sonykongara Posted July 26, 2018 Author Posted July 26, 2018 (edited) http://www.hccindia.com/whitepaper_pdf/2014/polavaram-canal-package-III-august-2014.pdf Edited July 26, 2018 by sonykongara
APDevFreak Posted August 9, 2018 Posted August 9, 2018 pattiseema lekapothe manam jumpega...opposition ekki digedi..
sonykongara Posted November 20, 2018 Author Posted November 20, 2018 పట్టిసీమ మురిసింది.. పంట పండింది..జిల్లాలో గణనీయంగా పెరిగిన దిగుబడులు పట్టిసీమ నీరు పరవళ్లు తొక్కింది.. పంట సిరులు కురిపించింది.. ఖరీఫ్ కృషి ఫలించింది.. కృష్ణా డెల్టా మురిసిపోయింది.. దిగుబడుల్లో గణనీయమైన మార్పు కనిపించింది.. విస్తుపోయేలా విస్తీర్ణం పెరిగింది. సాగుపై ఆశలను సజీవంగా నిలిపింది. చివరి క్షణంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉంటే రైతన్న పంట పండినట్లే. గొడుగుపేట(మచిలీపట్నం), న్యూస్‌టుడే శ్రీశైలం, నాగార్జునసాగర్‌ల నుంచి నీళ్లు రాకపోయినా పట్టిసీమ ఉందన్న భరోసాతో కృష్ణా డెల్టాలో అన్నదాతలు సాగు చేస్తున్నారు. నీటి సరఫరాలో కొద్దిపాటి ఇబ్బందులు తలెత్తినా వారు ఆశించిన విధంగా పట్టిసీమ నీరు మాత్రమే సాగు అవసరాలు తీర్చుతుంది. పెరిగిన సాగు విస్తీర్ణం* జిల్లా వ్యాప్తంగా గతేడాది ఖరీఫ్‌లో 2.35 లక్షల హెక్టార్లలో వరి సాగు అవుతుందని వ్యవసాయశాఖ అంచనాలు సిద్ధం చేసింది.* 2,36,036 లక్షల హెక్టార్లలో సాగయ్యింది. మొత్తం 3.18 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు వేశారు. ఈ ఏడాది ఎన్నడూ లేని విధంగా లక్ష్యానికి మించి సాగై రాష్ట్రంలోనే ముందంజలో ఉంది. ఈ ఖరీఫ్‌లో ముందస్తుగా సాగు నీటిని విడుదల చేశారు. కష్టం ఫలించి వివిధ పంటల సాగు విస్తీర్ణం 3.23 లక్షల హెక్టార్లు. లక్ష్యానికి మించి 3.31 లక్షల హెక్టార్లు సాగయ్యింది.* బందరు మండల పరిధిలోని పెదపట్నం, కానూరు, తాళ్లపాలెం, గూడూరు మండలం జక్కంచర్ల, కల్పటం, పినగూడూరులంక, ముక్కొల్లు, పెడన మండలంలోని జింజేరు, అచ్చయ్యవారిపాలెం, బంటుమిల్లి, కృత్తివెన్ను తదితర మండలాల పరిధిలో శివారు ప్రాంతాలకు నీళ్లు అందేవి కావు. ఈసారి నీళ్లు అందించేలా చర్యలు తీసుకున్నారు.పట్టిసీమే ఆధారం* జిల్లాలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాల కారణంగా వివిధ ప్రాజెక్టుల ద్వారా ఎగువ నుంచి వచ్చే నీటితోనే రెండు పంటలు పండించేవారు. ఖరీఫ్, రబీలతోపాటు కొన్ని ప్రాంతాల్లో మూడో పంటగా అపరాలు వేసేవారు.* బీంనది కాలువల పరిధిలోని 5 కిలోమీటర్ల మేర ఉన్న పంట కాలువ వెంబడి ఉన్న ఆయకట్టులోని శివారు ప్రాంత పొలాల్లో వందలాది ఎకరాలు సాగు కావడం లేదు. ఈ ఏడాది నీటిపారుదల శాఖ డీఈ రాజ్‌కుమార్ చొరవ తీసుకొని కాలువ పూడిక తొలగించడంతోపాటు నీటికి అడ్డుకట్ట వేశారు. అక్కడ కూడా ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగింది.పెరిగిన దిగుబడులు* గోదావరి జలాల కారణంగా జిల్లా అంతటా దిగుబడులు కూడా ఏటా పెరుగుతూ వస్తున్నాయి. 2015లో ఎకరానికి 27 బస్తాల దిగుబడి వస్తే ప్రస్తుతం వ్యవసాయాధికారుల అంచనాలను బట్టి 35 నుంచి 40 బస్తాల దిగుబడి రానుంది. ఈ ఏడాది సాగు ముందుగా ప్రారంభించడంతోపాటు అంతర పంటలు పెరగడంతో దిగుబడులు పెరుగుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. *మచిలీపట్నం, పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, గుడ్లవల్లేరు, పామర్రు, చల్లపల్లి, ముదినేపల్లి ఇలా ఆయా మండలాల్లో ఇప్పుడిప్పుడే కోతలు ప్రారంభమయ్యాయి.