Jump to content

polavaram


Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply

పోలవరానికి జీఎస్‌ఐ అనుమతులు

ఇక కాంక్రీటు పనులు వేగవంతం చేస్తాం

సీఎంకు తెలిపిన అధికారులు

పర్యవేక్షక కమిటీ ఏర్పాటు చేస్తున్నామన్న ప్రాజెక్టు అథారిటీ

15ap-state1a.jpg

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు జియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా(జీఎస్‌ఐ) నుంచి రావాల్సిన అన్ని అనుమతులు వచ్చాయని, దీంతో పాటు కాంక్రీటు పనులు చేపట్టేందుకు యంత్రపరికరాలు వస్తున్నందున ఇక పనులు వేగవంతం అవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అధికారులు తెలియజేశారు. పోలవరంపై ముఖ్యమంత్రి సోమవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. పనులు ఎలా జరుగుతున్నాయని క్షేత్రస్థాయిలో ఉన్న అధికారి వేమన రమేష్‌బాబును సీఎం అడిగారు. ‘డయాఫ్రంవాల్‌ పనులు, గేట్ల ఫ్యాబ్రికేషన్‌ పనులు లక్ష్యాన్ని మించి జరుగుతున్నాయి. కాంక్రీటు పనులు వచ్చేవారంలో వేగం అందుకుంటాయి. కాంక్రీటును మోసుకెళ్లే పరికరాలు 12 రానున్నాయి. కాంక్రీటు కన్వేయన్స్‌ బెల్టులు ఇప్పటికే రెండు ఉండగా.. మరో రెండు వస్తాయి. ఈ యంత్రపరికరాలన్నీ రావడం వల్ల కాంక్రీటు పనులు వేగం పుంజుకుంటాయి’ అని రమేష్‌బాబు వివరించారు. సర్‌ ఆర్థర్‌ కాటన్‌ జయంతి కావడంతో ముఖ్యమంత్రి ఈ సమావేశం మధ్యలోనే కాటన్‌కు నివాళులర్పించారు. కాటన్‌ రోజుల నాటి నుంచి ఆయన అనుసరించిన విధానాలు ప్రభుత్వాలు పాటించి ఉంటే ఈ రోజు కరవు అనేది ఉండేది కాదన్నారు. ఎలాంటి యంత్రాలు లేని రోజుల్లో కాటన్‌ ఎంతో చేశారని ముఖ్యమంత్రి శ్లాఘించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యదర్శి ఆర్‌ కె గుప్తా మాట్లాడారు. ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి సాయిప్రసాద్‌ ఆధ్వర్యంలో ప్రాజెక్టు అత్యున్నత పర్యవేక్షక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. పోలవరం ప్రాజెక్టు సలహాదారు భార్గవతోను ముఖ్యమంత్రి మాట్లాడారు. గుత్తేదారు అధికంగా యంత్రసామాగ్రిని సమీకరించడం, సరిగా మేనేజ్‌మెంట్‌ చేయకపోవడం వల్ల ఆర్థికంగా ఎంతవరకు వయబిలిటీ ఉంటుందనేది అనుమానంగా ఉందన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో చెల్లింపుల విషయంపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. బ్యాంకర్లు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎస్క్రో ఖాతాలకు సొమ్ములు బదిలీ చేయడానికి తమకు ఎలాంటి ఇబ్బంది లేదని వారు సీఎంకు వివరించారు.

