Jump to content

polavaram

Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply

41 మీటర్లా.. 31 మీటర్లా..?

కాఫర్‌ డ్యాం ఎత్తు తేలేది స్పిల్‌ వే కాంక్రీటు ప్రగతిపైనే

పునాది ఆకృతులపై నిర్ణయం జూన్‌ రెండో వారంలో

ఎత్తుపై నిర్దుష్ట నిర్ణయం వచ్చే ఏడాదే?

8, 9 తేదీల్లో డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానల్‌ సమావేశం

ఈనాడు - అమరావతి

29ap-main2a.jpg

పోలవరం ప్రాజెక్టులో కాఫర్‌ డ్యాం ఎత్తును 41 మీటర్లకు పెంచాలని కిందటి సంవత్సరం కీలక నిర్ణయం తీసుకున్నా దీనికి కొత్త సవాల్‌ ఎదురవుతోంది. స్పిల్‌ వే కాంక్రీటు నిర్మాణం పూర్తయితేనే కాఫర్‌ డ్యాం ఎత్తు పెంచడం వల్ల ప్రయోజనం ఉంటుంది. లేని పక్షంలో ఆ డ్యాం ఎత్తు పెంచి అదనంగా పొందే ప్రయోజనం ఏమీ ఉండదని డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానల్‌ సభ్యులు తాజాగా చర్చ ప్రారంభించారు. కాఫర్‌ డ్యాం ఎత్తును 41 మీటర్లకు పెంచేందుకు డిజైన్‌ రివ్యూ కమిటీ గతంలో సూత్రబద్ధంగా అంగీకరించింది. ఇప్పుడు స్పిల్‌ వే కాంక్రీటు పనులు అనుకున్నంత వేగంగా సాగడం లేదు. దీంతో నిర్దుష్ట గడువు లోపు స్పిల్‌ వే కాంక్రీటు పనులు పూర్తి చేయడం సాధ్యమవుతుందా అన్న అనుమానంతో కాఫర్‌ డ్యాం ఎత్తుపై కొత్త ప్రస్తావన వచ్చింది. కాఫర్‌ డ్యాం ఎత్తు 41 మీటర్లకు పెంచితేనే ప్రధాన డ్యాం నిర్మాణం పూర్తి కాకముందే గ్రావిటీ ద్వారా కాలువలకు నీరివ్వగలరు.

కాఫర్‌ డ్యాం పునాదిపై తేలేది వచ్చే వారమే

జూన్‌ 8, 9 తేదీల్లో డ్యాం డిజైన్‌ రివ్యూ ప్యానెల్‌ సమావేశం జరగనుంది. ఈ కమిటీ సమావేశంలోనే ప్రస్తుత కాఫర్‌ డ్యాం పునాది ఆకృతులను తేల్చాల్సి ఉంది. కాఫర్‌ డ్యాం ఎత్తును బట్టి ఈ కట్టడం పునాది ఆకృతులు ఆధారపడి ఉన్నాయి. కాఫర్‌ డ్యాం పునాది పనులు తాజాగా జట్‌ గ్రౌటింగ్‌ విధానంలో చేపట్టే అంశంపై నిపుణుల సమీక్ష సాగుతోంది. జట్‌ గ్రౌటింగ్‌పై మరింత సమాచారం కావాలని కమిటీ కోరింది. దిల్లీ ఐఐటీ ప్రొఫెసర్‌ రమణ దీనిపై తదుపరి సమావేశంలో పూర్తి స్థాయిలో నివేదిక సమర్పించనున్నారు. జట్‌ గ్రౌటింగ్‌కు సమ్మతి లభిస్తే కెల్లర్‌ సంస్థ ఈ పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉంది. ఎంత లోతునుంచి నిర్మించుకుంటూ రావాలనేది కాఫర్‌ డ్యాం ఎత్తుపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం 41 మీటర్ల ఎత్తును ఖరారు చేసుకుని పునాది పనులు చెయ్యాలని, వచ్చే సీజన్లో స్పిల్‌ వే పనులు ఏ స్థాయిలో ఉన్నాయన్నది గమనించి కాఫర్‌ డ్యాం ఎత్తుపై నిర్ణయం తీసుకోవచ్చనే ఆలోచనలో ఉన్నారు. ఈ మేరకు ఆకృతులకు ఆమోదం లభిస్తుందని ఇంజినీర్లు అంచనాతో ఉన్నారు.

