Jump to content

Recommended Posts

Posted
24 minutes ago, sonykongara said:

nene  tag cheddamu ani marchi poyanu, last time cheppinattu unnatd bri neeru chettuccase gurinchi mana govt adi kuda cheyyalekapohundi.

Its for only 60k rupees work..

Posted

Amaravati: రాజధాని అమరావతికి రూ.15,000 కోట్లు

రాజధాని అమరావతి నిర్మాణం ఇక పరుగులు పెట్టనుంది. ప్రపంచబ్యాంకు నుంచి పెద్ద ఎత్తున రుణ సమీకరణకు రాష్ట్రప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉండడంతో మరో నెలన్నరలోనే ఆ ప్రక్రియ కొలిక్కి రాబోతోంది.

Updated : 02 Oct 2024 06:59 IST
 
 
 
 
 
 

ప్రపంచ బ్యాంకు సుముఖత
రుణం ఇచ్చేందుకు అంగీకరిస్తూ కేంద్రానికి లేఖ
నవంబరు 15 నాటికి ప్రక్రియ కొలిక్కి
ఆ వెంటనే అడ్వాన్స్‌గా సీఆర్‌డీఏకి రూ.3,750 కోట్లు
ఈనాడు - అమరావతి

ap011024main1a.jpg

రాజధాని అమరావతి నిర్మాణం ఇక పరుగులు పెట్టనుంది. ప్రపంచబ్యాంకు నుంచి పెద్ద ఎత్తున రుణ సమీకరణకు రాష్ట్రప్రభుత్వం చేసిన కృషి ఫలించింది. కేంద్రం నుంచి పూర్తి సహకారం ఉండడంతో మరో నెలన్నరలోనే ఆ ప్రక్రియ కొలిక్కి రాబోతోంది. రాజధానికి రూ.15,000 కోట్ల రుణం ఇచ్చేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలుపుతూ ప్రపంచబ్యాంకు నుంచి కేంద్రానికి ఇటీవలే లేఖ అందింది. ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) సంయుక్తంగా ఈ రుణం ఇస్తున్నాయి. మొత్తం రూ.15వేల కోట్లూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే సీఆర్‌డీఏకి అందనున్నాయి. రాజధానిలో మౌలిక వసతుల అభివృద్ధి, భూసమీకరణలో భూములిచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్‌ల అభివృద్ధి, పరిపాలన నగరంలో శాసనసభ, హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల టవర్ల నిర్మాణం వంటి పనులకు రూ.49వేల కోట్లు ఖర్చవుతుందని సీఆర్‌డీఏ తాజాగా అంచనా వేసింది. రూ.15 వేల కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే వస్తుండడంతో దానికి అనుగుణంగా సీఆర్‌డీఏ నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

అడ్వాన్సుగా రూ.3,750 కోట్లు

ప్రపంచబ్యాంకు, ఏడీబీ రుణం మంజూరుకు సంప్రదింపులన్నీ వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ప్రపంచబ్యాంకు బృందం మూడు నాలుగు దఫాలు రాజధానిలో పర్యటించింది. దిల్లీలో కేంద్ర ఆర్థికశాఖ, ప్రపంచబ్యాంకు, సీఆర్‌డీఏ అధికారులతో కీలక సమావేశం గురువారం జరగనుంది. నవంబరు 8న తుది సమావేశం ఉంటుంది. అదే నెల 15 నాటికి సంతకాల ప్రక్రియ ముగుస్తుంది. అది పూర్తయితే రూ.15 వేల కోట్లు మంజూరైనట్టే..! ఆ వెంటనే మొత్తం రుణంలో 25% అంటే.. రూ.3,750 కోట్లు అడ్వాన్స్‌గా తీసుకోవచ్చు. నవంబరులో ఆ నిధులు వస్తే డిసెంబరు నుంచి పనులు మొదలుపెట్టాలని సీఆర్‌డీఏ భావిస్తోంది. టెండర్లు పిలిచేందుకు అంతా సిద్ధం చేస్తోంది.

ప్రపంచబ్యాంకు, ఏడీబీ వంటి అంతర్జాతీయ రుణవితరణ సంస్థలు ఒక ప్రాజెక్టుకు ఇంత వేగంగా రుణం మంజూరు చేయడం రికార్డు..! ప్రపంచబ్యాంకు లాంటి సంస్థలు నిర్దిష్ట ప్రాజెక్టులకు రుణాలిస్తాయి. ఆ ప్రాజెక్టు వల్ల పర్యావరణం, సమాజంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? నిర్వాసితులకు సహాయ, పునరావాస ప్యాకేజీ సంతృప్తికరంగా ఉందా? వంటి అంశాలన్నీ కూలంకషంగా అధ్యయనం చేశాకే రుణం ఇస్తాయి. సంప్రదింపులకే ఏడాది సమయం పడుతుంది. అలాంటిది రాజధాని అమరావతికి రుణం మంజూరు ప్రక్రియను ఆగస్టు 20న ప్రారంభించి... నవంబరు నాటికి కొలిక్కి తెస్తోంది. మూడు నెలల్లోనే అవసరమైన ప్రక్రియలన్నీ పూర్తిచేసుకుని, రుణం మంజూరు చేస్తుండడం విశేషం. 2019కి ముందు రాజధాని నిర్మాణానికి రూ.3,500 కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచబ్యాంకు ముందుకొచ్చి, అవసరమైన ప్రక్రియలన్నీ పూర్తిచేసింది. 2019లో వచ్చిన జగన్‌ ప్రభుత్వం.. రాజధానికి రుణం అవసరం లేదని కేంద్ర ఆర్థికశాఖ ద్వారా ప్రపంచబ్యాంకుకు చెప్పడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది.

