Jump to content

Assembly seats to increase in AP and Telangana


Recommended Posts

  • 2 weeks later...
సీట్ల పెంపు లేనట్టే సర్దుబాట్లకు సిద్ధం!
29-07-2017 02:08:27
 
636368909354718354.jpg
  • ఢిల్లీ సంకేతాలతో నియోజకవర్గాలపై తెలుగుదేశం కసరత్తు ప్రారంభం
  • 21 సర్దుబాట్లు అవసరం.. 7చోట్ల సమస్య
  • పరిష్కరించేందుకు పలు వ్యూహాలు 
  • సీనియర్లకు ఇప్పటికే ఇతర పదవులు
  • వారసులను దించాలనుకున్నవారికి నిరాశ
 
అమరావతి, జూలై 28 (ఆంధ్రజ్యోతి): ‘‘అసెంబ్లీ స్థానాలు పెంచే అవకాశం కనిపించడంలేదు. ప్రధాని మోదీ ఇందుకు సుముఖంగా లేరు. దేశమంతా ఒకేసారి పెంచాలని ఆయన భావిస్తున్నారు’’... ప్రధానితో భేటీ తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్‌ చెప్పిన మాటలివి! దీంతో... ఇక అసెంబ్లీ స్థానాలు పెరగకపోవచ్చుననే ప్రచారం ఊపందుకుంది. నియోజకవర్గాలు పెంచకపోతే ఎలా? ఏం చేయాలి? అనే అంశంపై టీడీపీ ముందు నుంచే కసరత్తు ప్రారంభించింది. వైసీపీ నుంచి టీడీపీలోకి 21 మంది ఎమ్మెల్యేలు చేరారు. వీరు చేరిన నియోజకవర్గాల్లో కొత్తగా వచ్చిన వారిని, పాతవారిని ఎలా సర్దుబాటు చేయాలన్నదే ఆ పార్టీకి ఉన్న ప్రధాన సమస్య. ఒక అంచనా ప్రకారం... ఆ 21లో ఏడు నియోజకవర్గాల్లోనే సమస్య అధికంగా ఉందని, మిగిలిన చోట్ల సర్దుబాటు పెద్ద కష్టం కాదని టీడీపీ నాయకత్వం భావిస్తోంది. సమస్య ఉన్నచోట దానిని పరిష్కరించడంపై కూడా ఆ పార్టీ దృష్టి పెట్టింది. ఉదాహరణకు... అద్దంకి, జమ్మలమడుగులో టీడీపీలో ఉన్న సీనియర్ల గౌరవం తగ్గకుండా చూసేందుకు కరణం బలరాం, రామసుబ్బా రెడ్డిలకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చింది. తద్వారా ఆ నియోజకవర్గాల్లో పోటీ నివారించే ప్రయత్నం చేసింది. ఈ విషయంలో సీఎం చంద్రబాబు అస్పష్టతకు తావు లేకుండా వ్యవహరిస్తున్నారు. అద్దంకిని సిటింగ్‌ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ చూసుకోవాలని, బలరాం అక్కడ తలదూర్చవద్దని స్పష్టంగా తేల్చిచెప్పారు. ఇక... నంద్యాలలో మరో రూపంలో సమస్య పరిష్కారమైంది. అక్కడ టీడీపీలో భూమా కుటుంబం స్థిరపడిపోగా, గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీచేసిన శిల్పా మోహన్‌ రెడ్డి వైసీపీలోకి వెళ్లిపోయారు. కదిరి, గిద్దలూరు వంటి స్థానాల్లో కొత్తగా చేరిన ఎమ్మెల్యేలకు... పోయిన ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థులకు మధ్య కొంత వేడి నెలకొంది. రాయలసీమలో కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి అభ్యర్థుల సమస్య ఉంది. సరైన నాయకుడు లేకపోవడం లేదా బహు నాయకత్వం ఆ పార్టీని ఇబ్బంది పెడుతోంది. సరైన నాయకుడు లేని చేటికి... బహునాయకత్వం ఉన్న చోటు నుంచి బదిలీ చేసే అవకాశాన్ని కూడా ఆ పార్టీ పరిశీలిస్తోంది. ‘‘తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీ ఎదుర్కొంటున్నంత సమస్య మాకు ఇక్కడ లేదు. ఏడెనిమిది నియోజకవర్గాల్లో సమస్య ఉంది. వాటిని పరిష్కరించవచ్చని అనుకొంటున్నాం. కొన్ని నియోజకవర్గాల్లో సిటింగ్‌ ఎమ్మెల్యేలను మార్చాల్సిన అవసరం ఉంది. కొన్నిచోట్ల మంచి అభ్యర్థులు లేరు. అక్కడ వీరెవరినైనా సర్దుబాటు చేయవచ్చా అని కూడా ఆలోచిస్తున్నాం. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఈలోపు ఈ సర్దుబాట్లు చేయగలమనే నమ్మకం ఉంది’’ అని టీడీపీ సీనియర్‌ నాయకుడొకరు పేర్కొన్నారు.
 
