Jump to content

NTR Amaravati International Airport


Recommended Posts

YSR & KKR time lo Airport development ni tokki pettaru, for land acquisition they had to release 200+ Crores. But they did not do it for 10 years.

 

Appatlo chesunte takkuva dabbulatho land vachhedi to government, konni years back ee international status vachhedi.

 

YSR family is dead against development in Andhra. They want only their lands to developed around Idupulapaya.

Link to comment
Share on other sites

  • Replies 1.8k
  • Created
  • Last Reply

YSR & KKR time lo Airport development ni tokki pettaru, for land acquisition they had to release 200+ Crores. But they did not do it for 10 years.

 

Appatlo chesunte takkuva dabbulatho land vachhedi to government, konni years back ee international status vachhedi.

 

YSR family is dead against development in Andhra. They want only their lands to developed around Idupulapaya.

inko run way ravali, ippudu unna run way kuda 4400mt kipenchali farmers land isthara chudali

Link to comment
Share on other sites

అమరావతి నుంచి విదేశాలకు ఎయిర్‌ ఇండియా రెడీ !
 
636297400441644740.jpg
  • కోస్తా జిల్లాల నుంచి లక్షలాది సంఖ్యలో ఎన్‌ఆర్‌ఐలు
  •  పర్యాటకం, వ్యాపారాల రీత్యా విదేశాలకు భారీగా రాకపోకలు
  • విదేశాల్లో వేలాది సంఖ్యలో రాజధాని ప్రాంతం విద్యార్థులు
  •  విదేశీయులు కూడా భారీగా రాకపోకలు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ): అంతర్జాతీయ హోదాను అంది పుచ్చుకోవటంతో విజయవాడ విమానాశ్రయం నుంచి ప్రపంచ దేశాలకు విమాన సర్వీసులను నడిపేందుకు విమానయాన సంస్థలు ముందుకు వస్తున్నాయి. అంతర్జాతీయ విమాన సర్వీసులను నడపటానికి దేశీయ ప్రభుత్వ దిగ్గజ విమానయాన సంస్థ ’ ఎయిర్‌ ఇండియా ’ నుంచి స్పష్టమైన హామీ రాగా ఆసియా దేశాలకు నడిపేందుకు ఎయిర్‌ ఏషియా సంస్థ నుంచి సుముఖత వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. దేశీయ దిగ్గజ ప్రైవేటు విమానయాన సంస్థ అయిన ’ ఇండిగో ’ సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. అధికారికంగా దీనిపై ప్రకటన రావాల్సి ఉంది. కోస్తా జిల్లాల నుంచి లక్షలాది సంఖ్యలో ఎన్‌ఆర్‌ఐలు ఉన్నారు. కృష్ణాజిల్లాలో ఈ సంఖ్య అగ్రస్థానంలో ఉంది. ప్రతి వంద ఇళ్ళకు ఒక ఒక ఎన్‌ఆర్‌ఐ ఉన్నట్టు అంచనాలున్నాయి. విదేశీ విద్య, ప్రాజెక్టు వర్క్స్‌, ఉద్యోగాలు, ఉపాధి పొందటం, వ్యాపార లావాదేవీలు నిర్వహించటం , విదేశీ వస్తువుల కొనుగోళ్ళు తదితరాల రీత్యా లక్షలాది సంఖ్యలో ఎన్‌ఆర్‌ఐలు ఉన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోనే ఆరు లక్షల మంది ఎన్‌ఆర్‌ఐలు ఉంటారన్నది ఛాంబర్‌ వర్గాల అంచనా. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పర్యాటక స్థలాల సందర్శనల కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ప్రతి ఏడాది భారీ సంఖ్యలో విదేశాలకు వెళుతుంటారు. సింగపూర్‌, మలేషియా, థాయ్‌ల్యాండ్‌, హాంకాంగ్‌ , శ్రీలంక, యూఎస్‌ఏ, యూరప్‌ దేశాలు, దుబాయ్‌, కువైట్‌, ఆస్ర్టేలియా వెళ్ళేవారు ఎక్కువుగా ఉన్నారు. నమ్మలేని విషయం ఏమిటంటే.. జూదం ఆడటానికి విదేశాలకు వెళ్ళే సంపన్నులకు ఈ ప్రాంతంలో కొదువ లేదు. క్యాసినోవాలు మన దేశంలో నిషిద్ధం. జూదం, బెల్లీ డ్యాన్స్‌లు, బాడీ మసాజ్‌లతో కూడిన ’ క్యాసినోవా క్లబ్బుల కోసం .. ఆసియా దేశాలకు ట్రిప్పులు వేసే వారి సంఖ్య తక్కువ ఏమీ లేదు. ఆఫ్రికా ఖండ దేశాలకు వెళ్ళేవారి సంఖ్య ప్రధానంగా కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి ఎక్కువుగా ఉంటుందని నమ్ముతారా ? నమ్మాల్సిందే ! ఆఫ్రికా ఖండ దేశాలలో సహజ వనరులు అపారంగా ఉంటాయి. ఖనిజ వనరులు కూడా విపరీతంగా ఉంటాయి. రెండు జిల్లాల నుంచి ఎక్కువుగా ఖనిజ వనరుల వెలికితీత కోసం లీజులు పొందిన వారు కూడా ఉన్నారు.
 
