Jump to content

నెలకు ఇచ్చేది 50 వేలే


sonykongara

Recommended Posts

నెలకు ఇచ్చేది 50 వేలే
 
636171976375750889.jpg
  • ఆర్బీఐ యోచన.. అభిప్రాయ సేకరణ
  • నేరుగా నగదు అంతకంటే అక్కర్లేదు 
  • మించితే ఈ-చెల్లింపులు, చెక్కులు, డీడీలే 
  • క్యాష్‌ విత్ డ్రాయల్స్‌పై కొత్త పరిమితులు 
  • క్షేత్రస్థాయిలో అధ్యయనం ప్రారంభం 
  • త్వరలో ఏటీఎంల ద్వారా రోజుకు 4500 

విశాఖపట్నం/న్యూఢిల్లీ, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఇవ్వడం, ఇవ్వకపోవడం అనే సంగతి పక్కనపెడితే... ప్రస్తుతం వారానికి మన ఖాతా నుంచి తీసుకోగలిగే గరిష్ఠ మొత్తం రూ.24 వేలు! అంటే... నెలకు రూ.96 వేలు! దీనిని 50వేలకు కుదించాలని కేంద్రం యోచిస్తోందా? విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ప్రశ్నకు ‘ఔను’ అనే సమాధానమే లభిస్తోంది. ఈ దిశగా కసరత్తు కూడా మొదలైంది. బ్యాంకుల్లో అంతర్గతంగా దీనిపై అభిప్రాయ సేకరణ కూడా జరుగుతోంది. ‘పరిమితమైన నగదు’ (లెస్‌క్యాష్‌) లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా... ప్రజలకు నగదును ‘ఒక స్థాయి వరకే’ అందుబాటులో ఉంచాలని కేంద్రం భావిస్తోంది. మరోవైపు... ‘కనీస పరిమితిగా మీరే నిర్ణయించిన రూ.24వేలు కూడా ఎందుకు ఇవ్వడంలేదు’ అంటూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో అధికారికంగానే నగదు వితడ్రా పరిమితిని తగ్గించాలనే దిశగా అడుగులు పడుతున్నాయి.


 
లెక్కలు తీస్తున్నారు

సామాన్య మధ్య తరగతి నుంచి ఓ మోస్తరు సంపన్న కుటుంబం దాకా... కనీస అవసరాలకు ఒక నెలకు గరిష్ఠంగా నగదు రూపంలోనే ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది? గత కొన్నేళ్లుగా సేవింగ్స్‌ ఖాతాల నుంచి విత డ్రాయల్స్‌ (ఏటీఎంలు, కౌంటర్‌లో సెల్ఫ్‌ చెక్‌ల ద్వారా) సరళి ఎలా ఉంది? తదితర అంశాలపై ప్రస్తుతం జాతీయ స్థాయిలో సమాచార సేకరణ, విశ్లేషణ జరుగుతోంది. పాలు, కూరగాయలు, చిల్లర సరుకులు, ఇతర చిన్న చిన్న అవసరాలకు నెలకు రూ.50 వేలకు మించి నగదు రూపంలో ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదనే అంచనాకు వస్తున్నారు. రైలు, బస్సు క్యాబ్‌లు, దుకాణాల్లో కొనుగోళ్లు ఇతర పెద్ద మొత్తాలను కార్డులు, చెక్కులు, డీడీలు, ఆన్‌లైన్‌లో జరిపే అవకాశాలున్నందున... నగదు పరిమితిని బాగా కుదించాలని భావిస్తున్నారు. దీనివల్ల అనవసరంగా ‘క్యాష్‌ను దగ్గర ఉంచుకోవడం’ తగ్గుతుంది. ఇక... నగదు లావాదేవీలను నిరుత్సాహ పరిచేలా పలు చర్యలు తీసుకోవడం ద్వారా, ‘ఈ-పేమెంట్స్‌’కు ఊతమిస్తారు. క్యాష్‌లెస్‌ లావాదేవీలపై ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పడిన సంగతి తెలిసిందే. అలాగే... కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి ఆర్‌పీ వాటల్‌ కమిటీ కూడా దీనిపై కసరత్తు చేస్తోంది. నీతి ఆయోగ్‌ సీఈవో అమితాబ్‌ కాంత నేతృత్వంలోనూ ఒక టాస్క్‌ఫోర్స్‌ ఏర్పడింది.