ఇష్టం లేనిదెవరికి?
రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాలని రాష్ట్ర విభజన చట్టంలోనే ప్రతిపాదించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు సీట్ల పెంపునకు కేంద్రంపై కొంతకాలంగా ఒత్తిడి తెస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లో ఇతర పార్టీలకు చెందిన వారిని తమ పార్టీలో చేర్చుకోవడం, వచ్చే ఎన్నికల్లో పాత-కొత్త నేతలకు టికెట్లు సర్దుబాటు చేయాల్సిన రాజకీయ అవసరమే దీనికి కారణం. నిజానికి... టీడీపీకంటే తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ సీట్ల పెంపునకు తీవ్రంగా ప్రయత్నిస్తూ వచ్చింది. పెంపునకు తాము సిద్ధంగా లేమని బీజేపీ నాయకత్వం ఆంతరంగికంగా టీడీపీకి సంకేతాలు పంపిస్తూనే ఉంది. కొంతకాలం క్రితం విజయవాడ వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షాతో జరిపిన విందు చర్చల్లో ఈ అంశాన్ని చంద్రబాబు ప్రస్తావించారు. నియోజకవర్గాల పెంపునకు బీజేపీ తెలంగాణ నేతలు అంగీకరించడంలేదని, వారిని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నామని అమిత్‌షా చెప్పినట్లు వార్తలు వచ్చాయి. పైకి తెలంగాణ నేతల పేరు చెబుతున్నా... సీట్ల పెంపు బీజేపీ అధిష్ఠానానికే ఇష్టంలేదని, నియోజకవర్గాలు పెరిగితే రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకే లాభం తప్ప తమకేమీ ఉపయోగం లేదని ఆ పార్టీ భావిస్తోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Link to comment
Share on other sites

No Special status, No railway zone yet, No steel plant to rayalaseema, Less & late funds to Polavaram, Not fulfilled promises to Rayalaseema & UA, No MLA seats increase. 

 

BJP AP ki election mundu cheppina vaatilo & Division bill lo vunna vaatilo 20% kooda fulfill cheyyaledu.

 

Inkaa TDP government lo BJP ministers ni continue endhuku chesthunnaru ee Kamineni & Manikayala Rao ni peeki oka Muslim (Seema) & Godavri Kapu leader (WG) lo ministries ivvandi if possible 1 ministry to STs.

 

TDP should prepare itself for contesting alone in 2019 & if possible go with Pavan.

 

BJP tie up lekapothe Brahmins, Vysyas dooram avvochhu konthavaraku, need to attract these sections mainly useful in Cities & Mandal HQs.

Link to comment
Share on other sites

I think seats peragaka pothe main blow for trs because next elections lo seat meke ani cheppi simple ga each seat ki ex mla's, ex mp's kalipi 5-10 members per seat ki ready chesaru

 

But CBN took selectively

 

Guess what happened to jagan took same step before elections and gave to some others all worked against him.

 

Chiru also same strategy failed compeltely

 

I think it will divide votes among themseleves 

Link to comment
Share on other sites

అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో లేనట్లే..

