Jump to content

Recommended Posts

  • 3 weeks later...
  • Replies 377
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • 3 weeks later...
Posted
కొండవీటి వాగుపై ఎత్తిపోతల పథకం
 
636225685465238316.jpg
  • కరకట్ట - పీడబ్ల్యూడీ వర్కుషాప్‌ మధ్య పంప్‌హౌస్‌ 
  • రెండు, మూడు రోజుల్లో శంకుస్థాపన తేదీ ప్రకటన 
  • చకచకా సాగుతున్న పైలాన్ నిర్మాణ పనులు
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగరానికి కొండవీటివాగు రూపంలో ముంపు ముప్పు పొంచి ఉంది. భవిష్యత్తులో ఆ బెడద తలెత్తకుండా పటిష్ట చర్యలకు పూనుకుంది. నీరుకొండ, కృష్ణాయపాలెం వద్ద భారీ జలాశయాలను ఏర్పాటు చేసి కొండవీటివాగు కృష్ణానదిలో కలిసే చోట రూ 213 కోట్ల భారీ వ్యయంతో ఎత్తిపోతలను ఏర్పాటు చేయనుంది. ఈ పధకానికి రోజుల వ్యవధిలోనే శంకుస్థాపన నిర్వహించేందుకు ఇరిగేషన్‌, సీఆర్‌డీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.మంగళగిరి: పేరేచర్ల కొండల్లో ఉద్భవించిన కొండవీటివాగు 29.6 కిలోమీటర్ల దూరం ప్రయాణించి తాడేపల్లి మండలం సీతానగరం పీడబ్ల్యూడీ వర్కుషాపు పక్కగా కృష్ణానదిలో కలుస్తుంది. ఏటా వర్షాకాలంలో వాగుకు వరదలు సంభవించి సమీప ప్రాంతాలను ముంచెత్తుతుంది. ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో ఎనిమిదివేల ఎకరాలకు పైగా వాగు వరద ముంపులో చిక్కుకునే ప్రమాదం ఉంది. కొండవీటివాగు చరిత్రను పరిశీలిస్తే గరిష్టంగా 16 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చినట్టు రికార్డులు ఉన్నాయని ఇరిగేషన్‌ అధికారులు తేల్చారు. వాగు సాధారణ సామర్థ్యం 8 వేల క్యూసెక్కులు మాత్రమే. వరద నీరులో ఐదు వేల క్యూసెక్కులను నదిలోకి, మూడు నాలుగువేల క్యూసెక్కులను కృష్ణా పశ్చిమ ప్రధానకాలువ, గుంటూరు చానల్‌లోకి ఎత్తిపోసే విధంగా పథకాన్ని డిజైన్‌ చేశారు.
 
16 మోటార్లతో పంప్‌హౌస్‌
ఎత్తిపోతల కోసం కృష్ణా కరకట్ట - పీడబ్ల్యూడీ వర్కుషాపు మధ్య పంప్‌హౌస్‌, 132 కేవీ సబ్‌స్టేషన్‌లను నిర్మించనున్నారు. పంప్‌హౌస్‌లో మొత్తం 16 మోటార్లను (ఒకటి స్టాండ్‌బై) ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్క మోటారు 350 క్యూసెక్కుల నీటిని తోడి పోస్తుంది. ఎత్తిపోతల నిర్వహణకు విద్యుత కోసం రూ.20 కోట్ల వ్యయంతో రెండెకరాల విస్తీర్ణంలో 132 కేవీ సబ్‌స్టేషన్‌ను ట్రాన్స్‌కో ఏర్పాటు చేయనుంది. ఈ సబ్‌స్టేషన్‌ నుంచి 30 మెగావాట్‌ల పవర్‌ను పంప్‌హౌస్‌కు అందిస్తారు. ఎత్తిపోతల నుంచి నదివైపుకు పైప్‌లైన్లతో డెలివరీ సిస్టమ్‌ ఏర్పాటవుతోంది. ఇందుకోసం సీఎం రెస్ట్‌హౌస్‌కు వెళ్లే కృష్ణా కరకట్ట రహదారిని పనులు పూర్తయ్యేంత వరకు కొంతమేర తొలగించాల్సి వస్తుంది. ఈ కారణంగా ముఖ్యమంత్రి రాకపోకల కోసం అవసరమైన ప్రత్యామ్నాయ రోడ్లను ఏర్పాటు చేయాల్సి ఉంది.
 
