Jump to content

Amaravati


Recommended Posts

రైతులే గృహ నిర్మాణదారులు

 

రాజధానిలో డెవలపర్లతో కలిసి నిర్మించేందుకు ప్రోత్సాహం
 ప్రత్యేక ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయనున్న సీఆర్‌డీఏ
వివిధ అంశాలపై రైతులకు శిక్షణ
 డెవలపర్లు, ఆర్కిటెక్ట్‌లు, బ్యాంకర్లతో సమావేశాలు
ఈనాడు - అమరావతి

19ap-main9a_1.jpg

అమరావతిలో సీఆర్‌డీఏ స్వయంగా చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టు ‘హ్యాపీనెస్ట్‌’కి మంచి స్పందన రావడంతో... రాజధాని ప్రాంత రైతుల్నీ ఆ దిశగా ప్రోత్సహించేందుకు చొరవ తీసుకుంటోంది. రాజధానిలో రైతులకు కేటాయించిన స్థలాల్లో సొంతంగా గానీ, డెవలపర్లతో కలిసిగానీ గృహ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టేందుకు ముందుకు వచ్చే రైతులకు అన్ని విధాలా సహకరించేందుకు సీఆర్‌డీఏ ఒక ప్రణాళిక సిద్ధం చేసింది. ఆర్కిటెక్ట్‌లు, డెవలపర్లు, ఆర్థిక వనరులు సమకూర్చే సంస్థలకు, రైతులకు మధ్య సీఆర్‌డీఏ సంధానకర్తగా వ్యవహరిస్తుంది. హ్యాపీనెస్ట్‌లో మాదిరే రైతులు ఫ్లాట్లు విక్రయించుకునేందుకు ప్రత్యేకంగా ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం రూపొందించనుంది. గృహ నిర్మాణానికి సంబంధించిన వివిధ అంశాలపై రైతులకు శిక్షణ ఇవ్వనుంది. సీఐఐ, ప్రైస్‌వాటర్‌ కూపర్‌ హౌస్‌ వంటి సంస్థలతో వారికి శిక్షణ ఇప్పించేందుకు ప్రణాళికలు రూపొందించింది. రైతులు గృహ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టే చోట తొలి ప్రాధాన్యతగా ప్రధాన మౌలిక వసతులు కల్పించనుంది. వారికి వేగంగా అనుమతులు జారీ చేసేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది.

జనవరి ఒకటి నుంచి రైతులకు శిక్షణ
గృహ నిర్మాణ ప్రాజెక్టులకు సీఆర్‌డీఏ, రెరా, అగ్నిమాపక విభాగం వంటి వివిధ సంస్థల నుంచి అనుమతులు పొందడం నుంచి ఫ్లాట్ల మార్కెటింగ్‌ వరకు వివిధ అంశాలపై రాజధాని రైతులకు సీఆర్‌డీఏ శిక్షణనిస్తుంది. జనవరి 1 నుంచి శిక్షణ మొదలవుతుంది. ఒక్కో బ్యాచ్‌లో 30-45 మంది రైతుల్ని ఎంపిక చేస్తారు. ‘మొదట వచ్చినవారికి మొదట’ క్రమంలో ఎంపిక జరుగుతుంది. ప్రతి బ్యాచ్‌కి మూడు నుంచి నాలుగు వారాల శిక్షణ ఉంటుంది. భవన నిర్మాణ అనుమతులకు సంబంధించి వివిధ సంస్థల నిబంధనలు ఎలా ఉంటాయి? ఆర్కిటెక్ట్‌లు, డెవలపర్లను ఎలా ఎంపిక చేసుకోవాలి? వివిధ బ్యాంకులు ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందడం ఎలా? భవన నిర్మాణ నిర్వహణ, మార్కెటింగ్‌ నైపుణ్యాలు వంటి అంశాలపై ప్రధానంగా శిక్షణ ఉంటుంది. శిక్షణ కార్యక్రమం ముగిశాక డెవలపర్లు, ఆర్కిటెక్ట్‌లు, బ్యాంకర్లతో రైతులకు సీఆర్‌డీఏ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తుంది. సీఐఐ, క్రెడాయ్‌, ప్రైస్‌వాటర్‌ కూపర్‌ హౌస్‌, సీబీఆర్‌ఈ వంటి సంస్థలకు చెందిన నిపుణులు రైతులకు శిక్షణనిస్తారు. శిక్షణకు హాజరవ్వాలనుకునే రైతులు రాజధాని గ్రామాల్లో సీఆర్‌డీఏ ఏర్పాటు చేసిన ఫెసిలిటేటర్లకుగానీ, భూసమీకరణ అధికారులకు గానీ దరఖాస్తులు అందజేయవచ్చునని సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ తెలిపారు.

