Jump to content

polavaram

Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply

పోలవరం నిధుల బాధ్యత నాది

కృష్ణా నీళ్ల కోసం పోరాడదాం

సమీక్షలో సీఎంచంద్రబాబు

ఈనాడు, అమరావతి: ‘‘ పోలవరం ప్రాజెక్టుకు నిధులు సమకూర్చే బాధ్యత నాది. నిధులపరంగా ఏ ఇబ్బంది ఉన్నా తక్షణమే నాకు తెలియజేయాలి. పనుల బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లించాల్సిందే...’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ‘‘కాంక్రీటు పనులు మరింత వేగం పుంజుకోవాలి. 2018 జూన్‌కు కాపర్‌ డ్యాం పూర్తి చేసి నీళ్లిచ్చేందుకు అనువుగా ఈ పనులు ఎలా పూర్తి చేస్తారో పక్కా ప్రణాళికతో రావాలి. రోజుకు 4000 నుంచి 5000 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని జరిగితేనే ఇది సాధ్యమవుతుంది. ఈ లక్ష్యం నెరవేర్చేందుకు ఎదురయ్యే ఇబ్బందులన్నింటినీ పరిగణనలోకి తీసుకుని కార్యాచరణ సిద్ధం చేయాలి...’’ అని ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పనుల తీరుపై సీఎం సోమవారం సచివాలయంలో అధికారులతో సమీక్షించారు. వర్చువల్‌ పద్ధతిలోను పనులను పరిశీలించారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. పోలవరం నుంచి పర్యవేక్షక అధికారి వేమన రమేష్‌బాబు మాట్లాడుతూ ఈ వారంలో రికార్డు స్థాయిలో 21,226 క్యూబిక్‌ మీటర్ల మేర పని జరిగిందన్నారు. సరాసరిన రోజుకు 3050 క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని సరిపోదన్నారు.

కర్ణాటక సీఎం, ప్రధానికి లేఖ రాద్దాం: ఈ సీజన్‌లో ఆలమట్టిలో 60 టీఎంసీల వరకు మాత్రమే నీరు వచ్చే అవకాశం ఉందని కర్ణాటక రోజుకు 1.5 టీఎంసీల నుంచి 2 టీఎంసీల నీరు వినియోగించుకుంటున్నందున దిగువకు చుక్క నీరు వచ్చే ఆస్కారం కనిపించడం లేదని జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. దిగువకు నీరు విడుదల చేసే విషయంలో కర్ణాటక సీఎంకు, ప్రధానికి లేఖలు రాద్దామని, వెంటనే అవసరమైన ఏర్పాట్లు చేయాలని చంద్రబాబు చెప్పారు. న్యాయస్థానంలోను తక్షణమే పిటిషన్‌ దాఖలు చేసి హక్కుల కోసం పోరాడదామన్నారు. ఇక గోదావరి నీటిని సద్వినియోగం చేసుకోవడమే మార్గమని, తక్షణమే గోదావరి నీరు సోమశిలకు తీసుకువచ్చేందుకు ప్రాజెక్టు నివేదిక సిద్దం చేయాలని చెప్పారు. అన్ని చోట్ల కాలువ కాకుండా టన్నెల్‌ నిర్మాణం కష్టమయ్యే చోట పైపులైను ఏర్పాటుకు ఉన్న అవకాశంపై దృష్టి పెట్టాలని సూచించారు.

వచ్చే నెల జలహారతి: సెప్టెంబర్‌ 6,7,8 తేదీల్లో జలహారతి కార్యక్రమం చేపడదామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఆ మూడు రోజులు రాష్ట్రంలోని అన్ని జలవనరులను పూజించుకునేలా... ప్రజలు ఇందులో భాగస్వాములయ్యేలా కార్యక్రమం చేపట్టాలన్నారు. 28 ప్రాజెక్టుల పనులు ఎలా సాగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పనులు అనుకున్నంతగా జరగకపోవడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో భూగర్భజలాలు ఎగువకు ఉన్నందున ఎన్టీఆర్‌ జలసిరి కింద అక్కడ మరిన్ని బోర్ల తవ్వకానికి అనుమతులు ఇవ్వాలన్నారు. ఆప్‌శాక్‌ అధికారుల పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. భూగర్భజలాల రీఛార్జిపై దృష్టి సారించాలని చెప్పారు. ఈఎన్‌సీలు వెంకటేశ్వరారవు, గిరిధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

