మించకూడదని, రుణం మంజూరు చేయొద్దని గతంలో వైకాపా నేతలు.. ప్రపంచబ్యాంకుకు లేఖలు రాశారు. అంతేకాకుండా పెద్దఎత్తున దుష్ప్రచారం చేశారు. అందులో వాస్తవం లేదని తేలిపోయింది. విజయవాడ కార్పొరేషన్‌కు చెల్లించాల్సిన పలు పన్నులకు ఈ నెల 30తో గడువు ముగుస్తోంది. నగరంలోని వరద ప్రాంతాల ప్రజలకు పన్నుల చెల్లింపునకు గడువు పొడిగిస్తాం’ అని మంత్రి చెప్పారు.
Mobile GOM Posted September 17, 2024 Posted September 17, 2024 7 hours ago, surendra.g said: Every year court ki velli techukunnaru kadaa! Atleast he didn’t pay minimum 3 years
sonykongara Posted September 19, 2024 Author Posted September 19, 2024 రాష్ట్రానికి బిట్స్, లా యూనివర్సిటీ అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయాన్ని యూజీసీ నిబంధనల ప్రకారం డీమ్డ్ టు బి యూనివర్సిటీగా మార్చేందుకు ప్రభుత్వపరంగా ఎన్వోసీ జారీ చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి దేశంలో ఉన్న టాప్ యూనివర్సిటీలను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో ‘బిట్స్’ సంస్థను ఏర్పాటు చేయాలని బిర్లా ప్రతినిధులను ఆహ్వానించగా వారు సుముఖత వ్యక్తం చేశారు. రూ.1000 కోట్ల పెట్టుబడితో తమ అనుబంధ సంస్థను ఇక్కడ ఏర్పాటు చేసేందుకు వారు ఆలోచన చేస్తున్నారు. సుప్రీంకోర్టు అడ్వకేట్లు ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు యోచిస్తున్నారు. టాటా ఆధ్వర్యంలో ఉన్న ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారు.
sonykongara Posted September 19, 2024 Author Posted September 19, 2024 వైఎస్సార్ జిల్లా కొప్పర్తిలోని మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో గతంలో ఆమోదించిన ప్రదేశానికి బదులుగా అమరావతిలో రెండో ఎంఎస్‌ఎంఈ టెక్నాలజీ సెంటర్ కమ్ టెస్టింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు ఆమోదం. ఈ మేరకు రాజధాని ప్రాంతంలో 20 ఎకరాలు అందించేందుకు నిర్ణయం Nfan from 1982 1
sonykongara Posted September 20, 2024 Author Posted September 20, 2024 Mobile GOM and Nfan from 1982 2
sonykongara Posted September 20, 2024 Author Posted September 20, 2024 Nfan from 1982, narens and Mobile GOM 3
sonykongara Posted September 23, 2024 Author Posted September 23, 2024 కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు అమరావతిలో 100 ఎకరాల్లో లా కాలేజ్
sonykongara Posted September 23, 2024 Author Posted September 23, 2024 100 ఎకరాల్లో అంతర్జాతీయ న్యాయ కళాశాల: చంద్రబాబు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. Updated : 23 Sep 2024 16:43 IST అమరావతి: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం ఆయన న్యాయశాఖపై సమీక్ష నిర్వహించారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రతిపాదనలను త్వరలోనే కేంద్రానికి పంపనున్నట్లు స్పష్టం చేశారు. మంత్రివర్గ భేటీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామన్నారు. అమరావతిలో అంతర్జాతీయ న్యాయ కళాశాల ఏర్పాటుపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్టు ద్వారా 100 ఎకరాల్లో న్యాయకళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. జూనియర్ న్యాయవాదులకు శిక్షణ అకాడమీ ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. అంతకుముందు మైనారిటీ సంక్షేమ శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మైనార్టీ సంక్షేమ పథకాల పునర్వ్యవస్థీకరణపై చర్చించారు. కడప హజ్ హౌస్, గుంటూరు క్రిస్టియన్‌భవన్‌ను పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇమామ్‌లకు రూ. 10 వేలు, మౌజన్‌లకు రూ. 5 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. మైనార్టీలకు లబ్ధి జరిగేలా వక్ఫ్ భూములను అభివృద్ధి Nfan from 1982 1
sonykongara Posted September 23, 2024 Author Posted September 23, 2024 అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు సోమవారం పర్యటించారు. లింగాయపాలెం గ్రామస్థులతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు భేటీ అయ్యారు. రాజధాని భూసమీకరణ, రైతు కూలీల జీవన ప్రమాణాలతో పాటు వారి స్థితిగతులపై చర్చించారు. అనంతరం వీఐటీ యూనివర్సిటీలో యాజమాన్య ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులతో పాటు సీఆర్డీఏ అదనపు కమిషనర్ కూడా పాల్గొన్నారు.
