Jump to content

polavaram


Recommended Posts

  • Replies 3.3k
  • Created
  • Last Reply

పోలవరానికి రూ.2981 కోట్లు

నాబార్డు నుంచి మంజూరుకు కేంద్ర ఆర్థికశాఖ ఆదేశం

ఆర్థిక సంవత్సరాంతానికి సవరించిన అంచనాలివ్వాలని ఏపీ సర్కార్‌కు సూచన

ఆరు నెలలకోసారి జలవనరులశాఖకు నివేదిక

సమర్పించాలని ప్రాజెక్టు అథారిటీకి నిర్దేశం

1ap-main5a.jpg

ఈనాడు, దిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నాబార్డ్‌ నుంచి తొలిదశగా రూ.2,981.54 కోట్ల రుణం మంజూరుచేయడానికి కేంద్ర ఆర్థికశాఖ అనుమతిచ్చింది. ఈ మేరకు కేంద్ర జలవనరులశాఖకు వర్తమానం పంపింది. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టంలోని సెక్షన్‌ 90కింద ఈ ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి, దాని నిర్మాణాన్ని కేంద్రమే చేపడుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం కేంద్రం పోలవరం ప్రాజెక్టు అథారిటీని ఏర్పాటు చేసింది. సెప్టెంబర్‌ 7వ తేదీన కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలో భాగంగా 2014 ఏప్రిల్‌ 1 తర్వాత పోలవరం ప్రాజెక్టు(సాగునీటి విభాగం) నిర్మాణానికయ్యే మొత్తాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. ప్రాజెక్టుకు ఇప్పటివరకు రూ.5,810.72 కోట్లు చెల్లించాల్సి ఉంది కాబట్టి ఆ మొత్తాన్ని నాబార్డ్‌ నుంచి దీర్ఘకాల సాగునీటి నిధి రూపంలో ఇప్పించాలని ఈ ఏడాది జనవరి 8వ తేదీన కేంద్ర జలవనరులశాఖ ఆర్థికశాఖను కోరింది. ఈ మొత్తంలో నుంచి 2014 ఏప్రిల్‌ 1 తర్వాత ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రాజెక్టుపై ఖర్చుచేసిన రూ.1,981 కోట్లను తిరిగి చెల్లించడంతోపాటు, ఈ ఆర్థికసంవత్సరంలో మిగిలిన కాలానికి మరో రూ.వెయ్యి కోట్లు అందుబాటులో ఉంచాలని కోరింది. రూ.5,810.72 కోట్ల నుంచి రూ.2,981.54 కోట్లు మినహాయిస్తే మిగిలిన రూ.2,829.18 కోట్లను 2011-12 నుంచి 2015-16 వరకు చేసిన ఖర్చుల వివరాలను పరిశీలించి, వినియోగ ధ్రువీకరణపత్రాలు సమర్పించిన తర్వాత ఇవ్వాలని సూచించింది. జలవనరులశాఖ సూచనల మేరకు ఆర్థికశాఖ ప్రస్తుతం రూ.2,981 కోట్ల మొత్తాన్ని నాబార్డు ద్వారా మంజూరుచేయడానికి అనుమతి ఇచ్చింది. ఇప్పటివరకు చేసిన అన్ని ఖర్చులకు సంబంధించి ఆడిట్‌ పరిశీలనలకు ఏపీ ప్రభుత్వం పేరావారీగా సమాధానాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. ఆ ఆడిట్‌ నివేదికను కేంద్ర జలవనరులశాఖ తప్పకుండా పరిశీలించి పంపాలని షరతు విధించింది. కేవలం సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం వరకే కేంద్రం బాధ్యత వహిస్తుందని, అదికూడా ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఖరారుచేసే సవరించిన అంచనాలకు లోబడి ఉంటుందని పేర్కొంది. 2014 ఏప్రిల్‌ నాటి ధరల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేంద్రానికి సవరించిన అంచనాలు అందించాలని సూచించింది. ప్రాజెక్టును కేంద్రమే పూర్తిచేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అడిగినందున అన్ని వ్యవహారాలను పోలవరం ప్రాజెక్టు అథారిటీ పర్యవేక్షించేలా చూడాలని కేంద్రజలవనరులశాఖను ఆర్థికశాఖ ఆదేశించింది.

