Jump to content

polavaram


Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply
గిపోతే కట్టలేం
పోలవరంపై నాకేం భేషజాలు లేవు
నమస్కారం పెట్టి కేంద్రానికి అప్పగిస్తా
పోలవరం పూర్తి కావడమే కావాలి
కేంద్రం లేఖతో గందరగోళం
అధికారులే అడ్డు తగులుతున్నారు
ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు
ఈనాడు - అమరావతి
30ap-main1a.jpg
ఈ రోజు మళ్లీ చెబుతున్నా. ఈ ప్రాజెక్టు మేం చేపడతామని ఎప్పుడూ కోరలేదు. కేంద్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టు చేపడతానంటే నాకెలాంటి అభ్యంతరమూ లేదు. నాకు ఎలాంటి భేషజాలూ లేవు. ప్రజలందరూ కోరుకుంటే, రేపు ఉదయానికల్లా ఈ ప్రాజెక్టును వారికి అప్పగించేస్తా. ఇంకా కావాలంటే కేంద్రమే సుమోటోగా ఈ ప్రాజెక్టును తీసుకుని చేపట్టవచ్చు. నాకు కావాల్సిందల్లా ఈ ప్రాజెక్టు సకాలంలో పూర్తి కావడమే. ఇది మన రాష్ట్ర ప్రజల జీవనాడి. దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టి తీరుతాం. ఎవరు ఈ ప్రాజెక్టు చేసినా సకాలంలో పూర్తి కావాలి.
- శాసనసభలో చంద్రబాబు

పోలవరం స్పిల్‌వే పనుల టెండర్లు ఆపాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రాసిన లేఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం శాసనసభలో తీవ్రంగా స్పందించారు. పోలవరం పనులు ఎంతో వేగంగా జరుగుతున్న ఈ దశలో కేంద్రం నుంచి వచ్చిన లేఖ లేనిపోని గందరగోళం సృష్టిస్తోందన్నారు. ఈ దశలో ప్రాజెక్టు ఆగిపోతే కట్టడం కష్టమని శాసనసభలో పేర్కొన్నారు. అసెంబ్లీ లాబీల్లోనూ ఇదే విషయమై విలేకరులతో మాట్లాడుతూ ఇంకొంత తీవ్రంగా స్పందించారు. పిలిచిన టెండర్లను   కేంద్రం నిలిపేయమంటోందని,  ఇలా ఆపమంటే వారికే పనులు అప్పగించి నమస్కారం పెట్టేస్తానని అన్నారు. పోలవరంపై వాస్తవాలు ప్రజల ముందు పెడతానని చెప్పారు. అంతకుముందు శాసనసభలో ‘రాష్ట్ర విభజన అంశాలు, కేంద్ర ఆర్థిక సాయం’ అనే అంశంపై జరిగిన లఘు చర్చలో చంద్రబాబు ప్రసంగిస్తూ కేంద్ర వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 60-సి కింద కొన్ని పనులను వేరే కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన అవసరముందని, దానికి సంబంధించి అందరితో చర్చించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచిందన్నారు. అయితే కేంద్రంలోనూ కొంతమంది అధికారులు ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని చెప్పారు. ఈ టెండర్ల ప్రక్రియను నిలిపేయాలని ఆదేశిస్తూ లేఖ రావడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ‘‘ఎన్నో వ్యయప్రయాసలుపడి పోలవరాన్ని ఈ స్థితికి తీసుకొచ్చాం. ‘60-సి’ కింద కొన్ని పనులను వేరే కాంట్రాక్టర్లకు ఇచ్చి చేయాల్సి ఉంది. అలాంటి సమయంలో కేంద్రం ఈ టెండర్లు ఆపాలని లేఖ రాసింది. ఇప్పటికే అక్కడ నాలుగువేల మంది పనిచేస్తున్నారు, ఆరేడు ఏజెన్సీలు విధులు నిర్వహిస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులున్నా రాష్ట్ర ప్రభుత్వం రూ.4వేల కోట్లు ఖర్చు పెట్టింది. కేంద్రం లేఖతో ఈ ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. నాలుగైదు నెలలు ఈ ప్రాజెక్టు జోలికెళ్లకపోతే చాలా నష్టం, నిర్మాణ వ్యయం పెరుగుతుంది. ఇప్పటికే రూ.12వేల కోట్లు ఖర్చయ్యాయి. మరో రూ.42వేల కోట్లు వెచ్చిస్తే ప్రాజెక్టు పూర్తవుతుంది. అంచనాలు పెరగడానికి కారణం భూసేకరణ వ్యయం పెరగడమే. రూ.9200 కోట్లు వ్యయం అయ్యే భూసేకరణ, పునరావాస వ్యయం ఇప్పుడు రూ.32వేల కోట్లకు చేరుకుంది. దానికి కారణం కేంద్రం తీసుకొచ్చిన భూ సేకరణ చట్టమే. అక్కడ నిర్వాసితుల సమస్య చాలా సున్నితమైంది. దాదాపు 2లక్షల మంది గిరిజనులు, 90వేల గిరిజన కుటుంబాలకు పునరావాసం, పరిహారం కల్పించాలి. ఇంకా 60 వేల ఎకరాలు భూ సేకరణ చేయాలి. పెద్దఎత్తున ప్రాజెక్టు పనుల కోసం యంత్రాలు, కార్మికులు, ఏజెన్సీలను ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడు ఈ పనులు ఆగిపోతే వారంతా వెనక్కి వెళ్లిపోతారు. మళ్లీ వారు వచ్చి పనులు చేపట్టాలంటే చాలా ఆలస్యం అవుతుంది. ఎన్ని రోజులు ప్రాజెక్టు ఆలస్యమైతే అన్ని వేలకోట్ల రూపాయల అధిక భారం పడుతుంది. దీనిపై మాట్లాడటానికి నితిన్‌ గడ్కరినీ సంప్రదించే ప్రయత్నం చేశాను, కానీ ఆయన లండన్‌లో ఉండటంతో వీలు కాలేదు. ఆయన్ను కలిసి అన్ని విషయాలు వివరిస్తాను.

ప్రధానమంత్రిని కలుస్తా...: రాష్ట్ర విభజన సమస్యలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఒకటి రెండు రోజుల్లో కలుస్తా. రాష్ట్ర సమస్యలను నివేదించి పరిష్కారం కోరతాను. రాష్ట్ర సమస్యలపై ఇప్పటికి 62 సార్లు దిల్లీకి వెళ్లొచ్చాను. రాజధానికి కేంద్రం ఇప్పటి దాకా రూ.2500 కోట్లు ఇచ్చింది. మరో రూ.వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పింది. కేంద్ర సంస్థల కోసం 2,911 ఎకరాలు ఇచ్చాం. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, అయితే 14 ఆర్థిక సంఘం సిఫారసులతో వీలుకాదని హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామంటే సరేనన్నాను. ఎందుకంటే ఐదారేళ్ల వరకు కేంద్రం నుంచి ఎలాంటి సాయం రాకపోతే తట్టుకునే పరిస్థితుల్లో రాష్ట్రం లేదు. నేనేమీ ప్రత్యేకహోదాను త్యాగం చేయలేదు, రాష్ట్ర ప్రయోజనాలను ఆలోచించే ప్యాకేజీకి అంగీకరించాను.
ప్యాకేజీ గురించి వైకాపా నేతలు నాపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ పార్టీ నేతలు గతంతో ఏం చెప్పారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని ప్రకటించారు. మరి ఆ పార్టీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయలేదు. ఆ పార్టీ ఎందుకు ప్రత్యేక హోదాపై గట్టిగా మాట్లాడటం లేదు, ప్రశ్నించడం లేదు. వారికి కేవలం రాజకీయాలు కావాలి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

