Jump to content

polavaram


Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply

ఆంధ్రజ్యోతి: పోలవరానికి పర్యావరణ అనుమతులను రద్దు చేయాలంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ను కోరిన పిటీషనర్‌కు చుక్కెదురైంది. పోలవరం నిర్మాణంలో నిబంధనలకు నీళ్లొదిలేస్తూ భారీ స్ధాయిలో పేలుళ్లు, పూడ్చివేతలకు పాల్పడుతున్నారంటూ ఎన్జీటీలో పిటీషన్ దాఖలైంది. ఇప్పటికే పోలవరంపై సుప్రీంకోర్టులో ఉన్న పిటీషన్ల జాబితాను సమర్పించడంతో దీనిపై ఇక్కడ విచారించలేమంటూ ఎన్జీటి స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఆదేశిస్తే అప్పుడు విచారణ చేపడతామని తేల్చి చెప్పింది.

Link to comment
Share on other sites



పోలవరం పనులకు ఆటంకం 636194341292456065.jpg



  • సమస్యలపై నిర్వాసితుల నిరసన
  • పోలీసులను దాటుకొని ప్రాజెక్టు వైపు
  • నాలుగు గంటపాటు తీవ్ర ఉద్రిక్తత
ఏలూరు/పోలవరం, జనవరి 7 (ఆంధ్రజ్యోతి) : పోలవరం ప్రాజెక్టు పనులను నిర్వాసితులు అడ్డుకున్నారు. ప్రాజెక్టుకు చెందిన వాహనాలను నాలుగు గంటలకుపైగా నిలువరించారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ 50 రోజులుగా ప్రాజెక్టు నిర్వాసితులు పోలవరంలో రిలే దీక్షలు చేస్తున్నారు. శనివారం వారంతా కాలినడకన పోలవరం నుంచి ప్రాజెక్టువైపు తరలివెళ్ళారు. ప్రాజెక్టు ముఖ ద్వారం వద్ద అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. తమ సంఖ్య తక్కువగా ఉండటంతో ఆందోళనకారులను నిలువరించలేకపోయారు. నిర్వాసితులు ఒక్కసారిగా ప్రాజెక్టు నిర్మాణ స్థలంవైపు దూసుకెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు రెండు వాహనాలను దారికి అడ్డంగా పెట్టారు. నిర్వాసితులను వెనక్కి పంపించేందుకు ప్రయత్నించారు.

 

‘ఆర్డీవో వచ్చేంతవరకు మేం ఇక్కడే దీక్ష చేస్తా’మంటూ నిరసనకారులు అక్కడ బైఠాయించారు. ప్రాజెక్టు వద్ద ఎర్త్‌వర్క్‌ పనుల్లో ఉన్న వాహనాల రాకపోకలను అడ్డుకొన్నారు. కొన్ని గంటలపాటు ప్రాజెక్టు ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తహశీల్దారు ముక్కంటి చేసిన శాంతియత్నాలు ఫలించలేదు. చివరకు ఆర్డీవో లవన్న అరగంటకుపైగా నిర్వాసితులతో చర్చలు జరిపారు. నిర్వాసితుల సమస్యలు విని, పరిష్కరించడం కోసం ఈనెల 12న అధికారులు నేరుగా చర్చలు జరుపుతారని వారికి ఆయన హామీ ఇచ్చారు. దీంతో నిర్వాసితులు శాంతించి, వెనుదిరిగారు.


Link to comment
Share on other sites

Source: AndhraJyothy
 
ఈ నెలలో పోలవరం ‘పవర్‌’ టెండర్లు 
09-01-2017 03:16:56
సీలేరు(విశాఖ జిల్లా), జనవరి 8: పోలవరం జలవిద్యుత్‌ కేంద్రం నిర్మాణ పనులకు ఈ నెలలోనే టెండర్లు పిలవనున్నామని జెన్‌కో (హైడల్‌) డైరెక్టర్‌ నాగేశ్వరరావు తెలిపారు. తొలి దశలో మూడు యూనిట్లను (ఒక్కోటి 80 మెగావాట్లు) నిర్మిస్తామని, మూడున్నరేళ్లలో విద్యుదుత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. రెండో దశలో మరో తొమ్మిది యూనిట్లను 18 నెలల్లో అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. మొత్తం మీద ఐదేళ్లనాటికి 12 యూనిట్ల ద్వారా 960 మెగావాట్ల విద్యుతను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.
Link to comment
Share on other sites

‘పోలవరం జలవిద్యుత్ కేంద్రం నిర్మాణ పనులకు టెండర్లు’
 