ఇక డబ్బు కొరత ఉండదు :సుజనాచౌదరి..: పోలవరం ప్రాజెక్టుకు నాబార్డు నుంచి నిధులు అందించడానికి కేంద్రం అనుమతి ఇచ్చినందున ఇకమీదట డబ్బుకొరత ఉండదని కేంద్ర మంత్రి సుజనాచౌదరి పేర్కొన్నారు. గురువారం సాయంత్రమిక్కడ విలేకర్లతో మాట్లాడారు.

ముఖ్యాంశాలు
Link to comment
Share on other sites

పోలవరం ప్రాజెక్టుకు నిధుల వరద
 
636162426997266544.jpg
  • 2981 కోట్లు నాబార్డు రుణానికి ఆర్థికశాఖ ఓకే
  • రూ.5,810 కోట్లు కోరిన ఏపీ
  • ఆడిట్‌ నివేదిక, యూసీలు ఇస్తే మిగిలిన రూ.2,829 కోట్లు
  • సవరించిన అంచనాలు త్వరగా సమర్పించాలన్న కేంద్రం
  • చేసిన ఖర్చు కూడా రీయింబర్స్‌

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టుకు నిధుల సమస్య తీరిపోయింది. ప్రాజెక్టుకు నాబార్డు రుణం మంజూరుకు కేంద్ర ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ వ్యయ విభాగం ప్రణాళికా డివిజన డైరెక్టర్‌ ఎనకే సిన్హా ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణం రూ.2,981.54 కోట్ల రుణాన్ని విడుదల చేయాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. నాబార్డు నుంచి పోలవరం ప్రాజెక్టుకు రుణ మంజూరు అనుమతి కోరుతూ ఈ ఏడాది జనవరి 8న కేంద్ర జల వనరుల శాఖ ఆర్థిక శాఖకు లేఖ రాసింది. 2010-11 సంవత్సరం ఖర్చుల ప్రాతిపదికగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన అంచనా వ్యయంలో ఇంకా ఖర్చు చేయాల్సిన రూ.5810.72 కోట్లను రుణం రూపేణా పొందేందుకు అనుమతి ఇవ్వాలని ఆ లేఖలో కోరింది. ఈమేరకు ఫైల్‌ (ఎఫ్‌.నెం.31/2/2008-పీఆర్‌/ఏపీ)ని ఆర్థికశాఖకు పంపించింది. ఈ ఫైలును పరిశీలించిన కేంద్ర ఆర్థికశాఖ రూ.2981.54 కోట్ల రుణాన్ని తక్షణం మంజూరు చేసేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తంలో రూ.1981.54 కోట్లు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణం కోసం చేసిన ఖర్చుకు రీయింబర్స్‌మెంట్‌ కాగా, మిగిలిన రూ.1000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసేందుకు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈమేరకు కొన్ని సూచనలనూ ఆర్థికశాఖ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.
 
