Jump to content

Recommended Posts

Posted
  పట్టిసీమ సంపూర్ణం! ! 636150312036364150.jpg

హైదరాబాద్‌, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): గోదావరి-కృష్ణా నదులను అనుసంధానం చేసేందుకు దోహదపడ్డ పట్టిసీమ ఎత్తిపోతల పథకం పూర్తిగా పనిచేయడం ప్రారంభించింది. వాస్తవానికి.. గత ఏడాది ఖరీ్‌ఫలోనే.. కృష్ణా డెల్టా ఆయకట్టుకు సాగు నీటిని అందించడంలో ఈపథకం దోహదపడింది. ఇప్పటి వరకు.. మొత్తం 24 పంపులను స్విచ్చాన్‌ చేయకుండా.. ఒకదాని తర్వాత ఒకటి ఆన్‌ చేస్తూ వచ్చిన జల వనరుల శాఖ.. బుధవారం నాటికి 23 పంపులు పనిచేసేలాచర్యలు తీసుకుంది. దీంతో..8500 క్యూసెక్కుల సామర్థ్యం కలిగిన పట్టిసీమ ద్వారా 8142 క్యూసెక్కుల నీరు పోలవరం కుడి ప్రధాన కాలువలోకి ఎత్తిపోసేందుకు వీలైంది. శుక్రవారానికి మిగిలిన ఒక్క పంపునూ స్విచ్‌ ఆన్‌ చేస్తే.. ఈ పథకం సంపూర్ణంగా పనిచేసినట్లు అవుతుందని జల వనరుల శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 44 టీఎంసీల నీటిని ఎత్తిపోశామని జల వనరుల శాఖ ఉన్నతాధికారులు వివరిస్తున్నారు. పట్టిసమీ ఎత్తిపోతల ఇదే తరహాలో నిరాటంకంగా పని చేస్తే.. వచ్చే ఖరీఫ్‌ నుంచి.. పూర్తి స్థాయిలో.. 45 టీఎంసీలను రాయలసీమ జిల్లాలకు అందించే అవకాశం లభిస్తుందని జల వనరుల శాఖ అధికారులు వివరిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోని కృష్ణా డెల్టా ఆయకట్టు భూములు చివరిలో ఉండడం వల్ల ఎప్పుడూ ఎగువ ప్రాంతానికి నీరు వచ్చే వీలుండేది కాదు. ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది. పట్టిసీమ నుంచి నీరు పోలవరం కుడి ప్రధాన కాలువకు ఎత్తిపోస్తుండడంతో.. ఈ ఎగువ ప్రాంతాలన్నీ ముందు వరుసలోకి వచ్చేశాయి. ఫలితంగా.. కాలువకు సమీపంలోని గ్రామాల్లో రైతులు పంపుల ద్వారా సాగునీటిని తీసుకుంటున్నారు. ఇదే సమయంలో.. చెరువులన్నింటినీ నింపుతున్నారు. కొల్లేరు ప్రాంతంలో రైతులు తమ చెరువులను నింపుకునేందుకు వీలు కలిగింది. పశ్చిమ గోదావరి జిల్లా లోని ఎగువ ప్రాంతాలకు.. 600 నుంచి 800 క్యూసెక్కులు వినియోగించుకుంటున్నారు. మిగిలిన జలాలన్నీ కృష్ణా డెల్టాలోకే వెళ్తున్నాయి. పట్టిసీమ పథకం ద్వారా ఇప్పటికి 116 రోజుల పాటు పంపింగ్‌ చేశారు. డిసెంబరు నెలాఖరు వరకు నీటిని ఎత్తిపోసే వీలుంది. భారీ వర్షాలు, తుఫాను కారణంగా పులిచింతలకు నీరు చేరడం కారణాలతో ఏడు రోజులు మాత్రం పంపింగ్‌ ఆగింది.
Posted

ee nellani etu velthunnato theliyadi gaani..maa praksam ki konchem vadalandayya babulu....2 yrs ga pantulu levu...

ivi only to krishna guntur and west ....prakassam ki sagar nundi vastay
Posted

Krishna Delta would have lost their Kharif cropt this year. Find out how CBN's Government rescued delta's farmers from distress and loss.

