ramntr Posted November 2 Posted November 2 3 hours ago, sonykongara said: Superb, chuttu pichi gaddi theesesthe inka baguntadi... ravindras 1
sonykongara Posted November 5 Author Posted November 5 maravati: రాజధాని పనులకు కొత్తగా టెండర్లు రాజధాని అమరావతిలో ప్రధాన మౌలిక వసతులు, భవనాల నిర్మాణానికి సంబంధించి పాత టెండర్లన్నీ క్లోజ్ చేసి, కొత్తగా టెండర్లు పిలిచేందుకు సీఆర్‌డీఏ అథారిటీ సమ్మతి తెలియజేసింది. Updated : 05 Nov 2024 06:44 IST పెండింగ్ బిల్లులు చెల్లించి.. పాత టెండర్లు మూసివేత సాంకేతిక కమిటీ సిఫారసులకు సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదం మూడేళ్లలో రాజధాని పనులు పూర్తికావాలని సీఎం ఆదేశం రాజధాని అమరావతిపై సచివాలయంలో సమీక్షిస్తున్న సీఎం చంద్రబాబు.. చిత్రంలో మంత్రులు నారాయణ, కేశవ్, సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్, ఉన్నతాధికారులు ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో ప్రధాన మౌలిక వసతులు, భవనాల నిర్మాణానికి సంబంధించి పాత టెండర్లన్నీ క్లోజ్ చేసి, కొత్తగా టెండర్లు పిలిచేందుకు సీఆర్‌డీఏ అథారిటీ సమ్మతి తెలియజేసింది. పలువురు చీఫ్ ఇంజినీర్లతో కూడిన సాంకేతిక కమిటీ దీనిపై 23 సిఫారసులతో ఇచ్చిన నివేదికను ఆమోదించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సోమవారం సచివాలయంలో జరిగిన అథారిటీ 39వ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాజధానిలో రహదారుల వంటి ప్రధాన మౌలిక వసతుల నిర్మాణం, రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్ల అభివృద్ధి, శాసనసభ, హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల టవర్లు, న్యాయమూర్తులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అఖిల భారత సర్వీసులు, ఇతర అధికారులు, ఉద్యోగుల నివాసగృహాలు సహా ప్రభుత్వపరంగా చేయాల్సిన నిర్మాణాలు వంటివన్నీ మూడేళ్లలో పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. రాజధానికి భవిష్యత్తులో వరద ముంపు తలెత్తకుండా రూపొందించిన ప్రణాళికకు అథారిటీ ఆమోదముద్ర వేసింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పురపాలకశాఖ మంత్రి పి.నారాయణ విలేకర్లకు వెల్లడించారు. ఇక వేగంగా రాజధాని పనులు రాజధానిలో 2014-19 మధ్య వివిధ పనులకు పిలిచిన టెండర్ల గడువు చాన్నాళ్ల క్రితమే ముగిసిందని, వాటిని క్లోజ్ చేయకుండా కొత్తగా టెండర్లు ఆహ్వానించలేమని నారాయణ తెలిపారు. వాటిని ముగించేందుకు అవసరమైన విధివిధానాలతో చీఫ్ ఇంజినీర్ల కమిటీ ఇచ్చిన నివేదికకు సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదం తెలిపిందన్నారు. దీంతో తదుపరి ప్రక్రియలన్నీ ఇక వేగంగా జరుగుతాయని వెల్లడించారు. ఐకానిక్ భవనాలుగా నిర్మించే హైకోర్టు, శాసనసభలకు మినహా మిగతా పనులన్నింటికీ ఈ ఏడాది డిసెంబరు నెలాఖరులోగా, ఆ రెండు భవనాలకు వచ్చే జనవరి నెలాఖరులోగా టెండర్లు పిలుస్తామని చెప్పారు. ‘గతంలో రూ.41 వేల కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచి, రూ.38 వేల కోట్లకు ఖరారు చేసి పనులు అప్పగించాం. గతంలో చేసిన పనులకు గుత్తేదార్లకు అప్పట్లోనే రూ.5 వేల కోట్ల వరకు చెల్లించాం. మరో రూ.600 కోట్లు వరకు ఇవ్వాల్సి ఉంటుంది. అప్పటితో పోలిస్తే ప్రస్తుత ఎస్‌ఎస్‌ఆర్ ధరల ప్రకారం అంచనా వ్యయం 10-15 శాతం పెరుగుతుంది. గతంలో పనులు చేసిన గుత్తేదారులకు పరిహారం ఏమీ చెల్లించడం లేదు. వారు రాజధానిలో నిల్వ చేసిన పరికరాలు, వస్తుసామగ్రి అపహరణకు గురైనా సీఆర్‌డీఏకి ఎలాంటి సంబంధం లేదు’ అని నారాయణ వివరించారు. రాజధానిలో 3.. వెలుపల 3 రిజర్వాయర్లు ‘రాజధానికి రూ.15 వేల కోట్ల రుణం ఇస్తున్న ప్రపంచ బ్యాంకు, ఏడీబీ వరద ముంపు నివారణ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని అడుగుతున్నాయి. గతంలో నెదర్లాండ్స్ కన్సల్టెన్సీ సంస్థలు రూపొందించిన వరద ముంపు ప్రణాళిక పనులకు సీఆర్‌డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది. దానిలో భాగంగా కొండవీటివాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్‌లను 48.3 కి.