Jump to content

kondaveeti vagu


Recommended Posts

  • Replies 306
  • Created
  • Last Reply

Top Posters In This Topic

కొండవీటి వాగు ప్రాజెక్టు ట్రయల్‌ రన్‌ విజయవంతం

0506459BRK119KND.JPG

అమరావతి: నవ్యాంధ్ర రాజధానికి వచ్చే వరద ముంపును నివారించడానికి ప్రభుత్వం నిర్మిస్తున్న కొండవీటి వాగు ఎత్తిపోతల ప్రాజెక్టు చివరి దశకు చేరుకుంది. ఆదివారం నిర్వహించిన ట్రయల్‌ రన్‌ విజయవంతంగా పూర్తి చేసినట్లు నిర్మాణ సంస్థ అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి వద్ద నిర్మిస్తున్న కొండవీటి వాగు ఎత్తిపోతల ప్రాజెక్టును ఈ నెల 14న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 16 మోటార్లు ఏర్పాటు చేశారు. శనివారం అర్థరాత్రి నుంచి ఒక్కో మోటారు ట్రయల్‌ రన్ నిర్వహిస్తున్నారు. ఒక్కో మోటారు నుంచి 350 క్యూసెక్కుల నీటిని కృష్ణానదిలోకి వదలనున్నారు. ఈ పనులు సోమవారం ఉదయానికి పూర్తి చేసి జలవనరుల శాఖ అధికారులకు అప్పగించనున్నారు.
Link to comment
Share on other sites

మూడు రోజుల పండుగ ‘జలసిరి హారతి’
12-09-2018 08:09:59
 
636723366002881163.jpg
  • నదీ జలాల వద్ద ప్రత్యేక పూజలు
  • హాజరు కానున్న సీఎం చంద్రబాబు
  • 14న సాగర్‌ కుడికాలువ వద్ద..
  • 16న కొండవీటివాగు ఎత్తిపోతల పథకం జాతికి అంకితం
గుంటూరు: జలసిరి హారతి కార్యక్రమాన్ని జిల్లాలో మూడు రోజుల పాటు పండగ వాతావరణంలో నిర్వహించేందుకు జలవనరుల శాఖ విస్త్రృత ఏర్పాట్లు చేస్తోంది. రెండ్రోజులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొననుండటంతో అధికారులు అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నీటి సంఘాల నాయకులు, అన్ని వర్గాల ప్రజలను భాగాస్వామ్యం చేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పటిష్ఠ ప్రణాళికను అధికారులు రూపొందించారు. సంప్రదాయబద్ధంగా జలవనరులకు ఈ మూడు రోజులు హారతులు పట్టడం, ప్రత్యేక పూజలు చేయడం, సభలు, సమావేశాలు నిర్వహించి జలవనరుల ఆవశ్యకతని ప్రజలకు వివరించడం వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
 
ఈ నెల 14న ముఖ్యమంత్రి చంద్రబాబు సాగర్‌ కుడికాలువ హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద జలసిరికి హారతిని పట్టి కుడికాలువకు నీటిని విడుదల చేస్తారు. ఈ సందర్భంగా జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాల్సిందిగా నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు లింగంగుంట్ల సర్కిల్‌ కార్యాలయ వర్గాలకు చీప్‌ ఇంజనీర్‌ నుంచి ఆదేశాలు అందాయి. అలానే 16న ఉండవల్లిలో నూతనంగా నిర్మిం చిన కొండవీటి వాగు ఎత్తిపోతల పథకానికి సీఎం పూజలు నిర్వహించి జాతికి అంకితం చేస్తారు. అక్కడ ఏర్పాట్లను మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కలెక్టర్‌ కోన శశిధర్‌ పర్యవేక్షించారు. మూడురోజులు పాటు జిల్లాలో పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని జలవనరుల శాఖ గుంటూరు సర్కిల్‌ ఎస్‌ఈ బాబురావు ఆంధ్రజ్యోతికి తెలిపారు.
 
 
ట్రయల్‌ రన్‌ పరిశీలన
కొండవీటి ఎత్తిపోతల పథకాన్ని ఈ నెల 16న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్న నేపథ్యంలో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మంగళవారం ఎత్తిపోతల పథకం డిశ్చార్జ్‌ పాయిట్‌ వద్ద ట్రయల్‌రన్‌ను కలెక్టర్‌ శశిధర్‌, ఇతర అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండవీటివాగు ముంపు సమస్యకు ఎత్తిపోతల పథకం శాశ్వత పరిష్కారమన్నారు. తుది దశ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఫోర్‌బే వద్ద రివిట్‌మెంట్‌ పనులను, పంప్‌హౌస్‌ వద్ద సుందరీకరణ పనులను పరిశీలించారు. ప్రారంభోత్సవానికి రైతులు,నీటి యాజమాన్య సంఘాలు తరలిరావాలని కోరారు. భద్రతా చర్యలు, ప్రారంభోత్సవ ఏర్పాట్లపై పోలీసు, నీటి పారుదల, రెవెన్యూశాఖ అధికారులతో కలెక్టర్‌ శశిధర్‌, అర్బన్‌ ఎస్పీ విజయరావు చర్చించారు.
 