పీవీ సింధుకు సీఎం అభినందనలు: ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో రజత పతకం గెలిచిన క్రీడాకారిణి పీవీ సింధుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అభినందనలు తెలిపారు. ఈ విజయంతో సింధు భారతదేశ కీర్తిపతాకను మరోమారు రెపరెపలాడించిందని పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

2019 నాటికి రూ.24వేల కోట్లు

30ap-main7a.jpg

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తంలో రూ.979.36 కోట్లు మంజూరు చేస్తూ కేంద్ర జలవనరులశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం 2019 నాటికి సుమారు రూ.24 వేల కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. ఈ ఏడాది రూ.3,500 కోట్లు, వచ్చే రెండేళ్లలో ఏటా రూ.9వేల కోట్ల చొప్పున కేటాయించాలని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొంది. ఈ సందర్భంగా కొన్ని మార్గదర్శకాలను సూచించింది.

* నిధుల విడుదలకు సంబంధించి కుదిరిన ఒప్పందంలో భాగంగా ప్రాజెక్టు పనుల్లో లక్ష్యానికి అనుగుణంగా పురోగతి ఉండాలి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం లేదా పోలవరం ప్రాజెక్టు అథారిటీ హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక వేళ పనుల పురోగతి ఆశించినట్లు లేకపోతే అందుకు తగిన కారణాలు పేర్కొనాలి.

* పోలవరం ప్రాజెక్టులో నాణ్యత నియంత్రణకు సంబంధించి మూడోపక్షంగా ఒక స్వతంత్ర ఏజన్సీని ఏర్పాటు చేయాలి. ప్రతి ఆర్థిక సంవత్సరం చివర్లో కేంద్రానికి ఈ పనులపై ఒక నివేదిక సమర్పించాలి.

* పనులు తగిన సమయంలో పూర్తి చేసేందుకు వీలుగా ప్రాజెక్టు పర్యవేక్షక విభాగం (పీఎంయూ) ఏర్పాటు చేయాలి.

30ap-main7b.jpg

కేటాయింపులు పెరగవచ్చు

పోలవరానికి మరిన్ని కేటాయింపులు పెరగవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశంలోని నీటి పారుదల ప్రాజెక్టుల పూర్తికి కేంద్రం దీర్ఘకాలిక నిధిని ఏర్పాటు చేసిన విషయం విదితమే. దీనికి అందనంగా నాబార్డు నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగానే ఒక ప్రణాళికను రూపొందించింది. తొలుత ఈ నిధికి బడ్జెట్‌లో రూ.20వేల కోట్లు కేటాయించగా...నాబార్డు రుణ సహకారంతో అది రూ.లక్ష కోట్లకు చేరుకుంది. ఆ మేరకు అన్ని ప్రాజెక్టులకు నిధులు విడుదల చేస్తూ వస్తోంది. ఆ క్రమంలో 2019 నాటికి పోలవరానికి రూ.24 వేల కోట్లు ఇవ్వాలని అప్పట్లోనే నిర్ణయించింది. ఈ విషయమై ఉన్నతాధికారి ఒకరు బుధవారం రాత్రి ‘ఈనాడు’తో మాట్లాడుతూ కేంద్ర అంచనాల్లో ఇది ప్రాథమిక కేటాయింపు మాత్రమేని చెప్పారు. ఏటా బడ్జెట్‌లో ప్రాజెక్టుల కోసం ఏర్పాటు చేసిన ‘నిధి’కి కేటాయింపులు ఎక్కువవుతున్నాయని, ఆ మేరకు పోలవరానికి కూడా వచ్చే నిధులు పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు.

