sonykongara Posted June 7, 2017 Posted June 7, 2017 Mahaprasthanam Vehicles | Free Services to Carry Dead Modiesఈ నెల 20 నుంచి, మృతదేహాల తరలింపునకు ఉచిత సేవ చనిపోయిన ఆప్తుల మృతదేహాలను ఇళ్లకు తీసుకెళ్లడానికి డబ్బుల్లేని భారతాన్ని ఇటీవల కాలంలో చూశాము. ఒడిషా, బీహార్ లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలను జరిగాయి. ఈ ఆపద సమయాల్లో అలాంటి వారికి అండగా నిలిచేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ వైద్య శాలల్లో చికిత్స పొందుతూ చనిపోయిన వారి మృతదేహాలను వారి ఇళ్లకు చేర్చడానికి మహాప్రస్థానం కార్యక్రమం అమలు చేయ్యనుంది ప్రభుత్వం. ముందుగా మెడికల్ కాలేజీలున్న 11 వైద్యశాలలతో పాటు ఏలూరు, విజయనగరం జిల్లా ఆసుపత్రులకు ఒక్కో వాహనాన్ని మహాప్రస్థానం కార్యక్రమం కింద సమకూరుస్తారు. త్వరలో రాష్ట్రంలోని మిగిలిన ఆసుపత్రులకూ వాహనాలు అందజేస్తారు. ఈ వాహనాల ద్వారా మృతదేహాలను ఇళ్లకు తరలిస్తారు. ఈ నెల 20 నుంచి మహాప్రస్థానం వాహనాలు సేవలు అందించనున్నాయి.
nivas_hyd Posted June 7, 2017 Posted June 7, 2017 Sometimes these things matters a lot.. I have seen cases where people struggling to find a vehicle to carry dead Modies.. Last minute lo chalaa pathetic anipisthaay alaanti situations.. I personally liked this move.. HelloNTR, Paruchuri and swarnandhra 3
NTRYoungTiger Posted June 7, 2017 Posted June 7, 2017 Sometimes these things matters a lot.. I have seen cases where people struggling to find a vehicle to carry dead Modies.. Last minute lo chalaa pathetic anipisthaay alaanti situations.. I personally liked this move..
Compaq Posted June 8, 2017 Posted June 8, 2017 Innallu mana govts asalu ee service provide cheyyalekapovatam too bad., sarele late aina okati plan chesaru.. swarnandhra 1
Hello26 Posted June 8, 2017 Posted June 8, 2017 Very good initiative ...much appreciated swarnandhra 1
Paruchuri Posted June 8, 2017 Posted June 8, 2017 Realistic move..cbn Funeral ki kuda 30k amount entho istunattunnaru kada??
Kiriti Posted June 8, 2017 Posted June 8, 2017 Sometimes these things matters a lot.. I have seen cases where people struggling to find a vehicle to carry dead Modies.. Last minute lo chalaa pathetic anipisthaay alaanti situations.. I personally liked this move.. Innallu mana govts asalu ee service provide cheyyalekapovatam too bad., sarele late aina okati plan chesaru.. Very good initiative ...much appreciated
murali@nbkfan Posted June 8, 2017 Posted June 8, 2017 Sometimes these things matters a lot.. I have seen cases where people struggling to find a vehicle to carry dead Modies.. Last minute lo chalaa pathetic anipisthaay alaanti situations.. I personally liked this move..
