Jump to content

kondaveeti vagu


Recommended Posts

What is this case AnnaGaru? is it over Kondaveeti Vagu or the Capital?

Vaagu meeda valla problem enti? lift petti water divert chesi aa area antha submerge avvakunda chudatam manchidega?

capital meeda,govt ki confirm ga anti ga rabotundi judgement,govt nundi report adigaru anta farming lands enta,inka chala vati meeda report adigaru anta,confirm ga restrictions pedataru 

 

manaki positive ga ravalani korukundam  :pray:  :pray:

Link to comment
Share on other sites

  • Replies 306
  • Created
  • Last Reply

Top Posters In This Topic

capital meeda,govt ki confirm ga anti ga rabotundi judgement,govt nundi report adigaru anta farming lands enta,inka chala vati meeda report adigaru anta,confirm ga restrictions pedataru 

 

manaki positive ga ravalani korukundam  :pray:  :pray:

 

restrictions pedataru common ye le. large extent of land is reserved for greenery/water canals in the capital master plan (more than usual). So, there won't be too many drastic restrictions except some protections for river-front and islands. 

 

mana valla preparation meeda naaku 100% nammakam, baaga cheyyaru ani. 50000 acres forest land ni deforestation ki request pamparu anta without any details of how that much of land is going to be used and how/when new forest will be created as replacement(basic info). 

 

most of the officials CBN review meeting lo masi boosi maredu kayanu cheyyatam antare ala build up lu istaru work matram nill. 

Link to comment
Share on other sites

restrictions pedataru common ye le. large extent of land is reserved for greenery/water in the capital master plan (more than usual). So, there won't be too many drastic restrictions except some protections for river-front and islands. 

 

mana valla preparation meeda naaku 100% nammakam baaga cheyyaru ani. 50000 acres forest land ni deforestation ki request pamparu anta without any details of how that much of land is going to be used and how/when new forest will be created as replacement(basic info). 

 

most of the officials CBN review meeting lo masi boosi maredu kayanu cheyyatam antare ala build up lu istaru work matram nill. 

yes,lets hope for the best,cbn care tisukunte better emo report chesetappudu,okasari ayina check cheyyali report ni 

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 1 month later...
కొండవీటి వాగు నాడు దుఃఖదాయిని... నేడు వరప్రదాయిని
09-06-2017 09:32:41
 
636325976801532679.jpg

  • అమరావతికి జలవనరుగా కొండవీటి వాగు
  • రెండోదశ వాగు విస్తరణకు వారంలో టెండర్లు
  • తొలిదశలో జరుగుతున్న ఎత్తిపోతల పనులు
 కొండవీటి వాగు దుఃఖదాయని.. అనేది ఒకప్పటి మాట. నేడు దానినే వరప్రదాయినిగా మార్చి సుందర వాహినిగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సంకల్పించింది. ఇప్పటికే రూ.237 కోట్లతో భారీ ఎత్తిపోతల నిర్మాణ పనులు జరుగుతుండగా.. రెండోదశ కింద వాగు విస్తరణ, వరద నీటిని నిల్వచేసే మూడు భారీ రిజర్వాయర్లను నిర్మించేందుకు సన్నద్ధమవుతోంది.

గుంటూరు/ మంగళగిరి: రాజధాని అమరావతికి పొంచివున్న ముప్పును సాంకేతిక పరిజ్ఞానంతో తప్పించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. రాజధాని అమరావతిలో సుమారు పదివేల ఎకరాలను ముంపునకు గురిచేసే కొండవీటివాగు వరద సమస్యకు చెక్‌ పెడుతూ దానినే సుందర వాహినిగా తీర్చిదిద్దేందుకు అమరావతి అభివృద్ధి సంస్థ చర్యలు చేపడుతోంది. సింగపూర్‌లో ఓ నది నుంచి తరచూ వస్తున్న వరద కట్టడికి అక్కడి ప్రభుత్వం రూపొందించిన విధానాన్ని అధ్యయనం చేసి రూపొందించిన మాస్టర్‌ప్లాను మేరకు కొండవీటివాగు వరద కట్టడి ప్రాజెక్టును చేపడుతున్నారు. తొలిదశ కింద ఉండవల్లి కృష్ణాతీరం వద్ద రూ.237 కోట్ల వ్యయంతో వాగు వరద నీటిని కృష్ణానదిలో ఎత్తిపోసేవిధంగా 16 మోటార్లతో భారీ ఎత్తిపోతల పనులను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ పనులు జరుగుతుండగనే.. రెండోదశ కింద కొండవీటి వాగు విస్తరణ, వరద నీటిని నిల్వచేసే మూడు భారీ రిజర్వాయర్లను నిర్మించేందుకుగాను ఏడీఏ సంస్థ సిద్ధమైంది. వారం రోజుల్లో టెండర్లను ఆహ్వానించనున్నట్టు తాజాగా సీఆర్‌డీఏ అధికారులు ప్రకటించారు.
 
