Jump to content

Recommended Posts

Posted
హ్యాపీనెస్ట్‌ ‘హౌస్‌’ఫుల్‌!
11-12-2018 02:40:19
 
636800928202768934.jpg
  • 129 నిమిషాల్లోనే 900 బుకింగ్స్‌
  • హాట్‌ కేకుల్లా అమ్ముడైన ఫ్లాట్లు
  • రెండో విడతలోనూ భలే డిమాండ్‌
  • దేశవిదేశాల్లోనూ అమోఘ స్పందన
అమరావతి, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): హ్యాపీనెస్ట్‌లోని ఫ్లాట్లు హాట్‌కేకులని మరోసారి రుజువైంది. ఏపీసీఆర్డీయే ఆధ్వర్యంలో అమరావతిలో ప్రప్రథమంగా నిర్మితమవుతున్న ఈ ప్రజానివాస సముదాయానికి దేశవిదేశాల నుంచి విశేష స్పందన లభించింది. నవంబరు 9న తొలి విడత ఆన్‌లైన్‌ బుకింగ్‌లో 300 ఫ్లాట్లు సాయంత్రానికల్లా అయిపోగా.. సోమవారం రెండో విడతలో భాగంగా అందుబాటులో ఉంచిన 900 ఫ్లాట్లు 129 నిమిషాల్లోనే ఫుల్లయిపోయి రికార్డులు సృష్టించాయి. దీంతో హ్యాపీనె్‌స్టకు విపరీతమైన డిమాండ్‌ ఉందని మరోసారి రుజువైంది. తెలుగు రాష్ట్రాల్లోని వారే కాకుండా ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో నివసిస్తున్న వారు కూడా ఆసక్తి చూపడంతో ఉదయం 9 గంటలకు మొదలైన బుకింగ్‌ ప్రక్రియ 11.09 గంటలకల్లా పూర్తయిపోయింది!
 
 
15 నిమిషాల్లోనే 600 ఫ్లాట్లు!
రాజధాని నగరంలోని నేలపాడు వద్ద నిర్మించనున్న హ్యాపీనె్‌స్టలో తొలి దఫా బుకింగ్‌ సందర్భంగా సీఆర్డీయే సర్వర్‌ పలుసార్లు మొరాయించింది. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పెద్దఎత్తున విమర్శలు రావడంతో ఈసారి అధికారులు సీఆర్డీయే సర్వర్‌ సామర్థ్యాన్ని, బ్యాండ్‌ విడ్త్‌ను రెండు రెట్లు పెంచారు. అలాగే వివిధ బ్యాంకులు, ఈ-సేవా కేంద్రాల నుంచి కూడా బుక్‌ చేసుకునే వీలు కల్పించారు. ఫలితంగా ఆన్‌లైన్‌ బుకింగ్‌ ప్రారంభమైన తొలి 15 నిమిషాల్లోనే ఏకంగా 600 ఫ్లాట్లు బుక్కయిపోయాయి. అరగంటలో 742 ఫ్లాట్లు ఫుల్‌అయ్యాయి. తొలి ఫ్లాట్‌ను విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌ డెస్క్‌ ద్వారా ఆ నగరానికే చెందిన పద్మ బుక్‌ చేసుకున్నారు!
 
అధికారుల అండతో.. కావాల్సిన ఫ్లాట్లు!
కొందరు అధికారులు కొంతమందిని నేరుగా లోపలికి తీసుకెళ్లి వారికి కావాల్సిన ఫ్లాట్లను బుక్‌ చేయించినట్లు తెలిసింది. అనేకమంది గంటల తరబడి లైన్లో నిలబడి, టోకెన్లు పొంది లోనికి వెళ్తుంటే.. పైన పేర్కొన్న కొందరు మాత్రం ఇలా అధికారుల అండతో ఫ్లాట్లను బుక్‌ చేయించుకోవడం విమర్శలకు తావిస్తోంది. ఈ అనుభవంతో ప్రభుత్వం ఇకముందు నిర్వహించే ఇలాంటి బుకింగ్స్‌లో ‘షార్ట్‌కట్స్‌’కు ఆస్కారం లేకుండా గట్టి చర్యలు తీసుకోవాలని కొందరు కోరుతున్నారు.
 