అవి ఏమిటంటే..
  • ప్రాజెక్టుకు ఏ ఏడాది ఎంత మేరకు ఖర్చు అయ్యింది.. దశల వారీగా ఎంత ఖర్చు చేశారు.. తదితర వివరాలను కేంద్ర జల వనరుల శాఖ తయారు చేసి ఆర్థిక శాఖ వ్యయ విభాగంలోని బడ్జెట్‌ డివిజనకు సమర్పించాలి.
  • జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన 2014 ఏప్రిల్‌ 1 నాటికి ప్రాజెక్టు కోసం కేంద్రం చేయాల్సిన వ్యయానికి ప్రాతిపదికగా 2013-14 ఆడిటింగ్‌ లెక్కలను సమర్పించాలి.
  • 2010-11 ధరల ప్రకారం కేంద్రం ఖర్చు చేయాల్సిన మొత్తం రూ.5810.72 కోట్లు. ఇందులో రూ.2981.54 కోట్లు మొదటి విడతగా విడుదలైన నేపథ్యంలో ఇంకా రూ.2829.18 కోట్లే కేంద్రం ఇవ్వాలి. 2011-12 నుంచి 2015-16 వరకు ఏటా దశల వారీగా చేసిన ఖర్చు.. వాటికి సంబంధించిన ఆడిట్‌ నివేదికలు, యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లను సమర్పించాలి. వీటిని సమర్పించాకే మిగిలిన 2829.18 కోట్ల విడుదలకు అనుమతి లభిస్తుంది.
  • పోలవరం ప్రాజెక్టులో సాగునీటి భాగానికి సవరించిన అంచనా వ్యయాన్ని ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు సమర్పించాలి. దానికి మాత్రమే కేంద్రం నిధులు భరిస్తుంది. 2014 ఏప్రిల్‌ నాటికి ఉన్న ధరల ఆధారంగా ఈ సవరించిన అంచనాను తయారు చేయాలి.
ఢిల్లీకి జలవనరుల శాఖ అధికారులు
నాబార్డు రుణానికి లైన్‌ క్లియర్‌ అయిన నేపథ్యంలో గురువారం ఢిల్లీ రావాలంటూ ఏపీ జల వనరుల శాఖ అధికారులను కేంద్ర ఆర్థిక శాఖ ఆహ్వానించింది. దీంతో జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఈఎన్‌సీ ఎం.వెంకటేశ్వరరావు అక్కడకు వెళ్లి కేంద్ర ఆర్థిక కార్యదర్శిని కలిశారు. పోలవరం కోసం నాబార్డు నుంచి కేంద్రం రుణం తీసుకుంటుందని ఆయన వారికి తెలిపారు. 2018నాటికి పనులు పూర్తయ్యేలా నిధుల ప్రవాహం ఉంటుందని, వ్యయాలకు సంబంధించి ఆడిట్‌, యూసీలను సమర్పిస్తుంటే నిధుల మంజూరు వెనువెంటనే చేస్తామని స్పష్టం చేశారు. నాబార్డు నుంచి రుణం తీసుకుంటున్నందున ఈ మొత్తాన్ని విడుదల చేస్తున్నామంటూ ఓ లేఖను శశిభూషణ్‌కు అందజేశారు. 2014 ఏప్రిల్‌ నాటికి ఉన్న పోలవరం అంచనాలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంది. రాష్ట్ర జల వనరుల శాఖ 2016లో అంచనాలను సవరించింది. భూసేకరణ, నిర్మాణ వ్యయాలు కలిపి రూ.40,450 కోట్లకు ప్రాజెక్టు అంచనా వ్యయం చేరుకుంది. ఈ సవరణ అంచనాలను రాష్ట్ర జల వనరుల శాఖ పీపీఏకి పంపింది. అయితే.. ప్రాజెక్టు అంచనాలను స్వతంత్రంగా కేంద్ర ఇంటర్నల్‌ బెంచ్‌ మార్క్‌ (ఐబీఎం) మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ)ని కేంద్ర జల సంఘం, కేంద్ర జల వనరుల శాఖ ఆదేశించాయి. పీపీఏ తాజా అంచనాలను రూపొందించే పనిలో నిమగ్నమైంది. నాబార్డు రుణం మంజూరైన నేపథ్యంలో.. కేంద్ర జల వనరుల కార్యదర్శి అమర్జిత సింగ్‌ను శశిభూషణ్‌ కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
 
 
 
  •  
Link to comment
Share on other sites

మొత్తం ఖర్చు నాబార్డే ఇస్తుంది: సుజనా
 
636162428083913504.jpg
పాత అంచనాల మేరకు రూ.16 వేల కోట్లకే నాబార్డు రుణం మంజూరయిందన్న వాదనను కేంద్ర మంత్రి సుజనా చౌదరి కొట్టిపారేశారు. ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని కేంద్రమే భరిస్తుందని స్పష్టం చేశారు. రెండు, మూడు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం సవరించిన అంచనాలను తయారు చేస్తుందని చెప్పారు. తొలి విడతగా విడుదలైన రూ.2981 కోట్లు రెండు, మూడు రోజుల్లో పీపీఏకి చేరతాయని తెలిపారు.
Link to comment
Share on other sites

19న పోలవరం కాంక్రీట్ పనులకు శంకుస్థాపన
 
636165392577838133.jpg
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలో పోలవరంపై సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి దేవినేని ఉమా, సిమెంట్‌ కంపెనీల ప్రతినిధులు, ముఖ్య అధికారులు హాజరయ్యారు. ఈనెల 19న పోలవరం కాంక్రీట్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి సహా పలువురు ప్రముఖులను ఆహ్వానించాలని చంద్రబాబు భావిస్తున్నారు. గత వారం రోజులుగా పనులు వేగంగా సాగుతున్నాయని, ప్రతి రోజు 2 లక్షల క్యూబిక్ మీటర్లకుపైగా తవ్వకం పనులు జరుగుతున్నాయని అదికారులు
చంద్రబాబుకు తెలియజేశారు.
 