180 అడుగులకు విస్తరణ
ఎత్తిపోతలను పక్కాగా ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో కొండవీటివాగు వరదల గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని ప్రభుత్వం భావిస్తోంది. వాగును నగరానికి తాగునీటి వనరు పర్యాటక వాహినిగాను వినియోగించుకునేలా ప్రణాళికలకు రూపకల్పన చేశారు. ప్రస్తుతం 11నుంచి 15 మీటర్ల వెడల్పు ఉన్న వాగును 180 అడుగుల వెడల్పుకు విస్తరించాలని ప్రతిపాదించారు. వాగు అడుగుభాగం వెడల్పు 120 అడుగులతో ప్రారంభమై పైకొచ్చే కొద్దీ 180 అడుగులకు విస్తరించేలా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. కొండవీటివాగుతో పాటు రాజధానిలోని పాలవాగు, లేళ్లవాగు, కొట్టేళ్లవాగు వంటి ఇతర పిల్లవాగుల నుంచి వచ్చే వరదనీటితో కృష్ణాయపాలెం, నీరుకొండ, అనంతరవరం వద్ద ఏర్పాటయ్యే భారీ జలాశయాలను నింపే విధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది.
 
కరకట్టపై పైలాన్ నిర్మాణం
రూ.213 కోట్ల వ్యయంతో నిర్మితం కానున్న ఈ ఎత్తిపోతల పనులను మెగా కంపెనీ దక్కించుకుంది. వెంటనే పనులను ఆరంభించేందుకు సంసిద్ధంగా ఉంది. రెండుమూడు రోజుల్లోనే ప్రభుత్వం శంకుస్థాపన తేదీని ప్రకటించనుంది. ఉండవల్లి కరకట్ట సమీపంలో పైలాన్‌ను నిర్మిస్తున్నారు. ఇక్కడే రాజధాని అమరావతి వైపు కృష్ణవేణి తల్లి విగ్రహాన్ని కూడ ఏర్పాటు చేయాలన్న సీఎం ఆదేశాల మేరకు దుర్గిలో విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేయిస్తున్నారు.

  • 2 weeks later...
Posted
కొండవీటి వాగుపై ఎత్తిపోతల పథకం
 
636239498028483915.jpg
ఆంధ్రజ్యోతి, గుంటూరు: కొండవీటి వాగు గుంటూరు జిల్లా పేరేచర్లకు సమీపంలోని కొండవీడు కొండల మీద కురిసే వర్షపునీటితో ప్రారంభమౌతుంది. మేడికొండూరు మండలంలో నుంచి ప్రవహించి గుంటూరు - అమరావతి రోడ్డులో లాం వద్ద రోడ్డు క్రాస్‌ అవుతుంది. ఇరిగేషన్ శాఖ ఇక్కడి నుంచే వాగు ప్రవాహం ప్రారంభమౌతున్నట్లుగా పేర్కొంటోంది. ఇక్కడినుంచి తాడికొండ, మంగళగిరి, తాడేపల్లి మండలాల మీదగా ప్రవహించి చివరికి ఉండవల్లి వద్ద ప్రకాశం బ్యారేజ్‌ ఎగువున కృష్ణానదిలో కలుస్తుంది. వాగుకు 175 చదరపు మైళ్ల క్యాచమెంట్‌ ఏరియా, 29.500 కిలోమీటర్ల ప్రవాహం ఉంది.
వర్షాకాలంలో ప్రధానంగా ముసురువర్షం కురిసే సందర్భాల్లో కొండవీటి వాగు ఉధృత రూపం దాల్చుతుంది. గరిష్టంగా 7,000 క్యూసెక్కుల ప్రవాహం ఇందులోకి వచ్చి చేరుతుంది. కృష్ణానదికి చేరుకొనేలోపు మార్గం మధ్యలో కొట్టేళ్ల వాగు, పాలవాగు వంటి పిల్లవాగులు ఇందులో కలుస్తాయి. ఎనఎస్‌పీ కాలువల డ్రైనేజీ నీరు కూడా వాగులోకి వచ్చి చేరుతోంది. కొండవీటి వాగుకు వరద ప్రవాహం వచ్చినప్పుడే కృష్ణానదిలోనూ ఎగువ నుంచి వరద వస్తోంది. దీంతో మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో సుమారు 13,500 ఎకరాల పంటలు నీట మునుగుతున్నాయి. లోగడ మంగళగిరి, తాడేపల్లి మండలాల్లో పంటలు ఉండటం వలన అవి ముంపునకు గురై రైతులు తీవ్రంగా నష్టపోయేవారు. ముంపునకు గురయ్యే భూమిలో ప్రస్తుతం 10,600 ఎకరాలు అమరావతి రాజధాని నగర పరిధిలో ఉంది. నీరుకొండ, ఉండవల్లి, పెనుమాక, కృష్ణాయపాలెం తదితర గ్రామాలు ముంపు బారిన ఉండేవి. ఈ కారణంగా అప్పట్లో అక్కడి భూములకు విలువ కూడా ఉండేది కాదు. రాజధాని రాకతో భూములు ధరలు పెరిగాయి.
ఇకపై కొండవీటి వాగు వలన ముంపు ఉండటానికి వీల్లేదని ప్రభుత్వం భావించింది. గతంలో కొండవీటి వాగును కృష్ణా పశ్చిమ కాలువలోకి మళ్లించి దుగ్గిరాల సమీపంలో కృష్ణానదిలో కలిపేందుకు ప్రణాళిక రూపొందించారు. అయితే కోర్టు కేసులు కారణంగా ఆ పని ప్రారంభం కాలేదు. మరోవైపు సీతానగరం వద్ద కొండల కింద నుంచి టన్నెల్‌ నిర్మాణం చేసి బ్యారేజ్‌ దిగువున కలిపేందుకు కూడా యోచించారు. ఇవేవీ ఆచరణకు నోచుకోలేదు. ఈ నేపథ్యంలో ఎత్తిపోతల పథకాన్ని ఉండవల్లి వద్ద నిర్మించి కొండవీటి వాగులోకి వచ్చిన వరద నీటిని కృష్ణానదిలోకి ఎత్తిపోయాలని ఇరిగేషన్ శాఖ నిర్ణయించింది. ఐదు వేల క్యూసెక్కుల వరదనీటిని కృష్ణానదిలోకి ఎత్తిపోసేందుకు పంపింగ్‌ స్కీం నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ.237 కోట్లను ఇరిగేషన శాఖ విడుదల చేసింది. మొత్తం 16 పంపులతో స్కీంని ఆరు నెలల వ్యవధిలో నిర్మిస్తారు.
 