డిమాండ్‌ని అందిపుచ్చుకునేలా!
హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టులో ఫ్లాట్లన్నీ సీఆర్‌డీఏ ఆన్‌లైన్‌లోనే విక్రయించింది. రైతులు వ్యక్తిగతంగా ఆన్‌లైన్‌ ఫ్లాట్ఫాంలు ఏర్పాటు చేసుకోలేరు కాబట్టి... వారి కోసం సీఆర్‌డీఏనే ఆ ఏర్పాటు చేయనుంది. సీఆర్‌డీఏ రూపొందించిన ‘మన అమరావతి’ యాప్‌, వెబ్‌సైట్‌లలో రాజధాని రైతుల స్థల, విక్రయాలకు వీలు కల్పించారు. చెల్లింపులు కూడా ఆన్‌లైన్‌లో చేసుకునేందుకు పేమెంట్‌ గేట్‌వే వంటి వసతులతో రైతుల కోసం ప్రత్యేకంగా ఒక ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాం సీఆర్‌డీఏ ఏర్పాటు చేయనుంది. రైతులు గృహ నిర్మాణ ప్రాజెక్టులు చేపట్టేందుకు ముందుకు వస్తే వారికి వెంటనే అనుమతులిచ్చేందుకు సీఆర్‌డీఏ ‘ఫెసిలిటేషన్‌ సెంటర్‌’ ఏర్పాటు చేసింది. ప్రతి శనివారం ఈ కేంద్రంలో అనుమతులిస్తారు. రైతులు చేపట్టే ప్రాజెక్టులకు విద్యుత్‌, నీటిసరఫరా, రహదారులు వంటి వసతుల్ని వెంటనే కలిస్తామని సీఆర్‌డీఏ కమిషనర్‌ తెలిపారు. ‘‘హ్యాపీనెస్ట్‌కి వచ్చిన డిమాండ్‌ కేవలం ఆ ప్రాజెక్టుకే వచ్చినది కాదు. మొత్తం రాజధాని అమరావతిపై ప్రజల్లో ఉన్న ఆసక్తికి అది నిదర్శనం. దీన్ని అందిపుచ్చుకునేలా రైతుల్ని ప్రోత్సహించడమే మా ఉద్దేశం’’ అని శ్రీధర్‌ వివరించారు.

 

Link to comment
Share on other sites

Cityzenith's Smart World Pro™ Digital Twin Software Platform Selected for New Capital City in India

Award-winning Smart World Pro™ solution selected for Amaravati, a $6.5 billion greenfield smart city designed by Foster + Partners and Surbana Jurong

Cityzenith logo (PRNewsFoto/Cityzenith)

News provided by

Cityzenith

Dec 17, 2018, 07:57 ET

Share this article

  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

CHICAGO, Dec. 17, 2018 /PRNewswire/ -- Cityzenith's Smart World Pro™ (SWP), the world's most advanced Digital Twin solution for buildings and cities, has been selected by the Government of Andhra Pradesh as the 3D City Information Model of choice for the development of Amaravati, a new $6.5 billion world-class smart city capital for the Indian state of Andhra Pradesh.

