Jump to content

Recommended Posts

Guest Urban Legend
Posted

runway terminal ki daridapullo kuda ledu anukuntaga

 

alage vuntayi ga

hyd airport kuda alage vuntadhi ...

Posted
ఎన్టీఆర్‌ ఎయిర్‌పోర్టు అమరావతి టెర్మినల్‌గా ఇక ఖ్యాతి !
 
636198870458042194.jpg
  • అన్నా.. నీకు వందనం!
  • ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన 
  •  ఏఏఐ, సివిల్‌ ఏవియేషన్‌ ఉన్నతాధికారులకు విజ్ఞప్తి 
  • ఆమోదం తెలిపిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
కృష్ణాజిల్లాలో పుట్టి.. తెలుగు కళామ తల్లిలో ఒదిగి.. తెలుగు చలన చిత్రసీమలో రారాజుగా వెలుగొంది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కు ముఖ్యమంత్రిగా పని చేసిన ధృవతార అన్న నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్‌) పేరుతో అమరావతిగ టెర్మినల్‌గా ఇక విజయవాడ ఎయిర్‌పోర్టు నూతన టెర్మినల్‌ బిల్డింగ్‌ భాసిల్లబోతోంది. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్‌ అంగీకారం, కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో అన్న ఎన్టీఆర్‌ పేరుతో, అమరావతి పేరును జోడించుకుని చరితార్థం కాబోతోంది. విజయవాడ నూతన ఇంటీరియమ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రకటన చేశారు. సభా వేదికపై సీఎం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేయటం విశేషం. అంతకు ముందు ఉదయం విజయవాడలోని గేట్‌వే హోటల్‌లో జరిగిన ఏవియేషన్‌ సమ్మిట్‌లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు అమరావతి ఎయిర్‌పోర్టుగా నామకరణం చేయనున్నట్టు సూచన ప్రాయంగా తెలిపారు. ఆ తర్వాత టెర్మినల్‌ బిల్డింగ్‌ ప్రారంభోత్సవ కార్య క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై స్పందిస్తూ అన్న ఎన్టీఆర్‌ పేరును ముందు ఉదహరిస్తూ అమరావతిని కూడా కలుపుతూ ఎన్టీఆర్‌ ఎయిర్‌పోర్టు అమరావతి టెర్మినల్‌గా నామకరణం చేయాలన్న ఆలోచన ఉందని చెప్పారు. వేదిక మీద ఉన్న కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులందరిదీ ఒకటే మాట, ఒకటే బాట అని చెబుతూ ముక్తకంఠంతో తామంతా ఈ పేరును ప్రతిపాదిస్తున్నట్టు సివిల్‌ ఏవియేషన్‌, ఏఏఐ ఉన్నతాధికారులకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. సభా వేదికపైనే కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్‌ గజపతిరాజు ఈ ప్రతిపాదనపై హర్షం వ్యక్తం చేవారు. దీనిపై కార్యక్రమం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తగిన ప్రతిపాదనను చేస్తూ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరుగుతుందని, అసెంబ్లీ తీర్మానం వచ్చిన తర్వాత పార్లమెంట్‌ ఆమోదం పొందిన వెంటనే దీనికి సంబంధించి ప్రక్రియను వేగంగా పూర్తి చేయనున్నట్టు చెప్పారు.
Posted
  • అతిత్వరలో మూడు నాలుగు రెట్ల విలువ చేసే ప్లాట్ల కేటాయింపు 
  • మల్లవల్లిలో ఫ్రైట్‌ స్టేషన్‌ ఏర్పాటుకు 100 ఎకరాలు 
  • ముఖ్యమంత్రి చంద్రబాబు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ/ గన్నవరం): ‘నాకు ఇప్పుడు సంతృప్తి, సంతోషంగా ఉంది. శాశ్వత ప్రాతిపదికన టెర్మినల్‌ బిల్డింగ్‌, అంతర్జాతీయ విమానాలు తిరిగే పరిస్థితి వచ్చింది. అమరావతి రాజధానికి ఖ్యాతి తెచ్చేలా విజయవాడ ఎయిర్‌పోర్టు అభివృద్ధికి భూములిచ్చిన రైతులకు నా పాదాభివందనం. మీకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదు. వ్యవసాయం చేసుకుంటే లేదా అమ్ముకుంటే ఎంత ఆదాయం వస్తుందో దానికి మూడు నాలుగు రెట్ల ఆదాయం వచ్చేలా అమరావతి రాజధానిలో అతి త్వరలో మీకు ప్లాట్లు కేటాయిస్తాం’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం రన్‌వే విస్తరణకు భూమిపూజ నిర్వహించిన తర్వాత విజయవాడ విమానాశ్రయ నూతన టెర్మినల్‌ బిల్డింగ్‌ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. విమానాశ్రయ విస్తరణకు రైతులు 750 ఎకరాల భూములను అప్పగించారని, ఒక్కో ఎకరం ఖరీదు రూ.3 కోట్ల చొప్పున.. అక్షరాలా రూ.2,250 కోట్ల ఆస్తిని మీ చేతుల్లో పెడుతున్నామని ఏఏఐ, సివిల్‌ ఏవియేషన్‌ ఉన్నతాధికారులకు తెలిపారు. రహదారుల కోసం బుద్దవరం గ్రామాల్లో స్థలాలను తీసుకోవాల్సి వచ్చిందని ప్రత్యామ్నాయ రహదారులను ఏర్పాటు చెప్పారు. కుటీర పరిశ్రమలు పోయాయని, వారికి కూడా ప్రత్యామ్నాయం కల్పిస్తామన్నారు. ఇళ్ళు కోల్పోయిన వారికి పునరావాసం కల్పిస్తున్నామని తెలిపారు. మల్లవల్లిలోని 100 ఎకరాలను ఎయిర్‌ ఫ్రైట్‌ స్టేషన్‌కు కేటాయించటానికి సిద్ధంగా ఉన్నామని ఏఏఐ, సివిల్‌ ఏవియేషన్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. రన్‌వే పనులు పూర్తి చేసుకుని ప్రారంభించుకునే నాటికి శాశ్వత ప్రాతిపదికన టెర్మినల్‌ బిల్డింగ్‌ పనులు కూడా మొదలౌతాయని తెలిపారు. ఇక విజయవాడ ఎయిర్‌పోర్టు అంతర్జాతీయ స్థాయి హోదాను దక్కించుకోవటమే మిగిలి ఉందని, సాధ్యమైనంత త్వరగా కేంద్రం దీనిని ప్రకటిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమా, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాసరావు, పార్లమెంట్‌ సభ్యులు కేశినేని శ్రీనివాస్‌, కొణకళ్ళ నారాయణరావు, రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్మన్‌ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌, జడ్పీ చైర్మన్‌ గద్దె అనురాధ, నగర మేయర్‌ కోనేరు శ్రీధర్‌, విజయవాడ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ జి.మధుసూదనరావు పాల్గొన్నారు.
 
