Jump to content

polavaram


Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply
పోలవరం ప్రాజెక్టుపై కేంద్రానికి బిల్లులు పంపనున్న ఏపీ సర్కార్
08-12-2017 20:59:37
 
636483635793001542.jpg
 
అమరావతి: పోలవరం ప్రాజెక్ట్‌‌‌ను వీలైనంత త్వరలోనే పూర్తి చేయాలని ఏపీ ప్రభుత్వం మరో ముందడుగేసింది. పోలవరం భూ సేకరణ పునరావాసం బిల్లులను ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసింది. రూ.2,544 కోట్ల మేర బిల్లులను ప్రభుత్వం కేంద్రానికి సమర్పించనుంది. 2014 నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో భూసేకరణకు రూ.2,380 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం తేల్చింది.
 
 
    తూర్పుగోదావరి జిల్లాలో రూ.158 కోట్ల పునరావాసం చెల్లింపులకు బిల్లులు సిద్ధం చేసినట్లు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. కేంద్రం నుంచి పెండింగ్‌లో ఉన్న మొత్తం రూ.2,884 కోట్లు అని ప్రభుత్వం తేల్చి చెప్పింది. గతవారం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మీటింగ్‌లో బిల్లుల అంశంపై చర్చ జరిగింది. బిల్లులు సమర్పిస్తే పునరావాసం నిధులు ఇస్తామని భేటీలో గడ్కరీ చెప్పడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Link to comment
Share on other sites

కాఫర్‌డ్యాం అవసరమా?
అధికారులతో చర్చించిన ఎన్‌హెచ్‌పీసీ బృందం
వివిధ ప్రత్యామ్నాయాలపైనా చర్చ
అధ్యయనం చేసి నివేదిక ఇస్తామని వెల్లడి
పోలవరం ప్రాజెక్టు పరిశీలన
ఈనాడు - అమరావతి
న్యూస్‌టుడే - పోలవరం
08ap-main1a.jpg

పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మించాలా? వద్దా? అనే అంశంపై జాతీయ జలవిద్యుత్తు కార్పొరేషన్‌(ఎన్‌హెచ్‌పీసీ) నిపుణులు శుక్రవారం పోలవరం అధికారులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అంతకు ముందు ప్రాజెక్టుకు వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ప్రధాన డ్యాంలో భాగంగా దీన్ని నిర్మించవచ్చా? విడిగా నిర్మించాలా? లేక వేసవి నీటి ప్రవాహం మేరకు పాక్షికంగా నిర్మించి డ్యాం నిర్మాణం పూర్తి చేయవచ్చా? అనే అంశాలపై వీరు     అధికారులతో చర్చలు జరిపారు. మరింత సమాచారం కోరి అధ్యయనం అనంతరం కేంద్రానికి నివేదిక సమర్పిస్తామంటూ చెప్పారు. ఇతమిత్థంగా వారి అభిప్రాయం ఏమిటనేది తేల్చి చెప్పలేదు. వారు నివేదిక ఇచ్చిన తర్వాత తిరిగి ఆకృతుల కమిటీ ముందుంచి చర్చించడంతో పాటు కేంద్ర జలసంఘం ముందు ఈ విషయాలు ఉంచి చర్చల తర్వాతే తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. 2018 జూన్‌ కల్లా కాఫర్‌ డ్యాం నిర్మించి గ్రావిటీ ద్వారా నీరు ఇచ్చేందుకు ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉన్నందున వీలైనంత త్వరగా నివేదిక ఇచ్చి సహకరించాలని మంత్రి దేవినేని ఉమా కమిటీకి విన్నవించారు. కమిటీలో కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వై.కె.దుబే, ఆర్‌.సి.శర్మ, శంకదీప్‌ చౌదరి ఉన్నారు. తొలుత వీరికి మొత్తం ప్రాజెక్టు పనులన్నింటినీ అధికారులు, మంత్రి కలిసి దగ్గరుండి చూపించారు.

ప్రధాన డ్యాంలో అంతర్భాగంగా కాఫర్‌ డ్యాం నిర్మించడానికి ఉన్న అవకాశాలపై నిపుణులు చర్చించడంతో పాటు ప్రధానంగా వివిధ ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తే ఖర్చు కొంత మేర తగ్గించుకోవచ్చు అనే కోణంలో అభిప్రాయపడినట్లు తెలిసింది. గతంలోనే ఈ అంశం చర్చకు వచ్చిందని, నిపుణులు పరిశీలించి అది వద్దనుకుని ఈ ప్రతిపాదనకు ఆమోదం ఇచ్చి పని ప్రారంభించినట్లు ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు కమిటీకి వివరించారు. వేసవిలో ఎంత తక్కువ నీరు ప్రవహిస్తుందో గత 40 సంవత్సరాల లెక్కల ఆధారంగా సగటు సమాచారం తమకు ఇవ్వాలని కమిటీ సభ్యులు కోరారు. ప్రధాన డ్యాంను నిర్మించుకుంటూ వచ్చి వేసవి సమయంలో తక్కువగా నీరు వచ్చేటంతటి ప్రాంతంలోనే కాఫర్‌ డ్యాం నిర్మించుకుంటే దాదాపు కిలోమీటరు మేర కాఫర్‌ డ్యాం నిర్మాణం తగ్గిపోతుందని వారు అభిప్రాయపడినట్లు సమాచారం. అందులో ఉన్న ఇబ్బందులను ఇంజినీర్లు వారికి వివరించారు. ఇంత పెద్ద డ్యాంలో ఆ పద్ధతి ఎంతవరకు వీలువుతుందని ఇంజినీరింగు అధికారులు ప్రశ్నించారు. ఖర్చు కన్నా నాణ్యత, డ్యాం భద్రత ముఖ్యం కదా అని చర్చించారు. ప్రధాన డ్యాంను కాఫర్‌ డ్యాంను అనుసంధానించడంలో ఎదురయ్యే ఇబ్బందులపైనా నిపుణులకు వివరించారు. 2018 జూన్‌ నాటికి  ఎలాగూ  పనులు పూర్తి కావని, ఇక కాఫర్‌ డ్యాం ఎత్తు పెంచుకోవడం ఎందుకని బృందం ప్రశ్నించినట్లు సమాచారం. మీరు అప్పటిలోగా పనులు ఎలా పూర్తి చేయగలమని భావిస్తున్నారని వారు అడిగారు. తమ ప్రణాళిక ఉందని, ప్రత్యామ్నాయాలపైనా దృష్టి సారించామని అధికారులు చెప్పారు. తాముకోరిన సమాచారం ఇస్తే అధ్యయనం చేసి తాము  నివేదికను కేంద్ర జలవనరులశాఖకు అందిస్తామని వారు చెప్పారు. ఈ సమావేశంలో  ఈఎన్‌సీ  ఎం.వెంకటేశ్వరరావు, ఎస్‌ఈ రమేష్‌బాబు, గుత్తేదారు సంస్థ తరఫున నిపుణులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

