Jump to content

polavaram

Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply
2019లోపే పూర్తి
ఎలాంటి అపోహలూ వద్దు
  సహాయ, పునరావాస ఖర్చు   కేంద్రమే భరిస్తుంది
  2రోజుల్లో అథారిటీకి పూర్తిస్థాయి సీఈఓ
  కాంక్రీట్‌ పనుల గుత్తేదారుకు   నెలరోజుల గడువు
  ఆలోపు లక్ష్యాన్ని చేరకపోతే   కొత్త వారికి బాధ్యతలు
  పోలవరంపై నితిన్‌ గడ్కరీ స్పష్టీకరణ
  చంద్రబాబుకి తమ్ముడిలా అండగా   నిలుస్తానని వ్యాఖ్య
  కేంద్రమంత్రితో ముఖ్యమంత్రి భేటీ
ఈనాడు - దిల్లీ
13ap-main1a.jpg

పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2019లోపు పూర్తిచేయడం తమ లక్ష్యమని కేంద్ర జలవనరుల మంత్రి నితిన్‌గడ్కరీ స్పష్టంచేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబుకి పూర్తి సహకారం అందిస్తుందని వెల్లడించారు. సహాయ, పునరావాస పనులకు 100% వ్యయం తామే భరిస్తామని చెప్పారు. అందులో ఎలాంటి అనుమానం అవసరంలేదన్నారు. కాంక్రీట్‌ పనులు చేపట్టిన కాంట్రాక్టర్‌కు నెలరోజులు గడువిస్తున్నామని, ఆలోపు అతను లక్ష్యాన్ని చేరుకోకపోతే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం పిలిచిన టెండర్‌ ప్రకారం కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తామని వెల్లడించారు. గడ్కరీ బుధవారం రాత్రి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సుదీర్ఘ సమావేశం అనంతరం విలేకర్లతో మాట్లాడారు.  పోలవరం నిర్మాణం విషయంలో ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని గడ్కరీ భరోసా ఇచ్చారు.

‘‘పోలవరం ప్రాజెక్టు భారత్‌ ప్రభుత్వానికీ ప్రతిష్ఠాత్మకమైందే. 2019 కల్లా పూర్తిచేయడం మాశాఖ బాధ్యత. చంద్రబాబు సహకారంతో గడువులోపు  పూర్తి చేస్తాం. భూసేకరణ, పునరావాసంపై కేంద్ర, రాష్ట్ర అధికారుల మధ్య చర్చ జరిగింది. సవరించిన అంచనాలు 8 రోజుల్లో సమర్పిస్తామని ఏపీ ప్రభుత్వం చెప్పింది. దాని ఆధారంగా తయారుచేసిన డీపీఆర్‌కు సీడబ్ల్యూసీ ఆమోదముద్ర వేసిన తర్వాత ఆర్థికమంత్రి దగ్గరకు వెళ్లి అనుమతి    తీసుకుంటాం. భూసేకరణలో ఏ ఇబ్బంది వచ్చినా మేం సహకారం అందిస్తాం. సివిల్‌ ఇంజినీర్‌ పనులు పూర్తిచేయడానికి గడువు 2019 వరకు ఉన్నా 2018లో ఎలా పూర్తిచేయాలన్న దానిపై మార్గసూచి తయారుచేశాం. సీఎం విదేశాల్లో ఉన్నప్పుడు చిన్నా, పెద్ద కాంట్రాక్టర్లను పిలిచి అన్నిపనులూ 2018లో పూర్తిచేయాలని చెప్పాం. కాంట్రాక్టర్లందరికీ చేసిన పనికి ప్రతి పైసా డబ్బులిస్తామని స్పష్టంచేశాను. అప్పటి నుంచి పనుల వేగం మరింత పెరిగింది. కాంక్రీట్‌పనులు 38 లక్షల క్యూబిక్‌ మీటర్లు జరగాల్సి ఉండగా అందులో కొంత లోటు కనిపిస్తోంది. అందువల్ల ఆ కాంట్రాక్టర్‌కు నెలరోజుల సమయం ఇచ్చాం. ఆలోపు రోజుకు 7-8వేల క్యూబిక్‌ మీటర్ల చొప్పున పనులు చేయాలని నిర్దేశించాం. లేకపోతే 60(సి) ప్రకారం ఇప్పటికే పిలిచిన టెండర్లలో ఎంపికైన వారికి ఆ పనులు అప్పగిస్తాం.  కాంట్రాక్టర్‌కు నెలరోజులవరకు చట్టపరిధిలో స్టీల్‌, సిమెంట్‌తోపాటు, ఆర్థిక మద్దతుకూడా అందిస్తాం. అప్పటికీ ఆయన లక్ష్యాన్ని చేరుకోకపోతే మారుస్తాం. కొన్ని నియమనిబంధనలను పాటించాల్సి ఉంటుంది.   కొత్త వారిని పిలవడం వల్ల అంచనాలు పెరుగుతాయన్న ఉద్దేశంతోనే కొంత సంయమనం పాటిస్తున్నాం. మార్పువల్ల పెరిగే భారాన్ని చట్టప్రకారం మేమే భరించాల్సి ఉంటుంది.  పోలవరం అథారిటీకి పూర్తిస్థాయి సీఈఓను రెండురోజుల్లో నియమిస్తాం. రాజమండ్రిలో ఉండి పనిచేయడంతోపాటు, ప్రతిరోజూ నాకు నివేదిక ఇచ్చేలా ఆదేశిస్తాం. ప్రాజెక్టు పూర్తిచేయడానికి చంద్రబాబు ఎంత ఆతృతతో ఉన్నారో నేనూ అంతే ఉన్నాను. నేను రాజకీయనాయకుడిగా కాకుండా ఆయన తమ్ముడిగా ఈ ప్రాజెక్టును పూర్తిచేయడానికి ఆయనతోపాటు పూర్తి బాధ్యత తీసుకున్నా. నేను ఇప్పటివరకూ నాశాఖల్లో రూ.7 లక్షల కోట్ల పనులు అప్పగించాను. లక్ష్యాలను అనుకున్న సమయంలో పూర్తిచేసిన ట్రాక్‌రికార్డ్‌ నాకుంది. పోలవరం చాలా కష్టమైన పని అయినప్పటికీ పూర్తిచేస్తామన్న నమ్మకం ఉంది. నిబంధనలకు అతీతంగా ఏదైనా ఆర్థిక మద్దతు అవసరమైతే చేయడానికీ ప్రయత్నిస్తాం. అన్ని విషయాల్లో మద్దతు ఇచ్చి ఎట్టిపరిస్థితుల్లోనూ 2019కల్లా పూర్తిచేస్తాం. 2018లో కాంక్రీట్‌పనులు పూర్తిచేయాలన్నది నా వ్యక్తిగత లక్ష్యం.  మేం ఒక జట్టుగా పనిచేసి 2019కల్లా పూర్తి చేస్తామన్నది ప్రజలకు ఇస్తున్న హామీ. ఈ ప్రాజెక్టువల్ల ఏపీకి ఎంత లాభం ఉంటుందో తెలుసు. కరువుపీడిత విదర్భప్రాంతానికి చెందిన రైతుగా నీటి అవసరం నాకు బాగా తెలుసు. అందుకే ముఖ్యమంత్రి ఎందుకు ప్రాజెక్టు కోసం ఇంతగా తాపత్రయపడుతున్నారన్నది అర్థంచేసుకోగలను. అందువల్ల గడువులోపు పూర్తిచేస్తాం. కాంక్రీట్‌ పనులు మినహాయించి మిగిలిన పనులన్నీ అనుకున్నట్లుగా జరుగుతున్నాయి. 2011 ధరల ప్రకారం ప్రాజెక్టు వ్యయం భరించడం మా బాధ్యత. నేను సానుకూల దృక్పథం ఉన్న వ్యక్తిని. ఎప్పుడూ రాజకీయాల గురించి ఆలోచించను. అనుకున్న పని అనుకున్న సమయంలో పూర్తిచేసేవారినే నేను ఇష్టపడతా అన్న స్లోగన్‌ నా టేబుల్‌పై ఉంటుంది. అనుకున్నది అనుకున్నట్లుగా చేస్తారన్న పేరును ఎప్పటికీ నిలబెట్టుకుంటా. అమర్‌జిత్‌సింగ్‌ రాసిన లేఖ గురించి మాట్లాడటానికి ఆయన ఇష్టపడలేదు. అలాంటి విషయాలపై మాట్లాడి నా సమయాన్ని వృథా చేసుకోదలచుకోలేదు.