 
త్వరలోనే హ్యాపీనెస్ట్‌ - 2, 3: శ్రీధర్‌
హ్యాపీనెస్ట్‌-1 ప్రాజెక్ట్‌లోని 1200 ఫ్లాట్లను బుకింగ్‌ చేసుకోలేక నిరుత్సాహపడుతున్న వారికి ఏపీసీఆర్డీయే శుభవార్త చెప్పింది. త్వరలోనే హ్యాపీనెస్ట్‌- 2, 3 ప్రాజెక్ట్‌ల నిర్మాణానికి చర్యలు తీసుకోబోతున్నట్లు ఏపీసీఆర్డీయే కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ వెల్లడించారు. హాపీనెస్ట్‌-1 ఆన్‌లైన్‌ బుకింగ్‌కు విశేష స్పందన లభించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆదేశానుసారం త్వరలోనే మరో రెండు ప్రాజెక్టులు ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. హ్యాపీనెస్ట్‌-1కి సంబంధించిన టెండర్లను వారంలో పిలుస్తామని, ఏపీ రెరా నిబంధనల ప్రకారం ఈ ప్రాజెక్ట్‌కు 36 నెలల గడువున్నప్పటికీ 24 మాసాల్లోనే పూర్తి చేస్తామన్నారు.
 
 
హ్యాపీనెస్ట్‌కు విశేష స్పందన: నారాయణ
అమరావతిలో నిర్మిస్తున్న హ్యాపీనెస్ట్‌ అపార్ట్‌మెంట్ల బుకింగ్‌కు విశేష స్పందన లభించిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆన్‌లైన్‌ బుకింగ్‌ ఓపెన్‌ చేసిన రెండు గంటల్లోనే 900 ఫ్లాట్లు బుక్‌ అయ్యాయని చెప్పారు. రెండో విడత బుకింగ్‌కు ప్రపంచ వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. అమరావతిలో చేపట్టిన రూ.35వేల కోట్ల పనులలో ఇప్పటికే 40 శాతం నిర్మాణాలు పూర్తయ్యాయని, ఏప్రిల్‌ నాటికి వంద శాతం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకుడు జగన్‌ మాత్రం అమరావతిపై అసత్య ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
Posted
హైకోర్టు నిర్మాణం..శరవేగం..!
12-12-2018 08:00:05
 
636801984064337099.jpg
  • సిద్ధమవుతున్న 23 కోర్టు హాళ్లు
  • నిర్మాణ పనుల్లో 1,600 మంది కార్మికులు
  • పార్కింగ్‌ ప్రదేశం చదును
  • న్యాయమూర్తులకు ప్రత్యేక మార్గం
  • రాజస్థాన్‌ రాయితో ఆకర్షణీయంగా బాహ్య భాగం
తుళ్లూరు : అమరావతి రాజధానిలో హైకోర్టు నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. నేలపాడు రెవెన్యూలో ఈ పనులు పగలు రాత్రి జరుగుతున్నాయి. రోజు 1,600మంది కార్మికులు నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యారు. భవనం లోపల 23 కోర్టు హాళ్లు రూపుదిద్దుకుంటున్నాయి. గ్రౌండు ఫ్లోర్‌లో పోస్టాఫీసు, బ్యాంకు ఉండబోతున్నాయి.
 
హైకోర్టు వెలుపల రాజస్థాన్‌ రాయితో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. క్లాక్‌ టవర్‌ నిర్మాణ పనులు తుదిదశకు వచ్చాయి. 14 కోర్టు హాళ్లు వేగంగా సిద్ధం చేయాలని ప్రభుత్వం నుంచి నిర్మాణ సంస్థకు ఆదేశాలు అందినట్టు సమాచారం. డిసెంబరు ఆఖరుకల్లా హైకోర్టు పరిపాలన ప్రారంభం కావాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. 2.50 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణపనులు జరుగుతున్నాయి. ఎల్‌అండ్‌టీ కంపెనీ రూ.105 కోట్లతో జీ ప్లస్‌ 2తో ఈ హైకోర్టు నిర్మాణ పనులు చేస్తోంది. ఉత్తరభాగంలో అతి పెద్ద పబ్లిక్‌ పార్కింగ్‌ ప్లేస్‌ సిద్ధం చేస్తున్నారు. ఆ ప్రదేశానంతటినీ చదును చేసి ఉంచారు. న్యాయమూర్తులు రావటానికి ప్రత్యేక దారిని ఏర్పాటు చేస్తున్నారు. సరాసరి కోర్టులోకి న్యామూర్తుల వాహనాలు వెళ్లటానికి పార్కింగ్‌ ప్రదేశం ఏర్పాటు చేస్తున్నారు. పబ్లిక్‌ రావటానికి మరో దారిని ఏర్పాటు చేస్తున్నారు.
 