పోలవరంలో ఎన్‌హెచ్‌పీసీ కమిటీ
09-12-2017 04:17:42
 
636483898637894508.jpg
  •  పనుల తీరును పరిశీలించిన బృందం
  •  ఎగువ కాఫర్‌ డ్యాం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం
  •  కాఫర్‌ డ్యాం అవసరమేనన్న రాష్ట్ర జలవనరుల శాఖ
  •  పారదర్శకంగా పోలవరం పనులు: దేవినేని ఉమా
పోలవరం, డిసెంబరు 8: పోలవరం ప్రాజెక్టును నేషనల్‌ హైడ్రోపవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) కమిటీ సభ్యులు సందర్శించారు. ఎగువ కాఫర్‌ డ్యాం అవసరమా.. కాదా.. అన్న అంశాన్ని అధ్యయనం చేసేందుకు కేంద్ర జలవనరుల శాఖ ఈ కమిటీని ఏర్పాటు చేసింది. శుక్రవారం రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి పోలవరం ప్రాజెక్టు పనులు జరుగుతున్న తీరును కమిటీ సభ్యులు పరిశీలించారు. కమిటీలో వై.కె. చౌబి, ఆర్‌.సి. శర్మ, పంకజిత్‌ చౌదిలు సభ్యులుగా ఉన్నారు. వీరికి రాష్ట్ర నీటి పారుదల శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు ప్రాజెక్టు వివరాలు తెలియజేశారు. ముందుగా గోదావరి నదీ గర్భంలో చేస్తున్న ప్లాస్టిక్‌ డయాఫ్రమ్‌వాల్‌, స్పిల్‌ వే కాంక్రీట్‌ పనులు, దిగువ కాఫర్‌ డ్యామ్‌, గేట్ల తయారీ పనులను కమిటీ సభ్యులు పరిశీలించారు. స్పిల్‌ వే గేట్ల వద్ద బుష్‌లకు సంబంధించిన నాణ్యత, సామర్ధ్యం ఎలా ఉంది.. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత 192 టీఎంసీల నీటి ఒత్తిడిని అవి తట్టుకుంటాయా అని కమిటీ సభ్యులు ప్రశ్నించారు. దీనికి శశిభూషణ్‌ జవాబిస్తూ.. ఈ బుష్‌ల జీవితకాలం 100 సంవత్సరాలని, ప్రతి సంవత్సరం 2500 టీఎంసీలు ఈ గేట్ల ద్వారా సముద్రంలోకి వెళుతాయని, అత్యధికంగా 50 లక్షల క్యూసెక్కుల నీరు ఈ గేట్ల ద్వారా దిగువకు విడుదల చేసే విధంగా డిజైన్‌ చేశామని వివరించారు. అనంతరం రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో కమిటీ సభ్యులు ప్రత్యేకంగా సమావేశ మయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన అధికారులు ఎగువ కాఫర్‌ డ్యాం ఆవశ్యకతను కమిటీకి వివరించారు.
 
‘పోలవరం ప్రాజెక్టు పనులన్నీ పూర్తి పారదర్శకంగా సాగుతున్నాయి. ప్రాజెక్టుకు సంబంధించి అన్ని లెక్కలు కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేశాం. పోలవరం ఖర్చులకు సంబంధించి ఏ విధమైన దాపరికం లేదు’. అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్‌లో ఒక్క రూపాయి కూడా అవినీతి లేదని, అంతా తెరిచిన పుస్తకమే అన్నారు. పోలవరానికి సంబంధించి ఇప్పటి వరకు రూ.1590 కోట్లు కాంట్రాక్టు కంపెనీలకు చెల్లించామని, దాంట్లో ట్రాన్స్‌ట్రాయ్‌కి రూ.654 కోట్లు చెల్లించామని, త్రివేణికి రూ.656 కోట్లు, ఎల్‌అండ్‌టికి రూ.205 కోట్లు, డెక్కమ్‌కు రూ.69 కోట్లు, కెల్లార్‌కి రూ.5కోట్లతో కలిపి మొత్తం రూ.1590 కోట్లు చెల్లించామన్నారు. దీంట్లో వేల కోట్లు అవినీతి జరిగినట్టు ఆరోపించడం ప్రతిపక్షం అవగాహనారాహిత్యానికి నిదర్శనమన్నారు. పోలవరానికి సంబంధించి ఇప్పటి వరకు రూ.7,435 కోట్లు ఖర్చు చేయగా కేంద్రం రూ.4647 కోట్లు నిధులు చెల్లించిందన్నారు.
Link to comment
Share on other sites

రకొర విదిలిస్తున్నారు!
09-12-2017 04:15:41
 
636483897425611656.jpg
  •  పోలవరం నిధుల విడుదల్లో కేంద్రం జాప్యం
  •  ఖర్చు 6600 కోట్లు..ఇచ్చింది 4 వేల కోట్లు
  •  తొలి రెండేళ్ల నిధులు మూడో ఏట విడుదల
న్యూఢిల్లీ, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): పోలవరం జాతీయ ప్రాజెక్టు. ఎప్పటికప్పుడు నిధులిస్తూ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. కేంద్రం మాత్రం నిధుల విడుదలలో జాప్యం చేస్తోంది. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాజెక్టును 2019కి పూర్తి చేయాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రాజెక్టు పనులు కుంటుపడకూడదన్న ఉద్దేశంతో లోటు బడ్జెట్‌ను సైతం లెక్క చేయకుండా పోలవరానికి అధిక ప్రాధాన్యమిచ్చి నిధులు సమకూరుస్తోంది. బిల్లులను ఎప్పటికప్పుడు కేంద్రానికి పంపుతున్నా నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు వాపోతున్నారు. 2014 నుంచి ఇదే తంతు నడుస్తోందని చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) ఇటీవల విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టుపై చేస్తున్న ఖర్చుకు.. కేంద్రం విడుదల చేస్తున్న నిధులకు పొంతనే ఉండటం లేదన్న విషయం స్పష్టమవుతుంది.
 
