Jump to content

polavaram


Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply
1 hour ago, Anne said:

Uncle key bord mundu kursuni typing antha easy em kadu... Pk inspiration aa mee questions ki :D

Pk  evaru.. what's wrong with my assumption..if centre doesnt supports we can extend pumps in pattiseema and continue..whats comedy in this?

Link to comment
Share on other sites

నిపుణుల మాటా వినరు!
03-12-2017 02:12:40
 
636478639618291863.jpg
  • పోలవరం ప్రాజెక్టు పనులపై ఏప్రిల్‌లోనే నిపుణుల కమిటీ నివేదిక
  • పీపీఏ పాత్రేమిటో తక్షణం తేల్చాలి
  • కాఫర్‌ డ్యామ్‌ 42 మీటర్ల ఎత్తులో నిర్మించాలి
  • ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి ఉల్లంఘనలు లేవు
  • నివేదికలో స్పష్టం చేసిన నిపుణుల కమిటీ
  • పట్టించుకోని కేంద్ర జల వనరుల శాఖ
  • కాఫర్‌ డ్యామ్‌ సహా కీలక పనులకు కొర్రీలు
అమరావతి, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు కాఫర్‌ డ్యామ్‌ను 42 మీటర్ల ఎత్తులో నిర్మించేలా భూసేకరణ చేయాలి.. ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి ఉల్లంఘనలూ లేవు.. ఇటీవల పోలవరాన్ని సందర్శించిన నిపుణుల కమిటీ కేంద్రానికి ఇచ్చిన నివేదికలోని ప్రధానాంశాలు ఇవి. వీటినేవీ పట్టించుకోకుండా కేంద్ర జలసంఘం కాఫర్‌ డ్యాం నిర్మాణంపై మెలిక పెట్టడం.. కీలకమైన స్పిల్‌ వే, చానల్‌ టెండర్లను నిలిపివేయాలని కోరడం చర్చనీయాంశమైంది.
 
పోలవరం ప్రాజెక్టు పనులను పర్యవేక్షించేందుకు ఈ ఏడాది ఏప్రిల్‌ 19, 20 తేదీల్లో నిపుణుల కమిటీ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించింది. ఈ కమిటీలో.. సీడబ్ల్యూసీ చీఫ్‌ ఇంజనీరు, సీడబ్ల్యూసీ (కేజీబీవో) చీఫ్‌ ఇంజనీరు, సీడబ్ల్యూసీ (డిజైన్స్‌) చీఫ్‌ ఇంజనీరు, సీడబ్ల్యూసీ (పీపీవో) చీఫ్‌ ఇంజనీరు, సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్‌ పాండ్యా, సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు డీవీ థరేజా, నేషనల్‌ హైడ్రోఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) మాజీ డైరెక్టర్‌ డీపీ భార్గవ తదితరులు ఉన్నారు. పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో రెండు రోజులపాటు పర్యటించిన ఈ కమిటీ ఓ నివేదికను కేంద్రానికి అందజేసింది. అందులో ప్రధానాంశాలు...
 
పీపీఏ పాత్ర ఏమిటో తేల్చండి
పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెరగాలంటే.. లక్ష్యాల మేరకు ప్రాజెక్టు పూర్తికావాలంటే పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) పాత్ర ఏమిటో తక్షణమే తేల్చాలని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. పీపీఏ విధివిధానాలేమిటో స్పష్టం చేయకుంటే ఎవరు ఏ పనిచేయాలో తెలియక వ్యవస్థ గందరగోళంగా మారుతుందని కమిటీ తేల్చి చెప్పింది. అదే సమయంలో జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టుగా పోలవరం పనుల పర్యవేక్షణలో కేంద్ర జల సంఘం, కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ పరిధిలోని కృష్ణా గోదావరి బేసిన్‌ ఆర్గనైజేషన్‌ (కేజీబీవో) ఎలాంటి పాత్రనూ పోషించడం లేదని తప్పుబట్టింది. రాష్ట్ర విభజన చట్టం మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏర్పాటైనా 2017 ఏప్రిల్‌ దాకా దాని విధివిధానాలేమిటో కేంద్రం ఖరారు చేయకపోవడంపై కమిటీ విస్మయం వ్యక్తం చేసింది.
 
భూసేకరణకు రూ.30 వేల కోట్లు
పోలవరం ప్రాజెక్టు కోసం 1,60,589 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని ఇందులో 2013 భూసేకరణ చట్టానికి ముందు 70,482.56 ఎకరాలను సేకరించారని కమిటీ నివేదికలో పేర్కొంది. భూసేకరణ చట్టం 2013 ప్రకారం 6012.70 ఎకరాలను సేకరించారని, ఇంకా 84,093.74 ఎకరాలను సేకరించాల్సి ఉందని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. 84,093.74 ఎకరాల భూసేకరణ కోసం రూ.9676.66 కోట్లు ఖర్చు చేయాల్సి ఉందని స్పష్టం చేసింది. అదేవిధంగా నిర్వాసితుల సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం రూ.20,547 కోట్ల వరకూ వ్యయం అవుతుందని అంచనా వేసింది. మొత్తానికి భూ సేకరణ, సహాయ, పునరావాస కార్యక్రమాల కోసం రూ.30,223 కోట్ల మేర బడ్జెట్‌ అవసరమువుతుందని నిపుణుల కమిటీ స్పష్టీకరించింది. పోలవరం ప్రాజెక్టులో భూసేకరణ వ్యయమే అత్యంత కీలకం కానుందని నివేదికలో స్పష్టం చేసింది.
 
కేంద్రం ఇచ్చింది రూ.2514.70 కోట్లు
జాతీయ హోదాను ప్రకటించాక కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టుకు 2014-15లో రూ.245 కోట్లు, 2015-16లో రూ.590 కోట్లు, 2016-17లో 2514.70 కోట్లు మొత్తం రూ.2514.70 కోట్లు మాత్రమే విడుదలయ్యాయని నిపుణుల కమిటీ పేర్కొంది. హెడ్‌ వర్క్స్‌ పనులకు రాష్ట్రప్రభుత్వం ముందుగా వ్యయం చేశాక, కేంద్రం ఆ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుందని, కానీ అన్నింటికంటే ముందుగా ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన భూసేకరణకు ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన(పీఎంకేఎ్‌సవై) కింద కేంద్రం నిధులు మంజూరు చేయాల్సి ఉందని వివరించింది. తాము పోలవరంను సందర్శించిన సమయంలో 2013-14 అంచనాలను పరిగణనలోకి తీసుకుంటే రూ.46,925.96 కోట్లుగా తేలిందని స్పష్టం చేసింది. ఈ వ్యయాలను పీఎంకేఎ్‌సవై ద్వారా ఎప్పటికప్పుడు విడుదల చేయాల్సి ఉందని నిపుణుల కమిటీ స్పష్టీకరించింది.
 
డిజైన్ల ఆమోదంలో జాప్యం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన డిజైన్లను సీడబ్ల్యూసీ ఆమోదం కోసం ప్రధాన కాంట్రాక్టు సంస్థ పంపిందని, సకాలంలో డిజైన్లను ఆమోదించకపోవడం వల్ల పనులు ముందుకు సాగడం లేదని నిపుణుల కమిటీ నివేదిక స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను రాష్ట్ర జల వనరులశాఖ తనిఖీ చేస్తోందని.. ఈ తనిఖీ మరింత పకడ్బందీగా ఉండాలని సూచించింది. 2019కి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని సాధించాలంటే ప్రస్తుతం ఉన్న యంత్ర సామగ్రి సామర్థ్యం సరిపోదని, ఇంకా మరిన్ని యంత్రాలను సమకూర్చుకోవాల్సి ఉందని కమిటీ స్పష్టం చేసింది.
 