ప్రణాళిక ఇలా..
రాజధాని అమరావతిని బ్లూగ్రీన్‌ సిటీగా అభి వృద్ధి చేసే ప్రణాళికలో భాగంగా ప్రపంచబ్యాంకు రూ.400 కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. ఈ నిధులతోనే కొండవీటివాగు విస్తరణ, సుందరీకరణ పనులను చేపడుతున్నారు. రాబోయే రోజుల్లో వైకుంఠపురం వద్ద కృష్ణానదిలో నిర్మించనున్న ఆనకట్ట ద్వారా ఏడెనిమిది టీఎంసీల నీటిని నిల్వ చేయాలని ప్రభుత్వం భావిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడినుంచి సుమారు పది కిలోమీటర్ల మేర కొత్తగా కాలువను నిర్మించి నేలపాడు-నీరుకొండ మధ్య ఏర్పాటు చేయనున్న జలాశయానికి కలుపుతారు. లాం ఆపైనుంచి వచ్చే కొండవీటి వాగు వరద నీటితో కూడ ఈ జలాశయాన్ని నింపుకొనే వెసులుబాటు వుంటుంది. ఇక్కడి నుంచి ఉండవల్లి కృష్ణాతీరం వరకు 11కిలోమీటర్ల పొడవున కొండవీటివాగును భారీగా విస్తరించనున్నారు.
 
ప్రస్తుతం 25మీటర్ల వెడల్పువున్న వాగు బెడ్‌లెవల్‌ను 75మీటర్లు, పై ఎత్తులో వంద నుంచి 115 మీటర్ల వరకు విస్తరిస్తారు. దీనివలన వాగులో 22వేలకు పైగా క్యూసెక్కులు ప్రవహించే వీలవుతుంది. నీరుకొండ నుంచి కృష్ణానది వరకు సాగే వాగు ప్రవాహం మధ్య కృష్ణాయపాలెం వద్ద మరో రిజర్వాయరును నిర్మిస్తారు. కొండవీటివాగుతో పాటు దానిలో కలిసే ఉప వాగులైన పాలవాగు, కొట్టేళ్లవాగు, అయ్యన్నవాగులను సైతం ఇదే తరహాలో విస్తరిస్తారు. వైకుంఠపురం రిజర్వాయరు నుంచి కొత్తగా నిరిమ్రంచబోయే కాలువను నీరుకొండ జలాశయానికి కలపడం వలన వైకుంఠపురం రిజర్వాయర్‌ నీటిని ప్రకాశం బ్యారేజికి తరలించే వెసులుబాటు కలుగనుంది.
 
అంచనాలివి..
కొండవీటి వాగు విస్తరణ కోసం సుమారు 885 ఎకరాలు, పాలవాగు ఇతర పిల్లవాగుల విస్తరణ నిమిత్తం 433 ఎకరాలు, వైకుంఠపురం నుంచి కొత్తగా నిర్మించనున్న కాలువ కోసం 217 ఎకరాల భూమి అవసరమవుతుందని అంచనా వేశారు. అలాగే నీరుకొండ-నేలపాడు మధ్య నిర్మించనున్న జలాశయం కోసం 450 ఎకరాలు, కృష్ణాయపాలెం వద్ద నిర్మించనున్న మరో జలాశయం కోసం 190 ఎకరాలు కేటాయించాలని అంచనా వేశారు. వీటితోపాటు శాఖమూరు వద్ద కూడ 50 ఎకరాల విస్తీర్ణంలో మరో జలాశయాన్ని ఏర్పాటుచేసేవిధంగా మాస్టర్‌ప్లానులో ప్రతిపాదించారు. ప్రస్తుతానికి కొండవీటివాగు విస్తరణ, అభివృద్ధి పూర్తిగా రాజధాని పరిధిలో మాత్రమే అంటే నీరుకొండ నుంచి ఉండవల్లి తీరం వరకు మాత్రమే జరుగనుంది. తరువాతి దశలో నీరుకొండ నుంచి లాం వరకు వాగు విస్తరణ పనులు చేపడతారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్యల వలన కొండవీటివాగుకు ఏస్థాయిలో వరదలు వచ్చినా రాజధాని ప్రాంతంలో ఒక్క సెంటు భూమి కూడ ముంపుకు గురయ్యే అవకాశం వుండదు.
 