అడ్డంకులు ఎందుకో తెలియడం లేదు..
శాసనసభ వాయిదా పడ్డాక లాబీల్లో తనను కలిసిన విలేకరులతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తాను ఆశావాదినని, పోలవరం సమస్య పరిష్కారం కోసం చివరికంటా ప్రయత్నిస్తానని, ఏ విషయంలోనూ రాజకీయం చేయనని చెప్పారు.   పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అడ్డంకులు ఎందుకొస్తున్నాయని విలేకరులు ప్రశ్నించగా... ‘‘ఎందుకో నాకూ అర్థం కావటం లేదు. ఉన్నతాధికారులతో సమస్యా, కేంద్రంతోనే సమస్యనా అన్నది తెలియటం లేదు. అప్పట్లో సీఎం అంజయ్య పోలవరానికి ఎందుకు పునాది రాయి వేశారో తెలియదు. అప్పటికి ఏ అనుమతీ రాలేదు. భూసేకరణా జరగలేదు. భాజపా వాళ్లను కూడా దిల్లీకి వెళ్లి కేంద్రంతో మాట్లాడమని చెప్పా. కొర్రీలు వేయకుండా పనులు జరిగేలా చూడమని కోరమన్నా. అవసరమైతే ప్రతిపక్షాన్ని కూడా దీనిపై దిల్లీకి రమ్మని అడుగుతాం. మిత్రపక్షం కాబట్టే సంయమనంతో ఓపికతో ఉన్నాం. ప్రాజెక్ట్‌కి సహకరిస్తే ఫలితం వస్తుంది. లేకుంటే కష్టం మిగులుతుంది’’ అని పేర్కొన్నారు. విభజన సమయంలో రాష్ట్రానికి న్యాయం చేయాలని చివరికంటా ప్రయత్నించానని తెలిపారు. పార్లమెంటులో చర్చ జరిగే సమయంలో భాజపా అగ్రనేత అద్వానీ గదిలో కూర్చుని తాను చేయాల్సిన ప్రయత్నమంతా చేశానని, చివరికి చేయి దాటిపోవటంతో నమస్కారం పెట్టి వచ్చేశాననని వివరించారు.

పోలవరం గడువులోగా పూర్తవుతుంది
భాజపాపక్ష నేత విష్ణుకుమార్‌రాజు వెల్లడి
ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కంగారు పడాల్సిన అవసరం లేదని.. చిన్నా, చితక సాంకేతిక సమస్యలు ఎదురైనా గడువులోగా ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరిస్తుందని శాసనసభలో భాజపా పక్ష నాయకుడు విష్ణుకుమార్‌రాజు వ్యాఖ్యానించారు. గురువారం సచివాలయ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించాక మళ్లీ అడ్డంకులు ఎందుకు సృష్టిస్తుందని ప్రశ్నించారు. సాంకేతికంగా తలెత్తే సందేహాలను నివృత్తి చేసుకోవడానికి కేంద్రం లేఖరాసినంత మాత్రాన పనులెలా నిలిచిపోతాయన్నారు. వీటికి రాష్ట్ర ప్రభుత్వం తగిన సమాధానమిచ్చి పనులు యధాతథంగా చేపట్టొచ్చన్నారు. ఆరు నుంచి పన్నెండు నెలలు ఆటు ఇటుగా పోలవరం ప్రాజెక్టు గడువులోగా పూర్తవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

Link to comment
Share on other sites

కేంద్రానికో దండం!
01-12-2017 01:57:07
 
636476902289635721.jpg
  • సాయం చేయలేమంటే ఇంకేం చేస్తాం?
  • పోలవరం ప్రాజెక్టు వారికే అప్పగిస్తాం
  • సుమోటోగా తీసుకున్నా అంగీకారమే
  • పనులు పూర్తి కావడమే ముఖ్యం
  • ఒక్కసారి బ్రేక్‌ పడితే తీవ్ర ప్రభావం
  • మిత్రపక్షం కాబట్టి సంయమనం
  • మళ్లీ కేంద్రానికి పరిస్థితి చెబుతాం
  • ఆశావాదిని.. ప్రయత్నాలు ఆపను
  • సహకరిస్తే ఫలితం వస్తుంది... లేకపోతే కష్టం మిగులుతుంది
  • సభలో, బయటా సీఎం ఆక్రోశం
  • టెండర్లు ఆపమనడంపై ఆగ్రహం
 
బాబు ఆక్రోశం
పోలవరంపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్వరం పెంచారు. నవ్యాంధ్ర జల-జీవ నాడిగా భావిస్తున్న ప్రాజెక్టుపై కేంద్రం పెడుతున్న కొర్రీలు, కొడుతున్న గండ్లపై ఆవేదన, ఆక్రోశంతోపాటు ఒకింత ఆగ్రహమూ వ్యక్తంచేశారు.
 
 
అమరావతి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): పోలవరం స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ టెండర్ల ప్రక్రియ ఆపాలంటూ కేంద్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి అమర్జిత్‌సింగ్‌ లేఖ రాయడంపై అసెంబ్లీలో, సభ బయట చంద్రబాబు స్పందించారు. కేంద్రం లేఖ రాసిన నేపథ్యంలో టెండర్లను నిలిపివేస్తారా అని ఒక విలేకరి ప్రశ్నించగా ‘‘మొత్తం పరిస్థితిని వారికి వివరిస్తాం. అయిప్పటికీ ఆపివేయాల్సిందే అని చెబితే... అలాగే చేసి, ప్రాజెక్టును కేంద్రానికే అప్పగిస్తాం. పోలవరం ప్రాజెక్టు పూర్తికి సాయం చేయాలని పదేపదే అడుగుతున్నాం. సాయం చేయలేమని వారు చెప్పారనుకోండి... ఏం చేస్తాం! నమస్కారం పెట్టి తప్పుకొంటాం!’’ అని తేల్చిచెప్పారు.
 
 
అయితే, తాను ఆశావాదినని, చివరి నిమిషం వరకూ తన ప్రయత్నం తాను చేస్తూనే ఉంటానని అన్నారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే పూర్తిచేస్తామంటే తక్షణమే ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎవరు కట్టినా ప్రాజెక్టు పూర్తికావడమే నా జీవితాశయం. ఈ విషయంలో ఎలాంటి భేషజాలూ లేవు’’ అని చంద్రబాబు సభా సాక్షిగా ప్రకటించారు. అన్ని రకాల సమస్యలను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ పనులు చేస్తున్నామని, ఒక్కసారి ఆగితే వాటిని గాడిన పెట్టేందుకు చాలా సమయం పడుతుందని తెలిపారు. ‘‘ప్రాజెక్టుకోసం నాలుగువేల మంది పని చేస్తున్నారు. వందలకొద్దీ యంత్రాలున్నాయి. విదేశీ కంపెనీలూ పని చేస్తున్నాయి. పని ఒక్కసారిగా ఆగితే మళ్లీ అందర్నీ ఒకచోటకు తీసుకురావడానికి చాలా కష్టమవుతుంది’’ అని చంద్రబాబు వివరించారు.
 
 
టెండర్ల ప్రక్రియ ఆపాలని పత్రికల్లో కూడా వచ్చిన నేపథ్యంలో దానిపై తాను స్పందించాల్సిన అవసరం ఉందంటూ పరోక్షంగా ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రస్తావించారు. ‘‘నేను పోలవరం ప్రాజెక్టును కావాలని తీసుకున్నానని కొందరు విమర్శిస్తున్నారు. తొలుత ఈ బాధ్యతను నాబార్డుకు ఇస్తామన్నారు. తర్వాత రాష్ర్టానికి దీనిపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది నీతి ఆయోగ్‌ సిఫారసు మేరకే మనకు ఇచ్చారు. ప్రాజెక్టుపై కోర్టుల్లో కేసులు వేస్తున్నారు. గ్రీన్‌ ట్రిబ్యునల్‌కు వెళ్తున్నారు. ఓ వైపు వాటిని ఎదుర్కొంటున్నాం! మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా ప్రాజెక్టుకు ఖర్చు పెడుతున్నాం.
 
