Jump to content

pattiseema


Recommended Posts

పట్టిసీమ అవసరమా.. కాదా?: దేవినేని
 
అమరావతి, (ఆంధ్రజ్యోతి): దమ్ము, ధైర్యం ఉంటే జగన్‌ తన ప్రశ్నకు సమాధానం చెప్పాలని మంత్రి దేవినేని ఉమ సవాల్‌ చేశారు. పట్టిసీమ అవసరమో కాదో జగన్‌ చెప్పాలని డిమాండ్‌ చేశారు. పట్టిసీమ ద్వారా 58 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణాకు తెచ్చామని తెలిపారు. పోలవరం ఆపడానికి జగన్‌ ఛత్తీ్‌సగఢ్‌, ఒడిసా రాష్ట్రాల ఎంపీలకు సమాచారం అందించి పార్లమెంట్‌లో ప్రశ్నలు వేయిస్తున్నాడని ఆరోపించారు. కో ర్టులో కేసులు వేయించడానికి కోట్లు ఖర్చు పెడుతున్నాడని తెలిపారు. కేసులు వేయించడానికి ఇతర రాష్ట్రాల ఎంపీల వద్దకువిజయసాయిరెడ్డినే పంపుతున్నాడని చెప్పారు.
Link to comment
Share on other sites

"storage lekunda pattiseema valla use enti ?" -- Jagan

"samudram lo kalapataaniki pattiseema nu kattaru" -- VaasiReddy Padma

 

pattiseema capacity 8500 cusecs. Canal capacity(out flow) at Prakasam barrage is around 17000 cusecs(east & west combined). inka storage avasaram enti (vunte better ofcourse - 2 weeks floods waste kakunda vundevi plus there are other benefits). 

 

eeme boss kante rendu aakulu ekkuva chadivinatlundi. minimum logics kuda panicheyyav anukunta. ee gang ki. 

Did the host contradict/question her logic or not? 

Link to comment
Share on other sites

"storage lekunda pattiseema valla use enti ?" -- Jagan

"samudram lo kalapataaniki pattiseema nu kattaru" -- VaasiReddy Padma

 

pattiseema capacity 8500 cusecs. Canal capacity at Prakasam barrage around 17000 cusecs(east & west combined). inka storage avasaram enti (vunte better ofcourse - 2 weeks floods waste kakunda vundevi). 

 

eeme boss kante rendu aakulu ekkuva chadvinatlundi. minimum logics kuda panicheyyav anukunta. ee gang ki. 

Did the host contradict/question her logic or not? 

 

see this, bakkodiki entha kovvo, aadu aadi vaagudu.. thokki naara thiyyaali..

Link to comment
Share on other sites

deeni valla benefit ayina farmers antha CBN ki vote vestarani nakaithe nammakam ledu.

 

okko saari vaalla karma vaallistam anipisthundhi, inkosaari manam kuudaa effect avuthaam chacchinattu pracharam cheskoni nachcha cheppukovaalsina avasaram vundhi anpisthundhi.. 

Link to comment
Share on other sites

okko saari vaalla karma vaallistam anipisthundhi, inkosaari manam kuudaa effect avuthaam chacchinattu pracharam cheskoni nachcha cheppukovaalsina avasaram vundhi anpisthundhi..

additional benefit with pattiseema is water for Aqua. significant part of farm land in Nandivada mandal had been converted to aqua and is a direct beneficiary out of this. Guess who represents Nandivada mandal.

Link to comment
Share on other sites

పట్టునిలిపిన...పట్టిసీమ!

amr-sty3a.jpg

కృష్ణా డెల్టా ఆయకట్టు స్థిరీకరణకు నిర్మించిన పులిచింతల ప్రాజెక్టు... డెల్టాలో సాగుకు సకాలంలో నీరందించడానికి ఏర్పాటుచేసిన పట్టిసీమ ఎత్తిపోతల పథకాలు డెల్టా రైతులను ఆదుకున్నాయి. కృష్ణానది పరివాహక ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు నెలకొని జలాశయాలకు వరదనీరు చేరకపోయినా సకాలంలో పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు తీసుకువచ్చి కృష్ణాడెల్టాలో వరిపంట పండించారు.