చంద్రబాబు శక్తిసామర్థ్యాలను ఆరాధిస్తా.. నాకు చంద్రబాబుపట్ల ఎల్లప్పుడూ పూర్తి గౌరవం ఉంది. ఆయన నిర్వహణ శక్తిసామర్థ్యాలను ఎప్పుడూ ఆరాధిస్తాను. ఆయన ఎంతో కష్టపడి దీన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు. దాన్ని నేను అర్థంచేసుకుంటున్నా. అదే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి, ఆర్థికమంత్రి ఆయనకు మద్దతుగా నిలుస్తారు. ఫుల్‌టైం సీఈఓ కావాలని ముఖ్యమంత్రి అడిగారు. అందువల్ల పోస్టుస్థాయిని తగ్గించి పోలవరం దగ్గర ఉండి పనిచేసే వ్యక్తిని వెతికి పట్టాలని అధికారులకు చెప్పాం. సీఈఓ నగరంలో కూర్చొని పనిచేయడాన్ని నేను అంగీకరించను. ప్రతిరోజూ పని గురించి నాకు చెప్పాలని నిర్దేశించాను. రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ నా సలహాదారుగా ఉంటారు. ప్రతి మూడురోజులకోసారి ఆయన వెళ్లి పనులను చూసి నాకు నివేదిస్తారు. శాఖాపరంగా సమన్వయలోపం ఏదైనా ఉంటే నేరుగా నా దగ్గరకే రమ్మని ఏపీ సాగునీటిశాఖ కార్యదర్శికి చెప్పాను. మా శాఖలో ఏదైనా సమస్య ఉంటే అంతిమ నిర్ణేతగా నేనే నిర్ణయం తీసుకుంటాను. కేంద్ర, రాష్ట్రాల మధ్య ఎలాంటి ఇబ్బంది లేదు. ఏపీలో అనవసరంగా ఊహాగానాలు ప్రసారం చేస్తున్నారు. అది అబద్ధం. ప్రాజెక్టును 100% పూర్తిచేసే బాధ్యత మాది’’ అని గడ్కరీ పేర్కొన్నారు.

గడ్కరీతో కాకపోతే ఇంకెవ్వరితోకాదు: చంద్రబాబు.. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన జలవనరుల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పనుల వేగం పెరిగినట్లు చెప్పారు. గడ్కరీతో ప్రాజెక్టు కాకపోతే ఇంకెవ్వరివల్లా కాదని వ్యాఖ్యానించారు.

Link to comment
Share on other sites

క్క నెలే గడువు
14-12-2017 02:15:35
636488145399941554.jpg
  • పోలవరం కాంట్రాక్టర్‌కు ఆఖరి అవకాశం
  • కాంక్రీట్‌ పనులు లక్ష్యం ప్రకారం జరగాలి
  • లేదంటే... కొత్త కాంట్రాక్టరుకు అవకాశం
  • గడ్కరీతో సీఎం భేటీలో కీలక నిర్ణయాలు
  • పెరిగిన వ్యయం భరించేందుకు ఓకే!
  • డీపీఆర్‌ పంపితే పరిశీలిస్తామన్న కేంద్రం
  • 2 రోజుల్లో పోలవరం అథారిటీకి సీఈవో
  • కేంద్రం స్పందనపై ముఖ్యమంత్రి హర్షం
న్యూఢిల్లీ, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): పోలవరం కాంక్రీటు పనులను లక్ష్యం ప్రకారం పూర్తి చేయడానికి ప్రధాన కాంట్రాక్టర్‌ ట్రాన్స్‌ట్రాయ్‌కి ‘చివరి అవకాశం’ లభించింది. నెల రోజుల్లోపు పనులు నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకోలేకపోతే... మరొకరికి అప్పగించేలా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్ణయించాయి. అంతేకాదు... పోలవరం ప్రాజెక్టు అంచనాలో పెరిగిన వ్యయాన్ని భరించడంపై రాష్ట్ర ప్రభుత్వ వాదనలను కేంద్రం సానుకూలంగా ఆలకించింది. పెరిగిన వ్యయంతో 8 రోజుల్లో సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌ ) పంపిస్తే కేంద్ర ఆర్థిక శాఖతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చింది. అంతేకాదు... పోలవరం అథారిటీకి రెండు రోజుల్లో సీఈవోను నియమిస్తామని తెలిపింది.
 