Posted

నాడు వరదరూపిణి... రేపు వరదాయిని!
కొండవీటి వాగుపై ఎత్తిపోతలతో కొత్తందాలు
దశాబ్దాల ముంపు సమస్యకు పరిష్కారం
రాజధానిలో పర్యటక ప్రాంతంగా అభివృద్ధి
ఈనాడు-అమరావతి
amr-top2a.jpgRAF_2023.jpg

దశాబ్దాలుగా వూహించని వరద ఉద్ధృతితో ముంచెత్తి రైతులకు, ప్రజలకు దు:ఖదాయనిగా మారిన కొండవీటివాగు ఉగ్రరూపానికి అడ్డుకట్ట పడునుంది. వరద నివారణకు పలు ప్రతిపాదనలు పరిశీలించిన ప్రభుత్వం ఎత్తిపోతల పథకాన్ని నిర్మించి వరదనీటిని బ్యారేజీలోకి ఎత్తిపోయాలని నిర్ణయించింది. దీంతో గత కొన్ని దశాబ్దాలుగా ఈప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ముంపు సమస్యకు పరిష్కారం చూపినట్లయింది. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి పూర్తిచేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. అందులో భాగంగానే బుధవారం కొండవీటివాగు ఎత్తిపోతల పథకం నిర్మాణానికి శ్రీకారంచుట్టారు. వదర ముంపు సమస్య తీరడంతోపాటు రాజధాని ప్రాంతంలో రెండు రిజర్వాయర్లు నిర్మించి తాగునీటి సరఫరాకు కూడా కొండవీటివాగు నీటిని ఉపయోగించుకోనున్నారు. దీంతోపాటు కొండవీటివాగులో ఏడాది పొడవునా నీటిని ఉండేలా చూసి పర్యటక పరంగా అభివృద్ధి చేయనున్నారు. దీంతో కొండవీటివాగుకు కొత్త సొబగులు సమకూరనున్నాయి.