ఈ ఏడాది ఏప్రిల్‌లోనే నిపుణుల కమిటీ కేంద్రానికి నివేదిక ఇచ్చినా వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా.. కాఫర్‌ డ్యామ్‌ను నిర్మించాలా వద్దా.. ఈ డ్యామ్‌ను ప్రధాన ప్రాజెక్టులోనే అనుసంధానం చేయాలా వద్దా అంటూ కేంద్రజలవనరుల శాఖ మెలికలు పెట్టడం గమనార్హం. అదేవిధంగా కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ భూసేకరణ కోసం రూ.30,223 కోట్ల వ్యయం అవుతుందని స్పష్టం చేసినా, ఇంత వరకు దానిపై కేంద్ర జలవనరుల శాఖ దృష్టి సారించలేదు. పోలవరం పనుల నాణ్యతలో ఎలాంటి లోపాలు కనిపించలేదని, నిర్మాణాల్లో డిజైన్ల ఉల్లంఘన లేదని నిపుణుల కమిటీ స్పష్టీకరించింది. ఇవేవీ పట్టించుకోకుండా కేంద్రం కొర్రీలు వేయడం చర్చనీయాంశమైంది.
 
 
 
 
Link to comment
Share on other sites

 
ఇదిగో పోలవరం
04-12-2017 12:57:26
 
636479890467957660.jpg
  •  కాంట్రాక్టర్‌ మార్పు విషయంలోనే వివాదం!
  •  రూ.5616 కోట్లతో హెడ్‌వర్క్‌ పనులు
  •  స్పిల్‌వే పనులు 35 శాతం
  • కొత్తగా స్పిల్‌వే ఛానల్‌ పనులకు టెండర్లు
  •  ఈ నెల 28న టెండర్లు ఖరారు
రాజమహేంద్రవరం(తూర్పు గోదావరి జిల్లా): పోలవరం ప్రాజెక్టు వ్యవహారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గందరగోళ పరిస్థితి ఏర్పడినప్పటికీ నిర్మాణ పనులు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం పనులు ఆగినట్టు జరుగుతున్న వివాదానికి కారణం కాంట్రాక్టర్‌ మార్పు అని అధికారులు చెప్తున్నారు. కేంద్రంలోని ఉన్నతాధికారులు ప్రస్తుతం ఉన్న ట్రాన్స్‌ట్రాయ్‌ కాంట్రాక్టరును కొనసాగించమని చెప్తుండగా ఈ సంస్థ వద్ద ప్రస్తుతం అవసరానికి సరిపడా ఎక్విప్‌మెంట్‌ లేదని... అందువల్ల మరో పెద్ద సంస్థకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. 2018కి గ్రావిటీ మీద నీరు ఇవ్వాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి ఉన్న సంగతి తెలిసిందే. ఈ లక్ష్యం నెరవేరాలంటే స్పిల్‌వే, కాఫర్‌ డ్యామ్‌ పనులు త్వరగా పూర్తవ్వాలి. 2018 డిసెంబరు నాటికి ఈ పనులు పూర్తి కావడానికి స్పిల్‌వే పనుల్లో రోజుకు 10వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని జరగాలి. కానీ ప్రస్తుతం రోజుకు గట్టిగా చేస్తే 3వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పని అవుతోంది. ఒక్కోరోజు 15 వేల క్యూబిక్‌ మీటర్ల పని మాత్రమే జరుగుతోంది. ఇక్కడ వేగం పెంచాలంటే మరింత ఎక్విప్‌మెంట్‌ అవసరమనేది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. ఈ నేపథ్యంలోనే స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌ పనులకు కొత్త కాంట్రాక్టరును నియమించడానికి టెండరు పిలిచారు. ఈ టెండరును ఈనెల 28వ తేదీన తెరవనున్నారు. తర్వాత కొత్త సంస్థకు ప్రధాన పనులు అప్పగించే అవకాశం ఉంది. అప్పుడు కూడా ట్రాన్స్‌టాయ్‌కు కొంతమేర పనులు ఉంటాయి. స్పిల్‌వేలో కొన్ని పనులతో పాటు కొన్ని లైనింగ్‌ పనులూ ఉంటాయి. కాఫర్‌ డ్యామ్‌, ప్రధాన ఈసీఆర్‌ఎఫ్‌ (ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ ) పనులు కూడా ట్రాన్స్‌ట్రాయ్‌ కంట్రోల్‌లోనే ఉంటాయి. ప్రస్తుతం మొత్తం హెడ్‌వర్క్స్‌ పూర్తి చేయడానికి రూ.5,616 కోట్ల పనులు మొదలుపెట్టగా ఇప్పటికే రూ.1,665 కోట్ల పనులు పూర్తి అయ్యాయి, ఇంకా రూ.3950 కోట్ల విలువైన పనులు పెండింగులో ఉన్నాయి. ఈ హెడ్‌వర్క్స్‌ పనుల్లో స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌, కాఫర్‌ డ్యామ్‌, డయాఫ్రమ్‌వాల్‌ ఉంటాయి. ఇంతవరకు స్పిల్‌వే పనులు 35 శాతం, స్పిల్‌ ఛానల్‌ పనులు 60 శాతం, డయాఫ్రమ్‌ పనులు 50 శాతం జరిగాయి, కాఫర్‌ డ్యామ్‌ పనులు ఇప్పుడే మొదలు పెట్టారు. ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ నిర్మాణానికి అనుకూలంగా డయాఫ్రమ్‌ వాల్‌ను కొంతవరకు నిర్మించారు.
 
ఈసీఆర్‌ఎఫ్‌ పనులకు సన్నాహాలు
తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య అంగుళూరు, పోలవరం గ్రామాల మధ్య గోదావరిలో నిర్మించే పోలవరం ప్రాజెక్టులో ప్రధాన భాగం ఈసీఆర్‌ఎఫ్‌. ఇదే ప్రధాన డ్యామ్‌. దీని పొడవు 2.45 కిలోమీటర్లు. ఈ పనిని పూర్తి చేయాలంటే దీనికి అప్‌స్ట్రీమ్‌లో ఒక కాఫర్‌ డ్యామ్‌, డౌన్‌ స్ట్రీమ్‌లో మరో కాఫర్‌ డ్యామ్‌ నిర్మించాలి. వరదల సమయంలో నీరు ప్రధాన డ్యామ్‌ పనుల మీదకు రాకుండా ఈ కాఫర్‌ డ్యామ్‌లు కాపాడతాయి. డ్యామ్‌ పూర్తయ్యే వరకు నీటిని అడ్డుకుంటాయి. ప్రధాన డ్యామ్‌ నిర్మాణం పూర్తి అయ్యే వరకు ఈ కాఫర్‌ డ్యామ్‌ల వల్ల ఆగిన నీటిని స్పిల్‌ వే నుంచి గ్రావిటీ ద్వారా కాలువలలోకి మళ్లిస్తారు. ప్రధాన డ్యామ్‌ అయిన ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ పూర్తి తర్వాత కాఫర్‌ డ్యామ్‌లను తొలగిస్తారు. ప్రధాన డ్యామ్‌కి పోలవరం వైపు ఒక కిలోమీటరు మేర 53 గేట్‌లతో స్పిల్‌వే పనులు జరుగుతున్నాయి. ఇందులో 48 గేట్‌ల ద్వారా నీటిని వదిలి పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువలకు నీటిని పంపిస్తారు. కాని కేంద్ర ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేస్తే ఈ పనులు త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఒకవేళ కేంద్రం నుంచి నిధులు రాక ఆలస్యమైతే మరో మార్గం ద్వారానైనా ఈ పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.
 
