sonykongara Posted October 4, 2024 Author Posted October 4, 2024 అమరావతి నుంచి పోర్టుకు జలమార్గం.. ప్రతిపాదనపై సీఎం సానుకూలత రాజధాని అమరావతి నుంచి బందరు పోర్టుకు జలమార్గం ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు గనులు, ఎక్సైజ్ శాఖామంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. Updated : 04 Oct 2024 09:25 IST మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం (కోనేరుసెంటరు), న్యూస్‌టుడే: రాజధాని అమరావతి నుంచి బందరు పోర్టుకు జలమార్గం ఏర్పాటుకు చర్యలు తీసుకోనున్నట్లు గనులు, ఎక్సైజ్ శాఖామంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. మచిలీపట్నంలో గురువారం ఆయన నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇన్‌లాండ్ వాటర్ వేస్ అభివృద్ధి కింద అమరావతి నుంచి నేరుగా పోర్టు వరకూ కాలవ ద్వారా రవాణా సౌకర్యం కల్పించే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం ఉన్న బందరు కాలవను అవసరం మేరకు అభివృద్ధి చేసి బందరు వద్ద అనుసంధాన కాలవను నిర్మిస్తే జలమార్గం సిద్ధం అవుతుందన్నారు. బుధవారం మచిలీపట్నం వచ్చిన చంద్రబాబు నగర అభివృద్ధితో పాటు, పోర్టు పనులు వేగవంతం చేసేందుకు ఆదేశాలు ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. షెడ్యూల్‌లో లేకపోయినా పోర్టు పనులను సందర్శించడం ద్వారా ముఖ్యమంత్రి మచిలీపట్నం నుంచే ఆకస్మిక తనిఖీలకు నాంది పలికారన్నారు. 300 ఎకరాలకు పైగా ఆస్తులున్న ఆంధ్రా జాతీయ కళాశాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుందన్నారు. స్వాతంత్రోద్యమ సమయంలో ప్రముఖులైన ముట్నూరి కృష్ణారావు, కోపల్లె హనుమంతరావు, డాక్టర్ భోగరాజు పట్టాభిసీతారామయ్యలు ప్రజా సహకారంతో కళాశాలను ఏర్పాటు చేస్తే ముంబయి నటి జత్వాని కాదంబరి కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి అక్రమంగా కళాశాల ఆస్తులు అనుభవిస్తున్నారన్నారు. ప్రజలకు చెందాల్సిన ఆస్తి అన్యాక్రాంతం అవడంపై దీర్ఘకాలంగా పోరాటం చేస్తూనే ఉన్నామని, తాజాగా చంద్రబాబు హామీతో త్వరలో ఇవి ప్రభుత్వపరం కానుందన్నారు. ఈ కళాశాలలో గ్లోబల్ కేపబిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రోల్డ్‌గోల్డ్ పరిశ్రమకు సంబంధించి ఎంఎస్‌ఎంఈ క్లస్టర్ల ద్వారా అభివృద్ధి చేయడంతో పాటు డిజైనింగ్‌లో నైపుణ్యాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. చిరకాల వాంఛగా ఉన్న మచిలీపట్నం-రేపల్లె రైల్వేలైన్ ఏర్పాటుకు అడుగులు ముందుకు పడుతున్నాయన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్, పాషా తదితరులు పాల్గొన్నారు.
