Jump to content

polavaram


Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply
పోలవరానికి సాయంపై కేంద్రం వైఖరిలో మార్పు లేదు
 
  • నిధుల విషయంలో వెనక్కు తగ్గలేదు
  • 2014 అంచనాలను పూర్తిగా భరిస్తామని చెప్పింది
  • అవి ఖరారు కాలేదు.. సవరణ జరుగుతోంది: రాష్ట్ర జలవనరుల శాఖ
అమరావతి, ఏప్రిల్‌ 11(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయం విషయంలో ఎలాంటి మార్పూ లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నిర్మాణ వ్యయం 2014 ఏప్రిల్‌ నాటి ధరల కంటే పెరిగితే రాష్ట్ర ప్రభుత్వమే భరించాలంటూ సోమవారం రాజ్యసభలో ఉమాభారతి ఇచ్చిన సమాధానం వల్ల పోలవరం నిర్మాణానికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయంటూ జరుగుతోన్న ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ మంగళవారం ‘‘ఆంధ్రజ్యోతి’’కి వివరించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తూ కేంద్రం ప్రకటన విడుదల చేసిన నాటి నుంచి... తాజాగా రాజ్యసభలో ఉమాభారతి సమాధానం వరకూ ఎలాంటి మార్పూ లేదని శశిభూషణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. నిర్మాణాన్ని కేంద్రమే చేపడుతుందని రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. పోలవరానికి జాతీయహోదా గుర్తింపును ఇచ్చిన సమయంలోనూ 2014 ఏప్రిల్‌ ఒకటో తేదీనాటి అంచనాలను 100ు భరిస్తామని కేంద్రం ప్రకటించిందని శశిభూషణ్‌ గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు ఆర్థిక సహకారం అందించడంలో కేంద్ర వైఖరిని వివరిస్తూ కేంద్ర ఆర్థికమంత్రి జైట్లీ ప్రకటన చేసిన సమయంలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారని అన్నారు. దీని తర్వాత కేబినెట్‌ తీర్మానం చేసినప్పుడు కూడా ఇదే విషయాన్ని ప్రకటించారన్నారు. చివరిగా కేంద్ర మంత్రి ఉమాభారతి రాజ్యసభలో ఇచ్చిన లిఖితపూర్వక ప్రకటనలోనూ ఇదే ఉందని స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ఇప్పటి దాకా 2014 ఏప్రిల్‌ ఒకటో తేదీ నాటి తుది అంచనాలు తయారు కాలేదని శశిభూషణ్‌ కుమార్‌ వివరించారు. ఇంతవరకూ 2010-11 సంవత్సరం నాటి రూ.16,010.45 కోట్ల అంచనాలు మాత్రమే అధికారికంగా ఉన్నాయని గుర్తు చేశారు. ఈ అంచనాల్లో 80 నుంచి 90 శాతం వరకూ భూసేకరణ, సహాయ-పునరావాస వ్యయాలే ఉంటాయని వివరించారు. 2013లో భూసేకరణ చట్టం వచ్చాక... భూసేకరణ వ్యయం అమాతం పెరిగిందని చెప్పారు. భూసేకరణ చట్టం 2014 ఏప్రిల్‌ ఒకటో తేదీలోగానే వచ్చినందున... పెరిగిన భూసేకరణ ధరలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటుందని శశిభూషణ్‌ కుమార్‌ వివరించారు. 2014వ సంవత్సరం నాటి అంచనాల సవరణలో 85-90 శాతం వరకూ పెరిగిన భూముల ధరలు, సహాయ-పునరావాస కార్యక్రమాల వ్యయమే ఉంటుందన్నారు. కాంక్రీట్‌ పనులకు సంబంధించి ధరల వ్యత్యాసం 15 శాతానికి మించదని వివరించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీకి ఇప్పటికే 2014 నాటి సవరించిన అంచనాల ముసాయిదాను అందజేశామని చెప్పారు. దీనిని ఆధారంగా చేసుకుని పోలవరం ప్రాజెక్టు అథారిటీ కూడా అంచనాల సవరణను చేస్తోందని అన్నారు. ఈ నెలాఖరులోగా 2014 నాటి తుది అంచనాలను పోలవరం ప్రాజెక్టు అథారిటీకి అందజేస్తామని చెప్పారు. అందువల్ల .. పోలవరం ప్రాజెక్టుకు నిధులను అందించే విషయంలో కేంద్రం వెనక్కు తగ్గడంగానీ, రాష్ట్రానికి షాక్‌ ఇవ్వడంగానీ లేవని శశిభూషణ్‌ కుమార్‌ స్పష్టం చేశారు.
Link to comment
Share on other sites