మీ. మేర అభివృద్ధి చేస్తాం. గత వందేళ్లలో ఆ ప్రాంతంలో వర్షపాతం రికార్డుల్ని పరిగణనలోకి తీసుకుని చూస్తే.. అత్యధిక వర్షపాతం నమోదయినా కూడా నీరు ఆ మూడు కాలువల్ని దాటి బయటకు రాదని తేలింది. ఆ మూడు కాలువలతోపాటు రాజధానిలో నీరుకొండ వద్ద 0.04, కృష్ణాయపాలెం వద్ద 0.01, శాఖమూరు వద్ద 0.01 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో మూడు రిజర్వాయర్లు నిర్మిస్తాం. ఉండవల్లి వద్ద 7,350 క్యూసెక్కులు నీటిని ఎత్తిపోసేలా మరో పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తాం. రాజధానికి వెలుపల లాం నుంచి పెదపరిమి వరకు గ్రావిటీ కెనాల్‌ను వెడల్పు, లోతు చేయడంతో పాటు, వైకుంఠపురం వద్ద 5,650 క్యూసెక్కుల సామర్థ్యంతో పంపింగ్ స్టేషన్ నిర్మిస్తాం. లాం వద్ద 0.3, పెదపరిమి వద్ద 0.33, వైకుంఠపురం వద్ద 0.17 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లు నిర్మిస్తాం’ అని మంత్రి చెప్పారు. ఆ రెండు గ్రామాల్లోనూ భూసమీకరణ! అమరావతి రైల్వేలైన్‌లో భూములు కోల్పోతున్న వడ్డమాను, వైకుంఠపురం గ్రామాల రైతులు సుమారు 1,750 ఎకరాల్ని భూసమీకరణ విధానంలో తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారని నారాయణ చెప్పారు. ముఖ్యమంత్రి కూడా సానుకూలత వ్యక్తం చేశారన్నారు. వీలైనంత వరకు ఆ భూముల్ని భూసమీకరణలో తీసుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. డిప్యూటీ సీఎంగా ఆయనకు ఆ అధికారముంది! హోం శాఖకు సంబంధించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై విలేకర్లు అడిగిన ప్రశ్నకు నారాయణ స్పందించారు. ‘అక్కడి పరిస్థితుల్నిబట్టి ఆయన స్పందించినట్టున్నారు. దానిలో ఎలాంటి వివాదం లేదు. ఏ శాఖలోనైనా జరగాల్సిన విధంగా పనులు జరగకపోతే స్పందించే అధికారం సీఎం, డిప్యూటీ సీఎంలకు ఉంటుంది. వారు స్పందిస్తే అందరూ అప్రమత్తమవుతారు. న్యాయపరమైన అవరోధాల వల్ల పోలీసులు చర్యలు తీసుకోవడంలో కొంత జాప్యం జరిగి ఉండొచ్చు. హోం మంత్రి వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకుంటారు’ అని తెలిపారు. Mobile GOM 1
sonykongara Posted November 9 Author Posted November 9 అమరావతిపై దుష్ప్రచారం.. సీఆర్‌డీఏ వివరణ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి (Amaravati) వరదముప్పు ఉందంటూ జరుగుతున్న దుష్ప్రచారంపై సీఆర్‌డీఏ (CRDA)వివరణ ఇచ్చింది. Updated : 09 Nov 2024 18:40 IST అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి (Amaravati) వరదముప్పు ఉందంటూ జరుగుతున్న దుష్ప్రచారంపై సీఆర్‌డీఏ (CRDA) వివరణ ఇచ్చింది. వరదరహిత నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచించినట్లు తెలిపింది. వందేళ్ల వర్షపాతాన్ని పరిశీలించి టాటాకన్సల్టింగ్ ఇంజినీర్లు, నెదర్లాండ్స్ సంస్థ నివేదిక ఇచ్చిందని వెల్లడించింది. ఈ మేరకు సీఆర్‌డీఏ అధికారులు మీడియాకు వివరించారు. ‘‘వరద నిర్వహణకు అమరావతిలో ప్రవహిస్తున్న వాగులను విస్తరిస్తాం. కొండవీటి వాగు, పాలవాగుల లోతు.. వెడల్పు పెంచుతాం. వరద నిర్వహణ ప్రణాళిక డిజైన్‌ను సాంకేతిక కమిటీ ఆమోదించింది. రాజధాని అమరావతిలో వరద నిర్వహణ పనులకు రూ.2,062 కోట్లతో అంచనాలు రూపొందించాం. ఈ ప్రణాళికపై ప్రపంచ బ్యాంక్, ఏడీబీ సంతృప్తి చెందాయి. వరద పనులు 2019-24 మధ్య చేసి ఉంటే ఖర్చు తక్కువయ్యేది. సుమారు 25-30 శాతం తక్కువ ఖర్చుతోనే పనులు పూర్తయ్యేవి. గత ఐదేళ్లలో జరిగిన నిర్లక్ష్యాన్ని సరిదిద్దాలని నిర్ణయించుకున్నాం. వచ్చే మూడేళ్లలో వరద పనులతో పాటు నగర అభివృద్ధి చేస్తాం’’ అని సీఆర్‌డీఏ తెలిపింది. Mobile GOM 1
