Jump to content

Recommended Posts

Posted
1 minute ago, baabuu said:

Highcourt inka ready kaaleduga, kaani 1st nunchi amaravathi nunchi ani vesthunnaru enduku?

CM camp office (Vijayawada) lo start avutundi ani CBN chepparu at foundation ceremony.

Posted
రాజధానిలో.. మరో అధ్యాయం
27-12-2018 08:18:18
 
636814955497851499.jpg
  • శాశ్వత సచివాలయ పనులకు నేడు శంకుస్థాపన
  • ప్రపంచంలోనే ఎత్తైన ఐదు టవర్లతో రూపకల్పన
  • ఏర్పాట్లు పరిశీలించిన సీఆర్‌డీఏ కమిషనర్‌, రూరల్‌ ఎస్పీ
 
తుళ్లూరు, డిసెంబరు: రాజధాని అమరావతి నిర్మాణపనుల్లో గురువారం మరో అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నారు. గురువారం ఉదయం 8.30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శాశ్వత సచివాలయ టవర్‌ బిల్డింగ్‌ పనుల ప్రారంభానికి శంకుస్థాపన చేయనున్నారు. ప్రపంచంలోనే ఎత్తైన ఐదు టవర్లతో సచివాలయ నిర్మాణానికి అధికారులు రూపొందించిన నమూనాకు ఆమోదం వచ్చింది. దీంతో రాజధాని పరిధిలోని కొండమరాజు, రాయపూడి తుళ్లూరు రెవెన్యూ పరిధిలో శాశ్వత సచివాలయాన్ని నిర్మించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయా పనులను శంకుస్థాపన చేయనున్నారు. సీడ్‌ రోడ్డు నుంచి శంకుస్థాపన జరిగే ప్రదేశానికి సీఎం చేరుకుంటారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం జుడీషియల్‌ కాంప్లెక్స్‌ వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ నుంచి హెలికాఫ్టర్‌లో అనంతపురం వెళ్లనున్నారు. 300 మంది రైతులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు.
 
నిరంతరాయంగా 72 గంటల పనులు
షాపూర్జీ పల్లోంజీ నిర్మాణ సంస్థ ఈ టవర్‌ పనులను దక్కించుకుంది. నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ టవర్ల డిజైన్‌ ఇంజనీరింగ్‌ పనులు పర్యవేక్షిస్తుంది. ప్రపంచంలోనే ఇటువంటి రాఫ్ట్‌ అమరావతిలో రెండోదిగా కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ రాఫ్ట్‌ పనుల్లో 1200 టన్నుల ఐరన్‌ వినియోగించారు. 10,800 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ వాడాల్సి ఉంది. పది మీటర్ల లోతు నుంచి 35 ఎంఎం రాడ్లను వాడుతూ వచ్చారు. క్వాలిటీ కంట్రోల్‌ బోర్డు 39 మంది సభ్యులు పనులు పర్యవేక్షిస్తారు. 72 గంటలు ఆపకుండా కాంక్రీట్‌ రాఫ్ట్‌ పనులు జరగాల్సి ఉంది. ఈ టవర్‌ నిర్మాణం 40 అంతస్తులతో జరుగుతుంది. సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ సీఎం శంకుస్థాపన జరిగే ప్రదేశాన్ని బుధవారం సాయంత్రం పరిశీలించారు. రూరల్‌ ఎస్పీ శేఖర్‌బాబు బందోబస్తు ఏర్పాటు పర్యవేక్షించారు
Posted
ఆంధ్రప్రదేశ్‌కు హైకోర్టు 

 

జనవరి 1 నుంచి అమరావతి కేంద్రంగా కార్యకలాపాలు 
ఉమ్మడి హైకోర్టు విభజనపై  రాష్ట్రపతి ఉత్తర్వులు 
ఏపీకి 14, తెలంగాణకు 10  మంది సిట్టింగ్‌ జడ్జీల కేటాయింపు 
ప్రధాన న్యాయమూర్తిసహా ముగ్గురిపై నిర్ణయం తీసుకోనున్న కొలీజియం 
ఈనాడు - దిల్లీ