* గత ఖరీఫ్‌లో వరి పంట 14.27 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరగడంతోపాటు దిగుబడులు కూడా ఆశాజనకంగా ఉండటంతో 15.92 లక్షల మెట్రిక్ టన్నులు వస్తాయని అధికారులు లెక్కగట్టారు. *జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న పంట అంచనాల మేరకు 35 నుంచి 40 బస్తాలు దిగుబడులు వస్తున్నట్లు నిర్ధరించారు. సగటున ఎకరానికి 34 బస్తాల చొప్పున లెక్కగడితేనే 15.92 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. అంతకంటే ఎక్కువ వస్తుందని అధికారులు చెబుతున్నారు.* 2015లో సగటున ఎకరానికి 27 బస్తాల దిగుబడి వస్తే 2016లో 30, 2017లో 32, 2018లో 34 బస్తాల చొప్పున దిగుబడి పెరుగుతూ వచ్చింది. ధర కూడా ఆశాజనకంగా ఉండటంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి సహకరిస్తే పండగేవరి పొలాలన్నీ కోతకు సిద్ధంగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే కోతలు ప్రారంభించారు. అన్నదాతలు ఇటీవల వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఆందోళన చెందుతున్నారు. బాగా పండాయిపొలాలన్నీ బాగా పండాయి. అన్ని ప్రాంతాల్లో కూడా ఈ ఏడాది మంచి దిగుబడులు వస్తాయి. పట్టిసీమ నీరు జిల్లాలో రైతులు అందరికీ అండగా ఉంటోంది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ముందుగా నాట్లు వేయడంతో దిగుబడులు బావున్నాయి, అపరాలకు కూడా అనువుగా ఉంటుంది. ఆకాశంలో మబ్బులు కమ్మడం, అడపదడపా వర్షాలు పడటంతో వరి కోతలు కోయాలంటేనే భయంగా ఉంది. పంట ఒడ్డుకు చేరిపోతే ఇంకా భయమే ఉండదు. - పోతన ఏడుకొండలు, రైతు గూడూరు బందరు మండలంలోని పలు ప్రాంతాలతోపాటు పెడన, గూడూరు, బంటుమిల్లి, కృత్తివెన్ను, గుడ్లవల్లేరు, ముదినేపల్లి, చల్లపల్లి, పామర్రు, మొవ్వ ఇలా ఆయా మండలాల్లోని పొలాలు మూడు పంటలతో కళకళలాడుతుండేవి. ఆ తర్వాత] కృష్ణా నదికి ఎగువన పలు ప్రాజెక్టులు రావడంతో బ్యారేజీకి వచ్చే నీరు గణనీయంగా తగ్గిపోయింది. ఘంటసాల మండల పరిధిలోని చిలకలపూడి, రుద్రవరం, మొవ్వ మండలపరిధిలోని కోసూరులోని గ్రామాల్లో 1400 ఎకరాలకుపైగా ఆయకట్టు ఉంది. 35 నుంచి 40 బస్తాల దిగుబడిజిల్లా వ్యాప్తంగా వరిలో మంచి దిగుబడులు వస్తున్నాయి. ఎక్కడ చూసినా ఎకరానికి 35 నుంచి 40 బస్తాల దిగుబడి వస్తోంది. కొన్ని చోట్ల 40 బస్తాలపైబడి వచ్చే పొలాలు కూడా ఉన్నాయి. సగటున 34 బస్తాల చొప్పున లెక్కకట్టాం. కలెక్టర్ లక్ష్మీకాంతం చొరవతో శివారు ప్రాంతాల వరకు పట్టిసీమ జలాలు వెళ్లడంతో సాగు విస్తీర్ణం కూడా పెరిగింది. లక్ష్యానికి మించి సాగు చేయడంలో జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో ఉంది. - మోహనరావు, వ్యవసాయశాఖ సంయుక్త సంచాలకులు అన్ని ప్రాంతాలకు నీరుఅన్ని ప్రాంతాలకు నీరు సక్రమంగా అందించేలా చర్యలు తీసుకున్నాం. మధ్యలో తగినంత రాకపోయినా వంతుల వారీ విధానంతో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా కృషి చేశాం. నీటి ఇబ్బంది సమయంలో రైతులు కొంత ఆగ్రహం వ్యక్తం చేసినా ప్రస్తుతం అందరూ అభినందిస్తున్నారు. ఘంటసాల మండలం చిలకలపూడి, బందరు మండలం చిట్టిపాలెం తదితర ప్రాంతాల్లో ఏళ్ల తరబడి ఉన్న సమస్యలను కూడా పరిష్కరించి శివారు వరకు నీళ్లు వెళ్లేలా చర్యలు తీసుకున్నాం. అవనిగడ్డ ప్రాంతంలో కొంత ఆలస్యంగా సాగు చేయడంతో వాళ్లకు డిసెంబరు నెలాఖరు వరకు కూడా సాగు నీరు ఇవ్వాల్సి ఉంది. ఆ దిశగా కూడా అన్ని చర్యలు తీసుకున్నాం. - రాజ్‌కుమార్, నీటిపారుదలశాఖ డీఈ
