Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

pattiseema

Featured Replies

  • Replies 1.4k
  • Views 208.8k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

  • Yaswanth526
    Yaswanth526

  • jjaggadu antha sadist vubdaremo..Naayalu ki psychological issues vunnattu vunnay..ledanate atu complete ayina projects, start ayina 50% complete ayina polavaram, calital works anni apafam endo. babu g

  • sonykongara
    sonykongara

Posted Images

  • 2 weeks later...
  • 1 year later...
  • Author

పరవళ్లకు పదేళ్లు.. వర్థిల్లు వందేళ్లు!

 

Eenadu icon
By Andhra Pradesh Dist. DeskPublished : 10 Sep 2025 06:14 IST
Ee
Font size
 
 
 
 
2 min read
 
 

బాబు సంకల్ప ఫలం.. పట్టిసీమ జలాలు దరిచేరి దశాబ్దం

2a_942.webp

హనుమాన్‌ జంక్షన్, న్యూస్‌టుడే: తెదేపా ప్రభుత్వం 2014లో ఏర్పడ్డాక పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని తెరపైకి తెచ్చింది. ఓ వైపు ఆ పథకం, మరోవైపు పోలవరం కుడి కాలువ నిర్మాణాలను ఏకకాలంలో చేపట్టి శరవేగంగా పూర్తిచేసింది. నాటి నుంచి కృష్ణా డెల్టాకు పట్టిసీమ ఆపద్బాంధవిగా మారింది. గోదావరి జలాలను కృష్ణా నదితో అనుసంధానం చేసి, ఖరీఫ్‌లో డెల్టా ఆయకట్టుకు నీటి ఎద్దడనే మాటే లేకుండా చేసింది. ఈ ప్రక్రియ సాకారమై పదేళ్లు.

89 రోజులు: 2015 ఖరీఫ్‌ నాటికి పట్టిసీమ ద్వారా డెల్టాకు నీరందించాలని నాడు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ప్రయత్నించారు. పోలవరం కుడి కాలువ పనులు కొలిక్కి రాక, గోదావరి నీరు అందుబాటులోకి రాకుండా పోయింది. అయినా పట్టుదలతో యంత్రాంగాన్ని శ్రమింపజేసి అదే ఏడాది సెప్టెంబరు 8న ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడుదల చేయగా, 9న ఉమ్మడి కృష్ణా జిల్లాలోకి ప్రవేశించాయి. మొత్తంగా ఆ ఏడాది 89 రోజుల పాటు 8.3 టీఎంసీల నీటిని కృష్ణానదికి మళ్లించి, డెల్టాలో సాగు, తాగు అవసరాలు తీర్చారు. 

428 టీఎంసీలు: 2016 ఖరీఫ్‌కు పోలవరం కుడి కాలువను పూర్తి స్థాయిలో సిద్ధం చేసి నీటిని విడుదల చేశారు. ఆ ఏడాది మొత్తం 138 రోజుల పాటు కృష్ణా నదికి 55.65 టీఎంసీలు మళ్లించారు. మొత్తంగా 2015-19 మధ్య 263 టీఎంసీలు ఇవ్వగలిగారు. వైకాపా అధికారంలోకి వచ్చాక.. కుట్రతో మొదటి రెండేళ్లు నీరివ్వకుండా ఉండేందుకు ప్రయత్నించింది. పరిస్థితుల ప్రభావం, రైతుల ఒత్తిడితో నీరు విడుదల చేయక తప్పలేదు. 2019-24 మధ్య 165 టీఎంసీలు మళ్లించారు.

ఈ ఏడాది స్వల్పం: ఈ ఏడాది జులై 3న పట్టిసీమ నుంచి పోలవరం కుడి కాలువకు నీరు విడుదల చేశారు. అనంతరం భారీగా వర్షాలు పడటం, కృష్ణానదికి ఎగువ నుంచి వరద వచ్చి చేరడంతో పట్టిసీమకు విరామం ఇచ్చారు. మొత్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 11.05 టీఎంసీల నీరు గోదావరి నుంచి కృష్ణానదికి చేరింది. 

వివరాలు ఇలా..

  • పట్టిసీమ నుంచి కృష్ణానది వరకు పోలవరం కుడి కాలువ పొడవు-188 కి.మీ
  • మొత్తం పంపులు- 24
  • ఇప్పటి వరకు మళ్లించిన నీరు- 439 టీఎంసీలు 
  • 2 weeks later...
  • Author

Pattiseema: ఒక దశాబ్దపు విజయగాథ పట్టిసీమ

 

Eenadu icon
By Andhra Pradesh News DeskPublished : 22 Sep 2025 03:42 IST
Ee
Font size
 
 
 
 
3 min read
 
 

ఖర్చు రూ.2,722 కోట్లు
పంట ఉత్పత్తి రూ.18 వేల కోట్ల పైమాటే
లక్షల మందికి తాగునీరు అదనం
కృష్ణాలో వరద ఉన్నా ఆదుకున్న పథకం

ap210925main1a.webp

పట్టిసీమ నుంచి పోలవరం కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకు వెళ్తున్న జలాలు  