 
ఇప్పటివరకూ రూ.4వేల కోట్లు రాష్ట్ర నిధులు ఖర్చుచేశాం. ప్రాజెక్టును పూర్తి చేయాలన్నదే మా లక్ష్యం. లేదా కేంద్రమే నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని బాధ్యత తీసుకున్నా, రాష్ట్రమంతా ఒప్పుకొని కేంద్రానికి ఆ పనులు అప్పగించాలని చెప్పినా వెంటనే కేంద్రానికి ఇచ్చేస్తాం. కావాలంటే సుమోటోగా కూడా తీసుకోవచ్చు. ఎవరు చేసినా ప్రాజెక్టు పూర్తే ధ్యేయం. ఇందులో రెండో ఆలోచనే లేదు’’ అని ముఖ్యమంత్రి వివరణ ఇచ్చారు. ప్రాజెక్టు ఆలస్యంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
 
 
దశాబ్దాల ఆలస్యం...
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఇప్పటికే దశాబ్దాలు ఆలస్యమైందని చంద్రబాబు గుర్తుచేశారు. కాంగ్రెస్‌ పాలకులు ప్రాజెక్టు ప్రారంభించి వదిలేశారని... పనులు మాత్రం కదల్లేదని తెలిపారు. తాము వచ్చాకే టెండర్లు పిలిచి పనులు వేగంగా చేపట్టామన్నారు. ‘‘పనులు ఆలస్యం కాకూడదన్న ఉద్దేశంతో 60(సి) నిబంధన కింద కొన్ని పనులను వేరే సంస్థలకు ఇవ్వాలని భావించి, టెండర్ల ప్రక్రియ చేపట్టాం. ఈ సమయంలో కేంద్రంలోని కొందరు అధికారులు అడ్డంకులు సృష్టించేలా లేఖ రాశారు’’ అని తెలిపారు. నర్మదా నదిపై చేపడుతున్న సరోవర్‌ ప్రాజెక్టు 65 ఏళ్లుగా అక్కడే ఉందని, పోలవరం అలా కాకూడదనేది తన ఆకాంక్ష అని చంద్రబాబు చెప్పారు.
 
 
కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ సర్కారు తెచ్చిన కొత్త భూసేకరణ చట్టం వల్లే ప్రాజెక్టు వ్యయం అమాంతం పెరిగిందని తెలిపారు. పేదలు, గిరిజనులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో భారీగా పరిహారం చెల్లిస్తున్నామన్నారు. కొత్త చట్టం వల్ల పునరావాసం, పరిహార వ్యయమే రూ.32వేల కోట్లు పెరిగిందన్నారు. తాజా లేఖపై కేంద్ర మంత్రి గడ్కరీతో మాట్లాడేందుకు ప్రయత్నించానని, ఆయన లండన్‌లో ఉన్నారని తెలిసిందన్నారు. ఆయన అందుబాటులోకి రాగానే మాట్లాడతానన్నారు.
 
 
ఇదీ సమాధానం...
అసెంబ్లీ వాయిదా అనంతరం చంద్రబాబు మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఇచ్చిన సమాధానాలు ఇవి...
 
 
కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన లేఖ మేరకు టెండర్లను ఆపి వేస్తారా?
పరిస్థితిని వారికి వివరిస్తాం. అయినా ఆపుచేయమంటే ఆపుచేసి ప్రాజెక్టు వారికే అప్పగిస్తాం. కానీ... పనులు ఆపడం తేలికే. పరుగులు పెడుతూ పనులు జరుగుతున్న చోట ఒక్కసారి ఆపితే ఆ స్పీడుకు బ్రేకులు పడతాయి. పనులు చేసేవారు యంత్రాలను సర్దుకొని ఎటువారు అటు వెళ్లిపోతారు. మళ్లీ వారిని తీసుకువచ్చి పట్టాలపైకి ఎక్కించడం చాలా కష్టం!
 
 
టెండర్లను ఆపాలన్న నిర్ణయం అధికారులదా లేక కేంద్రానిదా?
ఆ విషయం నాకు కూడా అర్థం కావడంలేదు!
 
 
బీజేపీ మిత్రపక్షం కాబట్టి సహనంతో ఉంటున్నారా?
ఔను. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం మా మిత్రపక్షం. అందుకే ఒకటికి పదిమార్లు మా అవసరాలు, సమస్యలు వివరిస్తున్నాం. సమయం తీసుకొని ప్రధాన మంత్రిని కూడా కలుస్తాను. ఆయన గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. సమస్యను వివరించడం నా బాధ్యత. మా ప్రయత్నం మేం చేస్తాం. సహకరించమని కోరతాం. ఫలితం సానుకూలంగా ఉంటుందని ఆశిస్తున్నాం. లేకపోతే ఏం చేయాలో అప్పుడు నిర్ణయించుకొంటాం! కేంద్రం సహకరిస్తే ఫలితం వస్తుంది. లేకుంటే... నా కష్టం ఒక్కటే మిగులుతుంది.
 
 
పోలవరంపై మీకు కేవీపీ లేఖ రాశారు కదా!
పోలవరం ప్రాజెక్టు క్రెడిట్‌ను మాజీ ముఖ్యమంత్రి అంజయ్యకు ఇవ్వాలని కేవీపీ కోరారు. అప్పటికి భూమి సేకరించలేదు. ప్రాజెక్టట డిజైన్లు లేవు. ఇంజనీర్ల డ్రాయింగ్స్‌ లేవు. ఆరోజున అంజయ్య ఎందుకు శంకుస్థాపన చేశారో కూడా తెలియదు. కేవీపీ లేఖలో ఏం అర్థం ఉంది?
 
 
సర్వత్రా అదే చర్చ!
పోల‘వరానికి’ కేంద్రం గండి... శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం రాజకీయంగా తీవ్ర చర్చకు తెరలేపింది. గురువారం శాసనసభా ప్రాంగణంలో పలువురు ఎమ్మెల్యేలు కేంద్రం తీరుపట్ల ఇటీవలే తాము స్వయంగా పనులు పరిశీలించామని... శరవేగంగా సాగుతున్న ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డుపడటం ఎంతమాత్రం తగదని అభిప్రాయపడ్డారు.
 