పీపీఏ వివరాల ప్రకారం.. ఈ ఏడాది జూలై వరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై రూ.6598.25 కోట్లు ఖర్చు చేసింది. కేంద్ర ప్రభుత్వం మాత్రం పీపీఏకు విడుదల చేసింది కేవలం రూ.4343.52 కోట్లు. అందులో నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి పీపీఏ రూ.4329.06 కోట్లు విడుదల చేసింది. అంటే కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన మొత్తం రూ.2256.19 కోట్లు. పీపీఏ నుంచి రాష్ట్రానికి మరో రూ.14.06 కోట్లు రావాల్సి ఉంది. కాగా, 2014-15, 2015-16 ఆర్థిక సంవత్సరాల్లో రాష్ట్రం ఖర్చు చేసిన నిధులను రెండేళ్ల తర్వాత ఇవ్వడం గమనార్హం. 2014-15లో రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుపై రూ.439.47 కోట్లు ఖర్చు చేయగా.. కేంద్రం రూ.245 కోట్లు ఇచ్చింది. 2015-16లో రూ.1867.93 కోట్లను రాష్ట్రం వెచ్చించగా కేంద్రం రూ.590 కోట్లు మాత్రమే విడుదల చేసింది. అయితే, ఆ రెండేళ్లకు సంబంధించిన పెండింగ్‌ నిధులను 2016-17లో విడుదల చేసింది. 2016-17లో రూ.1700.07 కోట్లు ఖర్చు పెడితే... కేంద్రం పెండింగ్‌ నిధులతో కలిపి రూ.2514.70 కోట్లను విడుదల చేసింది. ఇక 2017-18లో జూలై వరకు రాష్ట్రం రూ.2590.78 కోట్లను ఖర్చు చేసింది. ఈ ఏడాది అక్టోబరు వరకు కేంద్రం ఇచ్చింది రూ.979.36 కోట్లు మాత్రమే. కాగా, భూసేకరణ, పునరావాసానికి సంబంధించిన బిల్లులను సమర్పించాలని పీపీఏను కేంద్ర ప్రభుత్వం కోరింది. భూసేకరణ, పునరావాసాన్ని కలుపుకొంటే కేంద్రం నుంచి మరిన్ని నిధులు రావాల్సి ఉంటుంది. అలాగే, 2010-11 లెక్కల ప్రకారం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.16010.45 కోట్లు. ఖర్చులు పెరగడం వల్ల అంచనా వ్యయాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వానికి ప్రతిపాదించింది. 2013-14 లెక్కల ప్రకారం అంచనా వ్యయాన్ని రూ.58319 కోట్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఇది పంపి ఏడాది కావస్తున్నా కేంద్రం ఇప్పటికీ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దాన్ని అధ్యయనం చేయడానికి కమిటీని నియమించింది. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలు కేంద్ర జల సంఘం పరిశీలనలో ఉన్నాయి.
 
పనుల పురోగతి ఇలా...
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతి పర్వాలేదని పీపీఏ పేర్కొంది. పీపీఏ వివరాల ప్రకారం... డ్యామ్‌ సైట్‌లో మట్టి పనులు 71 శాతం పూర్తయ్యాయి. ఆనకట్టల నిర్మాణం 10 శాతం, నేవిగేషన్‌ టన్నెల్‌, టేకాఫ్‌ రెగ్యులేటర్‌, స్పిల్‌వే పనులు 11 శాతం, గేట్ల పనులు 35 శాతం పూర్తయ్యాయి.
Link to comment
Share on other sites

ప్రతి రూపాయికి లెక్కలున్నాయ్..
09-12-2017 12:58:44
 
636484211262327917.jpg
  • పారదర్శకతతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం
  • పనులన్నీ క్రమపద్ధతిలోనే జరుగుతున్నాయి
  • జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమ
  • నేషనల్‌ హైడ్రోపవర్‌ కార్పొరేషన్‌ కమిటీ పర్యటన
  • 11న సీఎం చంద్రబాబు 21వ సారి పర్యటన
  • 22న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ రాక
మేం అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టుకు రూ.7,435 కోట్లు ఖర్చు చేశాం. కేంద్రం రూ.4,647 కోట్లు చెల్లించగా.. ఇంకా రూ.2,884 కోట్లు ఇవ్వాలి. ఇప్పటి వరకు 7.50 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి పని, 4.38కోట్ల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని పూర్తి చేశాం. - మంత్రి దేవినేని ఉమ
 
 
పోలవరం : పోలవరం ప్రాజెక్టుకు ఖర్చుపెట్టిన ప్రతీ రూపాయికి ఆన్‌లైన్‌లో వివరాలు ఉన్నాయని, ఎవరైనా చూడవచ్చని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతం వద్ద క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌తో కలిసి ఆర్‌అండ్‌ఆర్‌పై రెండు జిల్లాల కలెక్టర్లు, జిల్లా యంత్రాంగంతో సుదీర్ఘంగా చర్చించారు. పునారావాస గ్రామాల్లో ఎంత మేర ప్యాకేజీ అమలు చేశారనే విషయాలను సీఎస్‌ ప్రశ్నించారు. దాంతో రాజమహేంద్రవరం భూసేకరణ డిప్యూటీ కలెక్టర్‌ శ్రీరామచంద్రమూర్తి తెలియజేయబోయారు. సీఎస్‌ అడ్డుకుని సంబంధిత విభాగాల అధికారులే వివరాలు తెలియజేయాలని సీఎస్‌ ఆగ్రహించారు.
 
 
            hk7777777777.jpgప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణలో 4 ఈఈలు, 13 మంది డీఈలు, 36 మంది ఏఈలు విధులు నిర్వహిస్తున్నారని వీరంతా ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా తెలియజేయాలన్నారు. రికార్డులతో ఉండి ఎందుకు చెప్పలేకపోతున్నారన్నారు. మొత్తం మూడు యూనిట్లుగా సాగుతోందని, తూర్పు గోదావరిలో దేవీపట్నం, ఎటపాక, కూనవరం మండలాలు 41వ కాంటూరులో ఉన్నాయని ఎస్‌డీసీ శ్రీరామచంద్రమూర్తి తెలియజేశారు. అనంతరం మంత్రి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పునరావాసంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పటి వరకు 680 బిల్లులకు 2380.76 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 158 బిల్లులకు 153.44 కోట్లు కలిపి మొత్తం రూ.2,544.13 కోట్లు చెల్లించామన్నారు. ప్యాకేజీ నగదు ఆయా రైతుల ఖాతాల్లోనే జమ చేశామని, ఎక్కడా అవినీతి జరిగే అవకాశం లేదన్నారు. పోలవరం లెక్కలను స్పష్టంగా చెప్పామన్నారు. ప్రతి విషయానికి స్పష్టంగా లెక్కలు ఆన్‌లైన్‌లో ఉన్నాయన్నారు. ఎవరైనా ఆన్‌లైన్‌ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని తెలిపారు.
 