             ఇవన్నీ పక్కన పెడితే .. విదేశాల నుంచి రాకపోకలు సాగించే విదేశీయుల సంఖ్య ఎక్కువుగా ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే వారి సంఖ్య గణనీయంగా ఉంటుంది. జపాన్‌, సింగపూర్‌, మలేషియా, నార్వే, న్యూజిలాండ్‌, ఇటలీ, అమెరికా, చైనా, రష్యా , ఆఫ్రికా తదితర దేశాల నుంచి వ్యాపార బృందాలు, పారిశ్రామిక బృందాలు తరలి వస్తున్నాయి. అమరావతి రాజధాని ప్రాంతం విదేశీయులను ఆకర్షిస్తోంది. ప్రపంచ స్థాయి రాజధానిని నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించటం, విదేశాలలో విపరీతమైన క్యాంపెయిన్‌ నిర్వహిస్తుండటంతో ఇక్కడ వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టడానికి అధ్యయనం చేయటానికి వచ్చే విదేశీ బృందాల సంఖ్య ఎక్కువుగా ఉంది. విదేశాల నుంచి ప్రధానంగా వెస్టిండీస్‌లోని కరేబియన్స్‌ కూడా వస్తున్నారు. విజయవాడ ఎడ్యుకేషన్‌ హబ్‌గా ఉండటం, చెంతనే రాజధాని రావటం వల్ల ఉన్నత సంస్థలు ఏర్పాటు అవుతాయన్న ఉద్దేశ్యంతోనూ వచ్చే వారి సంఖ్య ఎక్కువుగా ఉంది. విజయవాడలో విద్య నభ్యసించటానికి వెస్టిండీస్‌ తదితర దేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. విదేశాల నుంచి వివిధ ప్రాజెక్టుల మీద , డాక్యుమెంటరీలను చిత్రీకరించటానికి కూడా విదేశీయులు రాజధాని ప్రాంతానికి వస్తున్నారు.
 
           విదేశీయులు ఆంధ్రప్రదేశ్‌కు నేరుగా రాలేని పరిస్తితి. విదేశీయులు రావాలంటే హైదరాబాద్‌కు రావాల్సి వస్తోంది. అక్కడి నుంచి ప్రత్యేక బస్సులు, కార్లలో ఇక్కడికి రావాల్సి వస్తోంది. విదేశీయులకు తగిన ఆతిథ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌కే ఇప్పటి వరకు ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తోంది. విజయవాడలో ఫైవ్‌ స్టార్‌, ఫోర్‌ స్టార్‌ హోటల్స్‌ ఓ అరడజను వరకు నిర్మాణ దశలో ఉన్నాయి. ఓ ఇరవై వరకు త్రీస్టార్‌, బడ్జెట్‌ హోటల్స్‌ ఏర్పాటు జరిగాయి. ఈ నేపథ్యంలో, విజయవాడ ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ స్థాయి రావటం శుభపరిణామం. అంతర్జాతీయ స్థాయి హోదాతో ఎయిర్‌పోర్టులో మెరుగైన మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవాల్సి ఉంది.
అయితే వీటిని అంది పుచ్చుకోవటానికి ఓ ఏడాది సమయం పడుతుంది. రన్‌వే విస్తరణ జరుగుతోంది. ఇంటర్నేషనల్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ కూడా పూర్తి కావాల్సి ఉంది. రూ 516 కోట్ల వ్యయంతో ఇంటి గ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ లోపు పాత టెర్మినల్‌ను ఆధునీకరించి అందుబాటులోకి తీసుకు రావటానికి ఇప్పటికే టెం డర్లు కూడా పిలిచారు. కస్టమ్స్‌ , ఇమ్మిగ్రేషన్‌ శాఖల కోసం కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఎయిర్‌ ఇండియా సంస్థకు ముందుకు రావటం , ప్రైవేటు సంస్థలు సానుకూలంగా స్పందించటం శుభసూచికం
Link to comment
Share on other sites

ఎయిర్‌ ఇండియా కోసం ప్రయత్నాలు !!
 
