Jump to content

polavaram


Recommended Posts

http://www.thehindubusinessline.com/bline/2003/11/07/stories/2003110700301700.htm

 

 

CBN 96 time lo irrigation lo appati revenue deficit budget lo wonders chesadu....96-00 AP overdraft tho nadesindi chala kalam lo manaki jeetalaki levu...

first revenue improvement ki time pattindi and he achieved it step by step..Manaki credit rating leka world bank kuda loans chala restricted conditions this ichedi....Handri tane start chesadu a revenue down lo kuda...Thotapalli thande....

 

Chala mandiki teledu Potireddy padu head regulator TDP govt di....

 

DECO gadu janala emotion ni cash chesadu....vadiki CBN vesina IT results valla revenue kuda perigindi inka dobbataniki red carpet vesinattu ayyindi....

DECO HIGHEST priroity with all clearences low budget(250 crores) 45 TMC pulichintala meda chesina durmargam mamul di kadu le....vadu scrap chese projects ki high budet ichi paniki vache vatiki asalu pattinchukola

Link to comment
Share on other sites

  • Replies 3.3k
  • Created
  • Last Reply

సాకులు చెప్పొద్దు

పోలవరం పనుల తీరుపై ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం

అమెరికా నుంచి వచ్చేసరికి సరి చేయాలి

కేపీఎంజీపైనా ఆగ్రహం

అరుంధతి నక్షత్రం చూపించినట్లు కాదు

ఈనాడు - అమరావతి

1ap-state1a.jpg

పోలవరం ప్రాజెక్టులో కాంక్రీటు, మట్టి తవ్వకం పనులకు సంబంధించి లక్ష్యం మేరకు ఎందుకు పని చేయడం లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు చెప్పినా అంతులేని జాప్యం చేస్తున్నారని, నిర్మాణ సంస్థలు చెప్పే సమాధానాలు సరిగా లేవని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. పనులు ఆలస్యం కావడానికి ప్రతి సమీక్ష సమావేశంలో చెప్పే కారణాలే చెబుతున్నారు తప్ప పురోగతి చూపించడం లేదని ఆగ్రహించారు. పోలవరం పనుల పురోగతికి వస్తున్న సమస్యలను పరిష్కరించాలని అధికారులకు సూచించారు. మట్టి తవ్వకంతో సహా మిగిలిన అన్ని పనులకు పరిష్కారం చూపాలన్నారు. వెలగపూడి సచివాలయం నుంచి ముఖ్యమంత్రి సోమవారం పోలవరం ప్రాజెక్టుతో పాటు మరికొన్ని ప్రధాన ప్రాజెక్టులపై సమీక్షించారు. ఆర్థిక కారణాలను, ఇతర చిన్న సాకులను కారణాలుగా చూపితే సహించేది లేదన్నారు. తాను అమెరికా వెళ్లి వచ్చేసరికి అంతా సరిదిద్దాలని, లేదంటే వూరుకునేది లేదని హెచ్చరించారు. ఉపగుత్తేదారులతో ఒప్పందాలు, చెల్లింపులు, లీడ్స్‌కు సంబంధించి ప్రధాన గుత్తేదారు ప్రతినిధి వివిధ సమస్యలను సమావేశం ముందుంచగా జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కలగజేసుకున్నారు. ప్రభుత్వం వైపు నుంచి అన్నివిధాలా సహకరిస్తున్నామని, అంతర్గత సమస్యలు మీరే పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. బ్యాంకర్లు సహకరించడం లేదని నిర్మాణ సంస్థల ప్రతినిధులు సమీక్షలో వివరించగా వెంటనే సీఎం జోక్యం చేసుకుని బ్యాంక్‌ఆఫ్‌ బరోడా ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడారు. నిధుల విడుదల విషయంలో బ్యాంకర్లతో సమస్యలుంటే పరిష్కరించుకోవాలని, ప్రభుత్వం నుంచి మాత్రం నిధులపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదని ముఖ్యమంత్రి భరోసానిచ్చారు. ప్రాజెక్టు పనులు ఆలస్యమవుతున్నాయని, సరిగా జరగడం లేదంటూ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ ఒక నివేదికను ముఖ్యమంత్రికి చూపింది. దీంతో సీఎం వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలు చెబుతూ పోతే మీరెందుకని, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ అంటే పరిష్కారాలు చూపాలని అన్నారు. పనులు ఆలస్యమవడానికి మూలకారణం ఏమిటో తెలుసుకుని పరిష్కరించాలని, పనులు జరగడం లేదని చెబితే ఉపయోగమేమిటని ప్రశ్నించారు. వచ్చే సమీక్ష మీ నుంచే ప్రారంభిస్తానని వారికి చెప్పారు.

ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు, అవుకు టన్నెల్‌ తదితర అంశాలపై అక్కడి అధికారులు వివరాలు చెబుతున్న సమయంలోనూ ముఖ్యమంత్రి ఆగ్రహించారు. ‘నాకు కథలు చెప్పొద్దు.. ఫలితాలు కావాలి. పనులు చేయించుకునే బాధ్యత మీది. పనివారీగా సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు పరిష్కారాలు చూపుతున్నా. ప్రతిదీ నేనే పరిష్కరించాలనేట్లు చూస్తే ఎలా?’ అని ప్రశ్నించారు. వాసర్‌ ల్యాబ్స్‌ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రికి ఒక ప్రజంటేషన్‌ సమర్పించారు. కరవు నివారణకు ఏం చేయనున్నారో వివరించారు. ఈ సందర్భంలోనూ ముఖ్యమంత్రి కలగజేసుకుని ‘పెళ్లిళ్లలో అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు.. అది కనిపించకపోయినా కనిపించిందనేస్తారు. అలా నా చేత ఏదోలా మీరు ‘ఎస్‌’ అనిపించేస్తున్నారు. నాకు కావాల్సింది సిద్ధాంతాలు కాదు. ఆచరణ. అప్పుడే మూడేళ్లు గడిచాయి. కరవును ఎలా ఎదుర్కొన్నారో, ఎక్కడ ఎక్కువ నీరుంటే లోటున్న చోటకు ఎలా పంపారో అది కావాలి’ అని ఉద్బోధించారు.

సౌర విద్యుత్‌ నిల్వను పరిశీలించనున్న చంద్రబాబు

సౌర విద్యుత్‌ నిల్వకు ప్రాధాన్యత చేకూరిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన అమెరికా పర్యటనలో ఈ విషయాన్ని పరిశీలించనున్నారు. టెస్లా అనే సంస్థ సౌర విద్యుత్‌ నిల్వ విధానాన్ని రూపొందించిన నేపథ్యంలో దాన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశముంది.

Link to comment
Share on other sites

పోలవరంపై నేడు జైట్లీతో బాబు భేటీ
 
న్యూఢిల్లీ, మే 2 (ఆంధ్రజ్యోతి): ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీతో సమావేశం కానున్నారు. బుధవారం ఉదయం ఢిల్లీకి వస్తున్న సీఎం మధ్యాహ్నం 12.30కు జైట్లీని, 3 గంటలకు నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు అరవింద్‌ పనగాడియాని, సాయంత్రం 5 గంటలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌తో భేటీ అవుతారు. సమయానుకూలతను బట్టి ఇతర కేంద్ర మంత్రులను కూడా సీఎం కలిసే అవకాశం ఉంది. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీ కింద నిధుల మంజూరు, వివిధ పథకాలకు ఆమోదం మొదలైన అంశాలపై జైట్లీతో చంద్రబాబు చర్చించే అవకాశముంది. ముఖ్యంగా, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పాత అంచనాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.3,300 కోట్లు రావాల్సి ఉంది. ఈ మొత్తాన్ని తక్షణం విడుదల చేయాలని గత కొద్ది రోజులుగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కేంద్రాన్ని కోరుతున్నారు. త్వరలోనే మంజూరు చేస్తామని కేంద్రం సమాధానం ఇస్తోంది. ఈ అంశాన్ని చంద్రబాబు, జైట్లీతో చర్చించే అవకాశం ఉంది. డిజిటల్‌ చెల్లింపులపై నీతి ఆయోగ్‌ సబ్‌ కమిటీకి చంద్రబాబు నేతృత్వం వహించిన సంగతి తెలిసిందే. ఆ కమిటీ మధ్యంతర నివేదికను ఇచ్చింది. తుది నివేదికను కేంద్రానికి సమర్పించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై పనగాడియాతో చర్చించే వీలుంది.
Link to comment
Share on other sites

నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు

పలువురు కేంద్ర మంత్రులతో భేటీ!

అటు నుంచే అమెరికాకు

ఈనాడు, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం ఉదయం దిల్లీకి వెళ్లనున్నారు. పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. అక్కడి నుంచే బుధవారం రాత్రి 1.30గంటల సమయంలో అమెరికా పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు. తొలుత బుధవారం ఉదయం ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీతో భేటీ అవుతారు. పోలవరం ప్రాజెక్ట్‌కి రావాల్సిన రూ.3,000కోట్లు, 2014-15 సంవత్సరంలో రెవెన్యూ లోటు కింద ఇవ్వాల్సిన మొత్తం గురించి చర్చిస్తారు. అనంతరం గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌తో సమావేశమై..ఉపాధి హామీ పథకానికి సంబంధించి వస్తు సామగ్రి విభాగంలో రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మాట్లాడతారు. గ్రామీణ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణానికి కేంద్రం ప్రామాణికంగా తీసుకుంటున్న సెక్‌ సమాచారంతో ఏర్పడుతున్న ఇబ్బందుల గురించి వివరిస్తారు. ఆ సమాచారాన్ని మినహాయించటమో, కొత్తగా సేకరించటమో చేయాలని సూచించనున్నారు. నగదు రహిత లావాదేవీల గురించి నీతి అయోగ్‌ ఉపాధ్యక్షుడు పనగారియాతో చర్చిస్తారు.

