Jump to content

Recommended Posts

Posted (edited)

Amaravati heart project

మంగళగిరి: రాజధాని అమరావతి నగరంలో తమ గ్రామానికి ఓ ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాల్సిందేనని నీరుకొండ గ్రామస్థులు పట్టుబడుతున్నారు. ఇందుకోసం తమ గ్రామంలోని కొండను విశాఖలోని కై లాసగిరి కన్నా మిన్నగా అన్నిహంగులతో తీర్చిదిద్దాలని ప్రణాళికను రూపొందిస్తున్నా రు. ఈ మేరకు తమ మనోభావాలను ప్రభుత్వం దృష్టికి కూడ తీసుకువెళ్లారు. భూసమీకరణ ప్రక్రియలో భాగంగా పలుమార్లు గ్రామానికి వచ్చిన మంత్రులు పత్తిపాటి పుల్లారావు, పీ నారాయణ గ్రామస్థుల ఆలోచనలను అభినందిస్తూ కచ్చితంగా రాజధానిలో నీరుకొండకు ఓప్రత్యేకత కల్పిస్తామని హమీలను ఇచ్చారు. ఎన్టీఆర్‌ శిఖరం పేరుతో నీరుకొండను పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే డిమాండుతో గ్రామస్థులు ఎన్టీఆర్‌ ఫౌండేషన్‌ పేరుతో ఓ కమిటీగా ఏకమయ్యారు. ఈ ఫౌండేషన్‌కు డాక్టర్‌ శ్రీనివాస్‌ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా, గ్రామానికి చెందిన ముప్పవరపు వెంకట్రావు, చలమలపల్లి బుల్లియ్య, దిండు వెంకటేశ్వరరావు, తోట పార్ధసారధి, మొవ్వా ధనకుమార్‌, దేశిబోయిన శ్రీను సభ్యులుగా ఉన్నారు.

 
 
నీరుకొండ ప్రత్యేకతలివి...

నీరుకొండలోని కొండ మొత్తం 172 ఎకరాల విస్తీర్ణంలో సముద్రమట్టానికి 150మీటర్ల ఎత్తులో ఉంది. దీని ఉపరితలంలో సుమారు 30నుంచి 40 ఎకరాల వరకు విశాల మైదానం ఉంది. కొండ శిఖరం అంచుల వెంబడి ఎత్తుపల్లాలను చదును చేసి సరిదిద్దితే మరో ఐదారు ఎకరాల వరకు తోడయ్యే అవకాశం ఉంది. కొండమీదకు ఈశాన్యం వైపు నుంచి ఘాట్‌రోడ్డును సులువుగా నిర్మించేందుకు అనుకూల సరిస్థితులు ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని రాజధానిలో తమ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉండేలా ఓ ప్రాజెక్టును ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. నీరుకొండను రాజధానికి హృదయం (గుండె)గా మలచాలని ప్రతిపాదిస్తున్నారు. దీనికోసం హార్ట్‌ అనే సమ్మిళిత ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.

 

 

 

 
హార్ట్‌ అంటే....!

హార్ట్‌ అనేపదంలో హెచ్‌ అంటే...హెరిటేజ్‌ (వారసత్వ గుర్తింపు), ఇ అంటే ఎన్విరాన్‌మెంట్‌ (పర్యావరణం), ఏ అంటే...ఆర్ట్స్‌ అండ్‌ కల్చరల్‌ సెంటర్‌ (కళలు, సాంస్కృతిక మందిరం), ఆర్‌ అంటే... రిక్రియేషన్‌ (వినోదం) టీ అంటే...టూరిజం (పర్యాటకం). ఈ రీతిగా నీరుకొండను ఐదు అంశాల అభివృద్ధి సమాహారంగా అభివృద్ధి చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ గ్రామానికే చెందిన డాక్టర్‌ మాదల శ్రీనివాస్‌ బీజేపీ గుంటూరు పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌ఛార్జి గా వ్యవహరిస్తున్నారు. ఈ హార్ట్‌ ప్రాజెక్టుకు రూపకల్పన చేయించారు. నీరుకొండ పర్వత శిఖరంపై తెలుగు జాతి ఆత్మగౌరవానికి చిహ్నంగా రాజధాని ప్రాంతమంతా కనిపించే విధంగా దివంగత నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయించాలని ఆ ప్రాజెక్టులో ప్రతిపాదించారు. సందర్శకుల వినోదం కోసం కైలాసగిరిలో మాదిరి రోప్‌వే, కొండ చుట్టూ సర్య్యూట్‌ రైలు, ఇతర వినోద కార్యక్రమాలను చేపట్టాలని సూచిస్తున్నారు. దీంతోపాటు కొండ దిగువన కొండవీటివాగు పరిసరాలను గ్రీనరీతో అభివ్దృద్ధి చేసి బోటు షికారు సౌకర్యం కల్పించవచ్చునంటున్నారు. మొత్తంగా ఈ ఆహ్లాదభరితమైన ప్రాజెక్టును రాజధాని ప్రాంతంలోనే ఓపెద్ద పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేయవచ్చునన్నది గ్రామస్థుల ఆలోచన. దీనివలన నీరుకొండతో పాటు పరిసర గ్రామాల యువతకు మంచి ఉపాధి అవకాశాలు కూడ పెరుగుతాయని అంటున్నారు. నీరుకొండ, కురగల్లు గ్రామాల నుంచి రాజధానికి పెద్దఎత్తున భూములను ఇప్పించడంలో విశేషంగా కృషి చేసిన డాక్టర్‌ మాదల శ్రీనివాస్‌ రాజధాని ఏరియాలో నీరుకొండకు ఓ ప్రత్యేక స్థానాన్ని కల్పించాలని కృషి చేస్తున్నారు.