sonykongara Posted October 5, 2024 Author Posted October 5, 2024 పది రోజుల్లో కరకట్ట రోడ్డు నమూనాలు కొలిక్కి! రాజధాని అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా కీలక రహదారుల అనుసంధానతపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. విజయవాడ వైపు నుంచి రాజధానికి వెళ్లేందుకు ప్రస్తుతం వినియోగంలో ఉన్న కరకట్ట రోడ్డును నాలుగు వరుసలకు విస్తరించనుంది. Published : 05 Oct 2024 05:31 IST 15 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా నిర్మాణం ఒకే వరుసగా ఉన్న కరకట్ట రోడ్డు ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతి పునర్నిర్మాణంలో భాగంగా కీలక రహదారుల అనుసంధానతపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. విజయవాడ వైపు నుంచి రాజధానికి వెళ్లేందుకు ప్రస్తుతం వినియోగంలో ఉన్న కరకట్ట రోడ్డును నాలుగు వరుసలకు విస్తరించనుంది. ఇప్పటికే రూపొందించిన డిజైన్లను.. కృష్ణానదికి తాజాగా వచ్చిన వరదల నేపథ్యంలో మారుస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కరకట్ట రహదారి ఒకే వరుసగా ఉంది. విజయవాడ నుంచి సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టుకు వెళ్లేందుకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, న్యాయమూర్తులు ఈ మార్గంలోనే రాకపోకలు సాగిస్తుంటారు. విపరీతమైన రద్దీ కారణంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఉండవల్లి నుంచి అమరావతివైపు వెళ్లే వాహనాలను కరకట్టపైకి అనుమతించడం లేదు. వన్‌వే నిబంధన అమలు చేస్తున్నారు. మూడేళ్ల క్రితం ఈ రహదారిని రెండు వరుసలకు విస్తరించేందుకు నాటి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అవసరమైన కొద్దిపాటి భూమిని సేకరించలేకపోవడంతో పనులు అంగుళం కూడా కదల్లేదు. తాజాగా సీఎం చంద్రబాబు ఈ మార్గాన్ని నాలుగు వరుసలకు విస్తరించే ప్రణాళికకు ఆమోద ముద్ర వేశారు. నమూనాలు రూపొందించి టెండర్లు పిలిచే సమయానికి కృష్ణా నదికి 11.43 లక్షల క్యూసెక్కుల ప్రవాహంతో భారీగా వరద వచ్చింది. దీంతో భవిష్యత్తులో 15 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినా కరకట్ట తట్టుకునేలా, రాజధానికి ఇబ్బంది లేకుండా ఉండేలా డిజైన్ మార్చాలని ప్రభుత్వం నిర్ణయించి సీడీవో (సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్)తో తిరిగి తయారు చేయిస్తోంది. ఈ ప్రక్రియ పది రోజుల్లో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అనంతరం ఏడీసీ అధికారులు టెండర్లు పిలవనున్నారు. నాలుగు సమాంతర రోడ్ల అభివృద్ధి రాజధాని అనుసంధానతలో కీలక పాత్ర పోషించేలా సమాంతర రోడ్లను అభివృద్ధి చేయాలన్న ప్రణాళికకు సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. సువిశాలమైన రహదారులను నిర్మించి, వాటిని చెన్నై - కోల్‌కతా జాతీయ రహదారికి అనుసంధానం చేయనున్నారు. గత ప్రభుత్వ హయాంలో మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం వద్ద ఆగిన సీడ్ యాక్సెస్ రోడ్డు (ఈ3) నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించేందుకు అవసరమైన 19 ఎకరాలను సమీకరించే ప్రయత్నాల్లో సీఆర్డీఏ అధికారులున్నారు. ఇది పూర్తయితే.. మణిపాల్ ఆసుపత్రి వద్ద జాతీయ రహదారికి అనుసంధానిస్తారు. దీనికి సమాంతరంగా మరో నాలుగు రహదారులను అభివృద్ధి చేయనున్నారు. కరకట్ట రోడ్డు ప్రకాశం బ్యారేజీ వద్ద ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ5, ఈ11, ఈ13, ఈ15 రోడ్లను విస్తరించి చెన్నై - కోల్‌కతా జాతీయ రహదారికి అనుసంధానం చేయనున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డును ఎన్‌హెచ్‌తో కలిపేలా కొండవీటి వాగు, బకింగ్‌హామ్ కెనాల్‌పై మరో రెండు వంతెనలను సీఆర్డీఏ ప్రతిపాదించింది. ఈ పనులు త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసుకుని.. పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