Read The Hindu’s article below:
http://www.thehindu.com/…/pattiseema-pul…/article9363916.ece

చంద్రబాబు ముందుచూపుతో చేపట్టిన నదుల అనుసంధాన ఫలితంగా ఈ ఖరీఫ్ సాగు ఫలప్రదంగా సాగింది. పట్టిసీమ, పులిచింతల ప్రాజెక్టుల వలన కృష్ణా డెల్టా కింది నాలుగు జిల్లాలు... కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల లోని ఖరీఫ్ పంటలకు ప్రాణం పోశాయి. డెల్టాలోని 13,07,882 ఎకరాల మొత్తం ఆయకట్టు నుండి 10,74,907 ఎకరాలను రైతులు సంతోషంగా సాగు చేసుకోగలిగారు. పంటలే కాకుండా కృష్ణా జిల్లాలోని 1,51,912 ఎకరాల ఆక్వా సాగును కూడా కలుపుకుంటే నవంబర్ 17 వరకు మొత్తం 12,26,819 ఎకరాల్లో సాగును కాపాడుకోగలిగాం. ఈ ఏడాది నాగార్జున సాగర్ నుండి కేవలం 20 టీఎంసీల నీటిని మాత్రమే కృష్ణా డెల్టాకు విడుదల చేయడం జరిగింది. కృష్ణా జలాలను మాత్రమే నమ్ముకుని ఉంటే డెల్టా రైతుకు తీరని నష్టం జరిగేది. అత్యవసర కాలంలో పట్టిసీమ నుండి 45 టీఎంసీల గోదావరి జలాలు రావడంతో రైతులు తమ పంటలను కాపాడుకోగలిగారు. ఒక నది నుండి మరో నది పరివాహక ప్రాంతానికి ఇంత మొత్తంలో నీటిని తరలించడం ఇదే మొదటిసారి.

ఇదే సమయంలో శ్రీశైలం నుండి కొంత నీటిని పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్, హంద్రీ - నీవా సుజల స్రవంతి ప్రోజెక్టుల ద్వారా రాయలసీమ ప్రాంతాలకు తరలించింది ప్రభుత్వం. మొత్తమ్మీద అటు సాగర్ నుండి ఇటు పట్టిసీమ నుండి కలిపి మొత్తం 96.98 టీఎంసీల నీటితో కృష్ణా డెల్టాలోని నాలుగు జిల్లాలలో కలిపి 10.75 లక్షల ఎకరాల పంట సాగు, 1. 52 లక్షల ఆక్వా సాగు జరిగింది. పట్టిసీమను అడుగడుగునా అడ్డుకున్న ప్రతిపక్షాలను డెల్టా రైతాంగం ఛీ కొట్టే పరిస్థితి ఏర్పడింది. పట్టిసీమ ఫలాలను చూసిన ప్రతిపక్షాలు ఇప్పుడు నోరుమెదప లేకుండా ఉన్నారు. దార్శనికత కలిగిన చంద్రబాబుకూ, పదవీ వ్యామోహం తప్ప అభివృద్ధి ఆలోచన లేని ప్రతిపక్షాలకు ఉన్న తేడాను ఇప్పుడు ప్రజలు స్పష్టంగా తెలుసుకున్నారు.

Posted
పట్టిసీమ పరవళ్లు
 
636157245574167579.jpg
  • కృష్ణా డెల్టాకు చేరుకున్న 50 టీఎంసీలు..
  • 8142 క్యూసెక్కులు ఎత్తిపోత
హైదరాబాద్‌, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): కృష్ణమ్మను కలిసేందుకు గోదారమ్మ పరుగులు పెడుతోంది. కృష్ణా డెల్టాకు తాగు, సాగు నీటి అవసరాలను తీర్చేందుకు పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి నీరు పరవళ్లు తొక్కుతోంది. మొత్తం 24 పంపులలో 23 పంపుల ద్వారా రోజుకు 8.142 క్యూసెక్కుల నీటిని పోలవరం కుడి ప్రధాన కాలువలోకి ఎత్తిపోస్తున్నారు. ఇప్పటి వరకూ 49.5248 టీఎంసీలను పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు తరలించారు. గోదావరిలో నీళ్లున్నా గతంలో వాటిని సద్వినియోగం చేసుకోకపోవడంతో ఏటా 3000 టీఎంసీలను సముద్రంలోకి వదిలేసేవారు. ఇప్పుడు ఆ నీటిని పట్టిసీమ ద్వారా పశ్చిమగోదావరి జిల్లాలోని ఎగువ ప్రాంతాలకూ, కృష్ణా డెల్టాకు అందిస్తున్నారు. తాగునీటి కష్టాలు తీర్చేందుకు వీలుగా కాలువకు సమీపంలోని చెరువులను నింపుతున్నారు. వర్షాభావ పరిస్థితుల్లోనూ పోలవరం కుడి ప్రధాన కాలువలో జలాలు పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుండడంతో కృష్ణా డెల్టా రైతుల్లో ఆనందం కన్పిస్తోంది. పట్టిసీమ పథకం నదుల అనుసంధానానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుందని ఇటీవల సమీక్షలో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతి పేర్కొన్నారు. ఈ పథకం వివరాలను పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా కేంద్ర మంత్రికి వివరించడంతో పైవిధంగా స్పందించారు. ఈ సమాచారం తెలుసుకున్న మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌, ఛత్తీ్‌సగఢ్‌ సీఎం రమణసింగ్‌.. తమ రాష్ట్రంలోనూ అంతర్గత నదుల అనుసంధానానికి పట్టిసీమను ఉదాహరణగా తీసుకుందామ.. ఆయా రాష్ట్రాల జల వనరుల శాఖ ఉన్నతాధికారులతో చెప్పారు. ఈ రాష్ట్రాల ఉన్నతాధికారులు త్వరలోనే పట్టిసీమను పరిశీలించే అవకాశం ఉంది.
Guest Urban Legend
Posted

