Jump to content

NTR Amaravati International Airport


Recommended Posts

Guest Urban Legend

 

ఎప్పటిలాగే హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఫ్లైట్, గన్నవరం ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యింది... బయటకి వచ్చిన ప్రయాణికులు, ఒకింత షాక్ అయ్యారు... తేరుకుని చూసే సరికి, వాళ్ళు ఎప్పటి లాగే, పాత టెర్మినల్ కు కాకుండా, కొత్త టెర్మినల్ లో అడుగు పెట్టారు... కొత్త టెర్మినల్ కు స్వాగతం, మీదే మొదటి ఫ్లైట్ అని వాయిస్ ఓవర్ వస్తుంటే, వీళ్ళ ఆనందానికి అవధులు లేవు....

 

నిన్న రాత్రి మొదటి సారిగా, కొత్త టెర్మినల్ ఉపయోగించి చూసారు.. అంతా సవ్యంగా ఉండటంతో, ఇవాల్టి నుంచి, కొత్త టెర్మినల్ ను ఉపయోగిస్తున్నారు... కొత్త టెర్మినల్ చూడని వారు, ఇది నిజంగా గన్నవరం ఏనా, ఆశ్చర్యపోతున్నారు. అమరావతి సంస్కృతి ఉట్టి పడేలా ఉన్న, ఎయిర్ పోర్ట్ ఇంటీరియర్ చూసుకుంటూ, ముచ్చట పడుతూ, విజయవాడ బాగా డెవలప్ అయిపోతుంది, కొన్ని నెలల్లో ఇంత మార్పా, ఇలాంటివి చంద్రబాబు మాత్రమే చెయ్యగలరు అనుకుంటూ బయటకు వస్తున్నారు...

ఈ వీడియో చూడండి, మొదటి సారిగా, కొత్త టెర్మినల్ లో, అడుగుపెడుతున్న ప్రయాణీకులు....

 

http://www.amaravativoice.com/te/gannavarm-airport-new-terminal-started

Link to comment
Share on other sites

  • Replies 1.8k
  • Created
  • Last Reply

రక్షణ కంచె

1235 ఎకరాల చుట్టూ నిర్మాణం

త్వరలో టెండర్ల ప్రక్రియ ప్రారంభం

ఈనాడు, అమరావతి

amr-top1a.jpg

విజయవాడ విమానాశ్రయాన్ని అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లేందుకు రూ.160 కోట్లతో నూతన టెర్మినల్‌ భవనాన్ని నిర్మాణం చేపట్టారు. శనివారం నుంచి దీనిలో నుంచి రాకపోకలు సాగించారు. విజయవాడకు చేరుకున్న ప్రయాణికులను నూతన టెర్మినల్‌లోని అరైవల్‌ బ్లాక్‌ నుంచి అనుమతించారు. సోమవారం నుంచి పూర్తిస్థాయిలో అరైవల్‌, డిపార్చర్‌ బ్లాక్‌లు అందుబాటులోనికి రానున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ సర్వీసులు గన్నవరం నుంచి గాలిలోనికి ఎగరడమే మిగిలి ఉంది. దీనికి సంబంధించిన ఫైల్‌ సిద్ధమై క్యాబినెట్‌లో ఆమోదం పొందేందుకు ముందుకు కదిలింది. ఈ నేపథ్యంలో కొత్తగా గన్నవరం విమానాశ్రయంలో ఇప్పటికే ఉన్న 535 ఎకరాలతో పాటు కొత్తగా సేకరించిన 700 ఎకరాలలో అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం ఉన్న 7500 అడుగుల రన్‌వేను.. 11,023 అడుగులకు పొడిగిస్తున్నారు. కొత్తగా వచ్చిన భూమితో కలుపుకుని 1235 ఎకరాల విమానాశ్రయం చుట్టూ ఎనిమిది అడుగుల గోడ, దానిపై మరో ఒకటిన్నర ఎత్తులో విద్యుత్తు కంచెను నిర్మించనున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన టెండర్లను తెరవనున్నారు. గోడ నిర్మాణం ఒక వైపు చేపడుతుండగానే.. మరోవైపు రన్‌వే విస్తరణ పనులు నిర్వహిస్తారు. దీనికితోడు మరో రూ.565 కోట్లతో కొత్త ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ను సైతం విమానాశ్రయంలో నిర్మించనున్నారు. రెండేళ్లలో దీనిని అందుబాటులోనికి తేవాలనేది ప్రణాళిక.

టెర్మినల్‌ను పరిశీలించిన ముఖ్యమంత్రి..

గన్నవరం విమానాశ్రయం నుంచి దేశంలోని అన్ని నగరాలకూ కనెక్టివిటీని పెంచే విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. అవసరమైతే అన్ని ఎయిర్‌లైన్స్‌ సంస్థలతో సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడకు శనివారం విచ్చేసిన ఆయన విమానశ్రయ నూతన టెర్మినల్‌ భవనాన్ని పరిశీలించారు. ప్రయాణికుల రద్దీ పెరిగిన తీరును సీఎంకు అధికారులు వివరించారు. అనుకున్నట్టుగానే అంతర్జాతీయస్థాయి నూతన టెర్మినల్‌ను శనివారం నుంచి అధికారులు అందుబాటులోనికి తీసుకురావడాన్ని ఆయన అభినందించారు. జనవరి 12న నూతన టెర్మినల్‌ భవనాన్ని ప్రారంభించారు. ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ఏఏఐ) నిబంధనల ప్రకారం.. 21 రోజుల్లో కార్యకలాపాలను నిర్వహించాల్సి ఉంది. అనుకున్నట్టుగానే ఒక్క రోజు కూడా తేడా లేకుండా నూతన టెర్మినల్‌ను ప్రయాణికులకు అందుబాటులోనికి తీసుకొచ్చారు.