Nfan from 1982 Posted October 7, 2024 Posted October 7, 2024 16 minutes ago, sonykongara said: Good thing is central government is funding the land acquisition charge also for this 👏👏 abhi and Mobile GOM 2
sonykongara Posted October 7, 2024 Author Posted October 7, 2024 Amaravati ORR: అమరావతి ఓఆర్‌ఆర్.. రయ్ రయ్ రాజధాని అమరావతి బాహ్య వలయ రహదారి (అవుటర్ రింగ్ రోడ్ - ఓఆర్‌ఆర్) నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. తుది ఎలైన్‌మెంట్ ఖరారు, డీపీఆర్ తయారీ, భూసేకరణపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు దృష్టిపెట్టారు. Updated : 07 Oct 2024 07:03 IST ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు వేగంగా అడుగులు పాత సలహా సంస్థను కొనసాగించేందుకు అనుమతి క్షేత్రస్థాయిలో మరోసారి ఎలైన్‌మెంట్ పరిశీలన 5 జిల్లాల్లో భూసేకరణకు అధికారులను నియమించాలని లేఖలు ఏ పథకంలో చేరుస్తారనేది స్పష్టత రాగానే భూసేకరణ ప్రక్రియ ఈనాడు - అమరావతి రాజధాని అమరావతి బాహ్య వలయ రహదారి (అవుటర్ రింగ్ రోడ్ - ఓఆర్‌ఆర్) నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. తుది ఎలైన్‌మెంట్ ఖరారు, డీపీఆర్ తయారీ, భూసేకరణపై జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు దృష్టిపెట్టారు. ఏడాదిలో ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నారు. వాస్తవంగా 2018లో దీని ఎలైన్‌మెంట్ ఖరారు చేయగా, 2019లో అధికారంలోకి వచ్చిన వైకాపా.. రాజధానిపై అక్కసుతో ఓఆర్‌ఆర్‌ను పక్కనపెట్టింది. చంద్రబాబు మళ్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత దిల్లీ వెళ్లి.. కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు ప్రాథమిక ఆమోదం లభించేలా చేశారు. దీంతో ఓఆర్‌ఆర్‌కు సంబంధించి కార్యాచరణ చేపట్టాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. 189 కి.మీ. ఉండే బాహ్య వలయ రహదారికి గతంలో ఆర్వీ అసోసియేట్స్ అనే సలహా సంస్థ ఎలైన్‌మెంట్ రూపకల్పన, డీపీఆర్ పనులు చేసింది. 2019 నుంచి పనులు సాగకపోవడంతో ఆర్వీ సంస్థ ఈ ప్రాజెక్టు నుంచి వైదొలుగుతామంటూ గతంలోనే ఎన్‌హెచ్‌ఏఐని కోరింది. దీనిపై ఇంతకాలం నిర్ణయం తీసుకోలేదు. తాజాగా ఓఆర్‌ఆర్ నిర్మాణానికి కేంద్రం సమ్మతించడంతో.. ఆర్వీ సంస్థను కొనసాగించేలా అనుమతివ్వాలంటూ ఇక్కడి ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు దిల్లీకి ప్రతిపాదన పంపారు. తాజాగా అందుకు అనుమతి వచ్చింది. దీంతో ఆ సంస్థతో ఈ వారంలో ఎన్‌హెచ్‌ఏఐ సప్లిమెంటరీ ఒప్పందాన్ని చేసుకోనున్నారు. భూసేకరణ భారం లేదు ఓఆర్‌ఆర్ నిర్మాణానికి 2018 నాటి అంచనా ప్రకారం రూ. 17,761 కోట్లు, దీనికి అవసరమైన 3,404 హెక్టార్ల భూసేకరణకు రూ. 4,198 కోట్లు అవుతుందని అంచనా వేశారు. తాజాగా ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం దాదాపు రూ. 20 వేల కోట్లు, భూసేకరణకు సుమారు రూ. 5 వేల కోట్లు కలిపి రూ. 