max 80 dam ayaka we can...

 

if the flow is for more days

we can draw more than 100 tmc

Posted

if the flow is for more days

we can draw more than 100 tmc

 

yup, this year flood is 150+ days (starting from July 1st). So if all pumps were working from beginning, it would have been 110+ TMC

Posted

పట్టిసీమను అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలి అంటున్న కేంద్రం

pattiseema-as-example-26112016.jpg

పట్టిసీమ ఎత్తిపోతల పధకం, ఈ సంవత్సరం 50 TMCల నీటిని మళ్లించి రాష్ట్ర రైతాంగానికి అండగా నిలిచిన ఈ ప్రాజెక్ట్, ఇప్పుడు కేంద్రం దృష్టిలో పడింది. దేశంలో ఎన్నాళ్లగానో, ఒక కలగా ఉన్న నదుల అనుసంధానాన్ని నిజం చేసి చూపించిన చంద్రబాబు సర్కార్ కృషిని కేంద్రం మెచ్చుకుంటూ, అన్ని రాష్ట్రాలని ఈ ప్రాజెక్ట్ అధ్యయనం చెయ్యమంటుంది కేంద్రం.

నదుల అనుసంధానాన్ని కేంద్ర జల సంఘం ప్రత్యేకంగా కసరత్తు చేస్తోంది. ఇందుకు పట్టిసీమ ఎత్తిపోతలను నమూనాగా ఎంచుకుంది. రాష్ట్రాల మధ్య నదులను అనుసంధానం చెయ్యటానికి, ఆయా రాష్ట్రాలు అభ్యంతరం చెప్తున్న పరిస్థితుల్లో, ఆంధ్రప్రదేశ్ లోని పట్టిసీమ తరహాలో, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అంతర్గత అనుసంధానంపై తొలుత దృష్టి సారిస్తే కొంత ఫలితం వస్తుందని కేంద్ర జలసంఘం, కేంద్ర జలవనరులశాఖ భావిస్తున్నాయి.

 

ఇప్పటికే కేంద్ర జల సంఘానికి చెందిన ఒక ఒక బృందం ఈ కసరత్తులో భాగంగా పట్టిసీమ ఎత్తిపోతలను సందర్శించింది. దీనిపై ఒక అధ్యయన పత్రం రూపొందించి అన్ని రాష్ట్రాలకూ పంపనుంది. ఇలా అంతర్గతంగా చిన్న చిన్న అనుసంధానాలకు ఆస్కారం ఉన్న ప్రాజెక్టులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టేలా ప్రోత్సహించడం ఇందులో ప్రధాన ఉద్దేశం.

పట్టిసీమ సక్సెస్ గురించి తెలుసుకున్న మధ్యప్రదేశ్ సీఎం శివ రాజ్ సింగ్ చౌహాన్, చత్తీస్-ఘడ్ సీఎం రమణసింగ్ తమ రాష్ట్రంలోనూ ఆంతర్గత నదుల ఆనుసంధానానికి పట్టిసీమను ఉదాహరణగా తీసుకుందామని ఆయా రాష్ట్రాల జల వనరుల శాఖ ఉన్నతాధికారులతో చెప్పారు. ఈ రాష్ట్రాల ఉన్నతాధికారులు త్వరలోనే పట్టిసీమను పరిశీలించే అవకాశం ఉంది.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...