636303541509222839.jpg
  • హైదరాబాద్‌ నుంచి నడిచే విమానాన్ని ఇటు మరల్చటానికి కృషి
  • అంతర్జాతీయ సర్వీసుల కోసం అజయ్‌జైనతో త్వరలో భేటీ
విజయవాడ: ముంబైకి విజయవాడ విమానాశ్రయం నుంచి నేరుగా విమాన సర్వీసును నడపటానికి ఆసక్తి చూపిన ‘జూమ్‌’ ఎయిర్‌లైన్స్ ఆ ప్రతిపాదన నుంచి అర్థంతరంగా తప్పుకోవటంతో.. విమానాశ్రయ అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపడుతున్నారు. ముంబైకి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ చివరి నిమషంలో జూమ్‌ ఎయిర్‌లైన్స హ్యాండ్‌ ఇవ్వటంతో.. ఈ స్థానాన్ని ‘ఎయిర్‌ ఇండియా’ తో భర్తీ చేయాలని ఏఏఐ అధికారులు చర్యలు చేపట్టారు. ఎయిర్‌ ఇండియాతో ఇప్పటికే ప్రాంతీయంగానూ, జాతీయ స్థాయిలోని ఉన్నతాధికారులు కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఎయిర్‌ఇండియా నుంచి ఇంకా సుముఖత రావాల్సి ఉంది. జూమ్‌ ఎయిర్‌లైన్స ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం చూస్తే.. ఈ పాటికే ముంబై, జైపూర్‌లకు విమానాలు తిరిగేవి. దేశ వ్యాప్తంగా జూమ్‌ ఎయిర్‌లైన్స తీసుకున్న అంతర్గత సర్వీసుల మదింపు - కుదింపు నేపథ్యంలో, విజయవాడ నుంచి నడపాలనుకున్న ముంబై, జైపూర్‌ సర్వీసులను అర్థంతరంగా రద్దు చేసుకుంది. వెంటనే విజయవాడ ఎయిర్‌పోర్టు అధికారులకు తన నిర్ణయాన్ని తెలియపరిచింది. మే నెలలో ముంబై, జైపూర్‌ నగరాలకు విమాన సర్వీసులు నడపటమే తరువాయి అనుకున్న విజయవాడ ఎయిర్‌పోర్టు అథికారుల ఆనందం ఒక్కసారిగా ఆవిరైపోయింది. ఇదే సమయంలో స్పైస్‌ జెట్‌ సంస్థ కూడా వారణాసికి వెళ్ళే విమాన సర్వీసును రద్దు చేసుకోవటంతో విమానాశ్రయ అధికారులు హతాశులయ్యారు. అంతర్జాతీయ స్థాయికి ఎదిగే దశలో ఉండగా.. విమాన సర్వీసులను రద్దు కావటంతో నిశ్చేష్టులైన అధికారులు తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టారు. దేశీయంగా ఇండిగో వంటి పలు విమానయాన సంస్థలతో మరిన్ని నగరాలకు విమాన సర్వీసుల కోసం సంప్రదింపులు చేశారు. ఇవన్నీ చర్చల దశలో ఉండగానే.. విజయవాడ ఎయిర్‌పోర్టుకు అంతర్జాతీయ హోదాను కల్పించటానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇంకా అధికారికంగా ప్రకటించడానికి, నోటిఫికేషన వెలువరించటానికి ఓ సంవత్సరం సమయం పడుతుంది. ఈ క్రమంలో ఎయిర్‌పోర్టు అధికారులు ఇటు దేశీయంగా మరిన్ని నగరాలకు ఎయిర్‌ కనెక్టివిటీ పెంచే దిశగా, అంతర్జాతీయంగా విదేశీ విమానయాన సంస్థలతో సంప్రదింపులు చేయాలన్న ఉద్దేశ్యంతోనూ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ముందుగా దేశీయ విమాన సర్వీసులను పెంపొందించుకునేందుకు దృష్టి సారించారు. దేశ నెంబర్‌వన ఆర్థిక నగరం ముంబైకి విమాన సర్వీసును నడపటం గర్వకారణమైన విషయం. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రధానంగా ముంబైకి సర్వీసును తిప్పాలన్న కసితో అధికారులు ఉన్నాయి. జూమ్‌ సంస్థ వెనుకడుగు వేసినా ఢిల్లీకి సర్వీసులను నడుపుతున్న ఎయిర్‌ ఇండియా సంస్థ ద్వారా ముంబాయికి విమాన సర్వీసును నడిపించాలన్న ప్రయత్నాలు ఆరంభించారు. ఎయిర్‌ ఇండియా సంస్థ ఆసక్తి చూపితే దేశ వాణిజ్య నగరం ముంబైకి విజయవాడ నుంచే నేరుగా రాకపోకలు సాగించటానికి అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి ముంబాయి వెళ్లే ఎయిర్‌ ఇండియా విమానాన్ని విజయవాడకు లింక్‌ కలిపించాలన్న పట్టుదలతో ఇక్కడి ఏఏఐ అధికారులు ఉన్నారు.
 
