sonykongara Posted November 11, 2024 Author Posted November 11, 2024 అమరావతికి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణ ఒప్పందంలో పురోగతి ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులతో కేంద్ర, రాష్ట్ర ఆర్థిక శాఖల చర్చ ఒప్పందంపై దిల్లీలో 8 గంటలకుపైగా సాగిన సమావేశం రాజధానికి రూ.15 కోట్లు ఇవ్వనున్న ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రెండు సంస్థలతోనూ ఒప్పందం కుదుర్చుకోనున్న కేంద్ర ప్రభుత్వం భేటీలో అవగాహన ఒప్పంద పత్రాలు రూపొందించిన అధికారులు కేంద్ర, రాష్ట్ర ఆర్థికశాఖ, సీఆర్డీఏ సంతకాలు పూర్తయ్యాయని సమాచారం అతి త్వరలో నిధులు విడుదల చేస్తామని తెలిపిన ప్రపంచ బ్యాంకు, ఏడీబీ Mobile GOM and Nfan from 1982 1 1
Yaswanth526 Posted November 12, 2024 Posted November 12, 2024 Flash, Nfan from 1982 and Mobile GOM 2 1
Nfan from 1982 Posted November 12, 2024 Posted November 12, 2024 2 hours ago, Yaswanth526 said: Glad to see that 👏👏
Yaswanth526 Posted November 12, 2024 Posted November 12, 2024 No financial hurdles for Amaravati - AP Budget: ₹5445 cr - World Bank & ADB: ₹15,000 cr - HUDCO: ₹12,000 cr - Other Organizations (State govt, Central govt, bonds): ₹23,000 cr Nfan from 1982 1
Nfan from 1982 Posted November 14, 2024 Posted November 14, 2024 https://x.com/ap_crdanews/status/1856900789987684706?s=46 Best news
sonykongara Posted November 15, 2024 Author Posted November 15, 2024 ఐఐటి మద్రాసుతో ఎపి ప్రభుత్వం కీలక ఒప్పందాలు !! అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవడమే లక్ష్యం. మంత్రి నారా లోకేష్ సమక్షంలో 8 విభాగాల ఒప్పందం 1. ఐఐటిఎం – ఎపి సిఆర్ డిఎ అమరావతిలో అంతర్జాతీయ డీప్ టెక్ పరిశోధన, డిజైన్, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ పార్క్ ఏర్పాటులో సాంకేతిక సలహా కోసం ఈ ఒప్పందం కుదిరింది. అమరావతిని అంతర్జాతీయస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ఫిజికల్, వర్చువల్ పద్ధతుల్లో ఐఐటిఎం సంస్థ ఎపి ప్రభుత్వంతో కలసి పనిచేస్తుంది. 2. ఐఐటిఎం – ఎపి మారిటైమ్ బోర్డు సముద్ర పరిశోధన, కమ్యూనికేషన్, కోస్టల్ ఎనర్జీ హార్వెస్టింగ్ టెక్నాలజీల కోసం ఐఐటిఎం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుమ ఒప్పందం కుదిరింది. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి పరిశోధనతోపాటు కన్సల్టెన్సీ, విద్య, శిక్షణ ప్రయోజనాలను సాధించడమే ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం. 3. ఐఐటిఎం – ఎపి స్కిల్ డెవలప్ మెంట్ స్వయం ప్లస్, ఐఐటిఎం ప్రవర్తక్ డిజిటల్ స్కిల్ అకాడమీ వంటి ప్లాట్ ఫారాల ద్వారా స్కేల్ స్కిల్లింగ్ కార్యక్రమాల్లో నాణ్యత పెంచేలా ఎపి స్కిల్ డెవలప్ మెంట్ సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. 4). ఐఐటిఎం – ఎపి విద్యాశాఖ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అధునాతన సాంకేతిక శిక్షణ ఇచ్చేలా ఇరుపార్టీల నడుమ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ఐఐటిఎం ప్రవర్తక్ విద్యాశక్తి ద్వారా ఎపిలో ప్రాథమిక, ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఐఐటిఎం సాంకేతిక శిక్షణ ఇస్తుంది. ఇందుకు అవసరమైన మార్గదర్శక కార్యక్రమాలను ప్రారంభిస్తుంది. 