ఈనాడు, అమరావతి: పట్టిసీమ ఎత్తిపోతల మాట వినని సామాన్యుడు లేడు. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు అప్పట్లో అదో పెద్ద వివాదం. ఆ పథకంపై రాజకీయాలు ఏ స్థాయిలో ముసురుకున్నాయో తెలియంది కాదు- ఎలా వివాదం సృష్టించారో కూడా మరిచిపోలేదు. పట్టిసీమ ఎత్తిపోతల నిర్మించి సరిగ్గా పదేళ్లు పూర్తయింది. విమర్శలు ఎదుర్కొన్న పథకమే విజయవంతమై.. డెల్టా రైతులకు వరంలా మారింది. పట్టిసీమ నుంచి దశాబ్ద కాలంలో 439 టీఎంసీల జలాలు కృష్ణా డెల్టాకు సరఫరా చేశారు. ఒక టీఎంసీ నీటితో 10 వేల ఎకరాలు వరి సాగు చేయొచ్చు. ఈ లెక్కన 43.90 లక్షల ఎకరాల్లో వరి సాగు సాధ్యమైంది. ఎకరానికి సగటున 30 బస్తాల దిగుబడి తీసుకున్నా.. సగటు ధర ప్రకారం వచ్చిన ఫలం రూ.18 వేల కోట్లపైనే.

నాటి విమర్శలు

  • గోదావరి నుంచి 80 టీఎంసీల వరద జలాలు తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజిలో ఎక్కడ నిల్వ చేస్తారు? బ్యారేజి సామర్థ్యం 3.071 టీఎంసీలే. 
  • కృష్ణా, గోదావరి నదులకు నైరుతి రుతుపవనాల కాలంలోనే ఒకేసారి వరదలు వస్తాయి. గోదావరిలో వరద ఉన్నప్పుడే పట్టిసీమ నుంచి నీళ్లు ఎత్తిపోయగలరు. అప్పుడు కృష్ణాలోనూ వరద ఉంటుంది. నీళ్లు ఎలా తీసుకువస్తారు?
  • గోదావరిలో జులై, ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో 90 రోజులే వరద వస్తుంది. కృష్ణాలో అవే నెలల్లో వరద వస్తుంది. పట్టిసీమ నుంచి 80 టీఎంసీలు తీసుకురావాలంటే  109 రోజుల వరద రావాలి. తప్పుడు మాటలు ఎందుకు చెబుతారు? 
  • ఇవన్నీ నాడు జగన్‌ చెప్పిన మాటలు

10 ఏళ్లలో ఏం జరిగింది?

2016 నాటికి పూర్తి స్థాయిలో ఈ ఎత్తిపోతలను వినియోగంలోకి తీసుకొచ్చారు. రోజుకు 8,500 క్యూసెక్కుల గోదావరి వరద జలాలు మళ్లించేలా నిర్మాణం పూర్తయింది. 2015లో పాక్షికంగా నిర్మాణం పూర్తి చేసి ఇచ్చిన 4.20 టీఎంసీలతో పాటు ఆ తర్వాత 10 ఏళ్లలో కృష్ణా డెల్టాకు తాగు, సాగునీటి అవసరాల కోసం పట్టిసీమ 439.534 టీఎంసీలు అందించింది.


అదనుకు ఆదుకున్న పట్టిసీమ 

డిచిన 10 ఏళ్లలో కృష్ణాలో ప్రకాశం బ్యారేజి నుంచి ఎంత నీరు సముద్రంలోకి పోయింది? ఆ ఏడాది పట్టిసీమ నుంచి ఎంత నీరు తరలించి కృష్ణా డెల్టాలో వినియోగించారో పరిశీలిస్తే ఈ విషయం అర్థం చేసుకోవచ్చు. కృష్ణాలో వృథా జలాలు ఉన్నా కొన్ని సార్లు 120 రోజుల పంట కాలంలో అవి అదనుకు రావు. అందుకే పట్టిసీమ నుంచి తెచ్చిన నీరు పంటలను కాపాడేందుకు పనికొచ్చేది. 

  • నీటి సంవత్సరం అంటే ఆ ఏడాది జూన్‌ నుంచి మరుసటి ఏడాది మే నెలాఖరు వరకు
  • పట్టిసీమ వినియోగించేది ఒక ఏడాది జూన్‌ నుంచి అదే ఏడాది నవంబరు వరకు.. అంటే గోదావరిలో వరద ఉన్నప్పుడు మాత్రమే.

ఈ పథకానికి ఎంత ఖర్చయింది?

  • ఈ ఎత్తిపోతల నిర్మాణానికి సవరించిన అంచనా సుమారు రూ.1,900 కోట్లు
  • పదేళ్లలో నిర్వహణ వ్యయం రూ.48.95 కోట్లు
  • విద్యుత్తు ఛార్జీలు రూ.773.15 కోట్లు

ap210925main1b.webp

 
  • 5 months later...

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.