Madhu.T Posted June 10, 2024 Posted June 10, 2024 మన బాలయ్య బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
chanu@ntrfan Posted June 10, 2024 Posted June 10, 2024 Happy birthday to the GOD OF MASSES Andari kantey manchi manchi kathalu padali balayya manaki…
seenu454 Posted June 10, 2024 Posted June 10, 2024 Hbd Hero ...... Chandas lanti anti social elements meedha ku "Asurudu" madiri hero Gurram lo vasthunnatlu unnadu 109 lo...
RamaSiddhu J Posted June 10, 2024 Posted June 10, 2024 పరమవీరచక్ర తీశాడని దాసరిని, పాండురంగడు ఫ్లాప్ అని రాఘవేంద్ర రావు నీ నిందించలేదు.. వీరభద్ర ఫ్లాప్ అయింది అని రవికుమార్ చౌదరి కెరీర్ అంతం చెయ్యలేదు.. విజయేంద్ర వర్మ తీసినందుకు స్వర్ణ సుబ్బారావుని బలిపశువు ని నీ చెయ్యలేదు.. ఒక్క మగాడు పోయిందని వైవీఎస్ చౌదరి నీ దూరం పెట్టలేదు.. చెప్పుకుంటూ పోతే ఫ్లాప్ లిస్ట్ లో ఉన్న పీ.వాసు, కే ఎస్ రవికుమార్, క్రిష్ , జయంత్ సీ పరాన్జి వంటి డైరెక్టర్ ల గురించి బహిరంగంగా ఏనాడూ ఒక్క చిన్న మాట తూలలేదు.. పై పెచ్చు ఆ సినిమాల అపజయాన్ని అందరి కన్నా ఎక్కువ తానే మోశాడు.. Paid PR టీముల ని పెట్టుకుని, రివ్యూవర్లను మ్యానేజ్ చేసి పోయిన సినిమా క్రెడిట్ అంతా డైరెక్టర్ల ఖాతాలో, హిట్లని తన సొంత విజయంగా ఏనాడూ ప్రదర్శించుకోలేదు.. దర్శకుల పని లో వేలెట్టి కెలికేసి సొంత ఇన్ పుట్ లు, వెకిలి సలహాలు ఇచ్చేసి ఏనాడూ ఎవరితో మాట పడలేదు.. దర్శకుడే అన్నిటికీ ఆద్యుడు, he is the captain of the ship అని నమ్మే సమర సింహా రెడ్డి, నరసింహ నాయుడు లో థియేటర్ ల తాపు లేపిన ట్రైన్ సీన్ ల ను "బీ గోపాల్ గారు నా నుండి బెస్ట్ ఔట్ పుట్ తీసుకురాగలరు" అన్నా, అదే బీ గోపాల్ గారు దర్శకత్వం వహించిన పలనాటి బ్రహ్మనాయుడు లో ట్రాల్ అయిన ట్రైన్ సీన్ లను ప్రస్తావిస్తూ "ఎందుకు చేశానో నాకే తెలీదు, అసలు తొడ గొడిటే ట్రైన్ వెళ్లిపోవడం ఏమిటి, చూస్తే ఇప్పటికీ నవ్వొస్తుంది" అని నవ్వుతూ వదిలేసినా బాలయ్య కే చెల్లింది.. అందుకే అంత స్వచ్ఛంగా తన మీద సోషల్ మీడియా లో వెకిలి కామెడీ లు చేసుకుని బతికే ఎందరికో పరోక్షంగా తిండి పెడుతూ, కుల మత ప్రాంతాల కతీతంగా క్యాన్సర్ కారణంగా అంధకారం నింపుకున్న ఎందరో జీవితాల్లో వెలుగులు నింపుతూ సినీ వినీలాకాశంలో ధృవ తారగా , రాజకీయ రణరంగం లో ఓటమి ఎరుగని యోధునిగా నిలిచిపోయాడు.. అందుకే మరొక్కసారి మనస్ఫూర్తిగా "జై బాలయ్య"..