sonykongara Posted November 10 Author Posted November 10 Amaravati: అమరావతి అభివృద్ధికి ముందడుగు.. రూ.15వేల కోట్ల ప్రతిపాదనలకు ఆమోదం రాజధాని అమరావతి నగరం సుస్థిరాభివృద్ది, నగర నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు ఇచ్చే నిధుల వినియోగంపై ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది. Updated : 10 Nov 2024 16:27 IST అమరావతి: రాజధాని అమరావతి (Amaravati) నగరం సుస్థిరాభివృద్ధి, నగర నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు (World Bank), ఆసియా అభివృద్ధి బ్యాంకులు ఇచ్చే నిధుల వినియోగంపై ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సంయుక్తంగా రూ.15 వేల కోట్ల రుణ సహకారాన్ని అందించనున్నట్టు స్పష్టం చేసింది. ఈ నిధులతో రాజధాని అమరావతిలో అత్యున్నత ప్రమాణాలతో మౌలిక వసతులు, హరిత నిర్మాణాలు, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండేలా కార్యాచరణ చేపట్టాలని స్పష్టం చేసింది. ప్రజా రాజధానిగా అమరావతి అభివృద్ధికి చేపట్టాల్సిన ప్రణాళికలు అమలు చేయాలని సీఆర్‌డీఏను (CRDA) ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రధాన రహదారులు, డక్ట్‌లు, డ్రెయిన్‌లు, వరద నీటి ప్రవాహానికి అనుగుణంగా కాలువలు, నీటి రిజర్వాయర్‌లు, సురక్షిత తాగునీరు లాంటి సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులు చేపట్టాలని ఆదేశించారు. అమరావతి రాజధాని సుస్థిరాభివృద్ధికి ఏపీ సీఆర్‌డీఏ ప్రతిపాదనలు సమర్పించగా.. కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ ఆమోదించిందని వెల్లడించారు. ఈ ప్రతిపాదనలకు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు కూడా ఆమోదం తెలిపి అమరావతి నగర నిర్మాణం అభివృద్ధికి చెరో 800 మిలియన్ డాలర్ల మేర ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చినట్టు వెల్లడించారు. మిగతా నిధులను కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకుంటుందని స్పష్టం చేసింది. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి ఆర్థిక సాయం పొందేందుకు ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్‌కు అధికారం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అభివృద్ధి, నిర్మాణ ప్రణాళికల ఆధారంగా దశల వారీగా బ్యాంకుల నుంచి నిధులు పొందేందుకు ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాజధాని అమరావతి నిర్మాణ ప్రణాళికల కోసం బడ్జెట్‌లో ప్రత్యేక కేటాయింపులతో పాటు ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ సీఆర్‌డీఏ కమిషనర్ అధీనంలోనే ఈ అభివృద్ధి, నిర్మాణ ప్రణాళికలు అమలు చేయనున్నట్టు స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంత రాము ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రేపు, ఎల్లుండి దిల్లీలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి రుణ సహకారంపై సీఆర్‌డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ ఒప్పందం కుదుర్చుకోనున్నారు. Mobile GOM, Nfan from 1982 and Flash 3
Flash Posted November 10 Posted November 10 Turning into reality now.. no looking back Mobile GOM, ravindras, narens and 1 other 4
Mobile GOM Posted November 10 Posted November 10 1 hour ago, Flash said: Turning into reality now.. no looking back Yup
ramntr Posted November 10 Posted November 10 3 hours ago, Flash said: Turning into reality now.. no looking back Doosukupovali Ika... Aa railwayline kuda timeline ప్రకారం అయితే All set ఇంకా...
Nfan from 1982 Posted November 11 Posted November 11 On 11/10/2024 at 6:20 PM, Flash said: Turning into reality now.. no looking back Yes AP is unstoppable now and will be a growth engine for the country
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now