పోలవరంలో అపశ్రుతి
 
636278181758862625.jpg
  • భారీ ఎక్స్‌కవేటర్‌లో మంటలు.. పూర్తిగా కాలిపోయిన జనరేటర్‌
  • దెబ్బతిన్న వైరింగ్‌ వ్యవస్థ
  • షార్ట్‌ సర్క్యూటే కారణం!
  • పనులకు ఆటంకం లేదు
లక్ష్యం ప్రకారం నీళ్లు ఇస్తాం: జల వనరుల శాఖ
ఏలూరు, పోలవరం ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): పోలవరం పనుల పరుగులో అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న భారీ ఎక్స్‌కవేటర్‌ ప్రమాదవశాత్తూ పాక్షికంగా కాలిపోయింది. ఇందులోని రెండు జనరేటర్లలో ఒకటి పూర్తిగా దగ్ధమైంది. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు సిల్ప్‌వే వద్ద రాళ్లను తొలగిస్తూ... డంపర్లలోకి నింపుతున్న తరుణంలో యంత్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు కార్మికులు శతవిధాలుగా ప్రయత్నించారు. అక్కడే సిద్ధంగా ఉన్న ట్యాంకుల నుంచి నీటిని చల్లారు.
 
 
రెండు ఫైరింజన్‌లు కూడా అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. మంటలు పూర్తిగా ఆరిపోయేందుకు సుమారు 20 నిమిషాల సమయం పట్టింది. రెండు జనరేటర్ల సహాయంతో నడిచే భారీ ఎక్స్‌కవేటర్‌లో ఒక జనరేటర్‌ పూర్తిగా కాలిపోయినట్లు సమాచారం. మిగిలిన యంత్ర భాగాల్లో వైరింగ్‌ దెబ్బతిందని తెలుస్తోంది. షార్ట్‌ సర్క్యూట్‌వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఎక్స్‌కవేటర్‌ దగ్ధంపై ఎస్‌ఈ రమేశ్‌బాబు, ప్రాజెక్టు పనులు చూస్తున్న తిరుమలేశ్వరరావు ముఖ్యమంత్రి కార్యాలయానికి సవివరమైన నివేదిక పంపారు.
 
మరమ్మతుల సమయం ఎంత...
అగ్ని ప్రమాదంలో ఎక్స్‌కవేటర్‌కు జరిగిన నష్టం ఎంత, దీని మరమ్మతులకు ఎంత సమయం పడుతుందనే అంశంపై ప్రస్తుతానికి స్పష్టత లభించడంలేదు. జర్మనీ నుంచి తెప్పించిన ఈ యంత్రాన్ని విదేశీ నిపుణులే నడిపిస్తున్నారు. దీని మరమ్మతులకు కూడా జర్మనీ నుంచి నిపుణులను రప్పించాలని చెబుతున్నారు. ‘‘యంత్రం ఎంతమేరకు దెబ్బతింది, జరిగిన నష్టం ఎంతో అంచనా వేయలేకపోతున్నాం’’ అని ఎస్‌ఈ రమేశ్‌ బాబు వెల్లడించారు.
 