అంతర్జాతీయ విమానాల సాకారం దిశగా
అంతర్జాతీయ హోదా వస్తున్న నేపథ్యంలో, విదేశీ విమానయాన సంస్థలతో సంప్రదింపులకు అధికారులు తెరలేపుతున్నారు. విదేశీ పర్యటనను ముగించుకుని వచ్చి అజయ్‌ జైనతో భేటీ కావాలని ఏఏఐ అధికారులు భావిస్తున్నారు. ద్వైపాక్షిక భాగస్వామ్య విధానంలో ఆయా దేశాల విమానయాన సంస్థలకు ప్రతిపాదనలు పంపించి వాటిని ఫలవంతం చేయటంపై దృష్టి సారించనున్నారు.
Link to comment
Share on other sites

చక చకా రన్‌వే విస్తరణ
 
636303542423201409.jpg
  • వేగవంతంగా మట్టి లైనింగ్‌ పనులు
  • వచ్చే నెల నుంచి హాట్‌ మిక్సింగ్‌ పనులు
విజయవాడ: గన్నవరం ఎయిర్‌పోర్టు రనవే విస్తరణ పనులు ముమ్మరమయ్యాయి. తొలి దశలో చేపట్టిన మట్టి లైనింగ్‌ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. బుద్దవరం గ్రామానికి వెళ్ళే రహదారి ఆవల నుంచి రనవే విస్తరణ పనులు ముందుగా ప్రారంభించారు. ఈ రోడ్డు ఆవలగా 698 ఎకరాల భూములను జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఎయిర్‌పోర్టు అధికారులకు అప్పగించింది. రెవెన్యూ శాఖ అప్పగించిన భూములను పెగ్‌ మార్కింగ్‌ చేసుకున్న ఎయిర్‌పోర్టు అఽథారిటీ వాటిలో పనులు ప్రారంభించటానికి టెండర్లను పిలిచింది. కాంట్రాక్టు దక్కించుకున్న పీఆర్‌ఎల్‌ సంస్థ తక్షణం పనులు ప్రారంభించింది. ఎర్త్‌ఫిల్లింగ్‌ పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించింది. ఎర్త్‌ ఫిల్లింగ్‌కు సమస్య ఎదురైతే అప్పటి కలెక్టర్‌ బాబు తోటపల్లిలోని బ్రహ్మయ్య లింగం చెరువు మట్టిని తీసుకువెళ్ళేందుకు అనుమతులు ఇచ్చారు. ప్రతి రోజూ వందలాది భారీ ట్రిప్పర్లతో బ్రహ్మయ్యలింగం చెరువు నుంచి మట్టిని తరలిస్తున్నారు. ప్రస్తుత రనవేతో పోల్చుకుంటే స్వాధీనం చేసుకున్న భూములు చాలా లోతట్టులో ఉన్నాయి. దీంతో పెద్ద ఎత్తున ఎర్త్‌ ఫిల్లింగ్‌ చేయాల్సి వస్తోంది. ప్రస్తుత రనవేకు సమాంతరంగా మట్టిని చదును చేస్తున్నారు. పలు దఫాలు చదును చేయించిన తర్వాత హాట్‌మిక్స్‌, వెట్‌ మిక్స్‌ లేయర్ల కాంక్రీట్‌ వేయటానికి వీలుగా మట్టి నింపుతున్నారు.. వెట్‌మిక్స్‌, హాట్‌మిక్స్‌ పనులను తర్వాత వేగంగా చేపట్టడానికి వీలుగా కాంట్రాక్టు సంస్థ క్రషర్‌లను సిద్ధం చేసుకుని కంకర చిప్స్‌ తయారు చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుత రనవే బేస్‌ నుంచి మార్కింగ్‌ పనులు చేపడుతున్నారు. బుద్ధవరం రోడ్డు అభివృద్ధి చేపట్టేందుకు వీలుగా ఆర్‌ అండ్‌ బీకి, రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. జూన నెలలో ఎర్త్‌ ఫిల్లింగ్‌ పనులను పూర్తి చేసి, హాట్‌ మిక్సింగ్‌ పనులకు సిద్ధమవ్వాలని నిర్ణయించారు.
Link to comment
Share on other sites

