Jump to content

Mahakutami almost final


swarnandhra

Recommended Posts

పొత్తు ఫైనల్‌!
24-10-2018 02:46:56
 
636759460172166369.jpg
  • కూటమిలో సీట్ల పంపిణీ కొలిక్కి
  • రేపోమాపో 60 మందితో జాబితా
  • ఉమ్మడిగానే అభ్యర్థుల ప్రకటన
  • 90 కాంగ్రెస్‌
  • 15 టీడీపీ
  • 10 టీజేఎస్‌
  • 04 సీపీఐ
ఉంటుందా? లేదా? అనే అనుమానాలను నివృత్తి చేస్తూ... ఉండకూడదనుకున్న ప్రత్యర్థులకు ఆశాభంగం కలిగిస్తూ... ఎట్టకేలకు మహాకూటమి పార్టీల మధ్య పొత్తు ఖరారైంది. ‘నెగ్గాలంటే తగ్గాల’నే సూత్రానికి అనుగుణంగా కూటమి పార్టీలన్నీ పట్టువిడుపులకు సిద్ధపడడం, కాంగ్రెస్‌, టీడీపీ అధిష్ఠానాలు కూడా రంగంలోకి దిగడంతో కథ సుఖాంతమైంది.
 
 
హైదరాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): సీట్లు కాదు పొత్తే ముఖ్యమని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టం చేయడం, భాగస్వామ్య పక్షాలను సంతృప్తి పరుస్తూ పొత్తు ఉండాల్సిందేనని కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆదేశించడంతో గెలుపే ప్రాతిపదికగా పొత్తు చర్చలు, సీట్ల పంపిణీ ఖరారయ్యాయి. సీట్ల సర్దుబాటులో జాప్యం నేపథ్యంలో టీజేఎ్‌సతో పొత్తుకోసం బీజేపీ.. కోదండరాంతో టచ్‌లోకి వెళ్లినట్టు ఉప్పందడంతో కాంగ్రెస్‌, టీడీపీలు అప్రమత్తమై వ్యవహారాన్ని కొలిక్కి తెచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అవి వెల్లడించిన సమాచారం ప్రకారం... మొత్తం 119 సీట్లలో కాంగ్రెస్‌ 90 స్థానాల్లో పోటీ చేయనుంది. తెలుగుదేశం 15 స్థానాల్లో, టీజేఎస్‌ 10 చోట్ల, సీపీఐ 4 చోట్ల బరిలోకి దిగుతాయి. అంతేకాదు; ఆయా పార్టీలు విడివిడిగా కాకుండా, ఐక్యతకు చిహ్నంగా అన్ని పార్టీల అభ్యర్థులనూ ఉమ్మడిగా ఒకే వేదికపై ప్రకటిస్తారు.
 
నాలుగు పార్టీల రాష్ట్ర శాఖల బాధ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. కేవలం అసెంబ్లీ ఎన్నికల కోణంలోనే కాకుండా వచ్చే లోక్‌సభ ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని సీట్ల పంపిణీ జరుగుతున్నట్టు తెలిసింది. అందుకే కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ జాతీయ స్థాయి నాయకత్వాలు స్వయంగా పరిశీలిస్తూ, వివిధ సర్వేల ఆధారంగా ప్రతి సీటునూ ఆచితూచి ఎంపిక చేస్తున్నట్టు సమాచారం. లోక్‌సభ సీట్లు, సామాజిక వర్గాలు ప్రాతిపదికగా అసెంబ్లీ సీట్ల కేటాయింపు జరిగింది. సర్దుబాటును త్వరగా తేల్చాలని శ్రేణుల నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో.. క్షేత్ర స్థాయిలో నెలకొన్న ఉత్కంఠకు వీలైనంత త్వరలో తెరదించాలని భాగస్వామ్యపక్షాల నాయకత్వాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు, మూడు రోజుల్లోనే ఒకే వేదిక నుంచి కూటమి అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు సన్నాహాలు ముమ్మరమయ్యాయి.
 