Link to comment
Share on other sites

పర్యావరణానికి ఆటంకం లేదు కదా?
 
  • నిర్వాసితులకు పునరావాసం కల్పించారా?
  • పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై సీడబ్ల్యూసీ ప్రశ్నలు
  • పునరావాస గ్రామాన్ని పరిశీలించిన సభ్యులు
  • సౌకర్యాలు బాగున్నాయన్న స్థానికులు
పోలవరం, మే 3: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పరిశీలన కోసం రాష్ర్టానికి వచ్చిన సీడబ్ల్యూసీ సీఈ ఆర్‌కే పచౌరి నేతృత్వంలోని ఆరుగురు సభ్యులతో కూడిన బృందం బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆయా అంశాల పరిశీలనతో బిజీబిజీగా గడిపింది. పర్యావరణానికి ఆటంకం లేకుండా అనుమతులకు లోబడి నిర్మిస్తున్నారా? నిర్వాసితులకు పునరావాసం ఎలా కల్పిస్తున్నారు? వంటి పలు అంశాలపై అధికారులను అడిగి తెలుసుకుంది.
 
ఈ బృందం ప్రాజెక్టు వద్దకు చేరుకోగా స్పిల్‌వే, డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణ పనులు జరుగుతున్న తీరును ప్రాజెక్టు సీఈ వి.రమేశ్‌బాబు, ట్రానట్రాయ్‌ ప్రతినిధి తిరుమలేశ్వరరావుతోపాటు పలువురు ఇంజనీరింగ్‌ అధికారులు వివరించారు. ప్రాజెక్టు క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ ఉన్నతాధికారులు, ఇరిగేషన అధికారులు, కాంట్రాక్ట్‌ ఏజెన్సీ ప్రతినిధులతోనూ కమిటీ సభ్యులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా జాయింట్‌ కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రాజెక్టులో ముందుగా ముంపునకు గురయ్యే ఏడు గ్రామాలు, కుడి కాలువ వల్ల భూములు కోల్పోయిన రామన్నపాలెంతోసహా మొత్తం 8 గ్రామాలను ఖాళీ చేయించి వారికి అన్ని రకాల మౌలిక వసతులతో కలిగిన పునారావాస గ్రామాలను నిర్మించామన్నారు.
 
భూమికి భూమి సంబంధించి ఇప్పటి వరకూ 99ు అందించామని చెప్పారు. ప్రాజెక్టు నిర్మాణంతో జిల్లాలో 31,600 ఎకరాలు ముంపునకు గురికాగా, ఇప్పటి వరకు 30,400 ఎకరాలు సేకరించామని, ఇంకా 1200 ఎకరాలు సేకరించాల్సి ఉందని, అది కూడా డీఎన, డీడీ స్టేజీల్లో ఉందని, జూలై 31 వ తేదీకి నూరు శాతం పూర్తవుతుందన్నారు. ప్రాజెక్టు ఎగువ భాగంలో అటవీ ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల వాగుల ఉధృతికి కొండల పైనఉన్న మట్టి రిజర్వాయర్‌లోకి చేరి పూడిక పెరుగుతుందని, దానిని నివారించడానికి ఏ విధమైన చర్యలు చేపట్టారని కమిటీ సభ్యులు ఈ సందర్భంగా ప్రశ్నించారు. మట్టి రిజర్వాయర్‌లోకి రాకుండా అటవీ ప్రాంతంలోని వర్షపు నీరు దిగువకు వెళ్లే ప్రాంతాల్లో చెక్‌ డ్యాం నిర్మిస్తున్నట్లు అధికారులు వివరించారు.
 
అనంతరం రామన్నపాలెం పునరావాస గ్రామాన్ని కమిటీ సభ్యులు పరిశీలించి... అక్కడి సౌకర్యాలపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు. పాత గ్రామంలో తాటాకు పాకల్లో నివసించే వారమని, పునారావాస గ్రామాల్లో పక్కా భవనాలు బాగున్నాయని స్థానికులు తెలిపారు. దీంతో, కమిటీ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. పునారావాస గ్రామంలో కల్పించిన వసతులపై జాయింట్‌ కలెక్టర్‌ పి.కోటేశ్వరరావుతోపాటు ఐటీడీఏ పీవో షాన మోహన, జంగారెడ్డిగూడెం ఆర్డివో లవన్నలు కమిటీకి వివరించారు. కమిటీ సభ్యుల వెంట ప్రాజెక్టు ఈఈలు పుల్లారావు, చంద్రరావు, కుమార్‌, బుల్లియ్య, తహశిల్దార్‌ ముక్కంటి ఉన్నారు.
Link to comment
Share on other sites

