Jump to content

polavaram


Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply
పోలవరం పనులకు త్వరలో టెండర్లు
 
 
  •  ట్రాన్‌స్ట్రాయ్‌ నుంచి కొత్త సంస్థలకు నిర్మాణ బాధ్యత
అమరావతి, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టును నిర్దేశిత లక్ష్యాల మేరకు 2018-19లో పూర్తి చేసేందుకు వీలుగా ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్‌స్ట్రాయ్‌ నుంచి కొన్ని పనులను తప్పించి... కొత్తగా ఈ-టెండర్లను పిలిచేందుకు జల వనరులశాఖ సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్‌రెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో పోలవరం ప్రాజెక్టు పనుల బాధ్యతలను ట్రాన్‌స్ట్రాయ్‌ దక్కించుకుంది. అప్పట్లో పోలవరం అంచనాలు రూ.16,010.46 కోట్లు కాగా... 14 శాతం తక్కువకు ట్రాన్‌స్ట్రాయ్‌ కోట్‌ చేసింది.
 
ఈ స్థాయిలో తక్కువ ధరకు ట్రాన్‌స్ర్టాయ్‌ కోట్‌ చేయడం అప్పట్లో సంచలనం అయింది. కానీ, ట్రాన్‌స్ట్రాయ్‌ ఆర్థికంగా బలంగా లేనందున కీలకమైన మట్టిపనుల నుంచి కాంక్రీట్‌ పనుల దాకా... త్రివేణీ, ఎల్‌అండ్‌టీ-బావర్‌, కెల్లర్‌ వంటి సంస్థలకు ప్రాజెక్టులోని కొన్ని పనులు ప్రత్యేకంగా అప్పగించామని జల వనరుల శాఖ చెబుతోంది. అయినా... లక్ష్యం సమీపిస్తుంటే కాంక్రీట్‌ పనులు ముందుకు సాగడం లేదని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సోమవారం జరిగిన రివ్యూలోనూ కాంక్రీట్‌ పనులపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. స్పిల్‌ చానల్‌, స్పిల్‌ వే(పాక్షికంగా), ఎర్త్‌కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ పనులను బావర్‌-ఎల్‌అండ్‌టీ చేపడుతున్నందున... ఇతర పాక్షిక పనుల నుంచి, పూర్తిగా కాఫర్‌ డ్యామ్‌ పనుల నుంచి ట్రాన్‌స్ట్రాయ్‌ను తప్పించే యోచనకు జలవనరుల శాఖ వచ్చింది. ఈ పనులకు త్వరలోనే ఈ-టెండర్‌ను పిలవాలని భావిస్తోంది.
Link to comment
Share on other sites

Ippudu kothhaga tenders pilisthe Nov-2018 ki 60TMC water store cheyyochha?

 

2 years back ee Transtroy capable kaadu anukunte appude cancel chesi tenders call cheyyalsindi.

Transtroy ki one sided contract icchaadu big jaffa.. teeseyyatam antha easy kaadhu...

Link to comment
Share on other sites

Ippudu kothhaga tenders pilisthe Nov-2018 ki 60TMC water store cheyyochha?

 

2 years back ee Transtroy capable kaadu anukunte appude cancel chesi tenders call cheyyalsindi.

 

edocontract vundi . end of 2017 or 2018 loga panulu cheyyakapothe teeseyyotchu ni. so waiting for that.

 

but looks like govt. negotiated to involve more companies (L&T, Bauer, triveni) - with direct payments

Link to comment
Share on other sites

Guest Urban Legend

NTV vaadu maree over chesthunnadu, following Jaffa's order. 2014 nunchi 2017-August varaku emi panulu jaragaledu except some sand work antunnadu. Munde cheppina State govt. pattinchukoledu antunnadu.