 
కలెక్టర్లు ఎంతో కష్టపడ్డారు : మంత్రి ఉమ
పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పునరావాసం కల్పించే విషయంలో ఉభయ గోదావరి జిల్లాల కలెక్టర్‌లు కార్తీకేయ మిత్రా, కాటమనేని భాస్కర్‌ ఎంతో పారదర్శకంగా వ్యవహరించారన్నారు. ఎక్కడా అవినీతికి చోటు లేకుండా ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం వారి ఖాతాల్లోనే జమ చేయడం అభినందనీయమన్నారు.
 
 
ఇంజనీర్లను భర్తీ చేస్తాం - సీఎస్‌
పోలవరం ప్రాజెక్టులో ఖాళీగా ఉన్న ఇంజనీర్ల పోస్టులను 3 రోజుల్లో భర్తీ చేస్తామని రాష్ట్ర నీటి పారుదల శాఖముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌ అన్నారు. భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్‌ అమలులో ఉన్న జంగారెడ్డిగూడెం డివిజన్‌లో ఉన్న ఈఈ పోస్టును వెంటనే భర్తీ చేస్తామని తెలిపారు.
 
 
పునరావాసంపై విజయవాడలో చర్చ - మంత్రి ఉమ
పోలవరం ప్రాజెక్టు భూసేకరణ, పునరావాసానికి సంబంధించి మొత్తం ఇంజనీర్లందరికీ శనివారం విజయవాడలో సమావేశం నిర్వహిస్తామని మంత్రి ఉమ అన్నారు. ఈ సమావేశానికి రాజమండ్రి ఇందిరాసాగర్‌ భూసేకరణ పరిఽధిలో ఉన్న ఇంజనీర్లు పూర్తి స్థాయి దస్త్రాలతో రావాలని ఆదేశించారు. అన్ని బిల్లుల జిరాక్స్‌లు తీసుకొచ్చి పునారావాస డిప్యూటీ సీఈ నాగిరెడ్డికి అందించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు అథార్టీకి ఆ బిల్లులు అందజేస్తామని, వారిద్వారా కేంద్రానికి అప్పగిస్తారన్నారు. సమీక్షలో ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌ రేఖారాణి, జేసీ కోటేశ్వరరావు, ఐటీడీఏ పీవో హరీంద్రనాథ్‌, ఆర్డీవో మోహన్‌ కుమార్‌ పాల్గొన్నారు.
 
 
క్షుణ్ణంగా పనుల పరిశీలన..
పోలవరం ప్రాజెక్టు పనులను నేషనల్‌ హైడ్రోపవర్‌ కార్పొరేషన్‌ కమిటీ సభ్యులతో కలిసి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రాజెక్టును క్షుణ్ణంగా పరిశీలించారు. ఉదయం 10 గంటలకే పోలవరం వచ్చిన వారంతా ప్రాజెక్టులో జరుగుతున్న పనులన్నీ పరిశీలించారు. వాటి వివరాలను జర్మనీకి చెందిన హస్తాన్‌ వివరించారు. అలాగే స్పిల్‌వే కాంక్రీట్‌ పనుల వద్ద మ్యాప్‌ ద్వారా పూర్తి వివరాలను ఎస్‌ఈ రమేష్‌ బాబు తెలియజేశారు. అనంతరం గేట్ల తయారీ పనులు పరిశీలించి వారి అనుమానాలను అడిగి తెలుసుకున్నారు.
 
    కమిటీ సభ్యులు వై.కె.చౌబి, ఆర్‌.సి.శర్మ, సంకబిట్‌ చౌదితో కూడిన బృందం ఈ పనులను పరిశీలించింది. డయాప్రమ్‌వాల్‌ నిర్మాణ పనుల తీరును క్షుణ్ణంగా వివరించారు. పనులు ఎంత నాణ్యతగా సాగుతున్నాయో శశిభూషణ్‌ కుమార్‌ తెలియజేశారు. ఈఎంసీ ఎం.వెంకటేశ్వరరావు, సీఈ కుమార్‌, ఎస్‌ఈలు రమేష్‌ బాబు, పుల్లారావు, ఈఈ బుల్లియ్య, ట్రాన్‌ ట్రాయ్‌ ఈడి సాంబశివరావు, వైస్‌ ప్రెసిడెంట్‌ తిరుమలేశ్వరరావు, ఆర్డివో కె. మోహన్‌కుమార్‌ , డిఎస్పి రవికుమార్‌, పోలవరం సీఐ రమేష్‌బాబు, ఎస్‌ఐ శ్రీహరిరావు ఉన్నారు.
 
 
11న పోలవరానికి సీఎం రాక
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 11న పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు. అధికారిక పర్యటన ఖరారైంది. విజయవాడ నుంచి ఉదయం 11.30 గంటలకు పోలవరం చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. అనంతరం అధికార యంత్రాంగంతో సమీక్ష నిర్వహిస్తారు. ప్రాజెక్టు పనులు, ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీతో సహా అన్నింటిపైనా ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు పోలవరం నుంచి బయలుదేరి విజయవాడ వెళ్తారు.
 
 
22న కేంద్ర మంత్రి గడ్కరీ రాక
పోలవరం ప్రాజెక్టుపై వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర జల వనరుల శాఖా మంత్రి నితిన్‌ గడ్కరీ ఈనెల 22న పోలవరం రానున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని పనులను నిలిపివేయాల్సిందిగా గత వారం కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు అందడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది. కాని రెండు రోజుల క్రితమే పోలవరం ప్రాజెక్టు పనులను యధావిధిగా కొనసాగుతాయని గడ్కరీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రాజెక్టును ఆసాంతం తనిఖీ చేయడమే కాకుండా అధికారిక సమీక్ష నిర్వహిస్తారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అన్ని నివేదికలను సిద్ధం చేసింది.