Edited by sonykongara
  • 5 months later...
  • 5 weeks later...
Posted

నీరుకొండ పర్వత శిఖరంపై తెలుగు జాతి ఆత్మగౌరవానికి చిహ్నంగా రాజధాని ప్రాంతమంతా కనిపించే విధంగా దివంగత నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయించాలని ఆ ప్రాజెక్టులో ప్రతిపాదించారు

Posted
115.5 ft NTR statue at Amaravati
5681_NTR.jpg
115.5 ft NTR statue at Amaravati
 
 

Tirupati: The Government of Andhra Pradesh will install a 115.5 ft tall statue of founder president of TDP and former chief minister N T Rama Rao at Amaravati as a fitting tribute to NTR, who is a symbol of Telugu’s self respect, culture and tradition.

 

Announcing this at Mahanadu here on Saturday, party national president and Chief Minister N Chandrababu Naidu said, “a 115.5 ft tall statue of Rama Rao will be built to mark the 93rd birth anniversary of the leader and the 35th anniversary of TDP.”

 

Stating that NTR was a messiah for the poor, the Chief Minister said that he made several sacrifices for upholding pride of Telugus. NTR had a vision for elimination of poverty and also brought a revolutionary change in society. 

 

Despite entering politics at the age of 60, NTR became an idol for youth. The statue would be named as Telugu Jathi Atmagowrava Spoorthi. Delegates attending Mahandu welcomed the decision with a thunderous applause. 

 

The Chief Minister announced that the government would soon launch Anna canteens which would supply food for the poor at cheap price as a befitting tribute to Rama Rao.  “NTR will remain forever in the hearts of Telugus as a film actor and also as a popular leader,” he said.

Posted

ee 40-45 acres lo, 20 acres Telugu University and remaining land lo nice graden with 3-4 acres lake and 50ft Amaralingeswara Swamy vighram would be good.

  • 3 weeks later...
  • 2 months later...
  • 6 months later...
  • 1 month later...
Posted

అన్నగారి’ ఘనత చాటేలా విగ్రహం
రాజధాని గ్రామమైన నీరుకొండ వద్ద ఉన్న పర్వతంపై సుమారు 120 ఎకరాల విస్తీర్ణంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగువారి ఆరాధ్య కథానాయకుడైన నందమూరి తారక రామారావు 108 అడుగుల భారీ విగ్రహాన్ని నెలకొల్పాలని ప్రతిపాదించిన అధికారులు దానికి సంబంధించిన కాన్సెప్ట్‌ డిజైన్‌ను సీఎంకు చూపించారు. ఈ విగ్రహం చేతులమీదుగా వ్యూ పాయింట్లను ఏర్పాటు చేయాలని, అన్నగారి జీవన ప్రస్థానాన్ని కళ్లకు కట్టే విశేషాలతోపాటు రోప్‌వే కేబుల్‌కార్‌, జెయింట్‌ వీల్‌, ఇతర పర్యాటక ఆకర్షణలతో తీర్చిదిద్దాలని చెప్పారు.

Posted

ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటు వల్ల 120 ఎకరాల్లో ఉన్న నీరుకొండ ప్రాంతం రాజధానికే ముఖ్య ఆకర్షణగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ముఖ్య వినోద, విహార కేంద్రంగా తీర్చిదిద్దాలన్నారు. ఎన్టీఆర్‌లోని మహానటుడిని, గొప్ప రాజకీయవేత్తను, ఆయన సిద్ధాంతాలను ప్రతిబింబించేలా విగ్రహం ప్రాజెక్టు రూపొందించాలని సూచించారు.

  • 2 weeks later...
Posted
On 11/24/2017 at 10:12 PM, AnnaGaru said:

A Neerukonda hill govt permissions iste , we can show our difference with voluntary DONORS from all sections of people

 

 

bro,NTR Statue hill meda na,leda river daggara na petteindi

  • 1 month later...
Posted

ఏపీలోనూ ఎన్టీఆర్‌ వర్థంతిని ఘనంగా నిర్వహించామని తెలిపారు. ఎన్టీఆర్‌ వర్థంతి సభలో చంద్రబాబు పాల్గొన్నారని వివరించారు. అమరావతిలో ఎన్టీఆర్‌ విగ్రహం, మెమోరియల్‌ నిర్మాణానికి డిజైన్లు సిద్ధంగా ఉన్నాయని అన్నారు.

  • 2 weeks later...
Posted

* అమరావతిలో నీరుకొండ గ్రామంలోని కొండపై 108 అడుగుల ఎత్తున ఎన్టీఆర్‌ విగ్రహం ఏర్పాటుకు నిర్ణయించారు. డిజైన్లను మంత్రివర్గ సమావేశంలో ప్రదర్శించాలని, ఆన్‌లైన్‌లో  ప్రజాభిప్రాయం తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...