sonykongara Posted June 9, 2017 Author Posted June 9, 2017 మరణించిన వారి దహన సంస్కారాల కోసం ‘మహాప్రస్థానం’ అనే కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. దీనిద్వారా దహన సంస్కారాల కోసం రూ.30వేలు ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు
sonykongara Posted June 21, 2017 Author Posted June 21, 2017 ‘మహాప్రస్థానం’ ప్రారంభం మృతదేహాలను ఉచితంగా తరలించేందుకు 50 వాహనాలు ప్రయోగాత్మకంగా 15 ఆసుపత్రుల్లో అమలు: మంత్రి కామినేని ఈనాడు, అమరావతి: మృతదేహాలను ప్రభుత్వాసుపత్రుల నుంచి ఉచితంగా, గౌరవప్రదంగా ఇంటికి తీసుకెళ్లి అప్పగించే ‘మహాప్రస్థానం’ వాహనాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఆన్‌లైన్ ద్వారా గుంటూరు ఆసుపత్రి నుంచి ఈ వాహనాలను ముఖ్యమంత్రి ప్రారంభించారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ తెలిపారు. ‘మహాప్రస్థానం’ సేవలు మంగళవారం నుంచే మొదలైనట్లు సచివాలయంలో ఆయన విలేకరులకు చెప్పారు. ఈ సేవలను రాష్ట్రంలోని 15 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామని వివరించారు. 13 మెడికల్ కళాశాల ఆసుపత్రులతోపాటు ఏలూరు, విజయనగరంలలో 50 వాహనాలు అందుబాటులో ఉంచినట్లు మంత్రి పేర్కొన్నారు. చికిత్స పొందుతూ ఎవరైనా చనిపోతే సూపరింటెండెంట్ వచ్చి, దండ వేసి మృతదేహాన్ని వాహనంలో ఇంటికి పంపిస్తారని చెప్పారు. త్వరలో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు ఈ పథకాన్ని విస్తరిస్తామన్నారు. టాటా ట్రస్ట్‌తో ఒప్పందం: రాష్ట్రంలోని నెల్లూరు, కర్నూలులో క్యాన్సర్ యూనిట్లు, విశాఖపట్నం స్విమ్స్‌కు సూపర్ స్పెషాలిటీస్ టెక్నాలజీ అందించే విషయంలో టాటా ట్రస్ట్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని మంత్రి చెప్పారు. సెన్నార్ గ్రూప్‌తో మెడికల్ డేటా ఎనలిటిక్స్‌పై ఒప్పందం కుదిరిందన్నారు. యోగా కార్యక్రమంలో ముఖ్యమంత్రి: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం 6.55 గంటలకు విజయవాడలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారని మంత్రి తెలియజేశారు.
sskmaestro Posted July 10, 2017 Posted July 10, 2017 Govt hospital ki to and fro vehicles free ga undali.... Free ambulances, talli-Bidda expresses and maha prasthanam vehicles... abundant ha untey bauntundi
Compaq Posted July 10, 2017 Posted July 10, 2017 What happened to talli-bidda express? emaindo teliyadu,.. guntur lo maa apartment mundu okati untadi eppudu
HelloNTR Posted July 10, 2017 Posted July 10, 2017 heart touching move .. peru kooda baaga pettaru .. CBN
Naren_EGDT Posted July 10, 2017 Posted July 10, 2017 Innallu mana govts asalu ee service provide cheyyalekapovatam too bad., sarele late aina okati plan chesaru..