పనులకు ఆటంకం లేదు
అమరావతి: పోలవరం పనుల్లో అపశ్రుతి చోటు చేసుకున్నప్పటికీ... ప్రణాళికాబద్ధ పనులకు ఎలాంటి ఆటంకమూ లేదని జల వనరుల శాఖ స్పష్టం చేసింది. 2019నాటికి గ్రావిటీ ద్వారా నీటిని ఇవ్వాలన్న లక్ష్యం ఏమాత్రం దెబ్బతినదని ప్రకటించింది. ‘‘902 నంబరు కొండపై రాక్‌ కటింగ్‌ పనుల కోసం ఈ ఎక్స్‌కవేటర్‌ను త్రివేణీ సంస్థ తీసుకువచ్చింది. దీని సామర్థ్యం 3వేల హెచ్‌పీ. ఈ నెలాఖరు నాటికి 2000 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన రెండు ఎక్స్‌కవేటర్లను తీసుకురావాలని కాంట్రాక్టు సంస్థ ఇప్పటికే యోచిస్తోంది’’ అని తెలిపింది. పోలవరం పనులన్నీ ముందస్తు ప్రణాళిక మేరకు సవ్యంగానే జరుగుతున్నాయని వారు వివరించారు.

తవ్వకంలో ‘బాహుబలి’
పోలవరం స్పిల్‌వే పనులకోసం జర్మనీలో తయారైన భారీ ఎక్స్‌కవేటర్‌ను ప్రత్యేకంగా తెప్పించారు. గత ఏడాది సెప్టెంబరులో దీనిని చంద్రబాబు ప్రారంభించారు. దీని ఖరీదు సుమారు రూ.80 కోట్లు ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటిది మన దేశంలో మరెక్కడా లేదు. 2016లో ఈ యంత్రాన్ని ఓడల ద్వారా విడి భాగాల రూపంలో చేర్చి... ఇక్కడ అమర్చారు. దీని రవాణా కోసమే రూ.40 లక్షల వరకు ఖర్చయింది. ఈ యంత్రం బరువు 600 టన్నులు పైబడే. ఈ ఎస్కవేటర్‌ బకెట్‌ ఒక్క విడతకు 35 క్యూబిక్‌ మీటర్లమేర అంటే సుమారు 12 టన్నులను తవ్వి తీస్తుంది. ఈ ఎక్స్‌కవేటర్‌ రెండు జనరేటర్ల సహాయంతో నడుస్తుంది. ఈ యంత్రాన్ని నడిపేందుకు గంటకు 240 లీటర్ల డీజిల్‌ వినియోగం అవుతుంది. ఇప్పటిదాకా ఈ యంత్రం ద్వారా పోలవరంలో 20 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి/రాయిని తవ్వారు.
Link to comment
Share on other sites

Just read this article in andhrajyothy, sadly not enough rights to paste it here.  

Looks like to we have to pay for R&R. Very bad for the state and bjp if true. Any backtracking on polavaram will kill whatever little hopes bjp has in the state, will affect tdp too if not cautious.

Link to comment
Share on other sites

Just read this article in andhrajyothy, sadly not enough rights to paste it here.  

Looks like to we have to pay for R&R. Very bad for the state and bjp if true. Any backtracking on polavaram will kill whatever little hopes bjp has in the state, will affect tdp too if not cautious.

 

పోలవరం పునరావాస భారమెవరిది?

