Jump to content

New Health Minister


Recommended Posts

Posted
Just now, niceguy said:

Something cooking seriously...Mukkodiki music start anukunta...

Mukkodiki music start ante eetala "ee govt lo corruption undi. Sarigga panicheyatledu . Nenu resign chestuna" anevadu. 

Not kcr ordering enquiry. 

Posted

రాత్రికి రాత్రే సర్వే ఎలా పూర్తయింది?: హైకోర్టు

హైదరాబాద్‌: మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ కుటుంబం హైకోర్టులో వేసిన అత్యవసర పిటిషన్‌పై విచారణ జరిగింది. నివాసంలోనే న్యాయమూర్తి జస్టిస్‌ వినోద్‌కుమార్‌ విచారణ చేపట్టారు. ఈటల కుటుంబం తరఫున సీనియర్‌ న్యాయవాది దేశాయి ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. సర్వే చేసే ముందు తమకు నోటీసు ఇవ్వలేదని ఈటల కుటుంబం న్యాయస్థానానికి వివరించింది. అధికారులు తమ భూముల్లోకి అక్రమంగా చొరబడ్డారని తెలిపింది. కలెక్టర్‌ నివేదిక కూడా తమకు ఇవ్వలేదని చెప్పింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్(ఏజీ) ప్రసాద్‌ వాదనలు వినిపించారు. ఈటలపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినందునే విచారణ జరిపామని న్యాయస్థానానికి వివరించారు. వాదనలు విన్న హైకోర్టు ‘‘సర్వే చేసేందుకు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదా.. రాత్రికి రాత్రే సర్వే ఎలా పూర్తయింది. ఫిర్యాదు వస్తే ఎవరి ఇంట్లోకైనా వెళ్లి విచారణ చేయొచ్చా?’’ అని ప్రశ్నించింది.

అధికారులు కారులో కూర్చొని నివేదిక రూపొందించినట్లు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై స్పందించిన అడ్వొకేట్‌ జనరల్‌ పూర్తిస్థాయి విచారణ జరగలేదని వివరించారు. ప్రాథమిక విచారణ మాత్రమే చేసినట్లు తెలిపారు. తదుపరి చర్యలు చట్టప్రకారమే ఉంటాయని కలెక్టర్‌ నివేదికలో తెలిపారని ఏజీ హైకోర్టుకు వివరించారు. పిటిషనర్లది కేవలం ఆందోళన మాత్రమేనన్నారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను మధ్యాహ్నం 2.30గంటలకు వాయిదా వేసింది.

  • 4 weeks later...
Posted

ఈనాడు, హైదరాబాద్‌: మాజీ మంత్రి, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ భాజపా గూటికి చేరడం దాదాపు ఖాయమైంది. త్వరలోనే దిల్లీ వెళ్లి భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఆయన భేటీ కానున్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం.
 

Posted
On 5/4/2021 at 5:52 PM, NTRtheking said:

Jai KCR

 

Should become CM 3rd time in a row in 2023 

 

Jai Jai KCR

Akkada KCR gelisthe ikkada Jagan gelusthadu.. 

Posted
On 5/4/2021 at 5:52 PM, NTRtheking said:

Jai KCR

 

Should become CM 3rd time in a row in 2023 

 

Jai Jai KCR

He will

He must.

 

Posted
2 hours ago, Siva Charan said:

Etela wife press meet created nice impact today. 2018 lo anyone I asked said TRS, don't know how Lagada missed it. Same friends ippudu dead against KCR.

Link unte veyandi bro.. 

Posted

ఈనాడు- దిల్లీ, హైదరాబాద్‌: మాజీమంత్రి ఈటల రాజేందర్‌ సోమవారం భాజపా జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డాతో దిల్లీలో సమావేశమయ్యారు. పార్టీలో చేరితే తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరడంతో పాటు, తెరాస-భాజపా సంబంధాలపై పలు సందేహాలను ఈటల లేవనెత్తినట్లు సమాచారం. రాష్ట్రంలో తెరాస, భాజపా మధ్య రాజకీయ పోరు కొనసాగుతుందని స్పష్టం చేసిన నడ్డా.. రాజేందర్‌కు సముచిత ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. పార్టీలో చేరికపై త్వరగా నిర్ణయానికి రావాలని సూచించారు. విశ్వసనీయ సమాచారం మేరకు వారి మధ్య పలు విషయాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది.‘‘రాష్ట్రంలో తెరాస, భాజపా ఒకటేనన్న భావన ప్రజల్లో ఉంది. అందుకు తగినట్లే తెరాస నాయకత్వం వ్యవహరిస్తోంది. మొదట కేంద్ర ప్రభుత్వ పథకాలను కేసీఆర్‌ తిడతారు. తర్వాత అమలు చేస్తారు. ఆయుష్మాన్‌భారత్‌ వంటి పలు పథకాల అమలే ఇందుకు ఉదాహరణ. భవిష్యత్తులో తెరాస, భాజపా చేతులు కలిపితే భాజపాను నమ్మి వచ్చే మాలాంటి వారి పరిస్థితి ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వం అనేక అక్రమాలకు పాల్పడుతుందన్న ఆరోపణలున్నా.. కేంద్ర ప్రభుత్వం ఒక్క విచారణ చేయకపోవడంపై ప్రజల్లో పలు అనుమానాలున్నాయి’’ అని ఈటల వ్యాఖ్యానించినట్లు సమాచారం. నడ్డా స్పందిస్తూ ‘‘పశ్చిమబెంగాల్‌లో మూడు స్థానాల నుంచి అధికారం చేపడతామనే వరకు ఎదిగాం. తెలంగాణలోనూ అంతకుమించి దూకుడు ప్రదర్శిస్తాం. తెరాస ప్రభుత్వ అక్రమాలపై తగిన సమయంలో స్పందిస్తాం. కేసీఆర్‌ కేంద్ర ప్రభుత్వ పథకాలను ఎందుకు విమర్శిస్తున్నారో.. తర్వాత ఎందుకు అమలు చేస్తున్నారో అక్కడి ప్రతిపక్షాలే ప్రశ్నించాలి. రానున్న ఎన్నికల్లో తెలంగాణలో భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది’’ అని ఈటలతో వ్యాఖ్యానించినట్లు తెలిసింది. అంతకుముందు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, మాజీ ఎంపీ వివేక్‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌చుగ్‌లతో కలిసి ఈటల రాజేందర్‌, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిలు నడ్డాను దిల్లీలోని ఆయన నివాసంలో కలిశారు. ఈటల, రవీందర్‌రెడ్డిలను బండి సంజయ్‌ నడ్డాకు పరిచయం చేశారు. సుమారు 50 నిమిషాల పాటు వారి భేటీ కొనసాగింది. తెరాసలో ఉద్యమకారులకు అవమానం జరుగుతోందని ఈటల వివరించారు. భాజపాలో చేరికపై త్వరలో నిర్ణయం తీసుకుంటానని వెల్లడించారు.

 

Posted
2 hours ago, Siddhugwotham said:

Etela chapter close if he resign to MLA... If he joined in BJP means he has some loop-holes...

TRS wins Huzurabad easily....

Same anukuntunna. Nagarjuna Sagar results choosaka kooda BJP join ayyadu ante he has holes. There is a nice chance for another regional party to emerge in TS.

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...