2014 vadi channel lo vesina video

Monna review meet video rendu vaadey chusukuntey telusudhi

Link to comment
Share on other sites

10వేల కోట్లు కావాలి
పోలవరం నుంచి 2018లో నీళ్లు ఇవ్వాలంటే ఈ నిధులు అవసరం
రెండు కాఫర్‌ డ్యాంలతో.. 60 టీఎంసీలు నిల్వ
103 ఆవాస ప్రాంతాల తరలింపు అనివార్యం

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టును 2018 జూన్‌ లోపు కాఫర్‌ డ్యాం నిర్మించి గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వాలంటే ఈ ఏడాదిలోనే రూ.10 వేల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా. ఎర్త్‌ కం రాక్‌ ఫిల్‌ డ్యాం (ప్రధాన డ్యాం) పూర్తి కాకముందే రెండు కాఫర్‌ డ్యాంలు నిర్మించి వాటి ఎత్తును 41.15 మీటర్లకు పెంచి జలాశయంలో నీరు నిలబెట్టి కాలువల ద్వారా ఇవ్వాలనేది ప్రభుత్వ యోచన. ఇందుకోసం పోలవరం ప్రధాన డ్యాంలో స్పిల్‌ వే నిర్మాణం పూర్తి చేయాలి, గేట్లు ఏర్పాటు చేయాలి. స్పిల్‌ ఛానల్‌, అప్రోచ్‌ ఛానల్‌ నిర్మాణాలు పూర్తి కావాలి. ప్రధాన డ్యాం నుంచి కాలువలకు అనుసంధాన పనులు చేయాలి. దీనికి తోడు పోలవరం ఎడమ కాలువ నిర్మాణమూ పూర్తి చేయాల్సి ఉంటుంది. మరోవైపు పోలవరంలో ఈ స్థాయి వరకు నీరు నిల్వ చేస్తే 60 టీఎంసీలు నిల్వ ఉంటుంది. ఇందుకోసం ఉభయగోదావరి జిల్లాల్లో భూసేకరణ, పునరావాసాలను పూర్తిచేసి 103 ఆవాస ప్రాంతాలను తరలించాల్సి ఉంటుంది. దీని ప్రభావం 83 గ్రామాలపై ఉంటుందని తేల్చారు. పునరావాసం కల్పించాలంటే ఇంకా రూ.3665 కోట్లు ఖర్చు చేస్తే సరిపోతుందనేది పునరావాస కమిషనర్‌ కార్యాలయం అంచనాలు రూపొందించింది. అంచనాలు సవరిస్తే ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. పోలవరం డ్యాం నిర్మాణం జరిగితే +35 మీటర్ల ఎత్తుకు నిర్మిస్తే 30 టీఎంసీలు.. +41.15 మీటర్ల వద్ద 60 టీఎంసీలు, పూర్తి స్థాయి ఎత్తు +45.72 మీటర్ల వద్ద 194 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు.
ఇంకా ఇంత పని చేయాలి..!
* 2018 జూన్‌ నాటికి నీళ్లు ఇచ్చేందుకు స్పిల్‌ వే నిర్మాణం పూర్తి చేయాలి. ఇందుకోసం రమారమి 14.50 లక్షల క్యూబిక్‌ మీటర్లకు పైగా కాంక్రీటు నిర్మాణం పూర్తి చేయాలి. దీంతో పాటు 48 రేడియల్‌ గేట్లను బిగించాల్సి ఉంటుంది. 2017 నవంబరు నాటికి స్పిల్‌వేలో 19 బ్లాకుల నిర్మాణం, 16 గేట్లను ఏర్పాటు చేయాలి. ఇందుకోసం వారానికి 21వేల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని చేయాల్సి ఉంటుంది. అలాగే 2018 జనవరికి 16 బ్లాకుల నిర్మాణమూ, 16 గేట్ల ఏర్పాటు..2018 మార్చికి మరో 14 బ్లాకుల నిర్మాణం స్పిల్‌ వే పూర్తి చేయాలి. 16 గేట్ల ఏర్పాటు పూర్తి కావాలి.
* స్పిల్‌ ఛానల్‌ తవ్వాలి. కాంక్రీటు వేయాలి. దాదాపు 3 కోట్ల క్యూబిక్‌ మీటర్ల మట్టి తవ్వకం పనులు పూర్తి చేసి 15.30 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు వేయాలి. పక్కన కట్టల కోసం 8 లక్షల క్యూబిక్‌ మీటర్ల పని చేయాలి. ఆకృతులు సిద్ధం కావాల్సి ఉంది. కాంక్రీటు మెథడాలజీ ఇంకా తేలాల్సి ఉంది. 2018 ఏప్రిల్‌ నాటికి ఈ పనంతా పూర్తి కావాల్సి ఉంటుంది.
* 48 గేట్ల నిర్మాణంలో ప్లేట్లు సిద్ధమయ్యాయి. వాటికి సంబంధించి ఇతరత్రా పనులు చేస్తున్నారు. గేట్ల నిర్మాణం తగు సమయంలో పూర్తి అవుతుంది. స్పిల్‌ వే బ్లాకులు పూర్తయ్యాక ఈ గేట్ల అమరిక ప్రారంభమవుతుంది.
* ఎగువ, దిగువ కాఫర్‌ డ్యాంల నిర్మాణ పనులు ప్రారంభం కావాలి. ఆకృతులకు ఆమోదం పొందాల్సి ఉంది. 2018 మే నాటికి పూర్తి చేయాలని ఆలోచన. 65,000 చదరపు మీటర్ల జెట్‌ గ్రౌటింగ్‌ పని చేయాల్సి ఉంటుంది. దీనిపైన మట్టి, రాతి కట్ట నిర్మాణమూ చేపట్టాలి. 80 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పని చేయాల్సి ఉంది. ఇదంతా ఇంకా ప్రారంభం కావాలి.
* ప్రస్తుత లెక్కల ప్రకారం ప్రధాన డ్యాంలో ఈ పనులకు రూ.2,000 కోట్లు అవసరమవుతుంది. ఈ పనులన్నింటికీ కొత్తగా టెండర్లు పిలిచేందుకు జలవనరులశాఖ ఏర్పాట్లు చేస్తోంది. తాజా ధరలను వర్తింపచేస్తే అవసరమయ్యే నిధులు మరింత పెరుగుతాయి. దీనికి తోడు ఎడమ కాలువలో పనులు వేగం పుంజుకోవాల్సి ఉంది. ఎడమ కాలువ భూసేకరణ, పునరావాసం, కాలువ పనుల కోసం(లైనింగ్‌ వంటి పనులు మినహాయించి) దాదాపు రూ.4000 కోట్లకు పైనే అవసరమవుతుంది.