అప్పుడు సిగ్గు వేసేది.. ఇప్పుడు ఆనందంగా ఉంది..
ఒకప్పుడు ఈ ఎయిర్‌పోర్టుకు వచ్చినపుడు కూనాలమ్మ బస్టాండు మాదిరిగా ఉండటం చూసి నాకు సిగ్గు వేసేది. వర్తక, వాణిజ్యానికి, సాంస్కృతికానికి, విద్య, వైద్యానికి రాజధానిగా ఉండే విజయవాడలో ఇలాంటి ఎయిర్‌పోర్టు ఉండటం నన్ను బాధించేది. నేనెన్నో సార్లు ముఖ్యమంత్రికి దీనిని అభివృద్ధి చేయాల్సి ఉందని చెప్పేవాడిని. భూసేకరణ ఎంతో సమర్ధంగా చేశారు. నాగరికత అభివృద్ధి చెందటంతో పాటు పర్యాటకం, విద్య, ఉపాధి, ఉద్యోగావకాశాలు కలగటానికి రవాణా కనెక్టివిటీ దోహదపడుతుంది. రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి విమాన యాన ప్రగతి ఎంతగానో దోహదపడుతుంది. ఇక్కడ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఉత్పత్తులను ఎగుమతి చేసుకోవటానికి అవకాశం ఉంటుంది.
- ఎం.వెంకయ్య నాయుడు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి
 