పంప్‌హౌస్‌, పైలాన్‌ ఆవిష్కరించే ప్రాంతం, డిశ్చార్జ్‌ పాయింట్‌ వద్ద గ్యాలరీ తదితర వాటిని పరిశీలించారు. గుంటూరు ఆర్డీవో వీరబ్రహ్మయ్య, డీఎస్పీ రామకృష్ణ, ఇరిగేషన్‌ ఎస్‌ఈ బాబూరావు, తహసీల్దార్‌ పద్మనాభుడు, మున్సిపల్‌ కమిషనర్‌ శివారెడ్డి, ఎంపీడీవో బాలూనాయక్‌, ఎసై నారాయణ, మేఘా కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. కాగా కలెక్టర్‌ ఆదేశాల మేరకు పైలాన్‌ను పునర్నిర్మిస్తున్నారు. ఏర్పాట్లు పరిశీలించడానికి వచ్చిన కలెక్టర్‌ శశిధర్‌ పైలాన్‌ పరిమాణం తగ్గించి మళ్ళీ నిర్మించాలని ఆదేశించడంతో కాంట్రాక్టర్లు తిరిగి పైలాన్‌ నిర్మాణం చేపడుతున్నారు.
Link to comment
Share on other sites

5 minutes ago, rk09 said:

one silly question.

Aa pumps on chese badulu, aa water in Buckingham canal(Krishna West Canal) or Guntur channel loki divert cheyyotchu kada? incase if  inflows of vagu less than 10K.

aa renditi capacity 8200 + 600.

 

 

 

adi kuda chestharu ga

Link to comment
Share on other sites

9 minutes ago, rk09 said:

one silly question.

Aa pumps on chese badulu, aa water in Buckingham canal(Krishna West Canal) or Guntur channel loki divert cheyyotchu kada? incase if  inflows of vagu less than 10K.

aa renditi capacity 8200 + 600.

 

 

 

పదివేల క్యూసెక్కుల వరదనీటి మళ్లింపు
కొండవీటివాగు సామర్ధ్యం ఆరువేల క్యూసెక్కులు. భారీ వర్షాల నేపధ్యంలో ఉపవాగుల నుంచి వచ్చే వరదనీరు సుమారు పదివేల క్యూసెక్కులు వుంటుంది. అంటే కొండవీటివాగులో 16వేల క్యూసెక్కులకు పైగా గరిష్ట ప్రవాహం వుంటుంది. ఇదే సందర్భంలో కృష్ణానదిలో కూడ వరదనీరు చేరడంతో నదినీటి మట్టం కొండవీటివాగు మట్టం కన్నా ఎక్కువస్థాయిలో వుంటుంది. దీంతో ఎక్కడికక్కడ పొంగిపొర్లుతోంది. దీనిని ముందస్తుగా గుర్తించిన ప్రభుత్వం ఆ ముప్పును తప్పించేందుకు వాగు వరద నీటిని నదిలోకి ఎత్తిపోసే విధంగా డిజైన్‌ చేసింది. ఈ డిజైన్‌లో భాగంగా ఐదు వేల క్యూసెక్కులను ప్రకాశం రిజర్వాయరులోకి, మరో ఐదువేల క్యూసెక్కులను కృష్ణా పశ్చిమ ప్రధానకాలువలోకి, మిగిలిన ఆరువేలకు పైగా క్యూసెక్కుల వరదనీటిని రాజధాని నీటి అవసరాలకు వినియోగించుకునేలా పథకాన్ని రూపొందించారు.
Link to comment
Share on other sites

రాజధానికి ముంపు ముప్పు తొలగింది!
10-09-2018 03:11:51
 
636721459086766348.jpg
  • తాగునీటి కష్టాలూ తీరతాయి
  • కొండవీటివాగు ఎత్తిపోతల ట్రయల్‌రన్‌ సక్సెస్‌
  • 14న ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
  • ‘మేఘా’ విజయాల ఖాతాలో మరొకటి
  • నీటి ఊట, ఆక్రమణలను అధిగమించి నిర్మాణం
అమరావతి/మంగళగిరి, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాజధాని నగరానికి కొండవీటివాగు నుంచి వరద ముంపు ముప్పు తొలగిపోయింది. అలాగే పెరిగే జనాభాకు తాగునీటి అవసరాలకూ ఎలాంటి ఇబ్బందీ రాదు. రాజధాని నిర్మాణం ప్రారంభంలోనే భవిష్యత్‌ అవసరాలూ, ప్రమాదాలను గుర్తించి చేపట్టిన కొండవీటివాగు ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తయింది. సీతానగరం కృష్ణానది కరకట్ట వద్ద రూ.222.44 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ పథకం ట్రయల్‌ రన్‌ ఆదివారం విజయవంతమైంది. పట్టిసీమ, ముచ్చుమర్రి, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాలను చేపట్టి సకాలంలో పూర్తిచేసిన మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా కంపెనీయే కొండవీటివాగు పథకాన్నీ లక్ష్యం మేరకు పూర్తిచేసింది.
 