ప్రస్తుతం నిర్మిస్తున్న తాత్కాలిక హైకోర్టు (భవిష్యత్‌లో ఇందులో సిటీ సివిల్‌ కోర్టులు ఉంటాయి) ఎదురుగా న్యాయమూర్తుల బంగ్లాల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పౌండేషన్‌ పనులు దాటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. డిసెంబరులో హైకోర్టు ప్రారంభిస్తే న్యాయమూర్తులు ఎక్కడ ఉండాలి అనే దాని మీద ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందుకోసం తాడేపల్లి బైపాస్‌ రోడ్డులో అపార్ట్‌మెంట్లు పరిశీలించారు. ఫ్రీకాస్ట్‌ టెక్నాలజీతో నిర్మాణ పనులు జరుగుతుండటంతో అనుకున్న సమయానికి పూర్తి చేయటానికి అవకాశం ఉందని అధికారులు చెపుతున్నారు. మొత్తం మీద డి సెంబరు లేదా జనవరి నుంచి రాజధాని అమరావతిలో హైకోర్టు కొలువుదీరనుంది.
Posted
హ్యాపీనెస్ట్‌-2కి ముఖ్యమంత్రి అనుమతి 

 

తొలి ప్రాజెక్టుకు అనూహ్య స్పందన 
దేశవిదేశాల నుంచి తీవ్ర పోటీ 
12ap-main2a_1.jpg

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో ప్రజలకు విక్రయించేందుకు సీఆర్‌డీఏ చేపట్టిన గృహ నిర్మాణ ప్రాజెక్టు ‘హ్యాపీనెస్ట్‌’కు అనూహ్య స్పందన రావడంతో వెంటనే మరో ప్రాజెక్టుకు సన్నాహాలు చేసుకోడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకారం తెలిపారు. మరో ప్రాజెక్టు చేపడితే ముందస్తు రుసుము చెల్లించడానికి 3,394 మంది ఆన్‌లైన్‌లో సిద్ధంగా ఉన్నారని సీఆర్‌డీఏ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాజధాని పనుల పురోగతిపై ముఖ్యమంత్రి బుధవారం సీఆర్‌డీఏ, ఏడీసీ అధికారులతో సమీక్షించారు. 14.46 ఎకరాల్లో నిర్మించే హ్యాపీనెస్ట్‌ ప్రాజెక్టులోని 1200 ఫ్లాట్లకు రెండు విడతల్లో బుకింగ్‌ నిర్వహించగా అనూహ్య స్పందన వచ్చిందని సీఆర్‌డీఏ కమిషనర్‌ చెరుకూరి శ్రీధర్‌ వివరించారు. నవంబరు 9న 300 ఫ్లాట్లకు, డిసెంబరు 10న మరో 900 ఫ్లాట్లకు బుకింగ్‌ నిర్వహించగా ప్రపంచం నలుమూలలనుంచీ పోటీ పడ్డారని అన్నారు. రెండో విడతలో 900 ఫ్లాట్ల బుకింగ్‌ రెండు గంటల్లోనే పూర్తవడం ఆశ్చర్యపరిచిందని తెలిపారు.

సచివాలయ టవర్లకు 19న ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ 
అమరావతిలో నిర్మిస్తున్న సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాలకు ఈ నెల 19న ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌(పునాది) పనులు ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. మొత్తం ఐదు టవర్లుగా సచివాలయ భవనాలను నిర్మిస్తారు. ఒక్కో టవర్‌కు 13 మీటర్ల లోతు నుంచి ఫౌండేషన్‌ నిర్మిస్తున్నారు. ఫౌండేషన్‌ మందం నాలుగు మీటర్లు ఉంటుంది. ఒక్కో టవర్‌ ఫౌండేషన్‌కు 12 వేల ఘనపు మీటర్ల కాంక్రీట్‌ వినియోగిస్తారు. ఇది దేశంలోనే అత్యంత భారీ ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌గా అరుదైన ఘనత నమోదు చేసుకోనుందని సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు.