 
ముఖ్యమంత్రి మాట...
‘‘నేను రాజకీయం చేయడం లేదు. నాకు ఆ అవసరం లేదు. పోలవరం పూర్తి చేయడం నా ప్రధాన లక్ష్యం. దీని కోసం మేం చేస్తున్న ప్రయత్నాలకు బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా తోడుగా నిలవాలని, తమ వంతు ప్రయత్నం చేయాలని, ఢిల్లీ వెళ్లి మాట్లాడాలని నేను కోరాను. వాళ్లు మాట్లాడితే కొంత ఉపయోగం ఉంటుందని మా ఆశ. ప్రతిపక్షంతో సహా అందరినీ తీసుకొని ఢిల్లీ వెళ్తే బాగుంటుందంటే అందుకూ నేను సిద్ధమే. నాకు భేషజాలు లేవు. ప్రాజెక్టు పూర్తి కావాలి. అంతే! నాకేమీ వ్యక్తిగత అజెండా లేదు. నాకు వ్యక్తిగతంగా ఎవరితోనూ విరోధం లేదు. వాస్తవాలన్నీ ప్రజల ముందు ఉంచుతాం. వారే అర్థం చేసుకుంటారు. జరుగుతున్న పరిణామాలు ప్రజలకు వివరించడం నా బాధ్యత’’.
Link to comment
Share on other sites

అయినా.. ముందుకే!
01-12-2017 01:59:56
 
636476903974143217.jpg
  • టెండర్ల ప్రక్రియ కొనసాగిద్దాం
  • పోలవరంపై ప్రభుత్వ తీర్మానం
  • సీఎం ఉన్నతస్థాయి సమీక్ష
  • ఆన్‌లైన్‌లో వివరాలు అప్‌లోడ్‌
  • ‘ఆంధ్రజ్యోతి’ కథనంతో సంచలనం
‘‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇప్పటికే దశాబ్దాల ఆలస్యం జరిగింది. ఇది మరో నర్మదా సరోవర్‌ ప్రాజెక్టు కాకూడదన్నదే మా ఉద్దేశం. నాకు భేషజాలు, వ్యక్తిగత అజెండాలు లేవు. పనులు ఎవరు చేసినా ఫర్వాలేదు! ప్రాజెక్టు నిర్ణీత గడువులోగా పూర్తి కావడమే నాకు కావాలి! ఒక్కసారి పనులకు బ్రేక్‌ పడితే... మళ్లీ గాడిన పెట్టడం కష్టం! 
-చంద్రబాబు 
 
అమరావతి, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు టెండర్లపై ఏదిఏమైనా ముందుకే సాగాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది. లక్ష్యం ప్రకారం పనులు పూర్తి చేసేలా... స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌లకు విడిగా పిలిచిన టెండర్ల ప్రక్రియను కొనసాగించాలని తీర్మానించింది. ఇందులో భాగంగా గురువారం పోలవరం స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌, మట్టి పనులకు పత్రికల్లో పిలిచిన టెండర్లను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసింది. స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌ టెండర్ల ప్రక్రియ ఆపివేయాలంటూ కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్‌ సింగ్‌ లేఖ రాసినట్లు గురువారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనం కలకలం సృష్టించింది.
 
ఈ అంశంపై గురువారం జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆ శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... అమర్జిత్‌ రాసిన లేఖపై ఈ భేటీలో తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది.
 
స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ పనులు అనుకున్న లక్ష్యం మేరకు పూర్తికావడం లేదని, వాటికి టెండర్లను పిలిచి కొత్త కాంట్రాక్టు సంస్థకు అప్పగిస్తామని కేంద్ర జల వనరులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీకి గతంలోనే సీఎం వివరించిన అంశం ప్రస్తావనకు వచ్చింది. అదేవిధంగా ఈ ఏడాది అక్టోబరు 25న ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీతో మంత్రి దేవినేని ఉమా, ఇతర ముఖ్య అధికారులు నిర్వహించిన సమీక్షా సమావేశంలోనూ ఇదే విషయం చెప్పారు. అప్పుడు గడ్కరీ సానుకూలంగానే స్పందించారు.
 
 
కానీ... కేంద్ర జల వనరులశాఖ కార్యదర్శి అమర్జిత్‌ సింగ్‌ మాత్రం తొలి నుంచీ పోలవరం ప్రాజెక్టుకు అడ్డుపడుతూ వచ్చారని ఈ సమావేశంలో అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. పోలవరం అంచనాల సవరణ విషయంలోనూ అమర్జిత్‌ సింగ్‌ ఇదే తరహాలో వ్యవహరించారని పేర్కొన్నారు. ‘కాగ్‌’ పోలవరం పనుల వ్యయంపై ధ్రువీకరణ పత్రం సమర్పించినా కొర్రీలు వేయడం, నిధులు ఇవ్వడంలో జాప్యం చేయడం వంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అదేవిధంగా.. ఎగువ కాఫర్‌ డ్యామ్‌ పనులు ప్రారంభించవద్దంటూ అమర్జిత్‌ సింగ్‌ ఆదేశించడంపైనా చర్చ జరిగింది. పోలవరం ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్‌స్ట్రాయ్‌తోనే పనులు కొనసాగిస్తే నిర్దిష్ట గడువులోగా ప్రాజెక్టు పూర్తికాదనే అభిప్రాయం వ్యక్తమయింది.
 
 
‘‘ఇప్పుడు టెండర్లను ఖరారు చేయకపోతే ఒక నీటి సంవత్సరం వృథా అవుతుంది. అందువల్ల స్పిల్‌ వే, స్పిల్‌ చానల్‌కు పిలిచిన టెండర్ల ప్రక్రియను కొనసాగిద్దాం’’ అని తీర్మానించారు. దీనికి సంబంధించి రూ.1483 కోట్ల టెండర్ల షెడ్యూళ్లను జల వనరుల శాఖ అన్‌లైన్‌లో ఆప్‌లోడ్‌ చేసింది. ఇందులో స్పిల్‌వే అంచనా వ్యయం రూ.633 కోట్లు, స్పిల్‌ చానల్‌ రూ.850 కోట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఈ టెండర్ల దాఖలకు డిసెంబరు 20వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. డిసెంబరు 21వ తేదీన టెక్నికల్‌ బిడ్‌లను ఓపెన్‌ చేస్తారు. 23న ఫైనాన్సియల్‌ బిడ్‌లను ప్రారంభిస్తారు.
Link to comment
Share on other sites

జేపీ ఆకలితో ఉంది... ఏపీని కబళించాలని చూస్తోంది: జేసీ
01-12-2017 08:26:25
 
636477135865507765.jpg
అమరావతి: ‘‘బీజేపీ ఆకలితో ఉంది. ఒక్కోరాష్ట్రాన్ని ఆక్రమించాలనుకుంటోంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌ను కూడా కబళించాలని అనుకుంటున్నట్లుంది. అందుకే పోలవరం విషయంలో అవసరంలేని సమస్యలు సృష్టిస్తోంది. కేంద్రం చర్యలపై మాకు అనుమానాలు కలుగుతున్నాయి. చంద్రబాబును నియంత్రించాలనే ఒక దుర్బుద్ధి ఉందనే అనుమానం కూడా ఉంది’’ అని తెలుగుదేశం ఎంపీ, సీనియర్‌ నేత జేసీ దివాకర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం రాత్రి ఆయన ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ‘‘పోలవరం విషయంలో సీఎం చంద్రబాబు తన స్థాయిని తగ్గించుకుని కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు.
 
కానీ, కేంద్రం ఏపీని చిన్నచూపు చూస్తోంది. ఇది వాళ్ల జాగీర్దారు కాదు. మేం వాళ్ల బానిసలమూ కాదు. ఏవైనా అనుమానాలుంటే అడిగి తెలుసుకోవాలి కానీ... పిలిచిన టెండర్లు ఆపాలనడం సరికాదు. పోలవరం ఆపితే దేశంలో అతిపెద్ద తిరుగుబాటు తలెత్తే అవకాశం ఉంది. అలాంటి చర్యలకు కేంద్రం ఒడిగట్టదని ఆశిస్తున్నాం’’ అని జేసీ పేర్కొన్నారు. పోలవరానికి సృష్టిస్తున్న ప్రతిబంధకాలు పరిపాలనాపరమైనవి కాకపోవచ్చునని, రాజకీయ కారణాలు ఉండొచ్చునని సందేహం వ్యక్తం చేశారు.
 