ఈ పథకాన్ని ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ట్రయల్‌ రన్‌లో భాగంగా శని, ఆదివారాల్లో ఉండవల్లి రెగ్యులేటరీ గేట్లు తెరచి నదిలో నుంచి వాగులోకి బ్యాక్‌వాటర్‌ను విజయవంతంగా పంప్‌చేశారు. మోటార్లన్నీ విజయవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ ఎస్‌ఈ బాబూరావు, మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ ప్రాజెక్టు మేనేజరు జగన్‌ తదితరులు పాల్గొన్నారు. గత ఏడాది మార్చిలో కొండవీటివాగు పథకం బాధ్యతను చేపట్టిన మేఘా సంస్థ.. అనేక సవాళ్లను అధిగమించి దీనిని పూర్తిచేసింది. ఉబికివస్తున్న నీటి ఊటతో కాంక్రీటు పనులకు నిత్యం ఆటంకాలు ఎదురయ్యాయి. మూడువైపులా నీటి నిల్వలు.. కాలువలు ఉండడంతో సమస్య తీవ్రత ఎక్కువగా ఉండేది. వర్షాలు పడినప్పుడు, ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని విడిచిపెట్టినప్పుడు, బకింగ్‌హాం కెనాల్‌ నీటిని ఎక్కువగా వదిలినప్పుడూ ఈ ఊట సమస్య మరీ తీవ్రంగా ఉండేది.
 
ఈ సమస్యను అధిగమించేందుకు రోజంతా 25 జనరేటర్లతో.. నిర్మాణ ప్రాంతానికి వచ్చి చేరిన నీటిని తోడుతూ పనులు సాగించారు. ఈ నీటిని తోడేందుకే రూ.5 కోట్ల దాకా వ్యయమైంది. తామెదుర్కొన్న ప్రధాన సమస్య నీటిని తోడే పనేనని ప్రాజెక్టు మేనేజరు జగన్‌ చెప్పారు. వరద నీరు వచ్చి చేరుతూ కాంక్రీటు పనులు చేపట్టేందుకు ఆటంకాలు ఏర్పడుతుంటే.. మరోవైపు కరకట్ట చుట్టూ ఉన్న ఆక్రమణలతో మరో సమస్య వచ్చిందని తెలిపారు. ప్రభుత్వం చొరవ చూపి పరిష్కరించడంతో నిర్వాసితుల నుంచి ఇబ్బందులు ఎదురుకాలేదన్నారు.
 
నిర్మాణం ఇలా..
ఎత్తిపోతల నిర్మాణంలో భాగంగా ఫోర్‌బే (వాగు వరదనీటి కలెక్షన్‌ పాయింట్‌), మోటారు పంప్‌హౌస్‌, డెలివరీ సిస్టమ్‌(డిశ్చార్జి పాయింట్‌), ఎస్కేప్‌ రెగ్యులేటర్‌, సబ్‌స్టేషన్‌, ట్రాన్స్‌మిషన్‌ లైన్ల నిర్మాణ పనులను మేఘా చేపట్టింది. ఫోర్‌బేలోకి వచ్చిన వరదనీటిని పంపులతో డెలివరీ సిస్టమ్‌ సాయంతో నదిలోకి ఎత్తిపోస్తారు. 16 పంపులు, 16 మోటార్లు ఏర్పాటు చేశారు. ఒక్కో పంపు నుంచి 350 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తారు. మొత్తంగా 15 పంపులే పనిచేస్తాయి. ఒక పంపు స్టాండ్‌బైగా ఉంటుంది. ఏదైనా మరమ్మతుకు వచ్చినప్పుడు ఈ పంపును ఉపయోగిస్తారు. ప్రతి పంపు పనిచేయడానికి 1.6 కిలోవాట్ల విద్యుత్‌ వినియోగించాలి. కృష్ణా నదికి ఎంత భారీ వరద వచ్చినా గరిష్ఠంగా 18.4 అడుగులకు మించదు. అయినా ముందుచూపుతో 22 అడుగుల ఎత్తులో డిశ్చార్జి పాయింట్‌ను నిర్మించారు. ఈ పాయింట్‌ నుంచి పంప్‌హౌస్‌ మధ్య 16 వరుసల పైపులైన్‌ను ఏర్పాటు చేశారు.
 
ఈ పైపులైన్‌ పొడవు 1.4 కిలోమీటర్లు. యుద్ధ ప్రాతిపదికన దీనిని పూర్తిచేసి.. విజయవాడ నుంచి ఉండవల్లి సీఎం అధికారిక నివాసం, తాత్కాలిక సచివాలయం వరకూ వెళ్లే రహదారిని పునరుద్ధరించారు. డిశ్చార్జి పాయింట్‌, కరకట్ట, పంప్‌ హౌస్‌ మధ్య ఉన్న ఖాళీ స్థలాన్ని అందమైన పార్కుగా తీర్చిదిద్దారు. డిశ్చార్జి పాయింట్‌ నుంచి కృష్ణా నది అందాలను సందర్శకులు సందర్శించేందుకు ఏర్పాట్లూ చేశారు. ఎత్తిపోతల పథకం నిర్వహణకు ప్రధానమైన విద్యుత్‌ లైన్లు, 132/11 కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మాణం కూడా పూర్తయింది. 1,250 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన రెండు డీజిల్‌ జనరేటర్లనూ ఏర్పాటు చేశారు. 5 లాకులతో (గేట్లు) ఎస్కేప్‌ రెగ్యులేటర్‌ నిర్మాణం కూడా పూర్తయింది. ఒక్కో గేటు పొడవు 2.65 మీటర్లు. వెడల్పు కూడా అంతే. కొండవీటివాగు వరద తీవ్రత ఎక్కువైతే ఈ లాకులను ఎత్తివేసి సహజ ప్రవాహంతో వరదనీటిని బకింగ్‌హాం కెనాల్లోకి మళ్లిస్తారు. ఎత్తిపోతల తొలిదశ పనులు విజయవంతంగా పూర్తయిన నేపఽథ్యంలో రెండోదశ కింద వాగు విస్తరణ పనులను మొదలెట్టబోతున్నారు.
 
