Jump to content

polavaram


Recommended Posts

http://www.deccanchronicle.com/150926/nation-current-affairs/article/polavaram-needs-35852-acres-land

 

"The government, in its report, said that as per the plan furnished by the irrigation department, a total of 1,16,348 acres were required for the project, including for main canals, supply channels and feeder channels. 

 
The government said it already acquired 80,496 acres — of which 75,766 acres were acquired under the old Land Acquisition Act, 1894. Some 4,730 acres was acquired under the new Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013.
 
The state government said, so far, it paid Rs 1,696.16 crore as compensation to about 34,000 land losers under the project, including Rs 990 crore to 25,100 land losers under the old Act and Rs 706 crores to 8,960 land losers under the new Act."
 
 
 
inka kavalsindi 36000 acres. daaniki 33000 crores avvatam enti? already acquire chesina daaniki kuda 2013 rates prakaram malli compensation ivvaltaaniki ee estimations vesara????
Link to comment
Share on other sites

  • Replies 3.3k
  • Created
  • Last Reply

రూ.58,319 కోట్లకు సవరణ

పోలవరంపై కొత్త అంచనాలు

నేడు కేంద్రానికి సమర్పణ

ప్రాజెక్టు అథారిటీకి, కేంద్ర జలసంఘానికి కూడా

ఈనాడు - అమరావతి

21ap-main7a.jpg

పోలవరం నిర్మాణానికి రూ.58,319.06 కోట్లు ఖర్చవుతుందని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అంచనా వేసింది. పోలవరాన్ని కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. 2014 ఏప్రిల్‌ ఒకటో తేదీ నాటికి ఈ ప్రాజెక్టుకు ఎంత ఖర్చవుతుందో లెక్కించి ఆ మేరకు అంచనాలు సమర్పించాలని నిర్ణయించింది. ప్రాజెక్టు అథారిటీ తొలి సమావేశంలోనూ సవరించిన అంచనాలు సమర్పించాలని నిర్దేశించింది. ఈ మేరకు రాష్ట్ర జలవనరులశాఖ అధికారులు లెక్కలు రూపొందించారు. పూర్తి వివరాలతో మంగళవారం దిల్లీలో కేంద్ర జలసంఘానికి, కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖకు ఈ నివేదికను సమర్పించనున్నారు. జలవనరుల శాఖ బృందం ఇందుకోసం ఇప్పటికే దిల్లీకి చేరింది.

గతంలో 2010-11లో సవరించిన అంచనాల ప్రకారం పోలవరం అంచనా వ్యయం రూ.16010.45 కోట్లు. ఇప్పుడు అది 2013-14 నాటి లెక్కలకే రూ.58 వేల కోట్లకు చేరింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం విద్యుత్కేంద్రం మినహా 2014 ఏప్రిల్‌1 నాటికి మిగిలి ఉన్న పనికి మాత్రమే జాతీయ ప్రాజెక్టు కింద నిధులు అందిస్తానని పేర్కొంది. ఇందుకోసం నాబార్డుతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ప్రస్తుత ధరలను కూడా లెక్కలోకి తీసుకుంటే పోలవరం ప్రాజెక్టు వ్యయం ఇంకా అధికమవుతుంది. ఇందులో కేంద్రం ఎంత భరిస్తుందనేది పక్కన పెడితే మరికొన్ని పనులకు తాజా ధరలు వర్తింపజేసే ఆలోచన అధికారులకు ఉంది. ఈ కోణంలో పోలవరం అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉంది.

24న అథారిటీ సమావేశంలోనూ చర్చ

పోలవరం ప్రాజెక్టు అథారిటీ పూర్తి స్థాయి సమావేశం ఈ నెల 24న పోలవరంలో జరగనుంది. ఆ రోజు సవరించిన అంచనాలపైనా చర్చించే అవకాశం ఉంది. ఆ సమావేశంలో ప్రాథమిక చర్చ అనంతరం ఈ అంచనాల తనిఖీ నిమిత్తం ప్రాజెక్టు అథారిటీతో చర్చించనున్నారని సమాచారం. ఇందుకోసం పోలవరంలో విభాగాలవారీగా బృందాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన పనులు, ఎడమ, కుడి కాలువల పనుల వారీగాను, భూసేకరణ- పునరావాసపరంగానూ అథారిటీతో చర్చించి ఈ అంచనాలను కొలిక్కి తెస్తారు.

ఇంతకుముందు పోలవరం ప్రాజెక్టు అథారిటీకి రూ.48వేల కోట్ల సవరించిన అంచనాలతో ఒక ప్రతిపాదన సమర్పించారు. ఆ విషయంపై అథారిటీలో వివిధ సందర్భాల్లో అధికారులు చర్చించారు. వారి అనుమానాలను నివృత్తి చేయడానికి, క్షేత్ర స్థాయి పరిస్థితులకు మధ్య లంకె కుదరలేదు. అథారిటీ తనిఖీ తర్వాత ఒక అంగీకారానికి వచ్చి ఆ సవరించిన అంచనాలు కేంద్రానికి పంపితే సులభంగా ఆమోదం పొందవచ్చని భావించారు. ఈ ప్రక్రియలో రెండు వైపుల నుంచి ఇబ్బందులు తలెత్తుతూ వచ్చాయి. ప్రధాన పనులకు సంబంధించి కొన్ని మార్పులతో అంచనాలు సమర్పించాలని అథారిటీ వెనక్కు పంపిన సందర్భాలున్నాయి. ఇప్పుడు అవన్నీ కొలిక్కి తీసుకువచ్చి కేంద్రానికి సమర్పించనున్నారు.