26ap-main1a_2.jpg

కొంతకాలంగా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఏర్పాటు ఉత్తర్వులు బుధవారం విడుదలయ్యాయి. ఈ మేరకు ఉమ్మడి హైకోర్టును ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య రెండుగా విభజిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం ఆదేశాలు జారీచేశారు. జనవరి 1 నుంచి అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభిస్తుందని అందులో స్పష్టం చేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న న్యాయస్థానం తెలంగాణ రాష్ట్ర హైకోర్టుగా సేవలు కొనసాగిస్తుందని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 214 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఉండాలన్న నిబంధన మేరకు ఆంధ్రప్రదేశ్‌లో కొత్త హైకోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. 
ముగ్గురి గురించి చెప్పలేదు 
ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టులో సేవలందిస్తున్న(సిట్టింగ్‌) 28 మంది న్యాయమూర్తుల్లో 14 మందిని ఏపీకి, 10 మందిని తెలంగాణకు కేటాయించారు. ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.బి.ఎన్‌.రాధాకృష్ణన్‌, జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌, జస్టిస్‌ రామసుబ్రహ్మణ్యంలను ఏ హైకోర్టుకు కేటాయించిందీ ఉత్తర్వుల్లో చెప్పలేదు. వీరి ముగ్గురిపై సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నట్లు న్యాయశాఖ వర్గాలు పేర్కొన్నాయి. 
ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ రమేష్‌ రంగనాథన్‌, కేరళ హైకోర్టున్యాయమూర్తిగా సేవలందిస్తున్న దామా శేషాద్రినాయుడులను ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల జాబితాలో చూపారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌రెడ్డి తెలంగాణ హైకోర్టును ఐచ్ఛికంగా ఎంచుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

26ap-main1b_2.jpg

26ap-main1c_2.jpg

ఇదీ నేపథ్యం 
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకపోవడంతో సమైక్యరాష్ట్రానికి సేవలందిస్తూ వచ్చిన హైకోర్టును తాత్కాలికంగా ఉమ్మడి హైకోర్టుగా నిర్ణయించారు. ఆమేరకు విభజన చట్టంలో నిబంధన విధించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 214 ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటయ్యేంతవరకూ హైదరాబాద్‌లో ఉన్న హైకోర్టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల ఉమ్మడి హైకోర్టుగా కొనసాగాలని విభజన చట్టంలోని సెక్షన్‌ 30(ఎ) కింద చెప్పారు. సెక్షన్‌ 30లోని నిబంధనలకు లోబడి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని సెక్షన్‌ 31(1) కింద పేర్కొన్నారు. ఆ నాటి నుంచి హైదరాబాద్‌లో ఉన్న హైకోర్టు తెలంగాణ హైకోర్టుగా మారుతుందని చెప్పారు. అయితే కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన పీఠం ఎక్కడ ఉండాలన్నది రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా నోటిఫై చేయాలని విభజన చట్టంలోని సెక్షన్‌ 31(2)లో పేర్కొన్నారు. విభజన చట్టంలోని ఈ నిబంధనల ప్రకారం హైకోర్టును విభజించాలని కోరుతూ టి.ధనగోపాల్‌ అనే వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఉమ్మడి హైకోర్టును ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ హైకోర్టులుగా విభజిస్తూ నోటిఫికేషన్‌ జారీచేయడానికి సంబంధిత అధీకృత సంస్థకు ఎలాంటి అడ్డంకులు లేవని, అందువల్ల 2019 జనవరి 1 నాటికల్లా ఉత్తర్వులు జారీచేయొచ్చని పేర్కొంటూ జస్టిస్‌ ఏకే సిక్రీ, జస్టిస్‌ అశోక్‌భూషణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం అక్టోబర్‌ 29వ తేదీన తీర్పు ఇచ్చింది. దాంతో రెండు హైకోర్టులు వేర్వేరుగా పనిచేయొచ్చని, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సాధ్యమైనంత త్వరగా కొత్త భవనంలో విధులు ప్రారంభించవచ్చని పేర్కొంటూ ఆ కేసు విచారణను ముగించింది. ఈ నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 214తోపాటు, ఎస్‌ఎల్‌పీ(సివిల్‌) 29890/2018 కేసులో సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వులు, విభజన చట్టంలోని సెక్షన్‌ 30(ఎ)(1), 31(1)(2) ద్వారా దఖలు పడిన అధికారాలను ఉపయోగించి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హైకోర్టును ఏర్పాటుచేస్తూ రాష్ట్రపతి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. ఇది జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు పేరుతో అమరావతి నుంచి పని ప్రారంభిస్తుంది.