ఇకపై మూడు నెలలకోసారి పోలవరం సందర్శన

కేంద్ర బృందం వెల్లడి

3ap-state1a.jpg

పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను జాతీయ పర్యావరణ పర్యవేక్షణ రివర్‌వ్యాలీ ప్రాజెక్టుల సందర్శన బృంద సభ్యులు బుధవారం పరిశీలించారు. సీడబ్ల్యూసీ సీఈ ఆర్‌కె చౌదరి ఆధ్వర్యంలో నీతి ఆయోగ్‌లోని ప్లానింగ్‌ కమిషన్‌ సలహాదారుడు అభినేష్‌ మిశ్రా, గిరిజన మంత్రిత్వ శాఖ డిప్యూటీ కార్యదర్శి రూపక్‌ చౌదరి, జల వనరుల శాఖ సీనియర్‌ కమిషనర్‌ ఎస్‌కె శర్మ, సీడబ్ల్యూసీ జాయింట్‌ డైరెక్టర్‌ హెచ్‌కె మీనా, అసిస్టెంట్‌ డైరెక్టరు అమిత్‌ మిట్టల్‌ డయాఫ్రమ్‌వాల్‌ నిర్మాణ, స్పిల్‌వే కాంక్రీట్‌ పనులు పరిశీలించారు. అక్కడ నుంచి ప్రాజెక్టు క్యాంపు కార్యాలయానికి చేరుకుని ప్రాజెక్టు, ఆర్‌అండ్‌ఆర్‌ పనులపై సమీక్షించారు. ప్రాజెక్టు పనుల గురించి ఎస్‌ఈ వీఎస్‌ రమేష్‌బాబు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. జిల్లా సంయుక్త కలెక్టరు పి.కోటేశ్వరరావు, ఐటీడీఏ పీవో ఎన్‌.షణ్మోహన్‌లు ఆర్‌అండ్‌ఆర్‌ పనులపై సమగ్రంగా తెలియజేశారు. ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణ వివరాలు, పూడిక ఏర్పడకుండా చర్యలు తదితర వివరాలను బృంద సభ్యులు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న భూములకు బదులుగా సీఏ ల్యాండ్స్‌ 1750 ఎకరాలు రెవెన్యూ అధికారులు తమకు స్వాధీనం చేయగా ఆ భూముల్లో మొక్కలు పెంచుతున్నట్లు అటవీ రేంజర్‌ ఎన్‌. దావీద్‌రాజు వివరించారు. ఇకపై ప్రతి మూడు నెలలకు ఒకసారి తమ బృందం పోలవరం సందర్శనకు రానున్నట్లు సభ్యులు తెలిపారు.

Link to comment
Share on other sites

శరవేగంగా సాగుతున్న ఎడమ కాలువ పనులు
 
636295686993165497.jpg
  • శరవేగంగా సాగుతున్న ఎడమ కాలువ పనులు
  • రూ.132 కోట్లతో వరహనదిపై అక్విడెక్టు
  • కొండల వద్ద వాల్‌ నిర్మాణాలు
  • ఆధునిక యంత్రాలతో పనులు
  • వచ్చే ఏడాది ఏప్రిల్‌కు పూర్తి చేయాలని లక్ష్యం
జిల్లాలో పోలవరం ఎడమ కాలువ పనులు చకచకా సాగుతున్నాయి. పుష్కరకాలంగా నత్తనడకన సాగుతున్న కాలువను పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బడ్జెట్‌లో నిధులు కేటాయించడంతో పనులు ఊపందుకున్నాయి. 2018 ఏప్రిల్‌ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంతో ఆధునిక యంత్రాలతో పనులు జరుగుతున్నాయి. ఎడమ కాలువ పూర్తయితే జిల్లాలో లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందుతుంది.
 
విశాఖ‌ప‌ట్నం/ ఎలమంచిలి : జిల్లాలో 2005 సంవత్సరంలో ప్రారంభించిన పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులు పన్నెండేళ్లు అయినా పూర్తికాలేదు. దీంతో ఇటు ప్రజల్లోను, అటు రైతుల్లోను ప్రాజెక్టు నిర్మాణంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ ఏడాది బడ్జెట్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రూ.6,889 కోట్లు కేటాయించారు. దీంతో పనులు వేగవంతమయ్యాయి. 2018 ఏప్రిల్‌నాటికి కాలువ పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇందుకు ఆధునిక యంత్రాలను సైతం వినియో గిస్తున్నారు. ఈ కాలువ పనులు పూర్తయితే లక్షన్నర ఎకరాలకు సాగునీరు అందుతుంది. సుమారు నాలుగు లక్షల మంది రైతులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
 
6వ ప్యాకేజీ పనులు
పాయకరావుపేట నుంచి ఎస్‌రాయవరం మండలం దార్లపూడి వరకూ 111 కి.మీ. నుంచి 136 కి.మీ. వరకు 25 కిలోమీటర్లు పనులు చేపట్టాల్సి ఉంది. మట్టి పనులు మూడొంతుల వరకు పూర్తి కావచ్చాయి. లైనింగ్‌ పనులు 60 శాతం వరకూ జరిగాయి. కట్టడాల నిర్మాణాలు 43 శాతం వరకు జరిగాయి.
 