21ap-main7b.jpg

Link to comment
Share on other sites

 

http://www.deccanchronicle.com/150926/nation-current-affairs/article/polavaram-needs-35852-acres-land

 

"The government, in its report, said that as per the plan furnished by the irrigation department, a total of 1,16,348 acres were required for the project, including for main canals, supply channels and feeder channels. 

 
The government said it already acquired 80,496 acres — of which 75,766 acres were acquired under the old Land Acquisition Act, 1894. Some 4,730 acres was acquired under the new Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013.
 
The state government said, so far, it paid Rs 1,696.16 crore as compensation to about 34,000 land losers under the project, including Rs 990 crore to 25,100 land losers under the old Act and Rs 706 crores to 8,960 land losers under the new Act."
 
 
 
inka kavalsindi 36000 acres. daaniki 33000 crores avvatam enti? already acquire chesina daaniki kuda 2013 rates prakaram malli compensation ivvaltaaniki ee estimations vesara????

 

 

 

Congress didn't done any land aquititon tdp vachake atleast site lo una villages ni move chesi polavaram dam works started

 

already so many demanding so many cases vesaru on land aquition so we need to give according to 2013 only for most of them.

 

better leave land aquititon to central and state must concentrate on dam works it will be better

Link to comment
Share on other sites

Congress didn't done any land aquititon tdp vachake atleast site lo una villages ni move chesi polavaram dam works started

 

already so many demanding so many cases vesaru on land aquition so we need to give according to 2013 only for most of them.

 

better leave land aquititon to central and state must concentrate on dam works it will be better

 

yup, dam works compelte cheyyali up to max limit. land acquisition ippatlo ayye pani kadu. centre is not going to give that much money. 

Link to comment
Share on other sites

http://www.deccanchronicle.com/150926/nation-current-affairs/article/polavaram-needs-35852-acres-land

 

"The government, in its report, said that as per the plan furnished by the irrigation department, a total of 1,16,348 acres were required for the project, including for main canals, supply channels and feeder channels.

The government said it already acquired 80,496 acres — of which 75,766 acres were acquired under the old Land Acquisition Act, 1894. Some 4,730 acres was acquired under the new Land Acquisition, Rehabilitation and Resettlement Act, 2013.

The state government said, so far, it paid Rs 1,696.16 crore as compensation to about 34,000 land losers under the project, including Rs 990 crore to 25,100 land losers under the old Act and Rs 706 crores to 8,960 land losers under the new Act."

 

 

inka kavalsindi 36000 acres. daaniki 33000 crores avvatam enti? already acquire chesina daaniki kuda 2013 rates prakaram malli compensation ivvaltaaniki ee estimations vesara????

Acquired 86K acres till 2016. Need to acquire 94K acres still
Link to comment
Share on other sites

Acquired 86K acres till 2016. Need to acquire 94K acres still

:shakehands:

 

33k crores for 94k acres. almost 35 lacs per acre. that too for agency area lands? Granted, some of it is for rehabilitation. still very expensive land acquisition. With 2013 act in place, none of the major irrigation projects can be completed. unless you are a KCR who can set a price and take it.

Link to comment
Share on other sites

:shakehands:

 

33k crores for 94k acres. almost 35 lacs per acre. that too for agency area lands? Granted, some of it is for rehabilitation. still very expensive land acquistion. With 2013 act in place, none of the major irrigation projects can be completed. unless you are a KCR who can set a price and take it.

A compensation of up to 4 times the market price in rural areas

Houses for all affected families

Transport allowance

Resettlement Allowance

Training and skill development

If the Govt is unable to show unemployment, a one-time grant of Rs.5 lakh per family

Link to comment
Share on other sites

పోలవరం అంచనా 58 వేల కోట్లు!
23-08-2017 02
  • త్వరలో ప్రాజెక్టు అథారిటీకి అందజేత
అమరావతి, ఆగస్టు 22(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు తుది అంచనా రూ.58,319.06 కోట్లకు చేరుకుంది. 2013 భూ సేకరణ చట్టం నేపథ్యంలో.. భూ సేకరణ, సహాయ పునరావాస కార్యక్రమానికి.. రూ.33,858.45 కోట్లను చెల్లించాల్సి వస్తోంది. అంటే.. ప్రాజెక్టులో సగానికిపైగా వ్యయం భూ సేకరణకే ఖర్చు కానుంది. ఇక హెడ్‌వర్క్స్‌ పనుల అంచనా రూ.11,637.98 కోట్లు, ఎడమ ప్రధాన కాలువ నిర్మాణ అంచనా రూ.4,960.83 కోట్లు, కుడి ప్రధాన కాలువ నిర్మాణ అంచనా రూ.3656.14 కోట్లు, పవర్‌ హౌస్‌ నిర్మాణానికి రూ.4.205.66 కోట్లుగా జల వనరుల శాఖ, పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు అంచనాకు వచ్చారు. ఈ అంచనాలను రాష్ట్ర జల వనరుల శాఖ అధికారికంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీకి పంపనుంది. అనంతరం దీనిపై తుది నిర్ణయం వెలువడనుంది.
Link to comment
Share on other sites

పోలవరం ప్రధాన పనులకు మళ్లీ టెండర్లు!

