Jump to content

Recommended Posts

Posted

Last time punarvibhajana jariginappudu Gade Venkata Reddy chaala ground work chesi mana strong constituency lu chala vidadeesadu. Ex Nandigama, penugonda....more. Kudarani chota vere cast voters ni kaliparu. Ex: Gannavaram...etc.

 

Ippudu ala work chese vaallu mana party lo vunnara? Enthina politics lo R's kasi veru. Kshiminchandi oka cast prastavana techhinanduku.

 

Access vunna vaallu evariana mana tdp leaders ki cheppandi-eevishayam light ga teesukovaddani. Antha officers ki vadalakandi ani.

Posted

Last time punarvibhajana jariginappudu Gade Venkata Reddy chaala ground work chesi mana strong constituency lu chala vidadeesadu. Ex Nandigama, penugonda....more. Kudarani chota vere cast voters ni kaliparu. Ex: Gannavaram...etc.

 

Ippudu ala work chese vaallu mana party lo vunnara? Enthina politics lo R's kasi veru. Kshiminchandi oka cast prastavana techhinanduku.

 

Access vunna vaallu evariana mana tdp leaders ki cheppandi-eevishayam light ga teesukovaddani. Antha officers ki vadalakandi ani.

leaders involve avudam anna babu involve avvanivvaduga TDP leaders ade sagam cadre ki chikaku pette vishayam

Posted

leaders involve avudam anna babu involve avvanivvaduga TDP leaders ade sagam cadre ki chikaku pette vishayam

enduku dandaga...tit for tat time chusukoni ivalsindi aythe ittantivi cheyakunda unna eekedem ledu..national media lo news spread chesthunaru,.. negative news anedi wild fire laga potundi

Posted

Last time punarvibhajana jariginappudu Gade Venkata Reddy chaala ground work chesi mana strong constituency lu chala vidadeesadu. Ex Nandigama, penugonda....more. Kudarani chota vere cast voters ni kaliparu. Ex: Gannavaram...etc.

 

Ippudu ala work chese vaallu mana party lo vunnara? Enthina politics lo R's kasi veru. Kshiminchandi oka cast prastavana techhinanduku.

 

Access vunna vaallu evariana mana tdp leaders ki cheppandi-eevishayam light ga teesukovaddani. Antha officers ki vadalakandi ani.

tdp lo leaders kanna cbn ki telusu ekkada emi cheyyalo,already ekkada ey district lo penchalo mottam list ready ayipoyindi ani talk

Posted

enduku dandaga...tit for tat time chusukoni ivalsindi aythe ittantivi cheyakunda unna eekedem ledu..national media lo news spread chesthunaru,.. negative news anedi wild fire laga potundi

agreee

Posted

అసెంబ్లీ సీట్ల పెంపు ప్రక్రియ త్వరలోనే మొదలయ్యే అవకాశాలున్నాయి'
 

636247674186812849.jpg
ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ప్రక్రియ త్వరలోనే మొదలయ్యే అవకాశాలున్నాయని టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీ సీట్ల పెంపుపై వెంకయ్యతో మాట్లాడామన్నారు. అసెంబ్లీ సీట్లు పెంచేందుకు ఉన్న న్యాయ అడ్డంకులపై కేంద్రం కసరత్తు చేసిందని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ సవరణ చేయాలా, విభజన చట్టం సవరణ చేస్తే సరిపోతుందా అనే విషయంపై అధ్యయనం చేస్తున్నారని ఎంపీ తెలిపారు. సీట్ల పెంపుపై రెండు రాష్ట్రాలు ప్రధానికి పూర్తి నివేదిక ఇచ్చాయని ఎంపీ తెలిపారు
Posted
‘సీటు’ స్వీటుగా..
 