బుధవారం రాత్రి ఢిల్లీలో కేంద్ర జలవనరుల మంత్రి నితిన్‌ గడ్కరీతో ముఖ్యమంత్రి చంద్రబాబు మూడు గంటలపాటు జరిపిన చర్చల్లో ఈ కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. భేటీ అనంతరం నితిన్‌ గడ్కరీ, చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ‘‘2019లోపు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం మా బాధ్యత. ఏపీ ప్రజల ఆకాంక్ష కూడా ఇదే. ఈ ప్రాజెక్టు భారత ప్రభుత్వానికి ప్రతిష్ఠాత్మకం’’ అని గడ్కరీ తెలిపారు. ఇప్పటికే కేంద్రం రూ. 13వేల కోట్ల మేరకు విడుదల చేసిందని చెప్పారు. బిల్లులను తాము ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నామని, ఇంకా ఏవైనా మిగిలి ఉంటే త్వరలో విడుదల చేస్తామని ఆయన చెప్పారు. ‘‘కాంట్రాక్టు సంస్థ సరిగా పనులు చేయనందుకే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా టెండర్లు పిలిచింది.
 
ప్రస్తుత కాంట్రాక్టరుకు ఒక్క అవకాశం ఇచ్చాం. గడువులోపు పనులు చేయలేకపోతే... ఆ పనిని మరొకరికి అప్పగిస్తాం’’ అని స్పష్టం చేశారు. చంద్రబాబు ఈ విషయంలో ఎంత ఆందోళనతో ఉన్నారో... తాను కూడా అంతే ఆందోళనతో ఉన్నానని గడ్కరీ తెలిపారు. ఒక రాజకీయ నాయకుడుగా కాకుండా ఒక శ్రేయోభిలాషిగా, సోదరుడిగా ఈ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యతను చేపట్టానని చెప్పారు. తమ శాఖ నుంచి ఎలాంటి ఇబ్బందులున్నా తానే స్వయంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
 
‘‘రాష్ట్ర ప్రభుత్వంతో పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నాం. రాజకీయాలతో సంబంధం లేకుండా పోలవరం పూర్తి చేస్తాం. సాంకేతికంగా, ఆర్థికంగా సహకరిస్తాం. ఇది చాలా సున్నితమైన, ప్రజల భావోద్వేగాలతో కూడిన సమస్య అని నాకు తెలుసు. పరిహారం ఖర్చు పెరగడంపై మా విభాగం అధికారులు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అధికారులతో చర్చించారు. డీపీఆర్‌ను సవరించి పంపితే ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చించి అవసరమైన నిధులు విడుదల చేస్తాం’’ అని గడ్కరీ తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో సివిల్‌ ఇంజనీరింగ్‌ పనులను 2018 వరకు పూర్తి చేసేందుకు ప్రణాళికను రూపొందించామని చెప్పారు.
 
సంతోషంగా ఉంది: చంద్రబాబు
పోలవరం ప్రాజెక్టులో ఎదురవుతున్న సమస్యలపై కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీతో, సంబంధిత అధికారులతో ఇంత వివరంగా చర్చించడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఎగువ కాఫర్‌ డామ్‌, అప్‌ స్ర్టీమ్‌ కాఫర్‌ డామ్‌లకు అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామన్నారు. గేట్‌ పనులు సజావుగా సాగుతున్నాయని చెప్పారు. ప్రధానంగా 38 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేరకు జరగాల్సిన కాంక్రీట్‌ పనులు అంత వేగంగా సాగడం లేదని అన్నారు.
 
2014 జూన్‌ వరకు తమ వాటాగా 5,135 కోట్లు ఖర్చు పెట్టామని... భారత ప్రభుత్వం 7500 కోట్లు ఇవ్వాల్సి ఉండగా రు. 4500 కోట్ల వరకు విడుదల చేసిందని చెప్పారు. 3217 కోట్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలను సమర్పించామని, వారు అడిగిన సందేహాలను కూడా తీరుస్తామన్నారు.
 
తాను ఇప్పటికే 21సార్లు ప్రాజెక్టును సందర్శించానని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర జలవనరులమంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు, కేంద్ర జలవనరుల కార్యదర్శి యూపీ సింగ్‌, ఏపీ జలవనరుల విభాగం కార్యదర్శి శశిభూషణ్‌, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ వెంకటేశ్వర్‌ రావు తదితరులు పాల్గొన్నారు. మధ్యలో ట్రాన్స్‌టాయ్‌ కంపెనీ సీఈవో చెరుకూరి శ్రీఽధర్‌ను పిలిచి పనుల పురోగతిపై సమీక్షించారు.
Link to comment
Share on other sites

Kitti gadi news.