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టిసీమ పూర్తిచేయాలన్న పట్టుదల, జలవనరులశాఖ కార్యాచరణ ప్రణాళిక, రైతుల సహకారంతో డెల్టాలో 10.82లక్షల ఎకరాల్లో వరి పంట పండింది. ప్రస్తుతం డెల్టాలో వరిపంట దిగుబడులు రైతు ఇంటికి చేరుతున్నాయి. గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా ఎత్తిపోసి పోలవరం కుడికాలువ ద్వారా ప్రకాశంబ్యారేజీకి తరలించి అక్కడి నుంచి డెల్టా కాలువలకు విడుదల చేశారు. మొత్తం పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా 55 టీఎంసీల నీటిని పంపింగ్‌ చేయగా ప్రకాశం బ్యారేజీకి 45 టీఎంసీలపైగా నీరు వచ్చింది. పోలవరం కుడికాలువ ప్రయాణించే 174 కిలోమీటర్ల పరిధిలో మెట్టపంటలకు స్థానిక రైతులు నీటిని వాడుకుని పంటలు కాపాడుకున్నారు. మరోవైపు వూహించని విధంగా స్థానిక పరివాహక ప్రాంతం నుంచి పులిచింతల ప్రాజెక్టుకు 30టీఎంసీలకుపైగా నీరు చేరడంతో అవసరమైనప్పుడు నీటిని బ్యారేజీకి విడుదల చేసి డెల్టాలో పంటలకు అందించారు. జలవనరులశాఖ వారాబందీ విధానాన్ని అమలుచేసి ఆయకట్టు చివరి ప్రాంతాలకు కూడా సాగునీరు అందించడంతో అంతటా ఆనందం నెలకొంది. వారాబందీ విధానంలో నీటిని తడుల రూపంలో వరి పంటకు అందించడం వల్ల డిగుబడులు పెరిగాయని గుంటూరు వాహిని నీటిసంఘం ఛైర్మన్‌ జాగర్లమూడి రంగారావు తెలిపారు.

కృష్ణాడెల్టాలో గుంటూరు, ప్రకాశం, కృష్ణా పశ్చిమగోదావరి జిల్లాల్లో 13లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే ఇటీవల కాలంలో కృష్ణా జిల్లాలో ఆక్వా చెరువుల విస్తీర్ణం క్రమంగా పెరగడంతో వరిసాగు విస్తీర్ణం కొంతమేర తగ్గింది. ప్రస్తుతం డెల్టాలో 10.64లక్షల ఎకరాలు విస్తీర్ణం సాగులోకి రాగా గుంటూరు జిల్లాలో గుంటూరు వాహిని కింద 18200 ఎకరాలు సాగుచేశారు. కృష్ణా పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ పరిధిలో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 5.30లక్షల ఎకరాల విస్తీర్ణం సాగయింది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో 5.34లక్షల ఎకరాల ఆయకట్టు సాగుచేశారు. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలో జలాశయాలకు నీరు చేరకపోవడంతో సాగుకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈక్రమంలో పట్టిసీమ నుంచి పంపింగ్‌ ద్వారా బ్యారేజీకి నీటిని తీసుకువచ్చి కృష్ణాడెల్టాకు సాగునీరు అందించారు. నాట్లు వేసే సమయంలో కూడా ఇబ్బందులు ఏర్పడినా రైతులు సహకరించి నీరు వచ్చిన సమయంలో నాట్లు వేసుకున్నారు. ప్రారంభంలో కొంత నీటిఇబ్బందులు ఎదురైనా క్రమంగా పట్టిసీమ నుంచి సగటున 5వేల క్యూసెక్కులు రావడం, స్థానిక వాగుల ద్వారా పులిచింతల ప్రాజెక్టులోకి రికార్డుస్థాయిలో 30టీఎంసీలకుపైగా నీరు చేరడం, మునేరు, పాలేరు, స్థానిక వాగుల ద్వారా బ్యారేజీకి కొంతనీరు రావడంతో డెల్టాలో పంటలకు నీరందించారు. జలవనరులశాఖ ఇంజినీర్లు అందుబాటులో ఉన్న నీటివనరులను సమర్థంగా ఉపయోగించుకోవడానికి వీలుగా క్షేత్రస్థాయిలో పకడ్బందీగా వారాబందీ విధానాన్ని అమలుచేశారు. ఇందుకు నీటిసంఘాల వారిని భాగస్వామ్యులను చేశారు. ఉన్నతాధికారులు సైతం కాలువల వారీగా రోజువారీగా నీటివిడుదల పర్యవేక్షించి క్షేత్రస్థాయి సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో ఆయకట్టు చివరిభూములకు సైతం సాగునీరు అందించారు. రైతులు కూడా జలవనరులశాఖ ఇంజినీర్లకు సహకరించడంతో నీటిపొదుపు సాధ్యమైంది. గుంటూరు జిల్లాలో హైలెవల్‌ కెనాల్‌, అప్పాపురం చానల్‌ కింద ఎప్పుడూ నీరు అందక రైతులు ఆందోళన చెందేవారు. ఈఏడాది అక్కడ కూడా సక్రమంగా సాగునీరు అందించడం గమనార్హం.