9kondveeti123.jpgకొండవీటివాగు పథకం..
వ్యయం: రూ.222.44 కోట్లు
ఫోడెలివరీ సిస్టమ్‌: ఎత్తిపోతల కేంద్రంర్‌ బే: వరదనీటి నిల్వ ప్రాంతం
పంప్‌హౌస్‌: 16 పంపులు, 16 మోటార్లు
132/11 కేవీ సబ్‌స్టేషన్‌, ట్రాన్స్‌మిషన్‌ లైన్లు
2 డీజిల్‌ జనరేటర్లు (ఒక్కోటి 1,250 కిలోవాట్ల సామర్థ్యం)
ఎస్కేప్‌ రెగ్యులేటర్‌: 5 లాకులు
Link to comment
Share on other sites

18 minutes ago, sonykongara said:

adi kuda chestharu ga

Looks like Krishna West Canal's altitude is more than the Vagu

5 లాకులతో (గేట్లు) ఎస్కేప్‌ రెగ్యులేటర్‌ నిర్మాణం కూడా పూర్తయింది. ఒక్కో గేటు పొడవు 2.65 మీటర్లు. వెడల్పు కూడా అంతే. కొండవీటివాగు వరద తీవ్రత ఎక్కువైతే ఈ లాకులను ఎత్తివేసి సహజ ప్రవాహంతో వరదనీటిని బకింగ్‌హాం కెనాల్లోకి మళ్లిస్తారు.

 

Actually, these pumps are very useful when there are floods in both upper Krishna (i.e Munneru, Wyra, Katleru) and Kondaveetivagu.

Monna 17-22 Aug varshalu appdudu, almost 70K+ varada vatchindi just from Munneru +Wyra + Katleru

aa catchment villages vallu - varada ekkuva vatchina within one day lo clear ayyindi annaru

main reason is - aa days lo barrage level ni below 9 ft vuncharu

another advantage after capital - full monitoring on barrage

 

Edited by rk09
Link to comment
Share on other sites

ఏడు దశాబ్దాల కల నెరవేరింది
16న కొండవీటివాగు ఎత్తిపోతల పథకం ప్రారంభం
మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
amr-gen1a.jpg

తాడేపల్లి, న్యూస్‌టుడే: ఏడు దశాబ్దాలుగా వరద ముంపునకు గురవుతున్న రైతులు, గ్రామీణుల కష్టాలకు కొండవీటివాగు ఎత్తిపోతల పథకంతో తెర పడిందని రాష్ట్ర జలవనరుల మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు అన్నారు. సీతానగరంలో రూ.222 కోట్లతో నిర్మాణం పూర్తిచేసుకున్న కొండవీటివాగు ఎత్తిపోతల పథకాన్ని ముఖ్యమంత్రి 16న ఉదయం ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. మంగళవారం ఆయన ప్రారంభోత్సవానికి ఎత్తిపోతల వద్ద చేపట్టాల్సిన పనులను గుంటూరు జిల్లా కలెక్టర్‌ కోన శశిధర్‌, అర్బన్‌ ఎస్పీ విజయారావు, జలవనరుల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ వెంకటేశ్వరరావుతో కలసి పరిశీలించి పలు సూచనలు చేశారు. అమరావతి ప్రాంతంలో కొండవీటివాగునకు వరద వచ్చినపుడు పొలాలు మునిగే పరిస్థితి ఉండేదని, ఆ కష్టాన్ని సీఎం తీర్చారన్నారు. వాగులో 5,250 క్యూసెక్కుల నీటిని 16 పంపుల ద్వారా కృష్ణా నదిలో ఎత్తిపోసేలా పథకాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తిచేయటం జరిగిందన్నారు. కొండవీటివాగుతో గతంలో ఎలాంటి నష్టం జరిగేది, ఇప్పుడు కలిగే ప్రయోజనాలను వివరిస్తూ ఛాయాచిత్ర ప్రదర్శన ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. గోదావరి, పెన్నా అనుసంధానానికీ శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. హరిశ్చంద్రపురం వద్ద 10 టీఎంసీల నీటిని నిల్వ ఉంచేలా నూతన బ్యారేజీకీ శంకుస్థాపన జరుగనుందన్నారు. ఇది చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు.

పథకం ప్రారంభం ఇలా...
ఎత్తిపోతల పథకాన్ని 16న ఉదయం 10 గంటలకు సీఎం పైలాన్‌ ఆవిష్కరిస్తారు. పంపుహౌస్‌లో మోటార్లకు స్విచ్‌ ఆన్‌, పంపుల వద్ద జలసిరికి హారతి ఇస్తారని మంత్రి వెల్లడించారు. ఈ సందర్బంగా రైతులనుద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తారని, అవసరమైన ఏర్పాట్లు చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సీఎం భద్రతకు అవసరైన ఏర్పాట్లను గుంటూరు అర్బన్‌ ఎస్పీ విజయారావు పర్యవేక్షణలో సిబ్బంది చూస్తారన్నారు. వేదిక, ఇతర అంశాలపై కలెక్టర్‌ సూచనల మేరకు ఏర్పాట్లు పూర్తిచేయాలని మంత్రి ఆదేశించారు.