 
Link to comment
Share on other sites

పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న కేంద్ర బృందం
04-12-2017 15:11:50
 
636479971108362978.jpg
అమరావతి: మంగళవారం పోలవరం ప్రాజెక్ట్‌ను నేషనల్ హైడ్రోపవర్ కార్పొరేషన్ (ఎన్‌హెచ్‌పీసీ) అధికారుల బృందం సందర్శించనుంది. కేంద్ర జలవనరుల శాఖ అదేశాల మేరకు ఆరుగురు సభ్యులు రేపు ప్రాజెక్టును పరిశీలించనున్నారు. తాజాగా పోలవరానికి సంబంధించి కేంద్రం పంపిన లేఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేయడంతో రెండు రోజులుగా పోలవరం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం పోలవరాన్ని సందర్శించడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మంగళవారం పోలవరం అప్పర్ కాఫర్ డ్యాం సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఎన్‌హెచ్‌పీసీ బృందం కేంద్రానికి నివేదిక ఇవ్వనుంది.
 
Tags : polavaram, Central Govt
Link to comment
Share on other sites

కేంద్రాన్ని తాకిన పోలవరం సెగ
04-12-2017 18:06:16
 
636480075774720570.jpg
అమరావతి: పోలవరం సెగ కేంద్రానికి తాకింది. ఢిల్లీలో పోలవరం సెగ సాయంత్రం 6 గంటలకు కేంద్రమంత్రి గడ్కరీతో జలవనరులశాఖ మంత్రి, అధికారులు భేటీకానున్నారు. సీఎం చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడేందుకు గడ్కరీ ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఢిల్లీకి మంత్రి దేవినేని ఉమ, ఉన్నతాధికారులు బయల్దేరారు. ఈ భేటీలో వివాదంగా మారిన పోలవరం టెండర్లు.. అప్పర్ కాఫర్‌ డ్యాం నిర్మాణం, తదితర అంశాలపై చర్చించనున్నారు. పెండింగ్‌ బిల్లులపై యూసీలు ఇచ్చినా నిధులు మంజూరుకాని అంశాన్ని కేంద్ర దృష్టికి అధికారులు తీసుకెళ్లనున్నారు. రావాల్సిన నిధులపై ఏపీ ప్రభుత్వం పట్టుబట్టనుంది. పోలవరం వివాదం అంశం రేపు సాయంత్రం కొలిక్కిరానుంది
Link to comment
Share on other sites

దిల్లీలో మళ్లీ భేటీ!
పోలవరంపై గడ్కరీ నేతృత్వంలో నేడు ఉన్నతస్థాయి సమావేశం
జలవనరుల మంత్రి ఉమా, అధికారుల పయనం
పోలవరం అథారిటీ అధికారులకు, గుత్తేదారులకూ ఆహ్వానం
7,8 తేదీల్లో కాఫర్‌డ్యాంపై కమిటీ రాక
ఈనాడు, అమరావతి, దిల్లీ
4ap-main1a.jpg

పోలవరంపై వివాదాలు ముసురుకున్న నేపథ్యంలో కేంద్రం మంగళవారం సాయంత్రం 6 గంటలకు ఉన్నతస్థాయి భేటీకి ముహూర్తం నిర్ణయించింది. ప్రాజెక్టు నిర్మాణం, ఆర్థిక ప్రగతి, ఇతర అంశాల సమీక్షకు కేంద్ర మంత్రి గడ్కరీ నేతృత్వంలో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు జలవనరుల మంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి వర్తమానం పంపింది. ఈ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వం రూ.1483 కోట్ల విలువైన పనికి తాజాగా టెండర్లు పిలవడం, వాటిని నిలుపుదల చేయాలంటూ కేంద్ర జల వనరులశాఖ కార్యదర్శి లేఖ రాసిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావులు పాల్గొనేందుకు దిల్లీ వెళ్తున్నారు. కేంద్రం తరఫున కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి యు.పి.సింగ్‌, ప్రాజెక్టుల కార్యదర్శి ఓరాలతో పాటు పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్య కార్యనిర్వహణాధికారి హల్దార్‌, సభ్య కార్యదర్శి డాక్టర్‌ గుప్తాలు పాల్గొంటారు. ప్రధాన గుత్తేదారు ట్రాన్స్‌ట్రాయ్‌తో పాటు ఉపగుత్తేదారులను పిలిచారు. ప్రస్తుతం వివాదాస్పదంగా మారిన కాఫర్‌డ్యాం, స్పిల్‌వే పనుల్లో కొంతభాగాన్ని కొత్త గుత్తేదారుకు అప్పగింత, ఇప్పటివరకూ ఖర్చు చేసిన నిధుల తిరిగి చెల్లింపు, ఆర్‌ అండ్‌ ఆర్‌కు కేంద్ర సాయం వంటి అంశాలు ప్రధానంగా చర్చించనున్నారు. భవిష్యత్తులో పనుల వేగం మందగించకుండా ఒక స్పష్టమైన మార్గసూచి తయారు చేయడంతో పాటు, నిధుల చెల్లింపునకు ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కలిసినప్పుడు కొత్తగా టెండర్లు పిలిస్తే ఇబ్బందులు ఉంటాయని, ఆ భారాన్ని రాష్ట్రమే భరించాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి గడ్కరీ స్పష్టం చేయడం, అనంతరం రాష్ట్ర మంత్రిమండలిలో చర్చించి ప్రాజెక్టులో కొంత పనికి టెండర్లు పిలిచేందుకు నిర్ణయించడం విదితమే. మరో పక్క పోలవరం ప్రాజెక్టులో ఎగువ కాఫర్‌ డ్యాం నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని కేంద్ర జలవనరులశాఖ గతంలో లేఖ రాసింది. జాతీయ జలవిద్యుత్తు కార్పొరేషన్‌ బృందం వచ్చి పరిశీలించి తమ నిర్ణయం వెలువరించే వరకు ఈ నిర్మాణం చేపట్టవద్దని ఆదేశించింది. ఈ క్రమంలో ఈ బృందం ఈనెల 7, 8 తేదీల్లో వస్తోంది.

గడువు పెంపు 60సి నిబంధనకు విరుద్ధం
ట్రాన్స్‌ట్రాయ్‌ రాసిన లేఖలో ప్రస్తావన
తమ వద్ద నుంచి పని తొలగించి టెండర్లు పిలుస్తూ కొత్త గుత్తేదారుకు గడువు పెంచడం 60సి నిబంధనకు విరుద్ధమని  ప్రధాన గుత్తేదారు ట్రాన్స్‌ట్రాయ్‌ పేర్కొంది. తగిన వేదికపై తగిన సమయంలో దీన్ని తాము సవాల్‌ చేస్తామని వెల్లడించింది. కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి అమర్‌జిత్‌ సింగ్‌ పోలవరం టెండర్లు ఆపాలని కోరుతూ రాష్ట్రానికి రాసిన లేఖలో పోలవరం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌కు ప్రధాన గుత్తేదారు రాసిన ఈ లేఖ విషయాన్ని కూడా ప్రస్తావించడం గమనార్హం. ఆ లేఖలో కేంద్ర జలసంఘం ఆకృతుల ఆమోదాన్ని నిలుపుదల చేస్తే పనులు ఆలస్యానికి తమను నిందించడం ఎంత వరకు భావ్యమని ట్రాన్స్‌ట్రాయ్‌ పేర్కొంది. పూర్తి స్థలం తమకు అప్పగించిన సంవత్సర కాలానికే 90శాతం ప్రాజెక్టు పని పూర్తి చేసేలా లక్ష్యం విధించారని, 2016 జనవరిలో అంచనాలు సవరిస్తూ ఉత్తర్వులు ఇవ్వగా అనుబంధ ఒప్పందం అక్టోబరు వరకు కుదుర్చుకోలేదని వివరించింది. పైగా ఈ పరిస్థితుల్లో తాము 2020 వరకు గడువు కావాలని కోరినా పెంచలేదని పేర్కొంది.