పోలవరం చూశాక వైసీపీ నేతల్లో మార్పు వచ్చిందట.. ఎందుకో తెలుసా?
14-12-2017 11:26:14
636488475787647139.jpg

తానొకటి తలిస్తే దేవుడు మరొకటి తలుస్తాడు. ఈ సామెత పాతదే అయినా, నేటి పరిస్థితులకు అతికినట్టు సరిపోతుంది. ఈ విషయం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ నేతలకు ఇటీవల బాగానే అర్ధమయ్యి ఉంటుంది. ఎలా అంటారా, పోలవరం ప్రాజెక్టును చూడటం ద్వారా! ఇప్పటివరకు పత్రికలు, మీడియా కధనాలు, సీఎం చంద్రబాబు ప్రసంగాల ద్వారా తెలుసుకుని "ఆ! ఏముందిలే.. అంతా రాజకీయ జిమ్మిక్కు'' అనుకుని, పోలవరంపై రకరకాల విమర్శలు చేసేవారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతలు. తీరా ప్రాజెక్టు పనులు చూశాక మాత్రం అందరిలో కాకపోయినా, కొందరిలో మాత్రం మార్పు వచ్చిందండోయ్. అదెలా అంటారా? అసలు ప్రాజెక్టు పూర్తికాదు అన్న మహాశయులే.. ఇప్పుడు మళ్లీ లెక్కలు కట్టి, కొన్ని పనులు పూర్తికావడానికి 26 నెలల పైనే పడుతుందని అంచనాకి వచ్చేశారు. ఇంతకీ వారు వేసిన లెక్కలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
 
             నిర్మాణాత్మక విమర్శలు వచ్చినప్పడే అధికారపక్షంవారు వాటిని స్వాగతిస్తారు. అంతేకానీ, పనిగట్టుకుని విమర్శలు చేస్తూ ఉంటే ఎవరూ పట్టించుకోరు. పోలవరం ప్రాజెక్టు విషయంలో అదే జరిగింది. ప్రాజెక్టు పనులను ఎప్పుడూ పరిశీలించని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నేతలు.. విమర్శలు మాత్రం జాస్తిగానే చేసేవారు. తమ పార్టీకి చెందిన కొందరు ఇచ్చే నెగిటివ్ ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా తెగ విమర్శలు చేస్తూ, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని చూసేవారు. ఒకటి, రెండుసార్లు ఆ విమర్శలను స్వీకరించిన అధికార తెలుగుదేశం పార్టీ, తర్వాత నుంచి వాటిని పట్టించుకోవడమే మానేసింది. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే పోలవరం ప్రాజెక్టు పనులను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ ప్రజాప్రతినిధులు బృందం పరిశీలించింది. ఈ బృంద సభ్యులు తమ సహజశైలిలోనే విమర్శలు కూడా గుప్పించారు. అయితే అందరూ కాదండోయ్. టెక్నికల్ నాలెడ్డి లేని నేతలు మాత్రమే విమర్శలు చేశారు. టెక్నికల్ నాలెడ్జీ ఉండి, పనుల పట్ల అవగాహన కలిగిన కొందరు నాయకులు మాత్రం ముక్కున వేలేసుకున్నారు. పనులు బాగానే జరుగుతున్నాయనే అభిప్రాయానికి వచ్చారు. వారిలో కొందరు బడా కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు. వారయితే ఒక అడుగు ముందుకు వేసి, ఈ ప్రకారం పనులు జరిగితే, మరో 26 నెలల్లో గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వడం సాధ్యపడుతుందని అంచనాకి కూడా వచ్చేశారు.
 
               పోలవరం ప్రాజెక్టుని సందర్శించిన వైసీపీ బృందంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అప్పటివరకు ప్రాజెక్టు గురించి పేపర్లలోనే చదవడం అలవాటైన ఆ ప్రజాప్రతినిధులు, ఒక్కసారి ప్రాజెక్టు వైపు వెళ్లి స్వయంగా పరిశీలిస్తే ఎలా ఉంటుందో అనుకున్నారో ఏమో.. వన్‌ ఫైన్ మార్నింగ్ ప్రాజెక్టును చూడటానికి ఏకంగా బస్సుల్లో తరలివచ్చారు. అలా వచ్చిన ప్రజాప్రతినిధులు రెండు బృందాలుగా విడిపోయారు. ఒక బృందం నేరుగా ప్రాజెక్టు పనులు జరుగుతున్న స్పిల్‌వే దగ్గరకు చేరుకుంది. ఎట్ ద సేమ్ టైమ్.. రెండో బృందం మరొక ప్రాంతంలో నిర్వాసితులతో చర్చల్లో మునిగిపోయింది. స్పిల్‌వే పనులను పరిశీలించిన వైకాపా ప్రజాప్రతినిధులకు పోలవరం ప్రాజెక్టు అధికారులు.. పనులు ఏ విధంగా సాగుతున్నాయో వివరించారు. వారు చెప్పిన వివరాలు, పనులు జరుగుతున్న తీరును అంచనావేసిన కొందరు నాయకులు "ముఖ్యమంత్రి చెబుతున్నట్లు.. 2018 నాటికి గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వడం సాధ్యం కాదు. స్పిల్‌వే పనులు పూర్తి కావడానికి కనీసం 26 నెలలు పడుతుంది. అప్పుడే నీరు ఇవ్వడం సాధ్యమవుతుంది'' అని బహిరంగంగానే అన్నారు. అంతేకాదు, ప్రభుత్వం చెబుతున్నట్లుగా గ్రావిటీ ద్వారా 2018 నాటికి నీరిస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందించాల్సిందే'' అంటూ ఒక ఎంపీ నేరుగా చెప్పారు.
 
         ఇప్పటివరకు పోలవరం పనులు జరగడం లేదని చెప్పిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులే, గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వడానికి 26 నెలలు పడుతుందని అంచానాకు వచ్చారంటే పనులు జరుగుతున్నట్లే కదా అన్నది రాజకీయ విశ్లేషకుల లాజిక్‌! ఆఫ్టర్ దట్, రెండు బృందాల ప్రజాప్రతినిధులు ఒకేసారి, డయాఫ్రం వాల్ పనులు చూడటానికి తరలివెళ్లారు. అక్కడ కూడా టెక్నికల్ నాలెడ్జి ఉన్న ప్రజాప్రతినిధులు, డయాఫ్రం వాల్ పనులు చూసి ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారట. నాలెడ్జి లేని నాయకులు మాత్రం డయాఫ్రం వాల్ ఎక్కడ కడుతున్నారండీ అంటూ విమర్శలకు తెరతీశారు. నదీగర్భంలో ఇప్పటీకే 600 మీటర్ల వాల్ పనులు పూర్తయ్యాయి అని అధికారులు వారికి వివరించే ప్రయత్నంచేయగా, "ఏమిటీ.. నదిగర్భంలోకి మనుషులను పంపకుండా చేసేస్తున్నారా?'' అంటూ తమ వాగ్ధాటిని ప్రదర్శించే ప్రయత్నం చేశారనుకోండి. "అంతా యంత్రాల ద్వారా జరిగిపోతాయి'' అని చెప్పి అవి ఎలా పనిచేస్తున్నాయో చూపించే సరికి వారికి మతిపోయినంత పనైందట.
 
            ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే, ఆ పార్టీ ఫైర్‌బ్రాండ్‌గా చెప్పుకునే రోజా మేడమ్ పల్లెత్తు మాట మాట్లాడకపోవడం. కేవలం డయాఫ్రం వాల్ పనులు మాత్రమే చూసి, ఆమె వెంటనే రిటర్న్ అయ్యారనుకోండి. తర్వాత వైసీపీ నేతలంతా హిల్‌వ్యూ పాయింట్ వద్దకు చేరుకుని పోలవరం ప్రాజెక్టు పనులను అక్కడినుంచి తిలకించారు. ఇంజనీర్లు కూడా ఓపిగ్గా వారు అడిగిన అన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పారు. ఏదో విమర్శలు చేయాలి కాబట్టి.. కొందరు నేతలు మాత్రం తమ నాయకుడు అదేనండీ వైఎస్‌ రాజశేఖరరెడ్డి గొప్పతనం గురించి తరచూ ప్రెస్‌మీట్‌లలో ఊకదంపుడు ప్రసంగాలు చేసేవారు. కానీ.. పోలవరం టూర్‌కు వచ్చిన నాయకులకు మాత్రం ఒక విషయం బాగానే అర్దమయ్యింది. పనులు మాత్రం జరుగుతున్నాయి. అవి కూడా ప్రభుత్వం చెబుతున్నట్లు కాకపోయినా, బాగానే జరుగుతున్నాయన్న అభిప్రాయానికి వారు వచ్చేశారు. పోనీలెండి, ఇప్పటికైనా అందరిలో కాకపోయినా, కొందరు వైసీపీ నేతల్లో అయినా సానుకూల దృక్పథం ఏర్పడటం మంచిదే కదా! ఇదండీ వైసీపీ నేతల పోలవరం టూర్ కథ!!
Link to comment
Share on other sites

హిల్‌వ్యూ కొండపై ముఖ్యమంత్రి సమావేశ మందిరం 
స్థలాన్ని పరిశీలించిన గృహ నిర్మాణ శాఖ పీడీ 
weg-brk1a.jpg

పోలవరం, న్యూస్‌టుడే: పోలవరం ప్రాజెక్టు హిల్‌వ్యూ కొండపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జల వనరుల శాఖ అధికారులు, జిల్లా అధికారులతో సమీక్షకు వీలుగా సమావేశ మందిరం నిర్మించనున్నారు. అందుకు అవసరమైన స్థలాన్ని ఎంపిక చేసినట్లు గృహ నిర్మాణ శాఖ పీడీ కె.శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం పోలవరం వచ్చిన ఆయన పోలవరం డీఎస్పీ ఏటీవీ రవికుమార్‌, ఎస్సై కె.శ్రీహరిరావులతో కలిసి ప్రాజెక్టు హిల్‌వ్యూ కొండ పరిసరాలను పరిశీలించారు. హెలీకాఫ్టర్‌ సమీపంలో ఉన్న స్థలాన్ని గుర్తించామని, అక్కడి మట్టి పరీక్షలు చేయాల్సి ఉందని పీడీ చెప్పారు. ముఖ్యమంత్రి హెలీకాఫ్టర్‌ వచ్చే పది నిమిషాల ముందు అధికారులంతా పరుగు పరుగున హిల్‌వ్యూ కొండకు చేరుకుంటున్నారు. ఈ మధ్యలో పోలీసుల తనిఖీలు నుంచి బయటపడి పరుగులు తీయాల్సి వస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని కలెక్టరు కాటంనేని భాస్కర్‌ ఆదేశాల మేరకు స్థలం పరిశీలించినట్లు పీడీ తెలిపారు. హెలీప్యాడ్‌ సమీపంలోనే సమావేశ మందిరంతో పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు కూర్చునేందుకు వీలుగా హాలు నిర్మాణానికి స్థలాన్ని గుర్తించినట్లు చెప్పారు. ఏపీఎస్పీ కమాండ్‌ కంట్రోల్‌ రూంతో పాటు భద్రత సిబ్బంది అక్కడే ఉండటంతో భద్రతపరంగా అదనంగా తీసుకోవాల్సిన చర్యలు ఏమి ఉండవని పోలీసు అధికారుల్లో అభిప్రాయం వ్యక్తమవుతుంది. అధికారులతో సమావేశం అయిపోయిన వెంటనే ముఖ్యమంత్రి బయలుదేరి హెలీకాఫ్టర్‌లో వెళ్లిపోవడానికి వీలుగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

Link to comment
Share on other sites

ఒక భరోసా!
పోలవరం ప్రాజెక్టుపై గడ్కరీ సమావేశంతో అనుమానాలు పటాపంచలు
ముఖ్యమంత్రి చంద్రబాబు
గన్నవరం - న్యూస్‌టుడే
14ap-main5a.jpg