vinayak Posted November 20, 2018 Posted November 20, 2018 Krishna Delta Yielding at Record Levels this Kharif Season 2015- 10.7 Metric Tons Yield 2016- 12.29 Metric Tons Yield 2017- 14.27 Metric Tons Yield 2018- 15.92 Metric Tone Yield
AbbaiG Posted December 2, 2018 Posted December 2, 2018 1 hour ago, sonykongara said: Another year draws to a close, and into the history books. 90 TMC. Saahoooo Godavari uplands very very early plantings 48 varaku vachhindi yield. Godavari delta average 38-40 Krishna delta will beat Godavari delta this time in yield
AbbaiG Posted December 2, 2018 Posted December 2, 2018 Coffer dam ayipothe, there will be a chance to send water to krishna upto Sankranti
rk09 Posted December 3, 2018 Posted December 3, 2018 On 12/2/2018 at 1:40 AM, sonykongara said: Super ! Ee year Dec varaku todaru. Godaramma talli ?
Nfan from 1982 Posted December 3, 2018 Posted December 3, 2018 57 minutes ago, rk09 said: Super ! Ee year Dec varaku todaru. Godaramma talli ?
sskmaestro Posted December 3, 2018 Posted December 3, 2018 Hope farmers are not over using fertilizers for high yield.
sonykongara Posted December 5, 2018 Author Posted December 5, 2018 పట్టిసీమ నీళ్లు బంద్05-12-2018 03:00:27 కనిష్ఠ స్థాయికి గోదావరి మట్టం కృష్ణా డెల్టాలో రెండో పంటపై ప్రభావం ఏలూరు/పోలవరం, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): గోదావరి నదిలో అనూహ్యంగా నీటి మట్టం మందగించింది. ఎగువ నుంచి ప్రవాహం తగ్గిపోవడంతో మంగళవారం పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి కృష్ణా, గోదావరి జిల్లాలకు నీటి సరఫరాను నిలిపివేశారు. ఎత్తిపోతలు ఆరంభమైన ఈ నాలుగేళ్లలో.. గోదావరిలో తగు నీటిమట్టం లేక డిసెంబరు మొదటి వారంలోనే నీటి సరఫరా ఆపివేయడం ఇదే ప్రథమం. దీంతో కృష్ణా డెల్టాలో రెండో పంట పండించే అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. మొదటి పంటకు నాలుగేళ్లుగా గోదావరి జలాలు విస్తృతంగా సరఫరా అవుతున్నాయి. పట్టిసీమ ఆరంభంలో అంటే 2015-16లో 4.20 టీఎంసీల నీటిని విడుదల చేయడంతో అప్పట్లోనే 8,08,160 ఎకరాల్లో పంట పండించేందుకు వీలు కుదిరింది. నాటి నుంచి 2016-17లో 55.60 టీఎంసీలతో 10.74 లక్షల ఎకరాలు, 2017-18లోనూ 10.7 లక్షల ఎకరాల్లో సిరులు పండించారు. దీంతో కృష్ణా డెల్టాలో రైతు అప్పుల నుంచి బయటపడ్డాడు. మొదటి పంట దిగుబడులు రికార్డు స్థాయిలో నమోదు కావడంతో రైతులు ఆనందం పట్టలేకపోయారు. ఈ ఏడాది అనూహ్యంగా జూన్ 16న ఎత్తిపోతల నుంచి నీటి విడుదల ఆరంభం కాగా.. రెండో పంటకు నీరు వస్తుందనుకున్నారు. కానీ డిసెంబరు తొలివారంలోనే నీటి విడుదల ఆగిపోయింది. ప్రాజెక్టు పనులే కారణమా..? గోదావరిలో నీటిమట్టం పూర్తిగా పడిపోవడానికి ప్రధాన ప్రాజెక్టు వద్ద జరుగుతున్న నిర్మాణ పనులు ఒకింత కారణంగా చెబుతున్నారు. ఇటీవలే కాఫర్ డ్యాం పనులు చేపట్టడం, ఎగువ నుంచి వచ్చే గోదావరి ప్రవాహాన్ని పైపుల ద్వారా కిందికి మళ్లిస్తున్నారు. ఈ కారణంగా పైపుల నుంచి సమృద్ధిగా నీరు విడుదల కాకపోవడంతో పట్టిసీమ వద్ద గోదావరి మట్టం కనిష్ట స్థాయికి పడిపోయింది.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now