amr-gen1b.jpg

బుగ్గవాగు ఆధునికీకరణకు ప్రతిపాదన
జిల్లాలోని బుగ్గవాగు ఆధునికీకరణకు జలవనరుల శాఖ ప్రతిపాదనలు రూపొందిస్తుందని మంత్రి ఉమామహేశ్వరరావు తెలిపారు. దీనివల్ల గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ఉపయోగకరంగా ఉంటుందని, తాగునీటి అవసరాలకు సాగర్‌పై ఆధారపడాల్సిన అవసరం ఉండదన్నారు. తాగునీటిని నిల్వ చేసి, వేసవి ముగిసే వరకు బుగ్గవాగును ఉపయోగించుకోవచ్చన్నారు. దీనిని హెలికాఫ్టర్‌ ద్వారా ముఖ్యమంత్రి పరిశీలిస్తారన్నారు.
* జలసిరికి హారతిలో భాగంగా 14న సీఎం తిరుపతి నుంచి కర్నూలు జిల్లాలో జరిగే కార్యక్రమంలో హెలికాఫ్టర్‌ ద్వారా పాల్గొంటారని మంత్రి చెప్పారు. 14న శ్రీశైలం, నాగార్జునసాగర్‌, కర్నూలు జిల్లాలను సీఎం సందర్శిస్తారన్నారు. 15న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో జలసిరికి హారతి కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. 16న కొండవీటివాగు పథకం ప్రారంభిస్తారని తెలిపారు. దశాబ్దం తర్వాత శ్రీశైలం, నాగార్జునసాగర్‌ పూర్తిగా నీటితో నిండిందని, పులిచింతలో నీటి సామర్థ్యం పెరిగిందని వెల్లడించారు. వీటిని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి పర్యటిస్తారని ఆయన వివరించారు.

Link to comment
Share on other sites

కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం నేడు ప్రారంభం
16-09-2018 07:54:44
 
636726812805012268.jpg
  • జాతికి అంకితం చేయనున్న సీఎం చంద్రబాబు
  • ఏర్పాట్లను పరిశీలించిన ఉన్నతాధికారులు
గుంటూరు: ప్రకాశం బ్యారేజీ ఎగువున నూతనంగా నిర్మించిన కొండవీటి వాగు వరదనీటి ఎత్తిపోతల పథకం ప్రారంభానికి సిద్ధమైంది. ఆదివారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ పథకాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. జలసిరి కార్యక్రమంలో పాల్గొని డిశార్జ్‌ పాయింట్‌ వద్ద ఏర్పాటుచే సిన సభలో రైతులను ఉద్ధేశించి మాట్లాడతారు. ఈ మేరకు సభా ప్రాంగణం, పైలాన్‌ నిర్మాణం, పంప్‌హౌస్‌ వద్ద భారీకేడ్ల ఏర్పాటు, గ్రీనరీ పనులు పూర్తయ్యాయి. అర్బన్‌ ఎస్పీ విజయరావు సభా ప్రాంగణాన్ని, పంప్‌హౌస్‌ వద్ద ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
 
రూ.237 కోట్లతో ఎత్తిపోతల పథక నిర్మాణం
కొండవీటి వాగు ముంపునకు ముకుతాడు వేయడానికి 2017 మార్చి 30న 237 కోట్లతో వరదనీటిని ఎత్తిపోసే విధంగా ఎత్తిపోతల పథకం నిర్మించడానికి సీఎం చంద్రబాబు శంఖుస్థాపన చేశారు. నిర్మాణ పనులు దక్కించుకున్న మేఘా ఇంజనీరింగ్‌ కంపెనీ, ప్రభుత్వ, స్థానిక ప్రజాప్రతినిధులు సహకారంతో పలు అవరోధాలను అధిగమించి నిర్మాణం పూర్తి చేసింది. విజయవంతంగా ట్రయల్‌ రన్‌ కూడా నిర్వహించారు.
 
ఎత్తిపోతల పథకం నిర్మాణం ఇలా...
కొండవీటివాగు నుండి వచ్చే వరదనీటిని 110/110 మీటర్ల విస్తీర్ణంలో ఉండే ఫోర్‌ బే (సంపు వంటి నిర్మాణం) లోకి తరలిస్తారు. దీని ఎత్తు 17.4 మీటర్లు. ఇంచుమించు కొండవీటివాగు గరిష్ట లెవల్‌కు సమానం. ఇందులో 16 పంపులు, 16 మోటార్లు ఉంటాయి. పంప్‌హౌస్‌ అవతల ఉన్న ఫోర్‌ బే నుండి పైప్‌లైన్ల ద్వారా నదివైపు ఏర్పాటు చేసిన డిశ్చార్జ్‌ పాయింట్‌ ద్వారా వరదనీటిని కృష్ణానదిలోకి ఎత్తిపోస్తారు. కృష్ణానది గరిష్ట నీటిమట్టం 18.4 అడుగులు. దీనిని దృష్టిలో ఉంచుకొని 22 మీటర్ల ఎత్తను డెలివరీ సిస్టంను ఏర్పాటు చేశారు. ఇక్కడ నుంచి సుమారు 5252 క్యూసెక్కుల వరదనీటిని నదిలోకి తరలిస్తారు. అలాగే ఫోర్‌ బే సమీపంలో ఏర్పాటు చేసిన ఎస్కేప్‌ రెగ్యులేటర్‌ ద్వారా నాలుగు వేల క్యూసెక్కులనీటిని బకింగ్‌హామ్‌కెనాల్‌కి తరలించే విఽధంగా కూడా నిర్మాణం చేపట్టారు.
 