గన్నవరం ఎయిర్‌పోర్టు రన్ వే విస్తరణ పనులు ముమ్మరం
 
636304330127773456.jpg
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
గన్నవరం ఎయిర్‌పోర్టు రన్ వే విస్తరణ పనులు ముమ్మరమయ్యాయి. రన్ వే విస్తరణ పనులలో భాగంగా తొలి దశలో చేపట్టిన మట్టి లైనింగ్‌ పనులు దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. బుద్దవరం గ్రామానికి వెళ్ళే రహదారి ఆవల నుంచి రన్ వే విస్తరణ పనులు ముందుగా ప్రారంభించారు. ఈ రోడ్డు ఆవలగా ఉన్న 698 ఎకరాల భూములను జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఎయిర్‌పోర్టు అథికారులకు అప్పగించింది. రెవెన్యూ శాఖ అప్పగించిన భూములను పెగ్‌ మార్కింగ్‌ చేసుకున్న ఏఏఐ వాటిలో పనులు ప్రారంభించటానికి టెండర్లను పిలిచింది. టెండర్లలో కాంట్రాక్టును దక్కించుకున్న పీఆర్‌ఎల్‌ సంస్థ తక్షణం పనులు ప్రారంభించింది. ఎర్త్‌ఫిల్లింగ్‌ పనులను యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించింది. ఎర్త్‌ ఫిల్లింగ్‌కు సమస్య ఎదురైతే అప్పటి కలెక్టర్‌ బాబు తోటపల్లిలోని బ్రహ్మయ్య లింగం చెరువు మట్టిని తీసుకు వెళ్ళేందుకు అనుమతులు ఇచ్చారు. ప్రతి రోజూ వందలాది భారీ ట్రిప్పర్లతో బ్రహ్మయ్యలింగం చెరువు నుంచి మట్టిని తరలిస్తున్నారు. ప్రస్తుత రనవే తో పోల్చుకుంటే స్వాధీనం చేసుకున్న భూములు చాలా లోతట్టుతో ఉన్నాయి. దీంతో పెద్ద ఎత్తున ఎర్త్‌ ఫిల్లింగ్‌ చేయాల్సి వస్తోంది. ప్రస్తుత రన్ వేకు సమాంతరంగా మట్టిని చదును చేస్తున్నారు. పలు దఫాలు చదును చేయించిన తర్వాత.. హాట్‌మిక్స్‌, వెట్‌ మిక్స్‌ లేయర్ల కాంక్రీట్‌ వేయటానికి వీలుగా ఎర్త్‌ఫిల్‌ను కట్‌ చేస్తున్నారు. ప్రస్తుత రన్ వేకు అనుగుణంగా సమాంతరంగా తీసుకు రావాలంటే చదునుచేసిన ఎర్త్‌ఫిల్‌ను కట్‌ చేయాల్సి వస్తోంది. వెట్‌మిక్స్‌, హాట్‌మిక్స్‌ పనులను తర్వాత వేగంగా చేపట్టడానికి వీలుగా కాంట్రాక్టు సంస్థ క్రషర్‌లను సిద్ధం చేసుకుని కంకర చిప్స్‌ తయారు చేస్తున్నారు. మరోవైపు ప్రస్తుత రన్ వే బేస్‌ నుంచి మార్కింగ్‌ పనులు చేపడుతున్నారు. బుద్ధవరం రోడ్డును విస్తరించే రనవే చివరి నుంచి నూతన రోడ్డును అభివృద్ధి చేయాల్సి ఉంది. ఈ రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు వీలుగా ఆర్‌ అండ్‌బీకి, రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. జూన నెలలో ఎర్త్‌ ఫిల్లింగ్‌ పనులను పూర్తి చేసి.. హాట్‌ మిక్సింగ్‌ పనులను సిద్ధమవ్వాలని నిర్ణయించారు. విజయవాడ విమానాశ్రయం నుంచి అంతరాష్ట్ర సర్వీసుల్లో ఢిల్లీ, బెంగళూరు ప్రాంతాల్లో ఎయిర్‌ఇండియా, స్పైస్‌జెట్‌ సంస్థల మోనోపలి అప్రతిహతంగా కొనసాగుతోంది. ఢిల్లీ, బెంగళూరు నగరాలకు ఇటు ప్రయాణికుల పరంగాను, అటు విమానసర్వీసుల పరంగా ఎక్కువ వృద్ధి కనిపిస్తోంది. ఈ రెండు అంతర్రాష్ట్ర రూట్లలో అనూహ్య పురోగతి కనిపిస్తోంది.
