Jump to content

polavaram


Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply

october 2 nunchi dam works start chestharu antunaru

 

Ya main spillway earth works start antunaru

 

Using heavy machines we can do it super fast now

 

* ఐదు డంపర్లను కూడా ఆస్ట్రేలియా నుంచి వచ్చాయి. ఒక డంపరును ఇప్పటికే బిగించారు. మిగిలిన వాటిని బిగించే పనులు జరుగుతున్నాయి. ఒక్కో డంపరు ఖరీదు రూ.4 కోట్లు. ఈ డంపర్లు తిరగడానికి వీలుగా రహదారులు విశాలంగా ఉండాలి. అలా ఉంటే ఒక ట్రిప్పునకు 245 టన్నుల రాయిని గానీ మట్టిని గానీ సునాయాసంగా స్పిల్‌వే కొండ నుంచి బయటకు తీసుకొస్తుంది. ఇంకో డంపరు కూడా వస్తుంది.

 
 
Ippudu unna machines only 100tonnes idi 2+ times more when compared to old dumpers.
 
Deni valla Double speed avutayi works
ప్రస్తుతం రోజుకి 35 నుంచి 40 వేల క్యూబిక్కు మీటర్ల రాయిని తీస్తున్నారు. భారీ యంత్రాలు రాకతో రెట్టింపు పరిమాణంలో రాయిని తీయవచ్చని, మరో మూడు నెలల్లో స్పిల్‌వే పునాది పనులు పూర్తి చేస్తామని కంపెనీ సిబ్బంది భరోసా వ్యక్తం చేస్తున్నారు
 
:terrific:  :terrific:  :terrific:  :terrific:  Modern Babu is back
Link to comment
Share on other sites

open ga, free ga cheppa manu bro, entha varaku chance undo kanukko bro

 

Pulla rao gaare achanta lo oka function lo minimum 2021 ani chepparu.

But that was before Putzmeister and Bauer came into the scene. Tarvata triveni enter ayyindi

Chooddam

Link to comment
Share on other sites

పోలవరంపై ఫోకస్‌
12-09-2016 23:55:04
636093213049319970.jpg
  • తాజా పరిస్థితుల్లో సీఎం ప్రత్యేక శ్రద్ధ
  • నేడు ఏకధాటిగా 3గంటలు సమీక్ష
హైదరాబాద్‌, ఏలూరు, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): రాష్ర్టానికి పోలవరం ప్రాజెక్టును జీవనాడిగా అభివర్ణిస్తున్న సీఎం చంద్రబాబు... దానిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టనున్నారు. దీని నిర్మాణానికయ్యే ఖర్చునంతా తామే భరిస్తామని ఇటీవల ఏపీకి ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా కేంద్రం స్పష్టం చేయడంతో... ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించనున్నారు. ఈ రెండున్నరేళ్లలోనే 13సార్లు ప్రాజెక్టును సందర్శించి అనేకసార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించిన సీఎం... 2018 చివరికల్లా ఎట్టి పరిస్థితుల్లోనైనా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం సీఎం పోలవరంలో ప్రత్యేక సమీక్ష నిర్వహించనున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు రెండో తేదీన పోలవరం హెడ్‌ వర్క్స్‌ పనులను ప్రారంభించాలని ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్ససా్ట్రయ్‌ను సీఎం ఇప్పటికే ఆదేశించారు. ఈ పనులు మొదలైతే నిర్దేశిత కాలంలో ప్రాజెక్టు పూర్తవుతుందని జల వనరుల శాఖ ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో జరగనున్న నేటి సమావేశంలో ప్రాజెక్టు భూసేకరణ, నిర్వాసితులకు సహాయ, పునరావాస కార్యక్రమాలకు తగు చర్యలు చేపట్టడంపై రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేయనున్నారు.
 