ట్రాఫిక్‌ మళ్లింపు.. భారీ బందోబస్తు
ముఖ్యమంత్రి కార్యక్రమం సందర్భంగా ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలు చేపడుతున్నట్లు నార్త్‌జోన్‌ డీఎస్పీ రామకృష్ణ తెలిపారు. విజయవాడ నుంచి బ్యారేజీ దాటి మంగళగిరి వైపు వెళ్లే వాహనాలు సీతానగరం రామకృష్ణాహైస్కూలు, బోటు యార్డు మీదుగా వెళ్ళాలి. మంగళగిరి నుంచి విజయవాడ వెళ్లే వాహనాలు ఉండవల్లి కూడలి నుంచి బోటు యార్డు మీదుగా వెళ్ళాలి. అలాగే వెంకటపాలెం నుండి ఉండవల్లి కరకట్ట మీదుగా విజయవాడ వైపు వెళ్లే వాహనాలు ఉండవల్లి ఊళ్ళో గుండా, కూడలి మీదుగా వెళ్ళాలి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ఈ నిబంధనలు వర్తిస్తాయన్నారు. అలాగే 363 మందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అడిషనల్‌ ఎస్పీ, 5గురు డీఎస్పీలు, 17 మంది సీఐ /ఆర్‌లు, 25 మంది ఎస్సైలు, 22 మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు 223 మంది పీసీలు, హోమ్‌గార్డులు, 20 మంది మహిళా కానిస్టేబుళ్లు, 60 మంది ఏఆర్‌ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు చె ప్పారు.
 
 
ముంపు సమస్య ఇదీ..
కొండవీడు కొండల నుంచి పుట్టిన జలప్రవాహం, లాం నుంచి వాగు రూపాన్ని సంతరించుకొని తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాల మీదుగా 28.5 కిలోమీటర్లు ప్రయాణించి తాడేపల్లి మండలం సీతానగరం ప్రకాశం బ్యారేజీ వద్ద ఎగువ కృష్ణానదిలో క లుస్తోంది. ఈ వాగు కేవలం 25 మీటర్లు వెడల్పు ఉండి అధిక వర్షాల నేపధ్యంలో 8 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో ప్రవహిస్తుంది. తక్కువ వెడల్పుతో ఎక్కువ సామర్య్ధం కూడిన ప్రవాహం రావడంతో బలహీనంగా ఉన్న చోట్ల కట్టలు తెగి సమీపంలోని పంట భూములను ముంచెత్తుతోంది. దీనికి తోడు భారీ వర్షాలు కురిసిన సమయంలో కృష్ణానదిలో కూడా నీటిమట్టం పెరిగి కొండవీటి వాగు వరద నీరు కూడా నదిలో కలవకుండా వెనక్కి తన్ని ఒత్తిడి వలన ఎక్కడికక్కడ పొంగి పొర్లుతుంది. దీని వలన ఏటా వేలాది ఎకరాలు ముంపునకు గురౌతుంది.
 
 
పంపింగ్‌ స్కీం వివరాలు
మొత్తం పంపులు- 16
ఒక్కో పంపు సామర్థ్యం- 350 క్యూసెక్కులు
మొత్తం విడుదల సామర్థ్యం- 5,000 క్యూసెక్కులు
పంపుహౌస్‌ పునాది మట్టం- +4.85 మీటర్లు
పంపు ఫ్లోర్‌ మట్టం- +16.00 మీటర్లు
మోటార్‌ ఫ్లోర్‌ మట్టం- +22.50 మీటర్లు
మొత్తం పైపులు- 16
పైపు వ్యాసం- 2 మీటర్లు
పైపుల పొడవు- 1,396 మీటర్లు
డెలివరీ మట్టం- +22.50 మీటర్లు
విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సామర్థ్యం- 132 కేవీ
ట్రాన్స్‌మిషన్‌ టవర్లు- 22
మూలం- తాడేపల్లి ఉపకేంద్రం
సర్‌ప్లస్‌ ఎస్కేప్‌ రెగ్యులేటర్‌- 44 X 45 మీటర్లు
ద్వారాలు- 5
Link to comment
Share on other sites

ఎత్తిపోతల పథకం ద్వారా సమస్యకు పరిష్కారం లభించింది: చంద్రబాబు
16-09-2018 13:50:39
 
636727026362633552.jpg
 
గుంటూరు జిల్లా: ఉండవల్లిలో కొండవీటి వాగు ఎత్తిపోతల పథకాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం ప్రారంభించారు. లిఫ్ట్ స్కీమ్ దగ్గర పైలాన్‌ను ఆవిష్కరించారు. ఎత్తిపోతల పథకంతో రాజధాని ప్రాంతంలో ముంపు సమస్య తొలగిపోతుందని సీఎం చెప్పారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం నిర్మాణంలో పనిచేసిన ఇంజనీర్లకు అభినందనలు తెలిపారు. మూడు రోజులుగా జలసిరికి హారతి కార్యక్రమం కొనసాగుతోందని, రాష్ట్రాన్ని కరువురహితంగా తీర్చిదిద్దేందుకు జలదీక్ష చేపట్టామని అన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌ జలాశయాల్లో పూర్తిస్థాయిలో నీరు ఉందని, రాజధాని పరిధిలో చాలా ప్రాంతాలు వరదల కారణంగా మునిగిపోతున్నాయని అన్నారు. ఎత్తిపోతల పథకం ద్వారా సమస్యకు పరిష్కారం లభించిందని చంద్రబాబు పేర్కొన్నారు.
 