పోలవరం ప్రాజెక్టుపై బుధవారం కేంద్రమంత్రి గడ్కరీతో జరిగిన సమావేశంతో ఒక భరోసా వచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రధానంగా భూసేకరణ, పునరావాసానికి పూర్తి స్థాయిలో నిధులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించినట్లు చెప్పారు. తొలుత ఇందుకు రూ.2,900 కోట్లు ఖర్చవుతుందని తాము ప్రతిపాదనలు సిద్ధం చేయగా, 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాల్సి రావడంతో ఆ వ్యయం రూ.32 వేల కోట్లకు పెరిగిందని వివరించారు. తాము ఖర్చు చేసే ప్రతి పైసాకు లెక్క చెప్పటానికి సిద్ధంగా ఉంటామని  ఆయన స్పష్టం చేశారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గురువారం మధ్యాహ్నం ఆయన విజయవాడ విమానాశ్రయం చేరుకుని మీడియాతో మాట్లాడారు. దిల్లీలో సీడబ్ల్యూసీ, కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, పోలవరం పథకం అధికారులతో సుమారు 3 గంటలపాటు చర్చించినట్లు తెలిపారు. ఈ చర్చలు సఫలం అయ్యాయని ఓ అవగాహనకు వచ్చామని చెప్పారు. 2018 చివరికల్లా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. పోలవరం పూర్తయితే అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతామన్నారు. ప్రాజెక్టు నిర్మిస్తూనే రైతులకు నీరు అందించేందుకు పట్టిసీమ పథకం ఏర్పాటు చేసి కృష్ణా డెల్టాలో పంటలు పండించినట్లు చెప్పారు. తుపాను ప్రభావం నుంచి కూడా తప్పించుకోగలిగామన్నారు. శ్రీశైలం నుంచి రాయలసీమకు నీటిని విడుదల చేశామన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కొంతమంది అడుగడుగునా అడ్డుపడుతున్నారని, తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని హితవుపలికారు.

ముఖ్యమంత్రికి ఘన స్వాగతం: దిల్లీ నుంచి వచ్చిన ముఖ్యమంత్రికి అధిక సంఖ్యలో తెదేపా నాయకులు, రైతులు ఘన స్వాగతం పలికారు. తెలుగు రైతు కమిటీ జిల్లా మాజీ అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు ఆధ్వర్యంలో రైతులు వరికంకుల దండను సీఎం మెడలో వేశారు. మహిళలు హారతులు పట్టారు.

Link to comment
Share on other sites

అంచనాలు వెనక్కి
12 ప్రశ్నలు సంధించిన కేంద్ర జలసంఘం
సమగ్ర సమాచారంతో సమర్పించాలని సూచన
మళ్లీ కసరత్తు ప్రారంభం
14ap-main7a.jpg

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి కేంద్రానికి పంపిన అంచనాలు వెనక్కి వచ్చాయి. మొత్తం రూ.58,319 కోట్లతో సవరించిన అంచనాలు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నెలలో కేంద్రానికి సమర్పించింది. ఆ అంచనాలు సమగ్రంగా లేవంటూ... అనేక సందేహాలు లేవనెత్తుతూ కేంద్ర జలసంఘం వాటిని వారం క్రితం తిప్పి పంపింది. దాదాపు 12 ప్రశ్నలు వేసింది. ఆ సమాచారాన్ని అంతా క్రోడీకరించి అంచనాలు మార్చి పంపాలని కోరింది. ఆ మేరకు పోలవరం అధికారులు కసరత్తు ప్రారంభించారు. పోలవరంపై 2013-14 లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా కేంద్రం తిరిగి చెల్లిస్తుందని ఇప్పటికే  హామీ ఇవ్వడంతో అనేక నెలల పాటు కసరత్తుచేసి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులతో కూర్చుని చర్చించి... వారి సూచనలను పాటిస్తూ అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించింది.

కేంద్ర జలసంఘం ప్రస్తావనల్లో ముఖ్యాంశాలు
* పోలవరం ఎడమ కాలువ, కుడి కాలువ, ప్రధాన పనులకు 2015-16 లెక్కలతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు సవరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే కేంద్రానికి సమర్పించిన 2013-14 అంచనాలు అంతకన్నా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. ఇందుకు కారణాలు ఏమిటో తెలియజేయాలని అడిగింది.

* 2017-18 అంచనాల ప్రకారం లెక్కిస్తే పోలవరం ప్రాజెక్టుకు ఎంత వ్యయం అవుతుంది? ఈ ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి ఎంత ఖర్చవుతుందని భావిస్తున్నారో ఆ లెక్కలు తెలియజేయమంది.

* తాజా అంచనాలు కూడా సవరించిన తర్వాత మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటే పెట్టుబడి వ్యయం- లాభం నిష్పత్తి ఏ స్థాయిలో ఉంటుందో కూడా విశ్లేషించి ఆ వివరాలు కూడా పంపమంది.

* పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం, కుడి ఎడమ కాలువలలో జరిగిన మొత్తం పని పరిమాణం- ఇంకా పూర్తి కావాల్సిన పని పరిమాణాలను పేర్కొంటూ పూర్తయిన పనికి ఎంత ఖర్చు అయినట్లు, ఇంకా చేయబోయే పనికి ఎంత ఖర్చవుతుందో అంచనాలు విడివిడిగా రూపొందించి పంపాలని కోరింది.

* పోలవరం ప్రాజెక్టులో విద్యుత్కేంద్రం నిర్మాణానికి తాజాగా ఎంత ఖర్చవుతుందని లెక్కిస్తున్నారో చెప్పాలంది.

* ఈఅంచనాలను నేరుగా పంపకుండా పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా తనిఖీ చేయించి పంపాలని కూడా సూచించినట్లు సమాచారం.

* పోలవరం ప్రాజెక్టులో పునరావాసం, భూసేకరణకు సంబంధించి కూడా మరింత సమగ్ర సమాచారం కోరారు.

Link to comment
Share on other sites

పోలవరం టెండర్లకు గడువు పెంపు!
ముఖాముఖి చర్చలకే సీఎం, గడ్కరీ ప్రాధాన్యం
23న రాష్ట్రానికి గడ్కరీ రాక
ఎగువ కాఫర్‌డ్యాంపై 4 రోజుల్లో స్పష్టత

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో సుమారు రూ.1483 కోట్ల మేర పిలిచిన టెండర్ల గడువు మరికొంత కాలం పెంచుతామని జలవనరులశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత గుత్తేదారుకు మరో నెల రోజులు గడువు ఇస్తున్నట్టు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించిన నేపథ్యంలో... టెండరు ప్రక్రియను యథాతథంగా కొనసాగిస్తూనే, దాని గడువును పెంచనున్నామని వెల్లడించారు. పోలవరం పనుల వేగం పెంచేందుకు రాష్ట్రం సూచించిన ఆరు ప్రతిపాదనలపై బుధవారం రాత్రి దిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు, గడ్కరీ కూలంకషంగా చర్చించారు. గతంలో రాష్ట్ర స్థాయిలో 5 ప్రతిపాదనలపై చర్చించి టెండర్లు పిలవాలని నిర్ణయించారు. తాజాగా ఆరోప్రతిపాదన జోడించి కేంద్రమంత్రి వద్ద చర్చలు జరిపారు. గడ్కరీతో సీఎం సమావేశంలో ఉన్నతాధికారులు తప్ప వేరే ఎవరినీ అనుమతించలేదు. గడ్కరీ, ముఖ్యమంత్రి రెండుసార్లు విడివిడిగా చర్చలు జరిపారు. ఆ మధ్యలో అధికారులతో కలిసి చర్చించారు.