ఎన్‌ఆర్‌ఎస్‌ఏ ప్రజంటేషన్‌: సమావేశంలో నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ(ఎన్‌ఆర్‌ఎస్‌ఏ) ముఖ్యమంత్రికి అర్థగంట పాటు ఒక ప్రజంటేషన్‌ ఇచ్చింది. ఒక ప్రాంతంలో పడ్డ వర్షం అక్కడే ఎలా వినియోగించుకోవాలి, ఇందుకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలనే విషయమై ఒక నివేదిక సమర్పించారు. అనంతపురం జిల్లాను నమూనాగా తీసుకుని ఈ అధ్యయనం చేశారు. ఐదేళ్ల వర్షపాతం, ఐదేళ్ల గణాంకాలు దృష్టిలో ఉంచుకుని అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. సమావేశంలో జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

పోలవరం ఎస్‌ఈ రమేష్‌బాబు పదవీకాలం పొడిగింపు

మరో రెండేళ్లు పొడిగించేందుకు నిర్ణయం

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో క్షేత్రస్థాయిలో ఉండి పూర్తి స్థాయి పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎస్‌ఈ వేమన రమేష్‌బాబుకు మరో రెండేళ్ల పాటు పదవీకాలాన్ని పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయన ఏప్రిల్‌ నెలాఖరునే పదవీ విరమణ చేయాల్సి ఉంది.పోలవరం ప్రాజెక్టులో పనుల ప్రాధాన్యం దృష్ట్యా తొలి నుంచి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు ఆయనే పర్యవేక్షిస్తున్నందున ఆయన కొనసాగించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు రెండేళ్ల పాటు రమేష్‌బాబుకు పదవీకాలాన్ని పొడిగిస్తూ దస్త్రం సమర్పించాలని జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌కు ఆదేశాలు అందాయి. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

Link to comment
Share on other sites

Sir Arthur Cotton ippatiki prajalaku gurthunnarante only reason great projects he built for Godavari, Krishna & Penna deltas.

 

Hope CBN will complete all major irrigation projects in his tenure & will be remembered for next 100s of years.

Link to comment
Share on other sites

Guest Urban Legend

Sir Arthur Cotton ippatiki prajalaku gurthunnarante only reason great projects he built for Godavari, Krishna & Penna deltas.

 

Hope CBN will complete all major irrigation projects in his tenure & will be remembered for next 100s of years.

 

for this to happen,

he needs one more term ...hope people of AP vote wisely

Link to comment
Share on other sites

Guest Urban Legend

2018/19 Vote veyyadaanikaina entho kontha good amount of progress choopinchaali in all projects.

 

antha work jarugutunety ntho kontha enti brother

e pace lo works eppudu jarigayi asalu AP lo

Link to comment
Share on other sites

పోలవరం రైట్‌ రైట్‌!

18-05-2017 02:24:28
  • మట్టి డంపింగ్‌తో పర్యావరణానికి నష్టం లేదు
  • రసాయన, వాయు కాలుష్యమూ జీరో
  • జాతీయ హరిత ట్రైబ్యునల్‌ వెల్లడి
అమరావతి, మే 17(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణానికి చేపట్టిన మట్టి తవ్వకాలను పోలవరం మండలంలోని మూలలంకలో వేయడం వల్ల పర్యావరణానికి, అభయారణ్యానికి నష్టం వాటిల్లుతోందంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో వ్యాజ్యం పడింది. దీనిని పరిశీలించిన ట్రైబ్యునల్‌ వాస్తవాలను తెలుసుకునేందుకు ఏప్రిల్‌ 30న ఒక కమిటీని వేసింది. ఈ నెల 1న పోలవరం ప్రాంతంలో పర్యటించిన ఈ కమిటీ.. హరిత ట్రైబ్యునల్‌కు 6 పేజీల నివేదికను అందజేసింది. ఈ నివేదికలో పోలవరం ప్రాజెక్టు కోసం చేపడుతున్న తవ్వకాల మట్టిని ఒకే చోట పోగేయడం వల్ల పర్యావరణ హాని గానీ, జీవ, వాయు కాలుష్యంగానీ జరగడం లేదని స్పష్టం చేసింది. దీంతో.. పోలవరం ప్రాజెక్టు పనులు నల్లేరుపై నడకలా సాగనున్నాయి.
 