7వ ప్యాకేజీ పనులు
ఎలమంచిలి మండలం ఏటికొప్పాక నుంచి కశింకోట మండలం తాళ్లపాలెం వరకు 136 కి.మీ. నుంచి 162కి.మీ వరకు పనులు చేపట్టాల్సి ఉంది. ఈ ప్యాకేజిలో 90 శాతం మట్టి పనులు పూర్తి కాగా, 53 శాతం లైనింగ్‌ పనులు, 58 శాతం కట్టడాల పనులు జరిగాయి. సుమారు 50 కిలోమీటర్ల పొడవునా 53 మీటర్ల వెడల్పుతో కాలువ తవ్వి చుట్టూ లైనింగ్‌ పనులు చేపడుతున్నారు. గ్రామాలు ఉన్నచోట అనుసంధానం చేస్తూ సింగిల్‌ లెవెల్‌, డబుల్‌ లెవెల్‌ బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. గెడ్డలు, సాగునీటి కాలువలను కలుపుకుంటూ కట్టడాలను నిర్మిస్తున్నారు. పాయకరావుపేట వద్ద ప్రారంభమైన ఈ కాలువ కశింకోట మండలం తాళ్లపాలెం వరకూ వస్తుంది. ఇక్కడ నుంచి ఏలేరు కాలువలోకి నీరు మళ్లిస్తారు. జిల్ల్లాలో రైతుల అవసరాలకు పోనూ మిగులు నీరు విశాఖ స్టీల్‌ఫ్లాంట్‌ అవసరాల కోసం కణితి రిజర్వాయర్‌కు నీటిని మళ్లిస్తారు. ఈ రెండు అవసరాలకు సరిపడా నీరు పోనూ మిగిలిన ఏడు వేల క్యూసెక్కుల నీటిని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పఽథకానికి మళ్లించనున్నారు. ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు కూడా ఈనీటిని అందించనున్నారు. ఇందిరా సాగర్‌ ఎడమ ప్రధాన కాలువ పేరుతో పూర్తి కావస్తున్న ఈప్రాజెక్టు కనుక పూర్తయితే ఉత్తరాంధ్రలో పొలాలన్నీ సస్యశ్యామలంగా మారే అవకాశం లేకపోలేదు.
 
రూ.132 కోట్లతో వరహ నదిపై అక్విడెక్టు
ఈ ప్రాజెక్టులో కీలకమైన అక్విడెక్టును ఎస్‌.రాయవరం మండలం దార్లపూడి చక్కెర కర్మాగారం సమీపం నుంచి ఎలమంచిలి మండలం ఏటికొప్పాక ఆనకట్ట వద్ద వరహనది మధ్యలో రూ.132 కోట్లతో అక్విడెక్టు నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఒకకిలోమీటరు పైబడి అక్విడెక్టు నిర్మాణం, రెండు కిలోమీటర్లు పైబడి వాల్స్‌ నిర్మించేలా పనులు సాగుతున్నాయి.
 
2018 లక్ష్యంగా పనులు
2018 సంవత్సరానికి పోలవరం కాలువ పనులు పూర్తి చేసేలా వేగంగా పనులు జరిపిస్తున్నాం. భూసేకరణ కార్యక్రమం పూర్తికావచ్చింది. బడ్జెట్‌లో ప్రత్యేకతను కల్పించడం వల్ల మరింత వేగంగా పనులు సాగుతున్నాయి. ఆధునిక యంత్రాలను ఉపయోగించి మరీ పనులు జరిపిస్తున్నాం. వరహనదిపై కూడా అక్విడెక్టును వేగంగా నిర్మించేలా చర్యలు తీసుకుంటున్నాం. - జి.రామచంద్రరావు. ఈఈ, పోలవరం ప్రాజెక్టు
Link to comment
Share on other sites

లచ్చిందేవి వచ్చిందయ్యా!
 