తొలి జాబితాలో 60 పేర్లు ఉండే అవకాశం ఉంది. కూటమిలో ప్రతి భాగస్వామ్య పక్షానికి కేటాయించే సీట్లలో సగం మంది అభ్యర్థుల పేర్లు తొలి జాబితాలో ఉండొచ్చు. కాంగ్రెస్‌ నుంచి 40-50 మంది, టీడీపీ నుంచి 8, టీజేఎస్‌ నుంచి 5, సీపీఐ నుంచి ఇద్దరి పేర్లను ప్రకటిస్తారని సమాచారం. మొత్తమ్మీద జాబితాలో 35 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు, మిగిలిన వారు ఓసీలు ఉండే అవకాశం ఉంది. 60 మందిలో 35 దాకా ఎస్సీ, ఎస్టీ, బీసీలకే కేటాయించడం ద్వారా కూటమి వారికిచ్చే ప్రాధాన్యతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వ్యూహం రచించారు. ప్రజల మనోగతాన్ని ప్రతిబింబించేలా మహా కూటమి పేరును కూడా మార్చి, జనంలోకి వెళ్లాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో కూటమి వ్యవహారం కొలిక్కి వస్తుందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ మంగళవారం వెల్లడించారు. తొలి జాబితాను త్వరలో ప్రకటిస్తామని టీడీపీ టీఎస్‌ అధ్యక్షుడు రమణ తెలిపారు.
 
కూటమి నుంచి వైదొలగబోమని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి ప్రకటించారు. తాను హుస్నాబాద్‌లోనే బరిలోకి దిగుతాననీ, లేకుంటే పోటీకి దూరంగా ఉంటానని చెప్పారు. కాగా ఉత్తమ్‌, ఖుంటియా, జానారెడ్డి, షబ్బీర్‌ అలీ, సంపత్‌కుమార్‌, మధుయాష్కీగౌడ్‌ తదితరులతో కూడిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశమై సీట్ల పంపిణీకి తుది మెరుగులు దిద్దింది. బుధవారం సీపీఐ నేతలతో చర్చలు జరిగే అవకాశం ఉంది.
 
గతంలో గెలిచిన స్థానాలపై టీడీపీ ఆసక్తి
కూటమికి కీలకంగా మారిన తెలుగుదేశం.. 2014లో తాను గెలిచిన స్థానాల్లోనే ఇప్పుడూ పోటీ చేయటానికి ఆసక్తి చూపింది. దీంతో భాగస్వామ్య పక్షాలకు బలమైన అభ్యర్థులు లేకపోతే, ఆయా సీట్లు టీడీపీకే దక్కనున్నాయి. తెలుగుదేశం వర్గాల సమాచారం ప్రకారం.. ఉప్పల్‌, ఎల్బీనగర్‌, కూకట్‌పల్లి, శేర్‌లింగంపల్లి, రాజేంద్రనగర్‌, మహేశ్వరం, కోరుట్ల, సత్తుపల్లి టీడీపీకి దక్కబోతున్నట్టు తెలిసింది. ఈ 8 సీట్లకూ తొలి జాబితాలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. రమణ కోరుట్ల నుంచి పోటీ చేయడం ఖాయమైంది. మిగతావాటిలో కోదాడ, మహబూబ్‌నగర్‌, దేవరకద్రల్ని టీడీపీ కోరుతోంది. సనత్‌నగర్‌లో కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌రెడ్డి పోటీ చేయనున్నందున, దానికి బదులు సికింద్రాబాద్‌ ఇవ్వాలని టీడీపీ కోరుతున్నట్లు సమాచారం. ముషీరాబాద్‌, ఖైరతాబాద్‌ కూడా టీడీపీకి దాదాపుగా ఖరారైనట్లు తెలిసింది. వీలైతే కుత్బుల్లాపూర్‌, మహేశ్వరం, మక్తల్‌ సీట్లను తీసుకోవటానికి టీడీపీ ఆసక్తి చూపుతోంది. నామా నాగేశ్వరరావు పోటీ చేయటానికి సిద్ధపడితే ఖమ్మం అసెంబ్లీ స్థానాన్ని తీసుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది.
 