ప్రస్తుత గుత్తేదారు నుంచి కొంత తొలగింపు

తాజా ధరలతో మళ్లీ కొత్తగా ఆహ్వానం

ఎల్‌ ఎస్‌ పద్ధతిలో చేపట్టేందుకు నిర్ణయం

పనుల వేగం పెంచాలన్నదే వ్యూహం

ఈనాడు - అమరావతి

22ap-main11a.jpg

పోలవరం ప్రాజెక్టు ప్రధాన పనుల్లో కీలకమైన కొన్ని నిర్మాణాలకు మళ్లీ టెండర్లు పిలవాలని జలవనరులశాఖ అధికారులు ఒక ఉన్నతస్థాయి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 2018 జూన్‌ నాటికి కాఫర్‌ డ్యాం నిర్మాణం పూర్తి చేసి గ్రావిటీ ద్వారా నీరు ఇవ్వాలని భావిస్తున్న ప్రభుత్వం తాజాగా ఈ పనులు వేగం పెంచాలంటే మరో ప్రధాన గుత్తేదారును రంగంలోకి తీసుకురావాలని భావిస్తోంది. ఇంతవరకు ఈ ప్రాజెక్టులో ప్రధాన గుత్తేదారు ట్రాన్స్‌ట్రాయ్‌తో కలిసి ఉపగుత్తేదారులుగా అనేక మంది వివిధ పనులు చేపడుతూ వస్తున్నారు. ఈ పద్దతిలోను స్పిల్‌ ఛానల్‌ కాంక్రీటు పనులతో పాటు మరికొన్ని అప్పగించేందుకు అధికారులు ప్రయత్నించినా కొందరు ప్రధాన గుత్తేదారులు ఇందుకు అంగీకరించలేదు. సంబంధిత పనులను ప్రధాన గుత్తేదారు నుంచి 60 సి కింద తొలగించి ప్రస్తుత ధరలతో అంచనాలు రూపొందించి టెండర్లు పిలవాలని నిర్ణయించారు. స్పిల్‌ ఛానల్‌ కాంక్రీటుతో పాటు ఎర్త్‌ కం రాక్‌ ఫిల్‌ డ్యాం, కాఫర్‌ డ్యాంలు, ప్రధాన పనులకు అనుసంధాన కనెక్టివిటీ పనులు, స్పిల్‌ వేలో కొంత భాగం ప్రధాన గుత్తేదారు నుంచి 60 సి కింద మినహాయించనున్నారు. దాదాపు రూ.1500 కోట్ల నుంచి రూ.2000 కోట్ల విలువైన పనులకు ఇలా కొత్తగా టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకున్నారు. ఎర్త్‌ కం రాక్‌ ఫిల్‌ డ్యాంలో అడుగున డయాఫ్రం వాల్‌ నిర్మాణం పనులు ఇప్పటికే ఎల్‌ అండ్‌ టీ బావర్‌ సంస్థ చేపడుతోంది. అది పునాది వంటి పని. ఆ పని పూర్తయిన తర్వాత ఎగువన మట్టి, రాతితో కట్ట నిర్మాణం చేపట్టాల్సి ఉంటుంది. దాదాపు కిలోమీటరుకు పైగా ఈ నిర్మాణం ఉంటుంది. ఈ ప్రధాన డ్యాంకు ఎగువన, దిగువన కాఫర్‌ డ్యాంలు నిర్మించాలి. 41 మీటర్ల ఎత్తున కాఫర్‌ డ్యాం నిర్మించి నీటిని నిలబెట్టి గ్రావిటీ ద్వారా నీరు కాలువలకు విడుదల చేయాలనేది ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఇందులో భాగంగా కాఫర్‌ డ్యాం పునాదిగా జట్‌ గ్రౌటింగ్‌ పనులు చేపట్టారు. కెల్లర్‌ సంస్థ ఉపగుత్తేదారుగా ఇప్పటికే ఈ పనులు చేపట్టింది. ఎగువన కాఫర్‌ డ్యాం మట్టి కట్ట నిర్మించాల్సి ఉంటుంది. ఈ కాఫర్‌ డ్యాంలు ఎత్తు పెంచి 41 మీటర్లకు పెంచి 2018 జూన్‌ కల్లా నీళ్లు ఇచ్చే దిశగా కొత్తగా టెండర్లు పిలవబోతున్నారు. కాంక్రీటు పనులు కూడా ప్రస్తుతం వేగంగా జరగడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు. స్పిల్‌ ఛానల్‌లో 18 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని చేయాల్సి ఉంది. స్పిల్‌ వేలోను కొంత భాగం కాంక్రీటు పని కూడా కొత్త టెండర్లలో కలపనున్నారని సమాచారం.

Link to comment
Share on other sites

పోలవరంపై నేడు కీలక సమావేశం

23ap-main2a.jpg

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించడంతో పాటు కీలకాంశాలపై నిర్ణయం తీసుకునేందుకు ప్రాజెక్టు అథారిటీ పూర్తిస్థాయి సమావేశం గురువారం పోలవరంలో జరగబోతోంది. కేంద్ర జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవోగాను వ్యవహరిస్తున్న అమర్‌జిత్‌సింగ్‌ స్వయంగా నిర్మాణ ప్రగతిని పరిశీలించనున్నారు. దాదాపు ఏడాది తర్వాత ఆయన ప్రాజెక్టును సందర్శిస్తున్నారు. ఆయనతో పాటు కమిషనర్‌ కె.వోహ్రా, కేంద్ర జలసంఘం సభ్యుడు మసూద్‌ హుస్సేన్‌, సీనియర్‌ జాయింట్‌ కమిషనర్‌ శ్రీవాత్సవ, పోలవరం డ్యాం డిజైన్‌ రివ్యూ కమిటీ ఛైర్మన్‌ ఎ.బి.పాండ్యా తదితరులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు.