ఒకవేళ ఏపీతో వైరం పెట్టుకోవాలని కేంద్రం భావిస్తే... చివరికి వారికే మూడుతుందని తెలిపారు. డిసెంబరు 15 నుంచి పార్లమెంటు సమావేశాలున్నాయని... ఈలోపు దీనిని సరిదిద్దాలని కేంద్రాన్ని కోరారు. ‘‘నేను టీడీపీ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటాను. కానీ... వ్యక్తిగతంగానైనా సరే నిరసన తెలియచేస్తాను’’ అని జేసీ స్పష్టం చేశారు. అంతకుముందు... వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేయబోమని జేసీ తెలిపారు. తన కుమారుడు ఎంపీగా బరిలో నిలవాలనుకుంటున్నారని... తుది నిర్ణయం చంద్రబాబుదేనని చెప్పారు.
Link to comment
Share on other sites

ఆగమన్న కేంద్రం... అడుగేసిన రాష్ట్రం
అథారిటీ తేల్చే దాకా వేచిచూడండి
టెండర్ల ప్రక్రియ నిలిపేయండి
ప్రభుత్వానికి కేంద్రం లేఖ
అయినా జలవనరులశాఖ టెండర్‌ షెడ్యూళ్లు జారీ
30ap-main5a.jpg

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టులో వడివడిగా మలుపులు చోటు చేసుకున్నాయి. కొంత పనిని ప్రస్తుత గుత్తేదారు నుంచి తొలగించి కొత్త వారికి ఇవ్వాలని రాష్ట్రం భావించగా ఈ ప్రాజెక్టులో కొత్త గుత్తేదారులకు సంబంధించి పరిష్కరించాల్సిన అంశాలు పోలవరం ప్రాజెక్టు అథారిటీ తేల్చే వరకు టెండర్ల ప్రక్రియను నిలిపివేయాలని కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి అమర్‌జిత్‌సింగ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మంగళవారం లేఖ రాశారు. మరో వైపు ఇప్పటికే టెండరు నోటీసులు జారీ చేసిన జలవనరులశాఖ అధికారులు గురువారం ఈ టెండరు షెడ్యూళ్లను విడుదల చేసి ఈ ప్రొక్యూర్‌మెంట్‌లో ఉంచారు. అందులో డిసెంబరు 20 వరకు బిడ్‌ సమర్పణకు గడువు పెట్టారు. 21న  సాంకేతిక బిడ్‌, 23న ఆర్థిక బిడ్‌ తెరిచి గుత్తేదారును ఖరారు చేస్తారు. మొత్తం రూ.1,483.250 కోట్ల పనికి టెండర్లు ఆహ్వానించారు. పని ఒప్పందం నాటి నుంచి 18 నెలల్లోపు పూర్తి చేయాలని నిబంధన విధించారు. సంయుక్త భాగస్వామ్యాన్ని అనుమతించబోమని పేర్కొన్నారు. ప్రీమియం 5 శాతానికి మించకూడదని షరతు పెట్టారు. రూ.428.870 కోట్ల మట్టి పని, రూ.1,048.280 కోట్ల కాంక్రీటు పని, రూ.6.100 కోట్ల ఎంబార్కుమెంట్‌ పని చేయాల్సి ఉంది.

కేంద్రం రాసిన లేఖలో ఏముందంటే..
అక్టోబరు 13, 16, 25 తేదీల్లో జరిగిన సమావేశాల్లో ప్రస్తావనకొచ్చిన అంశాలను ఉటంకిస్తూ టెండరు ప్రక్రియను ఆపేయాలని కేందం సూచించింది. ‘‘ప్రస్తుత గుత్తేదారును తొలగించడం సరికాదని మేము అభిప్రాయపడ్డాం. కొత్త గుత్తేదారు అవసరమైన యంత్రసామగ్రి సమీకరించుకోడానికే చాలా సమయం పడుతుందని పేర్కొన్నాం. ప్రస్తుత గుత్తేదారు నుంచి కొత్త గుత్తేదారుకు యంత్రపరికరాల పరంగా సహకారం అవసరమవుతుందని ఇందుకు ప్రస్తుత గుత్తేదారు స్పందన ఏమిటో చెప్పమన్నాం. కొత్త గుత్తేదారుకు అప్పగిస్తే అయ్యే వ్యయభారంతో పాటు ప్రాజెక్టు పూర్తి చేసే షెడ్యూలును కూడా పంపాలని అడిగాం. ఇంతవరకూ ఆ వివరాలు పంపలేదు. పోలవరం అథారిటీ ఈ అంశాలన్నీ పరిశీలించి పరిష్కరించే వరకు ప్రారంభించిన టెండర్ల ప్రక్రియను నిలిపివేయండి’’ అని సూచించింది.

5న పోలవరానికి ఎన్‌హెచ్‌పీసీ బృందం
డిసెంబరు 5న పోలవరం ప్రాజెక్టుకు జాతీయ జల విద్యుత్తు సంస్థకు చెందిన నిపుణుల కమిటీ రానుంది. ఈ ప్రాజెక్టులో ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణం అవసరమా లేక ప్రధాన డ్యాంలో అంతర్భాగంగానే దీన్ని కూడా నిర్మించవచ్చా లేదా ఇతరత్రా ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా అన్న అంశాల్ని పరిశీలించేందుకు ఈ కమిటీని కేంద్ర జలవనరులశాఖ ఏర్పాటు చేసింది. పరిశీలన అనంతరం కమిటీ తొలుత ప్రాథమిక నివేదిక, తదుపరి సమగ్ర నివేదిక సమర్పించనుంది.

పోలవరం అథారిటీ సీఈవోగా హల్దార్‌
పోలవరం ప్రాజెక్టు అథారిటీకి ముఖ్య కార్యనిర్వహణాధికారిని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వ జల వనరులశాఖ కార్యదర్శి అమర్‌జిత్‌సింగ్‌ సీఈవోగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన పదవీ విరమణ చేశారు. రాష్ట్రం కూడా సీఈవోను నియమించాలని కోరింది. ఈ నేపథ్యంలో హల్దార్‌ను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్లు సమాచారం. ప్రారంభంలో దినేష్‌కుమార్‌ పూర్తి స్థాయి సీఈవోగా వ్యవహరించారు. ఆ తర్వాత ఆయన రాష్ట్ర క్యాడర్‌కు వచ్చి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అప్పటి నుంచి ఇన్‌ఛార్జి సీఈవోలే వ్యవహరిస్తున్నారు.

Link to comment
Share on other sites

అడ్డుగోడ..అమర్జిత్‌!
02-12-2017 02:56:11
 
636477801727074548.jpg
  • గతంలో కేంద్ర మంత్రి సమక్షంలోనే చంద్రబాబుతో దురుసు ప్రవర్తన
  • కాఫర్‌ డ్యామ్‌ పనులకూ అడ్డుపుల్ల
  • తాజాగా స్పిల్‌వే, చానల్‌ టెండర్లకు గండి
  • ఆయన పదవీ విరమణతో అడ్డుగోడ తొలగిందని వ్యాఖ్య
అమరావతి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కేంద్ర జల వనరుల మంత్రిత్వశాఖ మాజీ కార్యదర్శి అమర్జిత్‌ సింగ్‌ పోలవరం ప్రాజెక్టుకు అడ్డుగోడలా మారారని రాష్ట్ర జల వనరుల శాఖలో చర్చ జరుగుతోంది. జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి హోదాలో పనిచేసిన అమర్జిత్‌ సింగ్‌ పోలవరం ప్రాజెక్టుకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని, సీఎం చంద్రబాబుతోనూ ఓ సందర్భంలో దురుసుగా మాట్లాడారని ఆ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
 
నాటి ఘటనను కొందరు జలవనరుల శాఖ అధికారులు ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. గత ఏడాది జూన్‌ చివరి వారంలో పోలవరం ప్రాజెక్టుకు నిధులు, డిజైన్ల అనుమతులకు సంబంధించి చర్చించేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. జాతీయ హోదా ప్రాజెక్టుగా గుర్తించినందున పోలవరానికి సంపూర్ణ సహకారం అందించాలని అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని సీఎం చంద్రబాబు కోరుతున్న సమయంలో అమర్జిత్‌ సింగ్‌ జోక్యం చేసుకున్నారు.
 