Two views of the Amaravati greenfield city, as seen from Cityzenith's Smart World Pro Digital Twin solution. (PRNewsfoto/Cityzenith)
Two views of the Amaravati greenfield city, as seen from Cityzenith's Smart World Pro Digital Twin solution. (PRNewsfoto/Cityzenith)

On completion, Amaravati will rank among the top three digitally advanced cities in the world. As a greenfield new city development, Amaravati will incorporate best-in-class innovative technologies that will revolutionize development, planning, operations and citizen engagement at all levels across the new state capital. Smart World Pro™ will be customized to allow government agencies, commercial businesses, and citizens to use a single platform for a wide range of purposes. Ground-breaking new digital services and functions planned include:

  • real-time construction progress monitoring, environmental and wellness monitoring, et al via ubiquitous, multi-nodal IoT sensors
  • advanced mobility and traffic monitoring and simulations
  • advanced microclimate and climate change monitoring and simulations
  • digital "drag and drop" building permit submissions
  • digital zoning, setback, environmental, traffic, and other statutory compliance-related preliminary analysis
  • a proposed Digital Twin user ID scheme for every Amaravati citizen that will serve as a single citizen portal for all government information, notifications, forms, and applications

The initial prototype will be unveiled at Davos in January 2019. The first phase of the engagement will run through the end of 2019. Cityzenith will collaborate with its local JV partner in India, AEC Digital Studio, to deliver the project.

"We're honored to have been chosen for one of the most exciting greenfield smart city projects in the world, and one that will set an example for Andhra Pradesh and the whole of India," explained Michael Jansen, Cityzenith CEO. "Our open, non-proprietary, format-agnostic approach positions us well at the heart of the AEC, CRE, and smart city tech ecosystems. As a design, real estate, and smart city project all-in-one, Amaravati will give us the opportunity to show off many new advanced features."

"Amaravati will be born as a Digital Twin, the first entire city that I know of to do that in the world. Everything that happens in Amaravati will be scenarioized in advance to optimize outcomes, and adjusted on the fly to keep pace with change. This represents a giant leap forward for cities, how they're designed, built, and managed, and how they optimize their relationships with the private sector and their own citizens."

"Amaravati is a greenfield city being built with the happiness of its citizens at the core of its vision," says Dr. Sreedhar Cherukuri I.A.S., Commissioner, APCRDA (Andhra Pradesh Capital Regional Development Authority). "A digital platform that enables the entire ecosystem of the city's stakeholders to utilize and contribute to achieve this common goal is vital to have from Day 0. Amaravati will have an open platform to access data and tools across sectors in an integrated 3D city model, the pilot being powered by Cityzenith's Smart World Pro."

Smart World Pro's unique SimCity™-like Digital Twin software platform provides an extraordinarily visually rich "single pane of glass" view of urban, project, and property data, above and below ground, public and private, at a massive scale. A Digital Twin is a digital model of a physical asset, which continuously collects information (via sensors, drones or other IoT and IIoT data collection tools) and applies advanced analytics, machine-learning (ML) and artificial intelligence (AI) to gain valuable real-time insights about the physical asset's performance, operation or profitability. Digital Twin users include large building owners, building design professionals, property managers, REITS, and governments.

Riding the crest of the IoT wave in the building industry, Cityzenith's Digital Twin platform is uniquely tailored to accommodate IoT sensor data/BMS, leveraging a robust backend to interpret sensor data into actionable information that helps predict outcomes across maintenance, development, leasing, and financial functions. Users point and click their way into over a billion data records, import any type of file format from BIM to GIS to IoT, ask questions using voice-enabled natural language capabilities, and generate a full range of AI- and ML-driven analytics on the fly. To learn more about Cityzenith and its Smart World Pro™ solution, please visit cityzenith.com or email info@cityzenith.com.

About Cityzenith

Cityzenith is based in Chicago and London. The company's flagship Smart World Pro™ platform was created for the people responsible for designing, constructing, and managing complex, large-scale building projects, properties, real estate portfolios or cities, anywhere in the world. Visit www.cityzenith.com to learn more.

SOURCE Cityzenith

Related Links

http://www.cityzenith.com

Link to comment
Share on other sites

జడ్జిలు, ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు
21-12-2018 02:56:21
 
  • అమరావతిలో 238 ఎకరాలు కేటాయింపు
  • మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం: నారాయణ
అమరావతి, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): హైకోర్టు న్యాయమూర్తులు, సచివాలయ పరిధిలో పనిచేసే అఖిల భారత సర్వీస్‌ అధికారులు, హెచ్‌వోడీలు, ఉద్యోగుల ఇళ్ల స్థలాల కోసం సీఆర్డీయే 238 ఎకరాలు కేటాయించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. సచివాలయంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అధ్యక్షతన గురువారం జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు. అభివృద్ధి చేసిన లే అవుట్లలో ఇంటి స్థలాలు ఇస్తామన్నారు.
 