అలాగే ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినీర్ రమేష్ కుమార్ పోలవరం పనుల పురోగతిపై నిర్మాణ ప్రాంతం నుంచి వివరాలు తెలియజేశారు. నిన్న రాత్రి కురిసిన వర్షం కారణంగా స్పిల్ చానల్‌లో నీరు నిలిచిపోవడంతో పనులకు కొద్దిపాటి అంతరాయం ఏర్పడినట్లు రమేష్ తెలిపారు. 12వ తేదీకల్లా ప్రాజెక్ట్ పనులకు సంబంధించిన మిషనరీ అంతా నిర్మాణ ప్రాంతంలో సిద్ధంగా వుండాలని అధికారులకు చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.
Link to comment
Share on other sites

ముహూర్తం కుదిరింది
 
636165912479653611.jpg
  • 19న పోలవరం కాంక్రీట్‌ పనులు ప్రారంభం
  • జనవరిలో డయా ఫ్రమ్‌ వాల్‌ పనులు
  • పనుల వేగం పెంచాలని చంద్రబాబు ఆదేశం
హైదరాబాద్‌, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): పోలవరం కాంక్రీట్‌ పనులకు ముహూర్తం కుదిరింది. ఈ నెల 19న అట్టహాసంగా కాంక్రీట్‌ పనులను ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన డయా ఫ్రమ్‌ వాల్‌ నిర్మాణాన్ని జనవరి మొదటివారంలోనూ, ఫ్యాబ్రికేటెడ్‌ డ్యామ్‌ గేట్ల తయారీని సంక్రాంతి నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ నెల 19న చేపట్టే కాంక్రీట్‌ పనుల కార్యక్రమానికి కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమాభారతిసహా కేంద్ర మంత్రులు ఎం.వెంకయ్య నాయుడు, అశోక్‌ గజపతిరాజు, సుజనా చౌదరి, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. అందరి సమక్షంలో పండుగ వాతావరణంలో కాంక్రీట్‌ పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. తాత్కాలిక సచివాలయం వెలగపూడి నుంచి తొలిసారిగా ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం నాడు పోలవరం ప్రాజెక్టు పనులను విర్చువల్‌ విధానంలో సమీక్షించారు. ఈ సమీక్షలో జల వనరుల శాఖ మంత్రి ఉమా మహేశ్వరరావు, జల వనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్‌, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ ఎం.వెంకటేశ్వరరావు, ట్రాన్స్‌సా్ట్రయ్‌ సీఎండీ చెరుకూరి శ్రీధర్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సాంబశివరావు, త్రివేణి, బావర్‌-ఎల్‌అండ్‌టి ప్రతినిధులు హాజరయ్యారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు గత వారం 85 శాతం మేర మట్టి పనులు పూర్తి చేయడం పట్ల కాంట్రాక్టు సంస్థలు, అధికారులను అభినందిస్తూనే.. లక్ష్యాన్ని అందుకునేలా పనుల వేగాన్ని పెంచాలని ఆదేశించారు. స్పిల్‌వే, స్పిల్‌ చానల్‌, పవర్‌ హౌస్‌ ఫౌండేషన్‌ కోసం మట్టి తవ్వకం పనులు సిద్ధమవుతున్నాయని చీఫ్‌ ఇంజనీరు రమేశ్‌బాబు వివరించారు. ఈ సమయంలో కొద్దిసేపు సాంకేతిక సమస్య తలెత్తింది. పోలవరం ప్రాజెక్టు నుంచి వెలగపూడికి .. వెలగపూడి నుంచి పోలవరం ప్రాజెక్టు ప్రాంతానికి మధ్య సంభాషణలు వినపడలేదు. దీంతో రమేశ్‌బాబుతో సీఎం టెలిఫోన్‌లో మాట్లాడారు. ఈలోగా సాంకేతిక సమస్య పరిష్కారం కావడంతో యథావిధిగా విర్చువల్‌ సమీక్ష జరిగింది. ఈ సమయంలో కాంక్రీట్‌ను వేగవంతంగా 100 మీటర్ల లోతుకు తీసుకువెళ్లగలిగే కన్వేయర్‌ బెల్ట్‌ను ఫ్యుజియోమాస్టర్‌ సిద్ధం చేసిందా అని సీఎం ప్రశ్నించారు. కన్వేయర్‌ బెల్ట్‌ సిద్ధంగా ఉందని రమేశ్‌బాబు తెలిపారు. దానిని చూపించాలని సీఎం కోరగా.. డ్రోన్‌ సహాయంతో కన్వేయర్‌ బెల్ట్‌ను చూపించారు.
 