navayuvarathna Posted June 10, 2024 Posted June 10, 2024 ”కోపం వస్తే మండుటెండ… మనసు మాత్రం వెండి కొండ…” – బాలకృష్ణ సినిమాకూ, ఈ పాటకూ సంబంధం లేదు కానీ, ఈ చరణాలు సరిగ్గా బాలయ్య వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తాయి. తిక్క రేగితే తిడతాడు, అది నెత్తికెత్తితే కొడతాడన్నది ఎంత నిజమో, మనసుకు నచ్చితే అంతే స్వచ్ఛంగా మనుషుల్ని ప్రేమిస్తాడు అనేదీ అంతే నిజం. అదే అభిమానులకూ నచ్చుతుంది. అందుకే ఆయనంటే అంత పిచ్చి. బాలయ్య అంటే భళా.. బాలయ్య అంటే భోళా. చూడ్డానికి గంభీరంగా కనిపిస్తాడు. కదిలిస్తే చిన్నపిల్లాడైపోతాడు. అందంలో, ఆహార్యంలో, అభినయంలో, వాచకంలో, నృత్యంలో, నిత్యం కొత్తదారుల్ని ఆవిష్కరించడంలో బాలయ్యకు తిరుగులేదు. మాస్, యాక్షన్, ఫిక్షన్, ఫ్యాక్షన్, ఫాంటసీ, హిస్టరీ… ఇలా బాలయ్యకు లొంగని జోనర్ లేదు. నందమూరి తారక రామారావు తరవాత అన్ని జోనర్లనీ టచ్ చేసిన స్టార్ హీరో అతనే. ఈ విషయంలో తండ్రికి తగ్గ తనయుడిగా నిలిచాడు మన బాలయ్య. కత్తి పట్టాలన్నా బాలయ్యే, గుర్రమెక్కి కదం తొక్కాలన్నా బాలయ్యే. మాస్ డైలాగులు చెప్పాలన్నా, గళమెత్తి ఓ పద్యం అందుకోవాలన్నా.. బాలయ్యే! ఈ వైవిధ్యం ఇంకెవరికీ సాధ్యం కాదేమో. ఇండస్ట్రీ రికార్డుల్ని తిరగరాసిన బాలకృష్ణ – ప్రయోగాలకు వెనుకంజ వేయలేదు. ‘ఆదిత్య 369’, ‘భైరవద్వీపం’… ఇవన్నీ అప్పట్లో ప్రయోగాలే. ఫ్యాక్షన్ కథలతోనూ ఇండ్రస్ట్రీ రికార్డుల్ని కొట్టొచ్చు అని నిరూపించిన యాక్షన్ హీరో బాలయ్య. ‘సమరసింహారెడ్డి’తో ఫ్యాక్షన్ రుచి, స్టామినా ఏమిటో టాలీవుడ్ కి చెప్పాడు. ఆ తరవాత అంతా బాలయ్యను ఫాలో అయ్యారు. చిత్రసీమ అంతా మాస్, యాక్షన్ గోలలో కొట్టుకుపోతున్నప్పుడు ‘శ్రీరామరాజ్యం’, ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ లాంటి కళాత్మక చిత్రాల్లో నటించడానికి సాహసించిన హీరో. అందుకే బాలయ్య అంటే అంత అభిమానం. ఓసారి, ఓ దర్శకుడ్ని నమ్మాడంటే… ఆ దర్శకుడ్ని ఫాలో అయిపోవడమే తన పని. తొడ గొట్టమన్నా కొడతాడు, ట్రైన్లని వెనక్కి పంపమన్నా పంపుతాడు. నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్ అంతే. బాలయ్య చేసిన కొన్ని సీన్లు సరదాగా ఉంటాయి. నవ్వు తెప్పిస్తాయి. ట్రోలింగ్‌కి గురవుతాయి. కానీ వాటిని కూడా అభిమానులు ఎంజాయ్ చేస్తారు. ‘ఇలాంటివి చేయాలన్నా మన బాలయ్యే’ అని కాలర్ ఎగరేస్తారు. ఆడియో ఫంక్షన్లలో బాలయ్య స్పీచులు సైతం వాళ్లకు ఎంటర్‌టైన్ ఇస్తుంటాయి. మనసులో ఉన్నది మాట్లాడేయడం బాలయ్య స్పెషాలిటీ. వాటికి గ్రామర్ ఉండాల్సిన పనిలేదు అనేది బాలయ్య మెంటాలిటీ. తనని ట్రోల్ చేయడానికి కొంతమంది ఎదురు చూస్తుంటారు అని తెలిసినా బాలయ్య తన స్వభావం వదల్లేదు. ‘నవ్వేవాళ్లు నవ్వనీ, ఏడ్చేవాళ్లు ఏడ్వనీ.. డోంట్ కేర్’ అంటూ బాలయ్య సినిమాలో ఓ పాటుంది. అదే ఆయన లక్షణం కూడా. బసవతారకం ఆసుపత్రి బాలయ్యలోని మరో ఉదాత్తమైన కోణం. ఆ ఆసుపత్రి ద్వారా ఎంతమంది ప్రాణాల్ని కాపాడాడో లెక్కలేదు. సైలెంటుగా చేసే సేవా కార్యక్రమాలకు పద్దు లేదు. హిందూపురంలో వరుసగా మూడు సార్లు గెలిచి – రాజకీయ రంగంలోనూ విజయ పతాక ఎగరేశాడు బాలయ్య. ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న హీరోలు కూడా ‘నేను మీ అభిమానిని సార్’ అంటే చాలు, వాళ్ల సినిమాల ప్రమోషన్ల రంగంలో దిగిపోతాడు. అక్కడ ఈగోలు, స్టార్‌డమ్‌లూ అడ్డు రావు. పాతికేళ్ల వయసులో బాలయ్యని చూడండి. ఇప్పటి బాలయ్యని చూడండి. ఎక్కడా తేడా లేదు. అదే జోష్… అదే స్పీడ్. ఆ మాటకొస్తే అంతకంటే కొంచెం ఎక్కువే. వయసు శరీరానికే కానీ, మనసుకు కాదు. బాలయ్య ఈ మాటల్ని నిజం చేశాడు. ఇది వరకటికంటే స్పీడుగా సినిమాలు చేస్తున్నాడు. సినిమాలేనా, ఇటు బుల్లి తెర షోలు, అటు రాజకీయాలు, మరోవైపు ‘బసవతారకం’ అంటూ సేవా కార్యక్రమాలు. ఏం చేసినా, ఎక్కడ ఉన్నా ఆయనకంటూ ఓ బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ మరో వందేళ్లయినా అలానే ఉంటుంది. ఎందుకంటే ఆ బ్రాండ్ పేరు… బాలయ్య! హ్యాపీ బర్త్ డే నందమూరి బాలకృష్ణ!!!