హైకోర్టు జడ్జిలకు చదరపు గజం రూ.5వేల చొప్పున 750 చదరపు గజాలు, అఖిల భారత సర్వీస్‌ అధికారులకు రూ.5వేల చొప్పున 500 చ.గ., ఎన్జీవోలకు రూ.4వేల చొప్పున 175 చ.గ., గజిటెడ్‌ అధికారులకు రూ.4,500 చొప్పున 200 చ.గ. కేటాయించనున్నట్లు చెప్పారు. ఈషా ఫౌండేషన్‌కు ఎకరం రూ.10లక్షల చొప్పున 10 ఎకరాలు, చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్‌కు 3 ఎకరాలు రాజధాని వెలుపల ఇచ్చామన్నారు. వీటితో సీఆర్డీయే పరిధిలో ఇప్పటి వరకూ 1636 ఎకరాలను వివిధ సంస్థలకు కేటాయించినట్లు నారాయణ వివరించారు.
Link to comment
Share on other sites

సంక్రాంతికి హైకోర్టు సిద్ధం 

 

అమరావతిలో పూర్తికావస్తున్న పనులు 
హైకోర్టు పక్కనే న్యాయవాదులకు ప్రత్యేక భవనం 
ఒకేసారి 500 మంది భోజనం చేసేలా క్యాంటీన్‌ 
ఈనాడు - అమరావతి

MOPcMit.jpg

రాజధాని అమరావతిలో తాత్కాలిక హైకోర్టు భవనం శరవేగంగా సిద్ధమవుతోంది. జీ+2 విధానంలో భవన నిర్మాణం దాదాపు పూర్తయింది. భవనానికి వెలుపల శాండ్‌స్టోన్‌ క్లాడింగ్‌ పనులతో పాటు సమాంతరంగా అంతర్గత అలంకరణ పనులు చేస్తున్నారు. భవనాన్ని జనవరి 15 నాటికి పూర్తి హంగులతో సిద్ధం చేస్తామని సీఆర్‌డీఏ అధికారులు చెబుతున్నారు. పేరుకు తాత్కాలిక హైకోర్టు భవనమే అయినా, పూర్తిస్థాయిలో ఒక హైకోర్టు నిర్వహణకు అవసరమైన అన్ని వసతులూ దీనిలో సమకూరుస్తున్నారు. భవనానికి రెండు పక్కల ఉద్యానవనాలు, విశాలమైన పార్కింగ్‌ ప్రాంతం ఏర్పాటుచేస్తున్నారు. భవనానికి రాజస్థాన్‌ శాండ్‌స్టోన్‌తో తాపడం చేసి అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. హైకోర్టు భవనం పక్కనే జీ+5 విధానంలో అడ్వొకేట్స్‌ చాంబర్‌ను నిర్మిస్తున్నారు.  150 మంది సీనియర్‌ న్యాయవాదులకు సరిపడేలా ఈ భవనాన్ని నిర్మించనున్నారు. హైకోర్టు భవనంలో  కారిడార్లలో తప్ప మిగతా అన్ని చోట్లా ఎయిర్‌కండీషన్‌ సదుపాయం ఉంటుంది. 2.50 లక్షల దస్త్రాల్ని భద్రపరిచేందుకు ఆధునిక స్టోరేజీ సదుపాయాన్ని కోర్టు భవనంలో ఏర్పాటు చేస్తున్నారు. 