 

ఏపీకి 37  తెలంగాణకు 24

ఉమ్మడి హైకోర్టుకు మంజూరు చేసిన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 61. అందులో ఏపీకి 37, తెలంగాణకు 24 విభజించారు. ఏపీకి కేటాయించిన వారిలో 28 మంది శాశ్వతన్యాయమూర్తులు, తొమ్మిది మంది అదనపు న్యాయమూర్తులు ఉంటారు. తెలంగాణ హైకోర్టులో ఈ సంఖ్య 18, 6గా ఉంటుంది. 

ప్రస్తుతం 27 మందే

ప్రస్తుతం హైకోర్టు విభజన అయ్యే నాటికి ఉమ్మడి కోర్టులో 27 మంది సేవలందిస్తున్నారు. అందులో ఏపీకి 14, తెలంగాణకు 10 మంది న్యాయమూర్తులను కేటాయించారు. ముగ్గురిపై ఇంకా కొలీజియం నిర్ణయం తీసుకుని కేటాయించాల్సి ఉంది. ఇప్పటివరకు కేటాయించిన న్యాయమూర్తుల సంఖ్యను బట్టిచూస్తే ఏపీలో 23, తెలంగాణలో 14 జడ్జీల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుంది.

తెలంగాణ హైకోర్టుకు కేటాయించిన న్యాయమూర్తులు 

26ap-main1d.jpg

1. జస్టిస్‌ పులిగోరు వెంకట సంజయ్‌కుమార్‌ 
2. జస్టిస్‌ ఎం.ఎస్‌. శ్రీరామచంద్రరావు 
3. జస్టిస్‌ అడవల్లి రాజశేఖర్‌రెడ్డి 
4. జస్టిస్‌ పొనుగోటి నవీన్‌రావు 
5. జస్టిస్‌ చల్లా కోదండరాం చౌదరి 
6. జస్టిస్‌ బులుసు శివశంకర రావు 
7. జస్టిస్‌ డాక్టర్‌ షమీమ్‌ అఖ్తర్‌ 
8. జస్టిస్‌ పోట్లపల్లి కేశవరావు 
9. జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ షావిలి 
10. జస్టిస్‌ తొడుపునూరి అమర్‌నాథ్‌గౌడ్‌

Posted
పాలనకు పటిష్ఠ పునాది 

 

రాఫ్ట్‌ ఫౌండేషన్‌ మాస్‌ కాంక్రీట్‌ విధానంలో ఏర్పాటు 
4 మీటర్ల లోతు, 52 మీటర్ల పొడవు.. అంతే వెడల్పున కాంక్రీట్‌ 
72 గంటలు నిరంతరాయంగా పనులు