Link to comment
Share on other sites

విజయవాడ ఎయిర్‌పోర్టు విస్తరణ పనులు ప్రారంభం
 
636227447341854606.jpg
  • రూ. 98.34 కోట్లతో రన్ వే, ఐసోలేషన్ బే పనులు 
  • పీఆర్‌ఎల్‌ ప్రాజెక్ట్స్‌ అండ్‌ ఇన్ ఫ్రాస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌కు కాంట్రాక్టు 
  • శంకుస్థాపన చేసిన ఏపీడీ మధుసూదనరావు 
  • మార్చి నుంచి ముమ్మరంగా పనులు
 
నవ్యాంధ్రప్రదేశకే తలమానికమైన విజయవాడ ఎయిర్‌పోర్టు
అభివృద్ధి పథంలో మరో అంకానికి తెరలేచింది. విమానాశ్రయవిస్తరణకు ఎట్టకేలకు బీజం పడింది. రన్ వే విస్తరణతో పాటు ఐసోలేషన్ బే పనులకు కాంట్రాక్టు దక్కించుకున్న పీఆర్‌ఎల్‌ సంస్థ శ్రీకారం చుట్టింది. ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ జి.మధుసూదనరావు మంగళవారం రన్ వే విస్తరణ, అనుబంధ పనులకు శంకుస్థాపన చేశారు.
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ/గన్నవరం) : అంతర్జాతీయ హోదాను అవలీలగా అందిపుచ్చుకోవటానికి, భారీ విమానాలు రాకపోకలు సాగించటానికి దోహదపడేందుకు రనవే విస్తరణకు నాంది పడింది. విజయవాడ ఎయిర్‌పోర్టు రనవే విస్తరణకు పిలిచిన టెండర్లను ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) ఖరారు చేసింది. ఢిల్లీకి చెందిన పీఆర్‌ఎల్‌ ప్రాజెక్ట్స్‌ అండ్‌ ఇనఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సంస్థ రనవే విస్తరణతో పాటు ఐసోలేషన బే అనుబంధ పనుల కాంట్రాక్టును దక్కించుకుంది. టెండర్లు ఖరారు కాగానే కాంట్రాక్టు సంస్థ పీఆర్‌ఎల్‌ సంస్థ కూడా వెంటనే రంగంలోకి దిగింది. క్షేత్ర స్థాయిలో శంకుస్థాపన పనులకు శ్రీకారం చుట్టింది. విజయవాడ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ జి.మధుసూదనరావు మంగళవారం రనవే విస్తరణ, అనుబంధ పనులకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. మార్చి నుంచి రనవే విస్తరణ పనులు చురుగ్గా సాగనున్నాయి.
1074 మీటర్ల విస్తరణ
నూతన రనవే 1074 మీటర్ల విస్తరించనున్నారు. ప్రస్తుతం 2286 మీటర్ల రనవే ఉంది. అదనంగా విస్తరించనున్న 1074 మీటర్ల నేపథ్యలో, మొత్తం 3360 మీటర్ల మేర రనవే పొడవు ఉంటుంది. అతిపెద్ద రనవే ఉన్న ఎయిర్‌పోర్టుగా మారనుంది. నూతనంగా నిర్మించే రనవే వెడల్పు 45 మీటర్లు ఉంటుంది. రనవే పనులు ఏలూరు కాల్వ దిశగా జరుగుతాయి. రనవే విస్తరణ పనులు పూర్తయితే బోయింగ్‌ 747 - 400 విమానాలు దిగటానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ విమానాలు అత్యంత భారీ గా ఉంటాయి. భారీ ఎయిర్‌బస్‌లు దిగాలంటే.. 4000 మీటర్ల మేర రనవేను విస్తరించాల్సి ఉంది. ప్రస్తుతం 640 మీ టర్లు తక్కువుగా ఉన్నప్పటికీ అంత ర్జాతీయ విమానాలు తిరగటానికి ఎ లాంటి సమస్య లేదు. ప్రస్తుత రనవే విస్తరణ కోసం కృష్ణా జిల్లా యంత్రాం గం భూ సేకరణకు వెళితే అడ్డంకులు తలెత్తాయి. భూ సమీకరణ విధానంలో వెళ్లి తర్వాత 700 ఎకరాల సేకరణకు మార్గం సుగమైంది. మూడు నెలల కిందట జిల్లా యంత్రాంగం మొత్తం భూములను ఏఏఐకి స్వాధీనం చేసింది. భూములు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఏఏఐ చాలా వేగంగా ప్రక్రియను చేపట్టింది. ఏడాది కాలంలో రనవే విస్తరణ పనులను పూర్తి చేయాల్సి ఉంది.
Link to comment
Share on other sites

రేపటి నుంచి గన్నవరం ఏయిర్ పోర్టు పరిధిలో 144: సీపీ
 
విజయవాడ: శాంతిభద్రతల దృష్ట్యా శనివారం నుంచి గన్నవరం ఏయిర్ పోర్టు పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని సీపీ గౌతం సవాంగ్ ప్రకటించారు. ఆయుధాలు పట్టుకుని తిరిగినా...నలుగురు ఒకచోట గుమికూడినా చర్యలు తీసుకొంటామని ఆయన హెచ్చరించారు  enduku emi ayaindi
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...