‘పోలవరంపై వారం వారం సమీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం లేదు. వాస్తవానికి ప్రాజెక్టు నిర్మాణ పనులు ఒకలా ఉంటే అధికారులు చెబుతున్న లెక్కలు మరోలా ఉన్నాయని.. వాటిని నమ్మేస్తే ఎలా? ప్రాజెక్టుల నిర్మాణం గురించి మీకు తెలుసా?’ అని సీఎంని అమర్జిత్‌ సింగ్‌ ప్రశ్నించారు. అమర్జిత్‌ అలా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు మాత్రం సంయమనం పాటిస్తూ.. ‘ప్రాజెక్టుల నిర్మాణంలో ఎవరి నుంచైనా పాఠాలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. నాకు బేషజాలు లేవు. కొత్త విషయాలను నేర్చుకోడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను.
 
జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించిన 18 సాగు నీటి పథకాల్లో ఎన్నింటిని కేంద్ర జల వనరుల శాఖ నిర్ణీత సమయంలో పూర్తి చేసిందో.. వాటిలో ఏ ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేశారో చెబితే.. వాటిని చూసి పోలవరం ప్రాజెక్టునూ అదే తరహాలో వేగవంతంగా పూర్తి చేస్తాం’ అని సమాధానం ఇచ్చారు. అదే సమయంలో ఉమాభారతి జోక్యం చేసుకుని.. దేశంలోనే అత్యంత అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రితో మాట్లాడేతీరు అది కాదని అమర్జిత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో అమర్జిత్‌ సింగ్‌ పోలవరాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారని జలవనరుల శాఖ వర్గాలు తెలిపాయి.
 
కాఫర్‌ డ్యామ్‌ పనులు ప్రారంభించే సమయంలో వాటిని ఆపాలంటూ అమర్జిత్‌ ఆదేశించారు. ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌స్ట్రాయ్‌ కోట్‌ చేసిన మైనస్‌ 14 శాతానికి మించితే.. ఆ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనులకు కొత్త టెండర్లను పిలిచేందుకు తమకు అభ్యంతరం లేదంటూ నితిన్‌ గడ్కరీ సుముఖత వ్యక్తం చేసినప్పటికీ రిటైర్‌మెంట్‌కు మూడు రోజుల ముందు ఆ టెండర్లను ఆపాలంటూ అమర్జిత్‌ సింగ్‌ ఆదేశాలు జారీ చేయడం ఏమిటని జల వనరులశాఖ ఉన్నతాధికారవర్గాలు ప్రశ్నిస్తున్నారు. అమర్జిత్‌ నవంబరు 30న పదవీవిరమణ చేయడంతో కేంద్రంలో పోలవరానికి ఉన్న ఓ అడ్డంకి తొలగిపోయిందని జలవనరుల శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
Link to comment
Share on other sites

వెనకడుగు లేదు!
02-12-2017 01:49:11
 
636477761529850307.jpg
  • పోలవరం టెండర్లు కొనసాగిస్తాం
  • దీనిపై నితిన్‌ గడ్కరీతో మాట్లాడతా
  • అవసరమైతే మోదీతోనూ చర్చిస్తా
  • ప్రాజెక్టు పూర్తి బాధ్యత కేంద్రానిదే
  • ఇది కేంద్ర, రాష్ట్రాల మధ్య అంశం
  • బీజేపీతో పొత్తుకు సంబంధం లేదు
  • టీడీపీ శాసనసభాపక్ష భేటీలో సీఎం
  • 5న ఎన్‌హెచ్‌పీసీ బృందం రాక
  • వివరాలన్నీ అందుబాటులో ఉంచండి
  • రాష్ట్రానికి పీపీఏ నుంచి సమాచారం
అమరావతి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు అంశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విషయం అని, తెలుగుదేశం-బీజేపీ మధ్య రాజకీయ సంబంధాలకు సంబంధించింది కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం టెండర్లను ఎట్టి పరిస్థితుల్లోను కొనసాగిస్తామని ఉద్ఘాటించారు. తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం శుక్రవారం వెలగపూడిలోని శాసనసభ కమిటీ హాలులో జరిగింది. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ఇటీవలే కేంద్ర కార్యదర్శి ఒక లేఖ రాశారు. స్పిల్‌ వే, చానల్‌ టెండర్ల ప్రక్రియను ఆపేయాలన్నారు.
 
దీనిపై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ, అవసరమైతే ప్రధాని మోదీతో కూడా మాట్లాడతా. ఎట్టి పరిస్థితుల్లో పోలవరం పూర్తి కావాలి. దానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. కానీ వ్యక్తిగతంగా వెళ్లడం లేదు. ఎమ్మెల్యేలు కూడా ఏ విమర్శలూ చేయొద్దు. పోలవరం కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల అంశం. చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. ఈ అంశం తెలుగుదేశం-బీజేపీ మధ్య రాజకీయ సంబంధాలను ప్రభావితం చేయబోదు. ఇది రాజకీయ అంశం కాదు.. పాలనాపరమైన అంశం’ అని చంద్రబాబు స్పష్టం చేశారు. ఒక్కోసారి పోలవరం అంశంపై తాను తీవ్ర అలసటకు గురవుతుంటానని, పనులు కాక కోపం వస్తుంటుందని కానీ రాష్ట్రానికి కీలకమైన ప్రాజెక్టు విషయంలో వెనక్కి తగ్గకూడదన్న ఉద్దేశంతో ఓపిగ్గా ముందుకు వెళుతున్నామన్నారు.
 
‘ఒకసారి పనులు ఆగితే పని చేస్తున్న సంస్థలు, అక్కడున్న యంత్రాలు అన్నీ వెళ్లిపోతాయి. మళ్లీ వాటిని తీసుకురావడం కష్టం. ఒకసారి నమ్మకం కోల్పోతే తిరిగి రావడం కష్టం. ఒకసారి ఆగితే అది పూర్తయ్యేందుకు ఐదేళ్లు పడుతుందా? పదేళ్లు పడుతుందా? అన్నది తెలియదు. అందుకే టెండర్ల ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లో కొనసాగిస్తాం.’ అని ఉద్ఘాటించారు. కేంద్రం ఇవ్వాల్సిన నిధులు, ఇచ్చిన హామీలు నెరవేరిస్తే కొంతైనా రాష్ట్రానికి ఆర్థిక వెసులుబాటు లభిస్తుందన్నారు. ‘సెంట్రల్‌ విశ్వవిద్యాలయం, గిరిజన విశ్వవిద్యాలయాలకు భూమి కేటాయించాం. కానీ వీటి ఏర్పాటుకు కేంద్రం ఇంకా బిల్లు ఆమోదించ లేదు. కేంద్రం ఇచ్చే విద్యాసంస్థలకు, ప్రైవేటు విద్యాసంస్థలకు కలిపి 11,500 ఎకరాల భూమిని కేటాయించాం. నష్టపోయిన రాష్ట్రానికి అన్ని రాష్ట్రాలతో సమానంగా ఎదిగేవరకు చేయూతనివ్వాలని అడుగుతున్నాం. ఒకసారి ఇతర రాష్ట్రాలతో సమానంగా ఎదిగాక దేశ అభివృద్ధిలో ఏపీ పాత్ర కూడా ఉంటుంది.’ అని సీఎం తెలిపారు.
 