109.91 టీఎంసీల నీటి వినియోగం

కృష్ణా డెల్టాలో 13లక్షల ఎకరాల్లో పంటలు పండించడానికి, లక్షలమంది తాగునీటి అవసరాలు తీర్చడానికి 181టీఎంసీల నీటికేటాయింపులు ఉన్నాయి. అయితే ప్రస్తుత సీజన్‌లో డిసెంబరు 5వతేదీ వరకు 109.91టీఎంసీల నీటిని వినియోగించుకున్నారు. 10.82లక్షల ఎకరాల్లో వరిపంటకు సాగునీరు అందించడంతోపాటు లక్ష ఎకరాలకుపైగా ఆక్వాసాగు చెరువులకు నీరు అందించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సింహభాగం డెల్టాలో కోతలు జరుగుతుండగా డిసెంబరు నెలాఖరుకు 90శాతం ఆయకట్టులో పంట పూర్తికానుంది. పట్టిసీమ నుంచి ఇంకా సాగునీరు వస్తుండటం, పులిచింతలలో 6టీఎంసీలపైగా నీరు నిల్వ ఉండటంతో డెల్టాలో పంటకు సాగునీరు ఇబ్బంది లేదని జలవనరులశాఖ యంత్రాం గం చెబుతోంది. ప్రస్తుతం డెల్టాలో కోతలు జరుగుతున్న కాలువల కింద నీటిని పూర్తిగా నిలిపివేశారు. ఆయకట్టు చివరి భూములకు మాత్రం నీటివిడుదల కొనసాగుతోంది. దీంతో ప్రధానకాలువలకు బ్యారేజీ నుంచి తీసుకునే నీటిపరిమాణాన్ని భారీగా తగ్గించారు. ప్రస్తుతం బ్యారేజీలో 11.3 అడుగుల నీటిమట్టాన్ని కొనసాగిస్తున్నారు. కృష్ణా పశ్చిమ, తూర్పు డెల్టాలో సాగు విస్తీర్ణం సమానంగానే ఉన్నా కృష్ణా జిల్లాలో లక్ష ఎకరాలకుపైగా ఆక్వాసాగు చెరువులకు నీటిని వినియోగించినట్లు జలవనరులశాఖ వర్గాలు తెలిపాయి. ఆక్వాసాగు కూడా కీలకం కావడంతో క్రమం తప్పకుండా నీటిని విడుదల చేశారు.