 
ఉత్తరాంధ్రలో ‘అంతర్గత సర్వే’

ప్రస్తుతం సేవింగ్స్‌ ఖాతావారానికి రూ.24 వేలు చొప్పున నుంచి నగదు తీసుకునే వెసులుబాటు కల్పించిన సంగతి తెలిసిందే. ఇది జనం అవసరాలకు సరిపోతోందా? దీనిని పెంచాలా? మరింత తగ్గించాలా? అనే అంశంపై ఆర్‌బీఐ క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తెలుగు రాషా్ట్రల ఉన్నతాధికారి ఒకరు రెండు రోజులపాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటించారు. బ్యాంకు మేనేజర్లతో సమావేశమయ్యారు. ఖాతాదారులు ఏమనుకుంటున్నారో తెలుసుకున్నారు. వారానికి రూ.24 వేలు ఇవ్వాలనే నిబంధన ఉన్నా... నగదు కొరత వల్ల అంత ఇవ్వలేకపోతున్నామని, రూ.10 వేలు - 12 వేలు సర్దుబాటు చేస్తున్నామని పలువురు సిబ్బంది తెలిపారు. అయితే... వారానికి రూ.24 వేలు చొప్పున నెలకు రూ.96వేలు వితడ్రా చేసుకోవలసిన అవసరం అత్యధికులకు ఉండదని చెప్పారు. ‘‘జీతాలు అందుకునే వారు సగటున నెలకు రూ.30 వేలు నుంచి రూ.40 వేలు తీసుకుంటారు. మిగిలిన మొత్తం వారి ఖాతాల్లోనే ఉంటుంది. గృహ, వాహన రుణాల ఈఎంఐలకు ఈసీఎ్‌సలలో చెల్లింపులు జరుగుతాయి’’ అని చెప్పారు. మేనేజర్లు తమ అభిప్రాయాలు వెల్లడించిన తరువాత... పదిహేను రోజులకు రూ.25వేలు చొప్పున నెలకు గరిష్ఠంగా రూ.50 వేలు నగదు వితడ్రా చేసుకునే సౌకర్యం కల్పిస్తే ఎలా ఉంటుంది? అని ఆ ఉన్నతాధికారి ప్రశ్నించారు. ఆ మొత్తం సరిపోతుందని, నేరుగా నగదు రూపంలో తీసుకునే అవసరం అంతకుమించి ఉండదని చాలామంది అభిప్రాయపడ్డారు. ఇంకా అవసరాలు ఉంటే ఆనలైన, నగదు రహిత కార్యకలాపాలు చేసుకునే సౌలభ్యం ఎలాగూ ఉందని గుర్తు చేశారు. ఇక కరెంట్‌ ఖాతా నిర్వహించే వ్యాపారులకు ప్రస్తుతం వారానికి రూ.50 వేలు వితడ్రా చేసుకునే సౌలభ్యం ఉంది. దీనిని 15 రోజులకు రూ1.5 లక్షలకు పెంచాలని సూచించారు. అలాగే, ఏటీఎంలలో ప్రస్తుతం ఎవరైనా కార్డు ద్వారా రోజుకు రూ.2500 నగదు తీసుకునే సౌలభ్యం వుంది. ఈ మొత్తాన్ని పెంచాలనే కోరారు. దీనిని రూ.4500కు పెంచుతామని ఎస్‌బీఐ ఉభయ రాషా్ట్రల ఉన్నతాధికారే స్వయంగా వెల్లడించారు. అయితే, ఈ మొత్తం కూడా నెల రోజులకు తీసుకునే గరిష్ఠ పరిమితికి లోబడే ఉంటుందని తెలిపారు.

Link to comment
Share on other sites

  • Replies 129
  • Created
  • Last Reply

Ikkada practical problems gurinchi evaru alochinchatam ledhu.. prathi dhaniki Card/Cheq/DD antunnaru..

 

On a lighter note: Asale janalaki chillara dorakka sachipothunnaru.. anni Sulabh complex lalo POS machines supply Cheyandi.. Useful ga vuntadhi :P

lol

Link to comment
Share on other sites

With drawl capacity is 50k, online/cheque and DD unlimited.... good way to force public to use eMoney

Also, asalu bankers chethilo nunchi cash handout cheyyalsina pani ekunda, token (or ATM card) isthe ATM(some machine) lo nunchi draw cheskunettuu pettali, appudu chala varaku back door corruption prevent cheyyachu (like whats happening today with aadhar card misuse).

Link to comment
Share on other sites

Also, asalu bankers chethilo nunchi cash handout cheyyalsina pani ekunda, token (or ATM card) isthe ATM(some machine) lo nunchi draw cheskunettuu pettali, appudu chala varaku back door corruption prevent cheyyachu (like whats happening today with aadhar card misuse).

Good point.... manolla mind set maranantha kaalam edo oka loop hole kosam etukutaaru
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...