25 వేల కోట్ల వరకు అవుతుందని అంచనా వేస్తున్నారు. అప్పట్లో భూసేకరణ భారాన్ని రాష్ట్రమే భరించాలని కేంద్రం షరతు పెట్టగా.. ఇప్పుడు భూసేకరణ సహా మొత్తం వెచ్చించేందుకు కేంద్రం సమ్మతించింది. దీంతో ఈ ప్రాజెక్టు వేగంగా పూర్తయ్యేందుకు అవకాశం ఏర్పడనుంది. భూసేకరణ కోసం ఆయా జిల్లాల్లో అధికారులను నామినేట్ చేయాలని కోరుతూ.. ఇటీవల కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గుంటూరు, పల్నాడు జిల్లాల కలెక్టర్లకు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు లేఖలు రాశారు. ఎలైన్‌మెంట్, డీపీఆర్‌లకు కేంద్రం నుంచి ఆమోదం వచ్చిన వెంటనే భూసేకరణ ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్‌హెచ్‌ఏఐ నిబంధనల ప్రకారం 80-90 శాతం భూసేకరణ జరిగితే.. ఆ ప్రాజెక్టులో టెండర్లు పూర్తిచేసి, గుత్తేదార్లకు పనులు అప్పగిస్తారు. ఈ నేపథ్యంలో ఎంత త్వరగా భూసేకరణ ప్రక్రియ పూర్తయితే, అంత వేగంగా పనులు ప్రారంభించే వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. అంతా సవ్యంగా జరిగితే ఏడాదిలో ఓఆర్‌ఆర్ పనులు ఆరంభించే వీలుందని పేర్కొంటున్నారు. తుది ఎలైన్‌మెంట్ ఖరారుకు పరిశీలన ఓఆర్‌ఆర్‌కు 189 కి.మీ.తో ఉన్న ఎలైన్‌మెంట్ 2018 నాటిది. ఇప్పటికి ఆరేళ్లు కావటం, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులంతా మారిపోవడంతో తాజాగా ఎలైన్‌మెంట్‌ను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో హైటెన్షన్ విద్యుత్ లైన్లు, పంట కాల్వలు, చెరువులు ఏవైనా ఉన్నాయా? అనేది చూడనున్నారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాక, తుది ఎలైన్‌మెంట్‌ను ఎన్‌హెచ్‌ఏఐ ఉన్నతాధికారులకు పంపనున్నారు. మరోవైపు ఈ ప్రాజెక్టును కేంద్రం ఏ పథకంలో చేరుస్తుందనేది స్పష్టత రావాల్సి ఉంది. జాతీయ రహదారుల్లో ఒక్కో ప్రాజెక్టును దాని స్థాయిని బట్టి ఒక్కో పథకంలో చేర్చి, ఏటా నిధులు కేటాయిస్తుంటారు. ఇలా ఏ పథకంలో చేరుస్తారనేది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు చెబుతున్నాయి.
Nfan from 1982 Posted October 8, 2024 Posted October 8, 2024 15 hours ago, sonykongara said: Good deadline
sonykongara Posted October 11, 2024 Author Posted October 11, 2024 రాజధాని అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన ‘ఫాక్స్‌కాన్’ ప్రఖ్యాత టాటా సన్స్ కూడా అమరావతిలో పెట్టుబడులు పెట్టనుంది. తెదేపా అధికార ప్రతినిధి విజయ్‌కుమార్
vk_hyd Posted October 13, 2024 Posted October 13, 2024 Flash, Nfan from 1982, Koduri and 2 others 2 3
sonykongara Posted October 15, 2024 Author Posted October 15, 2024 Amaravati: ఆకర్షణీయ ఆకృతులు.. అద్భుతంగా అమరావతి రాజధాని అమరావతిలో శాసనసభ, హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల ఆకృతులను మార్చరాదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పరిపాలనా నగర ప్రణాళికతో పాటు, ఆ ఐకానిక్ భవనాలకు ఆకృతుల్ని 2018లో లండన్‌కు చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ సంస్థ నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్స్ రూపొందించింది. Updated : 15 Oct 2024 07:46 IST రాజధానిలో ఐకానిక్ భవనాలు అప్పటి డిజైన్‌లతోనే హైకోర్టు, శాసనసభ, సచివాలయ భవనాలు ప్రభుత్వ నిర్ణయం మళ్లీ ముందుకొచ్చిన నార్మన్ ఫోస్టర్! ఈనాడు - అమరావతి రాజధాని అమరావతిలో శాసనసభ, హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల ఆకృతులను మార్చరాదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పరిపాలనా నగర ప్రణాళికతో పాటు, ఆ ఐకానిక్ భవనాలకు ఆకృతుల్ని 2018లో లండన్‌కు చెందిన ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ సంస్థ నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్స్ రూపొందించింది. రాష్ట్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చి, రాజధాని నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాక... ఐకానిక్ భవనాల ఆకృతులపై ఉన్నతస్థాయిలో చర్చ జరిగింది. దాదాపు ఆరేళ్ల క్రితం రూపొందించిన ఆ ఆకృతుల్లో ఇప్పుడేమైనా మార్పులు చేయాలా అన్న కోణంలో చర్చించారు. వాటి బాహ్య ఆకృతుల్లో ఎలాంటి మార్పులూ చేయరాదని, అవసరమైతే అంతర్గతంగా కొన్ని మార్పులు చేయాలన్న అభిప్రాయానికి వచ్చారు. వాటిని మారిస్తే మరో ఏడాదిన్నర సమయం వృథా అవుతుందన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పైగా హైకోర్టు, సచివాలయం టవర్ల పునాదుల నిర్మాణం ఇప్పటికే పూర్తయినందున...