 

Link to comment
Share on other sites

నివేదికే కీలకం!
ఎగువ కాఫర్‌ డ్యాంపై త్వరగా  ఇవ్వాలని రాష్ట్రం నివేదన
  2018 లక్ష్యం తీరాలంటే అత్యవసరం
  పరిమిత కాఫర్‌ డ్యాంకే   ఎన్‌హెచ్‌పీసీ మొగ్గు చూపితే  పనుల్లో జాప్యం
  అధికారుల తర్జనభర్జన
ఈనాడు - అమరావతి
9ap-main5a.jpg

పుణ్యకాలం గడచిపోక ముందే పోలవరం ఎగువ కాఫర్‌ డ్యాంపై కేంద్ర నిర్ణయం వెలువడాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటోంది. పోలవరం ప్రాజెక్టులో భారీస్థాయిలో చేపడుతున్న ఎగువ కాఫర్‌డ్యాం నిర్మాణం ఆవశ్యకతపై ... శుక్రవారం జాతీయ జలవిద్యుత్తు కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) కమిటీ సందేహాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఎన్‌హెచ్‌పీసీ ఎలాంటి నివేదిక ఇస్తుందోనని రాష్ట్రం ఆతృతగా ఉంది. కాఫర్‌ డ్యాం నిర్మాణం ఎత్తు పెంచి, నీళ్లు నిలబెట్టి కాలువల ద్వారా గ్రావిటీతో 2018లో నీళ్లు ఇవ్వాలని పట్టుదలతో ఉంది. ఈ లక్ష్యం నెరవేరాలంటే ఎన్‌హెచ్‌పీసీ నివేదిక సత్వరమే రావాలి. ఎన్‌హెచ్‌పీసీ బృందం రావడమే నెలరోజులకు పైగా ఆలస్యమయింది. నివేదిక కూడా ఆలస్యమైతే ప్రాజెక్టు జాప్యమవుతుంది. మరోవైపు కాఫర్‌ డ్యాం నిర్మాణానికి కమిటీ పచ్చజెండా ఊపి, ఆకృతుల కమిటీ ఆమోదం ఇచ్చేస్తే పనులు మొదలు పెట్టడానికి కెల్లర్‌ సంస్థ సిద్ధంగా ఉంది. ‘‘ఏ విషయం చెప్పినా సరే. వీలైనంత తొందరగా నిర్ణయం వెలువరిస్తే మా లక్ష్యం మేరకు పనులు పూర్తి చేసుకోవడం వీలవుతుంది’’ అని కేంద్ర కమిటీని కోరామని జలవనరులశాఖ ఉన్నతాధికారి ఒకరు శనివారం సాయంత్రం ‘ఈనాడు’కు చెప్పారు. నెలాఖరుకు జెట్‌ గ్రౌటింగ్‌ పనులు ప్రారంభించినా మూడు నెలల్లో పూర్తి చేయగలమని కెల్లర్‌ సంస్థ హామీ ఇస్తున్నట్లు జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ అన్నారు. ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మించుకోవచ్చని కమిటీ పచ్చజెండా ఊపితే తొందరగానే సమస్య కొలిక్కి వస్తుంది. పరిమిత స్థాయిలో చిన్న కాఫర్‌ డ్యాం నిర్మాణానికి మొగ్గు చూపి, ఆ మేరకు నివేదిక  ఇస్తే... తదుపరి ప్రక్రియ ఆలస్యమవుతుంది. మళ్లీ ఆ నివేదికను పోలవరం ఆకృతుల కమిటీ సమావేశంలో ఉంచి చర్చించాల్సి ఉంటుంది. ఆ కమిటీ ఏమంటుందో చూడాలి. వారి అభిప్రాయాలు జోడించి తిరిగి కేంద్ర జలసంఘానికి పంపాలి. అక్కడ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు బాగా సమయం పడుతుందని అధికారులు అంటున్నారు.

చర్చకొచ్చిన కీలకాంశాలు...
* గోదావరిలో నవంబరు తర్వాత దాదాపు జూన్‌ వరకు ఆరు నెలల పాటు ప్రవాహాలు బాగా తక్కువగా ఉంటాయి. ఆ సమయంలో గోదావరి కేవలం రమారమి 400 మీటర్ల మేర ప్రవహిస్తూ ఉంటుంది. అందువల్ల పరిమితస్థాయిలో ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మిస్తే చాలనేది వారి ఆలోచన. ప్రధాన డ్యాం 1750 మీటర్ల పొడవునా నిర్మించాల్సి ఉంటుంది. ఎగువ కాఫర్‌ డ్యాం దాదాపు 2300 మీటర్ల పొడవున నిర్మించాలి. కమిటీ అభిప్రాయం ప్రకారం వరద లేని సమయంలో ప్రధాన డ్యాం నిర్మించుకుంటూ... డిసెంబర్‌ నుంచి జూన్‌ లోపు కేవలం 10వేల క్యూసెక్కులు మాత్రమే ప్రవాహం ఉన్న సమయంలో ఎగువ కాఫర్‌ డ్యాం కేవలం చిన్నదిగా నిర్మించి అది ప్రధాన డ్యాంతో అనుసంధానించాలి. ఆ సమయంలో మిగిలిన ప్రధాన డ్యాం పనులు పూర్తి చేసుకోవచ్చని ఎన్‌హెచ్‌పీసీ సభ్యుల వాదన.
* ప్రధాన డ్యాంలో డయా ఫ్రం వాల్‌ నిర్మాణం చేపడుతున్నామని, కాఫర్‌ డ్యాంలో జెట్‌ గ్రౌటింగ్‌ విధానం ఉందని రెండింటి అనుసంధానం ఎలా సాధ్యమని అధికారులు ప్రశ్నించగా...అనేక అభిప్రాయాలు చర్చకు వచ్చాయి. ప్రధాన డ్యాం సంబంధించిన డయాఫ్రం వాల్‌ పనుల జోలికి పోకుండా దాన్ని ‘టి’ ఆకారంలో మరింత విస్తృతం చేసి జెట్‌ గ్రౌటింగ్‌కు అనుసంధానం చేయవచ్చని కమిటీ అభిప్రాయపడింది.
* సెంట్రల్‌ ఫిల్టర్స్‌, క్లే కోర్‌ అనుసంధానం ఇబ్బందులు, వివిధ లేయర్ల వల్ల నీటి లీకేజి తదితర అంశాలూ చర్చలోకి వచ్చాయి. వీటన్నింటిపై తాము అధ్యయనం చేసి నివేదిక ఇస్తామని కమిటీ చెప్పింది. వివిధ కాలాల్లో నీటి ప్రవాహాలపై వివరాలు పంపాలని కోరింది.