భారీ యంత్రాలతో జోరుగా పనులు 
రాష్ట్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టును పూర్తిచేసేలా కేంద్రం గ్రీన సిగ్నల్‌ ఇవ్వడంతో వేగంగా ప్రాజెక్టును పూర్తి చేసేలా రాష్ట్ర జల వనరుల శాఖ తగు కార్యాచరణను సిద్ధం చేసేందుకు సమాయత్తమైంది. మరోవైపు, పనుల వేగాన్ని రెట్టింపుకంటే అధికం చేసేందుకు వీలుగా భారీ యంత్ర సామగ్రిని కాంట్రాక్టు సంస్థలు సిద్ధం చేశాయి. ఒకేసారిలో 35 క్యూబిక్‌ మీటర్ల మట్టిని తవ్వి తీసే(12 ట్రక్కుల లోడు) ఎక్స్‌కవేటర్‌ను జర్మనీ నుంచి ప్రత్యేకంగా తీసుకొచ్చారు. దీన్ని సీఎం చేతుల మీదగా నేడు ప్రారంభిస్తారు. గంటకు 1500 క్యూబిక్‌ మీటర్ల చొప్పున ఈ యంత్రం మట్టి తీయగలుగుతుంది. 280 టన్నుల మట్టిని ఒకేసారి డంపింగ్‌ యార్డుకు తరలించే సామర్థ్యంగల 5 డంపర్లను కూడా తీసుకొచ్చారు. ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్ససా్ట్రయ్‌తోసహా ఇతర ఉప కాంట్రాక్టు సంస్థలు ఇప్పటికే రోజుకు 60,000 నుంచి 70,000 క్యూబిక్‌ మీటర్ల వరకూ మట్టి పనులు చేపడుతున్నాయి. వాటికి తోడు ఈ యంత్రమూ తోడయితే.. పనులు వాయువేగంతో పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రాజెక్టులో కీలకమైన స్పిల్‌వే, డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణంపైనే ఇక పూర్తి శ్రద్ధ పెట్టనున్నారు.
 
పురుషోత్తమపట్నంపై స్పష్టత! 
పట్టిసీమ పథకంలాగే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకంలో భాగంగా పోలవరం ఎడమ కాలువ నుంచి ఏలేరు రిజర్వాయర్‌కు నీటిని పంపింగ్‌చేసే పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం పనులకు శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రి గతంలోనే నిర్ణయించారు. దాదాపు రూ.1648 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టు పనులకు ఈ ఏడాది ఆగస్టు 15నాటికి టెండర్లను పిలవాలనీ అనుకున్నారు. కానీ, ఈ ఏడాది జలవనరుల శాఖకు బడ్జెట్‌లో కేటాయింపుల కంటే మూడింతలకుపైగా నిధులు కేటాయించినందున... ఎఫ్‌ఆర్‌బీఎం మార్గదర్శకాల మేరకు ఈ పథకానికి పాలనా అనుమతులు ఇవ్వడం కుదరదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. అయితే, చింతలపూడి ఎత్తిపోతల పథకం విస్తరణ తరహాలోనే పురుషోత్తమపట్నం కూడా రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం తీసుకుని టెండర్లను పిలిచే యోచనలో ప్రభుత్వం ఉంది.
Link to comment
Share on other sites

Andhra CM Chandrababu Naidu carried out an aerial survey of the Polavaram project today and held meetings with officials from the Irrigation department to chart out plans for speedy completion of the prestigious project. He has also inagurated the new advanced machinery. Chief Minsiter is going to inspect Polavaram Project area every 3rd Satruday and review the work done. Government is planning to make the project a reality by completing the first phase by 2018.


While a total of 1,049 lakh cubic metres of earthwork was supposed to be done as part of the project construction, 410 lakh cubic meters has been completed so far. A 5.5-km spillway and spill channel were being constructed to enable discharge of 50 lakh cusecs of water, the largest in the world.


Upon completion, the dam and its canals will irrigate 2.91 lakh hectares (7.2 lakh acres) and supply drinking water to a population of 28.50 lakh living in 540 villages and divert 80 tmcft of water to the Krishna River Basin.


Link to comment
Share on other sites

ఏపీ సీఎం చంద్రబాబు
13brk92a.jpgపోలవరం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి 100 శాతం నిధులు ఇస్తామన్నందుకు ప్రధాని నరేంద్రమోదీకి ఫోన్‌ చేసి కృతజ్ఞతలు తెలిపినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఈరోజు పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా వస్తే ఏ ప్రయోజనాలు సమకూరుతాయో అంతే సమానమైన ప్రయోజనాలు ఇస్తామని ప్రధాని హామీ ఇచ్చినట్లు తెలిపారు. హోదాకు సమానంగా ప్రత్యేక ప్యాకేజీ కింద ఐదేళ్ల పాటు నిధులు ఇస్తామని చెప్పారని.. ఇందుకు గాను ప్రధానికి కృతజ్ఞతలు తెలిపినట్లు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన నాటి నుంచి అయ్యే మొత్తం ఖర్చును కూడా కేంద్రమే భరిస్తుందని ప్రధాని చెప్పినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టు పనులపై ఇకపై ప్రతి సోమవారం సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు.

నీటి సమస్యతో ప్రజల్లో అభద్రతా భావం రాకూడదని చంద్రబాబు పేర్కొన్నారు. అభద్రతా భావం ఏర్పడితే ఎటువంటి పరిస్థితులు తలెత్తుతాయో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ఘటనలే ఉదాహరణ అని ఆయన స్పష్టం చేశారు.

13brk92c.jpg

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...