 

Posted
అమరావతిలో హైకోర్టు పనులను పరిశీలించిన నారాయణ
13-12-2018 14:46:41
 
636803092031086591.jpg
అమరావతి: ఏపీ రాజధాని అమరావతితో నిర్మిస్తున్న హైకోర్టు పనులను రాష్ట్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఫ్రీ కాస్ట్ టెక్నాలజీతో హైకోర్టు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ఈ నెల 31కి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలకు, రైతులకు ఇచ్చిన ప్లాట్లలో రోడ్ల నిర్మాణ పనులు 1600 కిలోమీటర్లు పూర్తయ్యాయని, మార్చి 31కి పూర్తయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి చెప్పారు. రాజధాని నిర్మాణ పనులపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు చూసి మాట్లాడాలని హితవుపలికారు.
 
ఈ నెల 15వ తేదీ నుంచి ప్రజాప్రతినిధులు, విద్యార్థులకు రాజధాని అమరావతి సందర్శనకు అవకాశం కల్పిస్తామని నారాయణ అన్నారు. రోజుకు 25 బస్సుల్లో వెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. నీరుకొండపై నిర్మిస్తున్న ఎన్టీఆర్ విగ్రహాన్ని రాగితో నిర్మిస్తామని, మరో మూడు నెలల్లో పనులు మొదలుపెడతామన్నారు. ఏపీ పై కక్షపూరితంగా వ్యవహరిస్తున్న బీజేపీకి 2019 ఎన్నికల్లో ప్రజలు తగిన విధంగా గుణపాఠం చెప్తారని నారాయణ అన్నారు.
Posted

Guntur District @gunturgoap Dec 12

 
 

అమరావతి రాజధానిలో హైకోర్టు నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. నేలపాడు రెవెన్యూలో ఈ పనులు పగలు రాత్రి జరుగుతున్నాయి. రోజు 1,600మంది కార్మికులు నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యారు. భవనం లోపల 23 కోర్టు హాళ్లు రూపుదిద్దుకుంటున్నాయి. గ్రౌండు ఫ్లోర్‌లో పోస్టాఫీసు, బ్యాంకు ఉండబోతున్నాయి.

DuNt_YlU4AASKVu.jpg
Posted
ఇదో బృహత్తర యజ్ఞం..
సచివాలయ పునాది పటిష్ఠం!
19న ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ని కాంక్రీట్‌తో నింపే కార్యక్రమం
ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు
13ap-story5a.jpg

ఈనాడు, అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముఖ్య ఘట్టం ఆవిష్కృతమవుతోంది. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌(పునాది)ని కాంక్రీటుతో నింపే బృహత్తర కార్యక్రమాన్ని ఈ నెల 19న ప్రారంభించనున్నారు. సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల్ని ఐదు టవర్లుగా నిర్మిస్తుండగా.. వాటిలో రెండో టవర్‌ పునాదిని కాంక్రీటుతో నింపే ప్రక్రియను ఇపుడు ప్రారంభిస్తారు. మూడున్నర రోజులపాటు ఏకబిగిన ఈ కార్యక్రమం భారీ క్రతువులా కొనసాగనుంది. వందలాది ఇంజినీర్లు, కార్మికులతో పాటు భారీసంఖ్యలో వాహనాలు, యంత్రాల్ని వినియోగించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. మూడో టవర్‌కి 22న, సీఎం కార్యాలయం ఉండే ఐదో టవర్‌కి 24న పునాదుల్లో కాంక్రీటు నింపే ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. కొద్ది రోజుల వ్యవధిలో మిగతా రెండు టవర్లకూ ఆ పనులు పూర్తిచేస్తారు. కీలక ఘట్టాన్ని ఎలాంటి అవాంతరాలు లేకుండా పూర్తిచేసేందుకు సీఆర్‌డీఏ అన్ని సన్నాహాలూ చేస్తోంది. వీటిలో ముఖ్యమంత్రి కార్యాలయ భవనం ఉండే టవర్‌ని 50, మిగతా నాలుగు టవర్లను 40 అంతస్తులుగా నిర్మిస్తున్నారు. ఈ భవనాలకు పునాదుల నిర్మాణమే అనేక విశేషాల సమాహారం.