రాజధాని నిర్మాణం కోసం రైతులు 33వేల ఎకరాలు త్యాగం చేస్తే.. ప్రతిపక్ష నేతలు మాత్రం రాజధాని మునుగుతుందని ప్రచారం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. రాజధానిలో పనులు జరక్కుండానే.. లక్ష కోట్ల అవినీతి జరిగిందని తప్పుడు ప్రచారం చేశారని ఆయన విమర్శించారు. రోజుకు ఒక టీఎంసీ వరద నీరు వచ్చినా సమస్య లేదన్నారు. 7 వేల క్యూసెక్కుల నీరు ఎత్తిపోసేలా రెండో దశలో ఎత్తిపోతల పథకం చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. తన జీవితంలో ఎప్పుడు పెట్టని శ్రద్ధ జలవనరులశాఖపై పెట్టానని అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం ఇంకా రూ.2,500 కోట్లు ఇవ్వాల్సి ఉందని చంద్రబాబు తెలిపారు. ప్రాజెక్టు పనులు ఆగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. దేశంలో ఏ ప్రాజెక్టు పనులు ఇంత వేగంగా జరగట్లేదన్నారు. 2019 మే కల్లా పోలవరం ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా నిరిస్తామని సీఎం స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

కొండవీటి వాగు ఎత్తిపోతల పథకం జాతికి అంకితం
17-09-2018 09:57:17
 
636727750338368123.jpg
  • ప్రారంభించిన సీఎం చంద్రబాబు
  • రాజధానికి ముంపు ముప్పు లేదని ప్రకటన
  • అనుసంధానం జరిగిన చోట జల హారతి
  • రూ.400 కోట్లతో రెండో దశ పనులు చేపడతామని ప్రకటన
  • గుంటూరు చానల్‌ పొడిగింపు పైనా హామీ
 
రాజధానికి ముంపు సమస్య తీరిపోయింది. దశాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని వరదనీటితో ముంచేస్తున్న కొండవీటి వాగు సమస్యకు శాశ్వత పరిష్కారంగా నిర్మించిన ఎత్తిపోతల పథకాన్ని ఆదివారం సీఎం చంద్రబాబు జాతికి అంకితం చేశారు. నీరు నదిలో కలిసే డిశ్చార్జ్‌ పాయింట్‌ వద్ద జలసిరికి హారతినిచ్చారు. రాజధానికి ఇక ముంపు ఉండబోదని ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. వైకుంఠపురం బ్యారేజీకి వచ్చే నెలలో శంకుస్థాపన చేసి, ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు.
 
 
గుంటూరు: అమరావతి రాజధానిలోని ఉండవల్లిలో నూతనంగా నిర్మించిన కొండవీటివాగు వరదనీటి ఎత్తిపోతల పథకం మోటార్లకు ఆదివారం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్విచ్‌ఆన్‌ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పైలాన్‌ను ఆవిష్కరించి కృష్ణానదికి హారతి పట్టారు. ఈ సందర్భంగా వేదపండితులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ జిల్లాకు పలు వరాలను ప్రకటించారు. వైకుంఠపురం బ్యారేజ్‌కు వచ్చే నెలలో శంకుస్థాపన చేసి ఏడాదిలో పూర్తి చేస్తామన్నారు. అక్కడ 10 టీఎంసీల నీటిని నిల్వబెడతామని తెలిపారు. ప్రకాశం బ్యారేజ్‌ దిగువున చౌడవరం వద్ద మరో బ్యారేజ్‌ నిర్మించి నీటిని నిల్వ చేసి పంటలకు, తాగునీటి అవసరాలకు ఉపయోగిస్తామన్నారు. పులిచింతల ప్రాజెక్టు దిగువ నుంచి కృష్ణానది అంతర్ధానం వరకు రెండు వైపులా నీరు ఉండేలా చూస్తామన్నారు. కొండవీటి వాగు వరదనీటి ఎత్తిపోతల పథకం తొలిదశ నిర్మాణానికి రూ.222 కోట్లు ఖర్చు చేశామని, దీనివలన వాగు నుంచి ప్రస్తుతానికి ఐదు వేల క్యూసెక్కుల నీటిని కృష్ణానదిలోకి ఎత్తిపోయవచ్చన్నారు.
 
మరో నాలుగు వేల క్యూసెక్కుల నీటిని ఎస్కేప్‌ రెగ్యులేటర్‌ ద్వారా పశ్చిమ ప్రధాన కాలువలోకి మళ్లించ వచ్చన్నారు. రోజుకు ఒక టీఎంసీ నీటిని ఈ స్కీం ద్వారా ఎత్తిపోయవచ్చని తెలిపారు. రెండో దశలో లాం వద్ద నుంచే మరో 5,250 క్యూసెక్కుల నీటిని వైకుంఠపురం బ్యారేజ్‌కు మళ్లిస్తామన్నారు. మరో ఎత్తిపోతల పథకం నిర్మించి రాజధాని అవసరాలకు నీటిని వినియోగిస్తామన్నారు. వీటన్నింటి కోసం రూ.400 కోట్ల నిధులు ఖర్చు పెడతామన్నారు. అమరావతి రాజధానికి ఇక ముంపు ఉండబోదని ధైర్యంగా ప్రకటిస్తున్నానన్నారు. త్వరితగతిన ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసిన జలవనరుల శాఖ ఇంజనీర్లు, మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ సిబ్బందిని సీఎం అభినందించారు. గుంటూరు చానల్‌ పొడిగింపు ప్రాజెక్టు పూర్తి చేస్తే కొత్తగా 50 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. అంచనాల తయారీకి అయ్యే రూ.87 లక్షలకు సభా వేదిక మీద నుంచే శాంక్షన్‌ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ.489 కోట్ల నిధులు అవసరమౌతాయన్నారు. అలానే హెడ్‌ పంపింగ్‌ స్లూయిజ్‌కు రూ.13 కోట్లు మంజూరు చేశారు. ఆధునికీకరణకు రూ.350 కోట్ల నిధులను విడుదల చేశామన్నారు. వరికపూడిశెల లిఫ్టు ఇరిగేష్‌ ప్రాజెక్టుని త్వరలోనే చేపడతామన్నారు.
 