  • అసెంబ్లీ స్థానాల పెంపుపై ఆశల మోసులు
  • అమిత్‌షాతో బాబు చర్చల తర్వాతే కదలిక
అమరావతి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై కదలికతో నేతల్లో ఆశలు మోసులెత్తుతున్నాయి. నియోజకవర్గాల పెంపుతో ఎవరి అవకాశాలు ఎలా ఉంటాయన్న దానిపై నాయకుల్లో చర్చలు మొదలయ్యాయి. నియోజకవర్గాల పునర్విభజన ప్రకియ్ర చట్ట రూపం దాలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో సమీకరణాలు మారతాయని, ఈ పరిణామం మరిన్ని వలసలకు దారి తీసే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో 2009 అసెంబ్లీ ఎన్నికల ముందు ఒకసారి నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఇప్పుడు రాష్ట్ర విభజన నేపథ్యంలో మరోసారి ఆ అవసరం ఏర్పడింది. విభజన చట్టంలోనే నియోజకవర్గాల పెంపు అంశాన్ని పేర్కొన్నారు. రాజ్యాంగపరమైన మీమాంసలతో ఈ అంశం పెండింగ్‌లో పడుతూ వచ్చింది. పునర్విభజన రాజకీయంగా తమకు లాభించే పరిణామంగా భావిస్తున్న టీడీపీ కేంద్రంపై తెచ్చిన ఒత్తిడితో ఎట్టకేలకు ఫైలు కదిలింది. సీఎం చంద్రబాబు బీజేపీ చీఫ్‌ అమిత షాతో కొంతకాలం క్రితం జరిపిన చర్చల ఫలితంగా ఈ కదలిక వచ్చిందని అంటున్నారు. ‘‘మనం కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు రాజకీయంగా మా అవసరాలను తీర్చాల్సిన బాధ్యత మీపై ఉంది. మేం కొత్తగా ఏదీ కోరడంలేదు. విభజన చట్టంలో ఉన్నదే అడుగుతున్నాం. మేం బలంగా ఉంటే అది మీకూ లాభం. ఇంత చిన్న పని కోసం మేం ఇన్నిసార్లు ఢిల్లీ చుట్టూ తిరగాల్సి రావడం సరికాదు. ఆపై మీ ఇష్టం’ అని అమితషాతో చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ భేటీ తర్వాతే కేంద్రంలో కదలిక వచ్చిందని టీడీపీ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే పునర్విభజన చట్టాన్ని ఆమోదించుకోవాలన్న ప్రయత్నంలో ఆ వర్గాలు ఉన్నాయి. ఒకసారి పార్లమెం టు ఆమోదం తెలిపితే, మిగిలిన ప్రక్రియను ఎన్నికల కమిషన్‌ చేపడుతుంది.
 
 
కొత్తగా 50 మందికి చాన్స్‌
పునర్విభజన ప్రతిపాదన అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌లోని అసెంబ్లీ సీట్లు ప్రస్తుతం ఉన్న 175 నుంచి 225కు పెరుగుతాయి. కొత్తగా ఏభై అసెంబ్లీ సీట్లు వస్తుండటంతో పెద్ద సంఖ్యలో నేతలకు అవకాశాలు పెరగనున్నాయి. ప్రత్యేకించి అధికార పార్టీకి ఈ పరిణామం సౌలభ్యంగా ఉంటుందని అంటున్నారు. వైసీపీ నుంచి ఇటీవలి కాలంలో 21 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరారు. ఆ నియోజకవర్గాల్లో వారిపై పోటీచేసి ఓడిపోయిన టీడీపీ నేతలకు ఈ పరిణామం ఇబ్బందికరంగా మారింది. వచ్చేసారి పార్టీ టికెట్‌ ఎవరిని వరిస్తుందోనన్న ఆందోళనలో వారున్నారు. నియోజకవర్గాల పెంపు వల్ల ఈ తగాదా పోతుందని, అందరినీ ఎక్కడో ఒక చోట సర్దుబాటు చేయవచ్చని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇతర పార్టీల నుంచి మరింత మంది టీడీపీలోకి రావడానికి కూడా ఈ పరిణామం దోహదపడుతుందని వారంటున్నారు. టీడీపీ నేతలు ఎక్కడెక్కడ కొత్త నియోజకవర్గాలు వస్తాయో లెక్కలేసుకొంటున్నారు.
  • 2 weeks later...
Posted
ప్ర‌ధాని కోర్టులో అసెంబ్లీ సీట్లు
 