విశాఖ: పోలవరం జలవిద్యుత్‌ కేంద్రం నిర్మాణ పనులకు ఈ నెలలోనే టెండర్లు పిలవనున్నట్టు ఏపీ జెన్‌కో(హైడల్‌) డైరెక్టర్‌ సీహెచ్‌ నాగేశ్వరరావు తెలిపారు. తొలి దశలో మూడు యూనిట్లను(ఒక్కొక్కటి 80 మెగావాట్లు) నిర్మిస్తామని, మూడున్నర ఏళ్లలో విద్యుదుత్పత్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు రెండో దశలో మరో తొమ్మిది యూనిట్లను 18 నెలల్లో అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. మొత్తం మీద ఐదేళ్లనాటికి 12 యూనిట్ల ద్వారా 960 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఏటా 2,300 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతుందని, తద్వారా రూ.230 కోట్ల ఆదాయం సమకూరుతుందన్నారు.

 

Link to comment
Share on other sites

పోలవరం ‘డయాఫ్రమ్‌’కు గ్రీన్‌సిగ్నల్‌
 
636196056839527491.jpg
  • డిజైన్లను ఆమోదించిన కేంద్ర జల సంఘం
  • ప్రాజెక్టు ప్రాంతంలో గైర్‌ వాల్‌ పనులు ప్రారంభం
 
హైదరాబాద్‌, పోలవరం, జనవరి 9(ఆంధ్రజ్యోతి): పోలవరం సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన డయాఫ్రమ్‌వాల్‌ డిజైన్లకు కేంద్ర జల సంఘం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. హైదరాబాద్‌లోని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) కార్యాలయంలో సోమవారం కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్‌ పాండ్యా నేతృత్వంలో పోలవరం డిజైన్ల అధ్యయన కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో ఐఐటీ రూర్కీ, ఐఐటీ నాగపూర్‌, కేంద్ర జలసంఘం డిజైన్ల పర్యవేక్షణ అధికారులు, పీపీఏ సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా, ఏపీ జల వనరుల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ ఎం.వెంకటేశ్వరరావు, పోలవరం సీఈ వి.రమేశ్‌బాబు, ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పటికే 85 శాతం మేర ఆమోదించిన డయాఫ్రమ్‌వాల్‌ డిజైన్లకు ఈ సమావేశంలో కమిటీ సమ్మతిని తెలిపింది. ఇప్పటికే స్పిల్‌వే కాంక్రీట్‌ పనులను ప్రారంభించిన ప్రధాన కాంట్రాక్టు సంస్థ.. డయాఫ్రమ్‌వాల్‌ డిజైన్లకు ఆమోదం లభించడంతో నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయనున్నది.
 
మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకమైన ప్లాస్టిక్‌ డయా ఫ్రమ్‌వాల్‌ నిర్మాణానికి సంబంధించి ముందస్తు పనులను ప్రారంభించారు. ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యాం నిర్మించే ప్రాంతంలో ముందుగా ప్లాస్టిక్‌ డయా ఫ్రమ్‌వాల్‌ నిర్మించాలి. దాని నిర్మాణానికి భారీ యంత్రాలు ఉండాలి కాబట్టి.. దానికన్నా ముందుగా చేయాల్సిన గైర్‌ వాల్‌ పనులు ప్రారంభించారు. గోదావరి గర్భంలో ఎర్‌ ్త కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యాం నిర్మాణ ప్రాంతంలో 1400 మీటర్ల పొడవునా ప్లాస్టిక్‌ డ యా ఫ్రమ్‌వాల్‌ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. పోలవరం రిజర్వాయర్‌ పూర్తయిన తరువాత రాక్‌ఫిల్‌ డ్యాం నుంచి నీరు లీక్‌ కాకుండా (చమర్చకుండా) కాపాడే కట్టడమే ప్లాస్టిక్‌ డయా ఫ్రమ్‌ వాల్‌. దీని నిర్మాణానికి ముందుగా గైర్‌ వాల్‌ పనులు చేపట్టారు. ప్లాస్టిక్‌ డయా ఫ్రమ్‌వాల్‌ మీటరన్నర వెడల్పుతో నిర్మిస్తారు.
 
Link to comment
Share on other sites

29న కీలక ఘట్టం!
 