ఇదీ పురోగతి..

* ప్రాజెక్టులో మట్టి తవ్వకం పనులు 70 శాతానికి పైగా పూర్తయ్యాయి. 1055 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర మట్టి తవ్వకం పనులు చేయాల్సి ఉండగా.. 745 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర పూర్తయింది.

* స్పిల్‌ వే, స్టిల్లింగ్‌ బేసిన్‌ కాంక్రీటుకు సంబంధించి 16.04 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర పనిచేయాలి. ఇందులో 2.21 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీటు పని జరిగింది.

* మొత్తం 48గేట్ల ఫ్యాబ్రికేషన్‌ పూర్తయింది. వీటికి గడ్డర్ల ఏర్పాట్లు ప్రక్రియ సాగుతోంది. అక్టోబరు కల్లా మొత్తం గేట్ల నిర్మాణం పూర్తవుతుంది.

* ప్రధాన డ్యాంలో డయాఫ్రం వాల్‌ నిర్మాణ పనులు లక్ష్యం మేరకు పూర్తయ్యాయి. మిగిలిన పనులు వరద తగ్గిన తర్వాత చేపడతారు.

చర్చించనున్న అంశాలు..

* పోలవరం ప్రాజెక్టు అథారిటీకి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఇప్పటివరకూ ఒప్పందం (ఎంవోయూ) జరగలేదు. ఒప్పందంలోని అంశాలపై ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. ఇరువైపులా రెండు ముసాయిదాలు సిద్ధమయ్యాయి. దీనిపై సమావేశంలో చర్చ జరగనుంది.

* ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శికి ఆర్థిక అధికారాలు అప్పగించే అంశమూ చర్చకు రానుంది. ప్రత్యేకంగా ఒక ఖాతా ఏర్పాటు చేసి నిధులు ఆ ఖాతాకు వచ్చేలా, వాటిపై అథారిటీ సభ్య కార్యదర్శికి అధికారం కల్పించే ప్రతిపాదన పరిశీలనలో ఉంది.

* నిర్మాణంలో నాణ్యతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ సంస్థకు నాణ్యత పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించే విషయంపై చర్చించనున్నారు.

* ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టిన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన పలు ఇతర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు.

Link to comment
Share on other sites

కాంక్రీట్‌’ అవరోధం!
24-08-2017 03:14:50

 
636391412955148091.jpg
  • పోలవరం కాంక్రీట్‌ పనుల్లో జాప్యం.. ట్రాన్‌స్ట్రాయ్‌పై సర్కార్‌ అసంతృప్తి.. 60-సి కింద నోటీసులకు సిద్ధం
  • మరో సంస్థకు పనులు అప్పగించే యోచన
అమరావతి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): పోలవరం పనులను పరుగులెత్తించాలన్న ప్రభుత్వ సంకల్పానికి గండిపడుతోంది. 2108కి ప్రాజెక్టు నుంచి గ్రావిటీ ద్వారా నీరిందాలన్న సీఎం చంద్రబాబు లక్ష్యాన్ని కాంక్రీట్‌ పనుల్లో చోటుచేసుకుంటున్న జాప్యం నీరుగారుస్తోంది. ప్రాజెక్టులో అత్యంత ప్రధానమైన స్పిల్‌ చానల్‌, స్పిల్‌ వే, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌, కాఫర్‌ డ్యామ్‌ పనులు ఇదే స్థాయిలో కొనసాగితే 2019కి ప్రాజెక్టును పూర్తి చేయడం అసాధ్యమని ప్రభుత్వం భావిస్తోంది.
 
ప్రాజెక్టు పనులను చేపట్టిన ఉపకాంట్రాక్ట్‌ సంస్థలు లక్ష్యాల మేరకు పనులు చేస్తున్నా ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్‌స్ట్రాయ్‌ మాత్రం పనుల్లో వేగాన్ని అందిపుచ్చుకోవడం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. దీంతో కాంక్రీట్‌ పనులను కొత్త సంస్థలకు అప్పగించాలని యోచిస్తోంది. 2018 దాకా ట్రాన్‌స్ట్రాయ్‌కు కాలపరిమితి ఉన్నా పనుల్లో వేగం లేకపోవడంతో లక్ష్యాలను అధిగమించడం లేదన్న కారణంతో 60-సి కింద నోటీసు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. స్పిల్‌ చానల్‌, స్పిల్‌ వే, ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌, కాఫర్‌ డ్యామ్‌ పైభాగం పనులను అనుభవం కలిగిన సంస్థలకు అప్పగించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కాంక్రీట్‌ పనుల మందగమనం గురించి ఇప్పటికే ప్రధాన కాంట్రాక్టు సంస్థకు తెలియజేసిన జల వనరుల శాఖ పోలవరం పనులు పూర్తి చేసేందుకు కాంక్రీట్‌ పనులకు కొత్తగా టెండర్లను పిలిచే యోచనలో ఉన్నట్లు వివరించింది.
 
