Jump to content

kondaveeti vagu


Recommended Posts

The most best way better transfer water to Nagarjuna sagar canal in Guntur ofcourse few kms pampali water but deni valal lakhs of acres farming cheyochu

or

Transfer it to near by ponds, small canals drinking water storage ki long distance ki link cheyali

or

flood una time Gundlakama reservior ki oka link canal tavi water ni that canal lo pump chesthe we can use water

true... sagar canal ki pampisthe chala benefit AP ki...

Link to comment
Share on other sites

  • Replies 306
  • Created
  • Last Reply

Top Posters In This Topic

ముంపు మళ్లింపు.. ఆపై వంపూ, సొంపు

జల ప్రయాణానికి వీలుగా కొండవీటి వాగుకు మార్పులు

నదిలో నుంచి రాజధాని ప్రాంతం మీదుగా మళ్లీ నదిలోకి

వాగు గట్లు పటిష్ఠం, సుందరీకరణ నది ఒడ్డున నాలుగు వరుసల రహదారి

నదిలో ద్వీపాల సుందరీకరణ దృష్టి సారించిన సర్కారు

ఈనాడు - హైదరాబాద్‌

031ap-main13a.jpg

ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని అమరావతిలో కొండవీటి వాగు వరదను నియంత్రించడంతో పాటు ఈ వాగును, కృష్ణా నదిని ఆలంబనగా చేసి సుందరీకరణ, పడవ ప్రయాణం, పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం తలపోస్తోంది. అమరావతి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇందుకు అవసరమైన కసరత్తు సాగుతోంది. ఇప్పటికే దీనిపై అధ్యయనం చేస్తున్న బ్లూ కన్సల్టెన్సీ సమగ్ర ప్రణాళిక రూపొందించింది. ఇంతకుముందు ఆర్‌వీ కన్సల్టెన్సీ కొన్ని ప్రతిపాదనలు రూపొందించగా తాజాగా వరద నియంత్రణ-సుందరీకరణపై బ్లూ కన్సల్టెన్సీ సమగ్ర ముఖచిత్రం రూపొందించినట్లు సమాచారం. ఈ సంస్థ గతంలో నర్మద వరద నియంత్రణ ప్రాజెక్టులో పని చేసిందని అధికారులు చెబుతున్నారు.

వరదపై లెక్కలు

జలవనరులశాఖ నిపుణులు కొండవీటి వాగు నుంచి వరద సమయంలో రోజూ 16,000 క్యూసెక్కుల వరకు ప్రవాహాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. బ్లూ కన్సల్టెన్సీ నమూనా పరిశీలన చేపట్టి 20 వేల క్యూసెక్కుల వరకు కూడా ఉంటుందని తాజాగా పేర్కొంది. తదనుగుణంగా ముంపును కృష్ణా నదిలోకి మళ్లించే మార్గాలు సూచిస్తోంది.

*గతంలో ఈ వరదను కొంత మళ్లించడంతో పాటు మరికొంత రాజధాని అవసరాలు తీర్చేందుకు జలాశయాలు ఏర్పాటు చేసి నిల్వ చేస్తే మంచిదని జలవనరులశాఖ నిపుణులు భావించారు. ప్రతి వానాకాలంలోను మూడుసార్లు మాత్రమే ఈ వరద వస్తుందని, దీంతో జలాశయాలు నింపగల అవకాశమూ తక్కువేనని తాజా వాదనలు వస్తున్నాయి. ఎలాగూ వైకుంఠపురం వద్ద కృష్ణా నదిపై బ్యారేజి నిర్మాణానికి ప్రతిపాదన ఉంది. అక్కడ 8 టీఎంసీల వరకు నిల్వ చేసే ఆలోచన ఉన్నందున అది సరిపోతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

*కొండవీటి వాగు వరదను ప్రధానంగా కృష్ణా నదిలోకి ఎత్తిపోయడమే మేలని భావిస్తున్నారు. ఉండవల్లి వద్ద అందుకు తగ్గ ఏర్పాట్లు చేయబోతున్నారు. తాజా లెక్కలను ఖరారు చేసుకుని వరద వచ్చిన సందర్భంలో కొంత కృష్ణా పశ్చిమ కాలువ ద్వారాను, మరికొంత నదిలోకి మళ్లిస్తారు.

రాజధానిలోకి పడవ ప్రయాణం- సుందరీకరణ

ఈ కొండవీటి వాగును ఆధారంగా చేసుకుని కృష్ణా నదిలో నుంచి అమరావతి రాజధాని ప్రాంతంలోకి పడవ ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్నారు. కొండవీటి వాగును ఇందుకు అనువైన కాలువగా తీర్చిదిద్దబోతున్నారు. కృష్ణా నదిలో నుంచి నీరుకొండ, రాజధాని ప్రాంతం మీదుగా తిరిగి ఉండవల్లి వద్ద నదిలో కలిసేలా ఏర్పాట్లు చేయబోతున్నారు.

*కొండవీటి వాగు గట్లను పటిష్ఠం చేస్తారు. ఆ గట్లను సుందరంగాను తీర్చిదిద్దనున్నారు.

*పడవ ప్రయాణం ఏర్పాటు చేసి పర్యాటకంగా తీర్చిదిద్దనున్నారు.

*కృష్ణా నది గట్లను కొంత మార్చి, ఎగుడు దిగుళ్లు లేకుండా చేసి గట్టు పొడవునా రాజధాని ప్రాంతంలోకి నాలుగు వరుసల రహదారి ఏర్పాటు చేయబోతున్నారు. కృష్ణా నదిలో మధ్య మధ్య ఉన్న ద్వీపాల సుందరీకరణ చేపట్టబోతున్నారు.