ఇదీ ముంపు సమస్య
కొండవీటి కొండల నుంచి వచ్చే ప్రవాహం లాం నుంచి వాగు రూపాన్ని సంతరించుకుంటుంది. తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల మధ్యగా 28.5 కి.మీ ప్రయాణించి ప్రకాశం బ్యారేజి వద్ద ఎగువ కృష్ణలో కలుస్తుంది. ఈ వాగు కేవలం 25 మీటర్ల వెడల్పుతో వుండి అధిక వర్షాలు కురిస్తే ఎనిమిదివేల క్యూసెక్కుల సామర్ధ్యంతో ప్రవహిస్తుంది. తక్కువ వెడల్పు.. ఎక్కువ సామర్ధ్యంతో కూడిన ప్రవాహం రావడంతో బలహీనంగా ఉన్న చోట కట్టలు తెగి సమీప భూములను ముంచెత్తుతుంది. వర్షాల కారణంగా కృష్ణానదిలో నీటిమట్టం పెరగడంతో కొండవీటివాగు వరద నీరు నదిలోకి పారలేక ఒత్తిడి వల్ల ఎక్కడికక్కడ పొంగి పొర్లుతుంది.
Link to comment
Share on other sites

రాజధాని వరదను ఎత్తిపోసేలా!

అవాంతరాలు దాటి ఆరంభమైన కొండవీటివాగు పనులు

వరద వచ్చేలోపు పూర్తవుతాయన్న అధికారులు

కృష్ణమ్మలోకి మళ్లించనున్న నీరు

WlqUDf1.jpg

ఈనాడు, అమరావతి: అనేక అవాంతరాల అనంతరం కొండవీటి వాగు వరదను మళ్లించే ఎత్తిపోతల పనులు ఇప్పుడిప్పుడే వూపందుకుంటున్నాయి. మొత్తం రూ.222 కోట్ల ఒప్పంద విలువతో కొండవీటి వాగు వరదను కృష్ణా నదిలోకి మళ్లించేలా మేఘ ఇంజినీరింగు సంస్థ ఈ పనులు చేపట్టింది. పంపుహౌస్‌, నీటిని విడుదల చేసే ప్రాంతంలోను, ఎస్కేప్‌ ఛానల్‌ వద్ద పునాదుల తవ్వకాలు పూర్తయ్యాయి. నిర్మాణం పనులు ప్రారంభించాల్సి ఉంది. మొత్తం 16 పంపుల ద్వారా నీటిని కృష్ణమ్మలోకి మళ్లించనున్నారు. తొలుత ఓపెన్‌ ఫౌండేషన్‌ పద్ధతిలోనే పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యారు. తవ్వకాలు ప్రారంభించిన తర్వాత మట్టి జారిపోతుండటంతో ఆకృతులు మార్చారు. జట్‌షీట్‌ పైలింగుతో పనులు చేపట్టేందుకు అనుమతి లభించింది. మొత్తం 123×28 మీటర్ల దీర్ఘచతురస్రాకారంలో పునాదుల కోసం దిగువ వరకు తవ్వుతున్నారు. ఈ మేరకు దాదాపు 70 మీటర్లు మినహా మిగిలిన ప్రాంతంలో జట్‌షీట్‌ ఫైలింగు పూర్తయింది. మట్టి జారకుండా చూసుకుంటూ పునాది పనులు కొలిక్కి తీసుకువస్తున్నారు.