కాంక్రీటు పనులపై సీఎం గట్టి దృష్టి

పోలవరంలో ప్రస్తుతం ఒక్క స్పిల్‌ వే కాంక్రీటు పనులు తప్ప అన్నీ సంతృప్తికరంగా సాగుతున్నాయని ముఖ్యమంత్రి కిందటి సమీక్షా సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువులోపు ప్రాజెక్టు పూర్తి చేయాలనే కృతనిశ్చయంతో ఉన్న ముఖ్యమంత్రి ప్రతి చిన్న విషయాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంక్రీటు పనులపై ప్రత్యామ్నాయ ప్రణాళికతో సమావేశానికి రావాలని ఆదేశించారు. మహానాడు వల్ల ఈ సోమవారం పోలవరం సమీక్ష మంగళవారానికి వాయిదా పడింది. పోలవరం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వరరావు, పోలవరం అథారిటీ కార్యదర్శి గుప్తాలకు పరిష్కారాల బాధ్యత అప్పచెప్పారు. స్పిల్‌ వే కాంక్రీటు పనులను వేగవంతం చేసే దిశగా వ్యూహరచన సిద్ధమవుతోంది. ఈ సవాల్‌ను ఛేదించగలిగితే పోలవరం పూర్తి స్థాయిలో పట్టాలకు ఎక్కినట్లే.

Link to comment
Share on other sites

పోలవరం గుత్తేదారుకు రాయితీలు

ఈనాడు-అమరావతి: పోలవరం గుత్తేదారుకు ప్రభుత్వం అనేక రాయితీలు కల్పిస్తూ సోమవారం రెండు ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టిన సందర్భంలో కుదిరిన ఒప్పంద నిబంధనలు సడలిస్తూ ప్రాజెక్టు ప్రాధాన్యం, త్వరలో పూర్తి కావాలనే లక్ష్యం నెరవేర్చేందుకు ఈ రాయితీలు ఇస్తున్నట్లు పేర్కొంది.

* పోలవరం ప్రాజెక్టులో త్వరగా పూర్తి చేసేందుకు అనేక యంత్రపరికరాలు తీసుకురావాల్సి ఉంది. వివిధ చోట్ల అనేక పరీక్షలు చేయించాల్సి ఉంది. ఇలా అనేక పనులు చేయాల్సి ఉంది. వీటి బాధ్యత ఒప్పందం ప్రకారం గుత్తేదారుదే అయినా ఆయన సకాలంలో ఆ మొత్తాలు వెచ్చించలేకపోతున్నారు. నిధుల ప్రవాహం లేకపోవడం వల్ల గుత్తేదారుకు ఇబ్బందులు ఎదురై దాని ప్రభావం ప్రాజెక్టు నిర్మాణంపై పడుతోందని, ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.200 కోట్లు కేటాయించి కొంత మొత్తం ప్రాజెక్టు నిర్వహణ బృందం వద్ద ఉంచాలని ప్రాజెక్టు సలహాదారు భార్గవ ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. తొలుత ప్రభుత్వమే సొమ్ములు చెల్లించి ఆనక గుత్తేదారు బిల్లుల నుంచి మినహాయించుకునేలా ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు పోలవరం ఎస్‌ఈ వద్ద రూ.25 కోట్ల నిధి ఉంచనున్నారు.