8న భేటీలో కూలంకషంగా చర్చ

వాగు వరదపై తాజా లెక్కలు, నమూనా అధ్యయనాలపై సెప్టెంబరు 8న జరిగే సమావేశంలో కూలంకషంగా చర్చించనున్నట్లు జలవనరులశాఖ అధికారులు చెప్పారు. కన్సల్టెన్సీ నివేదికపై సమగ్ర చర్చ తర్వాత తుది నిర్ణయాలు తీసుకుంటారు. ముంపు సమస్య పరిష్కారం వరకు జలవనరులశాఖ దృష్టి సారిస్తున్నా సుందరకీరణ తదితర పనులు అమరావతి అభివృద్ధి సంస్థ అధికారులు పరిశీలించనున్నారు.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...
సీఎం చంద్రబాబుతో సీఆర్‌డీఏ అధికారుల భేటీ
 
విజయవాడ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో సీఆర్డీఏ అధికారులు బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్బంగా కొండవీటి వాగు ముంపు నివారణకు సంబంధించి ముఖ్యమంత్రికి నెదర్లాండ్స్ బృందం పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చింది. అలాగే సీఆర్డీఏ పరిధిలో పలు విషయాలకు సంభందించిన అంశాలపై కూడా అధికారులు భేటీలో చర్చించినట్లు తెలిసింది.
Link to comment
Share on other sites

జాతీయ జలమార్గంతో పారిశ్రామిక ప్రాంతం అనుసంధానం

రాజధానిలో 14 కి.మీ. సరకు రవాణా మార్గం

ప్రయాణికుల రవాణాకు 32 కి.మీ. కాలువలు

ఈనాడు - అమరావతి

రాజధాని అమరావతిలో ఏర్పాటుచేసే పారిశ్రామిక ప్రాంతాన్ని, జాతీయ జలరవాణా మార్గంతో అనుసంధానిస్తూ నగరంలో ఉండవల్లి-నీరుకొండ మధ్య 14కి.మీ. పొడవైన జల రవాణా మార్గాన్ని అభివృద్ధి చేయాలని బ్లూ కన్సల్టెన్సీ సంస్థ టాటా-ఆర్కాడిస్‌ ప్రతిపాదించింది. ప్రయాణికుల రవాణా, పర్యాటకుల విహారానికి మరో 32కి.మీ. పొడవైన జలమార్గాలు ఏర్పాటుచేయవచ్చంది. అమరావతిని ‘హరిత-నీలి’ నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్న రాష్ట్రప్రభుత్వం తదనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. సరకు, ప్రయాణికులు, పర్యాటకుల విహారానికి అనువుగా కాలువల్ని తీర్చిదిద్దాలంటే రూ.531కోట్లు అవసరమని అంచనా కడుతోంది.

ప్రమాదాన్నే ప్రమోదంగా.. అమరావతికి ప్రధాన సమస్యగా భావిస్తున్న కొండవీటివాగు, పాలవాగుల్నే.. వినోద, విహార కేంద్రాలుగా, రవాణా మార్గాలుగా మార్చుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. కొండవీటి వాగు వరద ముంపు నుంచి అమరావతిని కాపాడేందుకు, కాలువల నగరంగా తీర్చిద్దేందుకు ప్రణాళిక రూపకల్పనకు టాటా-ఆర్కాడిస్‌ను బ్లూకన్సల్టెంట్‌గా నియమించింది. వరద ముంపు నివారణ, కృష్ణానదిలో దీవుల అభివృద్ధి, రాజధానిలో జల రవాణా మార్గాల అభివృద్ధిపై కన్సల్టెన్సీ సంస్థ ప్రాథమిక నివేదికలు అందజేసింది. రాజధాని పరిధిలో 63కి.మీ. పొడవైన కాలువలు వెళుతుండగా..వీటిలో 14కి.మీ. పొడవైన కాలువని సరకు రవాణాకు, 32కి.మీ. కాలువల్ని ప్రయాణికుల రవాణా, పర్యాటకుల విహారానికి వినియోగించుకోవచ్చునని సూచించింది. వాణిజ్య, వినోద అవసరాలకు అనుగుణంగా కాలువల్ని తీర్చిదిద్దాలంటే రూ.531.5 కోట్లు వ్యయమవుతుందని, నిర్వహణ వ్యయంగా ఏటా రూ.26.57 కోట్లు కావాలని పేర్కొంది. వినోద అవసరాలకే సరిపెట్టాలనుకుంటే రూ.224.5 కోట్లు, నిర్వహణకు రూ.11.22 కోట్లు కావాలని అంచనాగట్టింది.

నిరంతరం నీరు ప్రవహించేలా.. సరకు, ప్రయాణికుల రవాణాకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చోట కాలువల వెడల్పు, సుందరీకరణ పనులు చేపడతారు. కాలువల్లో నిరంతరం నీరుండేలా చూస్తారు. ఈ కాలువల్లో ఎప్పుడూ 0.5 టీఎంసీల జలాలుంటాయని అంచనా. కాలువల పొడవునా 126కి.మీ. ఒడ్డుపై రకరకాల మొక్కలు నాటి హరిత హారంలా తీర్చిదిద్దుతారు. కాలువల వెంబడి కీలక ప్రాంతాలను పర్యాటక ఆకర్షక ప్రదేశాలుగా రూపుదిద్దుతారు. రాజధానిలో కాలువల అభివృద్ధికి సంబంధించి టాటా-ఆర్కాడిస్‌ సంస్థ త్వరలో వివరణాత్మక ప్రణాళిక అందజేయనుంది.

Link to comment
Share on other sites

  • 2 weeks later...
  • 1 month later...

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...