తప్పనున్న వరద ముప్పు

కొండవీటి వాగు అమరావతి రాజధాని కీలక ప్రాంతాల మీదుగా మొత్తం 29.5 కిలోమీటర్ల మేర ప్రవహిస్తూ కృష్ణా నదిలో కలుస్తుంది. ఈ వాగు వరద వల్ల 13,500 ఎకరాలు ముంపులో చిక్కుకుంటాయి. ఇందులో 10,600 ఎకరాలు కొత్త రాజధాని ప్రాంతంలోనే ఉంది. అయిదు నుంచి ఏడు రోజుల పాటు ఈ ప్రాంతం ముంపులో చిక్కుకుంటూ ఉంటుంది. కృష్ణా నదిలో వరద ఉద్ధృతంగా ఉండి, ఇటు కొండవీటి వాగులోను వరద ఉన్న సమయంలో ఈ ముంపు సమస్య తలెత్తుతోంది. లేని పక్షంలో వాగు వరదను మళ్లించే ఏర్పాట్లు ఉన్నాయి. ఒకేసారి 22,000 క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా, కొంత కృష్ణా పశ్చిమ కాలువలోకి, మరికొంత గ్రావిటీ కాలువ, ఎత్తిపోతల సాయంతో కృష్ణమ్మలోకి మళ్లించనున్నారు.

* ఒక్కో పంపు 350 క్యూసెక్కుల నీటిని మళ్లించేలా 16 పంపులు ఏర్పాటు చేస్తున్నారు. +6 మీటర్ల స్థాయిలో రాఫ్ట్‌ ఫౌండేషన్‌ పద్ధతిలో నిర్మాణం చేపడుతున్నారు.

* ఎస్కేప్‌ రెగ్యులేటర్‌ ద్వారా 5000 క్యూసెక్కుల నీరు మళ్లించేలా అయిదు వెంట్లు ఏర్పాటు చేస్తున్నారు.

* 16 పైపులు ఏర్పాటు చేసి ఎత్తిపోసిన నీటిని ప్రకాశం బ్యారేజికి ఎగువన +22.50 మీటర్ల వద్ద నదిలోకి ఎత్తిపోస్తారు.

* ఈ ఎత్తిపోతలకు తాడేపల్లి 132 కేవీ సబ్‌ స్టేషన్‌ నుంచి విద్యుత్తు తీసుకుంటారు.

ప్రారంభంలోనే సవాళ్లు

ఈ ఎత్తిపోతల నిర్మాణం పనులు ప్రారంభించిన కొత్తలోనే అనేక సమస్యలు తలెత్తాయి. మత్స్యకారులు తమ భవనం ఉందని, తమ ఉపాధికి ఈ పనులు భంగం కలిగిస్తున్నాయంటూ ఆందోళనకు దిగడంతో పనులు చాలా కాలం ఆగిపోయాయి. మరోవైపు ఈ పనులు చేపట్టే ప్రాంతం రాజధాని సచివాలయానికి వెళ్లే రహదారికి, నీటిపారుదలశాఖ వర్కుషాపునకు మధ్యలో ఉంది. అక్కడ దాదాపు 21 మంది ఇళ్లు ఉన్నాయి. దీంతో పనులు చేసుకునేందుకు వీలుగా కావాల్సిన స్థలం అందుబాటులోకి రాలేదు. ఇక్కడి మట్టి పునాదికి అనువుగా లేకపోవడంతో ఆకృతులు మార్చుకోవాల్సి వచ్చింది. మట్టి పరీక్షలు, ఇతరత్రా అధ్యయనాలు పూర్తయ్యాయి. ఆకృతులు ఆమోదం పొందిన వెంటనే పనులు యుద్ధప్రాతిపదికన మూడు నెలల్లో పూర్తి చేస్తామని ఎస్‌ఈ చౌదరి ‘ఈనాడు’తో చెప్పారు.

