Jump to content

Amaravati Real Estate


sonykongara

Recommended Posts

  • 4 months later...
  • 4 weeks later...
అమరావతి తూర్పు హాట్‌కేక్‌..
26-05-2018 02:39:02
 
636628991452421208.jpg
  • రియల్టీలో దూసుకుపోతున్న హైవే తూర్పు కృష్ణా తీరం
  • భారీగా గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్టుమెంట్ల నిర్మాణం
రాజధాని అమరావతికి ఎదురుగా తూర్పు హద్దునే... హద్దుగా చేసుకుంటూ పాత హైవే నుంచి దిగువ కృష్ణా పశ్చిమ కరకట్ట వరకు ఉన్న ప్రాంతమంతా ఓ మహానగరంగా ఊపిరిపోసుకుంటుంది. ఇదంతా మంగళగిరి నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ప్రాంతం. గత రెండేళ్లుగా ఈ ప్రాంతం రూపురేఖలు అతివేగంగా మారిపోతున్నాయి.
 
రాజధాని రాకతో విజయవాడ-గుంటూరు మధ్య... మంగళగిరికి అటుఇటు ఉన్న ప్రాంతమంతా జాతీయ రహదారిని ఆధారంగా చేసుకుని బ్రహ్మండమైన నగరీకరణను సంతరించుకుంటోంది. నెల తిరిగేసరికి ఈ హైవే పరిసర ప్రాంతాలు గుర్తుపట్టలేనంతగా మారిపోతున్నాయంటే అభివృద్ధి ఏస్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిన్నటిమొన్నటి వరకు పచ్చని పైర్లతో కనువిందు చేస్తున్న గ్రామీణ ప్రాంతాలు సైతం గేటెడ్‌ కమ్యూనిటీలతో రూపుమారి నగర వాతావరణాన్ని ఆపాదించుకుంటున్నాయి. మంగళగిరి బైపాస్‌ (16వ నెంబరు జాతీయరహదారి) నుంచి దిగువ కృష్ణా కరకట్ట మధ్య ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోని పొలాలన్నీ కొత్త వెంచర్లతో మహానగరీకరణను తలపిస్తున్నాయి.
 
 
ఇప్పటిదాకా విజయవాడ-గుంటూరు మధ్య హైవే వెంబడి గేటెడ్‌ కమ్యూనిటీలు, అపార్టుమెంట్లు వెలిశాయి. ఇప్పుడు హైవే వెంట ఉన్న ఖాళీ స్థలాలన్నీ బుక్‌ అయిపోయాయి. నిర్మాణ సంస్థలు విజయవాడ, అమరావతి, మంగళగిరికి చేరువగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుంటున్నాయి. మంగళగిరి బైపా్‌సకు తూర్పువైపు నుంచి దిగువ కృష్ణా కరకట్ట వరకున్న ఇప్పటం, వడ్డేశ్వరం, మెల్లెంపూడి, గుండిమెడ, దక్షిణ ప్రాతూరులోని పొలాలపై రియల్టర్ల దృష్టిసారిస్తున్నారు. ముఖ్యంగా కోనేరు లక్ష్మయ్య డీమ్డ్‌ యూనివర్సిటీని కేంద్రంగా చేసుకుని దానిచుట్టూ గ్రామాల తాలూకు పొలాలను గేటెడ్‌ కమ్యూనిటీలుగా మార్చేస్తున్నారు. కెఎల్‌ యూనివర్సిటీకి ఉత్తరంగా ఉన్న కుంచనపల్లి గ్రామం పక్కగా 16వ నెంబరు జాతీయ రహదారి ఉండడం, తక్కువ సమయంలోనే విజయవాడ వెళ్లి రాగల వెసులుబాటు ఉండడంతో ఆ గ్రామంలో అపార్టుమెంట్లు పుట్టగొడుగుల్లా వచ్చేశాయి.
 