వారాబందీ విధానంతో సఫలీకృతం

కృష్ణాడెల్టాలో నీటిఅవసరాలను లెక్కించుకుని, బ్యారేజీకి వస్తున్న నీటిని దృష్టిలో పెట్టుకుని కాలువలకు నీటిని విడుదల చేశాం. అవసరాలు ఎక్కువ, నీటిలభ్యత తక్కువగా ఉండటంతో వారాబందీ విధానాన్ని అమలుచేయడం ద్వారా అందరికీ నీరు అందించవచ్చని ప్రణాళికలు రూపొందించి క్షేత్రస్థాయిలో అమలుచేశాం. ఎప్పటికప్పుడు నీటిలభ్యత, అవసరాలపై చర్చించుకుంటూ ప్రధానకాలువలకు నీటిని విడుదల చేశాం. నీటిలభ్యతను రైతులకు వివరించి క్రమానుగతంగా నాట్లు వేసుకునేలా అవగాహన కల్పించాం. వారాబందీ విధానానికి రైతులు కూడా సహకరించడంతో పకడ్బందీగా అమలుచేయడం వల్ల సాగునీరు అందించడంలో సఫలీకృతమయ్యాం. డెల్టాలో ఉన్న పంటకు కూడా దిగుబడులు వచ్చేవరకు నీటిని అందించడానికి ప్రణాళికతో ముందుకెళ్తున్నాం.

- కేవీఎల్‌ఎన్‌పీ చౌదరి, పర్యవేక్షక ఇంజినీరు, గుంటూరు జిల్లా

- సుగుణాకర్‌రావు, పర్యవేక్షక ఇంజీనీరు, కృష్ణా జిల్లా

కాలువ--నీటివినియోగం(టీఎంసీలలో)

డెల్టాతూర్పు కాలువ 64.94

డెల్టా పశ్చిమకాలువ 43.05

గుంటూరువాహిని 1.92

మొత్తం 109.91

ఆదుకున్న పట్టిసీమ, పులిచింతల

కృష్ణానది పరివాహక ప్రాంతంలో వర్షాభావ పరిస్థితుల్లో శ్రీశైలం దాటి వరదనీరు నాగార్జునసాగర్‌ చేరలేదు. అయినప్పటికీ కృష్ణాడెల్టాలో 10.82లక్షల ఎకరాలకు సాగునీరు అందించి పంటలు పండించారంటే పట్టిసీమ, పులిచింతల నుంచి వచ్చిన నీరే ఆధారం. రికార్డుస్థాయిలో పులిచింతలకు స్థానిక పరివాహక ప్రాంతం నుంచి 30టీఎంసీలకుపైగా వరదనీరు వచ్చి చేరింది. రాష్ట్రప్రభుత్వం యుద్ధప్రాతిపదికన తెలంగాణలో ముంపునకు గురయ్యే ప్రాంతాలకు పరిహారం అందించి పులిచింతలలో 30టీఎంసీల నీటిని నిల్వచేసింది. మరోవైపు పట్టిసీమలో నీటిలభ్యత ఆధారంగా 24పంపులు నడిపించి గరిష్ఠంగా 8వేల క్యూసెక్కులు పంపింగ్‌ చేసింది. కీలకమైన అక్టోబరు, నవంబరు నెలలో పులిచింతల, పట్టిసీమ నుంచి నీరు బ్యారేజీకి చేరడంతో పంట గట్టెక్కింది. సాగర్‌ నుంచి ప్రకాశంబ్యారేజీకి కేవలం 18టీఎంసీలు మాత్రమే తీసుకున్నాం. ఇందులో పుష్కరాల సమయంలో కొంతనీటిని దిగువకు వదిలాం. పులిచింతల, పట్టిసీమ ద్వారా వచ్చినీటితో పాటు స్థానికవాగుల ద్వారా బ్యారేజీకి వచ్చిన నీటితోనే డెల్టా గట్టెక్కింది. పట్టిసీమ నుంచి 45టీఎంసీలు రాగా, పులిచింతల, స్థానిక వాగుల ద్వారా మరో 45టీఎంసీల నీరు సమకూరింది.