5). ఐఐటిఎం – ఇన్వెస్టిమెంట్ & ఇన్ ఫ్రాస్ట్చక్చర్ శాఖ విమానాశ్రయాలను లాజిస్టిక్స్ / మెయింటెనెన్స్ హబ్‌లుగా మార్చే లక్ష్యంతో ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ముఖ్యంగా కుప్పం, పుట్టపర్తి విమానాశ్రయాలపై దృష్టిసారించడం, ఆయా ప్రాంతాల్లో వ్యాపార అవకాశాలను గుర్తించి అభివృద్ధి చేయడం ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం. 6. ఐఐటిఎం – ఐటి శాఖ అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతికతను ఉపయోగించి విశాఖ మహానగరాన్ని ఇంటర్నెట్ గేట్‌వేగా అభివృద్ధి చేయడం. తద్వారా రాష్ట్రంలో అంతర్జాతీయ డేటా కనెక్టివిటీని మెరుగుపరచడం. 7. ఐఐటిఎం – ఆర్ టిజిఎస్ శాఖ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, డాటా సైన్స్ రంగాల్లో సాఫ్ట్ వేర్ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందుకోసం ఐఐటిఎం ప్రవర్తక్ తో ఎపి ఆర్టీజిఎస్ కలసి పనిచేస్తుంది. 8. ఐఐటిఎం – క్రీడల శాఖ అమరావతి రాజధానిలో అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో స్మార్ట్ టెక్ ఎనేబుల్డ్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ఐఐటిఎం ద్వారా సాంకేతిక సలహాలు పొందేందుకు ఈ ఒప్పందం కుదుర్చకున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో వరల్డ్ క్లాస్ స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి ఈ ఒప్పందం ఉపకరిస్తుంది.
sonykongara Posted November 15, 2024 Author Posted November 15, 2024 https://x.com/Swathireddytdp/status/1857431528420090315
sonykongara Posted November 15, 2024 Author Posted November 15, 2024 సింగపూర్ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించండి: కేంద్రాన్ని కోరిన చంద్రబాబు వ్యవసాయ రంగంలో అతి ముఖ్యమైన గోదావరి-పెన్నా ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సహాయ సహకారాలు అందించాలని కేంద్రాన్ని కోరినట్టు ఎంపీ లావు కృష్ణదేవరాయలు తెలిపారు. Published : 15 Nov 2024 20:37 IST దిల్లీ: వ్యవసాయ రంగంలో అతి ముఖ్యమైన గోదావరి-పెన్నా ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సహాయ సహకారాలు అందించాలని కేంద్రాన్ని కోరినట్టు ఎంపీ లావు కృష్ణదేవరాయలు తెలిపారు. సీఎం చంద్రబాబు దిల్లీ పర్యటన వివరాలను ఎంపీ కృష్ణదేవరాయలు మీడియాకు వివరించారు. ‘‘అమెరికాలో కొత్త ప్రభుత్వం ఏర్పడినందున భారత్ నుంచి అమెరికా వెళ్లే విద్యార్థుల పరిస్థితి, ఆర్థిక రంగంలో జరిగే మార్పులపై కేంద్ర మంత్రి జై శంకర్‌తో చంద్రబాబు చర్చించారు. విద్యార్థులు, ప్రజలు ఎదుర్కొనే ఇమ్మిగ్రేషన్ సమస్యలు పరిష్కరించాలని కోరారు. రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలు చేస్తున్నామని, పెట్టుబడుల కోసం విదేశీ కంపెనీలను ఏపీకి ఆహ్వానించాలని కోరాం. విదేశీ సంస్థలను ఏపీకి పంపడంలో సహకరిస్తామని కేంద్ర మంత్రి జై శంకర్ చెప్పారు. అమరావతి నిర్మాణంలో సింగపూర్ భాగస్వామ్యమైంది. సింగపూర్ భాగస్వామ్యాన్ని పునరుద్ధరించాలని సీఎం కోరారు. అన్ని అంశాలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు’’ అని ఎంపీ కృష్ణదేవరాయలు తెలిపారు.
sonykongara Posted November 16, 2024 Author Posted November 16, 2024 https://x.com/AP_CRDANews/status/1857666177277075561
Yaswanth526 Posted November 19, 2024 Posted November 19, 2024 On 11/17/2024 at 4:11 AM, sonykongara said: Nfan from 1982 1
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now