Link to comment
Share on other sites

ర్చిద్దాం రండి!
05-12-2017 01:15:09
 
636480396361170921.jpg
  • పోలవరం టెండర్లపై కేంద్రం స్పందన
  • నేడు ఢిల్లీలో గడ్కరీతో దేవినేని ఉమా భేటీ
  • లండన్‌ నుంచి రాగానే కేంద్ర మంత్రి దృష్టి
  • సీఎం ఆక్రోశం, అసంతృప్తి ఫలితమేనా!?
అమరావతి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కొర్రీల పట్ల సీఎం చంద్రబాబు అసంతృప్తి, ఆక్రోశం నేపథ్యంలో కేంద్రం స్పందించింది. ‘ప్రాజెక్టు పూర్తి కావడమే మాకు ముఖ్యం. ప్రాజెక్టు పనులు కేంద్రమే చేపట్టవచ్చు’ అని ఆయన స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో... టెండర్ల వ్యవహారంపై చర్చిద్దాం రండి అంటూ రాష్ట్రాన్ని కేంద్రం ఆహ్వానించింది. ఢిల్లీలో మంగళవారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గడ్కరీ, కార్యదర్శి యూపీ సింగ్‌తో రాష్ట్ర జల వనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్‌స్ట్రాయ్‌ ప్రతినిధులు సమావేశం కానున్నారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌ వే, చానల్‌ పనులకు సంబంధించిన టెండర్లను నిలిపేయాలంటే కేంద్ర జల వనులు శాఖ ఆదేశించిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
 
 
టెండర్ల నిలిపివేయాలన్న ఆదేశాలు ఇవ్వడానికి కేంద్రం ప్రధానంగా మూడు కారణాలను చూపింది. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీతో.. సీఎం చంద్రబాబు ఒకసారి, రాష్ట్ర మంత్రి దేవినేని ఉమా మరోసారి నిర్వహించిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా టెండర్లను ఆహ్వానించారంటూ కేంద్రం ఒక అభ్యంతరం వెలిబుచ్చింది. ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్‌స్ట్రాయ్‌ నుంచి గత నెల 18న తమకు లేఖ అందిందని మరో అభ్యంతరం వ్యక్తం చేసింది. కనీసం మూడు వారాలైనా సమయం ఇవ్వకుండా టెండర్లు పిలవడం సరి కాదంటూ మరో అభ్యంతరం వ్యక్తం చేసింది.
 
ఈ అభ్యంతరాలతో కేంద్ర జల వనరుల శాఖ కార్యదర్శి అమర్జిత్‌ సింగ్‌ గత నెల 27న రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖను ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తెచ్చింది. ‘పోలవరానికి కేంద్రం గండి’ పేరుతో ప్రచురితమైన ఈ కథనం సంచలనం సృష్టించింది. ‘ఆంధ్రజ్యోతి’ కథనం.. అసెంబ్లీలోనూ చర్చనీయాంశమైంది. ప్రజల్లో నెలకొన్న సెంటిమెంటును.. ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న స్వల్ప వ్యవఽధిని దృష్టిలో ఉంచుకుని టెండర్ల విషయంలో ముందుకే సాగాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ అంశాన్ని అసెంబ్లీలోనే ప్రకటించారు.
 
 
ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తున్న కేంద్రం వీలైనంత త్వరగా ఈ అంశానికి ముగింపు పలకాలని నిర్ణయించింది. లండన్‌ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఢిల్లీకి చేరుకున్న వెంటనే.. పోలవరం టెండర్ల వ్యవహారంలో రాష్ట్రంలో తలెత్తిన అలజడిపై దృష్టి సారించారు. సోమవారం మధ్యాహ్నం.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేశ్‌కుమార్‌కు కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి యూపీ సింగ్‌ ఫోన్‌ చేశారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు కేంద్ర జల వనరులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వద్ద సమావేశం ఉందని వివరించారు. ఇదే సమాచారం రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి ఉమామహేశ్వరరావు, కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌కూ కేంద్రం నుంచి వచ్చింది.
 
 
దీంతో.. సోమవారం సాయంత్రమే మంత్రి ఉమా, కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. కాగా.. అక్టోబరులో గడ్కరీతో సీఎం చంద్రబాబు, మంత్రి ఉమా జరిపిన సమావేశాల్లో పోలవరం పనుల్లో జరుగుతున్న జాప్యం, ట్రాన్‌స్ట్రాయ్‌కు 60(సి) కింద జారీ చేసిన నోటీసు, కొత్త సంస్థకు బాధ్యతలు అప్పగించేలా టెండర్లను పిలిచేందుకు సిద్ధం కావడం వంటి అంశాలన్నీ చర్చకు వచ్చాయి. ఈ సమావేశాల్లో ట్రాన్‌స్ట్రాయ్‌ గతంలో కోట్‌ చేసిన -14% కే కేంద్రం పరిమితమవుతుందని, అంతకుమించి పెరిగే భారాన్ని రాష్ట్రమే భరించాలని గడ్కరీ స్పష్టం చేశారు. ఇందుకు రాష్ట్రమూ సమ్మతించింది. ఈమేరకే కాంక్రీట్‌ పనులకు టెండర్లను పిలిచింది. వీటిన్నింటినీ సమావేశంలో చర్చించేందుకు ఏపీ సిద్ధమవుతోంది. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుతో మంత్రి దేవినేని ఉమ ఈ విషయమై మాట్లాడి పలు సూచనలు తీసుకున్నారు.
Link to comment
Share on other sites

పోలవరం సైట్ లో నుంచుని, జగన్ బ్రతుకు అంతా బయట పెట్టిన దేవినేని ఉమా...

   
uma-05122017-1.jpg
share.png

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీరు అందించేందుకు ప్రజలకు ఇచ్చిన మాట తప్పం.. ఎవరో కారుకూతలు కూస్తున్నారని వెనకడుగు వేయం... నిర్మాణం పూర్తి చేసి చూపిస్తాం అంటూ జల వనరుల మంత్రి దేవినేని ఉమ అన్నారు. ఇప్పటిదాకా నిర్మాణ పురోగతి మీ కళ్ళకు కనపడలేదా, పట్టిసీమ ద్వారా నీళ్ళ మళ్ళించి పదివేల కోట్ల విలువైన పంట రైతులకు దక్కేలా చేయడం గమనించలేదా, నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జనం ఊరుకుంటారా, మీ సంగతి అంతా చూస్తున్నారు. అంటూ ఉమ విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టు పనుల పనితీరును సోమవారం ఆయన స్వయంగా పరిశీలించారు. పురోగతి ఏ దశలో ఉందో అడిగి తెలుసుకున్నారు. ప్రతిపక్షాలపై నిప్పలు చెరిగారు, ప్రాజెక్టు పూర్తి చేసి నీరు అందిస్తామంటూ సవాల్ విసిరారు. కేంద్రంతో చర్చించి పనులు పూర్తయ్యేలా చూస్తామంటూ భరోసా ఇచ్చారు.