ప్రధాన కాంట్రాక్టు సంస్థతో సంప్రదింపుల తర్వాతే కాంట్రాక్టు పనులకు కొత్తగా టెండర్లను పిలవడం వల్ల న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా చూసుకోవాలని జలవనరుల శాఖ భావిస్తోంది. కాగా, పనుల జాప్యంపై ట్రాన్‌స్ట్రాయ్‌ ఇస్తున్న సంజాయిషీ మరోలా ఉంది. తాము కాంట్రాక్టు దక్కించుకున్న సమయంలో ఉన్న ధరలకూ.. ఇప్పటి ధరలకూ భారీ వ్యత్యాసం ఉందని, పైగా తాము 14 శాతం తక్కువకు టెండర్‌ కోట్‌ చేశామని చెబుతోంది. చాలా తక్కువ మార్జిన్‌తో పనులు చేపట్టేందుకు సిద్ధమయ్యామని సంస్థ పేర్కొంటోంది.
 
పోలవరం పనులు సత్వరమే పూర్తి చేయాలన్న ఉద్దేశంతోనే ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన నిర్మాణ సంస్థలను ఉప కాంట్రాక్టు సంస్థలుగా తీసుకుని పనులు అప్పగిస్తున్నామని చెబుతోంది. ఈ కాంట్రాక్టు సంస్థలకు ప్రస్తుత అంచనాల మేరకు చెల్లించాల్సి వస్తోందని వివరిస్తోంది. జూలై 26న సీఎం సమక్షంలో జరిగిన పోలవరం సమీక్షలో ఇదే అంశాన్ని స్పష్టం చేసింది. కాంట్రాక్టు పనుల అంచనాలను సవరించాలని లిఖిత పూర్వకంగా కోరింది.
 
దీనిపై అధ్యయనానికి కమిటీని వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంచనాల సవరణకు సంబంధించి ‘లాజికల్‌’ నివేదికలు సమర్పించాలని ట్రాన్‌స్ట్రాయ్‌ను అధికారులు కోరారు. ఇప్పటికే రెండు అంశాలకు సంబంధించి నివేదికలు సమర్పించిన ట్రాన్‌స్ట్రాయ్‌ మరో మూడు పనులపై నివేదికలు సమర్పించాల్సి ఉంది. అంచనాలు సవరించాల్సిన ఐదు పనులకు సంబంధించి ఎస్‌ఎ్‌సఆర్‌ సవరణ ధరలను ఒకేసారి అందజేయాలని ట్రాన్‌స్ట్రాయ్‌కు జల వనరుల శాఖ స్పష్టం చేసింది.
 
భారీగా పెరిగిన భూసేకరణ వ్యయం
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భూసేకరణే కీలక భూమిక వహిస్తోంది. రెండు దశల్లో చేపట్టే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి భూ సేకరణపై జల వనరుల శాఖ అధికారులు లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.58,319 కోట్లకు చేరుకుంటే .. ఇందులో భూసేకరణ వ్యయం రూ.33,000 కోట్లకు చేరుకుంది. ప్రాజెక్టు నిర్మాణం కోసం సేకరించే భూమికి పరిహారం చెల్లింపు, పునరావాస కార్యక్రమాల కోసం రూ.2500 కోట్లు చెల్లిస్తే సరిపోతుందని 2010 నాటి అంచనాల్లో భావించారు.
 
కానీ ఇప్పుడు 2013 భూ సేకరణ చట్టం నిబంధనల మేరకు భూములకు ధరలు చెల్లించాల్సి రావడంతో భూసేకరణ వ్యయం భారీగా పెరిగింది. ప్రాజెక్టు వ్యయంలో సగానికి పైగా వ్యయం ఈ పద్దు కిందే అవుతోంది. పోలవరం ప్రాజెక్టు తొలి దశలో 41.15 మీటర్ల కాంటూరు కోసం ఈ ఏడాది అక్టోబరు నాటికి భూ సేకరణ చేపట్టాల్సి ఉంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల 10,786.44 ఎకరాలు ముంపునకు గురవుతాయి. ఇప్పటి దాకా 9633.45 ఎకరాలను సేకరించారు.
 
ఇంకా .. 1152.99 ఎకరాలు సేకరించే పనిలో జల వనరుల శాఖ నిమగ్నమై ఉంది. పోలవరం ప్రాజెక్టు కోసం భూమికి భూమి ఇచ్చేందుకు 2111.88 ఎకరాలను సేకరించాల్సి ఉండగా 486.73 ఎకరాలను ఇప్పటి దాకా సేకరించారు. మరో 1625.15 ఎకరాలను సేకరిస్తున్నారు. నిర్వాసితులకు గృహాలు నిర్మించేందుకు 566.70 ఎకరాలను సేకరించి, గృహాలతోపాటు మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నారు.
Link to comment
Share on other sites

నేడు పోలవరానికి కేంద్ర బృందం!
24-08-2017 03:15:11
 
  • అమర్జిత్‌సింగ్‌ నేతృత్వంలో 12 మంది రాక
  • పోలవరం పనులను సమీక్షించనున్న బృందం
అమరావతి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్రం, ప్రాజెక్టు పనుల పర్యవేక్షణకు స్వయంగా రంగంలోకి దిగింది. కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అమర్జిత్‌ సింగ్‌ గురువారం ప్రాజెక్టును సందర్శించనున్నారు. కేంద్ర జల వనరుల మంత్రిత్వశాఖ కార్యదర్శితోసహా 12 మంది సభ్యుల బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించనుంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవోగానూ బాధ్యతలు వహిస్తున్నందున గురువారం పోలవరం ప్రాజెక్టు అథారిటీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించేందుకు అమర్జిత్‌ సింగ్‌ సిద్ధమయ్యారు. వాస్తవానికి పీపీఏ మార్గదర్శకాల మేరకు ప్రతి ఆరు నెలలకోసారి పీపీఏ సర్వసభ్య సమావేశం జరగాలి. ఈ లెక్కన మూడేళ్లలో 12 సర్వసభ్య సమావేశాలు జరగాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు రెండు సమావేశాలు మాత్రమే జరిగాయి. నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేసేందుకు కాంట్రాక్టు సంస్థలు అనుసరిస్తున్న విధానాలు, పనులు చేపడుతున్న తీరును అమర్జిత్‌ సింగ్‌ బృందం సమీక్షిస్తుంది.
Link to comment
Share on other sites

పెండింగ్‌ నిధులపై దక్కని భరోసా?