Link to comment
Share on other sites

పట్టిసీమనుంచి నీటివిడుదల తగ్గింపు
 
636166761542669667.jpg
పోలవరం, డిసెంబరు 6 : పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి కృష్ణా డెల్టాకు విడుదల చేస్తున్న నీటిని అధికారులకు క్రమేపీ తగ్గిస్తున్నారు. ఇప్పటి వరకు 22 పంపుల ద్వారా కుడి కాల్వనుంచి కృష్ణా డెల్టాకు నిరంతరాయంగా నీరు తరలించారు. ప్రస్తుతం గోదావరిలో నీటి సామర్థ్యం దృష్ట్యా ఒక్కో పంపు నుంచి 1400 క్యూసెక్కుల నీటిని గోదావరి నుంచి ఎత్తిపోస్తున్నారు.
Link to comment
Share on other sites

  • 4 weeks later...

Chivaraki decoit gallu "Naluka kostam" ani mottam plate marchesaru PAttiseema project meda :)

mari Godavari delta vallani rechagottatam, case lu veyyatam antha comedy ki annamata

 

Veedu&Ear reddy&batch 1 TMC water kuda radu just chembu to nillu postunaru danni "River linkage" antunaru ani prati TV debate lo chepparu

 

 

bemmi.plz.gif

 

15800452_1298382303534396_49633464619445

Link to comment
Share on other sites

Guest Urban Legend

http://www.eenadu.net/district/inner.aspx?dsname=Guntur&info=gnt-top1

 

పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి ప్రకాశం బ్యారేజీకి 52 టీఎంసీల నీటిని తీసుకురావడంవల్ల.. కృష్ణా డెల్టాలో ఖరీఫ్‌ పంటలను కాపాడడంతోపాటు శ్రీశైలంలో పొదుపైన నీటిని రబీలోనూ కుడి కాల్వకు ఇవ్వటంవల్ల.. పల్నాట సాగుకు వెసులుబాటు కలుగడం రైతన్నలకు డబుల్‌ ధమాకానే అయ్యింది. గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో రూ.వేల కోట్ల దిగుబడులకు కారణమైంది. ప్రస్తుతం శ్రీశైలంలో నిల్వ చేసుకున్న నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేసి కుడి కాల్వ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 9.73 లక్షల ఎకరాలకు ఆరుతడిగా అందిస్తున్నారు. నవంబరులో 10 టీఎంసీలు విడుదల చేసిన నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు(ఎన్నెస్పీ) ఇంజినీర్లు ప్రస్తుతం 15 టీఎంసీలు వదిలారు. ఫిబ్రవరిలో మూడో తడి ఇవ్వడానికి ప్రణాళిక రూపొందించారు. దీంతో కుడి కాల్వ కింద ఆరుతడి పంటల దిగుబడులు రైతుల చేతికి అందనున్నాయి. కుడి కాల్వ కింద గుంటూరు జిల్లాలో 80 వేలు, ప్రకాశంలో 30 వేల హెక్టార్లకు కీలకమైన దశలో సాగు నీరందుతోంది. మిరప దిగుబడులు ఆశాజనకంగా వస్తాయని రైతులు చెబుతుండగా ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో తొలికోతలు జరుగుతున్నాయి. కంది, శనగ, అపరాలకు కూడా మూడు తడులు ఇస్తుండడంతో దిగుబడులకు ఢోకా లేదంటున్నారు.