Link to comment
Share on other sites

పోలవరానికి 23,814 కోట్లు!
01-09-2017 02:58:12
 
636398315011858033.jpg
  • కేంద్ర కేబినెట్‌ ఆమోద ముద్ర
అమరావతి, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): పోలవరం సాగునీటి ప్రాజెక్టుకు 2019-20నాటికి కేంద్రం నుంచి దాదాపు రూ.47,628 కోట్ల దాకా మంజూరవుతాయా? కచ్చితంగా వస్తాయని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. 2019-20కల్లా ఈ ప్రాజెక్టుకు రూ.23,814 కోట్లు కేటాయించేందుకు కేంద్ర కేబినెట్‌ బుధవారం ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి కిసాన్‌ సంచాయి యోజన (పీఎంకేఎ్‌సవై) కింద.. దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఇచ్చిన నిధులు ఒక ఎత్తయితే.. జాతీయ హోదా కలిగిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికే రూ.23,814 కోట్లు కేటాయించడం విశేషం. ఇవిగాక మరో రూ.23,814 కోట్ల కేటాయించే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని.. మొత్తంగా పోలవరానికి.. రూ.47,628 కోట్ల దాకా మంజూరవుతాయని రాష్ట్ర జల వనరుల శాఖ ఉన్నతాధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి.
 
గతంలో సత్వర సాగు నీటి లబ్ధి పథకం (ఏఐబీపీ), కమాండ్‌ ఏరియా డెవల్‌పమెంట్‌ (కాడ్‌) కింద జాతీయ స్థాయిలో పలు పథకాలు చేపట్టారు. ఇప్పుడు.. వాటిన్నింటినీ పీఎంకేఎ్‌సవై కింద చేపడుతున్నారు. పోలవరం ప్రాజెక్టుకు అయ్యే వ్యయమంతా కేంద్రం భరించనున్న సంగతి తెలిసిందే. నాబార్డు ద్వారా రాష్ట్రప్రభుత్వానికి రుణం ఇప్పించి.. దానిని తానే చెల్లించనుంది. కేంద్ర బడ్జెట్‌లో పీఎంకేఎ్‌సవై కింద చేపట్టే పథకాలకు, పోలవరం ప్రాజెక్టు కోసం దీర్థకాలిక నీటిపారుదల నిధి కింద నాబార్డుకు కేంద్రం నిధులు కేటాయిస్తుంది. నాబార్డుకు నిరుడు (2016-17) రూ.20 వేల కోట్లు కేటాయించారు. ఈ నిధులకు మరో నాలుగు రెట్లను.. అంటే రూ.88,903 కోట్లను నాబార్డు మార్కెట్‌లో సమీకరించాల్సి ఉంటుంది.
 
అలా సమీకరించే రుణాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. సమీకరించిన నిధులను రాష్ట్రాలవారీగా ఆయా ప్రాజెక్టులకు కేంద్రం పంపిణీ చేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలోను నాబార్డుకు రూ.20 వేల కోట్లు కేటాయించారు. 2019-20 దాకా రాష్ట్రాల వారీగా ఏఐబీపీ, కాడ్‌, పోలవరం ప్రాజెక్టులకు కేంద్ర జల వనరుల శాఖ కేటాయింపులు చేసింది. అందులో పోలవరం ప్రాజెక్టుకు 2016-17లో రూ.2414 కోట్లు, 2017-18లో రూ.3400 కోట్లు, 2018-19లో రూ.9000 కోట్లు, 2019-20లో రూ.9000 కోట్లు.. మొత్తం రూ.23814 కోట్లను కేటాయించాలన్న ప్రతిపాదనలకు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. కాగా.. 2017-18లోను నాబార్డుకు రూ.20 వేల కోట్లు కేటాయించింది. ఇలా 2019-20 దాకా చేసిన కేటాయింపులకు అనుగుణంగా రూ.23,814 కోట్లు వస్తాయని, మార్కెట్‌ నుంచి సమీకరించే నిధుల కింద అదనంగా అప్పటికి మరో 23,814 కోట్లు అందుతాయని అంచనా వేస్తోంది. మొత్తం రూ.47,628 కోట్లు అవుతాయని ఉన్నతాధికార వర్గాలు అంటున్నాయి.

If it is true we must start works at war footing

Machinery motham ready cheyali double or triple the machinery ready chesthe better

cooling concrete plants kuda ready cheyali

Link to comment
Share on other sites

3.8 years lo 4000Cr. ichhina vaallu okka 2 years 24000Cr ela isthaaru ani nammuthunnaru. They want to slow down Polavaram works & show Center dependency to TDP. Baffas don't care about AP people. 

Vizag Railway Zone kooda Orissa kosam aaparu.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...