ఈ సమయంలో మళ్లీ సాంకేతిక సమస్య తలెత్తడంతో సీఎం అసహనం వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందుగా పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఆతర్వాత అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ నెల 10న కాంక్రీట్‌ పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామని జల వనరుల శాఖ అధికారులు సీఎంకు తెలిపారు. అయితే ఈ నెల 14, 15 తేదీల్లో మంచి ముహూర్తం ఉందని ట్రాన్స్‌సా్ట్రయ్‌ సీఎండీ శ్రీధర్‌, ఈడీ సాంబశివరావు వివరించారు. అయితే ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఉండడం, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదాన్ని పొందాల్సి ఉండడంతోపాటు రాష్ట్రానికి చెందిన ఎంపీలు పార్లమెంటు సమావేశాల్లో ఉన్నందున కాంక్రీట్‌ పనుల కార్యక్రమాన్ని ఈ నెల 19న ప్రారంభించడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తం అయింది. పోలవరం ప్రాజెక్టు పనుల కోసం 10,00,000 టన్నుల సిమెంట్‌ అవసరం అవుతుందని అధికారులు వివరించారు. అధికమొత్తంలో సిమెంట్‌ అవసరమవుతున్నందున కంపెనీలతో సమావేశాన్ని ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. సిమెంట్‌ పరిశ్రమలు కూడా సానుకూలంగా ఉన్నాయని అవసరాన్ని బట్టి బస్తా రూ.230, రూ.240, రూ.250కు అందిస్తామన్నందున.. వాటిని సద్వినియోగం చేసుకోవాలని సీఎం చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అత్యంత కీలకమైన డయా ఫ్రమ్‌ వాల్‌ నిర్మాణం పనులను 2017 జనవరి నెలలో ప్రారంభించాలని, పోలవరం డ్యామ్‌ గేట్ల తయారీని సంక్రాంతి నుంచి ప్రారంభించాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. డ్యామ్‌ గేట్లకు సంబంధించిన స్టీల్‌ను సరఫరాచేసే బాధ్యతను బిలాయ్‌, విశాఖ స్టీల్‌ కంపెనీలకు అప్పగించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి పెండింగ్‌లో ఉన్న మట్టి పనులన్నీ పూర్తికావాలని, మే నుంచి పూర్తిగా కాంక్రీట్‌ పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సభ్య కార్యదర్శి ఆర్‌.కె.గుప్తా నేతృత్వంలో ఇద్దరు చీఫ్‌ ఇంజనీర్లు క్వాలిటీ కంట్రోల్‌పై నిరంతరం సమీక్షిస్తారని అన్నారు. ఈ నెల 12వ తేదీ నాటికి కాంక్రీట్‌ పనులకు సంబంధించిన మిషనరీ అంతా సిద్ధం కావాలని కాంట్రాక్టు సంస్థలను ఆదేశించారు.
Link to comment
Share on other sites

పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పరీక్షలు
 
636167376011522848.jpg
పోలవరం : పోలవరం ప్రాజెక్టులో కీలక నిర్మాణాలకు సంబంధించి ఢిల్లీ నుంచి వచ్చిన శాస్త్రవేత్తల బృందం పరీక్షలు ప్రారంభించింది. పోలవరం ప్రాజెక్టులో ముఖ్య నిర్మాణమైన స్పిల్‌ వేకు సంబంధించి కాంక్రీట్‌ పనులు ప్రారంభించే ప్రాంతంలో బుధవారం ఢిల్లీ నుంచి వచ్చిన సెంట్రల్‌ సాయిల్‌ మెటీరియల్‌ రీసోర్స్‌ సెంటర్‌ (సీఎస్‌ఎంఆర్‌ఎస్‌), మినిస్ర్టీ ఆఫ్‌ వాటర్‌ రీసోర్స్‌ మరియు రివర్‌ డెవలప్‌మెంట్‌ గంగా రెజివ్‌ నేషన్‌ చీఫ్‌ సైంటిస్టు హరిదేవ్‌ ఆధ్వర్యంలో సీనియర్‌ సైంటిస్టులు డాక్టర్‌ జీవీ రమణ, డాక్టర్‌ దీపక్‌ సర్వడ్‌, అసిస్టెంట్‌ రీసెర్చ్‌ అధికారులు డాక్టర్‌ ఆర్‌పీ యాదవ్‌, డాక్టర్‌ కెకె మిత్రా ఈ ప్రాంతంలో పరీక్షలు నిర్వహించారు.
 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్పిల్‌ వే ప్రాంతంలో రాక్‌ నాణ్యత ప్రమాణాలు పరిశీలించేందుకు స్పిల్‌ వే పౌండేషన్‌ లెవల్స్‌లో డిఫార్మాబిలిటీ క్యారెక్టర్‌ స్టిక్స్‌ పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ పరీక్షల ద్వారా స్పిల్‌ వే ప్రాంతమంతా ప్రాజెక్టు నిర్మాణం పూర్తయిన తరువాత నీటి సామర్థ్యాన్ని ఒత్తిడి ఏ విధంగా ఉంటుంది? ఆ ఒత్తిడిని ఈ ప్రాంతం తట్టుకుంటుందా? లేదా ? అనే విషయంపై నిర్ధారణ అవుతుందని చెప్పారు. దీనికి సంబంధించి ఈ ప్రాంతంలో ఐదారుచోట్ల నిర్ధారించిన కొలతల్లో 70 టన్నుల బరువును ఉంచి ఆ రాయిపై ఒత్తిడి తెస్తామన్నారు. ఆ సమయంలో ఆ రాక్‌లో లూజు సాయిల్‌ ఉందా ? క్రేకర్స్‌ ఉన్నాయా ? లేక రాక్‌ కుంగిపోతుందా ? అనే విషయాలు తెలుస్తాయన్నారు. అయితే బుధవారం ఉదయం నిర్వహించిన పరీక్షల్లో అంతా సక్రమంగా ఉందని 70 టన్నుల సామర్థ్యాన్ని తట్టుకుందని చెప్పారు. ఈ పరీక్షల నిర్వహణ సమయంలో ప్రాజెక్టు ఈఈలు మునిరెడ్డి, పుల్లారావు, ట్రాన్స్‌ట్రాయ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ తిరుమలేశ్వరరావు, జీఎం సత్యనారాయణ, డీఈలు పాల్గొన్నారు.
Link to comment
Share on other sites

polavaram meda YSRCP started new music and giving hint to neighbour states to get stay in court.

A vijay sai gadu ekamga Rajya Sabha lo AP project kattestundi meeku inka telida ane type lo speech lu istunadu.

 

They stared demanding 1st resolve odissa&chattisgarh issue and then start concrete.
Do land acquisition before starting concrete works for project ani kotta ragam modalu pettaru

 

Guddilo mella laga manaki at last ippudu Technical approvals vachai design ki so concrete work start chestunam.

Adi apudam ani trying villu.

Link to comment
Share on other sites

‘పోలవరం’ పూర్తయితే జగన్ కు పుట్టగతులుండవ్‌!
 