636266049295849061.jpg
  • నియోజకవర్గాల పెంపు ఫైలు పీఎంవోకి
  • 170 అధికరణాన్ని సవరించడమా?
  • విభజన చట్టంలో మార్పు చేయడమా?
  • రాజ్యాంగ సవరణే మేలన్న న్యాయ శాఖ
  • మోదీ సూచన మేరకు బిల్లు తయారు
  • 11 లేదా 12 తేదీల్లో పార్లమెంటుకు?
  • కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు చాన్స్‌
న్యూఢిల్లీ, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ర్టాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఫైలు ప్రధాన మంత్రి కార్యాలయానికి చేరింది. ప్రధాని మోదీ సూచనల మేరకు సంబంధిత బిల్లు ఏప్రిల్‌లోనే పార్లమెంటుకు చేరనుంది. నియోజకవర్గాల పెంపుపై కొద్ది కాలంగా సందిగ్ధత రాజ్యమేలుతున్న విషయం తెలిసిందే. ఏపీ విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా ఏపీ, తెలంగాణల్లో అసెంబ్లీ స్థానాల పెంపునకు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170ని సవరించాలా? లేక విభజన చట్టంలోనే మార్పులు చేస్తే సరిపోతుందా? అన్న విషయంలో కేంద్ర హోం శాఖ మల్లగుల్లాలు పడుతోంది. ఆర్టికల్‌ 170ని సవరిస్తే కలిగే లాభనష్టాలు? విభజన చట్టంలోని సెక్షన్‌ 26ని సవరిస్తే భవిష్యత్తులో ఎదురయ్యే న్యాయపరమైన ఇబ్బందులను వివరిస్తూ కేంద్ర హోం శాఖ పీఎంవోకు ఫైల్‌ పంపింది. వారం రోజుల కిందటే ఈ ఫైలును పంపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అనంతరం, ప్రధాని మోదీ సూచనలకు తగినట్లుగా బిల్లును తయారు చేస్తామని, రాజ్యాంగ సవరణకు ప్రధాని మొగ్గు చూపితే దానికి తగినట్లుగానే బిల్లులో అంశాలు చేరుస్తామని, ప్రధాని నిర్ణయం కోసం తాము ఎదురు చూస్తున్నామని హోం శాఖలోని సీనియర్‌ అధికారులు తెలిపారు.
 
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170లోని సెక్షన్‌ 3 ప్రకారం దేశంలో ఏ రాష్ట్రంలోనూ 2026 సంవత్సరం వరకూ అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన కుదరదు. 2021 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరిగేందుకు వీలుగా ఆర్టికల్‌ 170లో సెక్షన్‌ 3ని చేర్చారు. అయితే, ఆర్టికల్‌ 3, 4 ప్రకారం 2014 తర్వాత ఏర్పడిన కొత్త రాష్ర్టాలకు సెక్షన్‌ 3 నుంచి మినహాయింపు ఇస్తూ కొత్తగా నాలుగో సెక్షన్‌ను చేరిస్తే సరిపోతుందని, ఇందుకు పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీ ఉంటే సరిపోతుందని హోం శాఖ వర్గాలు తెలిపాయి.
 