 

uma 05122017 2

ఈ మధ్యనే పోలవరం ప్రాజెక్టు పనులను నిలిపివేయాల్సిందిగా కేంద్రం నుంచి వర్తమానం అందిన తరువాత తొలిసారిగా ఆయన సోమవారం ప్రాజెక్టు స్థలికి వచ్చారు. స్పిల్వే, ఎర్త్ కం రాక్పిల్ డ్యాం, కాపర్ డ్యాం పనులను పర్యవేక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వచ్చే నెల 21న టెండర్లు గడువు పూర్తవతుందని, 22వ తేదీన టెండర్లు తెరుస్తారని చెప్పారు. సిల్వే పనులు ఇప్పటికే వేగంగా కొనసాగాయి. మరే ప్రాజెక్ట్ లోనూ ఈ తరహా వేగం లేదు. ప్రతీ సోమవారం ముఖ్య మంత్రి వర్చువల్ ఇన్స్పెక్షన్, వీలైతే ప్రాజెక్టు సందర్శన చేయడంతోనే ఇది సాధ్యమైందని మంత్రి అన్నారు. కాని కొందరు బాజాభజంత్రీలు కావాలని అక్కస్సుతో టెండర్ల ప్రక్రియను అబాసుపాలు చేసే విధంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

uma 05122017 3

పనులు పూర్తి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు, ఇదేదీ వారికి పట్టదు. టివిల ముందు కూర్చుని లేని పోని మాటలు మాట్లాడుతున్నారు. అధికారంలో ఉండగా వీరంతా ఎక్కడికిపోయారని, వ్యాఖ్యలు చేశారు. పోలవరం పూర్తి కావడం వీరెవరికీ ఇష్టంలేదు. వైఎస్ ఆత్మగా పేరొందిన వ్యక్తులతో కేంద్రానికి ఫిర్యాదులు చేయిస్తారు. ఇంకొందరు పరిస్థితిని తప్పుదారి పట్టిస్తారు. ఇంకా తగదునమ్మా అంటూ వైసీపీకి చెందిన ఎమ్మెల్వేలు పోలవరంకు బస్సులేసుకుని వస్తారటా అంటూ దేవినేని ఉమ విరుచుకుపడ్డారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ పవర్ ప్రాజెక్టు టెండరు కొట్టి వేయడానికి ప్రయత్నించారని ఆరోపించారు. దీనిపై ఇప్పటికీ కోర్టులో కేసులు నడుస్తున్నాయన్నారు. విదేశాల నుంచి వారి కుటుంబాలను వదిలేసి, ఇక్కడకు వచ్చిన ఇంజినీర్లు ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో పనులు చేయిస్తుంటే, టీవీల ముందు కూర్చునే వైఎస్ ఆత్మలు, వైఎస్ భజనపరులు ఏమీ జరగడం లేదంటూ మాట్లాడటాన్ని ఎద్దేవా చేశారు. నీ బ్రతుక్కి ఒక్కసారి అయినా పోలవరం వచ్చావా అంటూ జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు... నువ్వు, నీ న్నాన్న ఇన్నేళ్ళు ఉన్నారు, పులివెందులకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారని ఉమా అన్నారు...

 

 
Link to comment
Share on other sites

పోలవరమే!
06-12-2017 02:14:14
 
636481232558661265.jpg
  • 2018 చివరికి పూర్తి చేయడమే లక్ష్యం
  • కేంద్రానిదీ, రాష్ట్రానిదీ ఒకటే ఉద్దేశం: గడ్కరీ
  • పని చేపడితే అయ్యేదాకా వదలను
  • పనుల్లో జాప్యం సహించేది లేదు
  • 15 రోజులకోసారి ప్రాజెక్టు వద్దకు
  • అప్పర్‌ కాఫర్‌పై వెంటనే నిర్ణయం
  • టెండర్లపై సీఎంతో చర్చించి చెబుతా
  • కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టీకరణ
  • టెండర్ల గురించి మాట్లాడొద్దని
  • ట్రాన్స్‌ట్రాయ్‌కి చురకలు
  • మీ బిల్లులకు నాదీ హామీ..సబ్‌కాంట్రాక్టర్లకు మంత్రి భరోసా
  • కొరియా నుంచి గడ్కరీకి బాబు ఫోన్‌
న్యూఢిల్లీ/అమరావతి, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ‘‘ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, నా లక్ష్యం ఒక్కటే! 2018 డిసెంబరు నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం. దీనిని సాధిస్తాం. దీనిపై ఎలాంటి అపోహలూ వద్దు’’ అని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. విడిగా పిలిచిన టెండర్లను నిలిపివేయాలంటూ కేంద్రం లేఖ రాయడం, దీనిపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో... ఢిల్లీలో మంగళవారం నితిన్‌ గడ్కరీ రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు, ఎస్‌ఈ రమేశ్‌బాబు, ప్రధాన కాంట్రాక్టు సంస్థ ఎండీ శ్రీధర్‌, కెల్లర్‌, బావర్‌, ఎల్‌ అండ్‌ టీ, త్రివేణీ తదితర సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు.
 
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ పనులకు టెండర్లను పిలవడంపై ముందుగా చర్చ జరిగింది. ప్రధాన కాంట్రాక్టు సంస్థకు మరో రెండు నెలలు సమయం ఇచ్చి, ఆ తర్వాత అవసరమైతే కొత్త సంస్థకు బాధ్యతలు అప్పగిద్దామని గడ్కరీ సూచించారు. దీనిపై జలవనరుల శాఖ అధికారులు స్పందిస్తూ... ‘‘ప్రస్తుతం సమయం చాలా విలువైనది. కాంక్రీట్‌ పనుల్లో జాప్యం జరిగితే ఒక సంవత్సరం వృథా అవుతుంది. అందువల్లే ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త సంస్థకు పనులు అప్పగించి స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌ పనులు పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఉన్నారు’’ అని తెలిపారు. అయితే... కాంట్రాక్టరును మార్చితే అంచనా వ్యయాలు పెద్ద ఎత్తున పెరుగుతాయని, ఈ దశలో మంచిదికాదని గడ్కరీ అభిప్రాయపడ్డట్లు తెలిసింది. టెండర్లపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడాక ఒక నిర్ణయం తీసుకుందామని గడ్కరీ అన్నారు. ఇదే సమయంలో అప్పర్‌ కాఫర్‌ డ్యామ్‌ పనులపై చర్చ జరిగింది.
 
దీనిపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యమెందుకు జరిగిందని కేంద్ర జల సంఘం ఉన్నతాధికారులను గడ్కరీ ప్రశ్నించారు. ప్రధాన డ్యామ్‌తో కలపి అప్పర్‌ కాఫర్‌ డ్యామ్‌ పనులు చేయాలన్న ఆలోచన కూడా ఉందని.. నేషనల్‌ హైడ్రో పవర్‌ కార్పొరేషన్‌ నిపుణులకు అధ్యయన బాధ్యతను అప్పగించినట్లు సీడబ్ల్యుసీ అధికారులు వివరించారు. దీనిపై గడ్కరీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంతో అనుభవం కలిగిన సీడబ్ల్యూసీని కాదని మరొకరికి ఆ బాధ్యత అప్పగించడమేమిటని ప్రశ్నించారు. త్వరలోనే కాఫర్‌ డ్యామ్‌పై నిర్ణయాన్ని ప్రకటించాలంటూ డెడ్‌లైన్‌ విధించారు.
 
ముగిసేదాకా వదలను...
ఇకపై తాను కూడా పోలవరంపై నిరంతరం సమీక్షిస్తానని గడ్కరీ వెల్లడించారు. ఏదైనా పని మొదలు పెడితే పూర్తి చేసేదాకా వదలనని స్పష్టం చేశారు. ఈనెల 22న పోలవరం పర్యటనకు వస్తానన్నారు. అవసరమైతే ప్రతీ 15 రోజులకు ఒకసారి స్వయంగా ప్రాజెక్టు వద్దకు వచ్చి పనులు పరిశీలిస్తానని తెలిపారు. ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌స్ట్రాయ్‌ లేవనెత్తిన సమస్యలపై కమిటీని వేసి రెండు నెలల్లో వాటిని పరిష్కరించాలన్నారు. ఉప కాంట్రాక్టు సంస్థలు కెల్లర్‌, బావర్‌, ఎల్‌ అండ్‌ టీ లేవనెత్తిన సమస్యలను సావధానంగా విన్నారు.
 