క్షేత్రస్థాయిలో కమిటీ పరిశీలన
జాతీయ హరిత ట్రైబ్యునల్‌ వేసిన కమిటీ ఈ నెల 1న పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించింది. కేంద్ర పర్యావరణ, మంత్రిత్వశాఖ నుంచి డంపింగ్‌ యార్డుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందిన విషయాన్ని కమిటీ గుర్తించింది. పోలవరం సమీప గ్రామాల్లో మట్టిని వేయడం వల్ల పర్యావరణానికి విఘాతం కలిగే వీలున్నందున.. బురద మట్టిని దూరంగా వేసేందుకు అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ 2005 అక్టోబరు 25న అమోదం తెలిపింది. స్పిల్‌ చానల్‌ తవ్వకం కోసం మూలలంకలో 203 ఎకరాలను 2016లో ఏపీ ప్రభుత్వం రైతులను ఒప్పించి సేకరించింది. దీనికి 2013 భూసేరరణ చట్టం కింద భారీగా సహాయ పునరావాస కార్యక్రమాల కోసం వ్యయం చేసిందని కమిటీ గుర్తించింది.
Link to comment
Share on other sites

Pentapati pullarao...sakshi lo editorials raasukuntadu..paid jaffa as like as abk prasad

 

ohh vaadenaa. vaadu enduku telidu. vaadi kosame kada aa VISA reddy rajya sabha lo passport issue meeda questions adigindi. veedu UN ki poye planning lo unnadu anukunta ippudu.

Link to comment
Share on other sites

Pentapati pullarao...sakshi lo editorials raasukuntadu..paid jaffa as like as abk prasad

 

 

ee waste gallaki paid media tho anni channels lo paid news veyali

 

polavaram apadaniki jagan trying ani gola gola cheyali all channels lo

Link to comment
Share on other sites

పోలవరం రైట్‌ రైట్‌!
18-05-2017 02:24:28
  • మట్టి డంపింగ్‌తో పర్యావరణానికి నష్టం లేదు
  • రసాయన, వాయు కాలుష్యమూ జీరో
  • జాతీయ హరిత ట్రైబ్యునల్‌ వెల్లడి
అమరావతి, మే 17(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డంకులు తొలిగిపోతున్నాయి. ప్రాజెక్టు నిర్మాణానికి చేపట్టిన మట్టి తవ్వకాలను పోలవరం మండలంలోని మూలలంకలో వేయడం వల్ల పర్యావరణానికి, అభయారణ్యానికి నష్టం వాటిల్లుతోందంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో వ్యాజ్యం పడింది. దీనిని పరిశీలించిన ట్రైబ్యునల్‌ వాస్తవాలను తెలుసుకునేందుకు ఏప్రిల్‌ 30న ఒక కమిటీని వేసింది. ఈ నెల 1న పోలవరం ప్రాంతంలో పర్యటించిన ఈ కమిటీ.. హరిత ట్రైబ్యునల్‌కు 6 పేజీల నివేదికను అందజేసింది. ఈ నివేదికలో పోలవరం ప్రాజెక్టు కోసం చేపడుతున్న తవ్వకాల మట్టిని ఒకే చోట పోగేయడం వల్ల పర్యావరణ హాని గానీ, జీవ, వాయు కాలుష్యంగానీ జరగడం లేదని స్పష్టం చేసింది. దీంతో.. పోలవరం ప్రాజెక్టు పనులు నల్లేరుపై నడకలా సాగనున్నాయి.
 
క్షేత్రస్థాయిలో కమిటీ పరిశీలన
జాతీయ హరిత ట్రైబ్యునల్‌ వేసిన కమిటీ ఈ నెల 1న పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించింది. కేంద్ర పర్యావరణ, మంత్రిత్వశాఖ నుంచి డంపింగ్‌ యార్డుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందిన విషయాన్ని కమిటీ గుర్తించింది. పోలవరం సమీప గ్రామాల్లో మట్టిని వేయడం వల్ల పర్యావరణానికి విఘాతం కలిగే వీలున్నందున.. బురద మట్టిని దూరంగా వేసేందుకు అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ 2005 అక్టోబరు 25న అమోదం తెలిపింది. స్పిల్‌ చానల్‌ తవ్వకం కోసం మూలలంకలో 203 ఎకరాలను 2016లో ఏపీ ప్రభుత్వం రైతులను ఒప్పించి సేకరించింది. దీనికి 2013 భూసేరరణ చట్టం కింద భారీగా సహాయ పునరావాస కార్యక్రమాల కోసం వ్యయం చేసిందని కమిటీ గుర్తించింది.
Link to comment
Share on other sites