ఏపీ విభజన చట్టంలోని సెక్షన్‌ 26ని మాత్రమే సవరిస్తే భవిష్యత్తులో ఈ చట్టాన్ని కోర్టులో సవాలు చేసే ప్రమాదం ఉందని, అందువల్ల, దాని జోలికి వెళ్లకుండా రాజ్యాంగ సవరణ చేయడమే మంచిదన్న అభిప్రాయాన్ని కూడా పీఎంవోకు పంపిన ఫైల్‌లో కేంద్ర హోం శాఖ తన అభిప్రాయాన్ని తెలియజేసింది. అటార్నీ జనరల్‌, న్యాయ శాఖ అధికారులు కూడా రాజ్యాంగ సవరణకే మొగ్గు చూపారని స్పష్టం చేసింది.
 
కాగా, నల్సార్‌ వర్సిటీకి చెందిన న్యాయ నిపుణులు మాత్రం సెక్షన్‌ 26 సవరణకు అనుకూలంగా నివేదిక ఇచ్చారంటూ దానిని కూడా హోం శాఖ పీఎంవోకు పంపినట్లు సమాచారం. నిర్ణయాన్ని ప్రధానికే వదిలేసింది. అదే సమయంలో, ఏపీ విభజన చట్టాన్ని కాంగ్రెస్‌ పార్టీయే ప్రవేశ పెట్టిందని, అందువల్ల, ఇప్పుడు రాజ్యాంగ సవరణకు ఆ పార్టీ మద్దతు ఇస్తుందని, ఒకవేళ, కాంగ్రెస్‌ అడ్డం తిరిగితే తెలంగాణలో కూడా ఆ పార్టీకి పుట్టగతులు లేకుండాపోతాయని బీజేపీ అగ్ర నేతలు భావిస్తున్నారు. రాజ్యాంగ సవరణ చేపడితే, భవిష్యత్తులో ఏర్పడే కొత్త రాష్ర్టాల్లో సీట్ల పెంపునకు కూడా ఎటువంటి ఆటంకాలూ ఉండవని భావిస్తున్నారు.
 
11, 12 తేదీల్లో బిల్లు?
ప్రధాని ఆదేశాలకు అనుగుణంగా అసెంబ్లీ స్థానాల పెంపు బిల్లును తయారు చేసి, వీలైనంత త్వరగా పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కేంద్ర హోం శాఖ భావిస్తోంది. ఈనెల 12వ తేదీ వరకూ జరగనున్న పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుందని, లేకపోతే వర్షాకాల సమావేశాల వరకూ ఆగాల్సి ఉంటుందని, నియోజకవర్గాల పునర్విభజనకు ఎక్కువ సమయం కావాల్సి ఉన్నందున 11, 12 తేదీ ల్లో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలని న్యాయ శాఖ సీనియర్‌ అధికారులు సలహా ఇచ్చినట్లు తెలిసింది. బిల్లును తయారు చేసి కేబినెట్‌ ఆమోదం పొందడానికి కొంత సమయం పడుతుందని, ప్రధాని నుంచి ఎంత త్వరగా ఆమోదం వస్తే అంత త్వరగా బిల్లు తయారు చేయడానికి అవకాశం ఉంటుందని హోం శాఖ వర్గాలు తెలిపాయి.
Posted
మరోసారి హీటెక్కనున్న ఏపీ 636270196262352154.jpg

హైదరాబాద్: ఏపీలో మంత్రివర్గ పునర్‌వ్యస్థీకరణ వేడి చల్లారక ముందే నియోజకవర్గాల హీట్ రాజుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన సందడి మొదలైంది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీ అసెంబ్లీ సీట్లు 175 నుంచి 225 పెరగాలి. తెలంగాణలో 119 నుంచి 153కు పెరుగుతాయి. అయితే రాజ్యాంగ సవరణ చేయాలా? లేక పునర్వభజన చట్టంలో మార్పులు చేయాలా? కేంద్రంలో ఇప్పటివరకు తర్జనభర్జనలు జరిగాయి. రాజ్యాంగంలోని 170వ అధికరణలో 15 సెక్షన్‌కు సవరణ చేయడం లేదా పునర్విభజన చట్టంలోని సెక్షన్ 26కు సవకణ చేయడం ద్వారా పునర్విభజన చేపట్టవచ్చని న్యాయనిపుణులు చెబుతున్నారు.