Link to comment
Share on other sites

పోలవరం ప్రాజెక్టు ఆలస్యమవుతుండడంతో ఏపీ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. పనుల్లో జాప్యం, అలసత్వం చేసినందుకు కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్ ట్రాయ్ సంస్థకు ప్రభుత్వం శుక్రవారం నోటీసులు జారీ చేసింది. స్పిల్‌వే, స్పిల్‌వే ఛానల్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్‌ల నిర్మాణానికి తాజాగా షార్ట్ టెండర్లు పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవానికి 2018 నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఆ స్థాయిలో పనులు జరగడంలేదు. సీఎం ప్రతీ సోమవారం పనులు సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నా పోలవరం పనులు అనుకున్న స్థాయిలో జరగడంలేదు. దీంతో సీఎం చంద్రబాబు ప్రాజెక్టు విషయంలో రాజీ పడలేదు. ప్రస్తుతం పనుల నుంచి తప్పించబోతున్న ట్రాన్స్ ట్రాయ్ కంపెనీ..టీడీపీ ఎంపీ రాయపాటి బంధువర్గానికి చెందినది. అయినా ప్రాజెక్టు పూర్తి చేయాలనే లక్ష్యంతో సీఎం కాంట్రాక్ట్ సంస్థను మార్చాలని నిర్ణయించుకున్నారు.

Link to comment
Share on other sites

‘పోలవరం’లో పని విభజన
16-09-2017 02:41:52
 
636411265290131550.jpg
  • నాలుగు పనులకు టెండర్లు
  • స్పిల్‌ చానల్‌, స్పిల్‌వే, ఈసీఆర్‌ఎఫ్‌, కాఫర్‌డ్యామ్‌ పనులకు పిలవనున్న ప్రభుత్వం
  • ఈ నెల 22న ప్రకటన జారీకి నిర్ణయం
  • ట్రాన్‌స్ట్రాయ్‌కు 60-సీ నోటీసు అందజేత
  • పనులను పరిశీలిస్తున్న శ్రీవాత్సవ
  • సోమవారం ప్రాజెక్టు వద్దకు ముఖ్యమంత్రి
అమరావతి, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): పోలవరం పనుల్లో వేగం పెంచేలా పభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2018లో గ్రావిటీ ద్వారా నీళ్లు ఇవ్వడం, 2019లో నిర్మాణాన్ని పూర్తి చేయడం అనే లక్ష్యాల మేరకు పనులు సాగడంలేదంటూ... ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌కి నోటీసు ఇచ్చింది. నెమ్మదిగా సాగుతున్న పనులను కొత్తగా టెండర్లు పిలవనుంది. ఈ నెల 22న ఈ ప్రకటన జారీ చేయనుంది. ఆపై 15 రోజుల్లోనే వాటిని ఖరారు చేస్తారు. ప్రధాన పనుల్లో జాప్యంపై సీఎం చంద్రబాబు ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేయడంతో... వీటి నిర్మాణ బాధ్యతలను చూస్తున్న ట్రాన్‌స్ర్టాయ్‌కు పోలవరం ప్రాజెక్టు సూపరింటెండింగ్‌ ఇంజనీరు రమేశ్‌బాబు శుక్రవారం 60-సీ నోటీసును అందజేశారు.
 
పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు పనులు అప్పగించిన సమయంలో చేసుకున్న ఒప్పందం మేరకు... పనుల్లో జాప్యం జరిగితే 60-సీ నోటీసును అందజేసే వీలుంది. నోటీసులు, వాటికి సమాధానాల కోసం ఎదురు చూస్తే సమయం మించిపోతుందని భావిస్తున్న జల వనరులశాఖ... స్పిల్‌వే కాంక్రీట్‌ పనులు పాక్షికంగానూ, స్పిల్‌ చానల్‌(కాంక్రీట్‌), ఎర్త్‌కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌, కాఫర్‌ డ్యామ్‌ తోపాటు అవసరమైన పనులను ఇతర కంపెనీకి అప్పగించనుంది. కాగా, పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) సభ్య కార్యదర్శి శ్రీవాత్సవ శుక్రవారం పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించి పనులను సమీక్షించారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుందన్నారు. కాగా, ఈ నెల 18న పోలవరం ప్రాజెక్టు వద్దే నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.
Link to comment
Share on other sites

హైడల్‌ బరిలో 3 సంస్థలు
16-09-2017 02:42:19
 
  • టెక్నికల్‌గా నవయుగ, మేఘా, టాటాలు ఫిట్‌
  • నేడు ఫైనాన్షియల్‌ బిడ్లు తెరవనున్న జెన్కో
అమరావతి, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): పోలవరం జల విద్యుత్‌ కేంద్రం నిర్మాణానికి సాంకేతిక టెండర్లను ఏపీ జెన్కో శుక్రవారం ఓపెన్‌ చేసింది. ప్రఖ్యాత సంస్థలు నవయుగ-ఆల్‌స్ట్రామ్‌, మేఘా ఇంజనీరింగ్‌- బీహెచ్‌ఈఎల్‌, టాటా-ఆండ్రిడ్జ్‌ సంస్థలు అర్హతను పొందాయి. దీంతో అధికారులు శనివారం నాడు ఫైనాన్షియల్‌ బిడ్లు తెరనున్నారు. రాష్ట్రంలో మిగులు విద్యుత్‌ ఉండడం, సౌర, పవన విద్యుత్‌ ధరలు తగ్గుతుండడం, సోలార్‌ విద్యుత్‌ను బ్యాటరీలో స్టోరేజీ చేసే విధానం అమలులోకి రావడం, సోలార్‌ విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయడం వంటివి అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో... పోలవరం జల విద్యుత్‌ కేంద్ర నిర్మాణం చేపట్టడంపై సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ ఎనర్జీకి ప్రాధ్యాన్యం ఇస్తూ వస్తోంది. అయితే... జల విద్యుత్‌ కేంద్రం కూడా గ్రీన్‌ ఎనర్జీలో భాగమేనని కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పోలవరం జల విద్యుత్‌ కేంద్రం నిర్మాణానికి ఏపీ జెన్కో టెండర్లను పిలిచింది.
Link to comment
Share on other sites