ఒక్కో టవర్‌కి ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ కోసం...
ప్రతి టవర్‌కి సుమారు 12వేల ఘ.మీ.ల కాంక్రీటు వేయాల్సి ఉంటుంది. ‘ఎం45’ టెంపరేచర్‌ కంట్రోల్డ్‌ కాంక్రీటు వినియోగిస్తారు. ఎం45 కాంక్రీటు బలాన్ని తెలియజేస్తుంది. సాధారణ నిర్మాణాల్లో ఎం30 కాంక్రీటు వినియోగిస్తారు

ప్రతి ఫౌండేషన్‌కి 84 గంటలు..!
ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ పనుల్ని క్రతువులా కొనసాగించాల్సి ఉంటుంది. ఒక్కసారి కాంక్రీటు వేయడం ప్రారంభించాక నిరంతరాయంగా పూర్తిచేయాల్సిందే. సచివాలయ భవనాల ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌కు ఒక్కో టవర్‌కి 84 గంటల సమయం పడుతుందని భావిస్తున్నారు.

* సచివాలయ భవనాల్లో 1, 2 టవర్లను షాపూర్జీ పల్లోంజీ,  3, 4 టవర్లను ఎల్‌ అండ్‌ టీ, ఐదో టవర్‌ని ఎన్‌సీసీ సంస్థలు నిర్మిస్తున్నాయి.
* సీఆర్‌డీఏ తరఫున చీఫ్‌ ఇంజినీర్‌ ఎం.వి.రావు, సూపరెంటెండింగ్‌ ఇంజినీరు షేక్‌ జానీబాషా పనులు పర్యవేక్షిస్తున్నారు.

ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ అంటే
నేల స్వభావం, భవన పరిమాణాల దృష్ట్యా ఎలాంటి పునాది వేయాలో నిర్ణయిస్తారు. రాజధానిలో ఇప్పటి వరకు చేసిన నిర్మాణాలకు పైల్‌ ఫౌండేషన్‌ విధానం అనుసరించగా, సచివాలయ భవనాలకు ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌ వేస్తున్నారు. ఈ విధానంలో నేలలో అవసరమైనంత లోతు తవ్వి.. అక్కడి నుంచి భారీ కాంక్రీటు దిమ్మను నిర్మిస్తారు. దానిపై భవన నిర్మాణం జరుగుతుంది. ఆ కాంక్రీటు దిమ్మనే ర్యాఫ్ట్‌ ఫౌండేషన్‌గా పిలుస్తారు.

Posted

CleanMax Solar to install rooftop unit for AP Secretariat

cleanMax Solar is set to install a 842 kWp rooftop solar power unit at the Andhra Pradesh Secretariat in the upcoming Greenfiled capital city of Amaravati.

The project is being installed in partnership with the Andhra Pradesh Capital Region Development Authority (APCRDA). The solar project is the first Power Purchase Agreement signed as a part of the tender awarded by New & Renewable Energy Development Corporation of Andhra Pradesh Ltd. (NREDCAP) to CleanMax Solar. The plant will be spread across seven buildings , including the Chief Minister’s Office Building and AP Assembly, among others.

The project is based on the Resco (renewable service company) and Opex (Operational expense) model.

The unit is expected to generate 12.4 lakh units per annum, with estimated saving on electricity bills to be Rs 42 lakh per annum for the next 25 years. The plant will abate 1026 tonnes of CO2 emission annually, equivalent to planting 24,360 trees.

Andrew Hines, Co-founder, CleanMax Solar in a statement said, “Amaravati has been envisioned as a truly global city, and we are part of making it a sustainable city as well. Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu has laid special emphasis on driving sustainability by sourcing a large portion of its energy requirement from renewable energy.”

“CleanMax Solar will equip the city with one of its first solar projects, to meet 25% of AP Secretariat’s power requirement through sustainable solar power,” he said. It recently installed a 2MWp solar plant for Hindustan Shipyard Ltd in Andhra Pradesh. Once the Secretariat project is operational, the company projects will be abating 6168 tonnes of CO2 annually, via 4.3 MW of rooftop solar projects across 5 locations in Andhra Pradesh.

 
Published on December 13, 2018

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   1 member

×
×
  • Create New...