పోలవరం త్రిసభ్య కమిటీ  భేటీ నేడు

ఈనాడు, అమరావతి: పోలవరంలో పనుల్లో వివిధ ఆర్థిక సమస్యలు, వాస్తవ ధరలకు సంబంధించిన ప్రతిపాదనలపై నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ ఆదివారం భేటీ కాబోతోంది. తొలుత రాజమహేంద్రవరంలో ఈ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని భావించినా ఆ తర్వాత వేదిక విజయవాడకు మారినట్లు సమాచారం. జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు కన్వీనర్‌గా ఉన్న ఈ కమిటీలో పోలవరం ప్రాజెక్టు సలహాదారు భార్గవ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శి ఆర్‌.కె.గుప్తాలు సభ్యులు.

Link to comment
Share on other sites

కాఫర్‌డ్యాం నిర్మించకుంటే పోలవరం భద్రతకు ముప్పు
10-12-2017 03:00:49
 
636484716513318729.jpg
  • పైగా నిర్మాణంలో మహా జాప్యం
  • నీటి సంవత్సరాన్ని కోల్పోతాం
  • ఎన్‌హెచ్‌పీసీకి స్పష్టం చేసిన రాష్ట్రం
  • టెండర్ల ఖరారుపై నేడు భార్గవ కమిటీ భేటీ
  • రేపు పోలవరంలో సీఎం సమీక్ష
అమరావతి, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): ‘కాపర్‌ డ్యాంను నిర్మించకుండా పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తే ప్రధాన ఆనకట్ట భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. వందల ఏళ్ల పాటు ఉండాల్సిన కట్టడానికి రక్షణ ఉండదు. ప్రధాన డ్యాంను అంచెలంచెలుగా నిర్మిస్తే.. కాంక్రీట్‌ సెటిల్‌ కాదు. దీనివల్ల భద్రత కరువవుతుంది’ అని రాష్ట్రప్రభుత్వం స్పష్టం చేసింది. రూ.58,000 కోట్లతో నిర్మించే ఈ ప్రాజెక్టులో ఆదా చేయాలనుకోవడం సరికాదని పేర్కొంది. నేషనల్‌ హైడ్రో పవర్‌ ప్రాజెక్టు (ఎన్‌హెచ్‌పీసీ) జనరల్‌ మేనేజర్‌ వైకే చౌబే, జియాలజీ చీఫ్‌ ఆర్‌సీ శర్మ, సీనియర్‌ మేనేజర్‌ శంఖదీప్‌ చౌదరితో కూడి బృందం శుక్రవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించింది.
 
వారితో భేటీ అయిన రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు కాఫర్‌ డ్యాం నిర్మించాల్సిందేనన్నారు. ‘దీని నిర్మాణానికి రూ.200 కోట్లు ఖర్చవుతుంది. ఇది మిగుల్చుకోవడానికి డ్యాం భద్రతను గాలికి వదిలేయడం సరికాదు. ఆనకట్ట రక్షణను పరిగణనలోకి తీసుకునే గతంలో కేంద్ర జల సంఘం కాఫర్‌ డ్యాంకు ఆమోదం తెలిపింది. ఇప్పుడు ఖర్చు తగ్గించుకోవడానికి భద్రతా ప్రమాణాలకు తిలోదకాలివ్వాలనుకోవడం సరికాదు. దీనిని ప్రధాన ప్రాజెక్టుతో కలిపి నిర్మిస్తే.. బాగా జాప్యం జరుగుతుంది. ఒక నీటి సంవత్సరం వృథా అవుతుంది’ అని పేర్కొన్నారు.
 
ఇవీ కారణాలు..
పోలవరం ప్రాజెక్టులో భాగంగా కాఫర్‌ డ్యాం నిర్మాణం తప్పనిసరి అనడానికి నిపుణులు చెప్పిన కారణాలు ఇలా ఉన్నాయి. ‘ప్రధాన ప్రాజెక్టు నిర్మాణంతోనే కాఫర్‌ డ్యాం కలసి ఉండేలా డిజైన్లను రూపొందిస్తే.. ప్రధాన ఆనకట్టకు మట్టి పరీక్ష చేసి.. ప్రత్యేకంగా ట్రీట్‌మెంట్‌ చేయాల్సి ఉంటుంది. పైగా.. గోదావరి జలాలు లేనప్పుడు ప్రధాన కట్టడం నిర్మిస్తూ.. జలాలు వచ్చాక ఆపేసి.. మళ్లీ నీటి మట్టం తగ్గాక నిర్మాణ పనులు చేపడితే.. కాంక్రీటు సెటిల్‌ కాదు. అంతా లేయర్లుగా తయారవుతుంది. అది డ్యాం భద్రతకే ముప్పుగా పరిణమిస్తుంది. అదీగాక ప్రధాన కట్టడంతో కలిపి కాఫర్‌ డ్యాంను నిర్మిస్తే.. ప్రధాన కట్టడం ఎత్తు ఎక్కువగానూ.. కాఫర్‌ డ్యాం ఎత్తు తక్కువగానూ ఉంటుంది. ప్రాజెక్టు నిర్మాణంలో పొదుపు చర్యలు అనుసరిస్తే.. నాణ్యత తగ్గిపోతుంది. నాణ్యతలో రాజీపడితే ప్రమాదం’ అని తెలిపారు.
 
సాంకేతిక సమస్యలపై నేడు అధ్యయనం
పోలవరం స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ కాంక్రీట్‌ పనుల కోసం పిలిచిన టెండర్ల ఖరారుకు ముందు.. పలు అంశాలపై సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడంపై పోలవరం ప్రాజెక్టు సలహాదారు దినేశ్‌ ప్రసాద్‌ భార్గవ, పోలవరం ప్రాజెక్టు సభ్య కార్యదర్శి ఆర్‌.కె.గుప్తా, ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు ఆదివారం విజయవాడలో భేటీ కానున్నారు. ఈ నెల 5న కేంద్ర జల వనరుల మంత్రి నితిన్‌ గడ్కరీ వద్ద జరిగిన సమావేశంలో.. టెండర్ల ప్రక్రియను పూర్తి చేసేముందు వాస్తవ సమస్యలేమిటో ఈ కమిటీ అధ్యయనం చేయాలని సూచించారు.
 