NTR_Sachin Posted July 10, 2017 Posted July 10, 2017 heart touching move .. peru kooda baaga pettaru .. CBN
sonykongara Posted December 11, 2017 Author Posted December 11, 2017 మహాప్రస్థానానికి బ్రేక్?11-12-2017 03:10:14 వారంలో నిలిపివేయాలని నిర్ణయం బిల్లుల చెల్లింపుల్లో ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం సప్తవర్ణ దుప్పట్ల పథకానిదీ ఇదే దారి! మృత్యువు.. ఎక్కడ.. ఎప్పుడు.. ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు! కారణమేదైనా సొంతూళ్లో గానీ, స్థిర నివాసం ఉంటున్న ఊళ్లో లేదా అక్కడి ఆస్పత్రిలో గానీ కన్నుమూస్తే .. మనిషి దూరమయ్యాడన్న అంతులేని బాధ తప్ప, మృతదేహాన్ని ఇంటికి తరలించడం ఏమంత కష్టమూ కాదు.. ఖర్చూ కాదు! అదే ఊరుగాని ఊళ్లో అయితే?.. అందునా ప్రమాదాల్లో అయితే?? ఆ కష్టం వర్ణనాతీతం. ఇలాంటి బాధ పగవాడికి కూడా రాకూడదనే ప్రభుత్వం ’మహాప్రస్థానం‘ పేరిట అంబులెన్స్‌లను ప్రవేశపెట్టింది. కానీ.. ఇప్పుడా వైకుంఠ రథాలకు బ్రేక్ పడనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది! అమరావతి, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది జూన్‌లో ప్రవేశపెట్టిన మహాప్రస్థానం పథకం అతి తక్కువ సమయంలోనే ఆపన్నులకు మేలు చేయడమే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చిపెట్టింది. కానీ ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా అద్భుతమైన పతకం ఆరు నెలలకే మూలకు చేరే స్థితికి వచ్చేసింది. ఆరోగ్యశాఖ జూన్ 20వ తేదీన మహాప్రస్థానం వాహనాలు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో ప్రారంభించింది. సుమారు ఆరు నెలల్లో సుమారు 5 వేల మృతదేహాలని, కుటుంబ సభ్యులను ఈ వాహనాల ద్వారా స్వస్థలాలకు చేర్చారు. ప్రమాదానికి గురై చనిపోయిన వారి మృతదేహాలను ఇటు తెలంగాణ, అటు తమిళనాడు వంటి రాష్ట్రాలకు కూడా తరలించిన సందర్భాలు కూడా ఉన్నాయి. అద్భుతమైన సేవ అందిస్తున్న మహాప్రస్థానం వాహనాలు కేవలం నిధులు లేమి కారణంగా వారంలో నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆరోగ్యశాఖ సప్తవర్ణ దుప్పట్లు పథకం ప్రారంభించిన తర్వాత ఆసుపత్రుల్లో పడకలు ఎంతో పరిశుభ్రంగా ఉంటున్నాయి. కానీ ఈ పథకానికి కూడా నిధుల లేమి వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం వల్లే... నిబంధనల ప్రకారం కొత్త పథకాలు ప్రారంభించినప్పుడు, దానికి ప్రత్యేకంగా కొంత నిధులు సిద్ధం చేసుకున్న తర్వాతనే అమలులోకి తీసుకురావాలి. కానీ ఆరోగ్యశాఖ అధికారులు పథకాలు రూపకల్పన చేసి, అమలులోకి వచ్చిన తర్వాత నిధుల గురించి తర్జనభర్జన పడుతున్నారు. నెలల తరబడి సర్వీస్ ప్రొవైడర్లకు బిల్లులు చెల్లించకపోవడం వల్లే ఈ సమస్య వచ్చింది. పథకం ప్రారంభించినప్పటి నుంచి కాంట్రాక్ట్ సంస్థకు ఆరోగ్యశాఖ ఒక్క రూపాయి కూడా చెల్లించలేదు. దీంతో కాంట్రాక్ట్‌ర్లు సేవలు నిలిపి వేయాలన్న ఆలోచనలో ఉన్నారు. వీటికి మాత్రం క్రమం తప్పకుండా నిధులు! వాస్తవానికి చంద్రన్న సంచార చికిత్స వాహనాల్లో సుమారు 80 మంది వరకూ వైద్యుల కొరత ఉంది. మందుల సమస్య తీవ్రంగా ఉంది. నిబంధనల ప్రకారం చికిత్స వాహనాల్లో వైద్యులు లేకపోతే ఆ వాహనానికి చెల్లించాల్సిన డబ్బులను తగ్గించి, బిల్లులు చెల్లించాల్సి ఉంది. కానీ అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా, సంచార చికిత్స వాహనాల్లో వైద్యులు లేకపోయినా ఒక్క రూపాయి కూడా తగ్గించకుండా బిల్లులు చెల్లిస్తూ వస్తున్నారు. ప్రజల మన్నలు పొందిన పథకాలను మాత్రం గాలికి వదిలేస్తున్నారు.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now