 
ఇదే పరిస్థితి కెఎల్‌ యూనివర్సిటీకి దక్షిణం, తూర్పువైపుగా ఉన్న మెల్లెంపూడి, గుండిమెడ గ్రామాలకు విస్తరించింది. మెల్లెంపూడి పరిధిలో నిర్మాణాలకోసం బిల్డర్లు రైతుల నుంచి భూములను డెవ్‌పమెంట్‌ కింద ఒప్పందాలపై తీసుకుంటున్నారు. కెఎల్‌ యూనివర్సిటీతోపాటు కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువ పారుతున్నందునే ఇక్కడి గ్రామీణ ప్రాంతాలను రియల్టర్లు తమ కొత్త వెంచర్ల కోసం ఎన్నుకుంటున్నట్టు తెలుస్తోంది. అమరావతి ఇన్నర్‌రింగ్‌ రోడ్డు వస్తే... అది ఈ ప్రాంతానికి అతిచేరువలో కృష్ణానదిని దాటనుంది. ఇక 16వ నెంబరు జాతీయరహదారి క్రమంగా మారిపోతుంది. హైవే వెంట భారీ ప్రాజెక్టులు వెలుస్తున్నాయి. జాతీయస్థాయి నిర్మాణ సంస్థలన్నీ అమరావతిలో తమ ప్రాజెక్టులు ఉండాలన్న ఉద్దేశంతో వాటికి నెలవుగా హైవేనే ఎంచుకుంటున్నాయి. మంగళగిరికి తమ వెంచర్‌ సమీపంలో ఉండాలన్నది నిర్మాణ సంస్థల మనోగతంగా ఉంది.
 
 
ముఖ్యంగా విజయవాడ కనకదుర్గా వారధి నుంచి మంగళగిరి మధ్య ఉన్న హైవే పరిసర ప్రాంతాలకు, మంగళగిరి నుంచి నాగార్జున యూనివర్సిటీ మధ్య ఉన్న ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తూ వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు. పాతూరు రోడ్డులో అపర్ణా సంస్థ అమరావతి వన్‌ పేరుతో 9.29 ఎకరాల విస్తీర్ణంలో ఎనిమిదేసి టవర్లతో పది అంతస్తుల్లో 620 ఫ్లాట్లను నిర్మిస్తోంది. కనకదుర్గా వారధి నుంచి నాలుగు కిలో మీటర్ల దూరంలో జయభేరి సంస్థ ది క్యాపిటల్‌ పేరుతో ఏడెకరాల విస్తీర్ణంలో 15 అంతస్తులతో కూడిన ఐదు టవర్లలో 375 ఫ్లాట్లను నిర్మిస్తోంది.
 
 
దీనికి ఒకటిన్నర కిలోమీటరు దూరంలో మంగళగిరి వైపు డిజిపి కార్యాలయం సమీపంలో మంజీరా మోనార్క్‌ పేరుతో ఐదెకరాల విస్తీర్ణంలో 15 అంతస్తులతో కూడిన ఐదు టవర్లతో 567 ఫ్లాట్లు వచ్చేలా మరో గేటెడ్‌ కమ్యూనిటీ నిర్మాణం జరుపుకుంటుంది. సరిగ్గా దీని వెనుక ఎల్‌ఇపిఎల్‌ సంస్థ 15.5 ఎకరాల విస్తీర్ణంలో 485 ఫ్లాట్లు వచ్చేలా మూడు హైరైజ్‌ టవర్ల నిర్మాణాన్ని పూర్తి చేసింది. ఈ రెండు ప్రతిష్టాత్మక గేటెడ్‌ కమ్యూనిటీల మధ్య టిడిపి తమ కేంద్ర కార్యాలయ భవనాన్ని శరవేగంగా నిర్మిస్తోంది.
Link to comment
Share on other sites

  • 4 months later...
  • 4 years later...
1 hour ago, Nfan from 1982 said:

As per recent news in news papers, buying started in the capital region for last few months and prices slightly increased after MLC elections 

It seems people started investing in the region 

Yes Bro. Ee election year Motham inthe vuntundi up ee kaani down vundadu. 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...