కృష్ణమ్మలోను, స్థానికంగాను ఒకేసారి వరద వచ్చేసమయానికి ఈ పనులు పూర్తి చేయగలిగితే చాలు. ఆలమట్టి నిండి నారాయణపూర్‌, శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల జలాశయాలను దాటి వరద వచ్చే లోపు ఈ పనులు పూర్తి చేసుకుంటే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. ఒప్పంద సమయం ప్రకారం జులై నెలాఖరుకు పనులు పూర్తి కావాల్సి ఉన్నా అవాంతరాల వల్ల కొంత ఆలస్యమైందని, వరద వచ్చే లోపే పనులు పూర్తి చేస్తామని జలవనరులశాఖ అధికారులు చెబుతున్నారు.

Link to comment
Share on other sites

Govt departments low level entha worst ga pani chestayo e vagu case lo inko sari

 

Don't get me wrong but e sari e vagu debba paduddi villa overlook ki..andutlonu Pattiseema water tho barrage full ga unchutunnaru...

So varshalu gattiga padite eduru tantundi vagu guarantee ga...

 

Neerukonda daggara vagu musesaru University construction material road kosam....

That will divert flood water direct to secretariat if vagu gets flood...

 

 

 

http://epaper.eenadu.net/index.php?rt=image/index/img/20170610a_011135009.jpg

Link to comment
Share on other sites

https://www.google.com/maps/@16.4664608,80.5081344,706m/data=!3m1!1e3

 

e point lo vagu ni close chesaru Lorries vellatam kosam ...akkada vagu close cheste diversion lo water secretriat vypu veltai .....

I hope they remove that closure before flood starts ....actual ga a Unviersity building mottam mungipotundi as usal ga every vache water vachina......

 

Pattiseema tho barrage full ga untundi(idi additional water)+munneru flood vastundi+vagu kuda e year baga vastadi ani pistundi based on forecasts....

 

reasons evaina Kondaveedu lift works chala slow ga avutunai....a works avvaka pote manaki most embarrassing situation tappadu...

hopefully flood vache lopu a vagu closures ettesi LIFT works chestaru ani wishing....

 

problem ni irrigation lo dabbulu kosam mislead chesi vere route lo vallaki kavalsi natlu chestunaru....irrigation lo adi baga alavatu and common practice....

jalayagnam lo kakkurti ki alavatu padina pranalu "Avuravuru mantunai" .....CBN andutlonu nokkudu ki chance lekunda result oriented works cheyistunadu irrigation lo....

 

also asalu narukullapadu vagu kuda widen cheyyali..lekapote Medikonduru nunchi mottam itu LAM/capital vype vastundi...Narukullapadu widen cheste konta atu nunchi Vykuntapuram vypu veltundi...

 

Narukullapadu widen cheyyakunda only LAM-Undavalli widen cheste komapa munchukovatame water ni itu capital vypu teppichi....

 

Prastutam vallu chese ONLY capital area widen valla FLASH FLOOD severity peruguddi.....inka SUPER FAST ga vastai water Undavalli daggaraki....mamulga ayete LAM-TADIKONDA madya kattalu tegutai...kani "only capital" lo widen cheyyatam valla water mottam akkadiki JET SPEED lo veltundi....adi inka worst

 

:wall:

Link to comment
Share on other sites

https://www.google.com/maps/@16.4664608,80.5081344,706m/data=!3m1!1e3

 

e point lo vagu ni close chesaru Lorries vellatam kosam ...akkada vagu close cheste diversion lo water secretriat vypu veltai .....

 

I hope they remove that closure before flood starts ....actual ga a Unviersity building mottam mungipotundi as usal ga every vache water vachina......

 

Pattiseema tho barrage full ga untundi(idi additional water)+munneru flood vastundi+vagu kuda e year baga vastadi ani pistundi based on forecasts....

 

reasons evaina Kondaveedu lift works chala slow ga avutunai....a works avvaka pote manaki most embarrassing situation tappadu...

hopefully flood vache lopu a vagu closures ettesi LIFT works chestaru ani wishing....

 

problem ni irrigation lo dabbulu kosam mislead chesi vere route lo vallaki kavalsi natlu chestunaru....irrigation lo adi baga alavatu and common practice....

jalayagnam lo kakkurti ki alavatu padina pranalu "Avuravuru mantunai" .....CBN andutlonu nokkudu ki chance lekunda result oriented works cheyistunadu irrigation lo....