JkjyVRr.jpg

ఆధునిక హంగులతో కోర్టు భవనం 
తాత్కాలిక హైకోర్టు భవనాన్ని ఆధునిక వసతులతో కార్పొరేట్‌ కార్యాలయాలకు దీటుగా నిర్మిస్తున్నారు. 4.02 ఎకరాల్లో జీ+2 విధానంలో భవనాన్ని నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో జీ+5కి విస్తరించుకునేందుకు వీలుగా భవనాన్ని రూపొందించారు. జీ+2 భవనంలో 2.50 లక్షల చ.అడుగుల నిర్మిత ప్రాంతం ఉంటుంది. 
పార్కింగ్‌కు మూడెకరాలు కేటాయించారు. 440 కార్లు నిలిపేందుకు వీలుగా పార్కింగ్‌ వసతి కల్పిస్తున్నారు. 
దీనిలో ఒక ప్రధాన న్యాయమూర్తి కోర్టు (చాంబర్‌తో కలిపి 2480 చ.అడుగులు), 22 కోర్టులు (జడ్జి చాంబర్‌తో కలిపి సుమారు 2480 చ.అడుగులు) ఏర్పాటుచేస్తున్నారు. 
న్యాయమూర్తులు, ప్రజలు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది కోసం వేర్వేరు ప్రవేశద్వారాలు ఏర్పాటు చేశారు. 
న్యాయమూర్తులకు కావలసిన అన్ని సదుపాయాలు, పరిపాలన విభాగాలు (సెక్షన్లు, రిజిస్ట్రీలు), హైకోర్టు లైబ్రరీ, కక్షిదారులు వేచిఉండే ప్రాంతాలు, ప్రత్యామ్నాయ వివాద పరిష్కార విభాగం వంటివన్నీ ఏర్పాటుచేస్తున్నారు. 
కోర్టు భవనంలోనే 2,500 చ.అడుగుల విస్తీర్ణంలో మహిళా న్యాయవాదుల సంఘం కోసం ప్రత్యేక మందిరం ఉంటుంది. 
కోర్టు భవనానికి ఎదురుగా ఐదెకరాల్లో, తూర్పు పక్కన మరో ఐదెకరాల్లోనూ ఉద్యానవనాన్ని అభివృద్ధి చేస్తున్నారు. 
500మంది ఒకేసారి భోజనం చేసేందుకు వీలుగా గార్డెన్‌లో క్యాంటీన్‌ భవనం నిర్మిస్తారు. 
న్యాయవాదులకు వివిధ సదుపాయాలు కల్పిస్తున్నారు. అసోసియేషన్‌ హాళ్లు, రైటర్స్‌ కూర్చోడానికి అనువైన ప్రదేశాలు వంటివన్నీ ఏర్పాటవుతున్నాయి. 
కోర్టు భవనంలోనే బ్యాంకు, తపాలా కార్యాలయం, న్యాయశాస్త్ర సంబంధిత పుస్తకాల విక్రయ కేంద్రం వంటివి ఉంటాయి. 
సిబ్బంది కోసం ఆధునిక క్యూబికల్‌ ఫర్నిచర్‌ ఏర్పాటుచేస్తున్నారు. 
మొత్తం భవనానికి 12 లిఫ్ట్‌లుంటాయి. 
అడ్వొకేట్‌ జనరల్‌ కార్యాలయం భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌, మొదటి అంతస్తుల్లో నైరుతి దిశలో ఉంటుంది. అడ్వొకేట్‌ జనరల్‌, అదనపు అడ్వొకేట్‌ జనరల్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లకు ప్రత్యేక చాంబర్లు ఉంటాయి. 
ప్రభుత్వ న్యాయవాదులకు 21 కేబిన్లు ఏర్పాటుచేస్తున్నారు. 

9zj6aSv.jpg

న్యాయవాదులకు ప్రత్యేక భవనం 
సీనియర్‌ న్యాయవాదుల ఛాంబర్ల ఏర్పాటుకు 55 వేల చ.అడుగుల నిర్మిత ప్రాంతం కలిగిన భవనాన్ని నిర్మిస్తారు. ఈ భవనం గ్రౌండ్‌ఫ్లోర్‌లో బ్యాంకు, అసోసియేషన్‌ హాళ్లు, గ్రంథాలయం వంటివి ఉంటాయి. మిగతా అంతస్తుల్లో న్యాయవాదుల చాంబర్లు ఉంటాయి.

