Jump to content

Recommended Posts

Posted

విజయవాడ: నూతన రాజధానికి మరో కొత్త హంగు సిద్ధమైంది. అత్యాధునిక వసతులతో విమానాశ్రయ నూతన టెర్మినల్ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు టెర్మినల్ ప్రారంభోత్సవం, రన్‌వే విస్తరణకు శంకుస్ధాపన చేయనున్నారు. అమరావతి రాజధాని కావడంతో రాకపోకలు అమాంతం పెరిగాయి. రద్దీకనుగుణంగా ప్రస్తుత టెర్మినల్ చాలక పోవడంతో మరో టెర్మినల్‌ను కేవలం 15నెలల్లో పూర్తి చేసి రికార్డు సృష్టించారు. అత్యాధునికంగా నిర్మించిన ఈ టెర్మినల్ విజయవాడకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

 

 

https://youtu.be/5bZSFAKdKbU

Posted
అమరావతి వైభవం ఉట్టిపడేలా గన్నవరం ఎయిర్ పోర్ట్ ఇంటీరియర్

 

 
 

gannavaram-interiro-12012017-1.jpg

గన్నవరం విమానాశ్రయం నూతన శోభ సంతరించుకుంది. నేడు కొత్త టెర్మినల్‌ ప్రారంభోత్సవంతో పాటు రన్ వే నిర్మాణానికి భూమిపూజ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రుల చరిత్రతో పాటు అమరావతి వైభవం, విజయవాడ సాంస్కృతిక వైభవం, శిల్ప కళ, చరిత్ర ప్రతిబింబించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా దేశ విదేశాల్లో ఉన్న ఐదు వందల సంవత్సరాల నాటి అమరావతి శిల్పాల నమూనాలను విమానాశ్రయంలో ఏర్పాటు చేశారు. చైనా, లండన, ఆమెరికాతో పాటు మన దేశంలోనే వివిధ రాషా్ట్రల్లో ఉన్న అమరావతి శిల్పాల నమూనాలు ఇందులో ఉన్నాయి. ఈ నమూనాలను పర్యాటక శాఖ ఈడీ మల్లికార్జున ఆధ్వర్యంలో దేశవిదేశాల్లో 80 చోట్ల ప్రదర్శించారు. ఇప్పుడు వీటిని గన్నవరం విమానాశ్రయంలో ఏర్పాటు చేశారు. అమరావతి వైభవం తెలియజేసేందుకు జిల్లా కలెక్టర్‌ బాబు.ఎ దగ్గరుండి ఈడీ మల్లికార్జున్ తో వీటిని ఏర్పాటు చేయించారు.

gannavaram-interiro-12012017-2.jpg

gannavaram-interiro-12012017-3.jpg

 

gannavaram-interiro-12012017-4.jpg

gannavaram-interiro-12012017-5.jpg

gannavaram-interiro-12012017-6.jpg

gannavaram-interiro-12012017-7.jpg

gannavaram-interiro-12012017-8.jpg

gannavaram-interiro-12012017-9.jpg

Posted
గన్నవరం విమానాశ్రయం పేరు మారింది..
 

 

636198197169617277.jpg
విజయవాడ: రాష్ట్రం వేరు పడ్డాక గన్నవరం విమానాశ్రయం అనేక మార్పులకు లోనైంది. అనేకానేక కొత్త హంగులను సంతరించుకుంది. అంతేకాదు ఇక నుంచి తన పేరు కూడా మార్చుకోనుంది. రాజధాని పేరునే తన పేరుగా మార్చుకోనుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు గన్నవరం విమానాశ్రయానికి అమరావతి విమానాశ్రయంగా నామకరణం చేశారు. ఏపీలో విమానయాన రంగం అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయని ఆయన అన్నారు. విమానయానం అంటే కేవలం ప్రజారవాణా మాత్రమే కాదు, కార్గో రవాణా కూడా అని అశోక్ గజపతి రాజు తెలిపారు.
Posted