636301538129531742.jpg
  • పోలవరం పరిహారంతో మారిన కథ
  • కోరికల తేరుపై కుక్కునూరు జోరు
  • కొండ అంచు బతుకుల్లో కోటి పాట
  • రూ.10లక్షల నుంచి కోటి దాకా డబ్బులు
  • చిన్న పల్లెల్లోనూ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ పరుగు
  • వారంలోనే 110 బైకులు కొనేసిన రైతులు
  • కొత్తగా కార్లు, ట్రాక్టర్ల బుకింగ్‌లు
  • సంతల కూడలిలో షోరూమ్‌ల సందడి
సెల్‌ ఫోన్‌ ‘బీప్‌’మని శబ్దం చేసింది! ఎస్సెమ్మెస్‌ వచ్చింది. ‘మీ ఖాతాలోకి 20 లక్షల రూపాయలు జమ అయ్యాయి’ అని బ్యాంకు నుంచి సందేశం! ఇలా ఒకేరోజు వందలమంది రైతుల ఫోన్లకు సందేశాలు! పది లక్షల నుంచి కోటి రూపాయల దాకా... వచ్చి పడ్డాయి! ఇంకేముంది... సీన్‌ మారిపోయింది! డొంకరోడ్డులో నడిచినట్లుగా సాగిన బతుకు బండి... ఒక్కసారిగా రయ్య్‌మని వేగం పుంజుకుంది. పోలవరం ముంపు మండలాల్లో ఒకటైన కుక్కునూరులో పరిస్థితి ఇది! అక్కడేమైందంటే.. 
 
కుక్కునూరు, మే 11: పోలవరం ప్రాజెక్టు కింద మునిగిపోతామని ఒకనాడు భయపడిన పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు మండల రైతులు, ఇప్పుడు మరోరకంగా మునిగి తేలుతున్నారు. బైకులు, తళతళలాడే కార్ల మోడళ్లు, రంగురంగుల టీవీలు వచ్చిపడుతుంటే, ఆ వరద కింద ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. నిన్నటిదాకా సంతలు జరిగిన ఈ ప్రాంతమంతా ఇప్పుడు షోరూమ్‌లతో నిండిపోయింది. చీరవల్ల్లి మాధవరం పంచాయతీలాంటి మామూలు గ్రామంలో సైతం ‘బుల్లెట్లు’ ధఢ్‌ధఢ్‌మంటూ పరుగులు తీస్తున్నాయి. ఈ ఒక్క పంచాయతీలోనే వారం వ్యవధిలో 30కి పైగా బైకులు రోడ్ల రంగంలోకి దిగాయి.
 
పరిహారంలో పోల‘వరం’
కుక్కునూరు మండలంలో ఎక్కువమంది చిన్న, సన్నకారు, మధ్య తరగతి రైతులు ఉన్నారు. అందరికీ ఎంతోకొంత భూమి ఉంది. కాకపోతే సాగు వనరులే లేవు. ఏనాడూ వ్యవసాయం కలిసిరాలేదు. ఇలాంటి పరిస్థితిలో ఈ మండలం పోలవరం ముంపు పరిధిలోకి వచ్చింది. ఈ మండలంలోని 15 గ్రామాల పరిధిలో ప్రభుత్వం 14 వేల ఎకరాలను సమీకరించింది. ఎకరాకు రూ. 10.80 లక్షల చొప్పున పరిహారంగా నిర్ణయించింది. ఇందులో 12 గ్రామాల రైతుల ఖాతాల్లో ఒక్కసారిగా రూ. 850 కోట్లు వచ్చిపడ్డాయి. ‘లచ్చిందేవి వచ్చింది’ అంటూ తెల్లారేసరికి బ్యాంకుల నుంచి మెసేజ్‌లు వచ్చాయి. ఒక్కో రైతుకు రూ.10 లక్షల నుంచి కోటికిపైగా కూడా ఖాతాల్లో పడ్డాయి. దీంతో.. కుక్కునూరు కథే మారిపోయింది. తమ ఖాతాలో పడిన డబ్బులను తీసుకోవడం కోసం కుక్కునూరు ఆంధ్రా బ్యాంకు వద్ద కొందరు రైతులు బారులు తీరితే.. డబ్బులు చేతిలో పడినవారు కొత్తవస్తువుల పరుగులో పడిపోయారు. వీరిలో కొందరు తమకు వచ్చిన సొమ్ముతో ఇతర ప్రాంతాల్లో స్థలాలు, పొలాలు కొనుగోలు చేస్తుంటే, మరికొందరు మాత్రం తమ జీవనశైలిని వేగంగా మార్చేసుకొనే పనిలో పడ్డారు. బ్యాంకులో డబ్బు డ్రా చేసుకోవడమే ఆలస్యం.. సరాసరి షోరూములకు వెళ్తున్నారు. కుమారుడి కోసం బైకు, భార్య కోసం బంగారం, తన కోసం మరోటి.. ఇలా బుకింగుల పరంపర సాగుతోంది. ఒకప్పుడు కుక్కునూరు వాసులు బండి కొనాలంటే రాజమండ్రో, భద్రాచలమో వెళ్లాల్సి వచ్చేది. రోజంతా తిరిగి, కంపెనీ ప్రతినిధులు అడిగే ప్రూఫ్‌లు ఇవ్వలేక అవస్థలు పడేవారు. ఇప్పుడు ఇంటి ముందుకే కంపెనీల ఏజెంట్లు నడుచుకొంటూ వస్తున్నారు. కార్లు, బైకులు, ట్రాక్టర్లు, గృహోపకరణాలు.. ఇలా ఏది కావాలంటే అది చేతికి అందించిపోతున్నారు. ఇంకా డబ్బులు డ్రా చేయలేదన్నా వదిలిపెట్టడం లేదు. ‘ఫరవాలేదు. మీ దగ్గర డబ్బులు ఎక్కడకుపోతాయి’ అంటూ రైతు మీద మునుపెన్నడూ లేనంత నమ్మకం ప్రదర్శిస్తున్నారు. చూస్తుండగానే కుక్కునూరులో రెండు బైక్‌ల షోరూమ్‌లు వెలిశాయి. అయినా, చాలక ఎక్కడ టెంటు కనిపిస్తే అక్కడకు రైతులు వెళ్లిపోయి, బేరాలాడుకొని బుకింగు చేసేస్తున్నారు. ఇలా వారం వ్యవధిలోనే ఈ మండలంలో 110 ద్విచక్ర వాహనాలను కొనేసినట్టు చెబుతున్నారు. కుక్కునూరు, అశ్వారావుపేట, భద్రాచలం, కొత్తగూడెంలో జోరుగా విక్రయాలు జరుగుతున్నాయి.
 