త్రివేణీ సంస్థ పనులు నిలిపివేయడం పట్ల గడ్కరీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఎవరు డబ్బులు ఇస్తారో అర్థంకావడంలేదని.. అందువల్లే పనులు నిలిపివేశామని త్రివేణీ సంస్థ పేర్కొంది. కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని ఇతర సబ్‌ కాంట్రాక్టర్లు గడ్కరీకి తెలిపారు. దీనిపై గడ్కరీ స్పందిస్తూ... ‘‘ఏడు లక్షల కోట్ల రూపాయలతో పనులు చేయించాను. ఇది నాకో లెక్క కాదు. మీకు డబ్బుల విషయంలో ఎటువంటి ఇబ్బంది రాదు. ఇది నా భరోసా!’’ అని స్పష్టం చేశారు. అలాగే... ‘‘ఆశించిన లక్ష్యంతో, వేగంతో పనులు చేయకపోతే ఊరుకోబోను. సబ్‌ కాంట్రాక్టర్లు కూడా వేగంగా పనులు చేయాలి. కాంట్రాక్టరు మీకు డబ్బులు ఇవ్వకపోతే నేనిస్తాను. పనుల్లో మాత్రం వేగం తగ్గొద్దు.
 
ఈ విషయంలో ఊరుకునేది లేదు’’ అని కాంట్రాక్టర్‌కు, ఉప కాంట్రాక్టర్లకు తేల్చి చెప్పారు. ‘మీ పని తీరు సరిగ్గా లేదని మాకు సమాచారం ఉంది. దీనిని మెరుగు పరుచుకోండి’ అని ట్రాన్స్‌ట్రాయ్‌కి సూచించారు. తాము చేస్తున్న పనులను వేరొకరికి అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, దాని కోసం టెండర్లు కూడా పిలిచిందని ట్రాన్స్‌ట్రాయ్‌ ప్రతినిధి పేర్కొనగా... గడ్కరీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘‘టెండర్ల వ్యవహారంతో మీకు సంబంధం లేదు. వాటి గురించి మీరు మాట్లాడవద్దు. మీరు చేయాల్సిన పని మీరు చేయండి’’ అని సూచించారు.
 
అధికారుల మధ్య నెలకొన్న సమన్వయ సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలని అధికారులకు కేంద్ర మంత్రి సీరియ్‌సగా చెప్పారు. అంచనా వ్యయాల పెంపుపై సీఎం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటి నివేదికను త్వరగా సమర్పించాలని ఆదేశించారు. మరోవైపు, పునరావాసం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు రూ. 3300 కోట్లు రావాల్సి ఉంది. అందులో రూ. 318 కోట్లు విడుదల చేస్తూ కేంద్రం మంగళవారం ఉత్తర్వులిచ్చింది. మిగితా రూ. 2900 కోట్లను విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటామని గడ్కరీ హామీ ఇచ్చారు. అలాగే... పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని రాజమండ్రిలో ఏర్పాటు చేయాలన్న అభ్యర్థనకు కూడా సరే అన్నారు.
 
గడ్కరీ మాట నమ్మలేం: కాంగ్రెస్‌
పోలవరం ప్రాజెక్టును వేగవంతంగా పూర్తి చేయాలని మంగళవారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీని ఏపీ కాంగ్రెస్‌ నేతలు కోరారు. పీసీసీ చీఫ్‌ రఘువీరా రెడ్డి నేతృత్వంలోని నేతల బృందం మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిసి వినతి పత్రం అందించింది. అనంతరం రఘువీరా విలేకరులతో మాట్లాడుతూ... కాంగ్రెస్‌ హయాంలో 34 శాతం పనులను పూర్తి చేశామని తెలిపారు. కేంద్ర మంత్రి తనకు బాధ్యత లేనట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామని గడ్కరీ ఇచ్చిన హామీ పట్ల విశ్వాసం లేదని స్పష్టం చేశారు. పునరావాసానికి కూడా కేంద్రమే నిధులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ బృందంలో సీనియర్‌ నేతలు కేవీపీ రామచంద్ర రావు, టీ. సుబ్బిరామి రెడ్డి, జేడీ శీలం, పల్లంరాజు, కొప్పుల రాజు, కనుమూరి బాపిరాజు, తదితరులు ఉన్నారు.
 
సానుకూలం: మంత్రి ఉమా
ఈ నెల 22వ తేదిన గడ్కరీ పోలవరంకు వస్తున్నారని, సీఎంతో కలిసి డ్యామ్‌ సైట్‌ను సందర్శిస్తారని మంత్రి దేవినేని ఉమా మీడియాకు తెలిపారు. అసమర్థులు, చేతకానివాళ్లు రాళ్లేస్తున్నారని, ఎన్ని అడ్డంకులు సృస్టించినా 2018 చివరి నాటికి పోలవరం నుంచి గ్రావిటీ ద్వారా నీళ్లందిస్తామని పునరుద్ఘాటించారు. వైఎస్‌ హయాంలో రూ. 128 కోట్లు, తర్వాత ఇద్దరు సీఎంల హయాంలో రూ. 70 కోట్ల పనులు జరిగాయని, కాలువల్లో మట్టిని తీసి నెత్తిన వేసుకొనిపోయారని విమర్శించారు.
Link to comment
Share on other sites

కేంద్రం భరోసా
15 రోజులకోసారి పోలవరానికి వస్తానన్న గడ్కరీ
పని ఆపొద్దని ప్రస్తుత గుత్తేదారులకు ఆదేశం
కొత్త టెండర్లపై సీఎంతో మాట్లాడి నిర్ణయం
గుత్తేదారుకు ఆర్థిక వెసులుబాటుపై త్రిసభ్య కమిటీ తక్షణ నివేదిక
22న కేంద్ర మంత్రి రాక
ఈనాడు - దిల్లీ, అమరావతి
5ap-main1a.jpg