konnalaki bza kanumarugu aipoddi....bezawada ante ooru kaadu...naa baalyam

amaravati nidi nadi  kadu andrukala kala la rajdani dani lo vijayawada bhgame

Posted

టెర్మినల్‌ ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం

విపత్తులను తట్టుకునేలా భవన నిర్మాణాలు

కలెక్టర్‌ బాబు.ఎ

amr-gen7a.jpg

విమానాశ్రయం (గన్నవరం), న్యూస్‌టుడే : విజయవాడ విమానాశ్రయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సకల సౌకర్యాలతోపాటు తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా రూపొందించిన నూతన టెర్మినల్‌ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధంచేసినట్లు కృష్ణాజిల్లా కలెక్టరు బాబు.ఎ తెలిపారు. బుధవారం ఆయన గన్నవరం విమానాశ్రయంలో తుది మెరుగులు దిద్దుకుంటున్న టెర్మినల్‌ భవన పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టరు విలేకరులతో మాట్లాడుతూ.. సుమారు రూ.150 కోట్ల వ్యయంతో రికార్డు స్థాయిలో 14 నెలల్లో టెర్మినల్‌ పనులు పూర్తిచేసినట్లు చెప్పారు. తుపాను వంటి విపత్తులను సైతం తట్టుకునేలా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో భవనాలు నిర్మించినట్లు వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి సుజనా చౌదరి గురువారం లాంఛనంగా టెర్మినల్‌ భవనాన్ని ప్రారంభిస్తారని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న రన్‌వే పటిష్టీకరణ, విస్తరణ పనులకు సీఎం భూమిపూజ చేస్తారని చెప్పారు. అనంతరం కలెక్టరు రన్‌వే విస్తరణ భూమిపూజా కార్యక్రమం జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి నూతన టెర్మినల్‌ భనవం వద్దకు వచ్చే మార్గం, సభా ప్రాంగణం, లోపల ఆగమనం, నిర్గమనం ప్రాంతాల్లో జరుగుతున్న శుభ్రత కార్యక్రమాలను పరిశీలించారు. గురువారం ఉదయానికల్లా పూర్తి పరిశుభ్రత వాతావరణం నెలకొనాలని ఆదేశించారు. బోర్డింగ్‌ గదిలో ఏర్పాట్లు చేస్తున్న వేదికను, భూములిచ్చిన రైతులు ప్రముఖులు, మీడియా ప్రతినిధులు కూర్చునేందుకు చేస్తున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. భూములు ఇచ్చిని అల్లాపురం, బుద్దవరం, అజ్జంపూడి, కేసరపల్లి గ్రామాలకు చెందిన 400 మంది రైతులను సభకు ఆహ్వానించినట్లు కలెక్టరు తెలిపారు. రైతులందరికీ రాయితీ పంపిణీ చేస్తామన్నారు. ఈ పర్యటనలో విమానాశ్రయం డైరెక్టరు జి.మధుసూధనరావు, విజయవాడ ఉప కమిషనర్‌ కోయ ప్రవీణ్‌, ఏసీపీ రాజీవ్‌కుమార్‌, నూజివీడు ఆర్డీవో చెరుకూరి రంగయ్య, గన్నవరం తహసీల్దారు మాధురి, సమాచార పౌర సంబంధాల శాఖ నూజివీడు అదనపు పీఆర్‌వో రామారావు, విమానాశ్రయం ముఖ్య భద్రతా అధికారి రాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

amr-gen7b.jpg

Posted

 

గన్నవరం విమానాశ్రయం పేరు మారింది..

 

 

636198197169617277.jpg
విజయవాడ: రాష్ట్రం వేరు పడ్డాక గన్నవరం విమానాశ్రయం అనేక మార్పులకు లోనైంది. అనేకానేక కొత్త హంగులను సంతరించుకుంది. అంతేకాదు ఇక నుంచి తన పేరు కూడా మార్చుకోనుంది. రాజధాని పేరునే తన పేరుగా మార్చుకోనుంది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు గన్నవరం విమానాశ్రయానికి అమరావతి విమానాశ్రయంగా నామకరణం చేశారు. ఏపీలో విమానయాన రంగం అభివృద్ధికి అనేక అవకాశాలున్నాయని ఆయన అన్నారు. విమానయానం అంటే కేవలం ప్రజారవాణా మాత్రమే కాదు, కార్గో రవాణా కూడా అని అశోక్ గజపతి రాజు తెలిపారు.

 

:super:

Posted

Antha baagaane undi kaani even kotha terminal lo koodaa JetBridge/AirBridge facility undadani antunnaaru.

Not sure how many more years it takes to get a real aiport feeling :(

 

 

yeah you are right. second floor facilities lo ekkada adi mention cheyyaledu. it only said "service staircase". they should have built at least one jetbridge for now.

 

Migilinavanni latest standards prakaram chesi, ilantivi vadilesthara...undemo?

Guest Urban Legend
Posted

ilantidi okati pettataniki entha karchu ayiddi saami

 

 

flights e terminal varaku raavu

bus lo pattukupotharu ikkada nunchi

Guest Urban Legend
Posted

idhi chusthey oka idea vastadhi meeku

 

Posted

tpt sangathi telchandi mundu huh

Guest Urban Legend
Posted

avuna, 50 crores petti apron nirmistunnaru ani vundi ga previous article lo.

 

emo bro tarvatha chestharu emo ...present situation aithey idhi

Posted

tpt sangathi telchandi mundu huh

john bro, tpt airport meda nuvvu pade badaha lo 10% ayina rajikiya nayakulaki unte eppudu bagupadedi,kesineni nani lanti MP lekpovatam mi bad luck.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...