ఈ కార్యక్రమంలో జిల్లా మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, తెనాలి శ్రావణ్‌కుమార్‌, రావెల కిషోర్‌బాబు, నామినేటెడ్‌ ఎమ్మెల్యే ఫిలిప్‌ సీ థోచర్‌, ఎమ్మెల్సీ ఏఎస్‌ రామకృష్ణ, కలెక్టర్‌ కోన శశిధర్‌, సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌, అర్బన్‌ ఎస్పీ విజయారావు, ఏపీ ఫుడ్‌ కమిషన్‌ చైర్మన్‌ జేఆర్‌ పుష్పరాజ్‌, జడ్పీ ఛైర్‌పర్సన్‌ షేక్‌ జానిమూన్‌, దివ్యాంగుల సంస్థ చైర్మన్‌ కోటేశ్వరరావు, మైనార్టీ కమిషన్‌ చైర్మన్‌ జియావుద్దీన్‌, మిర్చియార్డు చైర్మన్‌ మన్నవ సుబ్బారావు, కృష్ణా పశ్చిమ డెల్టా పీసీ చైర్మన్‌ మైనేని మురళీ, ఎపెక్స్‌ కమిటీ సభ్యుడు ఆళ్ల గోపాలకృష్ణ, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ అడ్మిన్‌ కె.శ్రీనివాస్‌, సీఈ ఆర్‌.సతీష్‌కుమార్‌, ఎస్‌ఈ ఎం.బాబూరావు తదితరులు పాల్గొన్నారు.
 
 
త్వరలో హరిశ్చంద్రాపురం ఎత్తిపోతల
సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. హరిశ్చంద్రాపురం వద్ద గోదావరి నీటిని నాగార్జునసాగర్‌ కాలువలకు మళ్లించే ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని కూడా త్వరలో చేపట్టబోతున్నాం. బ్యారేజ్‌ దిగువన చౌడవరం వద్ద మరో ఆనకట్ట నిర్మించబోతున్నాం. పట్టిసీమ ప్రాజెక్టు దండగని జగన్‌ మాట్లాడాడు. నేడు డెల్టాని సస్యశ్యామలం చేస్తున్న పట్టిసీమ నీటిని చూసి ఆయన ముఖం ఎక్కడ పెట్టుకొంటారరు. నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌లో కేసులు వేయిస్తూ రాజధానికి అడ్డుపడుతున్నారు. అలానే వెలిగొండ ప్రాజెక్టు ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారు.
- మంత్రి దేవినేని ఉమా
 
 
వేగంగా రాజధాని నిర్మాణం
ప్రపంచస్థాయి ప్రమాణాలతో అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతోంది. పరిపాలన, న్యాయ నగరాల్లో నాలుగు వేల అపార్టుమెంట్ల నివాసాలు వేగవంతంగా జరుగుతున్నాయి. కొండవీటి వాగు, పాలవాగుల డిజైన్లను నెదర్లాండ్స్‌ నిపుణులతో చేయించాం. వాళ్లు రాబోయే 100 ఏళ్లలో గరిష్టంగా 16 వేల క్యూసెక్కుల వరద వస్తుందని చెబితే తాము 22 వేల క్యూసెక్కులకు డిజైన్‌ చేశాం.
- మంత్రి పి.నారాయణ
 
 
అమరావతికి వరప్రదాయిని
అమరావతి ఒక ప్రపంచ స్థాయి నగరంగా రూపుదిద్దుకొంటోంది. కొండవీటి వాగుకు హఠాత్తుగా వచ్చే వరదతో ముంపు ఉంది. ఇది గమనించిన సీఎం తమకు ఎత్తిపోతల పథకం నిర్మించాలని ఆదేశాలు ఇచ్చారు. ఆరు నెలల్లోనే పూర్తి చేయాలని చెప్పినా అనివార్య కారణాలతో జాప్యం జరిగింది. ఎట్టకేలకు ఏడాదిన్నరలో పూర్తి చేశాం. ఇది అమరావతికి వరప్రదాయినిగా మారుతుంది.
- శశిభూషణ్‌కుమార్‌, జలవనరుల శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ
 
 
అపర భగీరథుడు చంద్రబాబు
తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ కుమార్‌ మాట్లాడుతూ కొండవీటి వాగు ఈ ప్రాంత వాసులకు భవిష్యత్తులో వరప్రదాయినిగా నిలుస్తుందని అపర భగీరదుడు చంద్రబాబు రాజదాని అభివృద్దికి ఎనలేని కృషి చేస్తున్నారన్నారు.
- ఎమ్మెల్యే శ్రావణ్‌ కుమార్‌
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...