ఇప్పుడు ఆకృతులను మార్చాలనుకోవడం సరికాదన్న అభిప్రాయానికి వచ్చింది. హైకోర్టు భవన ఆకృతులకు సంబంధించి హైకోర్టు న్యాయమూర్తులతో ఇటీవల సీఆర్‌డీఏ అధికారులు సమావేశమై, వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. మరోపక్క ఐకానిక్ భవనాల డిజైన్లకు సంబంధించి పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు ఆర్కిటెక్ట్ నియామకానికి సీఆర్‌డీఏ టెండర్లు పిలిచింది. లండన్ సంస్థ నార్మన్ ఫోస్టర్ ప్రతినిధులు కూడా ప్రీబిడ్ మీటింగుకు హాజరయ్యారు. ఆ సంస్థ కూడా బిడ్ దాఖలు చేసి ఉంటుందని సీఆర్‌డీఏ అధికారులు భావిస్తున్నారు. మరో మూడు నాలుగు రోజుల్లో బిడ్‌లు తెరిచి ఆర్కిటెక్ట్‌ను ఖరారు చేయనున్నారు. హైకోర్టు, సచివాలయ భవనాల పునాదులు పటిష్ఠంగానే ఉన్నాయని చెన్నై ఐఐటీ నిపుణులు సర్టిఫై చేయడంతో ఆ భవనాల నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలిచేందుకు సీఆర్‌డీఏ సన్నాహాలు చేస్తోంది. జగన్ ప్రభుత్వం ముప్పు తిప్పలు పెట్టినా..! 2019కి ముందు తెదేపా హయాంలో అమరావతి నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రఖ్యాత సంస్థలేవీ... ఇప్పుడు మళ్లీ ఆ అవకాశం వస్తే వదులుకోవడానికి సిద్ధంగా లేవు. నార్మన్ ఫోస్టర్ అండ్ పార్ట్‌నర్స్ సంస్థ మళ్లీ అమరావతి నిర్మాణంలో భాగస్వామి అయ్యేందుకు ఆసక్తి చూపడమే ఇందుకు నిదర్శనం. జగన్ ప్రభుత్వంలో అనేక చేదు అనుభవాల్ని ఎదుర్కొన్న విదేశీ సంస్థల్లో నార్మన్ ఫోస్టర్ కూడా ఉంది. వైకాపా ప్రభుత్వం...నార్మన్ ఫోస్టర్ వంటి సంస్థల్నీ అనేక ఇబ్బందులు పెట్టింది. వారితో సీఆర్‌డీఏ చేసుకున్న ఒప్పందాల్ని కాలరాసింది. నార్మన్ ఫోస్టర్ సంస్థకు బకాయిలు చెల్లించకుండా ముప్పుతిప్పలు పెట్టింది. చివరకు బకాయిలు వసూలు చేసుకోవడానికి నార్మన్ ఫోస్టర్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అన్ని వేధింపులు ఎదుర్కున్న తర్వాత కూడా నార్మన్ ఫోస్టర్ సంస్థ... మళ్లీ ముందుకు వస్తుందని సీఆర్‌డీఏ అధికారులు ఊహించలేదు. కానీ ప్రీబిడ్ మీటింగుకు హాజరవడంతో...ఆ సంస్థ ఆసక్తిగా ఉందన్న విషయం తెలిసింది. ఆ సంస్థ ప్రీబిడ్ మీటింగుకు మాత్రమే హాజరైందా? బిడ్ కూడా దాఖలు చేసిందా అన్న విషయంలో స్పష్టత లేదు. ఒక వేళ ఆ సంస్థ బిడ్ వేసి, దానికే టెండరు ఖరారైతే సమయం కలసి వస్తుందని సీఆర్‌డీఏ అధికారులు అభిప్రాయపడుతున్నారు. అప్పట్లో ఆకృతులు ఇలా..! అప్పట్లో శాసనసభ భవనాన్ని బోర్లించిన లిల్లీపువ్వు ఆకారంలో, హైకోర్టు ఆకృతిని బౌద్ధ స్తూపం స్ఫూర్తితో రూపొందించారు. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాలను ఐదు టవర్లుగా...డయాగ్రిడ్ విధానంలో నిర్మించాలనుకున్నారు. అప్పటి అంచనాల ప్రకారం వాటి నిర్మాణ వ్యయం రూ.11,752 కోట్లు. శాసనసభ భవనం నిర్మితప్రాంతం 11.67 లక్షలు, హైకోర్టు భవనం నిర్మిత ప్రాంతం 16.85 లక్షలు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల నిర్మిత ప్రాంతం 68.88 లక్షల చదరపు అడుగులు. అప్పట్లో హైకోర్టు, సచివాలయ భవనాల నిర్మాణానికి టెండర్లు పిలిచి, పనులు అప్పగించారు. పునాదుల నిర్మాణం పూర్తయింది. వాటి పునాదులకు అప్పట్లో రూ.330 కోట్లు వరకు ఖర్చయింది. శాసనసభ భవనానికి శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం పనులు నిలిపేసింది.