 

Edited by sonykongara
Link to comment
Share on other sites

1 hour ago, baabuu said:

dec 15 ki annaru, 
malla ippudu Jan 15 antunnaru, 
iddi antara... 
too short targets 

most likely finish avvadu. oka vela finish chesarante, temporary secretariat lo water leaks lanti episodes ikkada kuda repeat avutayi.

I don't think any body believes CBN's finish targets any more. Even Judges set Mid April as starting day. They never bought these Dec 15/Dec 30/Jan 15 deadlines.

Link to comment
Share on other sites

42 minutes ago, swarnandhra said:

most likely finish avvadu. oka vela finish chesarante, temporary secretariat lo water leaks lanti episodes ikkada kuda repeat avutayi.

I don't think any body believes CBN's finish targets any more. Even Judges set Mid April as starting day. They never bought these Dec 15/Dec 30/Jan 15 deadlines.

edi ayipothundi,judges ki houses kuda ivvali avi purthi chesthene vastharu..

Link to comment
Share on other sites

టవర్లు ఐదే.. విశేషాలెన్నెన్నో!
22-12-2018 03:52:03
 
636810475245642256.jpg
  •  నిర్మాణంలో తొలిసారి ‘డయాగ్రిడ్‌’
  •  కాలమ్స్‌ తగ్గి స్థలం ఆదాకు వీలు
  •  హెచ్‌వోడీలూ సచివాలయంలోనే
  •  భద్రతలో రెండాకులు ఎక్కువగా..
  •  ప్రతి అంతస్థుకూ ఒక ఫైర్‌ లిఫ్ట్‌
  •  27న ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌కి సీఎం శ్రీకారం
(ఆంధ్రజ్యోతి, అమరావతి)
టవర్లు ఐదే.. విశేషాలు ఎన్నెన్నోశ్రీ రాజధానిలోని గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లో అంతర్భాగంగా నిర్మితమవుతున్న సెక్రటేరియట్‌ టవర్లు వాటికి మాత్రమే స్వంతమైన పలు ప్రత్యేకతలను కలిగి ఉన్నాయి! మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే వివిధ అంశాల్లో అగ్రభాగాన నిలవబోతున్నాయి! 41 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో, ఐదు టవర్లు, ఒక్కొక్కటి రమారమీ 40-50 అంతస్థులతో సిద్ధమవుతున్నాయి. ఒకపక్క అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూనే, మరొకపక్క పర్యావరణహితంగానూ రూపుదిద్దుకొంటుండటం ఈ టవర్ల విశిష్టత. వీటి నిర్మాణంలో తొలిసారిగా డయాగ్రిడ్‌ స్ట్రక్చరల్‌ విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ విధానంలో.. నిర్మాణానికి మధ్య భాగాల్లో కాలమ్స్‌ ఉండవు. భవంతుల బాహ్యభాగంలో మాత్రమే ఫ్రేమ్‌లు ఉంటాయి. దీనివల్ల స్థలం ఆదా అవుతుంది. అదే సమయంలో ఎక్కువ అడ్డంకులు లేకుండా ఆ గదిని ఎలాగయినా మలుచుకొనే వీలు ఉంటుంది. అంతకన్నా ముఖ్యంగా ఈ విధానంలో వినియోగించే స్ట్రక్చరల్‌ స్టీల్‌ పరిమాణం సంప్రదాయ నిర్మాణ విధానంలో వాడేదానికంటే చెప్పుకోదగినంత తక్కువ కావడంతో నిర్మాణ వ్యయం కూడా తగ్గుతుంది. ఈ క్రమంలో మరో ముఖ్యమైన ఘట్టానికి ఇప్పుడు రంగం సిద్ధమయింది. భారీ ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ పనులను ఈనెల 27న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
 