* పోలవరంలో 16 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు 13 నెలల్లో పోయాల్సి ఉంది. ఇందుకు ఫుట్జ్‌మీయిస్టర్‌ కంపెనీకి సంబంధించిన యంత్రపరికరాలను గుత్తేదారు ఏజన్సీ రప్పిస్తోంది. అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఈ యంత్రపరికరాల కస్టమ్‌ డ్యూటీ చెల్లించడం తమ వల్ల కాదని గుత్తేదారు ముఖ్యమంత్రి సమీక్ష సమావేశంలో తెలియజేశారు. దీంతో ఆ చెల్లింపులు ప్రభుత్వ ఖజానా నుంచి తొలుత చెల్లించాలని సీఎం ఆదేశించారు. నిజానికి ఒప్పంద నిబంధనల్లోని 79వ క్లాజు ప్రకారం ఈ బాధ్యత గుత్తేదారుదే. ప్రస్తుత తరుణంలో ఆ నిబంధన సడలిస్తూ ఈ యంత్రపరికరాలు పోర్టు నుంచి విడిపించేందుకు అవసరమైన రూ.7.50 కోట్లు తొలుత సర్కార్‌ చెల్లిస్తుంది. ఆనక గుత్తేదారు బిల్లుల నుంచి మినహాయించుకునేలా జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఉత్తర్వులు ఇచ్చారు

పోలవరం భద్రతపై దృష్టి

డీఎస్పీకి కూడా తెలియకుండా మాక్‌డ్రిల్‌

పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు భద్రతపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీస్‌శాఖ సిబ్బంది సన్నద్ధతపై పరీక్ష నిర్వహించింది. ఆప్రాంత డీఎస్పీకి సైతం తెలియకుండా నిర్వహించిన మ్యాక్‌డ్రిల్‌ స్థానిక పోలీసులను 4 గంటలపాటు హడలెత్తించింది. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతం నుంచి సోమవారం ఉదయం ఒక వ్యక్తిని కిడ్నాప్‌ చేసి కారులో తీసుకెళ్లి పోతున్నారన్న సమాచారం స్థానిక పోలీసుల్లో కలకలం సృష్టించింది. అప్రమత్తమైన పోలీసులు చెక్‌పోస్టుల వద్ద సిబ్బందిని ప్రతి వాహనాన్ని తనిఖీ చేయమని ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లాలోని దేవీపట్నం, సీతానగరం పోలీసుస్టేషన్ల ఎస్సైలకూ సమాచారం ఇచ్చారు. గోదావరి రేవుల నుంచి ఎవరిని పడవలపై నది దాటించవద్దని హెచ్చరికలు జారీ చేశారు. అప్పటికే కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని తీసుకుని వెళ్తున్న కారు పోలవరం మండలం పైడిపాక, పాతపోలవరం వద్ద చెక్‌పోస్టులు దాటిపోవడంతోపాటు నంబరు ప్లేట్‌ మార్చిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. వారు ఆ కారును వెంబడించి పట్టుకుని కిడ్నాప్‌ చేసిన వ్యక్తిని విడిపించడంతో పాటు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. కారులో కిడ్నాపర్ల వద్ద ఆయుధం కూడా ఉన్న విషయాన్ని గుర్తించారు. ఈ హైడ్రామా పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది. జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్‌, ఓఎస్డీ ఫకీరప్ప ప్రణాళిక ప్రకారం ఇది జరిగింది. కిడ్నాప్‌ అయిన వ్యక్తి, కిడ్నాపర్లు అందరూ పోలీసులే.. మొత్తం మీద పోలవరం ప్రాజెక్టు భద్రతపై మాక్‌డ్రిల్‌ నిర్వహించినట్లు తెలుసుకుని స్థానిక పోలీసులు వూపిరి పీల్చుకున్నారు. సిబ్బంది ఎంత అప్రమత్తంగా ఉన్నారో తెలుసుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే పోలవరం డీËఎస్పీకి కూడా తెలియకుండా కిడ్నాప్‌ వ్యవహారం నడిపించారు.