భారత ప్రభుత్వ దిగ్గజ విమానయాన సంస్థ అయిన ఎయిర్‌ ఇండియా విజయవాడ నుంచి ఢిల్లీకి సర్వీసులను నడుపుతోంది. ఢిల్లీకి సర్వీసులు నడిపే విషయంలో ఎయిర్‌ఇండియాకు పోటీ లేని పరిస్థితి ఏర్పడింది. ఢిల్లీకి హైదరాబాద్‌ కనెక్టివిటీతో ఒక్క సర్వీసును ప్రవేశపెట్టిన ఎయిర్‌ఇండియా ఆ తర్వాత రెండు ఫ్లైట్లను నేరుగా ఢిల్లీకి నడుపుతోంది. విజయవాడ-ఢిల్లీ మార్గంలో విజయవాడ నుంచి ఎయిర్‌ఇండియా సర్వీసులు మాత్రమే నడుస్తున్నాయి.
 ఉదయం నేరుగా ఢిల్లీకి విమాన సర్వీసు నడుస్తోంది. ఉదయం 8.30 గంటలకు ఇక్కడకు వస్తుంది. ఇక్కడి నుంచి 9.20 గంటలకు బయలు దేరుతుంది. మధ్యాహ్నం 4.60 గంటలకు ఇక్కడికి ఫైట్‌ వస్తుంది. తిరిగి సాయంత్రం 5.40 గంటలకు ఇక్కడి నుంచి బయలు దేరుతుంది. రాత్రి 7.55 గంటలకు విమాన సర్వీసు వస్తుంది. తిరిగి 8.40 గంటలకు బయలు దేరుతుంది. ఈ సర్వీసు హైదరాబాద్‌కు కనెక్ట్‌ అవుతుంది. రెండేళ్ళ కాలంలో ఢిల్లీకి మూడు విమాన సర్వీసుల ఎయిర్‌ ఇండియా ఆధిపత్యం నడుస్తోంది. ఈ రూట్‌లో ఎయిర్‌ ఇండియాకు 80-85 మధ్య ఆక్యుపెన్సీ వస్తోంది.
ఫబెంగళూరు ప్రాంతానికి వస్తే.. విజయవాడ నుంచి స్పైస్‌జెట్‌ సంస్థ ఆధిపత్యం కొనసాగుతోంది. విజయవాడ-బెంగళూరు రూట్‌లో స్పైస్‌జెట్‌ సంస్థ మూడు సర్వీసులను నడుపుతోంది. ప్రస్తుతం ఉదయం 7.25 గంటలకు విజయవాడ వస్తుంది. విజయవాడ నుంచి 7.35 గంటలకు బెంగళూరు బయలు దేరుతుంది. మధ్యాహ్నం 1.10 గంటలకు విజయవాడకు విమానం వస్తుంది. 1.40 గంటలకు ఇక్కడి నుంచి బెంగళూరు బయలుదేరుతుంది. రాత్రి 7.35 గంటలకు వస్తుంది. ఇక్కడి నుంచి 8.00 గంటలకు బయలు దేరుతుంది. బెంగళూరు రూట్‌లో గతంలో ఎయిర్‌కోస్తా సర్వీసును నడిపేది. ఎయిర్‌కోస్తా విమానాలు రద్దు కావటంతో ఈ రూట్‌లో స్పైస్‌జెట్‌ ఏకఛత్రాధిపత్యం చేస్తోంది.
మరో అంతరాష్ట్ర రూట్‌ చెన్నైలో ఏ విమానయాన సంస్థ ఆధిపత్యం నడవటం లేదు. స్పైస్‌జెట్‌, ట్రూజెట్‌ సంస్థలు రెండేసి సర్వీసులతో మొత్తం నాలుగుసర్వీసులు నడుపుతున్నాయి. ఈరూట్‌ విమానయానసంస్థలు మిశ్రమ ఆపరేషన్స్ నడుస్తున్నాయి. పొరుగు తెలుగు రాష్ట్రం హైదరాబాద్‌కు సర్వీసులు తగ్గటం గమనార్హం. ఎయిర్‌కోస్తా రద్దు వల్ల రెండు విమాన సర్వీసులు నిలిచిపోయాయి. వారణాసికి విమాన సర్వీసు రద్దుకావటం వల్ల లింక్‌గా హైదరాబాద్‌కు వెళ్ళాల్సిన విమానం కూడా రద్దయింది. ప్రస్తుతం స్ర్పైస్‌జెట్‌, ట్రూజెట్‌ సంస్థలు మాత్రమే ఈ రూట్‌లో ఆపరేషన్స నిర్వహిస్తున్నాయి.
Link to comment
Share on other sites