రాజధాని పనులు ముమ్మరం
వచ్చే ఆరు నెలల్లో రాజధాని పనులు ఊపందుకుంటాయని సీఎం తెలిపారు. శాశ్వత సచివాలయంలో శాసనసభ, హైకోర్టు భవనాలను ఐకానిక్‌గా నిర్మిస్తామని స్పష్టం చేశారు. సచివాలయం, శాఖాధిపతుల భవనాలన్నీ ఒకేచోట ఉండేలా నిర్మాణం చేస్తామని తెలిపారు. ‘సచివాలయానికి వచ్చి మళ్లీ అక్కడి నుంచి పనికోసం నాలుగైదు చోట్ల ఉన్న వివిధ శాఖల కార్యాలయాలకు తిరిగే పనుండదు. అన్నీ ఒకేచోట నిర్మిస్తాం. వాటి డిజైన్లూ ఆమోదించాం. సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు ఫిబ్రవరిలో పూర్తికావాలి. ఇతర రోడ్లు, రైతుల స్థలాలకు రోడ్లు కూడా ప్రారంభించాం. 68 టవర్ల నిర్మాణ డిజైన్లు ఆమోదించాం. అందులో మంత్రులు, ఎన్‌జీవోలు అందరివీ ఉంటాయి.
 
సచివాలయంలో ఐదు టవర్లు నిర్మిస్తాం. అందులోనే శాఖా కార్యాలయాలతో సహా అన్నీ వస్తాయి.’ అని తెలిపారు. ‘రాజధానిలో ఇటీవలే విట్‌, ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయాలు తరగతులు ప్రారంభించాయి. మిగతావి పనులు ప్రారంభించనున్నాయి. ఇటీవలే హెచ్‌సీఎల్‌ కూడా వచ్చి నిర్మాణం ప్రారంభిస్తానని తెలిపింది. రాబోయే ఏడాదిన్నరలో మనం అనుకున్నవన్నీ రాజధానికి వస్తాయి.’ అని సీఎం పేర్కొన్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌కు ఒక ఐటీ కంపెనీ తెచ్చేందుకు ప్రపంచమంతా తిరిగి, అతికష్టంపై మైక్రోసా్‌ఫ్టను తీసుకురాగలిగామని, దాన్ని చూసి ఎన్నో కంపెనీలు వచ్చాయన్నారు. హైదరాబాద్‌ మెట్రో.. ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఆలోచనకు బీజం వేసింది తానేనన్నారు. అమరావతిని కాలుష్యరహిత రాజధానిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అందులో భాగంగా పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలను కాకుండా ఎలక్ర్టిక్‌ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపారు.
 
ఇప్పటికే 1500 ఇ-వాహనాల కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చినట్లు చెప్పారు. ఒకప్పుడు ఫైలు ఎక్కడుందో తెలియని పరిస్థితి ఉండేదని, దాన్ని సరిదిద్దేందుకు ఈ-ఆఫీసు విధానాన్ని తీసుకొచ్చామని సీఎం తెలిపారు. ఈ విధానంలో ఏ ఫైల్‌ ఎక్కడుంది? సీఎం నుంచి అధికారి వరకు ఎవరు ఎంత సమయంలో ఫైళ్లను పరిష్కరిస్తున్నారనేది ఇట్టే తెలిసిపోతుందన్నారు. ఈ-ఆఫీ్‌సను ముందుగా సీఎంవోలో ప్రారంభించి మండల స్థాయి వరకు తీసుకెళ్లినట్లు తెలిపారు. కొందరు మంత్రులు ఐదారు గంటల్లోనే ఫైళ్లు పరిష్కరిస్తున్నారని సీఎం అభినందించారు. ఇదంతా తొలి దశ అని, రెండో దశలో ఫైళ్ల పరిష్కార నాణ్యత కూడా పరిశీలిస్తామని చెప్పారు.
 
సీమ చరిత్ర మారుతోంది
‘ఒకప్పుడు రాష్ట్రంలో ఎరువులు, విత్తనాలు కావాలంటే రైతులు క్యూలో నిల్చోవాల్సి వచ్చేది. ఎవరన్నా క్యూలోంచి యూరిన్‌కు వెళ్తే చెప్పులు పెట్టి వెళ్లేవారు. నాలుగు లాఠీ దెబ్బలు కొట్టి ఒక ఎరువుల బస్తా ఇచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి లేకుండా చేశాం. వ్యవసాయంలో సుస్థిరత తెచ్చాం. గత ఏడాదికంటే ఉత్పాదకత పెరిగింది. పట్టిసీమతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దిగుబడులు పెరిగాయి. ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని చెప్పరు. ఏదైనా కాకపోతే దాన్నే చెబుతుంటారు.’ అని సీఎం వ్యాఖ్యానించారు. గత ఏడాది పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలంలో పండ్లతోటలు ఎండిపోతున్నాయంటే కాపాడేందుకు 2 టీసీఎంల నీరిచ్చామని, రాయలసీమలో ఇకపై తోటలు ఎండిపోయే పరిస్థితి ఉండదన్నారు.
 
పట్టిసీమతో కృష్ణా డెల్టాకు సమృద్ధిగా నీరు అందుతోందని, కృష్ణా నీటిని శ్రీశైలం నుంచి రాయలసీమకు ఇస్తామని తెలిపారు. సీమలో నీటి కొరత తీరడంతో పరిశ్రమలు కూడా వస్తున్నాయని, గొల్లపల్లి రిజర్వాయరులో నీటిని నిలపడంతో ‘కియ’ పరిశ్రమ వచ్చిందన్నారు. కియతోపాటు దక్షిణ కొరియాకు చెందిన సుమారు 150 సంస్థలు ఈ ప్రాంతానికి వస్తున్నాయన్నారు. దీంతో అనంతపురం జిల్లాలో కొరియన్‌ సిటీని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఫలితంగా అనంతపురం చరిత్రే మారిపోనుందన్నారు.
 
ఎల్లుండి ఢిల్లీకి సీఎస్‌!
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపై కేంద్ర జలవనరుల శాఖ అధికారులతో చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌ కుమార్‌ ఈ నెల 4న ఢిల్లీలో పర్యటించనున్నారు. ముఖ్యంగా కాఫర్‌ డ్యామ్‌తోపాటు స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ నిర్మాణాలను నిలిపివేయాలని రెండు సార్లు వేర్వేరుగా కేంద్రం లేఖ రాయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సీఎస్‌ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటి వరకు కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శిగా ఉన్న అమర్జిత్‌ సింగ్‌ నవంబరు 30న పదవీవిరమణ చేశారు. ఆ స్థానంలో నియమితులైన ఒడిసా కేడర్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఉపేంద్ర కుమార్‌ సింగ్‌ (యూపీ సింగ్‌) శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కొత్త కార్యదర్శి వచ్చారు కాబట్టి ఆయనకు పోలవరంతోపాటు ఏపీలో చేపడుతున్న ఇతర ప్రాజెక్టుల పురోగతి గురించి సీఎస్‌ వివరిస్తారని తెలిసింది.
 
జేసీ వ్యతిరేకించినా..!
పేదలపై వైద్యఖర్చుల భారాన్ని చాలా వరకు తగ్గించామని, ఇంకా తగ్గిస్తామని సీఎం తెలిపారు. ‘ఒకప్పుడు ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు పెడతామంటే ఇదే సమావేశంలో ఉన్న జేసీ దివాకర్‌ రెడ్డి వ్యతిరేకించారు. అనంతపురంలో సహకార పద్ధతిలో వైద్య కళాశాల పెడతామన్నా ఎవరూ ముందుకు రాలేదు. చివరకు ప్రభుత్వమే పెట్టింది. ఇప్పుడు జిల్లాకో వైద్య కళాశాల ఉంది. అలా ఉన్న ఏకైక రాష్ట్రం ఏపీ’ అని అన్నారు.
 