 

పోలవరం ప్రాజెక్ట్ వ్యతిరేకులకి, చెదు వార్త వినిపించిన గ్రీన్ ట్రిబ్యునల్...

 

ఒక మంచి జరుగుతుంది అంటే, దాన్ని ఆపే వారు కొంత మంది ఉంటారు... ఈ కాలం రాజకీయల్లో అయితే అది మరీ ఎక్కువ... మన రాష్ట్రంలో అయితే, ఇక చెప్పనవసరం లేదు... అమరావతి దగ్గర నుంచి కంపెనీలు పెట్టే పెట్టుబడులు దాకా... నాలుగు ఉద్యోగాలు తెచ్చే ముఖ్యమంత్రి పర్యటన అడ్డుకోవటం దగ్గర నుంచి, రాష్ట్రం జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ దాకా.. అన్ని అడ్డుకోవటానికి చూసేవారే... వీళ్ళ కుట్రలు దాటుకుంటే, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే నాయకుడు ఉన్నాడు అనుకోండి, అది వేరే విషయం..

తాజాగా, పోలవరం ప్రాజెక్ట్ ను అడ్డుకోవటానికి ప్రయత్నిస్తున్న, ప్రాజెక్ట్ వ్యతిరేకులకి, చేదు వార్త వినిపించింది గ్రీన్ ట్రిబ్యునల్... ప్రాజెక్టు నిర్మాణానికి చేపట్టిన మట్టి తవ్వకాలను పోలవరం మండలంలోని మూలలంకలో వేయడం వల్ల పర్యావరణానికి, అడువాలకి నష్టం వాటిల్లుతోందంటూ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్‌లో కేసు వేశారు. దీనిని పరిశీలించిన ట్రైబ్యునల్‌ వాస్తవాలను తెలుసుకునేందుకు ఏప్రిల్‌ 30న ఒక కమిటీని వేసింది. ఈ నెల 1న పోలవరం ప్రాంతంలో పర్యటించిన ఈ కమిటీ.. హరిత ట్రైబ్యునల్‌కు 6 పేజీల నివేదికను అందజేసింది. ఈ నివేదికలో పోలవరం ప్రాజెక్టు కోసం చేపడుతున్న తవ్వకాల మట్టిని ఒకే చోట పోగేయడం వల్ల పర్యావరణ హాని గానీ, జీవ, వాయు కాలుష్యంగానీ జరగడం లేదని స్పష్టం చేసింది. దీంతో పోలవరం ప్రాజెక్టు అడ్డుకోవాలనుకున్న వారికి, గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పు ఒక చేదు వార్త... మరలా, ఏ రూపంలో వచ్చి, ఈ ప్రాజెక్ట్ కు అడ్డు పుల్ల వేస్తారో, వేచి చూడాలి..

 

పోలవరం ప్రాజెక్ట్, ఇప్పుడు నేషనల్ ప్రాజెక్ట్... 100% ఖర్చు కేంద్రమే భరిస్తుంది... చంద్రబాబు, ఈ ప్రాజెక్ట్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు... ఎలా అయినా సరే, 2018 చివరి నాటికి మొదటి విడతగా గ్రావిటీ ద్వారా నీరు ఇచ్చే విధంగా పనులు చేస్తున్నారు.. ప్రతి సోమవారం, ఈ ప్రాజెక్ట్ సమీక్షిస్తున్నారు... రెండు నెలలకు ఒక సారి, ప్రాజెక్ట్ ఏరియాకు వెళ్లి ఫీల్డ్ విజిట్ చేసి, తగు సూచనలు ఇస్తున్నారు... మరో పక్క, చంద్రబాబ ఈ ప్రాజెక్ట్, పూర్తి చేస్తే, ఇక రాజకీయ సమాధే అవుతుంది అని, ప్రత్యర్ధి పార్టీలు, అన్ని విధాలుగా, ఈ ప్రాజెక్ట్ లేట్ చెయ్యటానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి... ఇవన్నీ దాటుకుని, ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ, చంద్రబాబు లక్ష్యం వైపు అడుగులు వేస్తున్నారు...