వెయిటింగ్‌ అక్కర్లేదు..
సాధారణంగా ఎక్కడైనా సెక్రటేరియట్‌ భవన సముదాయాల్లో సచివాలయానికి సంబంధించిన కార్యాలయాలు మాత్రమే ఉంటాయి. శాఖల అధిపతుల (హెచ్‌.ఒ.డి.) కార్యాలయాలు వాటికి దూరంగా, ఎక్కడెక్కడో ఉండడం పరిపాటి. కానీ, అమరావతిలో రూపుదిద్దుకొంటున్న సెక్రటేరియట్‌లో మాత్రం.. సచివాలయ కార్యాలయాలతోపాటు సుమారు 145 విభాగాధిపతుల కార్యాలయాలకు కూడా చోటు కల్పించారు. ఇలాంటి ఏర్పాటు భారతదేశంలో ఇదే ప్రప్రథమం. ఐదు టవర్లను కలుపుతూ (బహుశా రెండో అంతస్థులో) ఉద్యోగులు, సందర్శకుల రాకపోకలకు వీలుగా ఎలివేటెడ్‌ కాలిబాట వంతెనను నిర్మించనున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కనిపించేటటువంటి అత్యంత సౌకర్యవంతమైన ఆఫీస్‌ స్పేస్‌లు ఈ టవర్లలో రానున్నాయి. చక్కటి వెలుతురు, సమ శీతోష్ణస్థితి, విశాలమైన క్యూబికల్స్‌తోపాటు చాంబర్లు, కాన్ఫరెన్స్‌ రూమ్‌లు, ఆడిటోరియంలు, చికిత్సా కేంద్రాలు ఇత్యాదివి ఉంటాయి. ఇవి కాకుండా పాలవాగుకు అభిముఖంగా క్యాంటీన్లు, రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తారు.
 
 
ఒకటి కాదు.. రెండు
అగ్ని ప్రమాదాల్లాంటివి సంభవించినప్పుడు ప్రాణనష్టాన్ని నివారించే ఏర్పాటు ఈ టవర్లలో చేస్తుండటం మరో విశేషం. నేషనల్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ నిబంధనల ప్రకారం కొన్ని అంతస్థులకు కలిపి ఒక ఫైర్‌ లిఫ్ట్‌ ఏర్పాటు చేస్తే చా లు. కానీ, ఇక్కడ ప్రతి అంతస్థులో ఒకటి నెలకొల్పుతున్నారు. అగ్నిప్రమాదాలప్పుడు ఫైర్‌ సిబ్బంది త్వరగా ఆయా అంతస్థులకు చేరుకునేందుకు ఇవి తోడ్పడతాయి. ఒక ఫైర్‌ టవర్‌ సరిపోతుందని నిబంధనలు చెబుతుండగా... రెండింటిని ఏర్పాటు చేస్తున్నారు. ఐజీబీసీ ప్లాటినం రేటింగ్‌ నిబంధనలకు అనుగుణంగా ఈ టవర్లను నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా, డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ సిస్టం గ్రిడ్‌తో అనుసంధానించడంవల్ల విద్యుత్తు వాడకం తగ్గుతుంది. ట వర్ల పైభాగంలో ఏర్పాటు చేసే సౌర ఫలకాలు ఉత్పత్తి చేసే విద్యుత్తుతో.. సంప్రదాయ విద్యుత్‌ వాడకం తగ్గుతుంది.
Link to comment
Share on other sites

 

1/2 స్మార్ట్ టెక్నాలజీని కేవలం ప్రదర్శన వరకే పరిమితం కాకుండా వాటి ఉపయోగాలను వాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం మరియు APCRDA ఎప్పుడు ముందుంటాయి. 360 నిఘా, వైఫై , ఆటోమేటిక్ నెంబర్ గుర్తింపు , 5జి సెల్ కేసింగ్ ,వాతావరణంలోని మార్పులని నమోదు చేసే ఎన్విరాన్మెంటల్ సెన్సార్1

 
 
 
 
 
 
 
 

2\2 టూ వే ప్రజా అనుసంధాన వ్యవస్థ వంటి అత్యాధునిక ఫీచర్స్ కలిగిన స్మార్ట్ పోల్స్ అమరావతిలో తమ సేవలను అందించనున్నాయి. ఇప్పటికే 8 పోల్స్ ను ప్రయోగాత్మక పరిశీలన కోసమై సచివాలయంలో ఏర్పాటు చెయ్యడం జరిగింది. #Amaravati #APCRDA Instagram : http://www.instagram.com/prajarajadhani  http://www.crda.ap.gov.in 

DvAUPlUVYAA84Vt.jpg
Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...