పోలవరం ఆగొద్దు

ఒక్కరోజు కూడా పనులు నిలపడానికి వీల్లేదు

కాపర్‌డ్యాం పూర్తి చేయాల్సిందే

ప్రాజెక్టు పరిశీలనలో సీఎం చంద్రబాబు

ఈనాడు- ఏలూరు, న్యూస్‌టుడే-పోలవరం

18ap-main1a.jpg

ఏవేవో కారణాలతో పోలవరం ప్రాజెక్టు పనులు ఒక్కరోజు కూడా ఆపడానికి కుదరదని, నిధుల సమస్య లేదని, కాపర్‌ డ్యాం నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రావడం ఆలస్యమైతే రాష్ట్ర ప్రభుత్వం వద్ద ఉన్న వాటితో పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం ప్రాజెక్టు పనులను ఆయన సోమవారం స్వయంగా పరిశీలించారు. స్పిల్‌వే, గేట్ల తయారీ పనులను పరిశీలించి అధికారులు, ఇంజినీర్లతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. ఎర్త్‌కం ర్యాక్‌ఫిల్‌ డ్యాం పనులు నవంబరులో ప్రారంభిస్తామని, స్పిల్‌వేలో 48 గేట్ల పనులు జరుగుతున్నాయని, స్పిల్‌ఛానల్‌ లైనింగ్‌ పనులు, ఐకానిక్‌ వంతెన పనులు అక్టోబరులో ప్రారంభిస్తామని సీఎం వివరించారు. 960 మెగావాట్ల విద్యుత్తు కేంద్ర నిర్మాణ పనులకు టెండర్లు పిలుస్తున్నామని, మట్టి పని 71 శాతం పూర్తయిందని, మిగిలినది 2018 ఫిబ్రవరి నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. గోదావరిలో నీరు తగ్గిన వెంటనే నవంబరు నుంచి డయాఫ్రం వాల్‌ నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని రాబోయే 18 నెలల్లో పూర్తి చేసి ఆ పొలాలకు సాగునీరు అందిస్తామన్నారు. భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌లో నిర్వాసితులకు అన్యాయం చేసే ప్రసక్తి లేదని చెప్పారు. బినామీ వ్యక్తుల ద్వారా పరిహారం పొందడానికి ప్రయత్నించినా, రికార్డులు తారుమారు చేసినా అటువంటి వ్యక్తులపైనా, అధికారులు, సిబ్బందిపైనా కూడా కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

ఉమ్మడి నిధులను వినియోగించుకోండి

ప్రాజెక్టు పరిశీలన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులు, గుత్తేదార్లు, ఇంజినీర్లతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా పనులు మధ్యలో ఎందుకు ఆగుతున్నాయని ప్రశ్నించారు. దీనికి సీఈ రమేష్‌బాబు సమాధానమిస్తూ కార్మికులు కొన్ని రోజులు సమ్మె చేశారని, కొన్ని సందర్భాల్లో వర్షాలు, పెట్రోల్‌ కొరతతో పనులు నిలిచిపోయాయని చెప్పారు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కార్మికుల జీతాలు, ఇతర అత్యవసరాల కోసం ఉమ్మడి నిధిని సీఈ పేరునే ఇచ్చినందున వినియోగించుకోవాలని ఆదేశించారు. గుత్తేదారుల నుంచి పనులు రాబట్టుకోవాలంటే వారికి సకాలంలో బిల్లులు కూడా ఇవ్వాల్సి ఉంటుందన్నారు. నిర్వాసితుల కాలనీల్లో 25 అంశాలతో కూడిన ప్రణాళికను పశ్చిమగోదావరి కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ సీఎంకు వివరించారు. అది బాగుందని కితాబునిచ్చి ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు కూడా దీనిని ఆచరిస్తూ ముందుకు సాగాలని సూచించారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పనులు అనుకున్న స్థాయిలో చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికీ రెండు పంపుల ద్వారానే నీరు ఇస్తున్నారని, అక్టోబరు నెలాఖరు నాటికి 2100 క్యూసెక్కులు నీరు ఇవ్వాలని ఆదేశించారు. ప్రాజెక్టుకు సంబంధించి 21 రకాల అనుమతులు సీడబ్ల్యూసీ నుంచి రావాల్సి ఉందని, దీనిపై త్వరలో తాను దిల్లీ వెళ్లినప్పుడు చర్చిస్తానని, ఏ అంశాలు ప్రస్తావించాలో ప్రాధాన్యక్రమంలో నోట్‌ రాయాలని అధికారులను ఆదేశించారు. కుడికాలువపై రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని ఈఎన్‌సీ వెంకటేశ్వరరావు వెల్లడించారు. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పైడికొండల మాణిక్యాలరావు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...