ramntr Posted October 15, 2024 Posted October 15, 2024 24 minutes ago, sonykongara said: 6 lane వేస్తే better emo ga 4 lane kanna... sonykongara and Flash 2
sonykongara Posted October 15, 2024 Author Posted October 15, 2024 4 minutes ago, ramntr said: 6 lane వేస్తే better emo ga 4 lane kanna... Naku alganae unnadi
ramntr Posted October 15, 2024 Posted October 15, 2024 8 minutes ago, sonykongara said: Naku alganae unnadi River venta road lo veltha vunte sight seeing baguntadi, recreation activity like parks N water sports etc.. అక్కడక్కడా develop sesthe ఇంకా too good vuntadi.. So barrage nunchi amaravathi daka 40km ela vestaro road chudali...
Nfan from 1982 Posted October 16, 2024 Posted October 16, 2024 7 hours ago, ramntr said: River venta road lo veltha vunte sight seeing baguntadi, recreation activity like parks N water sports etc.. అక్కడక్కడా develop sesthe ఇంకా too good vuntadi.. So barrage nunchi amaravathi daka 40km ela vestaro road chudali... river front capital project lo Chaala theme projects unnayi both sides of the river 19-24 TDP unte they could have been materialised in this term Now it will take time
sonykongara Posted October 16, 2024 Author Posted October 16, 2024 RDA: జనవరిలో అసెంబ్లీ, ఐకానిక్ భవనాలకు టెండర్లు.. సీఆర్డీయే భేటీలో కీలక నిర్ణయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీయే అథారిటీ 38వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. Updated : 16 Oct 2024 23:36 IST అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీయే అథారిటీ 38వ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఐఏఎస్‌ల కోసం నిర్మించిన అపార్ట్‌మెంట్ల వద్ద మిగిలిపోయిన పనుల కోసం రూ.524 కోట్లకు పాలనా అనుమతి ఇచ్చారు. 18 టవర్లుగా, 432 అపార్ట్‌మెంట్ల నిర్మాణం కోసం పనులు చేపట్టేందుకు పాలనా అనుమతి మంజూరు చేశారు. అమరావతిలో సీఆర్డీయే ప్రధాన కార్యాలయం జీ ప్లస్ 7గా నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు రూ.160 కోట్లతో అనుమతి ఇచ్చారు. సీఆర్డీయే, ఏడీసీ, పురపాలక శాఖలోని అన్ని హెచ్ఓడీ కార్యాలయాలు ఈ భవనంలోనే వచ్చేలా నిర్మాణం చేపట్టనున్నారు. కొండవీటి వాగు, పాలవాగు నుంచి వచ్చే వరద నీటిని గ్రావిటీ కెనాల్‌లో వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. నెదర్లాండ్స్ నుంచి గ్రావిటీ కెనాల్‌కు సంబంధించిన డిజైన్లు కూడా తీసుకున్నారు. అదనపు వరదనీటి కోసం ఆరు చోట్ల రిజర్వాయర్లను నిర్మించేలా ప్రణాళిక సిద్ధం చేయనున్నారు. డిసెంబరులోపు అన్ని పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ పూర్తై పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. అసెంబ్లీ, హైకోర్టు, ఐకానిక్ భవనాలకు సంబంధించిన పనులు 2025 జనవరికల్లా టెండర్ల ప్రక్రియ పూర్తి చేయనున్నారు. భేటీ అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ.. గతంలో భూములిచ్చిన రైతులకు పది రోజుల్లో ప్లాట్లు కేటాయిస్తామని తెలిపారు. రాజధాని పరిధిలో జంగిల్ క్లియరెన్స్ దాదాపు పూర్తయిందన్నారు. భారీ వరదల దృష్ట్యా కరకట్ట రోడ్డును రీడిజైన్ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now