5వేల క్యూసెక్కుల ఎత్తిపోత : కొండవీటివాగు ముంపు సమస్య పరిష్కారం దశాబ్దాలుగా కలగానే మిగిలింది. గత కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రూ.49కోట్లతో వాగు ఆధునికీకరణకు నిధులు మంజూరుచేయగా నామమాత్రంగానే పనులు జరిగాయి. కేవలం వంతెనల నిర్మాణంతోనే సరిపెట్టారు. భారీవర్షాలు వస్తే ఈప్రాంత ప్రజలకు కంటిమీద కునుకు ఉండటం లేదు. ఈప్రాంతంలోనే రాజధాని నగరం రావడంతో రాష్ట్రప్రభుత్వం ప్రత్యేకంగా కొండవీటివాగు ముంపుపై దృష్టిసారించింది. జలవనరులశాఖ నిపుణులు, విదేశాలకు చెందిన నిపుణులు ఈప్రాంతంలో పర్యటించి పలు సూచనలు చేశారు. వరద ముంపునకు ప్రణాళికలు రూపొందించారు. వరద నివారణతోపాటు తాగునీటి అవసరాలు, పర్యటకంగా అభివృద్ధి చేయడానికి గల అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఈక్రమంలో అమరావతి అభివృద్ధి సంస్థ మూడు ప్రణాళికలను సిద్ధం చేయగా ముఖ్యమంత్రి ఒకదానికి ఆమోదముద్ర వేశారు. ఇందులో భాగంగానే తొలిదశలో ఉండవల్లి సమీపంలో కొండవీటివాగు నుంచి వరదనీటిని ప్రకాశంబ్యారేజీలోకి ఎత్తిపోయడానికి పథకం నిర్మిస్తున్నారు. మొత్తం ఇక్కడ 15 పంపులు ఏర్పాటుచేసి ఒక్కొక్క పంపు ద్వారా 350 క్యూసెక్కులతో మొత్తం 5వేల క్యూసెక్కుల నీటిని పంపింగ్‌ చేసేలా పథకం నిర్మిస్తున్నారు. మరో పంపును సైతం ప్రత్యామ్నాయంగా అందుబాటులో ఉంచుతున్నారు. కొండవీటివాగులో సగటున వరద సమయంలో 6వేల క్యూసెక్కుల నీరు ప్రవహిస్తుంది. అత్యధికంగా 11500 క్యూసెక్కుల వరకు వరదనీరు వచ్చే అవకాశముందని అంచనా. ఈనేపథ్యంలో 5వేల క్యూసెక్కులు తొలిదశలో ఎత్తిపోయగా మిగిలినవాటిని సీఆర్‌డీఏ రెండోదశలో ఎత్తిపోయడానికి ప్రత్యామ్నాయ ప్రణాళికలు అమలుచేయనుంది. దీంతోపాటు కృష్ణా పశ్చిమడెల్టా కాలువలోకి కూడా 4వేల క్యూసెక్కుల నీటిని వదలడానికి వీలుగా ఏర్పాట్లు సైతం చేస్తున్నారు.

120 మీటర్లతో వాగు విస్తరణ
కొండవీటివాగు ప్రవహించే ప్రాంతం సింహభాగం సీఆర్‌డీఏ భూసమీకరణ చేసిన ప్రాంతంలో విస్తరించింది. ఇందులో వరద సమయంలో 10.500 ఎకరాలు ముంపునకు గురయ్యే ప్రాంతం ఉంది. భవిష్యత్తులో అంచనాలకు మించి వరదనీరు వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి వాగును 120మీటర్ల వెడల్పుతో విస్తరించనున్నారు. దీంతోపాటు వరదనీటిని లామ్‌ సమీపంలో ఒకచోట, నీరుకొండ ప్రాంతంలో మరోచోట నుంచి పంపింగ్‌ చేసి రెండు రిజర్వాయర్లకు పంపాలని నిర్ణయించారు. రిజర్వాయర్లలో నిల్వచేసిన నీటిని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలనేది ప్రణాళిక. దీంతోపాటు కొండవీటివాగును విస్తరించడం ద్వారా పర్యటకంగా కూడా అభివృద్ధి చేయనున్నారు. వాగు వెంబడి పచ్చదనం పెంపొందించడం, వాటర్‌ స్పోర్ట్స్‌ తదితర వినోద కార్యక్రమాలకు కూడా వేదికగా మలచనున్నారు. ఇందుకు సంబంధించి రెండో దశ ప్రణాళికను అమరావతి అభివృద్ధి సంస్థ చేపట్టనుంది. మొత్తంమీద కొండవీటివాగు విస్తరణ ప్రణాళిక పూర్తయితే కొత్తందాలను సంతరించుకుని రాజధాని వాసులకు ఆహ్లాదాన్ని పంచనుంది.

  • 1 month later...
Posted
వర్షాకాలానికి ముందే వాగుల పనులు పూర్తి చేయాలి: నారాయణ
 
అమరావతి: వర్షాకాలానికి ముందే వాగుల పనులు పూర్తి చేయాలని మంత్రి నారాయణ అన్నారు. కొండవీటి, పాలవాగుల గ్రావిటీ కెనాల్ వెడల్పుకు 1536 ఎకరాలు అవసరమని ఆయన తెలిపారు. రాజధాని పరిధిలో మరో మూడు రిజర్వాయర్లు ఏర్పాటు
చేయనున్నట్లు పేర్కొన్నారు. నీరుకొండ, కృష్ణాయపాలెం, శాఖమూరు వద్ద కూడా రిజర్వాయర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అయితే ఈ రిజర్వాయర్ల నిర్మాణానికి 690 ఎకరాలు అవసరమని మంత్రి నారాయణ అన్నారు.
  • 2 weeks later...
Posted

NGT court reserved judgement very soon to deliver....

What is this case AnnaGaru? is it over Kondaveeti Vagu or the Capital?

Vaagu meeda valla problem enti? lift petti water divert chesi aa area antha submerge avvakunda chudatam manchidega?

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...