Link to comment
Share on other sites

పోలవరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలి

అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనులపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం సమీక్ష నిర్వహించారు. వెలగపూడి సచివాలయంలో తన కార్యాలయం నుంచి వాస్తవిక సదృశ్య తనిఖీ ద్వారా ఈ సమీక్ష నిర్వహించారు. పగలు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నందున రాత్రిపూట కాంక్రీటు పనులు చేస్తున్నట్లు క్షేత్రస్థాయి నుంచి ప్రాజెక్టు ఇంజనీర్‌ రమేష్‌ బాబు సీఎంకు వివరించారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా స్పిల్‌ ఛానల్‌ వద్ద నీటితో నిండిపోయి రెండురోజులు పనులకు ఆటంకం కలిగినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం 1055 లక్షల క్యూబిక్‌ మీటర్ల తవ్వకం పనులకుగానూ 703 క్యూబిక్‌ మీటర్ల పనులు పూర్తయ్యాయని అధికారుల తెలిపారు. ఇంకా 352 లక్షల క్యూబిక్‌ పనులు చేపట్టాల్సి ఉందని వెల్లడించారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 66.6శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడంపై కూడా దృష్టిసారించాలని అధికారులను సీఎం ఆదేశించారు. వచ్చే వారం ఈ అంశంపై సమీక్షిస్తానని వారితో చెప్పారు.

Link to comment
Share on other sites

Guest Urban Legend

Reviewed Polavaram Project Work
I strongly felt, after the review meeting with our Hon’ble Chief Minister Chandrababu Naidu, one should be consistent in conduct and persistent in efforts to achieve what we want. In spite of the obstructions by the nature, may it be rainfall or high temperature, deploying 3821 Manpower, both technical and non-technical, by now we are able to do 66% of the earth excavation, construction of 18 out of 48 gates and completion of 50% of the Diaphragm Wall. I am also happy to say that Polavaram Project is going to be Prime Centre of tourist attraction which includes an Iconic bridge.

Link to comment
Share on other sites

ఆకట్టుకునేలా ఐకానిక్‌ వంతెన

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టులోభాగంగా స్పిల్‌ ఛానల్‌పై ఐకానిక్‌ వంతెనను ఆకట్టుకునేలా ఆకృతులు తయారు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అన్ని దశలు కళ్లకు కట్టేలా ప్రదర్శన ఏర్పాటు చేయాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టు, జలనవరులశాఖ పురోగతిపై మంగళవారం సీఎం సమీక్షించారు. పర్యాటకానికి పట్టిసీమ, ధవళేశ్వరం, పాపికొండలు, చిన్నచిన్న దీవులుఆకర్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు. చిల్లింగ్‌ ప్లాంటు విశాఖ పోర్టుకు వచ్చిందని, త్వరలోనే పోలవరం ప్రాజెక్టు వద్దకు వస్తుందని పోలవరం పర్యవేక్షణ అధికారి వేమన రమేష్‌బాబు సీఎంకు వివరించారు. కాఫర్‌ డ్యాం కటాఫ్‌వాల్‌, స్పిల్‌ ఛానల్‌ వంతెన పనులు వచ్చే నెల 8 నుంచి ప్రారంభమయ్యేలా చూడాలని అధికారులతో చెప్పారు. జూన్‌ 30 నుంచి కాంక్రీట్‌ పనులు వేగవంతం చేయాలని చెప్పారు.

Link to comment
Share on other sites

పోలవరానికి రూ.3700 కోట్లు 

03-06-2017 01:47:09
  •  అడిగిన దానికంటే 400 కోట్లు అదనం
అమరావతి, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టుకు రూ.3700 కోట్ల నిధులు ఇచ్చేందుకు కేంద్రం సమ్మతించింది. ఈ ఏడాది ఇప్పటిదాకా రూ.3314 కోట్లు ఖర్చు చేశామని.. వాటిని రీయింబర్స్‌ చేయాలని రాష్ట్ర జల వనరుల శాఖ కేంద్రాన్ని కోరింది. ఈ పనుల వ్యయాలను మదింపు చేసిన కేంద్ర జల వనరుల శాఖ రాష్ట్రం కోరిన మొత్తం కంటే.. దాదాపు రూ.400 కోట్లు అదనంగా నిధులు మంజూరు చేసేందుకు అంగీకరించడం గమనార్హం. దీనిపై రాష్ట్ర అధికారుల్లో హర్షం వ్యక్తమవుతోంది. నాగార్జున సాగర్‌ టెయిల్‌పాండ్‌ విద్యుత్కేం ద్రం ఏపీ జెన్కో పరిధిలోనే ఉండాలని కోరుతూ కేంద్ర జల వనరుల శాఖకు ప్రభుత్వం లేఖ రాసింది. దీనికి కేంద్రం అంగీకరించినట్లు తెలిసింది.