1brk128-hansram.jpg

దిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు అంశంపై కొనసాగుతోన్న సస్పెన్స్‌కు కేంద్రం తెరదించింది. ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం ఇరు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెంచాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని పలుమార్లు కోరాయి. దీంతో సీట్లు పెరుగుతాయనే ప్రచారం పెద్దఎత్తున జరిగింది. ఈ ప్రచారానికి చెక్‌పెడుతూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టతనిచ్చింది. ఆర్టికల్‌ 170ని సవరించకుండా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ స్పష్టంచేశారు. విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాలలో సీట్ల పెంపు అంశంపై లోక్‌సభలో తెదేపా ఎంపీ మురళీమోహన్‌, తెరాస ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. సీట్ల పెంపు అంశంపై ఇప్పటికే న్యాయశాఖను సంప్రదించినట్టు తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170 (3) ప్రకారం 2026 వరకు అసెంబ్లీ సీట్ల పెంపు కుదరదని అటార్నీ జనరల్‌ అభిప్రాయపడినట్లు మంత్రి తన సమాధానంలో పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో లేనట్లే..

1brk128-hansram.jpg

దిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు అంశంపై కొనసాగుతోన్న సస్పెన్స్‌కు కేంద్రం తెరదించింది. ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం ఇరు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెంచాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని పలుమార్లు కోరాయి. దీంతో సీట్లు పెరుగుతాయనే ప్రచారం పెద్దఎత్తున జరిగింది. ఈ ప్రచారానికి చెక్‌పెడుతూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టతనిచ్చింది. ఆర్టికల్‌ 170ని సవరించకుండా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ స్పష్టంచేశారు. విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాలలో సీట్ల పెంపు అంశంపై లోక్‌సభలో తెదేపా ఎంపీ మురళీమోహన్‌, తెరాస ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. సీట్ల పెంపు అంశంపై ఇప్పటికే న్యాయశాఖను సంప్రదించినట్టు తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170 (3) ప్రకారం 2026 వరకు అసెంబ్లీ సీట్ల పెంపు కుదరదని అటార్నీ జనరల్‌ అభిప్రాయపడినట్లు మంత్రి తన సమాధానంలో పేర్కొన్నారు.

Mari emm peekidhamani INC vallu bill lo ettaru.. ee baffas Ela support chesaru ??

Link to comment
Share on other sites

అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో లేనట్లే..

1brk128-hansram.jpg

దిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు అంశంపై కొనసాగుతోన్న సస్పెన్స్‌కు కేంద్రం తెరదించింది. ఆంధ్రప్రదేశ్‌ విభజన అనంతరం ఇరు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెంచాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని పలుమార్లు కోరాయి. దీంతో సీట్లు పెరుగుతాయనే ప్రచారం పెద్దఎత్తున జరిగింది. ఈ ప్రచారానికి చెక్‌పెడుతూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టతనిచ్చింది. ఆర్టికల్‌ 170ని సవరించకుండా తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు సాధ్యం కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్‌రాజ్‌ స్పష్టంచేశారు. విభజన చట్టం ప్రకారం తెలుగు రాష్ట్రాలలో సీట్ల పెంపు అంశంపై లోక్‌సభలో తెదేపా ఎంపీ మురళీమోహన్‌, తెరాస ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. సీట్ల పెంపు అంశంపై ఇప్పటికే న్యాయశాఖను సంప్రదించినట్టు తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 170 (3) ప్రకారం 2026 వరకు అసెంబ్లీ సీట్ల పెంపు కుదరదని అటార్నీ జనరల్‌ అభిప్రాయపడినట్లు మంత్రి తన సమాధానంలో పేర్కొన్నారు.

 

 

 

 

Good manaki in 2 ways in telangana

 

1)Trs vallu oka seat ki 5+ members andulo 3+ ex-mla's and ex-mp's ni join chesukunaru saying we will give seat ani vallu returns to tdp, congress

2) TDP may get back all leaders who left which will increase strength in telangana

Link to comment
Share on other sites

  • 1 year later...

Unna count aite TRS lost confirm ayuntadi, so maybe to favour TRS 

 

seats peragakapothe congresski oka 40 seats daka cake walk considering their strong candidates and will be less by only 23 for magical figure which can be easily achievable by alliance parties like TDP and fighting hard.

Seats perigithe last minute will be tough for opposition parties and TRS can accommodate all assamithi .

 

KCR dora 50 days 100 meetings hadavidi aapi intlo korchodaniki reason ide ayuntadi kashtamavtundi gelavadam ani or BJP gameplan to backstab KCR right before elections

 

But the question is, Is it that  simple to increase constituencies?

