Jump to content

pattiseema

Recommended Posts

కృష్ణాకు గోదారమ్మ
23-06-2017 01:23:05
 
636337839144713736.jpg
  • సీతారాంపురం వద్ద స్వాగతం
  • పూజలు చేసిన మంత్రి ఉమా
  • డెల్టా రైతుల తొలకరి ఆశలు సజీవం
 
(ఆంధ్రజ్యోతి - న్యూస్‌ నెట్‌వర్క్‌)
మొన్న ఆగస్టులో.. నిన్న జూలైలో..ఇప్పుడు జూన్‌లో! ఒక్కో ఏడాది గడుస్తున్నకొద్దీ, కృష్ణమ్మ వైపు గోదారమ్మ పరుగు పెరుగుతోంది. నైరుతి మోసుకొచ్చిన తొలకరి ఆశలను నిలుపుతూ, పట్టిసీమ నుంచి పైరుసీమల వైపు పరవళ్లు తొక్కింది. ఈసారి ముందే ఏరువాకకి సాగిన కృష్ణాడెల్టా రైతాంగం ఉత్సాహాన్ని మరింత పెంచేసింది. వరుసగా మూడో ఏడాది పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా వదిలిన నీరు మూడు రోజులు ప్రయాణించి.. గురువారం కృష్ణాజిల్లాలోకి ప్రవేశించింది. కృష్ణా డెల్టా కింద మొత్తం పదమూడు లక్షల ఎకరాల ఆయకట్టు సాగువుతోంది. ఈ ఏడాది ఒక్క ఎకరం ఎండరాదని ప్రభుత్వం నిర్దేశించింది. అందుకని, ప్రస్తుతం పట్టిసీమ నుంచి 14 పంపుల ద్వారా నిరంతరాయంగా నీరు వదులుతున్నారు. శుక్రవారం రాత్రికి ఇబ్రహీంపట్నం వద్ద పవిత్ర సంగమంలో పట్టినీరు కలవనుంది. అసలే, మబ్బులు తేలిపోయి, ఎండలు ముదిరిన తరుణంలో, తమకోసం పట్టిసీమ నీరు తరలిపోవడంతో, రైతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నూజివీడు మండలం సీతారాంపురం వద్ద గోదావరికి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రత్యేక పూజలు చేసి, జిల్లాలోకి స్వాగతం పలికారు. పూలు, పసుపు, కుంకుమను అర్పించారు. చంద్రబాబు మహా సంకల్పం ఫలించిందని మంత్రి అన్నారు. రైతుల సంక్షేమంకోసం ముఖ్యమంత్రి ఇంత చేస్తున్నా, వేల కోట్ల రూపాయలను వృధాగా పట్టిసీమపేరిట గోదావరిలో క
 
లిపేస్తున్నారని విపక్ష నేత జగన్‌ బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
 
కలిసొచ్చిన కాలానికి..
ఖరీఫ్‌ సీజన్‌లో 100 టీఎంసీల నీరుని పట్టిసీమ నుంచి అందించాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం! అవసరమైతే పట్టిసీమలోని మొత్తం పంపులనూ అందుబాటులోకి తీసుకువస్తామనేది జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట! ప్రభుత్వ సంకల్పానికి గోదావరి కూడా సహకరిస్తుండటం విశేషం. నిజానికి, గోదావరిలో ఈ సమయంలో ఇన్‌ఫ్లో అంతగా ఉండదు. ఉన్నా చాలా తక్కువ. అలాంటిది ఇప్పుడు గోదావరికి ఇన్‌ఫ్లో స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం 10,952 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. గతేడాది ఈరోజున 5,037 క్యూసెక్కుల మాత్రమే ఉంది. సీలేరు నుంచి 785.18 క్యూసెక్కులు వస్తుండగా, వర్షాలు అక్కడక్కడా కురుస్తుండడమూ కలిసివస్తోంది. ఈసారి భారీ వర్షాలు ఉంటాయనే అంచనా ఉంది. దీంతో.. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీటిని తోడుతున్నప్పటికీ గోదావరి నిండా నీళ్లు కనిపిస్తున్నాయి.
 
కుడికాల్వలో పరవళ్లు
మూడు రోజుల క్రితం పట్టిసీమ నుంచి విడుదలైన గోదావరి జలాలకు ఈ మూడురోజులుగా పశ్చిమ గోదావరి రైతులు అడుగడుగునా పూజలు చేశారు. పెదవేగి మండలం జానంపేట వద్ద ప్రభుత్వ విప్‌, దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట వందలాది మంది మహిళలు, రైతులు తరలివచ్చారు. వంతెనల పైనుంచే పూలు, పుసుపు, కుంకుమలు కాల్వల్లోకి విడిచిపెట్టారు.
Link to comment
Share on other sites

patti.jpg 

Guest Urban Legend

e neeru maaku bangaram tho samanam says farmer.

rey jaffa mundals pattiseema waste antara saraina answer vasthadhi 2019 lo get ready

Link to comment
Share on other sites

కృష్ణమ్మ చెంతకు చేరిన గోదారి

23ap-state2a.jpg

విజయవాడ (ఇబ్రహీంపట్నం), న్యూస్‌టుడే: పట్టిసీమ నుంచి పోలవరం కుడి కాలువ ద్వారా విడుదల చేసిన గోదావరి జలాలు శుక్రవారం సాయంత్రం పవిత్ర సంగమ ప్రాంతం వద్ద కృష్ణమ్మలో కలిశాయి. పరవళ్లు తొక్కుతూ వచ్చిన గోదావరి జలాలకు స్థానికులు స్వాగతం పలికారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య పసుపు, కుంకుమ, పూలను కృష్ణా, గోదారమ్మలకు సమర్పించారు. కృష్ణమ్మలో కలిసేందుకు 183 కి.మీ. దూరం నుంచి వచ్చిన గోదారికి చీర, సారెలను స్థానికులు అర్పించారు.

Link to comment
Share on other sites

TDP/CBN Saving 13+ Lac acres of Krishna Delta (Krishna, Guntur, West Godavari, Prakasam) every years from last year ee districts lone Lacs & Lacs of Farmers emi ichhi TDP/CBN runam teerchukogalaru.

Chintalapudi & Uttarandhra Srujala Sravanthi kooda next 1 year lo complete ayithe backward areas of Krishna-West & Uttara Andhra kooda direct gaa benefit ponduthaayi.

Polavaram entha important oo ee projects kooda chaala important for whole AP farmers.

Indirectly it is saving at least 50-100 TMC water for Rayalaseema & Nellore districts from Srisailam.

Link to comment
Share on other sites

Last year CBN ichina hype lo konta theda undi especially pushkaralu valla one month water sarigga release cheyale...still crop save aindi kani profits pedda ga raale (diviseema) farmers ki.

But he is making ammends to that mistake and releasing now. Farmers are very happy and pleasantly surprised

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...