ఈపీసీ కాంట్రాక్టులో ధరలు పెంచడం సాధ్యం కాదని గడ్కరీకి ఈఎన్‌సీ వివరించే ప్రయత్నం చేశారు. అయితే.. ధరల వ్యత్యాసం, కాంక్రీట్‌ కూలింగ్‌ విధానం, యంత్రాలు తీసుకురావడం వంటి పలు అంశాలు కాంట్రాక్టు అగ్రిమెంటులో లేవని.. వాటిని సమీక్షించే వీలుందని గడ్కరీ అన్నారు. సోమవారం ఉదయం ప్రాజెక్టు పనులను భార్గవ కమిటీ సమీక్షిస్తుంది. కాగా.. సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పోలవరం వద్ద మధ్యాహ్నం 12 నుంచి మూడు గంటల దాకా సమీక్ష నిర్వహించనున్నారు.
Link to comment
Share on other sites

అనుబంధ టెండర్లు?
పోలవరం ప్రధాన రిజర్వాయర్‌ కాలువల పనులకు మళ్లీ పిలుపు
65వ ప్యాకేజి గుత్తేదారుకు 60 సి కింద నోటీసులు
కొత్త ధరలు ఇమ్మంటున్నఅనుబంధ ప్యాకేజీల గుత్తేదారులు
ఈనాడు - అమరావతి
10ap-main8a.jpg

పోలవరంలో ప్రధాన డ్యాం పనులతో పాటు ప్రధాన జలాశయం నుంచి ఎడమ, కుడి కాలువలకు నీటిని తీసుకెళ్లేందుకు చేయాల్సిన పనుల్లో కొన్నింటికి మళ్లీ టెండర్లు పిలిచేందుకు జలవనరుల శాఖ రంగం సిద్ధం చేస్తోంది. కీలకమైన ఈ అనుబంధ పనులకు సంబంధించి ఆరు ప్యాకేజీలుగా విడగొట్టి ఎప్పుడో 2004లోనే గుత్తేదారులకు పనులు అప్పగించారు. ఆ పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. కుడి కాలువ అనుబంధ పనులు దాదాపు 85శాతం పూర్తయినా ఎడమ కాలువ అనుబంధ పనులు మరీ ఆలస్యమవుతున్నాయి. ఇందులో రెండు ప్యాకేజీల్లో కేవలం పది, 20 శాతం పనులే పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో 65వ ప్యాకేజీ గుత్తేదారుకు ఇప్పటికే పోలవరం అధికారులు 60సి కింద నోటీసులిచ్చారు. మీ పని నుంచి కొంత తొలగించి కొత్త గుత్తేదారుకు ఎందుకు ఇవ్వకూడదో తెలియజేయాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ ప్యాకేజికి కొత్తగా టెండర్లు పిలవనున్నట్లు జలవనరుల శాఖ అధికారులు వెల్లడించారు. త్వరలో ఈ ప్రక్రియ కొలిక్కి రానుంది.

పనుల వివరాలివి..
- ప్యాకేజీ 62: పోలవరం ప్రధాన డ్యాంకు కుడి వైపున కాలువను కలిపేలా కుడి ఫ్లాంకు రెగ్యులేటర్‌, ఆఫ్‌టేక్‌ రెగ్యులేటర్‌, శాడిల్‌డ్యాం, పనులు.. వీటికోసం రూ.79 కోట్లతో  2005లోనే గుత్తేదారుతో ఒప్పందం కుదుర్చుకున్నారు. తర్వాత  మరో రూ.2.306 కోట్ల విలువైన పనికి మరో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంతవరకు 80 శాతం పని పూర్తయింది.
* ప్యాకేజీ 63: కుడి కాలువ అనుసంధానానికి వీలుగా 900 మీటర్ల పొడవైన టన్నెల్‌, ఈ టన్నెల్‌లోకి వెళ్లే.. బయటకు వచ్చే ఛానళ్ల మట్టి తవ్వకం, ఆఫ్‌టేక్‌ రెగ్యులేటర్‌ వద్ద స్టిల్లింగ్‌ బేసిన్‌ పనులు రూ.72.81 కోట్ల విలువతో 2005లోనే ఒప్పందం కుదుర్చుకున్నారు. పనులు 80శాతానికి పైగా పూర్తయ్యాయి.
ప్యాకేజీ 64: కుడి వైపున 880 మీటర్ల పొడవైన టన్నెల్‌ నిర్మాణం. ఇక్కడ కూడా టన్నెల్‌లోకి నీటిని తీసుకువెళ్లే, బయటకు తీసుకువెళ్లే ఛానళ్ల మట్టి తవ్వకం పనులు రూ.73.90 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టేందుకు 2005లోనే ఒప్పందం కుదుర్చుకున్నారు. పనులు 85శాతం పూర్తయ్యాయి.
ప్యాకేజి 65: ఎడమ వైపున కాలువను అనుసంధానించేలా 919 మీటర్ల టన్నెల్‌ నిర్మాణం, ఎడమ ఫ్లాంకు రెగ్యులేటర్‌ పనులు. మొత్తం రూ.90.99 కోట్లతో 2005లోనే ఒప్పందం, రూ.12.92 కోట్లతో 2006లో మరో అనుబంధ ఒప్పందం కుదిరింది. పనులు 20శాతమే పూర్తయ్యాయి.
ప్యాకేజి 66: ఎడమ వైపున 890 మీటర్ల టన్నెల్‌ నిర్మాణం, శాడిల్‌ డ్యాం, ‘కెఎల్‌’ ఆఫ్‌టేక్‌ రెగ్యులేటర్‌ నిర్మాణ పనులు. వీటికి రూ.77.08 కోట్లతో 2006లోనే ఒప్పందం కుదిరింది. ఇంతవరకు పది శాతం పనులే పూర్తయ్యాయి.
ప్యాకేజి 67: నేవిగేషన్‌ కాలువ, 1,2,3 నేవిగేషన్‌ గేట్లు, కాలువ సైఫన్‌ నిర్మాణ పనులు. రూ.86.79 కోట్ల విలువతో 2005లోనే ఒప్పందం. 95శాతం పనులు పూర్తి.
టెండర్ల వైపు ప్రయత్నాలు.. తొలుత 65వ ప్యాకేజికి సంబంధించి టెండర్లు పిలిచేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ పనులకు రూ.200 కోట్లకుపైగా ఖర్చవుతుందని లెక్కిస్తున్నారు. 66వ ప్యాకేజీపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
కొత్త ధరలు ఇమ్మంటున్న గుత్తేదారులు.. ఎప్పుడో 2005 ధరలతో పనులు చేయాల్సి వస్తోందని, జీవో 22, 63 వర్తింపజేసినా తమకు సరిపోవడం లేదని అనుబంధ ప్యాకేజీల గుత్తేదారులు అంటున్నారు. అటవీ అనుమతులు తదితర కారణాల వల్లే పనులు ఆలస్యమయ్యాయన్న అంశాన్నీ వారు ప్రస్తావిస్తున్నారు. కొత్త ధరలు ఇవ్వాలని కోరుతున్నారు. జలవనరుల మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆదివారం ఈ పనులకు సంబంధించి గుత్తేదారులను పిలిచి సమీక్షించారు.