90 శాతం కేంద్రమే భరిస్తుంది

కేంద్ర, రాష్ట్రాల్లో ఎన్డీయే భాగస్వాములే అధికారంలో ఉండడంతో రాజధానికి గ్రహణం వీడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రూ.15వేల కోట్ల రుణం అందిస్తామని తాజా బడ్జెట్‌లో కేంద్రం ప్రకటించింది. అక్కడి నుంచి రుణం మంజూరుకు అవసరమైన పరిణామాలన్నీ శరవేగంగా జరిగాయి. రాజధానికి ప్రపంచబ్యాంకు, ఏడీబీ ఇస్తోంది పేరుకు రుణమే అయినా... అది రాష్ట్రప్రభుత్వానికి భారం కాబోదు. కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులిస్తోంది. ఈ రుణంపై 15 ఏళ్లపాటు మారటోరియం ఉంటుంది. చెల్లించాల్సిన వడ్డీ కూడా 4%లోపే ఉంటుంది. పైగా ఆ రుణంలో కేంద్రప్రభుత్వం 90%, రాష్ట్రప్రభుత్వం 10% చొప్పున భరించనున్నాయి. రాష్ట్రప్రభుత్వం చెల్లించాల్సిన 10% నిధుల్ని కూడా కేంద్రం వేరే నిధుల నుంచి సర్దుబాటు చేస్తుందని ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి.

Posted

 రాజధాని అమరావతిని తాకుతూ హైవే విస్తరణ

రాజధాని అమరావతిని కలుపుకొంటూ జాతీయ రహదారి విస్తరణకు నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) రూపొందించిన ప్రణాళికతో మెరుగైన రవాణా సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు.

Updated : 04 Oct 2024 09:27 IST
 
 
 
 
 
 

వినుకొండ- గుంటూరు మార్గం మరో 25 కి.మీ. పొడిగింపు
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌

041024brk124180810a.jpg

గుంటూరు (కలెక్టరేట్‌), న్యూస్‌టుడే: రాజధాని అమరావతిని కలుపుకొంటూ జాతీయ రహదారి విస్తరణకు నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) రూపొందించిన ప్రణాళికతో మెరుగైన రవాణా సేవలు అందుబాటులోకి వస్తాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ తెలిపారు. గుంటూరు కలెక్టరేట్‌లో గురువారం జాతీయ రహదారుల పనులపై అధికారులతో మంత్రి సమీక్షించారు. కృష్ణా, గుంటూరు జిల్లాలను కలిపే హైవే-16 అభివృద్ధి ప్రణాళిక బాగుందని కితాబిచ్చారు. ‘వినుకొండ- గుంటూరు రెండు లైన్ల మార్గాన్ని నాలుగు లైన్లుగా విస్తరించి మరో 25 కిలోమీటర్లు పొడిగిస్తూ, రాజధాని అమరావతిని తాకేలా ప్రణాళిక రూపొందింది. ఈ హైవే రాజధాని ప్రాంత అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. గుంటూరుకు మరో ఔటర్‌ రింగ్‌రోడ్డులా మారుతుంది. దీన్ని పూర్తిగా ఎన్‌హెచ్‌ఏఐ నిర్మిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున భూసేకరణ, విద్యుత్తు తదితర పనులు వెంటనే చేపట్టాలి. రెండేళ్లలో హైవే నిర్మాణం పూర్తవుతుంద’ని మంత్రి వివరించారు. సమీక్షలో కలెక్టర్‌ ఎస్‌.నాగలక్ష్మి, ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పాల్గొన్నారు. 

రైతులను మోసగించిన వారిపై చర్యలు: గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు జిల్లాల రైతులు గుంటూరులోని శీతల గిడ్డంగుల్లో మిర్చిని దాచుకుంటే, వారికి తెలియకుండానే రుణాలు తీసుకుని మోసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి చంద్రశేఖర్‌ స్పష్టం చేశారు. మోసపోయిన రైతులందరూ కన్నీరు పెట్టుకుని రావడం బాధనిపించిందన్నారు. నిందితులను అరెస్టు చేశామని, వారి ఆస్తులు అటాచ్‌ చేసేందుకు ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. నకిలీ రైతులపైనా చర్యలు తీసుకుంటామన్నారు.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...