 

2026 వరకు దేశంలో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టకూడదని, 2002లో 84వ రాజ్యాంగ సవరణ తీసుకువచ్చారు. 175వ అధికరణలో మార్పులు చేశారు. ప్రస్తుతం ఈ 175వ అధికరణలో ఒక అంశాన్ని చేర్చాలని కేంద్రం భావిస్తోంది. ఆర్టికల్ 3 ప్రకారం కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలకు ఈ సవరణ వర్తించదనే క్లాజ్ చేర్చితే సరిపోతుందని న్యాయనిపుణులు అంటున్నారు. సవరణ కోసం కేంద్రం ఇప్పటికే అడుగులు వేస్తోంది. రాజ్యాంగ సవరణ చేస్తే కేంద్ర ఎన్నికల సంఘం ఛీప్ కన్వీనర్‌గా, రెండు రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు సభ్యులుగా ఏర్పడే కమిటీ 6 నెలల్లో పునర్విభజన పూర్తి చేయాల్సి ఉంది. హోం మంత్రి రాజ్‌నాథ్‌తో ప్రత్యేకంగా సమావేశమై వెంకయ్యనాయుడు, సుజనాచౌదరి ఇదే విధివిదానాలపై చర్చించనున్నారు. ఎలాంటి వ్యూహంతో వెళ్లాలి, పునర్విభజనపై ఎప్పటికి స్పష్టత వస్తుందనేది ఈ సమావేశం తర్వాత తేలిపోతుంది.

 

ప్రస్తుతం ఏపీలో 175 నియోజకవర్గాల్లో 29 ఎస్సీ నియోజకవర్గాలు ఉండగా పునర్వభజనతో మరో 9 పెరుగుతాయి. దీంతో 38కి కానున్నాయి. ఎస్టీలకు 7 నియోజకవర్గాలు ఉండగా 5 పెరిగి 12 కానున్నాయి. ఇక తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎస్సీలకు 19 ఉండగా 5 పెరిగి 24 కానున్నాయి. ఎస్టీలకు 12 ఉండగా రెండు పెరిగి 14 కానున్నాయి. పెరిగే 34 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాలు ఎస్సీ, ఎస్టీలకు దక్కనున్నాయి. పునర్విభజన చట్టంలో సెక్షన్ 26 (1) సి కింద పార్లమెంట్ నియోజకవర్గాల సరిహద్దులు, ప్రాంతాలు మార్పు చేసుకోవచ్చని సూచించారు. ఏపీలో ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గంలో రెండు చొప్పున అసెంబ్లీ నియోజకవర్గాలు పెరుగనున్నాయి. తెలంగాణలో పెరిగిన జిల్లాల ప్రకారం పునర్విభజన చేస్తారా? లేక పాత జిల్లాలా ఆధారంగా జరుగుతుందా? అనేతి ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది.

 

మొత్తానికి పునర్వభజన చట్టంలో సెక్షన్ 26 ప్రకారం కేంద్రం రంగంలోకి దిగుతోంది. ఆరు నెలల్లో ఈ పక్రియ పూర్తవుతుందని అంటున్నారు. రెండు పక్కల రాజకీయ అలజడి రేగుతోంది. ప్రస్తుతం పార్లమెంట్ నియోజకవర్గాల్లో మండలాలు, అసెంబ్లీ సెగ్మెంట్లలోని పరిస్థితులను తెలుసుకుని వ్యూహరచన చేసేందుకు అధికార పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. అంటే రెండేళ్ల ముందే తెలుగురాష్ట్రాల్లో రాజకీయ వేడి హడావుడి కనిపించబోతోంది.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...