Link to comment
Share on other sites

రాయితీలు ఇవ్వగలమా?
మార్గాన్వేషణలో పోలవరం త్రిసభ్య కమిటీ
గుత్తేదారుణ్నే ప్రశ్నించిన అధికారులు
నేడు మళ్లీ భేటీ కావాలని నిర్ణయం

ఈనాడు-అమరావతి: పోలవరం ప్రాజెక్టులో ప్రధాన గుత్తేదారు వినతులను ఎంత మేరకు పరిష్కరించగలమన్న అంశంపై త్రిసభ్య కమిటీ మార్గాన్వేషణలో పడింది. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సూచన మేరకు ఈ కమిటీ ఆదివారం విజయవాడలో సమావేశమైంది. గుత్తేదారుతో కుదిరిన ఒప్పందాన్ని, అందులోని అంశాలను పరిశీలిస్తూ.. ప్రధాన గుత్తేదారు ఏమేం కోరుతున్నారో ఒప్పందానికి మేళవించి పరిశీలన ప్రారంభించారు. జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు కన్వీనర్‌గా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌.కె.గుప్తా, సలహాదారు భార్గవలు సమావేశమయ్యారు. ప్రధాన గుత్తేదారు ట్రాన్స్‌ట్రాయ్‌ అయిదు అంశాలను ప్రభుత్వం ముందుంచింది. కాంక్రీటు జోనింగులో మార్పు తీసుకువచ్చి తదనుగుణంగా ధరల చెల్లింపు, మట్టి తవ్వకంలోను సరైన వర్గీకరణతో సంబంధిత ధర చెల్లింపు, మట్టి, రాళ్ల రవాణా ఖర్చులు క్షేత్రస్థాయిలో ఎంత దూరం ఉందో తదనుగుణంగా ఇవ్వడం, కాంక్రీటు పనులకు వాస్తవ ధరలు లెక్కించి ఆ ధరలు ఇవ్వడం, అదనపు యంత్రాలు, వనరుల సమీకరణకు పడే భారం చెల్లింపు వంటి డిమాండ్లు ట్రాన్స్‌ట్రాయ్‌.. కమిటీ ముందుంచింది. ప్రధాన గుత్తేదారుతో అప్పట్లో కుదుర్చుకున్న ఒప్పందం చాలా కీలకమని, ఆ ఒప్పందం చాలా పకడ్బందీగా ఉందని త్రిసభ్య కమిటీ గుర్తించినట్లు సమాచారం. ఆ ఒప్పందానికి ఇప్పటి డిమాండ్లకు మధ్య పొంతన కుదరడం అంత సులభమయ్యే విషయమేమీ కాదనే భావన ఆ కమిటీ సభ్యుల్లో వ్యక్తమవుతోంది. ప్రస్తుత ప్రాజెక్టు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఏ మేరకు ఈ డిమాండ్లు పరిష్కరించే అవకాశం ఉందనే కోణమే ప్రస్తుతం దీనికి జోడించి పరిశీలిస్తున్నారు. గుత్తేదారు ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కమిటీ సభ్యులు వారినే అడిగారు. ఒప్పందం కుదుర్చుకున్న మీరు ఆ పరిధిలో వీటిని ఎలా అమలు చేయగలమని భావిస్తున్నారో వివరించాలని కోరారు. గుత్తేదారు తరఫు నుంచి వారి ఇబ్బందులు వివరించారు. ప్రాజెక్టు క్షేత్రం ఆలస్యంగా అప్పగించడం, భూసేకరణలో ఆలస్యం, అదనపు యంత్రపరికరాలు తదితర అనేక భారాలు ప్రస్తావించినట్లు సమాచారం. సోమవారం మరోసారి భేటీ అయి మరింత లోతుగా ఇందులోని అంశాలను పరిశీలించాలని కమిటీ నిర్ణయించింది.

Link to comment
Share on other sites

నేడు సీఎం పోలవరం సందర్శన
నేటి నుంచి మళ్లీ మట్టి తవ్వకం

ఈనాడు, అమరావతి: పనుల సమీక్షకు సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో శాసనసభలో పోలవరంపై చర్చించాక ముఖ్యమంత్రి మళ్లీ సమీక్షిస్తున్నది ఈ సోమవారమే. ఈలోపు కేంద్ర మంత్రి గడ్కరీ వద్ద జరిగిన భేటీలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. డిసెంబరు 22న తాను నేరుగా పోలవరానికి వచ్చి ప్రగతిపై సమీక్షిస్తానని కేంద్ర మంత్రి చెప్పారు. గుత్తేదారులు పనుల్లో వేగం పెంచాలన్నారు. ట్రాన్స్‌ట్రాయ్‌తో ఒప్పందంలో భాగంగా త్రివేణి సంస్థ చేపట్టిన మట్టి తవ్వకం పనులు ఇటీవలే నిలిచిపోయాయి. ఈ పనులకు సంబంధించి పోలవరం అధికారులు టెండర్లు కూడా పిలిచారు. నిధుల చెల్లింపు బాధ్యత తనదని కేంద్ర మంత్రి భరోసానిచ్చిన నేపథ్యంలో త్రివేణి సంస్థ సోమవారం ఉదయం నుంచి మట్టి పనులు ప్రారంభించనుంది. వీరికి కూడా ఎస్క్రో ఖాతా ద్వారా బిల్లులు చెల్లించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. ప్రధాన గుత్తేదారు లేవనెత్తిన అంశాలు పరిష్కరించేవరకు, కేంద్రం అడిగిన ఇతర సమాచారం తమకు చేరేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా పిలిచిన టెండర్లు నిలిపేయాలంటూ కేంద్ర జలవనరుల శాఖ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్ర అధికారులు టెండర్లను వెబ్‌సైట్‌లో నవీకరించారు. డిసెంబరు 23నాటికి మొత్తం ప్రక్రియ పూర్తయ్యేలా ఏర్పాట్లుచేశారు. కొత్త టెండరు ప్రక్రియ కొనసాగిస్తారా? ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ముఖ్యమంత్రి సోమవారంనాటి సమీక్షలో వెల్లడవుతుందేమోనని అధికారులు భావిస్తున్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...