 

also asalu narukullapadu vagu kuda widen cheyyali..lekapote Medikonduru nunchi mottam itu LAM/capital vype vastundi...Narukullapadu widen cheste konta atu nunchi Vykuntapuram vypu veltundi...

 

Narukullapadu widen cheyyakunda only LAM-Undavalli widen cheste komapa munchukovatame water ni itu capital vypu teppichi....

 

Prastutam vallu chese ONLY capital area widen valla FLASH FLOOD severity peruguddi.....inka SUPER FAST ga vastai water Undavalli daggaraki....mamulga ayete LAM-TADIKONDA madya kattalu tegutai...kani "only capital" lo widen cheyyatam valla water mottam akkadiki JET SPEED lo veltundi....adi inka worst

 

:wall:

 

mee concerns Loki ki tweet cheyyandi bro, else twitter unna mana DB members. 

Link to comment
Share on other sites

  • 2 weeks later...
ఊపందుకున్న రాజధాని రక్షణ కవచ నిర్మాణం.!
 
 
636339802505202573.jpg
అమరావతి: రాజధాని అమరావతికి రక్షణ కవచంగా పనిచేయనున్న కొండవీటివాగు ఎత్తిపోతల పథకం పనులు ఊపందుకుంటున్నాయి. ఆగస్టు 15 నాటికి ఈ పథకాన్ని ప్రారంభించాలన్న లక్ష్యంతో కాంట్రాక్టు ఏజెన్సీ... మెగా ఇంజనీరింగ్‌ కంపెనీ పనుల్లో వేగాన్ని పెంచింది. పథకంలో ప్రధానమైన డెలివరీ సిస్టమ్‌ పనులను ఫిషర్‌మెన్‌ సొసైటీ మూడు మాసాలుగా అడ్డుకోవడంతో కొంతమేర పనుల్లో జాప్యం జరిగినట్టయింది. ఇటీవలే ప్రభుత్వం వారికి ప్రత్యామ్నాయ రేవు ఏర్పాటుకు హమీని ఇవ్వడంతో ఆ సమస్య పరిష్కారమైంది.
 
 
డిజైన్‌ రూపకల్పన ఇలా..
రూ.237 కోట్ల భారీ వ్యయంతో వరదనీటి ఎత్తిపోతలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పనులకు సంబంధించి ఈ ఏడాది మార్చి ఒకటవ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. వాగులో గరిష్టంగా 17వేల క్యూసెక్కుల వరదనీటిని అంచనా వేస్తూ.. అందులో ఐదు వేల క్యూసెక్కులను ఎగువ కృష్ణలోకి ఎత్తిపోసే విధంగా, మరో ఐవేల క్యూసెక్కులను గ్రావిటీ రూపంలో కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువలోకి మళ్లించేలా డిజైన్‌ చేశారు. మిగిలిన ఏడు వేల క్యూసెక్కుల నీటిని రాజధాని నీటి అవసరాల నిమిత్తం వాడుకునే విధంగా రూపకల్పన చేశారు.
 
నాలుగు నిర్మాణాలు..
ఈ పథకంలో ప్రధానంగా నాలుగు నిర్మాణాలు వున్నాయి. వీటిలో ఒకటి సంపు కాగా, రెండోది పంపుహౌస్‌ కమ్‌ డెలివరీ సిస్టమ్‌. మూడోది ఎస్కేప్‌ రెగ్యులేటర్‌. నాలుగోది 132కెవి విద్యుత్‌ సబ్‌స్టేషన్‌. కొండవీటివాగు కృష్ణానదిలో కలిసేచోట కరకట్ట నుంచి దక్షిణం వైపు 250 మీటర్ల దూరంలో 120/120 మీటర్ల విస్తీర్ణంలో అంటే సుమారు మూడెకరాల పరిధిలో ఓ మినీ రిజర్వాయరు (సంపు) నిర్మాణం చేపడుతున్నారు. ఇది ఆరు మీటర్ల లోతులో వుండి కొండవీటివాగు వరద నీటి కలెక్షన్‌ పాయింట్‌గా పనిచేయనుంది. దీనిలో సుమారు 0.1 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు.
 