RamaSiddhu J Posted June 10, 2024 Posted June 10, 2024 పసిపిల్లలతో ఏంట్రా ఇది....రీల్ తగలబెట్టేస్తా ****************************** ఎన్టీఆర్ శ్రీనాథకవిసార్వభౌమ షూటింగ్ రామకృష్ణ స్టూడియోలో జరుగుతున్నరోజులు....తండ్రి సినిమా అందునా పౌరాణికం కావడంతో ఆసక్తిగా షూటింగ్ కి వీలున్నప్పుడల్లా వచ్చేవాడు బాలయ్య...అదే స్టూడియోలో ఇంకోసెట్లో ఇంద్రజ హీరోయిన్ గా పరిచయమయిన జంతర్ మంతర్ షూటింగ్ కూడా జరుగుతుంది......ఒకరోజు సాయంత్రం తండ్రి సినిమా షూటింగ్ చూడడానికొచ్చిన బాలయ్యకి జంతర్ మంతర్ షూటింగ్ జరుగుతున్న సెట్ పక్కగా వెళ్తుండగా ఒక చిన్నకుర్రోడు లైట్ పట్టుకుని కనిపించాడు. ఎంతసేపట్నుంచి పట్టుకునిఉన్నాడో దాని బరువుమోయలేకనో అలసిపోయి కళ్ళుతిరిగిపడిపోయేలా కనిపించాడు....షాట్ మధ్యలో ఉంది...వెంటనే బాలయ్య వేగంగా వెళ్ళి పడిపోబోతున్న కుర్రోడిని పక్కకి జరిపి షాట్ పూర్తయ్యేదాకా బాలయ్యే లైట్ పట్టుకున్నాడు...ఇది గమనించిన డైరెక్టర్ భరత్ పరిగెత్తుకుంటూ వచ్చి లైట్ చేతుల్లోకి తీసుకున్నాడు...షాట్ పూర్తవ్వగానే ఆగ్రహంతో బాలయ్య డైరెక్టర్ ని "పసిపిల్లలతో ఏంట్రా ఇది....రీల్ తగలబెట్టేస్తా" అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు...పొద్దున్నుంచి ఏమి తినకపోవడంతో బక్కచిక్కి నీరసంగా ఉన్న ఆ కుర్రోడిని తీసుకెళ్ళి కడుపునిండా అన్నంపెట్టి వాళ్ళ తల్లితండ్రుల్ని తీసుకుని రమ్మని స్టూడియో సిబ్బందితో చెప్పాడు...ఒక అరగంటలో ఆ కుర్రోడితో స్టూడియో మేనేజర్ తిరిగివచ్చాడు...పక్షవాతంతో తండ్రి, మూర్ఛరోగంతో తల్లి మంచానపడ్డారని తెలుసుకుని బాలయ్య చలించిపోయాడు...వెంటనే తార్నాకలోని హాస్పిటల్లో చేర్పించామని వాళ్ళ వైద్యానికి అయ్యే ఖర్చు అంత తానె భరిస్తానని చెప్పి...ఆ కుర్రోడిని తార్నాకలోని సరస్వతి శిశుమందిర్ లో చేర్పించి చదువు పూర్తయ్యేదాకా ఖర్చులన్నీ తానే భరించాడు...కస్టపడి చదువుకున్న ఆ కుర్రోడు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లోని బంకురా జిల్లాలో సీఐ గా పనిచేస్తున్నాడు...ఇప్పటికీ జూన్ 10 వ తారీకు ఈ భూమిమీద ఎక్కడున్నా దగ్గిర్లోని హాస్పిటల్ కి వెళ్ళి రక్తదానం చేస్తుంటాడు... బాలయ్య గురించి ఇవేవీ రాయరు...ఎందుకంటే ఇవేవీ బాలయ్య ప్రచారంకోసం బాకా కొట్టుకోడు...తనకి తెలిసిన సూత్రం ఒక్కటే " మానవసేవే మాధవ సేవ" జన్మదిన శుభాకాంక్షలు బాలయ్యా....🎊💐💐🎊🎊💐
KingV Posted June 10, 2024 Posted June 10, 2024 1 hour ago, John said: phone chesi vuntaadu le....!!!
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.