ఆదుకున్న పులిచింతల, పట్టిసీమ: క¹ృష్ణానది పరివాహక ప్రాంతంలోని జలాశయాలకు వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆశించిన మేర వరద నీరు చేరలేదు. దీంతో పట్టిసీమ నుంచి వచ్చిన నీటితోనే ప్రారంభంలో డెల్టాలో నాట్లు వేసుకున్నారు. కృష్ణా పుష్కరాల సమయంలో శ్రీశైలం నుంచి 18 టీఎంసీలను సాగర్‌ ద్వారా ప్రకాశం బ్యారేజీకి తీసుకుని డెల్టాకు విడుదల చేశారు. ఆగస్టులో గుంటూరు, కృష్ణా, తెలంగాణ జిల్లాలో కురిసిన వర్షాలకు పులిచింతల ప్రాజెక్టుకు 30 టీఎంసీలు చేరగా ఇదే సమయంలో పట్టిసీమ నుంచి సగటున రోజూ 5500 క్యూసెక్కులు బ్యారేజీకి వచ్చాయి. డెల్టా అవసరాల మేరకు పులిచింతల నుంచీ నీరును బ్యారేజీకి వదలడంతో 10 లక్షల ఎకరాలకు సక్రమంగా అందింది. జలవనరుల శాఖ వారాబందీ విధానాన్ని అమలు చేసినా రైతులు సహకరించడంతో సఫలీకృతమయ్యారు. ఇటీవల పులిచింతల పూర్తిగా ఖాళీ కావడంతో సాగర్‌ జలాశయం నుంచి 10 టీఎంసీలు డెల్టాకు తీసుకుంటుండగా సింహభాగం వరి కోతలు పూర్తయ్యాయి. ఆయకట్టు చివరి భూములకు మాత్రమే ప్రస్తుతం నీరందిస్తున్నారు. వరికి ఆరుతడులు అందించడం, వాతావరణం అనుకూలించడం, దిగుబడులు ఇంటికి వచ్చేవేళ తుపానులు తప్పిపోవడంతో ఎకరాకు 40 బస్తాలపైగా ధాన్యం దిగుబడులు వస్తున్నాయి. పట్టిసీమ నుంచి 52 టీఎంసీలు, పులిచింతల నుంచి 30 టీఎంసీలు డెల్టాకు వాడుకోవడంవల్ల ఆ మేరకు శ్రీశైలం నుంచి నీటిని తీసుకోకుండా ప్రణాళికయుతంగా పంటలకు నీరిచ్చారు.

మిర్చికి కలిసొచ్చిన తడులు: ఖరీఫ్‌ ప్రారంభంలో వర్షాభావ పరిస్థితులు కొనసాగినా ఆగస్టులో వచ్చిన వర్షాలకు సాగర్‌ కుడి కాల్వ కింద గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 1.10 లక్షల హెక్టార్లలో మిరప పంట వేశారు. పత్తికి గులాబీ రంగు పురుగు బెడద ఉంటుందన్న ప్రచారం, గతేడాది మిరపకు రికార్డుస్థాయిలో ధర రావడంతో ఈసారి సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గుంటూరు జిల్లాలో సాధారణ విస్తీర్ణం 63 వేల హెక్టార్లు కాగా ఈసారి 79,356 హెక్టార్లలో పండిస్తున్నారు. నవంబరులో ఒక తడి, ప్రస్తుతం రెండో తడి ఇస్తున్నందున ఎకరాకు సగటున 20 క్వింటాళ్లకు తగ్గకుండా దిగుబడులు వస్తాయని ఉద్యానశాఖ ఉపసంచాలకుడు జయచంద్రారెడ్డి ‘ఈనాడు’కు తెలిపారు. ఫిబ్రవరిలో మరో తడి ఇస్తే ఎకరాకు మరో 5 క్వింటాళ్ల దిగుబడులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది వాతావరణం అనుకూలించడం, చీడపీడలు తక్కువగా ఉండడంతో దిగుబడులకు ఢోకా లేదని, సరైన సమయంలో సాగు నీరందడం కలిసొచ్చిందని చెప్పారు. ప్రస్తుతం కొన్నిచోట్ల తొలి కోతలు ప్రారంభµంకాగా మిరపకు పేరుగాంచిన పల్నాడు ప్రాంతంలో రూ.వేల కోట్ల విలువైన దిగుబడులు వస్తాయని ఉద్యానశాఖ అంచనా వేసింది.

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...