16-04-2017 00:15:57

 

  • రాష్ట్రం నిర్మిస్తే అథారిటీ పాత్రేంటి: కేవీపీ
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు పునరావాస ప్యాకేజీ భారం ఎవరు భరిస్తారో చెప్పాలని కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతిని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు కోరారు. పోలవరం నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిన నేపథ్యంలో ఉమాభారతికి శనివారం ఆయన లేఖ రాశారు. ఈ అంశంపై రాజ్యసభలో కేవీపీ ప్రశ్నించగా.. రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రశ్నోత్తరాల సందర్భంగా చర్చించాలని భావించానని, అయితే ఆ రోజు దీనిపై చర్చ జరగలేదని కేవీపీ గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు ఇంకా ఏమైనా అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయా? 2014 మార్చి 31వ తేదీకి ముందు, 2014 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి జూన 2వ తేదీ మధ్య, ఆ తర్వాత కేంద్రం విడుదల చేసిన నిధులు, ఆయా తేదీల వారీగా జరిగిన ఖర్చు వెల్లడించాలని కోరారు.
Link to comment
Share on other sites

పోలవరం పునరావాస భారమెవరిది?

16-04-2017 00:15:57

 

  • రాష్ట్రం నిర్మిస్తే అథారిటీ పాత్రేంటి: కేవీపీ
న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు పునరావాస ప్యాకేజీ భారం ఎవరు భరిస్తారో చెప్పాలని కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతిని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు కోరారు. పోలవరం నిర్మాణ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిన నేపథ్యంలో ఉమాభారతికి శనివారం ఆయన లేఖ రాశారు. ఈ అంశంపై రాజ్యసభలో కేవీపీ ప్రశ్నించగా.. రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రశ్నోత్తరాల సందర్భంగా చర్చించాలని భావించానని, అయితే ఆ రోజు దీనిపై చర్చ జరగలేదని కేవీపీ గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టుకు ఇంకా ఏమైనా అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయా? 2014 మార్చి 31వ తేదీకి ముందు, 2014 ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి జూన 2వ తేదీ మధ్య, ఆ తర్వాత కేంద్రం విడుదల చేసిన నిధులు, ఆయా తేదీల వారీగా జరిగిన ఖర్చు వెల్లడించాలని కోరారు.
Ee KVP gadu sani laa addupaduthunnadu.. luchhha nayyalu :kick:

 

Veediki Inka entha term balance undi RS member gaa??

Link to comment
Share on other sites

పోలవరానికి ఎండగండం!
 
636279941604493178.jpg
  • కత్తి మీద సాములా పనులు
  • మండుతున్న ఎండలతో యంత్రాలకు ముప్పు
ఏలూరు/పోలవరం, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు పనులు కత్తి మీద సాములా మారాయి. లక్ష్యాలను అందుకోవడానికి కాంట్రాక్టు సంస్థలు, ఇంజనీర్లు, కార్మికులు చెమటోడుస్తున్నారు. మండుతున్న ఎండలు.. యంత్రాలకు గండంగా మారాయి. ఈ సీజన్‌లోనే పనులు వేగంగా సాగాలి. లేదంటే వర్షాకాలంలో పనులు పూర్తిగా మందగిస్తాయి. అందుకనే జూన్‌ చివరి నాటికల్లా స్పిల్‌వే, డయాఫ్రంవాల్‌ వంటి నిర్మాణ పనులు చకచకా కానిస్తున్నారు. ప్రతీ సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం పనులను సమీక్షిస్తున్నారు. గడువులోగా ప్రాజెక్టు పనులు ఎట్టి పరిస్ధితుల్లో పూర్తి కావాలన్నదే ఆయన ఆకాంక్ష. కానీ ఇప్పటిదాకా కొన్ని కీలక పనులు మందగమనంతో నడుస్తున్నాయి. స్పిల్‌ఛానల్‌లో 5 కోట్ల 95 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఎర్త్‌ వర్కు (మట్టి తవ్వకం) జరగాల్సి ఉండగా.. 3.70 కోట్ల క్యూబిక్‌ మీటర్ల పని పూర్తయింది. మొత్తంమీద ఈ ఒక్క పనిలోనే 62 శాతంమేర పురోగతి కనిపించింది. అప్రోచ్‌ చానల్‌ విషయంలోను 1.31 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర మట్టి తవ్వకం పని జరగాల్సి ఉండగా 22 లక్షలు క్యూబిక్‌ మీటర్ల వరకే సరిపెట్టారు. స్పిల్‌వే పనుల్లో వేగం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. కోటి 65 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఎర్త్‌వర్కు ఇప్పటికే కొలిక్కి వచ్చింది. చేపట్టిన స్వల్ప వ్యవధిలోనే అత్యధిక లక్ష్యాలను అందుకోగలిగారు.
 