పోలవరం ప్రాజెక్టు ద్వారా 2018 కల్లా నీళ్లు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్రం ఇక పూర్తి స్థాయిలో దృష్టి సారించనుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి తాను వచ్చి స్వయంగా పనుల ప్రగతిని పరిశీలిస్తానని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు.  దేశమంతటా 7.2 లక్షల కోట్ల పనులు చేయిస్తున్న తనకు దీనిని నిర్దేశించిన సమయంలోగా ఎలా పూర్తి చేయించాలో తెలుసునన్నారు.  పనుల వేగం ఎందుకు మందగించిందంటూ ప్రధాన గుత్తేదారును, ఉపగుత్తేదారును నిలదీశారు. వెంటనే పనుల వేగం పెంచాలని, డిసెంబర్‌ 22న తాను వస్తానని వెల్లడించారు. వేగం పెరగకపోతే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో కూడా తెలుసన్నారు. కొత్తగా టెండర్లు పిలిచినందున పనులు చేయాలో లేదో అర్థం కాక నిలిపివేసినట్లు ఉపగుత్తేదారు త్రివేణి సంస్థ పేర్కొనగా... ‘‘ వెళ్లి పనులు చేపట్టండి... బిల్లులు చెల్లించే బాధ్యత నాదని...’’ కేంద్ర మంత్రి భరోసా ఇచ్చారు. ‘రాష్ట్ర ప్రభుత్వం 60 సి కింద కొంత పని తొలగించి వేరే వారికి ఇస్తామంటోంది. ఈ విషయంలో నాకు వేరే అభిప్రాయం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే ఈ విషయం మాట్లాడతా...’ అని గడ్కరీ స్పష్టం చేశారు. గుత్తేదారు ఆర్థిక సమస్యలు, పోలవరంలో ఇతర సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ మూడు రోజుల్లో కూర్చుని నివేదిక పంపాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పిలిచిన టెండర్‌ ప్రక్రియపై ముందుకెళ్లవద్దంటూ కేంద్ర జలవనరుల శాఖ మాజీ కార్యదర్శి అమర్‌జిత్‌సింగ్‌ రాసిన లేఖ వివాదాస్పదమైన నేపథ్యంలో సమస్యల పరిష్కారానికి గడ్కరీ మంగళవారం ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. దిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో సుమారు మూడు గంటల పాటు జరిగిన సమావేశంలో రాష్ట్ర జలవనరుల మంత్రి దేవినేని ఉమ, కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌, ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు, కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి యూపీ సింగ్‌,   కమిషనర్‌ ఓరా, ఇతర ఉన్నతాధికారులు, గుత్తేదారులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి  ముందు దక్షిణకొరియా నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు  కేంద్ర మంత్రి గడ్కరీతో సుమారు 15 నిమిషాల పాటు ఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరు, సమస్యాత్మకంగా మారిన అంశాలు, వేగం మందగించిన పనులను కొత్త గుత్తేదారుడికి అప్పగించాలనుకోవడానికి దారి తీసిన కారణాలను వివరించారు. వాటన్నింటిపైనా కొరియా నుంచి తిరిగి వచ్చిన తర్వాత కూలంకషంగా మాట్లాడుకొని పరిష్కరించుకుందామని గడ్కరీ ఆయనకు చెప్పారు. రూ.318 కోట్ల బిల్లులకు నిధులు విడుదల చేయగా... ఏఐబీపీ కింద చేపట్టిన ఏడు ప్రాజెక్టులకు మరో రూ.300 కోట్లు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబుతో సంభాషణ ముగిసిన అనంతరం గడ్కరీ ఉన్నతస్థాయి భేటీకి హాజరయ్యారు. తొలుత ఏపీ జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌ ఈ పనులు జరుగుతున్న వివరాలను వెల్లడించారు. తర్వాత ట్రాన్స్‌టాయ్‌ గుత్తేదారు మాట్లాడారు. 60సీ కింద కొత్త టెండర్‌ పిలవడంతో తమకు బ్యాంకులు సహకరించడం లేదని, రుణం రాక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. దీనిపై గడ్కరీ స్పందిస్తూ... ‘‘దాంతో మీకేం సంబంధం, మీ పని మీరు చేసుకుంటూ వెళ్లండని..’’ ఆదేశించారు. 15 రోజుల్లో పనితీరులో వేగం చూపకపోతే అప్పుడు మీ సంగతి ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.  ప్రాజెక్టును ఆపమన్నామంటూ మీడియా అపోహలు సృష్టించిందని, ఆ నెపాన్ని తమపై నెట్టేయడానికి ఏపీ ప్రభుత్వం సమాయత్తమవుతోందని నవ్వుతూ అన్నారు.  ఇప్పటివరకూ జరిగిన వాటికి కొలతలు వేసి లెక్కలు తేలిస్తే తదుపరి పనులు ప్రారంభిస్తామని త్రివేణి ప్రతినిధులు చెప్పగా.. చీఫ్‌ ఇంజనీర్‌ స్పందిస్తూ ఒకరోజులోపు కొలతలు పూర్తి చేస్తామని చెప్పారు. గడ్కరీ మిగతా ఉపగుత్తేదారుల సమస్యలనూ ఒక్కొక్కటిగా అడిగి తెలుసుకున్నారు.

* ఆర్థిక సమస్యలపై త్రిసభ్య కమిటీ పరిశీలించి నిర్ణయాలు తీసుకోవాలని గడ్కరీ చెప్పగా... గుత్తేదారుతో కుదిరిన ఒప్పందం ప్రకారం అది సాధ్యం కాదని ఈఎన్‌సీ చెప్పారు. సమస్య పరిష్కారానికి మార్గాలు అన్వేషించాలే తప్ప కఠినంగా ఉండకూడదన్నారు. సలహాదారు భార్గవ అభిప్రాయాన్ని కూడా తీసుకున్నారు.
* కేంద్ర జలసంఘం, పోలవరం అథారిటీ వద్ద పెండింగులో ఉన్న ఆకృతుల ఆమోదాన్ని తక్షణమే వేగవంతం చేయాలి.
* పునరావాస పెండింగు నిధులు తక్షణమే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. పోలవరం అథారిటీ తనిఖీ తర్వాత తమకు పంపితే చెల్లిస్తామని కేంద్ర అధికారులు చెప్పారు. గతంలో పునరావాస నిధులపై తర్వాత చూద్దామన్న కేంద్ర మంత్రి గడ్కరీ ఇప్పుడు సానుకూలంగా స్పందించడం విశేషమని అధికారులు చెబుతున్నారు.
* 2018 కల్లా గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలి. ఆ లక్ష్యానికి అనుగుణంగా అందరూ పనిచేయాలి.
* ఎగువ కాఫర్‌ డ్యాం ఆలస్యం కావడానికి వీల్లేదు. ఈ అంశంలో ఎన్‌హెచ్‌పీసీ నెలరోజులు ఆలస్యం చేయడం సమంజసం కాదు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకూడదు. సమన్వయం చేసుకోవాలని కేంద్ర అధికారులను ఆదేశించారు.
* పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయాన్ని తక్షణం రాజమండ్రికి తరలించాలి. అవసరమైన వసతులు కల్పిస్తామని జలవనరుల మంత్రి దేవినేని ఉమా స్పష్టం చేశారు.
* టెండర్‌ కొనసాగించాలా వద్దా? అన్నది ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో నిర్ణయిస్తాం.

కేంద్రమూ కలిసి అడుగు...
తాజాగా కేంద్ర మంత్రి సమావేశం నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణ బాధ్యతను కొనసాగిస్తూనే కేంద్రమూ పూర్తి స్థాయి పర్యవేక్షణ, ప్రగతి పరిశీలనకు నిరంతరం దృష్టి సారించేలా వెళ్లబోతోందని అవగతమవుతోంది. 2018 జూన్‌లోపు గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వాలని కేంద్ర మంత్రి ఆదేశించడం, ఎగువ కాఫర్‌ డ్యాంపై కమిటీ రాక ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేయడం...15 రోజులకోసారి స్వయంగా వస్తానని ప్రకటించడం ద్వారా దీనిని సంయుక్తంగా నిర్మిస్తున్నారనే భావన రాష్ట్ర ప్రజల్లో కలిగించడంతో పాటు కేంద్ర రాష్ట్రాలు ఆ ఫలాలు పొందేలా వ్యూహరచన జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గుత్తేదారుల సమస్యలు ఎలా పరిష్కరించాలో, ప్రాజెక్టు ఎలా నిర్మించాలో తనకు తెలుసునని గడ్కరీ వ్యాఖ్యానించడం ద్వారా కేంద్రం దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించినట్లుగా భావిస్తున్నారు.

కాంగ్రెస్‌ నాయకులకు మాట్లాడే అర్హత లేదు: దేవినేని ఉమ
పదేళ్లు అధికారంలో ఉండి పోలవరం ప్రాజెక్టు పరిధిలో కనీసం ఏడు ముంపు గ్రామాలను కూడా ఖాళీ చేయించలేని కాంగ్రెస్‌ నాయకులకు ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత లేదని జలవనరుల మంత్రి దేవినేని ఉమ పేర్కొన్నారు.  వైఎస్‌ అధికారంలో ఉన్న అయిదున్నరేళ్లకాలంలో  రూ.128 కోట్ల పనులు... రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి అధికారంలో ఉన్న కాలంలో రూ.70 కోట్ల పనులు మాత్రమే చేశారన్నారు. కాలువల్లో మట్టి తీసి డబ్బులు దండుకున్న వారికి ఏం అర్హత ఉందని గడ్కరీని కలుస్తారని ధ్వజమెత్తారు. వీళ్లు ఎన్ని రాళ్లు వేసినా 2018కల్లా గ్రావిటీతో నీరిస్తాం అని స్పష్టం చేశారు. ఇందుకోసం చంద్రబాబు, మోదీ ప్రభుత్వాలు కృతనిశ్చయంతో పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