ఆడిట్‌ నివేదిక లేకుండా ఎలా ఇవ్వగలం

2018కి పోలవరం పూర్తి అవుతుందా?

రాష్ట్ర అధికారులకు అథారిటీ ప్రశ్నలు

వారంలో రూ.970 కోట్లు విడుదలయ్యే అవకాశం

24ap-main14a.jpg

ఈనాడు-అమరావతి, న్యూస్‌టుడే-పోలవరం: పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర సాయం ఎప్పటికప్పుడు అందేలా చూడాలని రాష్ట్ర ఉన్నతాధికారులు పోలవరం ప్రాజెక్టు అథారిటీని కోరారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు సకాలంలో అందకపోవడంతో ఆ ప్రభావం రాష్ట్ర ప్రాజెక్టులపై పడుతోందని విన్నవించారు. రాష్ట్ర అధికారులు మొరపెట్టుకున్నా... పెండింగులో ఉన్న నిధుల విడుదలకు సంబంధించి అథారిటీ అధికారుల నుంచి గట్టి భరోసా లభించలేదు. ఆడిట్‌ నివేదికలు, సవరించిన అంచనాల ఆమోదంపై అథారిటీ నాయకత్వం ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలిసింది. పోలవరం ప్రాజెక్టు వద్ద గురువారం ప్రాజెక్టు అథారిటీ ఆరో సర్వసభ్య సమావేశం జరిగింది. అథారిటీ సీఈవో కేంద్ర జలవనరులశాఖ కార్యదర్శి అమర్‌జిత్‌సింగ్‌ ఈ సమావేశానికి హాజరుకాలేదు. ఆయన స్థానంలో కేంద్ర కమిషనర్‌(రాష్ట్ర ప్రాజెక్టులు) కె.వోహ్రా అధ్యక్షత వహించారు. సమావేశంలో రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌...పోలవరం ప్రాజెక్టుపై ఇప్పటికే రాష్ట్రం ఖర్చు చేసిన రూ.3700 కోట్లకు పైగా నిధులను కేంద్రం విడుదల చేయాల్సి ఉందని అథారిటీ దృష్టికి తెచ్చారు. సవరించిన అంచనాలు ఆమోదం పొందలేదు కదా అని ఈ సందర్భంగా వోహ్రా ప్రశ్నించారు. రూ.970 కోట్ల విడుదలకు కేంద్ర మంత్రి ఉమాభారతి సంతకం చేశారని, వారం రోజుల్లో విడుదలవుతాయని చెప్పారు. ఆడిట్‌ నివేదికలు పంపితే మిగిలిన నిధులు విడుదల చేయగలమని అన్నారు. సవరించిన అంచనాలు ఆమోదం పొందవలసిన అవసరం లేదని, ఆమోదం పొందిన మేరకే తాము ఖర్చు చేశామని శశిభూషణ్‌ వివరించారు. దీనిపై అథారిటీ ప్రతినిధుల నుంచి గట్టి భరోసా ఏమీ లభించలేదు.

అథారిటీ సభ్యులు, డ్యాం డిజైన్‌ కమిటీ ఛైర్మన్‌, ఇతర కేంద్ర సంస్థల ప్రతినిధులు అడిగిన ప్రశ్నలపై రాష్ట్ర ప్రభుత్వ అధికారుల నుంచి ఓహ్రా స్పష్టమైన సమాధానాలు కోరారు. 2018 జూన్‌ లోపు ఈ ప్రాజెక్టు పూర్తయ్యే స్థాయిలో పనులు జరగడం లేదని కన్సల్టెంట్‌ భార్గవ ప్రస్తావించారు. కాంక్రీటు పనులు వేగంగా సాగడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో కాఫర్‌ డ్యాం ముందే నిర్మించుకుని ఉపయోగం ఏమిటని అథారిటీ ప్రశ్నించింది. స్పిల్‌ వే పనులు పూర్తి కాకుండా కాఫర్‌ డ్యాం నిర్మించుకుంటే ఆనక వరద వస్తే ఇబ్బంది ఉంటుంది కదా అన్నది వారి సందేహం. 2018 అక్టోబరు తర్వాతే కాఫర్‌ డ్యాం నిర్మించుకోవచ్చు కదా అని ప్రస్తావించారు. దీనికి ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సమాధానం చెబుతూ డ్యాం కాంక్రీటు పనుల వేగం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. 2018 జూన్‌ నాటికే కాఫర్‌ డ్యాం పూర్తి చేయాలన్నది లక్ష్యమని చెప్పారు. నాణ్యతకు సంబంధించిన రికార్డులు సరిగా లేవని సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. నాణ్యతపై సీఎస్‌ఎంఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో ఇక్కడి ఇంజినీర్లకు శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. పోలవరం అథారిటీకి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఒప్పందానికి భిన్నాభిప్రాయాలు తొలగించుకుని సంసిద్ధమయ్యేందుకు రాష్ట్ర అధికారులు అంగీకరించారు. సమావేశంలో అథారిటీ కార్యదర్శి ఆర్‌.కె.గుప్తా, కేంద్ర జలసంఘం విశ్రాంత ఛైర్మన్లు, ప్రస్తుత సభ్యులు పాల్గొన్నారు. మసూద్‌ హుస్సేన్‌, అనూప్‌ కె.శ్రీవాస్తవ, ఎబీ పాండ్యా, బీపీ భార్గవ, హుస్సేన్‌ అబ్దుల్లా, ఆర్‌.చిత్ర, జగ్‌మోహన్‌ గుప్తా, ఎ.పరమేశన్‌, ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ (పాలన) గిరిధర్‌రెడ్డి, పోలవరం పర్యవేక్షక అధికారి వేమన రమేష్‌బాబు, రెండు జిల్లాల కలెక్టర్లు కె.భాస్కర్‌, కార్తికేయమిశ్రాలు పాల్గొన్నారు.