Angeekarinchatam kadu, release cheyyandi please...

పోలవరం పూర్తి చేయడం నా జీవిత లక్ష్యం: చంద్రబాబు
 
636321164111027492.jpg
విజయవాడ: పోలవరం పూర్తి చేయడం తన జీవిత లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపకపోతే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనని ప్రధానితో స్పష్టం చేశానని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ముంపు మండలాల విలీనంతో పోలవరానికి అడ్డంకులు తొలగాయని, ఈ నెల 8న పోలవరం కాపర్ డ్యామ్‌కు శంకుస్థాపన చేస్తామని చంద్రబాబు చెప్పారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి కరువును జయిస్తామన్నారు. రాష్ట్రాభివృద్ది కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, ఎన్నికల లబ్ది కోసం కాదని స్పష్టం చేశారు. విభజన సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నాయని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ ప్రజల పొట్ట కొట్టిందని, కాంగ్రెస్‌ సభలకు వెళ్తే రాష్ట్ర ప్రయోజనాలను వ్యతిరేకించినట్లేనని బాబు అన్నారు.
Link to comment
Share on other sites

ఈ నెల 8న పోలవరం కాపర్‌ డ్యాంకు శంకుస్థాపన
 
636322027301891016.jpg
అమరావతి: పోలవరం పనుల్లో మరో అడుగు ముందుకు వేసింది ఏపీ ప్రభుత్వం. ఈ నెల 8న ఉదయం 8గంటల 30 నిమిషాలకు సీఎం చంద్రబాబు పోలవరం కాపర్‌ డ్యాంకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పోలవరం డ్యామ్‌ సైట్‌లో కేంద్ర జల సంఘం డిజైన్‌ కమిటీతో భేటీకానున్నారు. ఈ సందర్భంగా పోలవరం డ్యామ్‌ డిజైన్లకు సీడబ్ల్యూసీ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వనుంది.
Link to comment
Share on other sites

8న పోలవరం కాఫర్‌ డ్యాం నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో కీలకమైన కాఫర్‌ డ్యాం నిర్మాణ పనులకు ఈ నెల 8వ తేదీన సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఆ రోజు ఉదయమే అమరావతి నుంచి పోలవరం వెళ్లి ముఖ్యమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పోలవరం నిర్మాణంలో కాఫర్‌ డ్యాం కూడా ప్రధానమే. ప్రధాన డ్యాం నిర్మాణానికి నీటి ప్రవాహం నుంచి ఇబ్బంది రాకుండా ఉండేలా కాఫర్‌ డ్యాంను ప్రతి ప్రాజెక్టులోనూ నిర్మిస్తుంటారు. అయితే, పోలవరంలో కాఫర్‌ డ్యాంను 41 మీటర్ల ఎత్తుతో నిర్మించి తద్వారా నీటిని నిల్వ చేసి ప్రధాన డ్యాం పనులు పూర్తికాకుండానే గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వాలనేది సర్కార్‌ యోచన. ఈ పనులను కెల్లర్‌ సంస్థ చేపట్టనుంది. జట్‌ గ్రౌటింగ్‌ పద్ధతిలో నిర్మించే ఈ పనులకు సంబంధించి అవసరమైన యంత్రపరికరాలను ఇప్పటికే అక్కడికి తరలించింది. కాఫర్‌ డ్యాంకు జట్‌ గ్రౌటింగ్‌ పద్ధతిలో 30 మీటర్ల కన్నా దిగువ నుంచి పునాది నిర్మించుకుంటూ వస్తారు. ఆపైన మట్టి కట్టకడతారు. మరోవైపు.. ఈ నెల 8నే పోలవరంలో డ్యాం ఆకృతుల సమీక్ష కమిటీ సమావేశం కూడా జరుగుతుంది.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...