 

Link to comment
Share on other sites

http://www.nandamurifans.com/forum/index.php?/topic/397712-andhra-people-ur-opposition-litigations/?hl=pentapati

 

A2 direct backing veediki..also Shit lo tega arata paddadu NGT emanna project works meda at least temporary stay istundi ani...

 

 

"All YSRCP want is 1 MONTH stay on works so that CBN govt misses targeted summer works and flood season starts"

Link to comment
Share on other sites

http://www.nandamurifans.com/forum/index.php?/topic/397712-andhra-people-ur-opposition-litigations/?hl=pentapati

 

A2 direct backing veediki..also Shit lo tega arata paddadu NGT emanna project works meda at least temporary stay istundi ani...

 

 

"All YSRCP want is 1 MONTH stay on works so that CBN govt misses targeted summer works and flood season starts"

Leader utkodu le annai.... vella babu valley kaledu.....

 

Post summer, we should take all these malpractices to public.... problem is we don't have a proper orator.... ah devineni uma speeches too boring... I doubt how many common public will hear Una's speech! We need someone who can speak and people will listen, it should be someone other than CBN!

 

Missing Revanth here....

Link to comment
Share on other sites

 ah devineni uma speeches too boring... I doubt how many common public will hear Una's speech! 

 

ohh, Uma work lo ne kadu speech lo kuda leader ne follow avutunnada  :P

actually, CBN changed speech style a lot in the last 2-3 years. Lot more jovial and direct these days. but could be boring if you listen to every speech obviously as lot of it is repeat.

Link to comment
Share on other sites

Guest Urban Legend

Ah payyavula kesav mlc tisukunnadu address ledu tarwata,baga matladatadu kesav but asala media munduku kuda ravadam ledu

Link to comment
Share on other sites

జూన్‌ 1 నుంచి గ్రామాల తరలింపు ప్రక్రియ

వేలేరుపాడు, కుక్కునూరు మండలాల పరిధిలో పూర్తయిన భూసేకరణ

కుక్కునూరు, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్రం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో కలిసిన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల పరిధిలోని పలు గ్రామాల్లో భూసేకరణ పూర్తయింది. ఇక గ్రామాల తరలింపు ప్రక్రియను జూన్‌ ఒకటో తేదీ నుంచి చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన కసరత్తు ఈపాటికే పూర్తయింది. ఆయా గ్రామాల్లోని కుటుంబాలు, గృహాలు, ఇతర స్థిరాస్తుల వివరాలనూ లెక్కించారు. గత ఏడాది ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో నిర్వహించిన ఈ సర్వే ప్రకారం జూన్‌ ఒకటో తేదీన నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఈ నోటిఫికేషన్‌లో ఉన్న కుటుంబాలకు మాత్రమే పునరావాసం, ఉపాధి కల్పిస్తారు. దీనికోసం ఆయాగ్రామాల్లో జూన్‌ రెండో వారం నుంచి గ్రామసభలు నిర్వహిస్తారు. అనంతరం ఆరునెలల లోపు వీరికి పునరావాసం, ఉపాధి కల్పించాల్సి ఉంటుంది. 18 నెలల గడువులోపు.. వీరందరికి నివాసగృహాలను, మౌలిక సదుపాయాలను కల్పించి ఆయాగ్రామాలను ఖాళీచేయించాల్సి ఉంటుంది.