పంప్‌ హౌస్‌ నిర్మాణం
సంపునకు ఈశాన్యంగా కరకట్ట-కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ మధ్య పాత రెగ్యులేటర్‌ స్థానంలో పంప్‌హౌస్‌ నిర్మాణం చేపడుతున్నారు. సుమారు 15మీటర్ల లోతు నుంచి దీని నిర్మాణం జరుగనుంది. ఇందులో ఒక్కోటి 1,600 కిలోవాట్ల సామర్ధ్యం గల 16 మోటార్లను ఏర్పాటు చేస్తారు. ఈ మోటార్ల నుంచి కరకట్లకు నాలుగు మీటర్ల దిగువ నుంచి 65 మీటర్ల పొడవు, 34మీటర్ల మందం... రెండు మీటర్ల డయా వ్యాసార్ధం గల 16 పైపులను కృష్ణానది వైపుకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ 16 మోటార్లు, 16 పైపుల్లో ఒక జత స్టాండ్‌బైగా వుంటుంది. మొత్తంగా 15 మోటార్ల సాయంతో సెకనుకు 5,297 క్యూసెక్కుల వరద నీటిని కృష్ణానదిలోకి ఎత్తిపోయవచ్చు.
 
 
తరువాత కొండవీటివాగు నుంచి మరో ఐవేల క్యూసెక్కుల వరదనీటిని కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువలోకి మళ్లించేందుకు సహజ ప్రవాహాన్ని ఎంచుకున్నారు. పశ్చిమ ప్రధాన కాలువ కొత్త హెడ్‌ రెగ్యులేటర్‌ నుంచి దక్షిణంగా రెండొందల మీటర్ల దూరంలో కాలువకు పశ్చిమంగా పీడబ్ల్యూడి వర్కుషాపు రోడ్డువద్ద 12 మీటర్ల లోతులో అయిదు గేట్లతో కూడిన రెగ్యులేటర్‌ నిర్మాణం చేపట్టారు. కొండవీటివాగు నుంచి 143 మీటర్ల పొడవు, 120 మీటర్ల వెడల్పుతో వుండేవిధంగా కొత్తగా ఓ కాలువను నిర్మించి దానిని ఈ రెగ్యులేటర్‌కు అనుసంధానం చేయనున్నారు, ఇలా వాగు నుంచి పదివేల క్యూసెక్కుల వరదనీటిని రెండువైపులా మళ్లించనున్నారు.
 
విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌
మొత్తం పథకం నిర్వహణకు శక్తిని అందించేది 132 కే విద్యుత్‌ సబ్‌స్టేషన్‌. దీనిని కొత్తగా నిర్మించనున్న కాలువకు దక్షిణంగా సుమారు 1.20 ఎకరాల విస్తీర్ణంలో రూ 30 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. ఈ సబ్‌స్టేషన్‌ను తాడేపల్లి సబ్‌స్టేషన్‌తో అనుసంధానించేందుకు 21 టవర్లతో హెచ్‌టి లైనును ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే వీటిలో నాలుగు టవర్ల నిర్మాణం పూర్తయింది. విద్యుత్‌ సబ్‌ స్షేషన్‌ నిర్మాణ పనులు వారం రోజుల్లో ప్రారంభం కానున్నాయి.
 
అవరోధాలూ ఉన్నాయి..
వర్షాకాలం రావడంతో పాటు కొండవీటివాగు నుంచి పంపుహౌస్‌ నిర్మాణ ప్రాంతంలోకి నీటివూట భారీగా లీకవతుండడం, ఆ ప్రాంతమంతా నల్లరేగడి నేల కావడం...వాతావరణం అంతగా అనుకూలించకపోవడంతో పాటు పీడబ్ల్యూడీ వర్కుషాపు రోడ్డులో వున్న సుమారు ఇరవై ఆక్రమిత నివాసాలు పనుల వేగానికి అవరోధంగా మారాయి. తొలగింపు త్వరితగతిన చేపడితే ఆగస్టు 15 నాటికి పథకాన్ని పూర్తి చేయాలన్న లక్ష్యానికి చేరుకోగలుగుతారు. ప్రస్తుతం ప్రాంగణంలో భారీ మిషనరీతో పాటు రెండొందల మంది సిబ్బంది రెండు షిఫ్టులుగా పనిచేస్తున్నారు.
 
 
 
Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 3 weeks later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...