రండి.. చూడండి..
కోటి రూపాయలకుపైగా పరిహారం వచ్చినవారు లేటెస్ట్ట్‌ కార్లు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల ధర ఉన్న కార్ల్లను బుక్‌ చేస్తున్నారు. వచ్చిన పరిహారాన్ని బట్టి మరికొందరు చిన్న కారుతో సరిపెట్టుకొంటున్నారు. కుక్కునూరులో కార్ల్ల కంపెనీల హడావుడి కూడా పెరిగిపోయింది. ట్రాక్ట్టర్ల్ల కంపెనీలూ గ్రామాల్లోకి దిగిపోతున్నాయి. రైతులను కలసి బ్రోచర్‌లను పంచుతున్నాయి. ఆసక్తి చూపిన వారికి కంపెనీల ఏజెంట్లు ఆఫర్ల్లు ప్రకటిస్తున్నారు.
 
వడ్డీకి తెచ్చి తాగుతున్నారు
పరిహారం అందుకున్నవారిలో కొందరు.. కోల్పోయిన భూమికి సరిపడా పొలాలను కొనడం, పిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేసుకోవడం చేస్తుండగా.. మరికొందరు మాత్రం డబ్బుల మాయలో ఊగి తూగుతున్నారు. మద్యం అలవాటు ఉన్న వారు రూ.5 వడ్డ్డీకి డబ్బులు తెచ్చుకొని మరీ తాగేస్తున్నారు. అదేమంటే.. బ్యాంకులోని డబ్బులు రాగానే తీర్చేస్తామని ధీమాగా చెప్పడం కనిపిస్తోంది.
 
కొత్త.. కొత్తగా..
కుక్కునూరుకు చెందిన ఓ రైతు ఇంట్లో టీవీ, ఫ్రిజ్‌, వాషింగ్‌మిషన్‌తోపాటు ఏసీ సౌకర్యం కూడా ఉంది. అవన్నీ బాగా నడిచేవే. కానీ... పోలవరం పరిహారం చేతిలో పడటమే ఆలస్యం, పాతవన్నీ ఆయనకు బోరు కొట్టేశాయి. రూ.50వేలు పెట్టి కొత్త ఏసీ తెచ్చేశాడు. పాతటీవీ అమ్మేసి 20అంగుళాల కలర్‌ టీవీని కొన్నాడు. కొత్త వాషింగ్‌మిషన్‌ కూడా తెచ్చుకున్నారు.
 
2polavaram1.jpg 
 
SELF ADVT
Link to comment
Share on other sites

పోలవరం @ రూ.45 వేల కోట్లు!
 