హోదాకు తగ్గ ప్రాజెక్టు
జాతీయహోదాకు అవసరమైన అన్ని అర్హతలు పోలవరానికి ఉన్నాయి
అందుకే కల్పించాం
విభజన చట్టంలోని సెక్షన్‌  90 రాజ్యాంగ విరుద్ధంకాదు
ఒడిశా లేవనెత్తిన  ఏ అభ్యంతరంలోనూ పసలేదు
తెలంగాణను కక్షిదారుగా    చేర్చాల్సిన అవసరంలేదు
కేంద్రం పర్యవేక్షణలోనే పనులు
సుప్రీంకోర్టులో కేంద్రం    ప్రమాణపత్రం దాఖలు
ఈనాడు - దిల్లీ
8ap-main1a.jpg

రాజ్యాంగబద్ధంగానే పోలవరం ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు వీలుకల్పించిన ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని సెక్షన్‌ 90ని సవాల్‌చేస్తూ ఒడిశా ప్రభుత్వం దాఖలుచేసిన కేసుకు విచారణార్హతలేదని కేంద్ర జలవనరులశాఖ స్పష్టం చేసింది. ఈమేరకు సుప్రీంకోర్టులో ప్రమాణపత్రం దాఖలుచేసింది. 131 అధికరణం ప్రకారం కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టాలను సవాల్‌చేసే అధికారం రాష్ట్రాలకు లేదని స్పష్టంచేసింది. ఒడిశా ప్రభుత్వం లేవనెత్తిన ఏ విషయంలోనూ వాస్తవంలేదని, అందువల్ల జరిమానా విధిస్తూ ఆకేసును కొట్టేయాలని కోర్టును కోరింది. జాతీయహోదాకు తగ్గ అన్ని అర్హతలూ పోలవరానికి ఉన్నాయని స్పష్టం చేసింది. ‘‘ఏపీ విభజన చట్టంలోని నిబంధనలన్నీ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 3కి లోబడే ఉన్నాయి. అందులోని సెక్షన్‌ 90 ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులు వచ్చినట్లే. దీనికి సంబంధించి హోంశాఖ 2017 నవంబర్‌ 17న స్పష్టమైన లేఖ కూడా ఇచ్చింది. ఈ ప్రాజెక్టును పూర్తిగా గోదావరి జల వివాద ట్రైబ్యునల్‌ తీర్పునకు లోబడే నిర్మిస్తున్నాం. గోదావరి ట్రైబ్యునల్‌ తీర్పు దగ్గరి నుంచి ప్రతి దశలోనూ ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ అభిప్రాయాలు తీసుకున్నాం. సీడబ్ల్యూసీ నిర్వహించిన అంతర్రాష్ట్ర సమావేశాలన్నింటిలోనూ ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఆ రెండు రాష్ట్రాలు పాల్గొని       అభిప్రాయాలు వ్యక్తంచేశాయి. వాటన్నింటినీ సీడబ్ల్యూసీ మినిట్స్‌లో నమోదుచేయడంతోపాటు ఆ రాష్ట్రాలకు సమాచారం అందించారు. విభజన చట్టంలోని సెక్షన్‌ 90(3)ప్రకారం ఈ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినట్లే. అందువల్ల ఈ వ్యాజ్యంలో వారిని కక్షిదారుగా చేర్చాల్సిన అవసరంలేదు’’ అని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు విన్నవించింది. ఒడిశా ప్రభుత్వం దాఖలుచేసిన ఈ కేసులో సుప్రీంకోర్టు కేంద్ర అభిప్రాయం కోరిన నేపథ్యంలో కేంద్ర జలవనరులశాఖ నిర్దేశకుడు (ఆర్థిక వ్యవహారాలు) ఆర్‌.పి.ఎస్‌.వర్మ 25 పేజీల ప్రమాణపత్రం దాఖలు చేశారు. ఒడిశా లేవనెత్తిన అనుమానాలను అంశాలవారీగా నివృత్తి చేశారు.

వాటిలో ముఖ్యమైనవి...
* గోదావరి ట్రైబ్యునల్‌ తీర్పు ప్రకారం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాల మధ్య పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ఒప్పందం కుదిరింది. కొత్తగా ఆ రాష్ట్రం ఉపశమనాలు కోరడానికి వీల్లేదు. నిబంధనలను అనుసరించే కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అనుమతులు జారీచేసింది. గిరిజన వ్యవహారాల శాఖకూడా ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్రణాళికకుచట్టబద్ధంగానే ఆమోదముద్ర వేసింది. ఒడిశా ప్రభుత్వం పూర్తిగా గోదావరి ట్రైబ్యునల్‌ తీర్పునకు కట్టుబడి ఉండాలి. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా శాశ్వత ఇంజెంక్షన్‌ ఇవ్వాలని కోరే హక్కు వారికి లేదు.

* ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని సమస్యలకూ గోదావరి ట్రైబ్యునల్‌ తీర్పులోనే పరిష్కారాలు చూపారు. దీనికి ముందే ఇచ్చంపల్లి, లేదా శబరి, బలిమెలపై ప్రాజెక్టుల నిర్మాణం పూర్తికావాలన్న ముందస్తు షరతులేమీ లేవు. దీని నిర్మాణంలో 1980 నాటి గోదావరి ట్రైబ్యునల్‌ తీర్పే అంతిమం.

* విభజన చట్టంలోని సెక్షన్‌ 90(2) ప్రకారం ఈ ప్రాజెక్టు (సాగునీటి విభాగం) అమలు నియంత్రణ, పర్యవేక్షణ, అభివృద్ధి అంతా కేంద్రం ఆధ్వర్యంలోనే జరుగుతుంది. నిర్మాణం పూర్తిచేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. విభజన చట్టాన్ని అనుసరించి పీపీఏ ఏర్పాటు, నిధుల విడుదల విధానం ఖరారు చేశాం. నిర్మాణం పూర్తిచేయడానికి ఎన్నో కమిటీలు ఏర్పాటుచేశాం. ఇందులో కేంద్రం పాత్ర లేదనడానికి లేదు. 2016 సెప్టెంబర్‌ 30 నాటి ఆర్థికశాఖ ఆఫీస్‌ మెమోరాండం ప్రకారం 1-4-2014 నుంచి ఈ ప్రాజెక్టు సాగునీటి విభాగానికయ్యే మిగిలిన మొత్తాన్నంతా 100శాతం కేంద్రమే అందిస్తుంది. నిర్మాణ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్‌కు అప్పగిస్తే సమంజసంగా ఉంటుందని నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు సిఫార్సు చేశారు. అందువల్ల కేంద్రం తరఫున తామే నిర్మాణబాధ్యతలు చేపడతామని ఆంధ్రప్రదేశ్‌ చేసిన విజ్ఞప్తిని కేంద్రం అంగీకరించింది. నిర్మాణాన్ని రాష్ట్రప్రభుత్వం ద్వారా పోలవరం ప్రాజెక్టు అథారిటీ చేపడుతుంది.

* పోలవరానికి జాతీయహోదా కల్పిస్తూ ఏపీ విభజన చట్టంలో పొందుపరిచిన 90వ సెక్షన్‌ రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 262కి విరుద్ధంకాదు.

పోలవరం పనుల పరిశీలనకు నిపుణుల బృందం
ఈనాడు, రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టులో కాఫర్‌డాం నిర్మాణానికి సంబంధించి పరిశీలనకు దిల్లీ నుంచి నిపుణుల బృందం గురువారం రాజమహేంద్రవరానికి చేరుకుంది. ఈ పనుల వివరాలను ఎస్‌ఈ పోలేశ్వరరావు నుంచి ఈ బృందం ప్రతినిధులు సేకరించారు. బృందంలో జనరల్‌ మేనేజర్‌ వైకే చౌబే, జియాలజీ చీఫ్‌ ఆర్‌సీ శర్మ, సీనియర్‌ మేనేజర్‌ సంకదీప్‌ చౌదరి ఉన్నారు. వీరు శుక్రవారం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...