కేంద్రానికి రాష్ట్రానికి మధ్య అగాథం లేదు

ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మద్య ఎలాంటి అగాథమూ లేదని ప్రాజెక్టు అథారిటీలో సభ్యుడు, కేంద్రంలో రాష్ట్ర ప్రాజెక్టుల కమిషనర్‌ కె.వోహ్రా స్పష్టం చేశారు. గురువారం రాత్రి ఆయన ‘ఈనాడు-ఈటీవీ’తో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూలు ప్రకారమే కొనసాగిస్తోందన్నారు. కేంద్రం నుంచి నిధులు సకాలంలో రావడం లేదు కదా అని ప్రశ్నించగా నిధులు ఇచ్చేందుకు కేంద్రంలో ఒక విధానం ఉందని, ఇందుకు అనుగుణంగానే కేటాయింపులు జరుపుతున్నామన్నారు. దీంతో కాస్త ఆలస్యం జరగవచ్చన్నారు.

Link to comment
Share on other sites

పోలవరంపనులు భేష్‌.. కానీ!
 
 
636392289307671852.jpg
  • వేగం ఇంకా పెరగాలి.. తగినంత సిబ్బంది, అధికారులు అవసరం
  • లేకుంటే 2018నాటికి జలాల తరలింపు కష్టం
  • అంచనా వ్యయం పెంపుపై కేంద్రానిదే నిర్ణయం
  • అన్ని అనుమతులూ ఇచ్చేశాం
  • నిధుల విడుదలకు ఢోకా లేదు
  • ఏపీ భూసేకరణ, పునరావాసం దేశానికే ఆదర్శం
  • పోలవరం ప్రాజెక్టు పనులపై వోరా బృందం
అమరావతి, ఆగస్టు 24(ఆంధ్రజ్యోతి): ‘పోలవరం ప్రాజెక్టు పనులు చురుగ్గా సాగుతున్నాయి. విరామం లేకుండా పనులు చేస్తున్నారు. కానీ తగినంత సిబ్బంది, అధికారులు అవసరం. ఇది జరిగితేనే పనుల్లో నాణ్యత, నిర్మాణ పరిమాణం సక్రమంగా, మరింత సంతృప్తిగా ఉంటాయి’ అని పోలవరం ప్రాజెక్టు అథారిటీ స్పష్టం చేసింది. కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ సాగునీటి ప్రాజెక్టుల కమిషనర్‌ వోరా ఆధ్వర్యంలోని 11 మంది సభ్యుల బృందం గురువారం పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించింది. సభ్యులంతా తొలుత పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. నివేదికలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన స్పిల్‌వేను సందర్శించి పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. డయాఫ్రమ్‌వాల్‌, స్పిల్‌ వే, గేట్లతోసహా నిర్మాణ ప్రగతిని సమీక్షించింది.
 
అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8.15 గంటల వరకూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సమావేశం జరిగింది. సమీక్ష అనంతరం వోరా మీడియాతో మాట్లాడారు. ‘ప్రాజెక్టును ఆసాంతం పరిశీలించాం. పనుల్లో ఒకింత వేగం కనిపించింది. ఇది మరింత పెరగాలి. అన్ని శాఖల మధ్య సమన్వయం ఉంది. అంతకుమించి ఈ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సమన్వయం అద్భుతం’ అని కీర్తించారు. 2014 తరువాత అంచనా వ్యయం పెరిగింది. దీనిని భరించడానికి కేంద్రం సిద్ధంగా ఉందా అని ప్రశ్నించగా.. ‘రాష్ట్ర ప్రభుత్వం అన్ని వివరాలను సీడబ్ల్యూసీకి సమర్పించాలి. వాటిని కేంద్రం పరిశీలిస్తుంది. కేంద్రమే తుది నిర్ణయం తీసుకుంటుంది’ అని స్పష్టం చేశారు. నిర్మాణ పనులకు అవసరమైన నిధులు ఎప్పటికప్పుడు విడుదలవుతున్నాయి. నిబంధనలకు అనుగుణంగా నిధులు మంజూరవుతూనే ఉంటాయి.
 