విజయవాడ ఎయిర్‌పోర్టుపై ‘ఇండిగో’ దృష్టి
 
636306955438845001.jpg
అగ్రస్థానంలోకి దూసుకుపోతున్న విజయవాడ ఎయిర్‌పోర్టుపై దేశీయ దిగ్గజ ప్రైవేటు విమానయాన సంస్థ ‘ఇండిగో’ దృష్టి సారించింది. ఎయిర్‌పోర్టులో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయన్న దానిపై ఇండిగో బృందాలు అధ్యయనం చేసేందుకు త్వరలో రానున్నాయి. ఇండిగో ఎయిర్‌లైన్స ప్రధానంగా ఎయిర్‌బస్‌ 320, ఎయిర్‌బస్‌ 321, ఏటీఆర్‌ 72 శ్రేణి విమానాలను నడపటానికి వీలుగా ఉన్న పరిస్థితులను అధ్యయనం చేయనున్నది.
 
(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
వృద్ధిరేటులో అగ్రస్థానంలోకి దూసుకుపోతున్న విజయవాడ ఎయిర్‌పోర్టుపై దేశీయ దిగ్గజ ప్రైవేటు విమానయాన సంస్థ ‘ఇండిగో’ దృష్టి సారించింది. విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు విమాన సర్వీసులు నడపటానికి సాధ్యాసాధ్యాల(ఫీజుబిలిటీ)ను అధ్యయనం చేయటానికి రంగంలోకి దిగిం ది. బుధవారం ఇండిగో ఎయిర్‌లైన్స ముఖ్య ప్రతినిధులు విజయవాడ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ గిరి మధుసూదనరావును ఫోన్ లో సంప్రదించారు. విమాన ఆపరేషన్సకు తగిన పరిస్థితుల ను అధ్యయనం చేయటానికి వ స్తామని అపాయింట్‌మెంట్‌ కావాలని కోరారు. ఈ క్రమంలో జూన్ 15, 16 తేదీలలో ‘ఇండిగో’ విమానయా న సంస్థ టెక్నికల్‌ బృందం విజయవాడ రాబోతోంది. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవి యేషన (డీజీసీఏ) నియమ నిబంధనల ప్రకా రం విజయవాడ ఎయిర్‌పోర్టులో ఎలాంటి సదుపాయాలు ఉన్నాయన్న దానిపై ఇండిగో బృందాలు అధ్యయనం చేయనున్నాయి. ప్రధానంగా రన్‌వే, టాక్సీ వే, ఆఫ్రాన్స, పా ర్కింగ్‌ బేలు, అగ్నిమాపక విభాగం అందిస్తున్న సేవలు, నైట్‌ల్యాండింగ్‌, ఐఎల్‌ఎస్‌ తదితర సాంకేతిక వ్యవస్థల అందుబా టుపై అధ్యయనం చేయటంతోపాటు ఇతర విమానయాన సంస్థలు అందించే సేవలు, వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల వివరాలు, విమాన ఆపరేషన్స నిర్వహణ వంటి వాటికి సంబంధించి సమగ్ర అధ్యయనం జరపనున్నది. దీంతోపాటు టవర్‌లో పనిచేసే అధికారులు, సిబ్బందితో కూడా ఇండిగో టెక్నికల్‌ బృందాలు భేటీ కానున్నాయి. ట్రాఫిక్‌, ఇతర సాంకేతిక సేవలకు సంబంధించి టవర్‌ అధికారులు, సిబ్బందితో మాట్లాడే అవకాశం ఉంది.
 
గతంలోనే సంప్రదింపులు
ఇండిగో విమానయాన సంస్థ విజయవాడ నుంచి ఆపరేషన్స నిర్వహించటం కోసం కొంత కాలం కిందట విజయవాడ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ మధుసూదనరావు ఆ సంస్థ మార్కెటింగ్‌ విభాగ వైస్‌ ప్రెసిడెంట్‌తో సంప్రదింపులు జరిపారు. అప్పట్లో ఇండిగో ఆసక్తి చూపినా.. ఎందుకో ముందుకు వెళ్లలేదు. తాజా గా దేశీయంగా విజయవాడ ఎయిర్‌పోర్టు ప్రగతి సాధించటం, అంతర్జాతీయ హోదాను కూడా సాఽధించటంతో .. ఇండిగో ఇటు దృషి ్టసారించింది.
 
ఇండిగో వస్తే.. దశ తిరిగినట్టే :
ఇప్పటివరకు విజయవాడ ఎయిర్‌పోర్టు నుంచి నడిచిన విమానయాన సంస్థలన్నీ ఒక ఎత్తయితే.. ఇండిగో ఎయిర్‌లైన్స ఒక్కటే మరో ఎత్తు. దేశంలోని అతిపెద్ద ప్రైవేటు వి మానయాన సంస్థ అయిన ఇండిగో ప్రణాళికా బద్ధంగా సర్వీసులు నడుపుతుంటుంది. ఇండిగో విమానయాన సంస్థ ఏదై నా ఎయిర్‌పోర్టు నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలంటే ఆషా మాషీగా అడుగు పెట్టదు. ఎంతో అధ్యయనం చేస్తుంది. ఫలా నా ఎయిర్‌పోర్టు నుంచి సర్వీసులు నడపాలనుకుంటే ఒకటి, రెండు సర్వీసులతో ప్రారంభించదు. పెద్దమొత్తంలో సర్వీసుల ను నడుపుతుంది. దేశంలోని నలుమూలలకు కనెక్టివిటీ అయ్యే లా సర్వీసులు ప్రవేశపెడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎయిర్‌పోర్టుకు ఇండిగో ఎయిర్‌లైన్సను తీసుకు రావాలన్న ప్రయత్నాలను ఎయిర్‌పోర్టు అధికారులు పట్టువిడవకుండా చేస్తున్నారు. ఇండిగో ఆసక్తి చూపించటంతో ఎయిర్‌పోర్టు అధికారులు ఆనందంతో ఉన్నారు.
 