 

Eeee BJP valla natakalento gani sava *****tunnaru janalni eppudu politics tho

 

Link to comment
Share on other sites

అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై మళ్లీ కేంద్రహోంశాఖ కసరత్తు
26-09-2018 18:54:03
 
636735848454300553.jpg
 
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై హోంమంత్రిత్వశాఖ మళ్లీ కసరత్తు ప్రారంభించింది. అసెంబ్లీ నియోజకవర్గాల విభజనకు సంబంధించి అభిప్రాయం చెప్పాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. ప్రస్తుతం రిజర్వేషన్లు ఎలా ఉన్నాయి. ఎన్ని నియోజక వర్గాలు ఎస్సీ, ఎస్టీ కేటగిరిలో ఉన్నాయో చెప్పాలని కోరింది. నియోజక వర్గాలు పెంచితే ఏ కేటగిరికి ఎన్ని నియోజక వర్గాలు కేటాయించాలో నివేదిక సమర్పించాలని సూచించింది. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం ఏ జనాభా లెక్కల ప్రాతిపదికన కేటాయింపు ఉంటుందో చెప్పాలని హోంశాఖను కోరింది. దాంతో రిజిస్ట్రార్ జనరల్ నుంచి హోంమంత్రిత్వశాఖ అభిప్రాయం తీసుకుంది. 2001 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేపట్టవచ్చని స్పష్టం చేస్తూ రిజిస్ట్రార్ జనరల్ నివేదిక ఇచ్చారు. దాన్ని కేంద్ర హోంశాఖ ఎన్నికల సంఘానికి పంపింది. నియోజకవర్గాల పెంపుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరింది.
Link to comment
Share on other sites

ఏపీ, టీఎస్ అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై హోంశాఖ కసరత్తు
26-09-2018 19:03:11
 
636735853928486224.jpg
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపుపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. గతంలో నిలుపుదల చేసిన ప్రక్రియను తిరిగి హోంమంత్రిత్వ శాఖ ప్రారంభించింది. అసెంబ్లీ నియోజకవర్గాల విభజనకు సంబంధించి అభిప్రాయం చెప్పాలని ఎన్నికల సంఘాన్ని కోరింది. ఎన్ని నియోజకవర్గాలు ఎస్సీ, ఎస్టీ కేటగిరిలో ఉన్నాయో చెప్పాలన్న హోంశాఖ కోరింది. నియోజకవర్గాలు పెంచితే ఏ కేటగిరీకి ఎన్ని నియోజకవర్గాలు కేటాయించాలో నివేదిక ఇవ్వాలన్న హోంశాఖ పేర్కొంది.
 
 
హోంశాఖ అడిగిన అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. ఏ జనాభా లెక్కల ప్రాతిపదికన కేటాయింపు ఉంటుందో చెప్పాలని హోం శాఖను ఎన్నికల సంఘం
కోరింది. రిజిస్ట్రార్ జనరల్ నుంచిహోంమంత్రిత్వ శాఖ అభిప్రాయం తీసుకుంది. 2001 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల, పునర్విభజన చేపట్టవచ్చని రిజిస్ట్రార్ జనరల్
నివేదిక ఇచ్చింది. 2011 జనాభా లెక్కల పూర్తి నివేదిక ఇంకా తయారు కాలేదని, 2001 జనాభా లెక్కల ప్రకారమే వెళ్లాల్సి ఉంటుందని రిజిస్ట్రార్ జనరల్ తేల్చిచెప్పింది. రిజిస్ట్రార్ జనరల్ ఇచ్చిన నివేదికను కేంద్ర హోంశాఖ ఈసీకి పంపింది.
 
 
తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఏడు మండలాలపై ఇటీవల ఎన్నికల సంఘం స్పష్టత ఇచ్చింది. విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాల పెంపు చేపట్టాలనే యోచనలో హోంమంత్రిత్వ శాఖ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఇటీవల అధికారులతో హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గబా సమీక్షించారు. రిజర్వేషన్ల విధానంపై ఈసీ నివేదిక కోసం హోం మంత్రిత్వ శాఖ వేచి చూస్తోంది. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిల్లు పెట్టేందుకు హోంశాఖ కసరత్తు చేస్తోంది. ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని హోంశాఖ భావిస్తోంది.
 
Tags : andhara pradesh, AP, Telangana, Chandrababu
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...