Link to comment
Share on other sites

పోలవరం పరుగులు!

 

  • ఎండల భయంతో రాత్రి వేళలో పనులు
  • జూన్‌ 15కి డయాఫ్రం వాల్‌ సిద్ధం
  • పూర్తయిన స్పిల్‌వే మట్టి పనులు
  • నేడు ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు
 
పోలవరం, మే 21: ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. తెలుగు ప్రజల దశాబ్దాల కలను సాకారం చేసే దిశగా చురుగ్గా అడుగులు పడుతున్నాయి. ప్రాజెక్టు తొలి దశను 2018కి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు. దీంతో సీఎం నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు, కాంట్రాక్ట్‌ ఏజెన్సీ ప్రతినిధులు కలిసి సమన్వయంతో పనులను పరుగులు దీయిస్తున్నారు. కొండ ప్రాంతం కావడంతో ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం వద్ద నెల రోజులుగా 40 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయినా పనుల్లో మాత్రం వేగం తగ్గడం లేదు. ముఖ్యంగా గేట్లు, డయాప్రమ్‌ వాల్‌ నిర్మాణంలో ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ పనులు, స్పిల్‌వేలో కాంక్రీట్‌ పనులు చురుగ్గా సాగుతున్నాయి. సోమవారం సీఎం చంద్రబాబు ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులో కీలకమైన పలు నిర్మాణాల పురోగతిపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం ఇది..
 
 
డయాఫ్రం వాల్‌ 40 శాతం పూర్తి
ప్రాజెక్టులో అత్యంత కీలక నిర్మాణం డ్రయాఫ్రం వాల్‌. గోదావరి నదీగర్భంలో నిర్మించే డయాఫ్రం వాల్‌ను మొత్తం 1468 మీటర్ల పొడవున నిర్మిస్తారు. ఈ సీజన్‌లో 668 మీటర్లు పూర్తి చేయాలన్నది సీఎం ఆదేశం. ఇప్పటి వరకు 287 మీటర్ల పనులు పూర్తయ్యాయి. ఈ పనులను సీఎం 2017 ఫిబ్రవరి 14న ప్రారంభించారు. ఎల్‌ఎంటీ బోవర్‌ కంపెనీ జూన్‌ 15 లోగా పనులు పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తోంది. డయాఫ్రం వాల్‌లో వేసే ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ను ప్రత్యేకమైన గుణాలు కలిగిన వాటితో తయారు చేస్తారు.
ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తర్వాత చుక్క నీరు లీక్‌ కాకుండా చూసే బాధ్యత ప్లాస్టిక్‌ కాంక్రీట్‌దే. భూకంపాలు వచ్చిన సమయంలోనూ ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ బీటలు వారదు. దానికిగాను ఈ కాంక్రీట్‌లో ఇసుక, సిమెంట్‌, మెటల్‌తోపాటు బెంటోనెట్‌ పౌడర్‌, యార్డు మిక్చర్స్‌ కలుపుతారు. ఈ కాంక్రీట్‌ భూగర్బంలో సెట్‌ అవ్వడానికి సుమారు 10 గంటల సమయం తీసుకుంటుంది. డయాఫ్రం వాల్‌ నిర్మాణంలో సుమారు 1.20 లక్షల క్యూబిక్‌ మీటర్ల ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ వేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 22వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేశారు.
 