లోకేశ్‌కు అదే చెప్పా..!
‘ఉపాధిహామీ పథకం గతంలోను ఉంది. కానీ ఇప్పుడు అన్ని శాఖలతో సమీకృతం చేసి ఎన్నడూ చేయనన్ని పనులు చేశాం. పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ భవనాలు, సీసీ రోడ్లు.. ఇలా ప్రతి పనీ చేశాం. ఎక్కడా పైసా అవినీతి లేకుండా ఈ పనులు చేస్తున్నాం. దేశంలోనే తొలి స్థానంలో ఉన్నాం. అయితే చిన్న తప్పు జరిగినా భూతద్దంలో చూపేందుకు, ఫిర్యాదులు చేసి నిధులు అడ్డుకునేందుకు వైసీపీ సిద్ధంగా ఉంది. అందుకే ఎక్కడా పైసా అవినీతి ఉండకూడదని సంబంధిత శాఖ మంత్రి లోకేశ్‌కు చెప్పా’ అని సీఎం వివరించారు. మరోవైపు 19 లక్షల ఇళ్ల నిర్మాణాలను రూ.50 వేల కోట్లతో చేపడుతున్నామని, మూడేళ్లలో విద్యుత్‌ చార్జీలు పెంచలేదని, భవిష్యత్తులోనూ పెంచేది లేదని సీఎం స్పష్టం చేశారు.
 
 
 
 
 
Link to comment
Share on other sites

3 hours ago, sonykongara said:
అడ్డుగోడ..అమర్జిత్‌!
02-12-2017 02:56:11
 
636477801727074548.jpg
  • గతంలో కేంద్ర మంత్రి సమక్షంలోనే చంద్రబాబుతో దురుసు ప్రవర్తన
  • కాఫర్‌ డ్యామ్‌ పనులకూ అడ్డుపుల్ల
  • తాజాగా స్పిల్‌వే, చానల్‌ టెండర్లకు గండి
  • ఆయన పదవీ విరమణతో అడ్డుగోడ తొలగిందని వ్యాఖ్య
అమరావతి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కేంద్ర జల వనరుల మంత్రిత్వశాఖ మాజీ కార్యదర్శి అమర్జిత్‌ సింగ్‌ పోలవరం ప్రాజెక్టుకు అడ్డుగోడలా మారారని రాష్ట్ర జల వనరుల శాఖలో చర్చ జరుగుతోంది. జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి హోదాలో పనిచేసిన అమర్జిత్‌ సింగ్‌ పోలవరం ప్రాజెక్టుకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారని, సీఎం చంద్రబాబుతోనూ ఓ సందర్భంలో దురుసుగా మాట్లాడారని ఆ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
 
నాటి ఘటనను కొందరు జలవనరుల శాఖ అధికారులు ‘ఆంధ్రజ్యోతి’కి వివరించారు. గత ఏడాది జూన్‌ చివరి వారంలో పోలవరం ప్రాజెక్టుకు నిధులు, డిజైన్ల అనుమతులకు సంబంధించి చర్చించేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. జాతీయ హోదా ప్రాజెక్టుగా గుర్తించినందున పోలవరానికి సంపూర్ణ సహకారం అందించాలని అప్పటి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతిని సీఎం చంద్రబాబు కోరుతున్న సమయంలో అమర్జిత్‌ సింగ్‌ జోక్యం చేసుకున్నారు.
 
‘పోలవరంపై వారం వారం సమీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో తెలుసుకోవడం లేదు. వాస్తవానికి ప్రాజెక్టు నిర్మాణ పనులు ఒకలా ఉంటే అధికారులు చెబుతున్న లెక్కలు మరోలా ఉన్నాయని.. వాటిని నమ్మేస్తే ఎలా? ప్రాజెక్టుల నిర్మాణం గురించి మీకు తెలుసా?’ అని సీఎంని అమర్జిత్‌ సింగ్‌ ప్రశ్నించారు. అమర్జిత్‌ అలా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు మాత్రం సంయమనం పాటిస్తూ.. ‘ప్రాజెక్టుల నిర్మాణంలో ఎవరి నుంచైనా పాఠాలు నేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. నాకు బేషజాలు లేవు. కొత్త విషయాలను నేర్చుకోడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను.
 
జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించిన 18 సాగు నీటి పథకాల్లో ఎన్నింటిని కేంద్ర జల వనరుల శాఖ నిర్ణీత సమయంలో పూర్తి చేసిందో.. వాటిలో ఏ ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేశారో చెబితే.. వాటిని చూసి పోలవరం ప్రాజెక్టునూ అదే తరహాలో వేగవంతంగా పూర్తి చేస్తాం’ అని సమాధానం ఇచ్చారు. అదే సమయంలో ఉమాభారతి జోక్యం చేసుకుని.. దేశంలోనే అత్యంత అనుభవజ్ఞుడైన ముఖ్యమంత్రితో మాట్లాడేతీరు అది కాదని అమర్జిత్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కూడా పలు సందర్భాల్లో అమర్జిత్‌ సింగ్‌ పోలవరాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారని జలవనరుల శాఖ వర్గాలు తెలిపాయి.
 
కాఫర్‌ డ్యామ్‌ పనులు ప్రారంభించే సమయంలో వాటిని ఆపాలంటూ అమర్జిత్‌ ఆదేశించారు. ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌స్ట్రాయ్‌ కోట్‌ చేసిన మైనస్‌ 14 శాతానికి మించితే.. ఆ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనులకు కొత్త టెండర్లను పిలిచేందుకు తమకు అభ్యంతరం లేదంటూ నితిన్‌ గడ్కరీ సుముఖత వ్యక్తం చేసినప్పటికీ రిటైర్‌మెంట్‌కు మూడు రోజుల ముందు ఆ టెండర్లను ఆపాలంటూ అమర్జిత్‌ సింగ్‌ ఆదేశాలు జారీ చేయడం ఏమిటని జల వనరులశాఖ ఉన్నతాధికారవర్గాలు ప్రశ్నిస్తున్నారు. అమర్జిత్‌ నవంబరు 30న పదవీవిరమణ చేయడంతో కేంద్రంలో పోలవరానికి ఉన్న ఓ అడ్డంకి తొలగిపోయిందని జలవనరుల శాఖ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Ee XX gadini ah polavaram slip way kinda pudchali loafer edava 

Link to comment
Share on other sites

Deputy Chief Minister Telangana Sri Kadiyam Srihari called on CM @Naveen_Odisha. They discussed Polavaram issue which would impact both the states. Sri Srihari announced Telangana’s support to Odisha Government’s demand for stopping the project until all concerns are addressed

DP-FMqkVAAAlz97.jpg
26 replies47 retweets240 likes
Reply
 26
 
Retweet
 47
 
 
Like
 240
 
Direct message
Link to comment
Share on other sites

On 18/11/2017 at 12:11 AM, Jeevgorantla said:

Seems like this project wont complete in 2020 also. Instead govt should add 24 more pumps to pattiseema and increase flow rate to 17K cusecs and route some water to pulichintala. what are these committees for? what was polavaram authority doing?  

Uncle key bord mundu kursuni typing antha easy em kadu... Pk inspiration aa mee questions ki :D

Link to comment
Share on other sites

45 minutes ago, chanu@ntrfan said:

Deputy Chief Minister Telangana Sri Kadiyam Srihari called on CM @Naveen_Odisha. They discussed Polavaram issue which would impact both the states. Sri Srihari announced Telangana’s support to Odisha Government’s demand for stopping the project until all concerns are addressed

DP-FMqkVAAAlz97.jpg
26 replies47 retweets240 likes
Reply
 26
 
Retweet
 47
 
 
Like
 240
 
Direct message

Wt can we expect from this kcharas

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...