636302387823249863.jpg
  • భూసేకరణ కోసమే రూ.33,000 కోట్లు.. పనుల వారీగా ఏకకాలంలో అంచనాలు
హైదరాబాద్‌, మే 12(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు అంచనా ఎంతో త్వరలో తేలిపోనుంది. ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ప్రాథమిక అంచనా మేరకు రూ.45,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ), రాష్ట్ర జలవనరుల శాఖలు భావిస్తున్నాయి. ఈ మొత్తంలో ప్రాజెక్టు హెడ్‌వర్క్స్‌, కాలువలకు, డిసి్ట్రబ్యూటరీలకు గతంతో పోలిస్తే వ్యయం పెద్దగా పెరగలేదని, 2013 నాటి చట్ట ప్రకారం భూసేకరణకే రూ.33,000 కోట్ల వ్యయం అవుతుందని పీపీఏ భావిస్తోంది. సభ్య కార్యదర్శి ఆర్‌.కె.గుప్తా నేతృత్వంలో అంచనాలను రూపొందించడంలో నిమగ్నమైంది. ఇతర రాష్ట్రాల జల వనరుల శాఖ అధికారులతోనూ సమీక్షించాక... తుది అంకెను ఖరారు చేయాలని పీపీఏ ఆలోచిస్తోంది. జాతీయ హోదా ను ప్రకటించిన ఈ ప్రాజెక్టుకు 2014 నాటి అంచనాల మేరకు 100% నిధులను కేంద్రమే భరిస్తుందని రాష్ట్ర విభజన చట్టం స్పష్టంగా పేర్కొంది. పోలవరం ప్రాజెక్టు అంచనా... 2005-06 నాటి రూ.10,151.04 కోట్ల నుంచి 2010-11 నాటికి రూ.16.010.45 కోట్లకు చేరుకుంది.
 
2010-11 తర్వాత ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులపై రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా శ్రద్ధ చూపలేదు. అందువల్ల ఈ ప్రాజెక్టు అంచనాలను సవరించడంపైనా ప్రభుత్వం దృష్టి సారించలేదు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు.. ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించా రు. నిధులను కేంద్రం విడుదల చేసేలా ఒత్తిడి పెంచారు. ఫలితంగా... కేంద్రం నాబార్డు నుంచి రుణం తీసుకుని ప్రాజెక్టు నిర్మా ణం కోసం నిధులు మంజూరు చేసింది. అయితే... ఇప్పటి దాకా 2010-11 అంచనా మాత్రమే అధికారికంగా ఉంది. రాష్ట్ర విభజన తర్వాత.. రాష్ట్ర జలవనరుల శాఖ రూపొందించిన అంచనా రూ. 30,450 కోట్లుగా ఉంది. దీనిని పీపీఏ పరిశీలిస్తోంది. మరోవైపు, ఇటీవల పార్లమెంటు ఉభయ సభల్లోనూ, మీడియా సమావేశాల్లోనూ... 2014-15 నాటి అంచనా వ్యయాన్ని కేంద్రం పూర్తిగా భరిస్తుందంటూ లిఖిత పూర్వకంగా స్పష్టం చేస్తూ వచ్చింది.
 
అయితే, ఈ ప్రకటనపై రాజకీయపక్షాలు పలు సందేహాలు లేవనెత్తాయి. కేంద్రం కేవలం రూ.16,010.45 కోట్లను మాత్రమే ఇచ్చేందుకు సిద్ధమైందంటూ ఆరోపణలు గుప్పించాయి. కాగా, ఈ ప్రాజెక్టు నుంచి 2018 నాటికి గ్రావిటీ ద్వారా నీరివ్వాలని, 2019 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం... ఆలోగా ప్రాజెక్టు అంచనాలపై స్పష్టత రాకుంటే నిర్మాణ వ్యయభారం మోయడం కష్టమవుతుందని కేంద్రానికి స్పష్టం చేసింది. కాగా, పోలవరం సూపరింటెండింగ్‌ ఇంజినీరు(ఎ్‌సఈ) రమేశ్‌ ఉద్యోగ కాలం ఈ ఏడాది ఏప్రిల్‌ 30తో ముగిసింది. ప్రస్తుతం క్వాలిటీ కంట్రోల్‌ చీఫ్‌ ఇంజినీరుగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అందువల్ల, ఆయనను ఎస్‌ఈ హోదాలో మరో రెండేళ్లు పనిచేసేలా జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ మెమో జారీ చేశారు.
Link to comment
Share on other sites

పోలవరం భద్రతపై ప్రత్యేక దృష్టిపెట్టాలి

డీఐజీ పీవీఎస్‌ రామకృష్ణ ఆదేశం

ఏలూరు, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఏలూరు రేంజి డీఐజీ పీవీఎస్‌ రామకృష్ణ పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టు భద్రత అంశంపై పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో ఆదివారం సమీక్ష నిర్వహించారు. పోలవరం నిర్మాణ ప్రాంతంలో అవసరమైతే ప్రత్యేక బలగాలను నియమిస్తామని డీఐజీ చెప్పారు. నిర్మాణ పనులు చేపట్టిన ఏజెన్సీల సిబ్బందికి ప్రత్యేక రక్షణ కల్పించాలన్నారు. అగ్నిమాపక శాఖ అధికారులతో మాట్లాడుతూ నిర్మాణ ప్రాంతంలో అగ్నిప్రమాదాలు సంభవిస్తే ఎలా ఎదుర్కోవాలో అక్కడి ఏజెన్సీల నిర్వాహకులకు, సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా ఎస్పీ భాస్కరభూషణ, రాజమహేంద్రవరం ఎస్పీ బి. రాజకుమారి, జిల్లా అగ్నిమాపక అధికారి బి. వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...