26ap-main7a.jpg

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ సచివాలయ భవనాల నిర్మాణంలో కీలక ఘట్టం మొదలుకానుంది. సచివాలయ, విభాగాధిపతుల కార్యాలయాలను అయిదు టవర్లుగా నిర్మిస్తున్నారు. ఇందులో రెండో భవన పునాది పనులకు గురువారం ఉదయం 8.50 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు భూమిపూజ చేయనున్నారు. దీనికి సంబంధించి గుత్తేదారు సంస్థ షాపూర్‌జీ పల్లోంజీ, అధికార యంత్రాంగం ఏర్పాట్లుచేసింది. రాఫ్ట్‌ ఫౌండేషస్‌ మాస్‌కాంక్రీట్‌ విధానంలో పునాది వేస్తున్నారు. 
రాఫ్ట్‌ ఫౌండేషన్‌ విధానంలో 
నిర్ణీత ప్రాంతం మొత్తాన్ని కాంక్రీట్‌తో నింపే ప్రక్రియనే రాఫ్ట్‌ ఫౌండేషన్‌ విధానంగా పేర్కొంటారు. ఒక రకంగా చెప్పాలంటే స్టీలు, కాంక్రీటుతో అత్యంత పటిష్ఠమైన, మందపాటి కాంక్రీట్‌ దిమ్మెను నిర్మించడమే. 
సాధారణంగా నేల లోతు నుంచి స్తంభాలు వేసి పునాది నిర్మించాలంటే గుంతలు తవ్వాలి. బోర్లు వేసి స్టీలు పెట్టాలి. కాంక్రీట్‌ పోయాలి.. కనీసం నెలన్నర వ్యవధి పడుతుంది. అదే రాఫ్ట్‌లో అయితే మూడు రోజుల్లో పునాది వేయొచ్చు. ఫైల్‌ విధానంతో పోలిస్తే ఖర్చు ఎక్కువైనా నిర్మాణం పటిష్ఠంగా ఉంటుంది. 

నేల స్వభావానికి అనుగుణంగా 
నేల స్వభావానికి అనుగుణంగా భవన విస్తీర్ణం, ఎత్తుకు తగినట్లు పునాది ఎలా ఉండాలనేది నిర్ణయిస్తారు. రాజధాని ప్రాంతంలో ఇప్పటిదాకా ఫైల్‌ ఫౌండేషన్‌ విధానంలో పనులు చేస్తున్నారు. సచివాలయ భవనాలకే రాఫ్ట్‌ ఫౌండేషన్‌లో పునాది వేస్తున్నారు. 72 గంటలపాటు నిరాటంకంగా పనులు చేస్తారు. మూడోపార్టీగా వ్యవహరిస్తున్న ఐఐటీ చెన్నై నిపుణులు కాంక్రీట్‌మిక్స్‌ను డిజైన్‌ చేశారు. 
భారీ యంత్రాల వినియోగం 
60, 40 టన్నుల సామర్థ్యపు క్రేన్లు 
10 మీటర్ల వరకు వినియోగించే హైడ్రాస్‌ 
కాంక్రీట్‌ వేసే నాలుగు పంపులు 
30 ట్రాన్సిట్‌ మిక్సర్లు (అందుబాటులో అదనంగా మరో ఆరు) 

26ap-main7b.jpg

ఇదొక ఇంటెలిజెంట్‌ భవనం: సీఎం చంద్రబాబు 
సచివాలయ అయిదు టవర్లకు దేశంలో ఎక్కడా చేయనట్టు భారీ స్థాయిలో కాంక్రీట్‌ వేసే పనికి నాంది పలుకుతున్నాం. ఇప్పటిదాకా సచివాలయాలంటే చీకటిగా ఉంటాయనే భావన ఉండేది. ఇది ఆధునికంగా, అన్ని సౌకర్యాలతో ఉంటుంది. భవిష్యత్తుకు కూడా ఇదొక ఇంటెలిజెంట్‌ భవనంగా నిర్మిస్తున్నాం. 
భవనం ప్రత్యేకతలివి.. 
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సచివాలయ, విభాగాధిపతుల భవనం 
40 అంతస్తుల ఎత్తు 
6.9 మిలియన్‌ చ.అడుగుల విస్తీర్ణం 
రెండు దశల లిఫ్ట్‌ విధానం 
16వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహించేందుకు వీలుగా నిర్మాణం 
20 వేల టన్నుల కూలింగ్‌(చల్లదనానికి) కోసం డిస్ట్రిక్ట్‌ కూలింగ్‌ విధానం 
రూఫ్‌టాప్‌ హెలిపాడ్‌ 
పర్యావరణహితమైన ఐజీబీసీ ప్లాటినం రేటింగ్‌ లక్ష్యంతో నిర్మాణం 
వేగవంతమైన గాలులు, భూకంపాలు తట్టుకునే సామర్థ్యం

26ap-main7d.jpg

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
×
×
  • Create New...