డయాఫ్రం వాల్‌ నిర్మాణమే సవాల్‌
గోదావరి నదిలో సుమారు 667 మీటర్ల మేర ఈ సీజన్‌లోనే ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ వేయాలని భావించారు. ఆధునిక యంత్రాలను రప్పించారు. ఈ పనులకుగాను పెద్ద సంఖ్యలోనే ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ను వాడతారు. 199 ప్యానల్స్‌ను జూన్‌ నాటికి పూర్తి చేయాలి. ఇప్పటి వరకు 100 మీటర్ల మేర ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ పనులు, 18 ప్యానల్స్‌ పనులు మాత్రమే దగ్గరపడ్డాయి. వాస్తవానికి డయా ఫ్రం వాల్‌ నిర్మాణ పనులు 1409 మీటర్ల మేర జరగాలి. ఈ ఏడాది 667 మీటర్లకే సరిపెట్టారు. డయా ఫ్రం వాల్‌ నిర్మాణంలో అనేక సవాళ్లు ఉన్నాయి. భూఉపరితలం నుంచి సుమారు 100 నుంచి 120 మీటర్ల వరకు భూగర్భంలో రాయితగిలేంతవరకు వెళ్లాల్సి ఉంది. ఎక్కడైతే రాయి తగులుతుందో ఆ పైభాగం నుంచి ప్లాస్టిక్‌ కాంక్రీట్‌తో డయా ఫ్రం వాల్‌ను నిర్మిస్తారు. పవర్‌హౌస్‌ వద్ద కోటి 18 లక్షల క్యూబిక్‌ మీటర్లమేర ఎర్త్‌వర్కు జరగాల్సి ఉండగా ఇప్పటికే 87 లక్షల క్యూబిక్‌ మీటర్ల పని చేయగలిగారు. స్పిల్‌వేకు సంబంధించి 48 రేడియల్‌ గేట్లకుగాను ఐదు గేట్లను తీర్చిదిద్దగలిగారు. ప్రాజెక్టు ప్రాంతంలో గడిచిన వారం రోజులుగా సరాసరిన 40 డిగ్రీల పైబడే పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ మధ్యనే 995 ఎక్స్‌కవేటర్‌ అగ్నికి ఆహుతైంది. విపరీతమైన ఎండలు, ఉష్ణోగ్రతలు ఈ ప్రమాదానికి కారణమని అంచనా. 600కి పైగా వాహనాలు, చిన్న చిన్న ఎక్స్‌కవేటర్లు ఎర్త్‌వర్కులో పాలుపంచుకుంటున్నాయి. మే నెలలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉండడంతో యంత్రాలపై దీని ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
 
నేడు పోలవరానికి సీఎం
ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులను సోమవారం పరిశీలించనున్నారు. విజయవాడ నుంచి ఆయన ఉదయం నేరుగా పోలవరం చేరుకుంటారు. నిర్మాణస్ధలిలో ఇటీవల దగ్ధమైన 995 ఎక్స్‌కవేటర్‌ను పరిశీలిస్తారు.
Link to comment
Share on other sites

land aquition WG side Project head works site motham cleared 

 

Collector is rocking  :terrific:  :terrific:  :terrific:

WG lo 29,000+ acres lo 25,000 acres land aquition completed.

 

5000 acres pending for tribals pending to give land to land.

 

Total land aquition may complete by may

 

1st phase ki land aquition ki almost gets completed

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...