636167632568494921.jpg
  • ప్రాజెక్టు నిర్మాణానికి సైంధవుడిలా అడ్డుపడుతున్నాడు
  • 2.1 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పని పూర్తి
  • 19న కాంక్రీట్‌ పనులు.. కేంద్ర మంత్రుల హాజరు
  • మంత్రి దేవినేని ఉమ వెల్లడి
విజయవాడ, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): ‘‘రా ష్ట్రానికి  జీవనాడిలాంటి పోలవరం ప్రాజెక్టు పూర్తయితే వైసీపీ అధినేత జగనకు పుట్టగతులండవు. అందుకే ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సైంధవుడిలా అడ్డుపడుతున్నాడు’’ అని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. అభివృద్ధిని అడ్డుకోవడానికి జగన్‌ కేన్సర్‌లా మారాడని దుయ్యబట్టారు. వైఎస్‌ హయాంలో దళారులను అడ్డుపెట్టుకుని రూ.లక్షలు దోచుకున్నాడని ఆరోపించారు. ఇప్పుడు పారదర్శకంగా ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయన్నారు. ఈ మేరకు విజయవాడలో బుధవారం మంత్రి ఉమా మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా 2.1 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టి పనులు పూర్తయ్యాయన్నారు. డిసెంబరు 19న ప్రాజెక్టు కాంక్రీటు పనులు ప్రారంభమవుతాయని, ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు ఉమాభారతి, వెంకయ్యనాయుడు, అశోక్‌గజపతిరాజులను ఆహ్వానిస్తున్నట్టు మంత్రి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 50 లక్షల క్యూసెక్కుల వరద నీటిని మళ్లించవచ్చన్నారు. 194 టీఎంసీల నీటిని నిల్వ చేయడంతోపాటు, 950 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేసే అవకాశం ఉందన్నారు. తూర్పుగోదావరిలో 58,324, పశ్చిమగోదావరిలో 18,284 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని తెలిపారు. దేవీపట్నం, పోలవరం గ్రామాల్లో నిర్వాసితులకు కొత్త భూసేకరణ చట్టం ప్రకారం ఎకరాకు రూ.7.50 లక్షల పరిహారంగా చెల్లిస్తున్నామన్నారు. ఖమ్మం జిల్లా నుంచి విలీనమైన గ్రామాల్లోని నిర్వాసితులకు ఎకరాకు రూ.10.5 లక్షలు ఇస్తున్నామన్నారు. ఇది కాకుండా నిర్వాసితులకు సకల సదుపాయాలు కల్పించడానికి ఒక్కో వ్యక్తికి రూ.7 లక్షలను ఖర్చు చేస్తున్నామని ఉమా స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారాన్ని జగన తన పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ద్వారా చత్తీస్ గఢ్,  ఒడిశా రాష్ట్రాలకు ఇచ్చి రాషా్ట్రనికి ద్రోహం చేస్తున్నారని ఎండగట్టారు.
Link to comment
Share on other sites

పోలవరం ఆకృతిలో మార్పులు చేయలేం

లోక్‌సభలో కేంద్రం స్పష్టీకరణ

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాలో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు అంశంపై లోక్‌సభలో ప్రస్తావనకు వచ్చింది. ప్రశ్నోత్తరాల సమయంలో తెలంగాణకు చెందిన తెరాస ఎంపీలు, ఒడిశాకు చెందిన ఎంపీలు ఈ అంశంపై ప్రశ్నలు లేవనెత్తారు.

తెరాస ఎంపీ సీతారాం నాయక్‌ మాట్లాడుతూ.. పోలవరం నిర్మాణానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని.. అయితే ఆ ప్రాజెక్టు వల్ల భద్రాచలంలోని రామాలయం ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పోలవరం ఎత్తు తగ్గిస్తే ఈ సమస్య పరిష్కారమవుతుందని సూచించారు.

ఒడిశా ఎంపీ బలభద్ర మాఝీ మాట్లాడుతూ.. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై తమకు సమాచారం ఇవ్వడం లేదన్నారు. ఈ ప్రాజెక్టుపై అవగాహనకు ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాల్లో గ్రామసభలు కూడా నిర్వహించలేదన్నారు. పోలవరాన్ని పెద్ద ప్రాజెక్టుగా కాకుండా మూడు బ్యారేజీలుగా నిర్మించాలని కోరారు. పెద్ద ప్రాజెక్టుగా కడితే విపత్తులు సంభవించినప్పుడు లక్షల మందిపై ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు వల్ల ఒడిశాలో 2లక్షల మంది నిర్వాసితులవుతారని తెలిపారు.

సభ్యుల ప్రశ్నలపై కేంద్రమంత్రి సంజీవ్‌ కుమార్‌ బాల్యన్‌ స్పందిస్తూ.. 2014లో పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినట్లు చెప్పారు. ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయని.. ఈ పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు చేయడం సాధ్యం కాదన్నారు. పోలవరం కారణంగా భద్రాచలం ఆలయం ముంపునకు గురయ్యే అవకాశం లేదని స్పష్టం చేశారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...