ఫెడెక్స్‌ కార్గో విమానాలు త్వరలో వస్తాయి..
విజయవాడ విమానాశ్రయం అభివృద్ధి చెందటం వల్ల ధనికులకే ప్రయోజనమన్న అపోహలకు తావివ్వవద్దని ఇక్కడి వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలకు సైతం ఎగుమతి చేసుకోవచ్చు. ఇక్కడ టమాటాలు ఒక రూపాయికి అమ్ముకుంటే ఢిల్లీలో రూ.20ల ధర పలుతుంటే చాలా బాధగా ఉంటుంది. రన్‌వే విస్తరణ జరిగితే అంతర్జాతీయ స్థాయిలో కేవలం సరుకు రవాణా చేపట్టే ఫిడెక్స్‌ విమానాలు రావటం పెద్ద కష్టమేమీ కాదు.
- పి.అశోక్‌గజపతిరాజు, పౌర విమానయాన శాఖ మంత్రి
Posted
భవిష్యత్తులో భారీ టెర్మినల్‌
 
  • 50 లక్షల ప్రయాణికులకు సరిపడా వసతులు
  • దేశంలో ఏ సీఎం ఇలా భూమి ఇవ్వలేదు:అశోక్‌
అమరావతి: విమానయాన ప్రాజెక్టులకు అవసరమైన భూమిని చంద్రబాబులా దేశంలో ఏ ముఖ్యమంత్రీ ఇవ్వలేదని పౌరవిమానయాన మంత్రి అశోక్‌గజపతిరాజు కితాబిచ్చారు. ఏ ప్రాజెక్టు ఉన్నా దానికి అవసరమైన భూమిని ఇచ్చేందుకు ఏపీ ముందుకురావడంతో... సొంత రాష్ట్రానికి ఎక్కువ చేస్తున్నానన్న అపవాదు తనపై రాకుండా పోయిందన్నారు. గన్నవరం నూతన టెర్మినల్‌ భవనం 11 నెలల్లో పూర్తయిందని... ఎయిర్‌పోర్ట్సు అథారిటీ ఆఫ్‌ ఇండియా చరిత్రలోనే ఇది రికార్డు అని చెప్పారు. పాత టెర్మినల్‌లో ఏటా 6 లక్షల మంది ప్రయాణికులకు సరిపడా సౌకర్యాలు మాత్రమే ఉన్నాయన్నారు. కొత్త టెర్మినల్‌తో ఇది 20 లక్షలకు పెరిగిందని తెలిపారు.
 
మూడు, నాలుగేళ్లలో 50 లక్షల మంది ప్రయాణికులకు వసతులు కల్పించేలా మరో సరికొత్త టెర్మినల్‌ నిర్మిస్తామన్నారు. ఇప్పుడు ప్రారంభించిన టెర్మినల్‌ను కార్గో టెర్మినల్‌గా మారుస్తామన్నారు. ఒకప్పుడు విలాసమైన విమానయానం ఇప్పుడు అవసరంగా మారిందని సుజనా చౌదరి తెలిపారు. పోలవరం ప్రాజెక్టును సాఫల్యం చేస్తున్నందుకు చంద్రబాబు, వెంకయ్యలను తెలుగురైతు నాయకుడు చలసాని ఆంజనేయులు నేతృత్వంలో పలువురు రైతులు సత్కరించారు. మరోవైపు... తెలంగాణలో కొత్తగూడెం విమానాశ్రయానికి కూడా అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అశోక్‌ను కోరారు.
Posted

NTR airport ano leka Amaravati airport ano pettaka, NTR Amaravati enti?

BJP govt vacchaka ika nundi E air port ki vakthi peru pettakudadu ani pakkana unna city peru pettali ani cabinet decision tisukunnadi ntr peru kastm anukunta

Posted

BJP govt vacchaka ika nundi E air port ki vakthi peru pettakudadu ani cabinet decision tisukunnadi ntr peru kastm anukunta

naakenduko aa peru prakkana inkokati add cheayyatam nacchala.

mari ila aithe approve avutunda?

Posted

bigger, permanent terminal 2 years lo ready cheyyali ani CBN annaru, Raju Garu emo 4 years antunnaru. bahusa 4 years pattiddemo. ala 4 years lo finish ayina okay. this terminal is good enough for now. Raju garu should make sure to allot immigration, customs officer ...etc posts needed to make it international ASAP.

Posted

naakenduko aa peru prakkana inkokati add cheayyatam nacchala.

mari ila aithe approve avutunda?