 
48 గేట్లకు 15 సిద్ధం
ప్రాజెక్టు స్పిల్‌వేలో ఏర్పాటు చేసే గేట్లను పోలవరంలోనే తయారు చేయిస్తున్నారు. 20.8 మీటర్ల ఎత్తు, 16 మీటర్ల వెడల్పుతో మొత్తం 48 గేట్లు అమర్చాల్సి ఉంది. గేట్ల తయారీలో సుమారు 23, 300 మెట్రిక్‌ టన్నుల ఇనుమును వినియోగిస్తున్నారు. ఈ మొత్తం ఇనుమును స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ద్వారా దిగుమతి చేసుకున్నారు. ఈ గేట్ల తయారీ బాధ్యతను సబ్‌ కాంట్రాక్టర్‌గా డెక్కం కంపెనీ చేస్తోంది. ఇప్పటి వరకు 15 గేట్లు పూర్తయ్యాయి. ట్రూమియన్స్‌ 96 తయారు చేయాల్సి ఉండగా వాటి తయారి కూడా ప్రారంభించి ఆరు పూర్తిచేశారు. వాటిని విజయవాడలో తయారు చేస్తున్నారు. అలాగే గేట్లను పైకి లేపడానికి కావాల్సిన హైడ్రాలిక్‌ సిలిండర్లను జర్మనీ నుంచి తీసుకురానున్నారు.
 
 
స్పిల్‌వే మట్టి పని 100 శాతం పూర్తి
పోలవరం ప్రాజెక్టులో అతి కీలకమైన స్పిల్‌వే నిర్మాణంలో మట్టి పని నూరు శాతం పూర్తయింది. ప్రస్తుతం కాంక్రీట్‌ పని జరుగుతోంది. 48 గేట్లు అమర్చేందుకు వీలుగా 48 బాడీవాల్స్‌ను నిర్మించాల్సి ఉంది. స్పిల్‌వే నిర్మాణానికి మొత్తం 35 వేల మెట్రిక్‌ టన్నుల ఐరన్‌, 4 లక్షల క్యూబిక్‌ మీటర్ల సిమెంట్‌ వినియోగించనున్నారు. మొత్తం 1054 మీటర్ల పొడవునా నిర్మించే స్పిల్‌వేలో 70 మీటర్లు లోతు నుంచి కాంక్రీట్‌ వేయాల్సి ఉంది. ప్రతి రోజూ 2 వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వేయాలని ప్రణాళిక సిద్దం చేసినా ఎండల కారణంగా రోజుకి 1500 నుంచి 1750 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ను మాత్రమే వేస్తున్నారు. కాంక్రీట్‌లో ఉష్ణోగ్రత తగ్గించడానికి ప్రత్యేక ఐస్‌ మ్యాకర్‌ తయారు చేసి కాంక్రీట్‌లో కలిపి వేస్తున్నారు. పగటిపూట అధిక ఉష్ణోగ్రతల కారణంగా రాత్రి వేళల్లోనే ఎక్కువగా కాంక్రీట్‌ పనులు జరుగుతున్నాయి.
Link to comment
Share on other sites

లక్ష మందితో ‘పోలవరం పాదయాత్ర’
 
  • సీఎం సారథ్యం వహిస్తారు: దేవినేని ఉమ
మచిలీపట్నం, మే 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఆదివారం మచిలీపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు గ్యాలరీలు(ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలు) ఎంతో అపురూపంగా రూపుదిద్దుకుంటున్నాయని అన్నారు. ఈ గ్యాలరీల్లో లక్ష మందితో సీఎం చంద్రబాబు సారధ్యంలో పాదయాత్ర నిర్వహిస్తామన్నారు. 2019 నాటికి పోలవరం నుంచి రాష్ట్రం మొత్తానికి నీరు సరఫరా చేస్తామన్నారు. ఇప్పటికే పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా గత ఏడాది రాష్ట్రంలో 3 లక్షల ఎకరాలకు సాగు నీరందించామని అన్నారు. ఈ ఏడాది 100 టీఎంసీల పట్టిసీమ నీటితో డెల్టాకు సాగునీటి కొరత లేకుండా చూస్తామన్నారు. చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా కృష్ణాజిల్లాలోని మెట్టప్రాంతానికి ఏడాదిలోపు సాగునీరు అందిస్తామన్నారు. జగ్గయ్యపేట వద్ద ముత్యాల ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.1600 కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అయిన బందరు పోర్టు నిర్మాణాన్ని 2018 నాటికి పూర్తి చేస్తామన్నారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...