ఈ విషయంలో ఎలాంటి ఢోకాలేదని చెప్పారు. ‘ప్రాజెక్టు నిర్మాణ పరిధిలో అన్ని పనులకు అనుమతులు ఇచ్చాం. మా వద్ద పెండింగ్‌ లేనేలేదు’ అని ప్రకటించారు. అటవీ భూముల విషయంలో పదే పదే న్యాయస్థానాల్లో వ్యాజ్యాలు నమోదవుతున్నాయని, ఇది పనులకు ఆటంకమేనని, దీనిని కేంద్రం త్వరలోనే సవరించబోతున్నట్టు తెలిపారు. దీనికిముందు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8.15 గంటల వరకూ పీపీఏ సమావేశం జరిగింది. దాదాపు ఏడాది తర్వాత జరిగిన ఈ సమావేశంలో పోలవరం పనుల ప్రగతిపై ఒకవైపు సంతృప్తిని వ్యక్తం చేస్తూనే.. అసంతృప్తినీ అదేస్థాయిలో వ్యక్తం చేసింది. అంచనాలు ఇంత భారీగా పెరగడానికి కారణాలేమిటని వోరా బృందం ప్రశ్నించింది. 2013 భూసేకరణ చట్టం మేరకు పరిహారం చెల్లించడంతోసహా సహాయ పునరావాస కార్యక్రమాల కోసం వ్యయం చేయాల్సి వస్తోందని, ఏకంగా రూ.33,000 కోట్లను ఇందుకోసమే ఖర్చు చేస్తున్నామని ఏపీ జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ వివరించారు.
 
దీనిపై సంతృప్తి వ్యక్తం చేసిన వోరా బృందం.. ఈ సమాచారాన్ని తమకు పంపితే దేశవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులలో ఈ తరహా కార్యక్రమాలు అమలవుతున్నాయో లేదో తెలుసుకునే వీలుంటుందని పేర్కొంది. ఒకవేళ ఇలాంటి విధానాలు అమలు చేయకపోతే.. ఏపీని ఆదర్శంగా తీసుకుని అమలు చేయాలని సూచిస్తామని చెప్పారు. పోలవరం పనుల ప్రగతిపై ఏపీ జలవనరుల శాఖ సలహాదారు భార్గవ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కాంక్రీట్‌ పనులు రోజుకు 3000 క్యూబిక్‌ మీటర్లు మేర మాత్రమే సాగుతున్నాయని. ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌ పనుల వేగాన్ని పెంచలేకపోతోందని తెలిపారు.
 
ఇలాగే కొనసాగితే 2018 నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం నుంచి నీటి విడుదల సాధ్యం కాదని, మరో ఏడాది పెంచాల్సి ఉంటుందని తెలిపారు. దీనిపై శశిభూషణ్‌కుమార్‌, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వర్షాలు కురుస్తుండటం, గోదావరి ప్రవాహం ఉధృతంగా ఉండటంవల్ల కాంక్రీట్‌ పనులు నెమ్మదిగా సాగుతున్నాయని తెలిపారు. రోజుకు 3000 క్యూబిక్‌ మీటర్ల మేర పనులు జరిగితే 2018 నాటికి పోలవరం పూర్తిచేయడం కష్టవుతుంది కదా అని వోరా బృందం ప్రశ్నించింది.
  
దీనికి శశిభూషణ్‌ కుమార్‌ సమాధానమిస్తూ ప్రస్తుత కాంట్రాక్టు సంస్థతోపాటు మరో కొత్త సంస్థను కూడా పనుల్లో భాగస్వామ్యం చేయనున్నామని, టెండర్లను పిలవాలనుకుంటున్నామని, ఈ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తే పనుల్లో పురోగతి ఉంటుందని తెలిపారు. ఈ విషయాన్ని ముందుగా పీపీఏకు చెప్పాలి కదా అని వోరా బృందం ప్రశ్నించింది. పీపీఏకు చెప్పాకే టెండర్లు పిలుస్తామని శశిభూషణ్‌ అన్నారు. దీనిపై నివేదిక పంపాలని కేంద్ర బృందం కోరింది. నవంబర్‌ నాటికి పనుల్లో పురోగతి ఉంటుందని శశిభూషణ్‌ కుమార్‌ చెప్పగా.. అప్పుడు మరో దఫా సమావేశమై పనుల పురోగతిని సమీక్షించి కాలాన్ని పెంచడంపై నిర్ణయం తీసుకుందామని వోరా బృందం స్పష్టం చేసింది.
 
పోలవరం ప్రాజెక్టు వద్ద ఇంజనీరింగ్‌ సిబ్బందిని పెంచాలని చెప్పింది. పోలవరం ప్రాజెక్టు పనులలో నాణ్యతను థర్డ్‌ పార్టీ ద్వారా పరీక్షించేందుకు ఏజెన్సీని ఎంపిక చేయాలని సూచించింది. దీనిపై ప్రతి మూడు నెలలకోసారి కేంద్ర జల వనరుల సంస్థ పరిధిలోని సంస్థలు పునఃపరిశీస్తాయని తెలిపింది. డయాఫ్రమ్‌ వాల్‌ డిజైన్లపై సంతృప్తి వ్యక్తం చేసిన వోరా బృందం .. మిగిలిన డిజైన్లనూ సెప్టెంబరులోగా ఆమోదింపజేసుకోవాలని సూచించింది. స్పిల్‌ చానల్‌ నిర్మాణానికి మరో ఏజెన్సీని ఎంపిక చేయడంపైనా నివేదిక సమర్పించాలని కోరింది. వారం రోజుల్లో 1000 కోట్ల రూపాయలను రీయింబర్స్‌మెంట్‌ చేస్తామని వోరా బృందం హామీ ఇచ్చింది.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...