గుత్తేదారు ఆర్థిక సమస్యల చర్చించిన త్రిసభ్య కమిటీ ఈ సమావేశం సందర్భంగానే తమ నిర్ణయాన్ని కేంద్రమంత్రికి తెలియజేసింది. గుత్తేదారుతో ఒప్పందాన్ని, షరతులను పరిశీలించిన తర్వాత... ఒప్పందం పరిధిలో గుత్తేదారు కోర్కెలను పరిష్కరించడం సాధ్యమయ్యే పనికాదని చెప్పారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం టెండర్లకు సంబంధించి ప్రతిపాదించిన ఆరు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా... ఎలాగూ 60సి కింద టెండర్లు ఆహ్వానించినందున దానికే మొగ్గు చూపి, గుత్తేదారుకు మరో అవకాశం ఇవ్వాలనే అభిప్రాయానికి వచ్చారు. చివర్లో ప్రస్తుత గుత్తేదారు ట్రాన్స్‌ట్రాయ్‌ ఎండీని పిలిచి ఈ విషయం చెప్పారు. పనుల వేగం పెంచేందుకు తమకు రెండు నెలల గడువు ఇవ్వాలని ఆయన కోరారు. వరద వచ్చేలోపు స్పిల్‌ వే వేగం పెంచాల్సి ఉన్నందున అంత గడువు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పి, నెలరోజుల గడువిచ్చారు. ఆలోగా పని పూర్తి కాకపోతే కొత్తవారికి అప్పగిస్తామని స్పష్టం చేశారు.

23న గడ్కరీ పోలవరం సందర్శన: పోలవరం ప్రాజెక్టు వద్దకు ఈ నెల 23న కేంద్ర మంత్రి గడ్కరీ రానున్నారు. ప్రతి 15 రోజులకోసారి పోలవరంపై కేంద్ర మంత్రి సమీక్షించడమో, ప్రాజెక్టు వద్దకు రావడమో చేస్తారని తెలిసింది. మరో 4 రోజుల్లో ఎగువ కాఫర్‌ డ్యాంకు సంబంధించి స్పష్టత రానుంది.

Link to comment
Share on other sites

9 hours ago, sonykongara said:
అంచనాలు వెనక్కి
12 ప్రశ్నలు సంధించిన కేంద్ర జలసంఘం
సమగ్ర సమాచారంతో సమర్పించాలని సూచన
మళ్లీ కసరత్తు ప్రారంభం
14ap-main7a.jpg

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి కేంద్రానికి పంపిన అంచనాలు వెనక్కి వచ్చాయి. మొత్తం రూ.58,319 కోట్లతో సవరించిన అంచనాలు తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు నెలలో కేంద్రానికి సమర్పించింది. ఆ అంచనాలు సమగ్రంగా లేవంటూ... అనేక సందేహాలు లేవనెత్తుతూ కేంద్ర జలసంఘం వాటిని వారం క్రితం తిప్పి పంపింది. దాదాపు 12 ప్రశ్నలు వేసింది. ఆ సమాచారాన్ని అంతా క్రోడీకరించి అంచనాలు మార్చి పంపాలని కోరింది. ఆ మేరకు పోలవరం అధికారులు కసరత్తు ప్రారంభించారు. పోలవరంపై 2013-14 లెక్కల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా కేంద్రం తిరిగి చెల్లిస్తుందని ఇప్పటికే  హామీ ఇవ్వడంతో అనేక నెలల పాటు కసరత్తుచేసి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులతో కూర్చుని చర్చించి... వారి సూచనలను పాటిస్తూ అంచనాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించింది.

కేంద్ర జలసంఘం ప్రస్తావనల్లో ముఖ్యాంశాలు
* పోలవరం ఎడమ కాలువ, కుడి కాలువ, ప్రధాన పనులకు 2015-16 లెక్కలతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అంచనాలు సవరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే కేంద్రానికి సమర్పించిన 2013-14 అంచనాలు అంతకన్నా ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. ఇందుకు కారణాలు ఏమిటో తెలియజేయాలని అడిగింది.

* 2017-18 అంచనాల ప్రకారం లెక్కిస్తే పోలవరం ప్రాజెక్టుకు ఎంత వ్యయం అవుతుంది? ఈ ప్రాజెక్టు పూర్తయ్యే నాటికి ఎంత ఖర్చవుతుందని భావిస్తున్నారో ఆ లెక్కలు తెలియజేయమంది.

* తాజా అంచనాలు కూడా సవరించిన తర్వాత మొత్తం ప్రాజెక్టు వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుంటే పెట్టుబడి వ్యయం- లాభం నిష్పత్తి ఏ స్థాయిలో ఉంటుందో కూడా విశ్లేషించి ఆ వివరాలు కూడా పంపమంది.

* పోలవరం ప్రాజెక్టులో ప్రధాన డ్యాం, కుడి ఎడమ కాలువలలో జరిగిన మొత్తం పని పరిమాణం- ఇంకా పూర్తి కావాల్సిన పని పరిమాణాలను పేర్కొంటూ పూర్తయిన పనికి ఎంత ఖర్చు అయినట్లు, ఇంకా చేయబోయే పనికి ఎంత ఖర్చవుతుందో అంచనాలు విడివిడిగా రూపొందించి పంపాలని కోరింది.