మౌలిక సదుపాయాలపై నివేదికలు
ఇండిగో సంస్థ టెక్నికల్‌ బృందం విజయవాడ వస్తే.. ఎయి ర్‌పోర్టుకు సంబంధించిన సమస్త సమాచారంతో పాటు మౌలిక సదుపాయాల గురించి నివేదిక ఇవ్వటానికి ఇక్కడి అధికారులు సిద్ధమౌతున్నారు. విజయవాడలో రనవే విస్తరణ, పార్కింగ్‌ బేలు, ఆఫ్రాన్స, నూతన టెర్మినల్‌ బిల్డింగ్‌, టాక్సీవే, రోడ్లు, లైటింగ్‌ వ్యవస్థ, సాంకేతిక పరిజ్ఞానం, ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌, తాత్కాలిక ఇంటర్నేషనల్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ ఆధు నికీకరణ పనులు, కార్గో టెర్మినల్‌ బిల్డింగ్‌ తదితర అభివృద్ధి పనులను వివరించటానికి రంగం సిద్ధం చేస్తున్నారు.
Link to comment
Share on other sites

  • 2 weeks later...

గన్నవరం కేంద్రంగా..ఇండిగో!

విమానాలను నిలిపేందుకు పార్కింగ్‌ బేస్‌ కేటాయింపు..

ఈనెల 29, 30న పర్యటించనున్న సాంకేతిక బృందం

ఈనాడు - అమరావతి

గన్నవరం విమానాశ్రయం నుంచి సర్వీసులను నడిపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సంస్థ అధ్యయనం చేస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 29, 30 తేదీల్లో ఆ సంస్థకు చెందిన సాంకేతిక బృంద సభ్యులు గన్నవరం విమానాశ్రయానికి రానున్నారు. ఇక్కడ నుంచి సర్వీసులను దేశంలోని ఇతర నగరాలకు నడిపేందుకు ఉన్న అనుకూల, ప్రతికూల పరిస్థితులను ఈ బృందం పరిశీలించనుంది. ఇండిగో ఇక్కడి నుంచి త్వరితగతిన విమానాలను నడిపేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా మూడు నాలుగు విమానాలను ఇక్కడ ఉంచుకునేందుకు పార్కింగ్‌ బేలను కేటాయించేందుకు సిద్ధమవుతున్నారు. 29న వారితో చర్చించాక దీనిపై ప్రకటన చేయనున్నారు. గన్నవరంలో 2015 వరకూ రోజుకు కేవలం 15 సర్వీసులు మాత్రమే నడిచేవి. ప్రస్తుతం ఇక్కడ నుంచి నిత్యం 32 సర్వీసులు దేశంలోని ప్రధాన నగరాలకు వెళ్తున్నాయి. ప్రస్తుతం విమానాశ్రయం నుంచి ఎయిరిండియా, స్పైస్‌జెట్‌, ట్రూజెట్‌ సంస్థలు సర్వీసులు నడుపుతున్నాయి. ఈ మూడు సంస్థలూ హైదరాబాద్‌ కేంద్రంగానే రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఇండిగో రాత్రి పార్కింగ్‌ ఏర్పాటు చేసుకుంటే..గన్నవరం కేంద్రంగా నడిచే తొలి విమానయాన సంస్థ అదే అవుతుంది.

ముంబయికి జూమ్‌ సర్వీసులు లేనట్టే..

గన్నవరం విమానాశ్రయం, ముంబయి మధ్య మే 22 నుంచి నడుపుతామని ప్రకటించిన జూమ్‌ ఎయిర్‌లైన్స్‌ సంస్థ సర్వీసులు ఇక లేనట్టే. ముంబయి విమానాశ్రయంలో జూమ్‌ ఎయిర్‌లైన్స్‌ సర్వీసులు దిగేందుకు అవసరమైన స్లాట్లు దొరక లేదు. చాలాకాలంగా గన్నవరం నుంచి ముంబయికి సర్వీసును ఏర్పాటు చేయాలని ఇక్కడివాళ్లు కోరుతున్నారు. నిత్యం ఇక్కడి నుంచి ముంబయికి వెళ్లేవారంతా ప్రస్తుతం హైదరాబాద్‌ మీదుగా వెళ్తున్నారు.

హైదరాబాద్‌-ముంబయి సర్వీసు పొడిగింపు..

ప్రస్తుతం ముంబయి-హైదరాబాద్‌ మధ్య నడిచే ఎయిరిండియా సర్వీసును గన్నవరం వరకూ పొడిగించాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఎయిరిండియాతో విమానాశ్రయ అధికారులు చర్చలు జరుపుతున్నారు. గతంలో దిల్లీకి సైతం నేరుగా విమానం లేకపోవడంతో..హైదరాబాద్‌ వరకూ నడిచే విమానాన్ని ఇక్కడికి పొడిగించారు. ప్రస్తుతం ముంబయికి సైతం అదే విధంగా చేయనున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...