పోలవరం ప్రాజెక్టులో 4 ప్రధాన నిర్మాణాలకు శ్రీకారం.. డ్యామ్‌ గేట్లు, డయా ఫ్రమ్‌ వాల్‌ పనులు మొదలు
 
అమరావతి/పోలవరం, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఈ నెల 29న కీలక పనులు ప్రారంభం కానున్నాయి. డ్యామ్‌ గేట్ల తయారీ, కాంక్రీట్‌ పనులకు ఎలాంటి అవరోధం లేకుండా సాఫీగా సాగేందుకు వీలుగా చిల్లింగ్‌ ప్లాంట్‌, డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణం పనులు, సిబ్బంది కోసం ఆధునిక వసతులతో కూడిన క్వార్టర్లు మొదలవుతున్నాయి. ఈ కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు. 16 మీటర్ల వెడల్పు, 21 మీటర్ల పొడవు కలిగిన డ్యామ్‌ ప్రధాన గేట్ల డిజైన్‌కు కేంద్ర జల సంఘం సోమవారం ఆమోదం తెలపడంతో ఈ గేట్ల ఏర్పాటుకు సంపూర్ణ స్వేచ్ఛ లభించింది. ఈ గేట్ల తయారీ కోసం 16,000 నుంచి 17,000 మెట్రిక్‌ టన్నుల ఉక్కు అవసరం. దీని సరఫరాకు భిలాయ్‌, విశాఖ ఉక్కు కర్మాగారాలతో జల వనరుల శాఖ నేరుగా సంప్రదింపులు ప్రారంభించింది. నాణ్యతతో కూడిన స్టీల్‌ను సరఫరా చేసేందుకు ఈ రెండు కర్మాగారాల యాజమాన్యాలు సూత్రప్రాయంగా అంగీకరించాయి.
 
 
ఈ నెల 25కల్లా సరఫరా మొదలుపెట్టేందుకు సరేనన్నాయి. వీటికి జల వనరుల శాఖ ముందస్తుగా చెల్లింపులు జరుపుతుంది. ఈ మొత్తాన్ని కాంట్రాక్టు సంస్థకు చెల్లించాల్సిన బిల్లు నుంచి మినహాయించుకుంటుంది. డ్యామ్‌ గేట్ల తయారీలో నైపుణ్యం కలిగిన కన్నయ్యనాయుడు రూపొందించిన డిజైన్లకు కేంద్ర జల సంఘం సమ్మతి తెలపడంతో .. ఒకటి రెండు రోజుల్లోనే తయారీ ఏజెన్సీని జల వనరుల శాఖ ఎంపిక చేయనుంది. ఈ గేట్లను డ్యామ్‌ ప్రాంతంలోనే రూపొందించనున్నారు. దీనివల్ల రవాణా సమస్యలకు ఆస్కారం ఉండదు. డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణం పనులూ 29 నుంచే ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి నదీ పరివాహక ప్రాంతంలోని ఇసుక తిన్నెలపై ‘గైడింగ్‌ వాల్‌’ పనులు నాలుగింట మూడొంతులు పూర్తయ్యాయి. మిగతావి కూడా 29కల్లా పూర్తవుతాయి. గోడ నిర్మాణ పరికరాలను, యంత్రాలను జర్మనీకి చెందిన బావర్‌ సంస్థ ఇప్పటికే సిద్ధం చేసింది.
 
 
ఈ పనులు చేపడుతున్న బావర్‌-ఎల్‌అండ్‌టీకి, ప్రధాన కాంట్రాక్టు సంస్థకూ మధ్య ఉన్న ఒప్పంద సమస్యలు 19వ తేదీన కొలిక్కి వస్తాయని జల వనరుల శాఖ భావిస్తోంది. గత నెలలో చేపట్టిన స్పిల్‌ కాంక్రీట్‌ నిర్మాణం పనుల్లో వేగాన్ని పెంచేందుకు చిల్లింగ్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. బావర్‌ సంస్థ సంబంధిత సామగ్రిని జర్మనీ నుంచి రప్పిస్తోంది. ఈనెల 23 నాటికి సామగ్రి విశాఖ ఓడరేవుకు.. 25కల్లా ప్రాజెక్టు ప్రాంతానికి చేరుతుంది. చిల్లింగ్‌ ప్లాంట్‌ నిర్మాణం పనులు కూడా 29నే ప్రారంభమవుతాయి. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యాక సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాల్సి ఉన్నందున.. వారికోసం అత్యాధునిక సదుపాయాలతో నిర్మిస్తున్న క్వార్టర్ల పనులు కూడా 78 శాతం మేర పూర్తయ్యాయి.
 
భూసేకరణకు రూ.4000 కోట్లు
పోలవరం ప్రాజెక్టు ముంపు కారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్వాసితులకు పరిహారం చెల్లించేందుకు రూ.4000 కోట్ల అవసరమవుతాయని జల వనరుల మంత్రి దేవినేని ఉమ చెప్పారు. సోమవారం ఉదయం స్పిల్‌ వే కాంక్రీట్‌ పనులను పర్యవేక్షించారు. అనంతరం ఉభయగోదావరి జిల్లాల అధికారులతోనూ సమీక్షించారు.
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...