* పోలవరం ప్రాజెక్టులో విద్యుత్కేంద్రం నిర్మాణానికి తాజాగా ఎంత ఖర్చవుతుందని లెక్కిస్తున్నారో చెప్పాలంది.

* ఈఅంచనాలను నేరుగా పంపకుండా పోలవరం ప్రాజెక్టు అథారిటీ ద్వారా తనిఖీ చేయించి పంపాలని కూడా సూచించినట్లు సమాచారం.

* పోలవరం ప్రాజెక్టులో పునరావాసం, భూసేకరణకు సంబంధించి కూడా మరింత సమగ్ర సమాచారం కోరారు.

Drana started .....katha malli modatiki. BJP worst...induke these guys should get defeated in GJ. But, akkada vunna opposition party inka owrst. Thu, country ku pattina daridram both the parties.

Link to comment
Share on other sites

chandrababu knows that transtroy don't have capability to complete the project. transtroy got the contract with russian joint venture. chandrababu protected transtroy at the starting stage. if he removed the transtroy from the contract and give it to navayuga/megha that project could have been completed within two years. what is the use of conducting virtual inspection every monday when the contractor is bad.  contractor is not paying to bills to subcontractors, subcontractors(triveni) unable to pay for labour,diesel then work stopped. now gadkari saving transtroy , if this drama continue project won't complete before elections.

if polavaram completed in first two/three years then there is no need of pattiseema, purushotampatnam lift irrigation our state could saved 3000 crores. it is better for chandrababu to focus on outcome rather than publicity.  people vote based on outcomes. 

Link to comment
Share on other sites

1 hour ago, ravindras said:

No offense.  

May I know ur proffession n Dept ??

Jarigina works ke Central govt Bills ivvakunda korrilu pedutunte.. Malli company ni change cheyyala..

Transtroy ni change chesi inko company ki works kattabettali ante enni 1000's of crores baaram padutundho meeku telusa ??

Oka aa 1000's of crores bariddham anukundham.. Malli project estimation according to 2017 enni 1000's crores additional ga baaram padutundho meeku telusa ??

Company change chesthunandhuku Entha time, Man Power hours, Mechinary hours  waste avutundho meeku telusa ??

Ee Additional Cost antha Central govt ivvadaniki ready ga vundhi anukuntunnara ??

2013 LA Act teesukochina oka central govt (Inc govt proposed BJP supported) ee inko govt (BJP govt) ivvamu antundhi..

Navayuga ki isthe 2 years lo complete chesethara ??? 

CBN Mari antha telivi takkuva manishi laga kanapadutunnada meeku :sleep:

Link to comment
Share on other sites

1 hour ago, ravindras said:

chandrababu knows that transtroy don't have capability to complete the project. transtroy got the contract with russian joint venture. chandrababu protected transtroy at the starting stage. if he removed the transtroy from the contract and give it to navayuga/megha that project could have been completed within two years. what is the use of conducting virtual inspection every monday when the contractor is bad.  contractor is not paying to bills to subcontractors, subcontractors(triveni) unable to pay for labour,diesel then work stopped. now gadkari saving transtroy , if this drama continue project won't complete before elections.

if polavaram completed in first two/three years then there is no need of pattiseema, purushotampatnam lift irrigation our state could saved 3000 crores. it is better for chandrababu to focus on outcome rather than publicity.  people vote based on outcomes. 

ippudu megha vadiki ivvataniki tenders  pilichindi adi telusa miku, dani ni enduku aputunnaru

Link to comment
Share on other sites

Asala bills Transtroy company ki ekkada isthunnaru ?? 

Direct ga sub contracts vallaki pay chesthunte.. adhega Transtroy gadi edupulu.. maku bills ivandi memu subs ki pay chestham ani chepthunnaru Transtroy odu..

Central govt works chesina bills ivvakunda timepass chesthunte ekkada nunchi techi payments istharu ?? Idhemanna 10, 20 rupees anukunnaru pocket lo nunchi teesi ivvadaniki ??

Link to comment
Share on other sites

1 hour ago, ravindras said:

if polavaram completed in first two/three years then there is no need of pattiseema, purushotampatnam lift irrigation our state could saved 3000 crores. it is better for chandrababu to focus on outcome rather than publicity.  people vote based on outcomes. 

Total immature post bro..  

So AA 3 years water lekunda pantalu endipoina parledha ?! Daaham lo manushulu alladipothunna parledha ??

Major irrigation project 3 years lo complete ayipothadha which involves 1000's of crores.. idhemanna SSR movie BB setting aa :sleep:

Mana vuralalo 5 floor appartments kattadaniko enni days teesukuntaru enti ??

Polaram project ante edho concrete  matti dibba anukuntunnara.. 

Chaduvukunna janale ilaa vunte.. inka aa YCP leaders chese Mathi Leni vimarshalaki meeru nammadam peddha vinthem kadhuu :D

Link to comment
Share on other sites

2 hours ago, ravindras said:

chandrababu knows that transtroy don't have capability to complete the project. transtroy got the contract with russian joint venture. chandrababu protected transtroy at the starting stage. if he removed the transtroy from the contract and give it to navayuga/megha that project could have been completed within two years. what is the use of conducting virtual inspection every monday when the contractor is bad.  contractor is not paying to bills to subcontractors, subcontractors(triveni) unable to pay for labour,diesel then work stopped. now gadkari saving transtroy , if this drama continue project won't complete before elections.

if polavaram completed in first two/three years then there is no need of pattiseema, purushotampatnam lift irrigation our state could saved 3000 crores. it is better for chandrababu to focus on outcome rather than publicity.  people vote based on outcomes. 

Seems like you have zero knowledge on polavaram...who roped in triveni, bauer,keller?  Do you know how much work has been completed in 2017?  do you think Polavaram is trivial project?

Polavaram is lifeline to Andhra and our sentiments are linked it. Don't make cheap allegations. You sounded like ippala R.

Link to comment
Share on other sites

1 hour ago, Jeevgorantla said:

If CBN backed Transstroy, this wouldn't have happened. Ippala gadi name gurthu vasthe naku "count starts with 132" tweet gurthuku vasthundhi :roflmao:

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...