Mobile GOM Posted September 23, 2024 Posted September 23, 2024 44 minutes ago, sonykongara said: అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు సోమవారం పర్యటించారు. లింగాయపాలెం గ్రామస్థులతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు భేటీ అయ్యారు. రాజధాని భూసమీకరణ, రైతు కూలీల జీవన ప్రమాణాలతో పాటు వారి స్థితిగతులపై చర్చించారు. అనంతరం వీఐటీ యూనివర్సిటీలో యాజమాన్య ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులతో పాటు సీఆర్డీఏ అదనపు కమిషనర్ కూడా పాల్గొన్నారు. Thank you bro for all your updates every day 🙏 Nfan from 1982 1
AndhraBullodu Posted September 23, 2024 Posted September 23, 2024 2 hours ago, Mobile GOM said: Thank you bro for all your updates every day 🙏
Nfan from 1982 Posted September 24, 2024 Posted September 24, 2024 8 hours ago, sonykongara said: 100 ఎకరాల్లో అంతర్జాతీయ న్యాయ కళాశాల: చంద్రబాబు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. Updated : 23 Sep 2024 16:43 IST అమరావతి: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. సోమవారం ఆయన న్యాయశాఖపై సమీక్ష నిర్వహించారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు ప్రతిపాదనలను త్వరలోనే కేంద్రానికి పంపనున్నట్లు స్పష్టం చేశారు. మంత్రివర్గ భేటీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తామన్నారు. అమరావతిలో అంతర్జాతీయ న్యాయ కళాశాల ఏర్పాటుపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్టు ద్వారా 100 ఎకరాల్లో న్యాయకళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జూనియర్ న్యాయవాదులకు నెలకు రూ.10 వేల గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. జూనియర్ న్యాయవాదులకు శిక్షణ అకాడమీ ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. అంతకుముందు మైనారిటీ సంక్షేమ శాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మైనార్టీ సంక్షేమ పథకాల పునర్వ్యవస్థీకరణపై చర్చించారు. కడప హజ్ హౌస్, గుంటూరు క్రిస్టియన్‌భవన్‌ను పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇమామ్‌లకు రూ. 10 వేలు, మౌజన్‌లకు రూ. 5 వేలు గౌరవ వేతనం ఇవ్వాలని నిర్ణయించారు. మైనార్టీలకు లబ్ధి జరిగేలా వక్ఫ్ భూములను అభివృద్ధి Excellent 👍 👏👏
Nfan from 1982 Posted September 24, 2024 Posted September 24, 2024 Thank you 🙏 @sonykongara for the regular updates 🧡
sonykongara Posted September 24, 2024 Author Posted September 24, 2024 అమరావతి: ఇకపై ఒకే చట్టం పరిధిలోకి అన్ని యూనివర్సిటీలను తీసుకురానున్నట్లు సీఎం చంద్రబాబు (Chandrababu) తెలిపారు. ఉన్నత విద్యశాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ వర్సిటీల బలోపేతం, పోస్టుల భర్తీ, ప్రమాణాల పెంపు అంశంపై అధికారులతో చర్చించారు. ‘‘బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ ఛైర్‌పర్సన్స్‌గా పారిశ్రామికవేత్తలను నియమించే ప్రతిపాదనలు చేస్తున్నాం. పీపీపీ విధానంలో ఏఐ వర్సిటీ ఏర్పాటు చేస్తాం. రాజధాని నవనగరాల్లో భాగంగా అమరావతిలో స్పోర్ట్స్ విలేజ్ నిర్మిస్తాం. వచ్చే ఏడాది నుంచి కరికులమ్ మార్పునకు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. రాజకీయ జోక్యం లేకుండా పారదర్శకతతో వీసీలను నియమిస్తాం. విశ్వవిద్యాలయాల ర్యాంకింగ్‌కు ఐదేళ్ల ప్రణాళిక రూపొందిస్తున్నాం’’అని తెలిపారు.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now