 
మా వెంట పడుతున్నారు
టీఆర్‌ఎస్ పై రమణ, చాడ, కోదండ ధ్వజం
విపక్ష నాయకులను భయభ్రాంతులకు గురిచేసేలా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మహాకూటమి నాయకులు ధ్వజమెత్తారు. తమ వాహనాలను అక్రమంగా తనిఖీ చేస్తున్నాయని, తమను షాడో పార్టీలు వెంబడిస్తున్నాయని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ వైఖరిపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. దీనిపై ఉత్తమ్‌తోనూ ఫోన్‌లో చర్చించారు. తన కుటుంబసభ్యులు ఉన్న వాహనాన్ని కరీంనగర్‌ వద్ద నిర్బంధంగా ఆపి తనిఖీ చేశారని రమణ తెలిపారు. కోదండరాం వాహనాన్ని హైదరాబాద్‌లో తనిఖీ చేశారని, వాహనాన్ని షాడోపార్టీ వెంబడించిందని పేర్కొన్నారు.
Link to comment
Share on other sites

2 minutes ago, swarnandhra said:

yeah, TJS ki 5 kuda ekkuve. asalu kodandaram ayina gelustada?

ade kada,.. aa neerasapu voice tho ayye panena asalu, valla team lo okka Rachana thappa evariki voice ledu. TDP ki inka 2-3 ivvochu easy ga.. but teesukunna vaatillo baaga perform chesthe ade set avuthaayi le,.. Lokshabha ki adagochu atleast

Link to comment
Share on other sites

2 minutes ago, Compaq said:

ade kada,.. aa neerasapu voice tho ayye panena asalu, valla team lo okka Rachana thappa evariki voice ledu. TDP ki inka 2-3 ivvochu easy ga.. but teesukunna vaatillo baaga perform chesthe ade set avuthaayi le,.. Lokshabha ki adagochu atleast

 

25 minutes ago, swarnandhra said:

సీట్లు కాదు పొత్తే ముఖ్యమని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు స్పష్టం చేయడం

 

25 minutes ago, swarnandhra said:

కేవలం అసెంబ్లీ ఎన్నికల కోణంలోనే కాకుండా వచ్చే లోక్‌సభ ఎన్నికలను కూడా దృష్టిలో ఉంచుకుని సీట్ల పంపిణీ జరుగుతున్నట్టు తెలిసింది.

 

Link to comment
Share on other sites

Tdp strong anukunna places lo 15 theeskunte good.... last time tdp+bjp gelichina places lo mana ki strong leaders leremo in few places like erraballi,  thummala etc.... aa places congress ki ichi migathaa places and 2nd place vachi strong cadre/leaders unnachota contest cheyyaali..... 

TJS ki TRS strong unna places lo seats ichi congress rebels chetha koodaa contest chepisthe better ....

Link to comment
Share on other sites

8 minutes ago, nbk@myHeart said:

Tdp strong anukunna places lo 15 theeskunte good.... last time tdp+bjp gelichina places lo mana ki strong leaders leremo in few places like erraballi,  thummala etc.... aa places congress ki ichi migathaa places and 2nd place vachi strong cadre/leaders unnachota contest cheyyaali..... 

TJS ki TRS strong unna places lo seats ichi congress rebels chetha koodaa contest chepisthe better ....

mostly ade jaruguddankuntanna

Link to comment
Share on other sites

1 minute ago, nbk@myHeart said:

Trs will contest with dummy candidates in Bjp sitting places ... so mahakootami should try to con test strong candidates so that bjp will be big zero 

bjp ki last time 5 vachayi tdp punyam valla….eesari 1 or none.

amberpet, Musheerabad, kairtabad, goshamahal, uppal

veetillo  Musheerabad uppal  tdp Adugutundi

Link to comment
Share on other sites

11 minutes ago, baggie said:

bjp ki last time 5 vachayi tdp punyam valla….eesari 1 or none.

amberpet, Musheerabad, kairtabad, goshamahal, uppal

veetillo  Musheerabad uppal  tdp Adugutundi

Kairathabad congress ki evarannaa good candidate unnaada? Pjr kids iddaroo trs aa ipudu ?

Link to comment
Share on other sites

7 minutes ago, naanidilip said:

Suryapeta geliche chances unnai bjp 

Dubbaka - Raghunandan Rao is working since last 3 years. If Congress failed to field strong candidate BJP might chance to win.

Raghunandan Rao personal image > BJP here in Dubbaka. Raghunandan Mahakutami nunchi poti cheste sure win.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...