AIRPORT ki Amaravati  ani petti Terminal ki NTR peru pettame

Posted

ఈనాడు - అమరావతి, గన్నవరం-న్యూస్‌టుడే

gnt-gen1a.jpg

గన్నవరం విమానాశ్రయంలో నూతన టెర్మినల్‌ భవనం అందుబాటులోనికి రావడంతో 21 రోజులలోగా ఈ భవనంలోంచి కార్యకలాపాలు ఇక్కడి నుంచి ప్రారంభమవుతాయి. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దీనిని ప్రారంభించారు. నూతన టెర్మినల్‌ రాకతో.. అంతర్జాతీయ సర్వీసులు నడిచేందుకు మార్గం సుగమమైనట్టే. దీనిపైనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజులు సైతం మాట్లాడారు. వెంటనే అంతర్జాతీయ స్థాయిని ప్రకటించాలంటూ సీఎం కోరారు. దీనినిబట్టి త్వరలోనే ఇక్కడి నుంచి అంతర్జాతీయ సర్వీసులు గాలిలోనికి ఎగరనున్నాయని స్పష్టమైంది. ప్రస్తుతం ఉన్న వసతులు రెట్టింపయ్యాయి. ప్రయాణికుల రాకపోకలకు అవసరమైన అధునాతన సౌకర్యాలన్నీ అందుబాటులోనికి వచ్చాయి. గన్నవరంలో తాజాగా నూతన టెర్మినల్‌, రన్‌వే విస్తరణ, వసతుల కల్పన కోసం రూ.350 కోట్లను కేటాయించామని భారత విమానయాన సంస్థ(ఏఏఐ) అధికారులు గురువారం ప్రకటించారు. తాజాగా రూ.160 కోట్లతో నిర్మించి ప్రారంభించిన ఈ నూతన ట్రాన్సిట్‌ టెర్మినల్‌ సైతం తాత్కాలికమే. దీనికంటే అధునాతనమైనది, ఏటా 50లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే సామర్థ్యం ఉండేలా మరో శాశ్వత టెర్మినల్‌ను గన్నవరంలో నిర్మించనున్నట్టు ఏఏఐ అధికారులు తెలిపారు. దానిని వచ్చే రెండేళ్లలోనే నిర్మించాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అంటే మరో రెండేళ్లలో భవిష్యత్తుకు తిరుగులేని విధంగా విమానాశ్రయం రూపుదిద్దుకోనుంది. ప్రస్తుతం నిర్మించిన టెర్మినల్‌ భవనాన్ని కార్గోకు వినియోగించనున్నారు. ఈ ప్రాంతంలోని పండ్లు, వ్యవసాయ, అనుబంధ, ఆక్వా సహా అన్ని రకాల ఉత్పత్తులను ఇక్కడి నుంచి విదేశాలకు తరలించేందుకు ఈ కార్గో ఉపయోగపడనుంది. దీనికోసం విమానాశ్రయానికి అనుబంధంగా మరో వంద ఎకరాలను వీరపనేని గూడెంలో ఇస్తామని ముఖ్యమంత్రి సైతం తాజాగా హామీ ఇచ్చారు. 12 నెలల్లోనే నూతన టెర్మినల్‌ భవనాన్ని నిర్మించినందుకు ఏఏఐ అధికారులు, గుత్తేదారు సంస్థను ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందించారు. పౌరవిమానయాన శాఖ కార్యదర్శి ఆర్‌.ఎన్‌.చౌబే, ఏఏఐ ఛైర్మన్‌ గురుప్రసాద్‌ మహాపాత్రో, ఏఏఐ ప్రణాళిక సభ్యులు రహేజా, ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ వి.మధుసూదన్‌రావు, గుత్తేదారు సంస్థ డైరెక్టర్‌ సర్కార్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు సత్కరించారు. విమానాశ్రయానికి భూములిచ్చిన రైతలను అన్ని రకాలుగానూ తాను ఆదుకుంటానని చంద్రబాబు తెలిపారు.

నూతన టెర్మినల్‌లో వసతులు

రద్దీ వేళలో ప్రయాణికులు: గంటకు 500 మంది

ఏటా ప్రయాణికుల సామర్థ్యం: 20లక్షలు

విస్తీర్ణం: 12,642 చదరపు మీటర్లు

బోర్డింగ్‌ గేట్లు: 6

చెక్‌ఇన్‌ కౌంటర్లు: 18

బ్యాగేజీ క్లెయిమ్‌ కరౌసెల్స్‌: 2

బ్యాగేజీ కన్వేయర్లు: 1

కారు పార్కింగ్‌: 300కార్లు

ఇతర సౌకర్యాలు: సిరిమోనియల్‌ లాంజ్‌, కాన్ఫరెన్స్‌హాలు, ఎయిర్‌లైన్స్‌ కార్యాలయాలు, వీఐపీలకు ప్రత్యేక అప్రోచ్‌ రహదారి

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...